లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. లక్నోలోని ట్రాన్స్‌పోర్టు నగర్‌లో శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కూలడంతో సమీపంలో పారక్ చేసి లారీ కూడా నుజ్జునుజ్జయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే శిథిలాల కింద మరికిందరు చిక్కుకొని ఉంటారి అధికారులు భావిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది
కాగా బిల్డింగ్ కూలిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేయాలని తెలిపారు.
#WATCH | Lucknow building collapse | Rescue operations to evacuate the trapped people are underway. Fire Department and NDRF teams are at the spot. The evacuated people are being sent to the hospital.
So far, 4 people have been evacuated in the incident. pic.twitter.com/gN3GWrAQ4X— ANI (@ANI) September 7, 2024
Comments
Please login to add a commentAdd a comment