ఇండోర్: మధ్యప్రదేశ్‌లో భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్ కుప్పకూలాయి. మొరెనాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక పైలెట్ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పైలెట్లు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
సహాయక చర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. శిక్షణా సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శిక్షణా విన్యాసాలు చేస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన సుఖోయ్, మిరాజ్ శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment