Indian Air Force (IAF)
-
చుక్కలు చూపిన ఎయిర్ షో
సాక్షి, చెన్నై: చెన్నైలో ఆదివారం జరిగిన భారీ ఎయిర్ షో చేదు అనుభవం మిగిల్చింది. ఎండలకు తాళలేక సొమ్మసిల్లి ఐదుగురు చనిపోగా, 230 మంది ఆస్పత్రి పాలయ్యారు. మృతుల్లో ఒకరు తెలుగు వ్యక్తి అని సమాచారం. షో ఉదయం 11 నుంచి కాగా జనం 8 గంటలకే మెరీనా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివచ్చారు. ఎండ తీవ్రతకు చాలామంది షో ప్రారంభం కాకమునుపే సొమ్మసిల్లి పడిపోయారు. తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదని వాపోయారు. భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా 21 ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో 72 రకాల విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలు చేశాయి. వీటిని చూసేందుకు ఏకంగా 16 లక్షల మంది తరలివచ్చారు. ప్రదర్శన అనంతరం అంతా ఒక్కసారిగా ఇళ్లకు మరలడంతో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మండుతున్న ఎండ, రద్దీతో ముందుకు సాగేందుకు మార్గం లేకపోవడంతో ఒంట్లో ఓపికలేక చాలామంది రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు. బీచ్‌కు సమీపంలోని వారు కొందరికి మంచినీరు సరఫరా చేయడంతో పరిస్థితి కొంత తేలికపడింది. అయితే, జనం మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగానికి తగు ప్రణాళిక లేదని, కనీస వసతులు సైతం ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మెరీనా బీచ్ రోడ్డులో కిక్కిరిసిన జన సందోహం -
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి
జైపూర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం గాల్లో దూసుకెళ్తుండగా అనూహ్యమైన సంఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో పలురకాల వైమానిక సామగ్రి జారిపడింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. యుద్ధ విమానం అనుకోకుండా నిర్మానుష్య ప్రాంతంలో సామగ్రిని జారవిడిచినట్లు అధికారులు తెలియజేశారు. ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జారిపడిన సామగ్రి ఏమిటన్నది బయటపెట్టలేదు. సైనిక భాషలో బాంబు, క్షిపణులు, ఆయుధాలు, చమురు ట్యాంక్‌లను కూడా వైమానిక సామగ్రిగా పిలుస్తుంటారు. -
Indian Air Force: ‘నైట్ విజన్ గాగుల్స్’తో విమానం ల్యాండింగ్
న్యూఢిల్లీ: భారత వాయుసేన(ఐఏఎఫ్) మరో అరుదైన ఘనత సాధించింది. నైట్ విజన్ గాగుల్స్(ఎన్వీజీ) సాయంతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో సీ–130జే రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. తూర్పు సెక్టార్‌లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఒక వీడియోలో ఎన్వీజీ టెక్నాలజీతో విమానం సాఫ్ట్ ల్యాండింగ్ అయిన దృశ్యాలు, మరో వీడియోలో విమానంలో లోపలి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్వీజీ విజువల్స్ కావడంతో ఈ దృశ్యాలు ఆకుపచ్చ రంగులో విభిన్నంగా ఉన్నాయి. మన దేశ సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకొనే ప్రక్రియలో భాగంగా తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నామని భారత వాయుసేన పేర్కొంది. నైట్ విజన్ గాగుల్స్ టెక్నాలజీతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో, రాత్రిపూట విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి, సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడనుంది. -
ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
పుణె: ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ప్రదీప్ వసంత్ నాయక్ సతీమణి ఓటు గల్లంతయింది. ఓటర్ల జాబితా నుంచి తన భార్య మధుబాల పేరు తొలగించడంపై ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రదీప్ వసంత్ నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.సోమవారం ఉదయం పుణెలోని సాప్లింగ్ స్కూల్ బ్యానర్ రోడ్‌లోని పోలింగ్ బూత్ నంబరు26లో ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ఏసీఎం నాయక్, తన భార్య, కుమారుడు వినీత్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే తన భార్య పేరు ఓటరు జాబితాలో కనిపించలేదు. విషయాన్ని అక్కడి అధికారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు, ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారని ఏసీఎం నాయక్ పీటీఐకి చెప్పారు.“మేము పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు స్థానిక కార్పొరేటర్ ఇచ్చిన ఓటరు స్లిప్పులు మా వద్ద ఉన్నాయి. కానీ నా భార్య పేరు జాబితాలో లేదు”అని ఎయిర్స్ ఫోర్స్ మాజీ చీఫ్ వాపోయారు. పుణె సిట్టింగ్ ఎంపీ గిరీష్ బాపట్ మరణం తర్వాత బీజేపీ మాజీ మేయర్ మురళీధర్ మోహోల్‌ను పుణె లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. గత ఏడాది జరిగిన కస్బా అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించిన రవీంద్ర ధంగేకర్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. -
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
జమ్మూ: జమ్మూకశీ్మర్‌లోని పూంఛ్ జిల్లాలో భారత వాయుసేన జవాన్ల వాహనశ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. బలగాలు సనాయ్‌టోప్‌లోని శిబిరానికి తిరిగొస్తుండగా సురాన్‌కోటె పరిధిలోని షాసితార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఒక వాహనం విండ్్రస్కీన్పై డజనుకుపైగా బుల్లెట్ల దాడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఏకే రకం రైఫిళ్లతో దాడి చేసిన ఉగ్రవాదులు తర్వాత సమీప అడవిలోకి పారిపోయారు. గాయపడిన జవాన్లకు ఉధమ్‌పూర్‌లోని కమాండ్ ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. దాడి విషయం తెల్సి అప్రమత్తమైన సైన్యం, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రా్రïÙ్టయ రైఫిల్స్ బృందాలు అణువణువునా గాలిస్తున్నాయి. కాన్వాయ్ సురక్షితంగా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని వాయుసేన ‘ఎక్స్’లో పోస్ట్చేసింది. గత ఏడాది డిసెంబర్ 21న ఇక్కడి దగ్గర్లోని బఫ్లియాజ్లో సైన్యంపై మెరుపుదాడి చేసి నలుగురిని పొట్టనబెట్టుకున్న ఉగ్రముఠాయే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఫూంచ్‌లో గత రెండేళ్లుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. -
లద్దాఖ్‌లో ఐఏఎఫ్ అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దీంతో హెలికాప్టర్ దెబ్బతింది. లాద్దాఖ్‌లో కొండచరియలు, ఎత్తైన ప్రదేశాల కారణంగా చాపర్ దెబ్బతినడంతో ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ చేసినట్లు ఐఏఎఫ్ తెలిపింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. లడఖ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ (AOR)లో ఎత్తైన ప్రదేశాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి శిక్షణ ఇచ్చే సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను సమీపంలోని వాయుసేన స్థావరానికి చేర్చారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం కోర్టు విచారణకు ఆదేశించింది. -
బీజేపీలోకి మాజీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్.. అక్కడ నుంచి బరిలోకి?
సార్వత్రిక ఎన్నికలకు రోజులు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ 'ఆర్కేఎస్ భదౌరియా' (రిటైర్డ్) మార్చి 24న బీజేపీలోకి చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బదౌరియా.. సిట్టింగ్ ఎంపీ జనరల్ వీకే సింగ్ స్థానంలో ఘజియాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. పార్టీలో చేరిన తర్వాత ఆర్కేఎస్ భదౌరియా (రిటైర్డ్.) మాట్లాడుతూ.. తాను ఐఏఎఫ్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా పనిచేశానని, దేశ నిర్మాణానికి మరోసారి సహకరించేందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భారతీయ వైమానిక దళం(IAF)లో భదౌరియా సుదీర్ఘ సేవలందించారని బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కొనియాడారు. రక్షణ దళాలలో క్రియాశీల పాత్ర పోషించిన తర్వాత రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా, భారత జాతీయ కాంగ్రెస్ (INC) కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలుచుకోగా, INC కేవలం 44 సీట్లు మాత్రమే సాధించింది. #WATCH | Former Chief of Air Staff, Air Chief Marshal (Retd.) RKS Bhadauria joins BJP in the presence of party General Secretary Vinod Tawde and Union Minister Anurag Thakur. pic.twitter.com/n3s9k7INmf — ANI (@ANI) March 24, 2024 -
జాయింట్ ఆపరేషన్ సూపర్ సక్సెస్
న్యూఢిల్లీ: కచ్చితమైన వ్యూహం, సైనిక దళాల మధ్య సరైన సమన్వయం, పటిష్టమైన ప్రణాళిక ఉంటే ఎలాంటి ఆపరేషన్ అయినా విజయవంతం కావాల్సిందే. భారత వైమానిక దళం, నావికాదళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌తో సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టయ్యింది. సోమాలియా పైరేట్లు మూడు నెలల క్రితం హైజాక్ చేసిన సరుకు రవాణా నౌక ‘ఎంవీ రూయెన్’ను భారత వైమానిక దళం, నావికాదళం జాయింట్ ఆపరేషన్ ద్వారా విజయవంతంగా విడిపించాయి. ఈ నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను నావికాదళం అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నౌకలో బందీలుగా ఉన్న 17 మంది సిబ్బందిని విడిపించారు. నౌకలో రూ.8.29 కోట్ల విలువైన 37,800 కోట్ల టన్నుల సరుకు ఉందని, నౌకను ఇండియాకు చేరుస్తున్నామని నావికాదళం వెల్లడించింది. ఎంవీ రూయెన్ షిప్‌ను సముద్రపు దొంగల చెర నుంచి విడిపించడంలో భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్)కు చెందిన సి–17 టాక్టికల్ రవాణా విమానం కీలకంగా వ్యవహరించింది. జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా రెండు కాంబాట్ రబ్బరైజ్డ్ రైడింగ్ క్రాఫ్ట్(సీఆర్ఆర్సీ) బోట్లను, ‘మార్కోస్’ మెరైన్ కమాండోలను ఈ విమానం ద్వారా భారత తీరానికి 2,600 కిలోమీటర్ల దూరంలో ఆరేబియా సముద్రంపైకి క్షేమంగా జారవిడిచారు. కమాండోలు అపూర్వమైన ధైర్యసాహసాలతో సముద్రపు దొంగలను లొంగదీసుకున్నారు. మొత్తం ఆపరేషన్ 40 గంటలపాటు జరిగింది. -
మహీంద్రాతో ఎంబ్రేయర్ భాగస్వామ్యం
ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం ఎంబ్రేయర్ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్‌ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్‌లిఫ్టర్. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్‌కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్ సేకరించనుంది. -
సిబ్బందిని పొట్టనబెట్టుకుంది అతడే
జమ్మూ: శ్రీనగర్‌లో 1990 జనవరి 25వ తేదీన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సిబ్బందిపై కాల్పులు జరిపింది జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ అని ప్రత్యక్ష సాక్షి ధ్రువీకరించారు. ఆ రోజు ఘటన జరిగిన తీరును గురువారం ఐఏఎఫ్ మాజీ కార్పొరల్ రాజ్వర్ ఉమేశ్వర్ సింగ్ ప్రత్యేక సీబీఐ కోర్టుకు చెప్పారు. శ్రీనగర్ వైమానిక కేంద్రానికి వెళ్లేందుకు ఐఏఎఫ్ సిబ్బంది 1990 జనవరి 25వ తేదీ ఉదయం రావల్పొరాలో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో యాసిన్ మాలిక్‌తోపాటు కొందరు ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. యాసిన్ మాలిక్ తన దుస్తుల్లో నుంచి తుపాకీని బయటకు తీసి, యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ రవి ఖన్నా సహా నలుగురు నేలకొరగ్గా మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఉమేశ్వర్ సింగ్ ఒకరు. తీహార్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్ గురువారం జరిగిన కోర్టు విచారణకు వర్చువల్‌గా పాల్గొన్నాడు. ప్రత్యక్ష సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చని కోర్టు ఇచ్చిన అవకాశాన్ని యాసిన్ మాలిక్ తిరస్కరించాడు. తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలని కోరాడు. ఈ కేసులో మాలిక్, మరో అయిదుగురిపై 1990 ఆగస్ట్ 31వ తేదీన జమ్మూలోని టాడా కోర్టులో చార్జిషీటు దాఖలైంది. 1989లో అప్పటి కేంద్ర మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబియా కిడ్నాప్, నేవీ అధికారులపై కాల్పుల కేసులు యాసిన్ మాలిక్‌పై ఉన్నాయి. -
IAF: కార్గిల్‌లో నైట్ ల్యాండింగ్
భారత వాయుసేన (ఐఏఎఫ్) అరుదైన ఘనత సాధించింది. సముద్ర మట్టానికి ఏకంగా 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్‌పై సి–130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రి పూట సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. దీనికి సంబంధించి వాయుసేన ‘ఎక్స్’లో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఐఏఎఫ్ బాహుబలిగా చెప్పే ఈ విమానం పాక్ సరిహద్దులో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని ఈ ఎయిర్ స్ట్రిప్‌పై రాత్రి సమయంలో దిగడం ఇదే తొలిసారి! గరుడ్ కమాండోలకు శిక్షణలో భాగంగా ఇటీవలే ఈ విన్యాసం నిర్వహించినట్లు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. అంతేగాక ఐఏఎఫ్ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు వివరించాయి. నిజానికి రక్షణ శాఖలో రవాణా విమానాన్ని ఇలా రాత్రి పూట ల్యాండింగ్ చేయడం అత్యంత అరుదు. కొండలపై ఉన్న రన్‌వేపై భారీ విమానాన్ని క్షేమంగా దించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. హిమాలయ పర్వతాల్లో వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్ర్స్టిప్లు సేవలందిస్తున్నాయి. ఎల్ఏసీ సమీపంలో దౌలత్ బేగ్ ఓల్డీ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్(ఏఎల్జీ) సముద్ర మట్టానికి 16,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్‌ఫీల్డ్ కావడం గమనార్హం. వాయుసేన వద్ద 12 సి–130జే విమానాలున్నాయి. ఇవి సైనికుల తరలింపు, సహాయక సామగ్రి రవాణాలో ఉపయోగపడుతున్నాయి. – న్యూఢిల్లీ -
కలల సాధకులు... చరిత్ర సృష్టించారు
విజయానికి తొలి మెట్టు కల కనడం. కల కనడం ఎంత తేలికో ఆ కలను నిజం చేసుకోవడం అంత కష్టం. అయితే లక్ష్య సాధన వైపు బలంగా అడుగులు వేసే వారికి కలను నెరవేర్చుకోవడం కష్టం కాదని ఈ ఇద్దరు నిరూపించారు. మిజోరం నేపథ్యంగా చరిత్ర సృష్టించి వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు వన్నెహ్సోంగీ, మనీషా పధి... మిజోరంలో రాజకీయ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధికారంలోకి రాబోతున్న జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) గురించి మాట్లాడుకున్నట్లుగానే ఆ పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైన బారిల్ వన్నెహ్సోంగి గురించి కూడా ఘనంగా మాట్లాడుకుంటున్నారు. రేడియో జాకీగా పని చేసిన 32 ఏళ్ల బారిల్ వన్నెహ్సోంగి ‘జెడ్పీఎం’ నుంచి శాసనసభకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్కురాలైన మిజోరం శాసనసభ్యురాలిగా రికార్డ్ సృష్టించింది... మిజోరం శాసనసభ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పీఎం) ఘన విజయం సాధించడమనేది రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. అదృష్టం కాదు. మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), కాంగ్రెస్‌లను దాటుకొని అధికారం లోకి రావడం అంత తేలిక కాదు. అయితే ‘జోరం పీపుల్స్ మూమెంట్’ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు. ‘మనకంటూ ఒకరోజు తప్పకుండా వస్తుంది’ అని గట్టిగా అనుకుంది. సరిగ్గా ఇదే స్ఫూర్తి వన్నెహ్సోంగిలో కనిపిస్తుంది. చలాకీగా, నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వన్నెహ్సోంగి రాజకీయ, సామాజిక సంబంధిత విషయాలను మాట్లాడుతున్నప్పుడు మాత్రం ‘ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకరేనా’ అన్నట్లుగా ఉంటుంది. బలమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారికి సైద్ధాంతిక పునాది కూడా ముఖ్యం. కాలేజీ రోజుల నుంచే రాజకీయ దిగ్గజాలతో మాట్లాడడం, ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో విషయాలపై సాధికారత సాధించగలిగింది వన్నెహ్సోంగి. హైస్కూల్ రోజుల నుంచి మొదలు మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన సమయం వరకు వన్నెహ్సోంగి ఎప్పుడూ విన్న మాట, బాధ పెట్టిన మాట ... ‘రాజకీయాలు మహిళలకు తగనివి. రాజకీయాల్లోకి వచ్చినా రాణించలేరు’ ఈ భావన తప్పు అని నిరూపించడానికి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఆమె మనసులో బలంగా పడింది. రేడియో జాకీగా, టీవి ప్రెజెంటర్‌గా పని చేసిన వన్నెహ్సోంగి ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ‘రాజకీయాలు అంటే టీవి మైక్ ముందు మాట్లాడినంత తేలిక కాదు’ అని ముఖం మీదే అన్నారు చాలామంది. వారి మాటలతో డీలా పడలేదు వన్నెహ్సోంగి. తమ మీద తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర ఢీ అంటే ఢీ అనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కార్పోరేటర్‌గా గెలిచింది. విశాల రాజకీయ ప్రపంచంలో కార్పోరేటర్‌గా గెలవడం చిన్న విజయమే కావచ్చుగానీ ఆ విజయం తనకు అపారమైన ధైర్యం ఇచ్చి– ‘యస్. నేను సాధించగలను’ అని ముందుకు నడిపించింది. మిజోరంలోని ఐజ్వాల్ సౌత్–3 నియోజక వర్గం నుంచి 1,414 ఓట్ల మెజార్టీతో గెలిచిన బారిల్ వన్నెహ్సోంగి ‘సంకల్పబలం ఉండాలేగానీ మన కలల సాధనకు జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాదు’ అంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో ఎంతోమందికి చేరువ అయింది వన్నెహ్సోంగి. ఇన్స్టాగ్రామ్ అనేది ఆమె ఇంటి పేరుగా మారింది. ఇన్‌స్టాలో ఆమెకు మూడు లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నారు. ‘భవిష్యత్ లక్ష్యం ఏమిటీ?