Sukhoi 30
-
గుడ్‌బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ..
కొద్దిరోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతోంది. ఆశలు రేకెత్తిస్తూ.. 2024 మన ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆనందాన్ని అందించబోతోంది. అయితే 2023 దేశ ప్రజలకు కొన్ని మంచి, కొన్ని చెడు జ్ఞాపకాలను అందించింది. 2023 జనవరి 28న గగనతలంలో ఊహకందని ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్-2000 ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఈ రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్‌లోని మహారాజ్‌పురా ఎయిర్‌బేస్ నుండి సాధారణ శిక్షణ కోసం బయలుదేరాయి. ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని మోరెనాలోని పహర్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మన్పూర్ మహాదేవ్ అడవిలో మిరాజ్ యుద్ధ విమానం కూలిపోయింది. సుఖోయ్‌కు చెందిన రెక్కలు మోరెనాలోని పహర్‌ఘర్ ప్రాంతంలో పడిపోయాయి. మిగిలిన విమానం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని ఉచైన్ పోలీస్ స్టేషన్‌లోని నాగ్లా బిజా గ్రామ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మిరాజ్ పైలట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి మృతి చెందగా, సుఖోయ్ పైలట్లిద్దరూ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిరాజ్-2000 చాలా కాలంగా భారత వైమానిక దళంలో భాగంగా ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించారు. భారత వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానాలు.. విమాన శిక్షణ మిషన్‌లో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, ఇద్దరు పెలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు.. చర్చిలు శోభాయమానం! -
సుఖోయ్ 30 యుద్ధ విమానంలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ముర్ము
గువాహటి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి (ఏప్రిల్6-8) మూడు రోజులపాటు అస్సాంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో ముర్ము పాల్గొనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఈ సందర్బంగా ఆమె ఏప్రిల్ 8వ తేదీని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ 30 MKI విమానంలో ప్రయాణించనున్నారు. అంతకుముందు 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఏప్రిల్ 7న రాష్ట్రపతి కాజిరంగా నేషనల్ పార్క్‌లో గజ్ ఉత్సవ్-2023 వేడుకలను ప్రారంభించనున్నారు. అనంతరం గువాహటిలో మౌంట్ కాంచనగంగా సాహసయాత్ర-2023ను జెండా ఊపి ప్రారంభిస్తారు. దీంతోపాటు గౌవాహటి హైకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఏప్రిల్ 8న తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ముర్ము ప్రయాణించనున్నారు. చదవండి: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి టైగర్ జగర్నాథ్ కన్నుమూత.. -
సుఖోయ్, మిరాజ్ ఢీ.. పైలట్ మృతి
న్యూఢిల్లీ/భరత్పూర్/మొరెనా: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)నకు చెందిన సుఖోయ్ 30ఎంకేఐ, మిరాజ్–2000 యుద్ధ విమానాలు ఢీకొన్న అరుదైన ఘటనలో ఒక పైలెట్ మృతి చెందారు. మరో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఏఎఫ్ బేస్‌గా ఉన్న గ్వాలియర్ విమానాశ్రయం నుంచి ఈ రెండు విమానాలు రోజువారీ సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరాయి. మొరెనా జిల్లా పహర్‌గఢ్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అవి ప్రమాదవశాత్తు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఘటనలో సింగిల్ సీటర్ మిరాజ్–2000 పైలెట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి చనిపోగా ట్విన్ సీటర్ సుఖోయ్ ఫ్లయిట్‌లోని ఇద్దరు పైలెట్లు ఎజెక్ట్ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వింగ్ కమాండర్ శరీర భాగాలు పహార్‌గఢ్ ప్రాంతంలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. విమాన శకలాలు కొన్ని పొరుగునే ఉన్న రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లాలోనూ పడిపోయాయి. దీనిపై ఐఏఎఫ్ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఫ్లయిట్ డేటా రికార్డుల విశ్లేషణ అనంతరమే ఘటనకు దారి తీసిన కారణాలు తెలుస్తాయన్నారు. ఐఏఎఫ్ చరిత్రలో మిరాజ్, సుఖోయ్ ఢీకొనడం ఇదే తొలిసారి. దేశంలో గత 70 ఏళ్లలో ఇలాంటి 64 ప్రమాదాల్లో 39 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారని వైమానిక నిపుణుడు అంచిత్ గుప్తా తెలిపారు. -
Fighter Jets: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన రెండు యుద్ధ విమానాలు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్ కుప్పకూలాయి. మొరెనాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక పైలెట్ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పైలెట్లు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సహాయక చర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. శిక్షణా సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శిక్షణా విన్యాసాలు చేస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన సుఖోయ్, మిరాజ్ శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యాయి. -
దేనికైనా సిద్ధం!
-
ఎల్ఏసీలో సంసిద్ధంగా వైమానిక దళం
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా సైనిక సంపత్తిని తరలించడంతో భారత్ దీటుగా చర్యలు తీసుకుంటోంది. అమెరికా, రష్యా తయారీ యుద్ధ, రవాణా విమానాలను ఈ ప్రాంతంలో వాడుతోంది. కీలకప్రాంతాల్లో నిఘా విధులతోపాటు ఫార్వర్డ్ పోస్టులకు జవాన్లను, ఇతర ముఖ్యమైన పరికరాలు, సామగ్రిని ఇవి తరలిస్తున్నాయి. రష్యా తయారీ అత్యాధునిక సుఖోయ్–30 ఎంకేఐలు, ఎంఐజీ–29 యుద్ధ విమానాలు ఇప్పటికే గగనతలంలో పహారాకాస్తున్నాయి. సరిహద్దులకు సమీపంలోని ఈ వైమానిక కేంద్రంలో అమెరికా తయారీ రవాణా వాహనాలు సీ–17, సీ–130జేతోపాటు రష్యా తయారీ ఇల్యుషిన్–76, ఆంటొనొవ్–32లు కూడా ఇక్కడ మోహరించారు. తూర్పు లద్దాఖ్ సెక్టార్లో యుద్ధ విధుల కోసమే ప్రత్యేకించిన అపాచీ యుద్ధ విమానాలను వినియోగించుకుంటున్నారు. ఆర్మీ, ఐటీబీపీ బలగాలను సరిహద్దుల సమీపంలోకి తరలించేందుకు చినూక్, ఎంఐ–17వీఐ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మొత్తమ్మీద ఈ ఎయిర్ బేస్ విమానాల రాకపోకలతో సందడిగా మారింది. ‘ఈ ప్రాంతంలో ఈ ఎయిర్ బేస్ చాలా కీలకమైంది. యుద్ధ విధులతోపాటు, ఇతర అవసరాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరాలు అందుతుంటాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది’ ఓ అధికారి అన్నారు. -
అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
బాలాసోర్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన గగనతలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని బంగాళాఖాతం సముద్ర తీర ప్రాంతంలో అస్త్ర క్షిపణిని భారత వైమానిక దళం పరీక్షించింది. సుఖోయ్–30 ఎంకేఐ ద్వారా అస్త్రను ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. అస్త్ర సమర్థంగా, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘వివిధ రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఈవోటీఎస్), సెన్సార్లు అస్త్ర క్షిపణి గమనాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి చూశాయని, ఎంతో కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని వెల్లడైందని‘ ఆ ప్రకటన తెలిపింది. ఈ సందర్భంగా డీఆర్డీఓ, వాయుసేన బృందానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం వాయుసేన రష్యాకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఐ–డెర్బీ, స్వదేశీయంగా రూపొందించిన అస్త్రను వాయుసేనలో చేర్చడానికి సన్నాహాలు చేస్తోంది. అస్త్ర ప్రత్యేకతలు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), మరో 50 ఇతర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలతో కలిసి అస్త్ర క్షిపణిని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. గాల్లో నుంచి గాల్లోకి 70 కి.మీ. పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. ఈ పరిధిని 300 కి.మీ.లకు పెంచడానికి డీఆర్డీఓ ప్రణాళికలు రూపొందిస్తోంది. నిర్దేశిత లక్ష్యానికి చేరుకోవడానికి ఈ క్షిపణి గంటకి 5,555 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. 15 కిలోగ్రాముల పేలుడు పదార్థాలతో ప్రత్యేకమైన వార్‌హెడ్ ఉంటుంది. -
యుద్ధవిమానాలతో సెల్ఫీ
మాంటే-డీ-మార్సన్: భారత్‌కు చెందిన యుద్ధవిమానం సుఖోయ్‌ని ఫ్రాన్స్ పైలట్ నడపగా, ఫ్రాన్స్ యుద్ధవిమానం రఫేల్‌ను భారత పైలట్ నడిపారు. అంతేనా ఈ ఇద్దరు పైలట్లు యుద్ధవిమానాలని నడుపుతూ దిగిన సెల్ఫీలను ఇరుదేశాల వైమానిక విభాగాలు ట్వీట్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నాయి. ఈ అరుదైన సంఘటన ఫ్రాన్స్‌లోని మాంటే-డీ-మార్సన్ ఎయిర్‌బేస్‌లో చోటుచేసుకుంది. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య జులై 1 నుంచి 14 వరకు గరుడ-6 పేరిట ఇరుదేశాలకు చెందిన యుద్ధ విమానాల సంయుక్త విన్యాసాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ అత్యున్నత యుద్ధవిమానం సుఖోయ్‌ని ఫ్రాన్స్ ఫైలట్ నడపగా, భారత్ కొనుగోలు చేస్తున్న రఫేల్‌ను భారత ఫైలట్ నడిపారు. ఈ విన్యాసాలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ విన్యాసాలలో భాగంగా ఇరుదేశాల మధ్య మంచి అవగాహన కుదిరిందని, తమ సామర్థ్యాలను మరింత మెరుగపర్చుకోవడానికి అవకాశం కలిగిందని పేర్కొంది. అంతేగాక రెండు దేశాల సైనికుల మధ్య కూడా వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఏర్పడ్డాయని తెలిపింది. భారత్, ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలుచేసిన విషయం తెలిసిందే. అయితే రఫేల్ కొనుగోలులో అవినీతి జరిగిందంటూ భారత్‌లో తీవ్ర రాజకీయదుమారం రేగినా ప్రభుత్వం రఫేల్‌ను కొనడానికే సిద్దపడింది. ఇప్పటికే భారత్ దగ్గర నాలుగు సుఖోయ్-30లను కలుపుకొని మొత్తం 124 యుద్దవిమానాలు ఉన్నాయి. ఇప్పుడు రఫేల్ వచ్చి చేరితే భారత వాయుసేన మరింత శక్తివంతం కానుంది. సెప్టెంబర్19 నాటికి తొలి రఫేల్‌ను భారత్‌కు ప్రాన్స్ ఇవ్వనుంది. మిగతా వాటిని రెండు సంవత్సరాలలోపు ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఈ విన్యాసాలు భారత్ ఫైటర్లకు రఫేల్‌పై అవగాహన కల్పిస్తాయని, అలాగే భారత ఫైటర్లకు అంతర్జాతీయ వాతావరణంపై అవగాహన కలగడమేగాక రష్యా తయారీ భారత సుఖోయ్‌ని యుద్ధ క్షేత్రంలో రఫేల్‌తో అనుసంధానించడంపై వీరికి నైపుణ్యం వస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రష్యా తయారీ అత్యున్నత యుద్ధ విమానం సుఖోయ్ భారత్ తరపున ఫ్రాన్స్ గగనతలంపై చక్కర్లు కొట్టడమేగాక, ఒక ఫ్రెంచ్ ఫైటర్ ఆ విమానాన్ని నడపడం ఆసక్తికరవిషయమని అంటున్నారు. -
వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం!
-
చరిత్ర సృష్టించిన బ్రహ్మోస్
న్యూఢిల్లీ: వాయు సేనలో సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ప్రవేశపెట్టేందుకు గొప్ప ముందడుగు పడింది. ఇది వరకే భూ ఉపరితలం, సముద్రం నుంచి పరీక్షించిన ఈ క్షిపణిని బుధవారం యుద్ధ విమానం సుఖోయ్–30 నుంచి తొలిసారి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో బ్రహ్మోస్ త్రివిధ దళాల్లో పనిచేసేందుకు తన సమర్థతను చాటుకున్నట్లయింది. ఈ పరిణామంపై రక్షణ శాఖ, ఐఏఎఫ్ హర్షం వ్యక్తం చేశాయి. పరీక్ష జరిగిన తీరును రక్షణ శాఖ వివరిస్తూ...గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని సుఖోయ్–30 నుంచి బ్రహ్మోస్‌ను ప్రయోగించగా, క్షిపణి ఇంజిన్ రెండు దశల్లో మండి నేరుగా లక్ష్యాన్ని చేరుకుందని తెలిపింది. సుఖోయ్‌లో బ్రహ్మోస్‌ను అమర్చడం సవాలుతో కూడుకున్న పని అని ఐఏఎఫ్ వెల్లడించింది. ఇందుకోసం సుఖోయ్‌లో మెకానికల్, ఎలక్ట్రికల్, సాఫ్ట్వేర్ పరంగా పలు మార్పులు చేశామని పేర్కొంది. వాయుసేనకు అమూల్యం.... తాజాగా బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని బ్రహ్మోస్ ఛేదించడం... ఆకాశం నుంచి ఆ క్షిపణిని ప్రయోగించే వాయుసేన సామర్థ్యాన్ని తేటతెల్లం చేస్తోందని రక్షణ శాఖ పేర్కొంది. ఈ తరగతికి చెందిన క్షిపణిని ప్రయోగించిన తొలి వాయుసేన తమదేనని ఐఏఎఫ్ ప్రకటించింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో సముద్రం లేదా నేలపై ఉన్న సుదూర లక్ష్యాలను చాలా కచ్చితత్వంతో ఛేదించేందుకు బ్రహ్మోస్ తమకు ఎంతో దోహదపడుతుందని తెలిపింది. బ్రహ్మోస్, సుఖోయ్–30ల కాంబినేషన్ వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొంది. ‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ చరిత్ర సృష్టించింది. తొలిసారి సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయాణించి బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది’ అని రక్షణ శాఖ ప్రకటన జారీచేసింది. చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని హర్షం... సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. బ్రహ్మోస్ ప్రత్యేకతలు... ► 290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ధ్వనివేగం కంటే