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం...‘చదువు ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. అభివృద్ధి పథంలో పయనించవచ్చు. అందుకే రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను’ అంటుంది వన్నెహ్సోంగి. యంగ్, ఎనర్జిటిక్ అండ్ డేరింగ్ అని అభిమానులు పిల్చుకునే వన్నెహ్సోంగి మదిలో ఎన్నో కలల ఉన్నాయి. అవి రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న కలలు. ఆ కలల సాకారంలో శాసనసభ్యురాలిగా తొలి అడుగు వేసింది. ఏడీసీ మనీషా చిన్నప్పుడు తండ్రి యూనిఫాంను పోలిన డ్రెస్ ధరించి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా తెగ హడావిడి చేసింది మనీషా. అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపోయింది. తండ్రి నడకను అనుకరించింది. ఆరోజు తమ ముద్దుల బిడ్డను చూస్తూ తెగ నవ్వుకున్న మనీషా తల్లిదండ్రులు, ఇప్పుడు కుమార్తె ఉన్నతిని చూసి గర్విస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ మనీషా సాధి మిజోరం గవర్నర్ సహాయకురాలి (ఏడీసీ)గా నియామకం అయింది. మన దేశంలో గవర్నర్‌కు ఎయిడ్–డి–క్యాంప్ (ఏడీసీ)గా నియామకం అయిన ఫస్ట్ ఉమన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించింది... మనీషా పధి స్వస్థలం ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్. తల్లి గృహిణి. తండ్రి మనోరంజన్ పధి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది మనీషా. చదువుకు తగ్గ ధైర్యం ఉండేది. తండ్రిలాగే ‘ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్’ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నది. చిన్నప్పుడు తండ్రి యూనిఫామ్‌ను పోలిన డ్రెస్‌ను ధరించి సందడి చేసేది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా ఆ తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది. గతంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్–బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్– పుణె చివరగా భటిండాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పనిచేసింది ‘ఏడీసీగా మనీషా పధి నియామకం ఒక మైలురాయి మాత్రమే కాదు. లింగ వివక్షతను కాలదన్ని వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్న మహిళా శక్తికి నిదర్శనం. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అన్ని రంగాల్లో మహిళా సాధికారతను కొనసాగిద్దాం’ అని వ్యాఖ్యానించారు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు. ‘ఎయిడ్–డి–క్యాంప్’ అనేది సాయుధ దళాల్లో ఉన్నత స్థాయి అధికారికి సహాయపడే అధికారి హోదాను సూచిస్తుంది. మన దేశంలో ‘ఎయిడ్–డి–క్యాంప్’ గౌరవప్రదమైన హోదా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్... మొదలైన వాటిలో సర్వీస్ చీఫ్‌లకు సాధారణంగా ముగ్గురు ‘ఎయిడ్–డి–క్యాంప్’లు ఉంటారు రాష్ట్రపతికి ఆర్మీ నుంచి ముగ్గురు, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం అయిదుగురు ఉంటారు. ఇక రాష్ట్ర గవర్నర్లకు ఇద్దరిని నియమిస్తారు. మా కూతురు మా శక్తి మనిషా పధి తల్లిదండ్రులు ఒడిషాలోని భువనేశ్వర్‌లో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తె మిజోరం గవర్నర్ ‘ఏడీసీ’గా నియామకం కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘2015లో ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణకు సంబంధించి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకుంది. ఆ అనుభవమే మనీషాను ‘ఏడీసీ’గా నియామకం అయ్యేలా చేసింది. మనిషా తల్లిదండ్రులుగా ఈ నియామకం విషయంలో సంతోషిస్తున్నాం. గర్విస్తున్నాం’ అంటున్నాడు మనీషా తండ్రి మనోరంజన్ పధి. ‘చదువు విషయంలో, వృత్తి విషయంలో మనీషా మమ్మల్ని సంతోషానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం నా సంతోషాన్ని వ్యక్తీకరించడానికి మాటలు రావడం లేదు. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగింది’ అంటుంది మనీషా తల్లి. ‘తన కలను నిజం చేసుకోవడానికి సొంత ఊరు దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మాతో పాటు మనీషాకు ఎంతో మంది నిరుత్సాహపరిచే మాటలెన్నో చెప్పారు. మనీషా ఒక్క నిమిషం కూడా అధైర్యపడింది లేదు. అలాంటి మాటలను పట్టించుకోవద్దని మేము గట్టిగా చెప్పేవాళ్లం. అమ్మాయిల కెరీర్ డ్రీమ్స్‌కు తల్లిదండ్రులు అండగా నిలబడితే వారు అద్భుత విజయాలు సాధిస్తారు. తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారు’ అంటున్నాడు మనోరంజన్ పధి. మనీషా పధి తల్లిదండ్రులకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటి సారాంశం ‘మీ అమ్మాయి బంగారం’ -
Uttarkashi tunnel collapse: నెమ్మదించిన రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో సొరంగం కుప్పకూలి నాలుగు రోజులుగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకోసం మరో భారీ యంత్రాన్ని తెప్పించారు. మూడు విడిభాగాలుగా యుద్ధవిమానాల్లో తరలించిన ఈ యంత్రాన్ని అసెంబుల్ చేసి, మరికొద్ది గంటల్లో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కుప్పకూలిన టన్నెల్ శిథిలాల గుండా ఆగర్ మెషీన్ సాయంతో వెడల్పాటి స్టీల్ పైపులను లోపలికి పంపే పనులు అధికారులు మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. 800, 900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో పనులకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి అమెరికన్ ఆగర్ అధికారులు హుటాహుటిన భారీ అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ భాగాలను భారత వాయుసేన విమానాల ద్వారా 30 కిలోమీటర్ల దగ్గర్లోని చిన్యాలిసౌర్‌కు తెప్పించారు. అక్కడి నుంచి ఘటనాస్థలికి రోడ్డు మార్గంలో తీసుకువస్తున్నామని ఎస్పీ అర్పణ్ తెలిపారు. వీటిని అసెంబ్లింగ్ చేసి, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు థాయ్‌లాండ్, నార్వే నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు నేషనల్ హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(ఎన్‌హెచ్‌ఐడి) డైరెక్టర్ అన్షు మాలిక్ తెలిపారు. 2018లో థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ జట్టు జూనియర్ ఆటగాళ్లను అక్కడి సంస్థ నిపుణులు వారం పాటు శ్రమించి సురక్షితంగా తీసుకువచి్చన విషయం తెలిసిందే. -
Indian Air Force Day: ఐఏఎఫ్ అత్యుత్తమమైందిగా ఉండాలి
ప్రయాగ్‌రాజ్: ఎప్పటికప్పుడు కొత్తగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి పిలుపునిచ్చారు. దేశ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు, శత్రువులను దీటుగా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ కట్టుబడి ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. ఎయిర్ ఫోర్స్‌డేను పురస్కరించుకుని ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐఏఎఫ్ అవతరించి 2032 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుందని చెబుతూ ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటిగా ఐఏఎఫ్ అవతరించాలని అన్నారు. వ్యూహాలను మెరుగుపరుచుకోవడం, సామర్థ్యాలను సమకూర్చుకోవడం వంటివి భవిష్యత్ యుద్ధాల్లో పైచేయి సాధించడంలో ఐఏఎఫ్‌కు ఎంతో కీలకమన్నారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ యుద్ధ వీరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి నిరుపమాన సేవలు, త్యాగాల వల్లే మన గగనతలం సురక్షితంగా ఉందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
భారత వాయుసేనలోకి తేజస్
సాక్షి, బెంగళూరు: భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) మొట్ట మొదటి రెండు సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను బుధవారం భారత వైమానిక దళానికి అప్పగించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ తయారీ రంగాన్ని రక్షణ రంగంలో విస్తరిస్తున్న హెచ్ఏఎల్ కృషిని ఆయన కొనియాడారు. ప్రపంచ స్థాయి విమానాల డిజైన్, అభివృద్ధి తయారీలో మన దేశానికి అమోఘమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని గుర్తు చేశారు. భారత వాయుసేనలో శిక్షణ ఇవ్వడానికి తేజస్ అన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉందని, అవసరమైతే యుద్ధ రంగంలో కూడా సేవలు అందిస్తుందని హాల్ వెల్లడించింది. తక్కువ బరువు కలిగి ఉండి అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలిగిన 4.5 జనరేషన్‌కు చెందిన యుద్ధ విమానం తేజస్. రెండు సీట్లు ఉండేలా డిజైన్ చేయడం వల్ల అప్పుడే వాయుసేనలో అడుగు పెట్టిన పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. -
ఐఏఎఫ్‌లోకి సీ–295 విమానం
ఘజియాబాద్: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లోకి మొదటి సీ–295 రకం రవాణా విమానం చేరింది. ఈ విమానాలు ఐఏఎఫ్ వ్యూహాత్మక రవాణా సామర్థ్యం పెంపులో కీలకంగా మారనున్నాయి. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీ–295 విమానాన్ని ఐఏఎఫ్‌లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్‌నాథ్ సర్వ ధర్మపూజ నిర్వహించారు. వైమానిక దళ చీఫ్ వీఆర్ చౌధరితోపాటు సీనియర్ అధికారులు, విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ ప్రతినిధులు పాల్గొన్నారు. వడోదర ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి పనిచేసే స్క్వాడ్రన్ నంబర్ 11కు సీ–295ను అందజేయనున్నారు. కేంద్రం 56 సీ–295 రవాణా విమానాల్ని కొనుగోలు చేసేందుకు ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో రూ.21,935 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి సీ–295 విమానాన్ని ఈ నెల 13న ఐఏఎఫ్ చీఫ్ అందుకున్నారు. ఈ విమానాలను ప్రస్తుతమున్న పాతకాలం ఆవ్రో– 748ల బదులు వినియోగించుకుంటారు. ఒప్పందంలో భాగంగా 16 విమానాల్ని ఎయిర్‌బస్ సంస్థ అందజేస్తుంది. మిగతా 40 విమానాల్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో కలిసి భారత్‌లోనే ఉత్పత్తి చేస్తుంది. వి డి భాగాల తయారీ పనులు హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. -
G20 Summit: సరిహద్దుల్లో భారీ సైనిక విన్యాసాలు
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) త్రిశూల్ పేరిట భారీ సైనిక విన్యాసాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. త్రిశూల్‌లో భాగంగా రఫేల్ వంటి యుద్ధ విమానాలను, ఎస్–400, ఎంఆర్‌సామ్, స్పైడర్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దించనుంది. దీంతోపాటు, లద్దాఖ్‌లో ఆర్మీ విభాగాలు వేరుగా విన్యాసాలు చేపడతాయి. దేశ ఉత్తర సరిహద్దులతోపాటు ఢిల్లీలో, ఢిల్లీ వెలుపల ఐఏఎఫ్ పలు రక్షణ వ్యవస్థలను మోహరించనుంది. జీ20 సదస్సుకు సమగ్ర గగనతల రక్షణను కల్పించడమే త్రిశూల్ ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, లద్దాఖ్‌లో ఆర్మీ విభాగాలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తాయి. పారా ట్రూపర్లు, పర్వత ప్రాంత యుద్ధ విద్యలో ఆరితేరిన విభాగాలు సైతం ఇందులో పాల్గొంటాయి. త్వరలో జరిగే జీ20 శిఖరాగ్రానికి 20 మందికి పైగా ప్రపంచ దేశాల నేతలు రానున్న దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఈ విన్యాసాలు జరుగుతుండటం గమనార్హం. -
ఆపరేషన్ డేట్ ఫిక్స్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ టైటిల్ ఖరారు చేశారు. అంతేకాదు.. ఈ మూవీని డిసెంబర్ 8 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా, రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలను చూపే యాక్షన్ మూవీ ఇది. శక్తి ప్రతాప్ సింగ్, అమిర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఈ చిత్రకథ రాశారు. హిందీ, తెలుగులో రూపొందిస్తున్నాం’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నందకుమార్ అబ్బినేని. -
చైనా, పాక్ సరిహద్దుల్లో హెరాన్ మార్క్–2 డ్రోన్లు మోహరింపు
న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయడానికి భారత వాయుసేన పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన అత్యంత శక్తిమంతమైన హెరాన్ మార్క్–2 సాయుధ డ్రోన్లు నాలుగింటిని ఉత్తర సెక్టార్ సరిహద్దు స్థావరాల్లో మోహరించింది. హెరన్ మార్క్–2 డ్రోన్లు సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే సామర్థం్య కలిగిన క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తిని మోసుకుపోగలవని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్ల మోహరింపుతో సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ‘హెరాన్ మార్క్ 2 డ్రోన్లు అత్యంత శక్తిమంతమైనవి. గంటల తరబడి గాల్లో ఎగిరే సామర్థ్యం, సుదూర ప్రాంతాల్లో ఏం జరుగుతోందో పసిగట్టే టెక్నాలజీ ఉండడం వల్ల పాక్, చైనా సరిహద్దుల్లో నిఘా మరింత పటిష్టం కానుంది’ అని డ్రోన్ స్క్వాడ్రన్ వింగ్ కమాండర్ పంకజ్ రాణా చెప్పారు. ప్రత్యేకతలు ఇవీ ► ప్రతికూల వాతావరణ పరిస్థితులు న్నప్పటికీ హెరెన్ మార్క్–2 డ్రోన్లు ఏకబిగిన 36 గంటలు ప్రయాణం చేయగలవు. అంటే ఈ డ్రోన్లు ఒకేసారి పాకిస్తాన్, చైనాలను కూడా చుట్టేసి రాగలవు. ► డ్రోన్లలో ఉండే లేజర్ సుదూర ప్రాంతంలో ఉండే శత్రు దేశాల లక్ష్యాలను గుర్తించగలవు. దీంతో మన క్షిపణులు వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ► ఎంత దూరంలోనున్న లక్ష్యాలనైనా గుర్తించడం, సుదీర్ఘంగా గాల్లో ఎగిరే సామర్థ్యం ఉండడం వల్ల ఇవి ఎక్కడికైనా వెళ్లి ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగలవు. ► ఈ డ్రోన్లు ఉపగ్రహంతో అనుసంధానం అయి ఉండడం వల్ల ఎక్కడ నుంచైనా వీటిని ఆపరేట్ చేసే సదుపాయం ఉంది. -
కూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం.. పైలట్లకు గాయాలు
సాక్షి, బెంగళూరు: భారత వైమానిక దళాని (ఐఏఎఫ్)కి చెందిన విమానం కుప్పకూలిన ఘట నలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లా భోగాపుర వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. వింగ్ కమాండర్ తేజ్‌పాల్, కో పైలట్ భూమిక బెంగళూరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సూర్యకిరణ్ రకం చిన్న శిక్షణ విమానంలో బయలుదేరారు. తిరిగి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలింది. ఇంధనం అంటుకుని కాలిపోయింది. తేజ్‌పాల్, భూమిక ప్యారాచూట్ల సాయంతో దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తేజ్‌పాల్ వెన్నెముకకు గాయమైంది. విమానం బహిరంగ ప్రదేశంలో కూలడంతో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. సంఘటన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం బెళగావి జిల్లా సాంబ్రా ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన రెడ్‌బర్డ్ శిక్షణ విమానం వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులోని ఇద్దరు పైలట్లు గాయాలతో బయటపడ్డారు. -
అర్ధంతరంగా అపాచీ ల్యాండింగ్
భిండ్/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ ఎటాక్ హెలికాప్టర్ సోమవారం మధ్యప్రదేశ్‌లోని భిండ్ సమీపంలో అర్ధంతరంగా ల్యాండయింది. రోజువారీ శిక్షణ సమయంలో హెలికాప్టర్లో కొన్ని అవాంతరాలు తలెత్తడంతో పైలట్ ముందు జాగ్రత్తగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిపుణుల బృందం హెలికాప్టర్‌ను పరిశీలిస్తోందని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. ఉదయం 8.45 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో ఎవరికీ ఏవిధమైన హాని కలగలేదని, అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని పేర్కొంది. కాగా, హెలికాప్టర్ ల్యాండయిన ప్రాంతంలో జనం గుమికూడిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. -
హ్యాట్సాఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. చిమ్మచీకట్లో సాహాసోపేతంగా 121 మందిని..
ఢిల్లీ: అదొక చిన్న రన్‌వే ఉన్న ఎయిర్‌స్ట్రిప్. కమ్యూనికేషన్లో భాగంగా.. నావిగేషనల్ అప్రోచ్ సహకారం లేదు. అక్కడ ఫ్యూయల్ సౌకర్యమూ లేదు. రాత్రి పూట ల్యాండ్ చేయడానికి ఏమాత్రం అనుకూలంగా లేని చోటు అది. ల్యాండింగ్ లైట్లు కూడా లేని చోటు నుంచి జనాల్ని తరలించే ఆపరేషన్ సక్సెస్‌గా పూర్తి చేసింది భారత వైమానిక దళం. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేసే దమ్ము ఉందని మరోసారి నిరూపించుకుంది. సూడాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది. అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్ విజన్ గాగుల్స్ (Night Vision Goggles) సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశారు. ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్ఫ్రా-రెడ్ సెన్సార్లను ఉపయోగించి ఎలాంటి ఆటంకాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతే.. అంత చిన్న రన్‌వేలో ఎయిర్‌క్రాఫ్ట్ దించగలిగారు. ల్యాండింగ్ అయ్యాక కూడా ఇంజిన్లను ఆన్‌లోనే ఉంచి.. అక్కడున్నవాళ్లను, వాళ్ల లగేజీలను విమానంలోకి ఎక్కించారు. ఆ సమయంలో ఎయిర్‌ఫోర్స్ స్పెషల్ యూనిట్ గరుడకు చెందిన ఎనిమిది మంది కమాండోలు ప్యాసింజర్ల భద్రతను పర్యవేక్షిస్తూనే.. సురక్షితంగా ఎక్కించారు. విమానం ఎలాగైతే దిగిందో.. అదే తరహాలో ఎన్వీజీ ఉపయోగించి టేకాఫ్ చేశారు. అలా రెండున్నర గంటలపాటు ఈ రిస్కీ ఆపరేషన్ కొనసాగింది. కల్లోల రాజధాని ఖార్తోమ్కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఇదంతా చోటుచేసుకోవడం గమనార్హం. అంతా జెడ్డాకు సురక్షితంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆపరేషన్ కావేరి ద్వారా ఇప్పటిదాకా 1,360 మందిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చింది కేంద్రం. ఇదీ చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు! 110 ఏళ్ల తర్వాత.. -
రూ.6,828 కోట్లతో 70 శిక్షణ విమానాలు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం రూ.6,828 కోట్లతో 70 హెచ్‌టీటీ–40 బేసిక్ శిక్షణ విమానాల కోనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) బుధవారం ఆమోదం తెలియజేసింది. రానున్న ఆరేళ్లలో ఈ విమానాలు ఐఏఎఫ్‌కు అందనున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్లో వెల్లడించారు. హెచ్‌టీటీ–40 విమానాలను ప్రభుత్వ రంగంలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉత్పత్తి చేయనుందని భారత రక్షణ శాఖ తెలియజేసింది. తక్కువ వేగంతో నడిచే ఈ విమానాలతో వైమానిక దళం సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వొచ్చని పేర్కొంది. హెచ్‌టీటీ–40 విమానాల తయారీలో హెచ్ఏఎల్ సంస్థ ప్రైవేట్ పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయనుంది. దీనివల్ల 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 1,500 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. -
సుఖోయ్, మిరాజ్ ఢీ.. పైలట్ మృతి
న్యూఢిల్లీ/భరత్పూర్/మొరెనా: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)నకు చెందిన సుఖోయ్ 30ఎంకేఐ, మిరాజ్–2000 యుద్ధ విమానాలు ఢీకొన్న అరుదైన ఘటనలో ఒక పైలెట్ మృతి చెందారు. మరో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌కు సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఏఎఫ్ బేస్‌గా ఉన్న గ్వాలియర్ విమానాశ్రయం నుంచి ఈ రెండు విమానాలు రోజువారీ సాధారణ శిక్షణలో భాగంగా బయలుదేరాయి. మొరెనా జిల్లా పహర్‌గఢ్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో అవి ప్రమాదవశాత్తు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఘటనలో సింగిల్ సీటర్ మిరాజ్–2000 పైలెట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి చనిపోగా ట్విన్ సీటర్ సుఖోయ్ ఫ్లయిట్‌లోని ఇద్దరు పైలెట్లు ఎజెక్ట్ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వింగ్ కమాండర్ శరీర భాగాలు పహార్‌గఢ్ ప్రాంతంలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. విమాన శకలాలు కొన్ని పొరుగునే ఉన్న రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లాలోనూ పడిపోయాయి. దీనిపై ఐఏఎఫ్ దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనకు సంబంధించిన వివరాలను ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఫ్లయిట్ డేటా రికార్డుల విశ్లేషణ అనంతరమే ఘటనకు దారి తీసిన కారణాలు తెలుస్తాయన్నారు. ఐఏఎఫ్ చరిత్రలో మిరాజ్, సుఖోయ్ ఢీకొనడం ఇదే తొలిసారి. దేశంలో గత 70 ఏళ్లలో ఇలాంటి 64 ప్రమాదాల్లో 39 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారని వైమానిక నిపుణుడు అంచిత్ గుప్తా తెలిపారు. -
Fighter Jets: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన రెండు యుద్ధ విమానాలు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్ కుప్పకూలాయి. మొరెనాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక పైలెట్ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు పైలెట్లు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సహాయక చర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. శిక్షణా సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. శిక్షణా విన్యాసాలు చేస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన సుఖోయ్, మిరాజ్ శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో ప్రమాదానికి గురయ్యాయి. -
74th Republic Day: పరేడ్‌లో మహిళా శక్తి
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో ఈసారి మహిళా శక్తికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆర్మి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనికవాతు బృందాలకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించనున్నారు. మొదటిసారి మహిళా ఒంటె దళం కవాతు చేయనుంది. డేర్ డెవిల్స్‌గా స్త్రీల బృందం మోటర్ సైకిల్ విన్యాసాలుచేయనుంది. అనేక శకటాలు మహిళా శక్తిని చాటనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్త్రీ ప్రభావ శక్తికి ఈ పరేడ్ వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు జరిగే సైనిక కవాతు, రాష్ట్ర ప్రభుత్వాల శకటాల విన్యాసం, కళా బృందాల ఆట΄ాటలు. చూడటానికి కళ్లు చాలవు. ఇదంతా కలిసి మన దేశం... మనమంతా కలిసి మన శక్తి అనే భావన ఈ సందర్భంలో కలుగుతుంది. అయితే ఈసారి ఈ ‘మన శక్తి’లో స్త్రీ శక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలుప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్ల ఈ పరేడ్ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలువనుంది. ముగ్గురు మహిళా సైనికాధికారులు పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. నావికా దళంలో నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ (29) 144 మంది నావికులతో కూడిన కవాతు బృందాలకు నాయకత్వం వహించనుంది. బెంగళూరుకు చెందిన దిశ అమృత్ 2016లో నావికా దళంలో చేరక ముందు ఐటి రంగంలో పని చేసింది. ఎన్సిసి కాడెట్‌గా ఉన్నప్పటి నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌పాల్గొంటున్న ఆమె ఈసారి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మిగ్– 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించనుంది. ఇక మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌కు లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ నాయకత్వం వహించనుంది. ‘చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన పరేడ్‌లో ఈసారి నేను పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని శర్మ అంది. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్ డింపుల్ భాటి మోటార్ సైకిల్ విన్యాసాల దళంలో, మేజర్ మహిమ ‘కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్’ బృందాల నాయకత్వంలోపాల్గొననున్నారు. మహిళా శకటాలు ఈసారి పరేడ్‌లో 17 రాష్ట్రాల నుంచి, 6 మంత్రిత్వ శాఖల నుంచి, త్రివిధ దళాల నుంచి శకటాలుపాల్గొననున్నాయి. ఇవి కాకుండా డిఆర్డివో శకటం ఉంటుంది. అయితే వీటిలో చాలా శకటాలు ఈసారి మహిళా శక్తికి ప్రాధాన్యం,ప్రాముఖ్యం ఇచ్చాయి. మూడు సైనిక దళాలు ఈసారి మహిళా కేంద్రిత శకటాలను నడుపుతున్నాయి. టూరిజంలోనూ, సేంద్రియ వ్యవసాయంలోనూ స్త్రీల భాగస్వామ్యంలో వారి స్వయం సమృద్ధికిపాటుపడతాం అనే థీమ్‌తో త్రిపుర శకటం ఉండనుంది. పశ్చిమ బెంగాల్ శకటం యునెస్కో గుర్తింపు పొందిన దుర్గా పూజను ‘మానవత్వానికి అమూర్త వారసత్వ సంపదగా’ అభివర్ణిస్తూ ముందుకు సాగనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘సకల సజీవిత్వాలను సమృద్ధి చేసే అమృత స్త్రీతత్వం’ థీమ్‌తో శకటం నడపనుంది. కేంద్ర హోమ్ శాఖ అయితే ఆరు కేంద్ర బలగాలలో స్త్రీ పోరాట పటిమను ప్రదర్శించే శకటంను ఎంచుకుంది. కేరళ మహిళా సాక్షరత శకటాన్ని, కర్నాటక మహిళా స్వయం సమృద్ధి శకటాన్ని ఈ పరేడ్ దారుల్లో నడిపించనున్నాయి. కళకళలాడే నృత్యాలు వీరందరూ కాకుండా వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాలలో విద్యార్థునులు, యువతలు, మహిళా కళాకరులు విశేష సంఖ్యలోపాల్గొననున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి మొదలు వీరంతా తమ సాంస్కృతిక విన్యాసాలను ప్రదర్శించనున్నారు. లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ, స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి, లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ చారిత్రక దృశ్యం దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ నేత్రపర్వంగా ఉండటమే కాదు, దేశభక్తి భావాలు ఉ΄÷్పంగేలా కూడా చేస్తుంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేకత... సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) ‘క్యామెల్ కాంటింజెంట్’లో తొలిసారిగా ΄ాల్గొంటున్న మహిళా సైనికులు... దిల్లీలో ఘనంగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ‘క్యామెల్ కాంటింజెంట్’ 1976 నుంచి భాగం అవుతోంది. ఈసారి జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళా సైనికులు ‘క్యామెల్ కాంటింజెంట్’లో భాగం కావడం చారిత్రక ఘట్టం కానుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇరవై నాలుగు మంది మహిళా సైనికులకు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో క్యామెల్ రైడింగ్‌లో శిక్షణ ఇచ్చి పన్నెండు మందిని ఎంపిక చేశారు. ‘రిపబ్లిక్ డే పరేడ్‌లో ΄ాల్గొనడం ఒక సంతోషం అయితే క్యామెల్ కాంటింజెంట్‌లో భాగం కావడం మరింత సంతోషం కలిగిస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైన అంబిక. ‘రిపబ్లిక్ డే ఉత్సవాల్లో క్యామెల్ రైడర్స్‌ను చూసి అబ్బురపడేదాన్ని. ఇప్పుడు నేను అందులో భాగం కావడం గర్వంగా ఉంది’ అంటుంది సోనాల్. విజయ్‌చౌక్ నుంచి ఎర్రకోట వరకు కర్తవ్యపథ్ మీదుగా క్యామెల్ రైడర్స్ కవాతు నిర్వహిస్తారు. రిపబ్లిక్‌డే తరువాత జరిగే రీట్రీట్ సెరిమనీలో కూడా ఈ బృందం ΄ాల్గొనబోతోంది. అమృత్‌సర్‌లో జరిగిన బీఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ఈ బృందం ΄ాల్గొని ప్రశంసలు అందుకుంది. ఉమెన్ రైడర్స్ కోసం ఆకట్టుకునే యూనిఫాంను కూడా రూ΄÷ందించారు. ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ దీన్ని డిజైన్ చేశారు. మన దేశంలోని వివిధ ్ర΄ాంతాలకు చెందిన క్రాఫ్ట్ ఫామ్స్‌ను ఈ డిజైన్ ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది. రాజస్థాన్‌లోని మెవాడ్ సంప్రదాయానికి చెందిన తల΄ాగా మరో ఆకర్షణ. మన దేశంలో భద్రతావసరాలు, సాంస్కృతి కార్యక్రమాల్లో ఒంటెలను ఉపయోగిస్తున్న ఏకైక సైనిక విభాగం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సాంస్కృతిక కార్యక్రమాల్లో బీఎస్ఎఫ్ క్యామెల్ కాంటింజెంట్ కవాతులకు ప్రత్యేకత ఉంది. ఉమెన్ రైడర్స్ రాకతో కవాతులలో రాజసం ఉట్టిపడుతుంది. మేము సైతం: ఉమెన్ రైడర్స్, ఆకట్టుకునే యూనిఫాం: ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ డిజైన్ చేశారు. -