మూడురెట్ల అధిక వేగంతో కచ్చితంగా ఛేదించగలదు. ► ఆర్మీ, నౌకాదళం ఉపయోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు 3 టన్నులు కాగా, వాయుసేన ప్రయోగించే క్షిపణి మాత్రం 2.5 టన్నులే ఉంటుంది. అయినా సుఖోయ్–30 యుద్ధ విమానం మోసే అత్యధిక బరువున్న క్షిపణి ఇదే. ► సుఖోయ్ యుద్ధవిమానం ఒకసారికి ఒక క్షిపణినే తీసుకెళ్లగలదు. ► బ్రహ్మోస్‌ను అడ్డుకునేందుకు ప్రత్యర్థి యుద్ధనౌకలు క్షిపణులను ప్రయోగించేలోగానే బ్రహ్మోస్ ఆ నౌకలను ధ్వంసం చేస్తుంది. ► క్షిపణిని ప్రయోగించిన వెంటనే సుఖోయ్ విమానం తిరుగు ప్రయాణమవుతుంది. ► ప్రస్తుతం ప్రపంచంలోని ఏ యుద్ధనౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు. ► ప్రస్తుతం 290 కిలో మీటర్లుగా ఉన్న లక్షిత దూరాన్ని 450 కిలోమీటర్లకు పెంచేందుకు బ్రహ్మోస్ క్షిపణుల రూపురేఖలు, సాంకేతికతలో మార్పులు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. ► క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లోకి భారత్ ప్రవేశంతో ఈ క్షిపణుల పరిధిని పెంచడం సులువు కానుంది. ► మరో 40 సుఖోయ్–30 యుద్ధ విమానాలు బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగలిగేలా వాటికి అవసరమైన మార్పులు చేయడంతోపాటు ఇంకో 272 విమానాలు సమకూర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. భారత్‌కు బ్రహ్మస్త్రమే భూమిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన...ఇలా త్రివిధ దళాల్లో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువుగా ఉండే సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ అందుబాటులోకి వచ్చింది. మూడు చోట్ల నుంచి ప్రయోగానికి అనువుగా ఉండేలా హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ క్షిపణిలో మార్పులు చేసింది. రష్యాకు చెందిన పీ–700 ఒనిక్ సూపర్సోనిక్ క్షిపణి ఆధారంగా మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)–రష్యా ఎన్‌పీఓఎంలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధిచేశాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో నదుల పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్గా నామకరణం చేశారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ విమానం సెర్చింగ్‌కు స్పెషల్ చాపర్లు
గువాహటి: కనిపించకుండా పోయిన భారత వైమానిక విభాగానికి చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం జాడ తెలుసుకునేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. సీ-130 యుద్ధ విమానంతోపాటు ఎలెక్ట్రో పెలోడ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్‌హెచ్) హెలికాప్టర్ సహాయంతో కనిపించకుండాపోయిన సుఖోయ్ను గాలించారు. అయితే, సుఖోయ్ కనిపించకుండా పోయిన ప్రాంతం మొత్తం కూడా దట్టంగా పొగమంచు కప్పుకొని ఉన్నకారణంగా సరిగా కనిపించని పరిస్థితి ఉంది. ఆ వైపుగా వెళ్లేందుకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు కూడా ఆ విమానం గురించిగానీ, పైలట్ల గురించి ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో గాలింపు చర్యలు ఆపేశారు. -
చైనా సరిహద్దులో సుఖోయ్ గల్లంతు
-
కూలిన సుఖోయ్ -30 విమానం
పుణె:ఓ యుద్ధ విమానం కూలి పోయిన ఘటన పుణెలో మంగళవారం సంభవించింది. భారత యుద్ధ విమానం సుఖోయ్ 30 ఎమ్ -ఐ తూర్పు పుణెకు 35 కిలోమీటర్ల దూరంలో కుప్పుకూలింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలో పైలెట్ తో సహా కో పైలెట్ కూడా క్షేమంగా బయటపడ్డారు. వారు స్వల్పపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఇద్దరి పైలెట్లను ఒక ఐఎఎఫ్ హెలికాప్టర్ లో తీసుకొచ్చినట్లు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తెలిపింది. ఈ దుర్ఘటన మంగళవారం మధ్యాహ్నం 1.10 ప్రాంతంలో జరిగినట్టు లాహ్ గాన్ ఏఎఫ్ఎస్ అధికారి స్పష్టం చేశారు. గాలిలోకి ఎగిరిన కాసేపట్లోనే విమానం కూలినట్లు తెలిపారు.