స్త్రీ శక్తి: సూపర్ ఫైటర్
సవాలుకు దీటైన సమాధానం విజయంలోనే దొరుకుతుంది. ‘అమ్మాయిలు బైక్ నడపడం కష్టం’ అనే మాట విన్నప్పుడు పట్టుదలగా బైక్ నడపడం నేర్చుకుంది. ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశించడం చాలా కష్టం’ అనే మాట విన్న తరువాత ఫైటర్ పైలట్ కావాలనుకునే లక్ష్యానికి బీజం పడింది. ‘మిగ్–21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది జపాన్‌లో జరగబోయే ఎయిర్ కంబాట్ ఎక్సర్‌సైజ్‌లలో పాల్గొనబోతోంది... ఇండియా, జపాన్ దేశాలు కలిసి ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లు నిర్వహించనున్నాయి. ఎయిర్ డిఫెన్స్‌కు సంబంధించి పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్), జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్(జేఎఎస్డీఎఫ్)లు గగనతల విన్యాసాలకు శ్రీకారం చుట్టనున్నాయి. జపాన్‌లో హైకురీ ఎయిర్‌బేస్ కేంద్రంగా జరిగే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లు (వీర్ గార్డియన్ 2023) ఈ నెల 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. మన దేశానికి సంబంధించి సుఖోయ్–30 ఎంకేఐ, సీ–17 హెవీ–లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు దీనిలో భాగం అవుతాయి. ఈ కార్యక్రమంలోపాల్గొంటున్న ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్‌గా స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది చరిత్ర సృష్టించనుంది. మన దేశంలో జరిగిన కంబాట్ ఎక్సర్‌సైజ్‌లలో మహిళా ఫైటర్ పైలట్లుపాల్గొన్న సందర్భాలు ఉన్నప్పటికీ, వేరే దేశంలో జరిగే దానిలో ఒక మహిళా ఫైటర్ పైలట్పాలుపంచుకోడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌కు చెందిన అవని చతుర్వేది జైపూర్‌లో బీటెక్ చేసింది. విమానాలపై ఉన్న ఆసక్తితో రాజస్థాన్‌లోని వనస్థలి యూనివర్శిటీ ‘ప్లయింగ్ క్లబ్’లో చేరింది. అక్కడ మొదలైన ఆమె ప్రయాణం విజయపరంపరలతో సాగుతూనే ఉంది. ‘మిగ్–21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా 2018 చరిత్ర సృష్టించింది అవని. రాష్ట్రపతి చేతుల మీదుగా 2020లో ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకున్న అవని, వైమానిక రంగంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇచ్చింది. అవని తండ్రి నీటిపారుదలశాఖలో ఇంజనీరు. సోదరుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. సోదరుడి స్ఫూర్తితోనే సైన్యంలోకి వచ్చింది అవని. భారతీయ వైమానికదళంలో పనిచేయాలనే తన లక్ష్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ‘ఫ్లైయింగ్ క్లబ్లో చేరినంత సులువు కాదు’ అని వెక్కిరించిన వాళ్లూ ఉన్నారు. అయితే వాటిని అవని సీరియస్‌గా తీసుకోలేదు. ఎఎఫ్సిఎటీ పరీక్షలో రెండో స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది. దుండిగల్(హైదరాబాద్)లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందింది. సాహసాలతో చెలిమి చేసింది. అవనికి బాస్కెట్‌బాల్, చెస్ ఆడడం, పెయింటింగ్ అంటే ఇష్టం. బాస్కెట్‌బాల్ వల్ల తెగువ, చెస్‌తో లోతైన ఆలోచన, పెయింటింగ్‌తో సృజనాత్మక శక్తులు తనలో వచ్చి చేరాయి. ‘ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకోవాలనేది నా విధానం. మంచి ఫైటర్ పైలట్‌గా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం’ అంటోంది అవని చతుర్వేది. ‘కఠినమైన ఫైటర్–ఫ్లయింగ్ షెడ్యూల్స్’ అంటూ ఒకప్పుడు ఐఏఎఫ్ మహిళలను కంబాట్ స్ట్రీమ్‌లోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఐఏఎఫ్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. దీనికి తాజా ఉదాహరణ జపాన్‌లో జరిగే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్కు అవని చతుర్వేదిని ఎంపిక చేయడం. -
IAF Combined Graduation Parade: ఈ పైలట్లు ఫైటర్లు
పోరాటాలంటే మక్కువ ఉన్నవారు ఏ సవాల్‌నైనా ఇట్టే అధిగమిస్తారు. ఫైటర్ జెట్ పైలెట్‌గా ఎంపికైన మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్‌లను చూస్తే ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజం అంటారు. 22 మంది మహిళల్లో ఫైటర్లుగా ఎంపికైన వీరి ప్రతిభ, కృషి నవతరానికి స్ఫూర్తి. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో (ఏఎఫ్ఏ) జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ అది. వాయుసేనలో ఉన్న ఖాళీలు, శిక్షణ సమయంలో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా వారిని ఫైటర్లుగా ఎంపిక చేస్తారు. మొత్తం 164 మంది శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ ఆఫీసర్లు పట్టాలు పొందారు. వీరిలో 22 మంది మహిళలు ఉండగా మైత్రేయ నిగమ్, మెహర్ జీత్ కౌర్‌లు ఫైటర్ జెట్ పైలట్లుగా నిలిచారు. మైత్రేయ నిగమ్ ఆమె కుటుంబంలో మూడో తరం ఫైటర్. వదలని కృషి గ్రూప్ కెప్టెన్‌గా పదవీ విరమణ పొందిన పీకే నిగమ్ ప్రస్తుతం ఏవియేషన్ డొమైన్ సంస్థలో పని చేస్తుండగా, ఆయన కుమారుడు అమిత్ నిగమ్ వింగ్ కమాండర్ హోదాలో రిటైర్ అయి ఇండిగో విమానయాన సంస్థలో సీనియర్ కెప్టెన్‌గా పని చేస్తున్నారు. మైత్రేయ నిగమ్ ఢిల్లీలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడి ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో విద్యనభ్యసించారు. అహ్మదాబాద్‌లోని ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్‌లో (మికా) ఎంబీఏ కోర్సులో చేరారు. అదే సమయంలో తనకు ఆసక్తి ఉన్న వైమానిక దళంలోకి ఎంపికయ్యారు. ‘మా తాత, తండ్రిని చూసి స్ఫూర్తి పొందాను. ఫైటర్ జెట్ పైలట్ కావాలనే ఆశయంతో కృషి చేశా. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎవరైనా అనునిత్యం శ్రమించాల్సిందే. వెంట వెంటనే విజయాలు లభించవు. కల నెరవేరాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. కానీ, ఆగిపోవద్దు. కృషిని మధ్యలోనే వదిలేయకుండా కష్టపడితే విజయం తథ్యం’ అని చెబుతోంది మైత్రేయ. పోరాటాలంటే ఇష్టం ఢిల్లీకి చెందిన మెహర్ జీత్ కౌర్ బీఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తి చేశారు. ఆది నుంచీ మెహర్‌కి మిలటరీ బలగాలు చేసే పోరాటాలంటే మక్కువ. దీంతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్... ఏదో ఒకదాంట్లో చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏఎఫ్ఏలో శిక్షణలో ప్రతిభ చూపించి ఫైటర్ జెట్ పైలట్‌గా ఎంపికయ్యారు. ‘జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెనక్కు రాకూడదు. మహిళలు ఈ విషయంలో మరింత పట్టుదలతో ఉండాలి. ఏ సాయుధ బలగంలో అయినా అతివలు దూసుకుపోగలరని గుర్తుంచుకోండి. బీదర్ లో అదనపు శిక్షణ అనంతరం విధుల్లో చేరుతా’ అని పేర్కొన్నారు. నావిగేటర్.. మా నాన్న గుర్దీప్ సింగ్ గుర్దాస్పూర్ సిటీ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. తాత గురుబచన్ సింగ్ ఆర్మీలో పని చేసి పదవీ విరమణ పొందారు. వారు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి చేర్చింది. పంజాబ్‌లోని గుర్దాస్పూర్ నుంచే పన్నెండో తరగతి పూర్తి చేశాను. 2016లో భారత వాయుసేనలోకి ముగ్గురు మహిళా ఫైటర్లు తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన వార్త చూసి వారి బాటలోనే నడవాలనుకున్నాను. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లి ఏఎఫ్ఏలో శిక్షణ పూర్తి చేసుకుని, నావిగేటర్‌గా ఎంపికయ్యాను. – కోమల్ ప్రీత్ కౌర్, పంజాబ్ కఠినమైన శిక్షణ ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో శిక్షణ ఎంతో కఠినంగా ఉంటుంది. ఇక్కడ శిక్షణ పొందే ప్రతి ఒక్కరూ నెవర్ గివిట్ అప్ ధోరణిలోనే ఉంటారు. స్త్రీ, పురుష తేడాలు ఉండవు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉన్నట్టుగానే శిక్షణలో పాల్గొనాలి. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, త్యాగాల కారణంగానే ఈ స్థాయికి చేరా. 12వ తరగతి వరకు సైన్స్ చదివినా డిగ్రీ మాత్రం ఆర్ట్స్‌లో పూర్తి చేశాను. నా తండ్రి రణ్‌బీర్ సింగ్ ఢిల్లీ కేంద్రంగా టెరిటోరియర్ ఆర్మీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత హోదా అయిన సుబేదార్ మేజర్‌గా పని చేస్తున్నారు. ఆర్మీ జీవితాన్ని వారి ద్వారా ఇప్పటికే చూశాను. అందుకే వైమానిక దళాన్ని ఎంపిక చేసుకున్నా. ఎదగాలి, ఎగరాలనే కోరిక బలంగా ఉంది. – సహజ్ప్రీత్ కౌర్, అమృత్సర్ ఈ శిక్షణలో పాల్గొన్న కోమల్‌ప్రీత్‌కౌర్, సహజ్ప్రీత్కౌర్లు కూడా తమ శిక్షణ అనుభవాలను పంచుకున్నారు. – శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో, హైదరాబాద్ -
ఈశాన్యంలో వైమానిక విన్యాసాలు ప్రారంభం
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ జెట్లతో సహా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలోఉన్న సుఖోయ్–30 యుద్ధవిమానం, ఇతర అత్యాధునిక యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల చొరబాటు యత్నం నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఇవి జరుగుతున్నాయని, సైనికుల ఘర్షణతో వీటికి సంబంధం లేదని భారత వైమానిక దళం స్పష్టం చేసింది. విన్యాసాలు శుక్రవారం ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, 36 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరుకున్నాయని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. దీంతో ఒప్పందం మేరకు మొత్తం విమానాలు వచ్చినట్లయ్యిందని పేర్కొంది. -
స్వదేశీ ఆయుధ సంపత్తి
విజయదశమి.. ఆయుధపూజ వేళ... భారత వాయుసేన (ఐఏఎఫ్) అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ (ఎల్సీ హెచ్) ‘ప్రచండ’ చేరికతో మన సైన్యానికి కొత్త జవసత్వాలు సమకూరాయి. జోద్పూర్ వైమానిక కేంద్రం వేదికగా సోమవారం సైనిక ఉన్నతాధికారులతో కలసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలివిడతగా నాలుగు హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. పలు విధాలుగా ఇది కీలక ఘట్టం. పొరుగున చైనా నుంచి పొంచివున్న ముప్పు నేపథ్యంలో ప్రధానంగా ఎల్తైన పర్వత ప్రాంతాల్లో సైతం శత్రువులపై పోరాడే దేశవాళీ ఛాపర్ ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టయింది. ప్రభుత్వ రంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్ – హాల్) తయారు చేసిన ఈ లోహవిహంగం గణనీయంగా ఆయుధాలు, ఇంధనం తీసుకొని 5 వేల మీటర్ల ఎత్తున కూడా కిందకు దిగగలదు. టేకాఫ్ తీసుకోగలదు. ప్రపంచంలో అలాంటి యుద్ధ హెలికాప్టర్ ఇదొక్కటే అని నిపుణుల మాట. అతి వేడిగా ఉండే ఎడారుల్లో, రక్తం గడ్డ కట్టించే అతి ఎల్తైన ప్రాంతాల్లో, విద్రోహ చర్యల్ని విచ్ఛిన్నం చేసే వేళల్లో – ఇలా అన్ని యుద్ధ సందర్భాల్లో గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించ గలగడం ఈ లోహ విహంగాల ప్రత్యేకత. వెరసి, సైనిక ఆయుధాలను విదేశాల నుంచి కొనడానికే పేరుబడ్డ భారత్ ఈ దేశీయ తయారీ యుద్ధ హెలికాప్టర్లతో కనీసం ఇంతవరకైనా బయ్యర్ నుంచి బిల్డర్‌గా మారింది. ‘మేకిన్ ఇండియా’ స్వప్నసాకారంలో ఒక అడుగు ముందుకు పడింది. 1999 నాటి కార్గిల్ యుద్ధవేళ దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అవసరం తొలిసారిగా మనకర్థమైంది. అప్పటికి మన దగ్గర చేతక్, చీతా లాంటి హెలికాప్టర్లే ఉన్నాయి. కానీ మరింత చురుగ్గా, బహు పాత్రపోషణ చేయగలవి అవసరమయ్యాయి. ఆ పరిస్థితుల్లో తొలి దశ చర్చల తర్వాత 2006 అక్టోబర్‌లో ప్రభుత్వం ఎల్సీహెచ్ ప్రాజెక్ట్‌ను ‘హాల్’కు మంజూరు చేసి, వాటిని అభివృద్ధి చేసే బాధ్యతను అప్పగించింది. అలా పైలట్, కోపైలట్లు ఒకరి వెనుక మరొకరు కూర్చొనేలా ఈ రెండు ఇంజన్ల, 5.8 టన్నుల లోహ విహంగాన్ని డిజైన్ చేశారు. అనేక కఠిన పరీక్షల అనంతరమే ఈ ఛాపర్లకు అనుమతినిచ్చి, సైన్యంలోకి తీసుకున్నారు. అందుకు 2010– 2015 మధ్య 4 నమూనా ఛాపర్లు సిద్ధం చేసి, రకరకాల ఎత్తుల్లో, 2 వేలకు పైగా గగనయాన పరీక్షలు చేశారు. 2017లో వైమానిక దళ నమూనాకూ, 2019లో ఆర్మీ నమూనాకూ తొలిదశ అనుమతి వచ్చింది. నిరుడు నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రతీకాత్మకంగా ఎల్సీహెచ్ను భారత వైమానిక దళానికి అప్పగించి, ఆఖరి ఘట్టానికి తెర తీశారు. ఈ మార్చిలో భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సంఘం వాయుసేనకు 10, ఆర్మీకి 5 – మొత్తం 15 ఎల్‌సీహెచ్‌ల తయారీకి ఆమోదం తెలిపింది. దరిమిలా సెప్టెంబర్ 29న బెంగళూరులో ఆర్మీలోకీ, ఇప్పుడు జోద్‌పూర్‌లో వాయుసేనలోకీ ఎల్‌సీహెచ్‌లను లాంఛనంగా ప్రవేశపెట్టారు. ఇలాంటి ఎల్‌సీహెచ్‌లు 160 దాకా మనకు అవసరం. గంటకు 268 కి.మీ గరిష్ఠ వేగంతో వెళ్ళగల ఈ ‘ప్రచండ’ ఛాపర్లలో అనేక ప్రత్యేకతలున్నాయి. 6.5 కి.మీ ఎత్తున ఎగరగల సత్తా ఈ లోహ విహంగం సొంతం. 20 ఎంఎం టరెట్ గన్, 70 ఎంఎం రాకెట్లు, గగనతల క్షిపణి వ్యవస్థలతో ఇది యుద్ధసన్నద్ధమై ఉంటుంది. శత్రు రాడార్ల గురి నుంచి రక్షణవ్యవస్థ ఉండే ఈ ఛాపర్ ముష్కరుల గగనతల భద్రతావలయాన్ని ఛేదించి, విద్రోహ చర్యలను తిప్పికొడుతుంది. తొలి దేశీయ యుద్ధ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ జలప్రవేశం చేసి నెల తిరిగేసరికి ఇప్పుడు ఈ యుద్ధ హెలికాప్టర్లు మన వైమానికదళానికి సమకూరడం సంతోషమిచ్చే పరిణామం. వీటికన్నా ముందే ఈ జూన్‌లో తీరప్రాంత గస్తీ దళంలోకి దేశవాళీ అడ్వాన్స్›్డ లైట్ హెలికాప్టర్ ఎంకె–3 వచ్చి చేరింది. భారత రక్షణ రంగానికి ఇవన్నీ శుభసూచనలు. రక్షణ రంగంలో ఒకపక్క దిగుమతులు తగ్గించుకొంటూనే, మరోపక్క అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకుంటున్న ట్టయింది. గత అయిదేళ్ళలో మన రక్షణ ఎగుమతులు 334 శాతం పెరిగాయని సర్కారు వారి మాట. ప్రస్తుతం 75కి పైగా దేశాలకు మన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. మన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌పై మలేసియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, అమెరికా, ఇండొనేసియా, ఫిలిప్పైన్స్ సైతం ఆసక్తి కనబరచడం విశేషం. రక్షణ ఉత్పత్తుల దేశవాళీ డిజైనింగ్, అభివృద్ధి, తయారీకై కొన్నేళ్ళుగా తీసుకుంటున్న విధాన నిర్ణయాలు క్రమంగా ఫలితమిస్తున్నట్టున్నాయి. విదేశాల నుంచి రక్షణ ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకోవడం 2012–16తో పోలిస్తే, 2017–21లో దాదాపు 21 శాతం తగ్గాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెబుతోంది. అయితే, ఇప్పటికీ ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలో మనం ముందు వరుసలోనే మిగిలాం. రష్యన్ తయారీ ఆయుధాలపై భారీగా ఆధార పడ్డాం. ఈ పరిస్థితి మారాలంటే, తక్కువ వ్యయంతోనే ప్రపంచ ప్రమాణాలను అందుకొనే సాంకేతి కతను అభివృద్ధి చేయాలి. అదే అతి పెద్ద సవాలు. చిక్కులు లేకుండా ప్రభుత్వం అవసరమైన వనరుల్ని అందించి, పరిశోధన – అభివృద్ధిని ప్రోత్సహిస్తే, కీలక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి ఆ సవాలును అధిగమించవచ్చు. రక్షణ రంగంలో దిగుమతులు తగ్గించుకొని, సొంత కాళ్ళ మీద నిలబడవచ్చు. దృఢసంకల్పం ఉంటే అది అసాధ్యమేమీ కాదని ‘ప్రచండ్’ రూపకల్పన చెబుతోంది. సాధించిన ఘనతతో పాటు సాధించాల్సిన లక్ష్యాలను మరోసారి గుర్తుచేస్తోంది. -
శత్రువుల పాలిట ‘ప్రచండ’మే
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. సోమవారం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్లో రాజ్‌నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్‌లు, బంకర్లు, డ్రోన్లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్‌నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు. ఇంకొన్ని ప్రత్యేకతలు ఈ హెలికాప్టర్లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్‌కు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Indian Air Force: సవాలుకు సై
‘ఎగిరించకు లోహ విహంగాలను’ అన్నారు శ్రీశ్రీ ‘సాహసి’ కవితలో. ఈ సాహసులు మాత్రం రకరకాల లోహవిహంగాలను ఎగిరించడంలో తమ సత్తా చాటుతున్నారు. చండీగఢ్, అస్సాంలోని మోహన్బరీ చినూక్ హెలికాప్టర్ యూనిట్లలో తొలిసారిగా ఇద్దరు మహిళా ఫైటర్ పైలట్లు విధులు నిర్వహించబోతున్నారు.... మూడు సంవత్సరాల క్రితం... ‘ఇది చిరకాలం గుర్తుండే పోయే శుభసందర్భం’ అనే ఆనందకరమైన మాట ఫ్లైట్ లెఫ్టినెంట్ పారుల్ భరద్వాజ నోటి నుంచి వినిపించింది. రష్యా తయారీ ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ను నడిపిన తొలి ‘ఆల్ ఉమెన్ క్రూ’లో పారుల్ భరద్వాజ్ ఒకరు. ఆమెతోపాటు ఫ్లైట్ లెఫ్టినెంట్ హీన జైస్వాల్, ఫ్లైయింగ్ ఆఫీసర్ అమన్ నిధి ఉన్నారు. ‘ఆల్ ఉమెన్ క్రూ’కు ఎంపిక కావడం అంత తేలికైన విషయం కాదు. రకరకాల పరీక్షలలో విజయం సాధించి దీనికి ఎంపికయ్యారు. మొదట సికింద్రాబాద్‌లోని హకీంపేట్ హెలికాప్టర్ ట్రైనింగ్ సెంటర్లో, ఆ తరువాత బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ‘ఎంఐ–17వీ5 నడిపే మహిళా బృందంలో నేను భాగం అయినందుకు గర్వంగా ఉంది. దేశం కోసం ఏదైనా చేయాలనుకునేవారికి స్ఫూర్తినిచ్చే విషయం ఇది’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది పారుల్ భరద్వాజ్. పంజాబ్‌లోని ముకేరియన్ పట్టణానికి చెందిన పారుల్ రకరకాల హెలికాప్టర్లను నడపడంలో సత్తా చాటింది. తాజాగా... అధిక బరువు ఉన్న ఆయుధాలు, సరుకులను వేగంగా మోసుకెళ్లే మల్టీ–మిషన్ ‘చినూక్’ సారథ్య బాధ్యతను తొలిసారిగా ఇద్దరు మహిళలకు అప్పగించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. వారు... పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్. చండీగఢ్, అస్సాంలోని మోహన్బరీలో ఈ ఇద్దరు విధులు నిర్వహిస్తారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఫ్లై– పాస్ట్’ లీడ్ చేసిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించిన స్వాతి రాథోడ్ రాజస్థాన్‌లోని నగౌర్ జిల్లాలో జన్మించింది. పైలట్ కావాలనేది తన చిన్నప్పటి కల. ఎన్సీసీ ఎయిర్‌వింగ్‌లో చేరడం తనను మరోస్థాయికి తీసుకువెళ్లింది. 2014లో పైలట్ కావాలనే తన కోరికను నెరవేర్చుకుంది స్వాతి రాథోడ్. ‘ఎం–17 నుంచి చినూక్లోకి అడుగుపెట్టడం ముందడుగుగా చెప్పుకోవాలి. వాయుసేనలో పనిచేస్తున్న మహిళలు తాము ఉన్నచోటే ఉండాలనుకోవడం లేదు. తమ ప్రతిభను నిరూపించుకొని ఉన్నతస్థాయికి చేరాలనుకుంటున్నారు. ఇది గొప్ప విషయం’ అంటున్నారు ఎయిర్ మార్షల్ అనీల్ చోప్రా. ఎంఐ–17వీ5తో పోల్చితే చినూక్ పనితీరు పూర్తిగా భిన్నం. దీనికితోడు కొన్ని భయాలు కూడా! అమెరికాకు చెందిన ఏరో స్పెస్ కంపెనీ ‘బోయింగ్’ తయారుచేసిన చినూక్ భద్రతపై ఇటీవల కాలంలో రకరకాల సందేహాలు వెల్లువెత్తాయి. వీటి ఇంజన్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందనేది వాటిలో ఒకటి. అయితే దీన్ని ‘బోయింగ్’ సంస్థ ఖండించింది. ఎలాంటి సమస్యా ఉండదని స్పష్టం చేసింది. అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్‌ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం. అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్‌ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్‌లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం. -
ఎయిర్‌ఫోర్స్‌తో ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ ఒప్పందాలు
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌తో ‘డిఫెన్స్ వేతన ప్యాకేజీ’ ఒప్పందం చేసుకున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం కింద ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు, పదవీ విరమణ తీసుకున్న వారికి ఎస్బీఐ పలు ప్రయోజనాలు, ఫీచర్లతో ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. వ్యక్తిగత ప్రమాద బీమా, వాయు ప్రమాదం, విధుల్లో మరణిస్తే అదనపు పరిహారంతో బీమా రక్షణను అందించనున్నట్టు తెలిపింది. శాశ్వత/పాక్షిక అంగవైకల్య కవరేజీ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘‘మన జాతి, పౌరుల రక్షణ కోసం వైమానిక దళ ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. డిఫెన్స్ శాలరీ స్కీమ్ కింద వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారాలు అందించడాన్ని కొనసాగిస్తాం’’అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రకటించారు. ఈ ప్రయోజనాలు డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ పరిధిలో ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిగ్గా లభిస్తాయని ఎస్బీఐ తెలిపింది. -
వాయుసేనలో ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్.. రిజిస్ట్రేషన్ షురూ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘అగ్నివీర్వాయు’ ద్వారా రిజిస్ట్రేషన్ మొదలైందని ఐఏఎఫ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అగ్నిపథ్ పథకం ద్వారా 17.5–23 ఏళ్ల మధ్య యువతను నాలుగేళ్ల సర్వీసులోకి తీసుకుంటారు. వీరిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరిలో 25% మందిని రెగ్యులర్ సేవలకు వినియోగించుకుంటారు. ఈ పథకం వల్ల సైనిక బలగాల కార్యాచరణ సామర్థ్యం దెబ్బతింటుందంటూ దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు హింసాత్మక రూపం దాల్చడం తెలిసిందే. Registration window to apply for #Agniveervayu is operational from 10 am today. To register, candidates may log on to https://t.co/kVQxOwkUcz#Agnipath#भारतीयवायुसेनाकेअग्निवीर pic.twitter.com/2ZQl8Ak6nn — Indian Air Force (@IAF_MCC) June 24, 2022 -
దేశీయంగా 100 యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా దాదాపు 100 అత్యాధునిక యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసే దిశగా వాయుసేన భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలతో చర్చిస్తోంది. ఈ ప్రాజెక్టులో 70 శాతం భారత కరెన్సీనే వాడేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల మేకిన్ ఇండియా ప్రాజెక్టు మరింత బలోపేతం కానుందన్నాయి. ‘‘భారత్‌లో 96 యుద్ధ విమానాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 36 విమానాల తయారీకి మన కరెన్సీతో పాటు విదేశీ మారక ద్రవ్యమూ చెల్లిస్తాం. 60 విమానాల చెల్లింపులకు పూర్తిగా భారత్ కరెన్సీనే వాడతాం’’ అన్నాయి. -
మరో రికార్డు సృష్టించిన భారత వైమానిక దళం.. చైనాను వెనక్కి నెట్టి..
ప్రపంచంలో ఎక్కడైనా, ఏ యుద్ధమైనా ఇప్పుడు వైమానిక దళాలే కీలకం. వేగంగా, సులువుగా చొచ్చుకుపోయి శత్రువును తుద ముట్టించడం ఎయిర్‌ఫోర్స్‌కే సాధ్యం. మరి ఈ విషయంలో భారత వైమానిక దళం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్‌ఫోర్స్‌లలో.. దేశాల వారీగా చూస్తే మూడో స్థానంలో, వైమానిక దళాల వారీగా చూస్తే ఆరో స్థానంలో నిలిచింది. మొత్తంగా చైనా కన్నా మన ఎయిర్ ‘ఫోర్స్’ పైన ఉండటం గమనార్హం. ‘వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ (డబ్ల్యూడీఎంఎంఏ)’ సంస్థ క్షుణ్నంగా అధ్యయనం చేసి ఈ ర్యాంకులను ఇచ్చింది. ఈ వివరాలు ఏమిటో చూద్దామా.. అన్ని అంశాలనూ పరిశీలించి.. ప్రతిదేశానికి నేరుగా ఎయిర్‌ఫోర్స్‌తోపాటు పదాతిదళం (ఆర్మీ), నావికా (నేవీ) దళాలకు కూడా అనుబంధంగా ప్రత్యేకంగా వైమానిక దళ విభాగాలు ఉంటాయి. ‘డబ్ల్యూడీఎంఎంఏ’ ఇలాంటి వాటన్నింటినీ కూడా ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసింది. కేవలం యుద్ధ, రవాణా విమానాలు, హెలికాప్టర్ల సంఖ్యను మాత్రమేగాకుండా.. విమానాలు, సాంకేతికతల ఆధునీకరణ, రవాణా సౌకర్యం, తక్షణ యుద్ధ సన్నద్ధత, వేగంగా దాడులు చేయడంతోపాటు స్వీయ రక్షణ చర్యలు, భవిష్యత్తులో రానున్న కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు, స్థానికంగా వైమానిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలన్నింటినీ పరిశీలించింది. వీటి ఆధారంగా 98 దేశాలకు చెందిన 124 వైమానిక/అనుబంధ దళాలకు.. ‘ట్రూవ్యాల్యూ రేటింగ్ (టీవీఆర్)’లను ఇచ్చింది. క్వాంటిటీ (సంఖ్య)తోపాటు క్వాలిటీ రెండింటి లోనూ అమెరికా దళాలు ప్రపంచంలోనే టాప్‌లో నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో యూఎస్ ఎయిర్‌ఫోర్స్ (టీవీఆర్ 242.9), యూఎస్ నేవీ (142.4) నిలవగా.. రష్యన్ ఎయిర్‌ఫోర్స్ (114.2) మూడో స్థానం సాధించింది. తిరిగి నాలుగు, ఐదో స్థానాల్లో యూఎస్ ఆర్మీ ఏవియేషన్ (112.6), యూఎస్ మెరైన్ కార్ప్స్ (85.3) నిలిచాయి. ఆరో స్థానంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (69.4) నిలిచింది. ► ఇదే దేశాల వారీగా చూస్తే మన ఎయిర్‌ఫోర్స్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ►మన కన్నా ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ (63.8) ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే చైనా పీఎల్ఏ నేవీ ఎయిర్‌ఫోర్స్ (49.3) 15వ స్థానంలో నిలిచింది. ►మన ఇండియన్ నేవీ ఏవియేషన్ (41.2 స్కోర్) 28వ స్థానంలో, ఆర్మీ ఏవియేషన్ (30 స్కోర్) 36వ స్థానంలో ఉండిపోయాయి. చదవండి: చరిత్ర సృష్టించిన మాలావత్ పూర్ణ.. మౌంట్ డెనాలి ఎక్కి ప్రపంచ రికార్డు రాశి కాదు.. వాసి ముఖ్యం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు.. శత్రువులపై పైచేయి చూపించుకోవడం కోసం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర సాంకేతికలను విచ్చలవిడిగా పోగేసి పెట్టుకుంటున్నాయి. కానీ ఏళ్లు గడుస్తున్నా వాటి ఆధునీకరణ, ఆధునిక సాంకేతికతలను సమకూర్చుకోవడం, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం వంటివి చేపట్టడం లేదు. అందుకే ‘అసలు’ సామర్థ్యంలో వెనుకబడిపోయినట్టు డబ్ల్యూడీఎంఎంఏ స్పష్టం చేసింది. ► యుద్ధ విమానాల సంఖ్య ఇండియాలో కంటే చైనాలో 30 శాతం ఎక్కువ. అయినా ర్యాంకింగ్స్‌లో చైనా ఎయిర్‌ఫోర్స్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెనుక నిలిచింది. ►దక్షిణ కొరియా ఎయిర్‌ఫోర్స్‌కు 890 విమానాలున్నా.. బ్రిటిష్ (475 విమానాలు–11వ ర్యాంకు), ఇజ్రాయెల్ (581 విమానాలు–9వ ర్యాంకు), ఫ్రాన్స్ (658 విమానాలు– 10వ ర్యాంకు), జపాన్ (779 విమానాలు–8వ ర్యాంకు)లకన్నా వెనుకబడి 12వ స్థానంలో నిలిచింది. ►ఇలాగే ఈజిప్ట్ ఎయిర్‌ఫోర్స్ (1,066 విమానాలు– 22వ ర్యాంకు), ఉత్తర కొరియా ఎయిర్‌ఫోర్స్ (951 విమానాలు–45వ ర్యాంకు) బాగా వెనుకబడి ఉన్నాయి. సంఖ్యాపరంగాదేశాల ర్యాంకులివీ.. దేశం యుద్ధవిమానాలు/ హెలికాప్టర్ల సంఖ్య అమెరికా 13,247 రష్యా 4,173 చైనా 3,285 ఇండియా 2,186 దక్షిణ కొరియా 1,595 జపాన్ 1,449 పాకిస్తాన్ 1,386 ఈజిప్ట్ 1,062 టర్కీ 1,057 ఫ్రాన్స్ 1,055 (ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీ మూడింటిలో యుద్ధ విమానాలు, రవాణా, సహాయక, శిక్షణ విమానాలు, హెలికాప్టర్లు కలిపి) -
డైరెక్ట్ హిట్ : భారత వాయుసేన సంతోషం
న్యూఢిల్లీ: రష్యా సహకారంతో భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అన్ని వెర్షన్లు ఆశించిన రీతిలో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు.. భారత వాయుసేన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ మిస్సైల్ ను పరీక్షించింది. బంగాళాఖాతం సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి కచ్చితత్వంతో తాకిందని భారత వాయుసేన వెల్లడించింది. ‘‘డైరెక్ట్ హిట్’’.. అంటూ సంతోషం వ్యక్తం చేసింది. తాజా పరీక్షలో ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణి రేంజిని మరింత వృద్ధి చేశారు. రేంజ్ పొడిగించిన తర్వాత బ్రహ్మోస్ ను పరీక్షించడం ఇదే తొలిసారి. గతంలో బ్రహ్మోస్ క్షిపణి రేంజి 290 కిలోమీటర్లు కాగా, దాన్ని 350 కిమీకి పెంచారు. తాజా ప్రయోగం ద్వారా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భూతల, సముద్రతల లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలిగే సామర్ధ్యాన్ని భారత వాయుసేన సముపార్జించుకున్నట్లయ్యింది. కిందటి నెలలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ నావికాదళ వెర్షన్ ను విజయవంతంగా పరీక్షించడం తెలిసిందే. The Extended Range version of Brahmos air launched missile was successfully fired from a Su-30 MkI aircraft today. The successful firing was the first ever for the air launched version from a Su-30 MkI & the missile met all the laid down parameters while hitting the target. pic.twitter.com/WZk8zZkWKX — Indian Air Force (@IAF_MCC) May 12, 2022 -
నా కమీషన్ ఇప్పించండి
లండన్: భారత్‌లో మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధాల కొనుగోలు మధ్యవర్తి సంజయ్ భండారీ పదేళ్ల క్రితం నాటి తన కమీషన్ సొమ్ము ఇప్పించండంటూ బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. భారత వాయుసేనకు చెందిన మిరాజ్–2000 రకం యుద్ధవిమానాల నవీకరణ కాంట్రాక్ట్.. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆయుధాల సంస్థ ‘థేల్స్ గ్రూప్’కు దక్కేలా మధ్యవర్తిగా వ్యవహరించానని ఆయన కోర్టులో పేర్కొన్నారు. 2008 నుంచీ థేల్స్ కోసం పనిచేస్తున్నానని, అధునాతన మిరాజ్ విమానాలను భారత్‌కు విక్రయించేలా మధ్యవర్తిత్వంలో భాగంగా నాటి భారత రక్షణ శాఖ ఉన్నతాధికారితో భేటీని ఏర్పాటుచేశానని పిటిషన్లో ప్రస్తావించారు. భారత్ ప్రతిష్టాత్మంగా కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను తయారుచేసే దసాల్ట్ ఏవియేషన్‌కు థేల్స్ సంస్థే కీలకమైన ‘ఏవియోనిక్స్’ ఉపకరణాలను సరఫరా చేస్తుండటం గమనార్హం. 2.4 బిలియర్ యూరోల(దాదాపు రూ.20వేల కోట్ల) విలువైన మిరాజ్ కాంట్రాక్ట్‌లో మధ్యవర్తిగా వ్యవహరించినందుకు మొత్తంగా 2 కోట్ల యూరోలు(దాదాపు రూ.167 కోట్లు) ఇస్తానని థేల్స్ సంస్థ హామీ ఇచ్చిందని, కానీ కేవలం 90 లక్షల యూరోలే(దాదాపు రూ.75 కోట్లు) ఇచ్చి చేతులు దులిపేసుకుందని ఆయన వెల్లడించారు. సంస్థ నుంచి మిగతా కమిషన్ ఇప్పించాలని ఆయన పారిస్ సమీపంలోని నాంటయర్లోని ‘ట్రిబ్యునల్ డీ కామర్స్’ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని బ్రిటన్‌కు చెందిన ‘ది డైలీ టెలిగ్రాఫ్’ వార్తా సంస్థ ఇటీవల ఒక కథనం ప్రచురించింది. భారత వాయుసేనకు రఫేల్–బి, రఫేల్–సి రకం యుద్ధవిమానాల సరఫరాకు సంబంధించిన చర్చల్లో ఫ్రాన్స్ కన్షార్షియంలో థేల్స్ ఉంది. యూపీఏ హయాంలో యుద్ధవిమానాల ఆధునికీకరణ ఒప్పందం వేళ భండారీకి, కాంగ్రెస్‌కు సత్సంబంధాలు కొనసాగాయని బీజేపీ ఆరోపించింది. రక్షణ కొనుగోళ్లు జరిగిన ప్రతీసారి ముడుపులపై కాంగ్రెస్ దృష్టిపెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వ్యాఖ్యానించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, భండారీ మంచి మిత్రులని ఆరోపించారు. -
ఫైటర్ పైలట్..బ్రైట్ అండ్ ఫైట్
‘అపజయాలు ఎదురైతే అధైర్యం వద్దు. వెనక్కి తగ్గవద్దు. అపజయం అంటే ఏమిటో కాదు... నేర్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నం’ ఆకాశంలో బొయ్య్మని విమానం చేసే శబ్దాలు వినడమన్నా, చిన్ని విమానాన్ని కళ్లు పెద్దవి చేసి చూడడమన్నా అందరు పిల్లల్లాగే రోషిణికీ ఇష్టం. ఆ ఇష్టం ఆమెను వైమానిక చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేలా చేసింది. ఠాణె (మహారాష్ట్ర)లోని లోక్ పురం పబ్లిక్ స్కూల్లో చదివే రోజుల్లో రోషిణికి వచ్చే సందేహాలు...ఆమె విజ్ఞాన దాహానికి నిదర్శనాలుగా ఉండేవి. మాజీ రాష్ట్రపతి, ఏరోస్పేస్ సైంటిస్ట్ అబ్దుల్ కలామ్ అంటే రోషిణికి ఎంతో అభిమానం. తాను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయడానికి, ఫైటర్ పైలట్ కావడానికి ఆయనే స్ఫూర్తి. మంచి మాటలు మంచి కలలను ఇస్తాయి. కలామ్ ఏం అన్నారు? ‘అపజయాలు ఎదురైతే అధైర్యం వద్దు. వెనక్కి తగ్గవద్దు. అపజయం అంటే ఏమిటో కాదు... నేర్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నం’ ... ఇదిమాత్రమే కాదు, ‘ప్రతి గురువు ఒకప్పుడు విద్యార్థే. ప్రతి విజేత ఒకప్పుడు పరాజితుడే. ప్రతి నిపుణుడు ఒకప్పుడు తొలి అడుగులు వేసిన వాడే. అందరూ నేర్చుకోవడం అనే వంతెనను దాటి వచ్చినవారే’ ఇలాంటి మాటలు రోషిణి ఆశయ బలానికి అవసరమైన ఉత్సాహాన్ని ఇచ్చాయి. ‘చిన్నప్పటి నుంచి తన ఆలోచనలకు విలువ ఇస్తూ వచ్చాం. ఫైటర్ పైలట్ కావాలనేది తన లక్ష్యమని చెప్పినప్పుడు ఆశీర్వదించాం. మా అమ్మాయి ఫైటర్ పైలట్ అని గర్వంగా చెప్పుకోవడంతో పాటు, పిల్లల కలలను నిరక్ష్యం చేయకండి. వారి కలలకు బలాన్ని ఇవ్వండి...అని తల్లిదండ్రులకు చెప్పే సందర్భాన్ని ఇచ్చాయి’ అంటున్నాడు రోషిణి తండ్రి రవి అయ్యర్. చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన అయ్యర్ ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటి) ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి వచ్చింది. ‘ఫైటర్ పైలట్ అంటే నా దృష్టిలో ఉద్యోగం కాదు. బృహత్తరమైన బాధ్యత. జాతికి సేవ చేసుకునే అదృష్టం’ అంటుంది రోషిణి. స్కూల్లో చదివే రోజుల్లో రోషిణి జాతీయస్థాయిలో ఆటలు ఆడింది. రీడింగ్, ట్రెక్కింగ్, పెయింటింగ్ అంటే రోషిణికి బాగా ఇష్టం. మూడు అభిరుచులను ముచ్చటగా సమన్వయం చేసుకోవడం కూడా ఆమెకు తెలుసు. చదువు ఊహలను ఇస్తుంది. ఆ ఊహాలు అందమైన పెయింటింగ్స్‌గా మారతాయి. ఆ చిత్రాల భావుకత తనను ప్రకృతి ప్రపంచంలోకి తీసుకెళ్లి ట్రెక్కింగ్ చేయిస్తుంది. ‘సిటీ ఆఫ్ లేక్స్’గా చెప్పుకునే ఠాణెలోని ఈడెన్వుడ్ కాంప్లెక్స్‌లో రోషిణి బాల్యం గడిచింది. ఇప్పుడు కాంప్లెక్స్ వాసులతో సహా ఎంతోమందికి రోల్‌మోడల్‌గా మారింది రోషిణి. ఫైటర్ పైలట్‌గా ఆమె మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
ఇక పాకిస్తాన్, చైనాకు చుక్కలే.. పంజాబ్‌లో ఎస్-400 మోహరింపు!
భారత వాయుసేన అమ్ముల పొదిలోకి రష్యాకు చెందిన అత్యాధునిక ఎస్-400 మిస్సైల్స్ వచ్చిచేరిన సంగతి తెలిసిందే. భారత్, రష్యా మధ్య గతంలో జరిగిన ఒప్పందం మేరకు వీటిని రష్యా భారత్‌కి పంపించింది. ఇప్పుడు భారత వైమానిక దళం ఎస్-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను తాజాగా పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్ బోర్డర్ వెంట మోహరించింది. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యాదునిక ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. డ్రోన్స్ నుంచి బాలిస్టిస్ మిస్సైల్స్ వరకు దేన్నైనా ఎదుర్కొనగల సామర్ధ్యం దీని సొంతం. ఎస్-400 ట్రైంఫ్ మిస్సైల్ సిస్టమ్‌లో మొదటిదాన్ని భారత్ ఇక్కడ మోహరించింది. పాకిస్తాన్, చైనా దేశాల నుంచి ఎదురయ్యే గగనతల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ గగనతలం శత్రుదుర్భేద్యంగా మార్చడంలో ఈ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత తూర్పు సరిహద్దులో భారత వాయుసేన ఈ ఎస్-400 ట్రైంఫ్ మిస్సైల్ మోహరించే అవకాశం ఉంది. ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయాణించే మిస్సైల్ వ్యవస్థయే ఎస్- 400 మిస్సైల్. దీనిని ఎస్ఏ-21 గ్రోలర్ అని నాటో పిలుస్తుంది. ఇది అత్యంత సమర్థవంతంగైన మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థ అని దీన్ని ఎయిర్‌క్రాఫ్ట్, యూఏవీలు, క్రూయిజ్ మిస్సైల్స్తోనూ ఉపయోగించవచ్చు. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకతలు: ఎస్-400 రకాన్ని మాస్కోకు చెందిన ఆల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో రూపొందిచింది. సైన్యం, వాయుసేన, నౌకాదళానికి చెందిన ప్రస్తుత, భవిష్యత్ ఎయిర్ డిపెన్స్ యూనిట్స్‌తో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలో S-300 రకంతో సహ ఇతర శత్రు విమానాలు, బాలిస్టిక్ క్షిపణుల లక్ష్యాలను ఛేదించేందుకు ఎస్-400 నాలుగు రకాల మిస్సైల్స్ ఉపయోగిస్తుంది. స్వల్ప-శ్రేణి (40 కి.మీ), మధ్యశ్రేణి (120 కి.మీ), 250 కి.మీ, 400 కి.మీ దూరంలో గల లక్ష్యాలను ఛేదించేందుకు ఇందులో నాలుగు వేర్వేరు మిస్సైల్స్ ఉన్నాయి. ఎస్-400 సంక్లిష్టమైన సైనిక సాంకేతికపరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఎగిరే వస్తువులను ట్రాక్ చేసి, కమాండ్ వాహనాన్ని అప్రమత్తం చేసే దీర్ఘ-శ్రేణి నిఘా రాడార్ ఇందులో ఉంది. S-400 రకం మిస్సైల్స్ పరీక్షలో 2000 ప్రారంభంలో మొదలైంది. 2007 నుంచి ఈ ఆయుధాలు ఉపయోగంలోకి వచ్చాయి. మాస్కో రక్షణ సహ వివిధ ప్రదేశాల్లో S-400లను రష్యా మొహరించింది. 2015లో S-400ను సిరియాలోనూ రష్యా మొహరించింది. అంతే కాదు క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని యూనిట్లను అక్కడ కూడా ఉంచింది. చైనా వైమానిక బెదిరింపులను ఎదుర్కోవటానికి భారతదేశం అవసరమైన ఐదు దీర్ఘ-శ్రేణి ఉపరితల-నుంచి-గాలి క్షిపణి వ్యవస్థలను సేకరించడానికి 2018లో 5.5 బిలియన్ డాలర్లతో రష్యాతో ఒక ఒప్పందం చేసుకుంది. (చదవండి: Oil Price: సామాన్యులకు ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు!) -
బాలాకోట్ హీరో అభినందన్‌కు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చిన భారత వాయుసేన పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ‘గ్రూప్ కెప్టెన్’ ర్యాంక్ దక్కనుంది. సంబంధిత ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యాక ఆయనకు ఆ ర్యాంక్ ఇవ్వాలని భారత వాయుసేన నిర్ణయించిందని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదుల శిక్షణ శిబిరంపై భారత వాయుసేన విమానాలు మెరుపుదాడి చేసిన సంగతి తెల్సిందే. ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 2019 ఫిబ్రవరి 27న భారత దాడి తర్వాతి రోజునే పాకిస్తాన్ తన వాయుసేన దళాలను ప్రతిదాడి కోసం భారత్ వైపునకు పంపింది. వీటిని తిప్పికొట్టేందుకు భారత వాయుసేన బలగాలు గగనతలంలో ముందుకు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తాను నడుపుతున్న మిగ్–21 బైసాన్ వాయుసేన యుద్ధవిమానంతో పాక్ ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. చదవండి: (చిన్న రాష్ట్రంలో పెద్ద పోరు.. గోవా.. ఎవరిది హవా?) -
అనుక్షణం అప్రమత్తం
హిండన్ (యూపీ): సరిహద్దుల్లో అనుక్షణం త్రివిధ బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయని భారత వాయుసేన చీఫ్ వి.ఆర్. చౌధరి చెప్పారు. గత ఏడాది తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో డ్రాగన్ కుయుక్తుల్ని తిప్పికొట్టడమే దీనికి సాక్షీభూతంగా నిలుస్తుందని అన్నారు. శుక్రవారం 89వ భారత వాయుసేన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్ వద్ద విఆర్ చౌధరి మాట్లాడుతూ వైమానిక దళంలో బలగాలకు మరింత శిక్షణ అవసరమని అన్నారు. యువ అధికారులు మరింత రాటు దేలేలా శిక్షణ ఇవ్వడానికి అనుభవం కలిగిన అధికారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన దేశ భూభాగంలోకి విదేశీ శక్తులు రాకుండా ఉండేలా మన శక్తిని చూపించాలని ఆయన వ్యాఖ్యానించారు. మన దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని, స్పష్టమైన లక్ష్యాలతో సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానిని ప్రతిజ్ఞ చేస్తున్నానని పేర్కొన్నారు. అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సి ఉందన్నారు. యువ ఆఫీసర్లకు ఆయా టెక్నాలజీలను వాడేలా శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. వాయుసేనలోని బృంద సభ్యులంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 75 యుద్ధ విమానాలతో ఎయిర్‌షో నిర్వహించారు. వైమానిక దళం ఆధునీకరణలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా చెప్పారు. సరిహద్దులో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి, క్షణాల్లో నిర్ణయాలు తీసుకునేలా బలగాలను తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ జనరల్ ఎంఎం నరవాణె హాజరయ్యారు. భారత వాయుసేన దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఏఎఫ్ బృందాలకు శుభాకాంక్షలు చెప్పారు. -
మేరా భారత్ మహాన్: భగవద్గీత స్ఫూర్తి.. ఆకాశాన్ని అంటిన కీర్తి
Indian Air Force Day 2021:దేశ రక్షణలో సైన్యం పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మూడు విభాగాలతో రక్షణ, నిఘాతో సరిహద్దుల్లోనే కాదు.. అవసరం పడితే దేశం లోపల కూడా తమ సేవల్ని అందిస్తుంటాయి. అక్టోబర్ 8న అంటే ఇవాళ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే. ఈ సందర్భంగా భారత వాయు సేన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం. ►యునైటెడ్ కింగ్డమ్కి చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ ప్రోత్సాహంతో పుట్టుకొచ్చింది ఈ విభాగం. ►ప్రతీ ఏడాది ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ ‘హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్’లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఉత్సవాలను నిర్వహిస్తారు. ►ఐఏఎఫ్ చీఫ్, సీనియర్ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ►ఎయిర్‌క్రాఫ్ట్‌ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ వేడుకలకు. ►భారత వాయు సేన.. అక్టోబర్ 8, 1932న అధికారికంగా బ్రిటిష్ పాలనలో మొదలైంది. ►ఏప్రిల్ 1, 1933 నుంచి నుంచి సేవలు(కేవలం శిక్షణ కోసం) మొదలుపెట్టినప్పటికీ.. పూర్తిస్థాయిలో రెండో ప్రపంచ యుద్ధంలోనే రంగంలోకి దిగింది. ►ఆ టైంలో ఈ విభాగం పేరు.. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ►ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF).. దేశం తరపున ఆకాశ మార్గానా గస్తీ కాచే, శత్రువులతో పోరాడే కీలక సైన్య విభాగం. ►పాక్, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ ఐఏఎఫ్ సేవలు మరువలేనివి. ►గత 89 ఏళ్లుగా.. ముఖ్యంగా స్వాతంత్ర్యం అనంతరం.. వాయు సేన క్రమక్రమంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌ను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యాల తర్వాత అతిపెద్ద వాయుసేనను కలిగి ఉన్న వ్యవస్థగా భారత్ నిలిచింది. ►ఐఎఎఫ్ నినాదం ‘నభమ్ స్పర్శమ్ దీప్తమ్’(ఇంగ్లీష్‌లో టచ్ ది స్కై విత్ గ్లోరీ) అంటే.. ఆకాశాన్ని అంటే కీర్తి అని అర్థం. భగవద్గీతలోని పదకొండవ అధ్యయం నుంచి ఈ వాక్యాన్ని భారత వాయు సేన స్ఫూర్తిగా తీసుకోవడం విశేషం. ►భారత వాయు సేనలో ప్రస్తుతం సుమారు 1,400 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, లక్షా డెబ్భై వేల మంది సిబ్బంది ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ►యూపీ హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్.. ఆసియాలో అతిపెద్ద, ప్రపంచంలో 8వ పెద్ద ఎయిర్ బేస్. అందుకే ఇక్కడ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ►ఆపరేషన్ పుమాలై, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్.. ఇలా ఎన్నో ఆపరేషన్లలో ఐఎఎఫ్ సేవలు మరువలేనిది. ►యుద్ధ సమయంలోనే కాదు.. జాతి ప్రయోజనాల కోసం సైతం పని చేస్తుంది భారత వాయు సేన. గుజరాత్ తుపాన్(1998), సునామీ(2004), ఉత్తరాది వరదల సమయంలో సేవలు అందించింది కూడా. ముఖ్యంగా ఉత్తరాఖండ్ వరదల సమయంలో ‘రాహత్’ ఆపరేషన్ ద్వారా 20 వేల మంది ప్రాణాలు కాపాడగలిగింది ఐఎఎఫ్. ►ఐక్యరాజ్య సమితి శాంతి చర్యల్లోనూ ఐఎఎఫ్ పాల్గొంటోంది. ►వాయు సేనలో మహిళలకు ఉన్నత ప్రాధాన్యం ఉంటోంది. నేవిగేటర్ల దగ్గరి నుంచి పైలట్లు, ఉన్నత స్థాయి పదవుల్లో కొనసాగుతున్నారు. - సాక్షి, వెబ్ స్పెషల్ -
Viral Photos: ట్రైలరే ఇలా ఉంటే.. సిన్మా ఎలా ఉంటుందో?
ఘజియాబాద్: ఎయిర్ ఫోర్స్-డేను పురస్కరించుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అక్టోబర్ 8( శుక్రవారం)న 89వ వార్షికోత్సవాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఎయిర్ క్రాఫ్టులతో ఐఏఎఫ్ ఎయిర్ షో ప్రదర్శించనుంది. అందులో భాగంగా ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శన రిహార్సల్స్ చేస్తోంది. తాజాగా ఎయిర్ షోకు సంబంధించిన రిహార్సల్స్ ఫోటోలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు అత్యాధునిక ఎయిర్ క్రాఫ్టులను ఈ వేడుకల్లో ప్రదర్శిస్తామని ఐఏఎఫ్ పేర్కొంది.శుక్రవారం ఉదయం 8గంటలకు ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్టు ప్రదర్శనతో ఎయిర్ షో మొదలుకానుందని తెలిపారు. తర్వాత హెరిటేజ్ ఎయిర్ క్రాఫ్టు, మోడరన్ ట్రాన్‌పోర్టు, ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శన ఉంటుందని ఐఏఎఫ్ అధికారులు పేర్కొన్నారు. హిందన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ ప్రదర్శనలు జరుగుతాయిని తెలిపారు. అదే విధంగా ఢిల్లీ, ఘజియాబాద్ ప్రాంతంలోని ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని ఐఏఎఫ్ అధికారులు విజ్ఞప్తి చేశారు. చెత్త బయట వేయటం వల్ల పక్షలు తిరుగుతాయిని దాని వల్ల తక్కువ ఎత్తులో జరిగే ఎయిర్ షోకు ఇబ్బందులు కలుగుతాయిని తెలిపారు. -
వాయుసేనాధిపతిగా వీఆర్ చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వైస్ చీఫ్‌గా ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నం ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా నుంచి బాధ్యతలు చేపట్టారు. దీంతో వీఆర్ చౌదరి దేశ 27 వ ఎయిర్ స్టాఫ్ చీఫ్ అయ్యారు. వీఆర్ చౌదరి పూర్తి పేరు వివేక్ రామ్ చౌదరి. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పూర్వ విద్యార్థి. అంతేగాక డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కాగా ఈ ఏడాది జూలై 1న, వైమానిక దళంలో రెండవ అతి ముఖ్యమైన స్థానం అయిన వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా ఎయిర్ మార్షల్ హర్జిత్ సింగ్ అరోరా స్థానంలో చౌదరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన విధులను బాధ్యతతో నిర్వహిస్తానని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ భద్రతను, సార్వభౌ మత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆయుధాలకు కొత్త ఆయుధాలను జత చేయడం, కొత్త వేదికలను ఉపయోగించుకోవడం తన ప్రాధామ్యమని తెలిపారు. అయితే గురువారం వాయుసేన అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన చౌదరి మూడేళ్ల పాటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ పదవిలో ఉండనున్నారు. (చదవండి: లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..) వాయుసేనలో బాధ్యతలు 1982 డిసెంబర్లో వివేక్ రామ్ చౌదరి ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్ట్రీమ్‌లో ఫైటర్ పైలట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత మిగ్ –21, మిగ్ –23 ఎమ్ఎఫ్, మిగ్–29, సు–30 ఎమ్కేఐ వంటి యుద్ధ విమానాలను నడిపారు. 3,800 గంటలకు పైగా యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. ప్రస్తుతం వాయుసేన చీఫ్ అయ్యేముందు ఎయిర్‌ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా, తూర్పు కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేశారు. జూలైలో ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ కావడానికి ముందు, పాకిస్తాన్, చైనాతో సరిహద్దులలోని కొన్ని ప్రాంతాల భద్రతకు బాధ్యత వహించే వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు కమాండర్–ఇన్–చీఫ్‌గా పనిచేశారు. తూర్పులద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న సమయంలోనే వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ వివేక్ చౌదరిని నియమించారు. అంతేగాక గతంలో ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ సఫేద్ సాగర్ వంటి ఎయిర్ ఫోర్స్ చేపట్టిన కొన్ని ముఖ్యమైన మిషన్లలో చౌదరి భాగస్వాములయ్యారు. గతంలో ఫ్రంట్‌లైన్ ఫైటర్ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ డిప్యూటీ కమాండెంట్‌గా, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహించారు. (చదవండి: వరుస సంక్షోభాలు.. చైనాకు భారీ దెబ్బే: గోల్డ్‌మన్ సాక్స్) -
రహదారులే రన్వేలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లాలో జాతీయ రహదారి–925ఏపై సిద్ధం చేసిన సట్టా–గాంధవ్ స్ట్రెచ్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి రహదారి ఇదే. యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి వీలుగా కొన్ని జాతీయ రహదారుల్లో మార్పులు చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. సట్టా–గాంధవ్ స్ట్రెచ్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 19 నెలల్లో అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నా«థ్‌సింగ్, గజేంద్రసింగ్ షెకావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్ఎస్ బదౌరియాలతో కూడిన సి–130జే యుద్ధ విమానం ఈ స్ట్రెచ్‌పై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. వాయుసేన ఈ డ్రిల్‌ను చేపట్టింది. అనంతరం సుఖోయ్–30ఎంకేఐ ఫైటర్ జెట్, ఏఎన్–32 మిలటరీ రవాణా విమానం, ఎంఐ–17వీ5 హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు మార్గాల్లో.. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఈ తరహా స్ట్రెచ్ నిర్మించడం ద్వారా దేశ ఐక్యత, వైవిధ్యం, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఎంత ఖర్చయినా వెనకాడం అనే సందేశాన్ని ఇచ్చినట్లు అయ్యిందని రక్షణ మంత్రి రాజ్నా«థ్ అన్నారు. ఎన్నో హెలిప్యాడ్ల నిర్మాణంలో జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. రోడ్లపై అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం యుద్ధ సమయాల్లోనే కాకుండా విపత్తుల సమయంలోనూ ఉపకరిస్తుందని తెలిపారు. రక్షణపరమైన మౌలిక సదుపాయాల బలోపేతంలో ఇదొక ముఖ్యమైన అడుగు అని అభివర్ణించారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... సైన్యానికి జాతీయ రహదారులు సైతం ఉపకరించడం దేశాన్ని మరింత సురక్షితం చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు–ఒంగోలు, ఒంగోలు–చిలకలూరిపేట మార్గాలను ఈ దిశగా అభివృద్ధి చేయనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో కొరిశపాడు ఫ్లైఓవర్ నుంచి రేణంగివరం ఫ్లైఓవర్ వరకు రన్‌వే నిర్మాణంలో ఉంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సట్టా–గాంధవ్ మార్గంతోపాటు గగారియా–బఖాసర్ మార్గాన్ని రూ.765.52 కోట్లతో అభివృద్ధి చేశారు. అత్యవసర సమయాల్లోనే విమానాల ల్యాండింగ్ కోసం ఉపయోగిస్తారు. దీంతోపాటు కుందన్‌పురా, సింఘానియా, బఖాసర్‌లో మూడు హెలిప్యాడ్లను నిర్మించారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్లు, రవాణా విమానాలను ప్రయోగాత్మకంగా లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ మార్గంపై అత్యవసర ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయ జంక్షన్ వద్ద సిద్ధమవుతున్న రన్‌వే -
రాజస్థాన్‌లో కుప్పకూలిన సైనిక విమానం
జైపూర్: భారత వాయుసేన (ఎయిర్ ఫోర్స్-ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 బైసన్ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలింది. అయితే అందులో పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్‌లోని బర్మార్‌లో బుధవారం సాయంత్రం ఆకాశానికి ఎగిరిన విమానం 5.30 గంటల సమయంలో కూలిందని భారత వాయుసేన (ఐఏఎఫ్) ప్రకటించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. (చదవండి: ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేశారని విషం తాగిన టీచర్లు) కాగా మిగ్ విమానాలు కూలడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మే 21వ తేదీన శిక్షణ విమానం పంజాబ్‌లోని మోగా జిల్లాలో కూలింది. ఆ ఘటనలో స్కా్వడ్రన్ లీడర్ అభినవచౌదరి మృతి చెందారు. ఇదే సంవత్సరం మార్చిలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మిగ్-21 బైసన్ జెట్ విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోగా ఒకరు మరణించారు. జనవరిలో రాజస్థాన్‌లోని సూరత్గడ్లో మిగ్-21 బైసన్ విమానం టేకాఫ్ అయ్యి శ్రీగంగానగర్ జిల్లాలో కూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా జరిగిన ఘటన నాలుగోది. మిగ్-21 విమానాలు ప్రమాదానికి గురవడంపై వాయుసేన దర్యాప్తు చేస్తోంది. చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్ At around 1730 hrs today, an IAF MiG-21 Bison aircraft airborne for a training sortie in the western sector, experienced a technical malfunction after take off. The pilot ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause. — Indian Air Force (@IAF_MCC) August 25, 2021 -
మరో 392 మంది తరలింపు
న్యూఢిల్లీ: తాలిబన్ ముష్కర మూకల కబంధ హస్తాల్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ నుంచి తమ పౌరులు, భాగస్వాముల తరలింపును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆదివారం మూడు వేర్వేరు విమానాల్లో 392 మందిని వెనక్కి తీసుకొచ్చింది. వీరిలో ఇద్దరు అఫ్గానిస్తాన్ చట్టసభ సభ్యులు సైతం ఉండడం విశేషం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు(ఐఏఎఫ్) చెందిన సి–17 సైనిక రవాణా విమానంలో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు తరలించిన మొదటి బృందంలో 168 మంది ఉన్నారు. వీరిలో 107 మంది భారతీయులు కాగా, 23 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు. 87 మందిని శనివారం కాబూల్ నుంచి తజికిస్తాన్ రాజధాని దుషాన్‌బెకు చేర్చగా, వారిని ఆదివారం ఏఐ 1956 ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారత్‌కు తరలించారు. వీరిలో ఇద్దరు నేపాల్ జాతీయులు ఉన్నారు. ఇక మరో 135 మందికిపైగా భారతీయులను కొద్ది రోజుల క్రితం అమెరికా, నాటో విమానాల్లో ఖతార్ రాజధాని దోహాకు తరలించారు. వారందరినీ ఇప్పుడు ప్రత్యేక విమానంలో దోహా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. కాబూల్ నుంచి తరలించిన వారిలో ఇద్దరు అఫ్గాన్ చట్టసభ సభ్యులు అనార్కలీ హోనర్యార్, నరేంద్రసింగ్ ఖల్సా, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కష్టకాలంలో అండగా నిలుస్తున్న భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటిదాకా 590 మంది.. భారత ప్రభుత్వం అఫ్గాన్ నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియను ఆగస్టు 16న ప్రారంభించింది. ఇప్పటిదాకా దాదాపు 590 మందిని వెనక్కి తీసుకొచ్చింది. అమెరికాతోపాటు ఇతర మిత్రదేశాల సహకారం, సమన్వయంతో భారత్ ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తోంది. సోమవారం కూడా మరో బృందం భారత్‌కు చేరుకోనున్నట్లు తెలిసింది. ఇండియా వీసాలున్న అఫ్గాన్ పౌరులు కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోకుండా తాలిబన్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరోధిస్తున్నారు. -
వాయుసేనకు అందుబాటులో అధునాతన చాఫ్ టెక్నాలజీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు శత్రు రాడార్ పరిధి నుంచి రక్షించుకొనేందుకు చాఫ్ టెక్నాలజీని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. జోధ్‌పూర్‌లోని డీఆర్డీఓ డిఫెన్స్ ల్యాబొరేటరీ, పుణేలోని డీఆర్డీఓ ప్రయోగశాలలు సంయుక్తంగా ఐఏఎఫ్ అవసరాలకు అనుగుణంగా ‘అధునాతన చాఫ్ మెటీరియల్, చాఫ్ క్యాట్రిడ్జ్–118/ఐ’ను అభివృద్ధి చేసింది. శత్రువులు ప్రయోగించే రాడార్ నిర్దేశిత మిస్సైల్స్‌ను ఇది తప్పుదోవ పట్టిస్తుంది. తద్వారా వాయుసేన విమానాలకు ముప్పు తప్పుతుంది. చాఫ్ అనేది యుద్ధ విమానాలను శత్రు రాడార్ నుండి రక్షించడానికి ఉపయోగించే ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత అని రక్షణశాఖ తెలిపింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతల్లో ‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా డీఆర్డీఓ మరొక అడుగు ముందుకేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత వాయుసేనను మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడానికి సహకరించిన రక్షణ శాఖ ఆర్ అండ్ డీ కార్యదర్శి, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి బృందాలను రాజ్‌నాథ్ అభినందించారు. -
ఆ డ్రోన్లు జారవిడిచిన బాంబుల్లో ఆర్డీఎక్స్!
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల సాయంతో ప్రయత్నించిన మరో ఉగ్రకుట్రను భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అదే తరహా ఘటన పునరావృతమవడం సంచలనం రేపింది. ఈసారి సైనిక స్థావరాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. రెండు డ్రోన్లతో దాడికి ప్రయత్నించారు. ఆర్మీ జవాన్లు అప్రమత్తమై ఎదురుదాడికి దిగడంతో డ్రోన్లు తోకముడిచాయి. జమ్మూకశ్మీర్‌లోని రత్నుచక్–కలుచక్ సైనిక స్థావరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్,› సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరో డ్రోన్ సైనిక స్థావరం వైపు దూసుకొచ్చాయని తెలిపారు. వాటిని నేలకూల్చడానికి విధుల్లో ఉన్న సెంట్రీలు దాదాపు రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరపడంతో డ్రోన్లు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్మీ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ వివరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రత్నుచక్–కలుచక్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. డ్రోన్ల కోసం చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో భూభాగంపై అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని అన్నారు. మన సైనిక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. రత్నుచక్–కలుచక్ మిలటరీ స్టేషన్‌పై 2002లో ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో 31 మంది మరణించారు. వీరిలో ముగ్గురు సైనిక సిబ్బందితోపాటు వారికి కుటుంబ సభ్యులు, సాధారణ పౌరులు ఉన్నారు. అలాగే 48 మంది గాయపడ్డారు. ఈ దాడి జరిగినప్పటి నుంచి రత్నుచక్–కలుచక్ సైనిక స్థావరానికి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిషేధిత జైషే మొహమ్మద్(జేఈఎం) ముష్కరులు రెచ్చిపోయారు. ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీవో)తోపాటు ఆయన భార్య, కుమార్తె ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపుర ప్రాంతంలో ఉన్న హరిపరిగామ్‌లో ఆదివారం రాత్రి 11 గంటలకు ఎస్పీవో ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య రజా బేగం, కుమార్తె రఫియా(22) ఇంట్లో ఉండగా, ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. వెంటనే తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఫయాజ్ అహ్మద్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భార్య ఆదివారం రాత్రి, కుమార్తె సోమవారం ఉదయం మృతి చెందారు. ఎస్పీవో కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్న ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కశ్మీర్ రేంజి ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఘాతుకంలో పాలుపంచుకున్న ఇద్దరిలో ఒకడు విదేశీయుడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈ దారుణాన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ధ్వజమెత్తారు. బాధ్యులను వెంటనే పట్టుకొని, కఠిన శిక్ష విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిషేధిత జైషే మొహమ్మద్(జేఈఎం) ముష్కరులు రెచ్చిపోయారు. ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీవో)తోపాటు ఆయన భార్య, కుమార్తె ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపుర ప్రాంతంలో ఉన్న హరిపరిగామ్‌లో ఆదివారం రాత్రి 11 గంటలకు ఎస్పీవో ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య రజా బేగం, కుమార్తె రఫియా(22) ఇంట్లో ఉండగా, ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. వెంటనే తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఫయాజ్ అహ్మద్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భార్య ఆదివారం రాత్రి, కుమార్తె సోమవారం ఉదయం మృతి చెందారు. ఎస్పీవో కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్న ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కశ్మీర్ రేంజి ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఘాతుకంలో పాలుపంచుకున్న ఇద్దరిలో ఒకడు విదేశీయుడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈ దారుణాన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ధ్వజమెత్తారు. బాధ్యులను వెంటనే పట్టుకొని, కఠిన శిక్ష విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. లష్కరే టాప్ కమాండర్ అరెస్ట్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్‌ను సోమవారం భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. భద్రతా సిబ్బందిపై, సాధారణ ప్రజలపై జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో, హత్యల్లో అతడి హస్తం ఉందని అధికారులు చెప్పారు. నదీమ్ అబ్రార్‌ను బలగాలు అదుపులోకి తీసుకోవడం తమకు పెద్ద విజయమని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శ్రీనగర్ శివారులోని పరింపురా చెక్‌పాయింట్ వద్ద నదీమ్‌ను అరెస్ట్ చేశారు. అబ్రార్‌తోపాటు మరో అనుమానితుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఒక పిస్టల్, గ్రనేడ్ స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో లవాయ్పురాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి కేసులో నదీమ్ అబ్రార్ నిందితుడు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ డ్రోన్లు జారవిడిచిన బాంబుల్లో ఆర్డీఎక్స్! జమ్మూ ఎయిర్‌పోర్టు సమీపంలో భారత వాయుసేన(ఐఏఎఫ్) స్థావరంపై దాడికి ఉగ్రవాదులు ఆర్డీఎక్స్తో కూడిన పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముష్కరులు ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్లతో బాంబులను జారవిడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బంది గాయపడ్డారు. ఈ బాంబుల్లో ఆర్డీఎక్స్తోపాటు మిశ్రమ రసాయనాలు ఉన్నట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. దీనిపై పూర్తి నివేదిక అందాల్సి ఉందన్నాయి. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది దర్యాప్తు సంస్థలు నిర్ధారించలేదు. ఎన్ఐఏ ఘటనా స్థలం నుంచి సాక్ష్యాధారాలను సేకరిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులే డ్రోన్లతో దాడికి దిగినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. -
2022 నాటికి వాయుసేనలోకి ‘రఫేల్’
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో 2022 నాటికి 36 రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని భారత వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ బదౌరియా పేర్కొన్నారు. కరోనా కారణంగా ఫ్రాన్స్ నుంచి ఒకట్రెండు విమానాల రాకలో జాప్యం జరిగిందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రఫేల్ వినామాలను వాయుసేనలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. భారత-చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులపై ప్రశ్నించగా.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సమస్య చర్చల దశలో ఉందని పేర్కొన్నారు. వివాదాస్పద ప్రాంతం నుంచి ఇరు దేశాల బలగాల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపులపై నిఘా కొనసాగుతోందని చెప్పారు. పరిస్థితులకు తగ్గట్లు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రక్షణపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ పూర్తి చేసుకుని యువత ఎయిర్‌ఫోర్స్‌లోకి అడుగుపెడుతోందని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్లు ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగంలో 161 మంది ఫ్లైట్ క్యాడెట్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) నిర్వహించారు. ఆరుగురు నావికా దళ అధికారులు, ఐదుగురు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకోవడంతో వారికి ‘వింగ్స్’ప్రదానం చేశారు. ఫ్లయింగ్ ఆఫీసర్ ప్రజ్వాల్ అనిల్ కులకర్ణి పైలట్స్ కోర్సులో ప్రథమ స్థానంలో నిలిచి ప్రెసిడెంట్ పతకంతో పాటు ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డును అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ విభాగంలో తొలి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ కృతిక కుల్హారీకి ప్రెసిడెంట్ పతకం లభించింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ అధికారులు గగనతలంలో శిక్షణ విమానాలు నడిపి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. హవాక్స్, చేతక్, సారంగ్ హెలికాప్టర్లు, కిరణ్ విమానాల ఏరోబాటిక్ విన్యాసాలు ఆహూతులను అలరించాయి. -
భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్
కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు ఒకందుకు గర్విస్తుంది. భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ మా రాష్ట్రం నుంచి దేశానికి లభించింది అని ఆ రాష్ట్రం ఆశ్రిత వి. ఓలేటిని చూసి పొంగిపోతోంది. 1973 నుంచి ఎయిర్‌ఫోర్స్ నిర్వహిస్తున్న ఈ పరీక్షను కేవలం 275 మంది పాసవ్వగా వారిలో తొలి మహిళగా ఆశ్రిత చరిత్ర సృష్టించింది. ఇకమీద భారతీయ ఎయిర్‌ఫోర్స్‌లో ఏ విమానం కొనాలన్నా, సేవలు మొదలెట్టాలన్నా దానిని పరీక్షించే ఓ.కె చేయాల్సిన బాధ్యత ఆశ్రితదే. కర్ణాటక రాష్ట్రం కొల్లెగల్ కు చెందిన ఆశ్రిత బెంగళూరులో ఇంజినీరింగ్ చేసింది. అది విశేషం కాదు. 2014లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో చేరి స్క్వాడ్రన్ లీడర్ అయ్యింది. అది కూడా విశేషం కాదు. కాని ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలెట్ స్కూల్’ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘ఫ్లయిట్ టెస్ట్ కోర్స్’ (43వ బ్యాచ్)లో ఉత్తీర్ణత చెందింది. అదీ విశేషం. ప్రపంచంలో కేవలం 7 మాత్రమే ఉండే ఇలాంటి స్కూల్స్‌లో ఈ కోర్సులో ఉత్తీర్ణత చెందడమే కాకుండా భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ కావడం ఇంకా పెద్ద విశేషం. ఐ.ఎ.ఎఫ్ ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ప్రకటించి ఆశ్రితకు అభినందనలు తెలిపింది. ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతం 6,807 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో 1607 మంది మహిళా ఆఫీసర్లు పని చేస్తున్నారు. నేవీలో వీరి సంఖ్య 704 మాత్రమే. పురుషులతో పోలిస్తే త్రివిధ దళాలలో స్త్రీ శాతం తక్కువే అయినా ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల్లో జెండర్ అడ్డంకులు అధిగమించి స్త్రీలు ఆ మూడు సైనిక విభాగాలలో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. 2015 నుంచి ఎయిర్ ఫోర్స్ తన ఫైటర్ విభాగంలో మహిళల ప్రవేశాన్ని ఆమోదించాక సరిగ్గా ఆరేళ్లకు ఆశ్రిత తనదైన ఘనతను సాధించింది. -
టార్గెట్ ఎక్కడో.. సరిగా అక్కడే..
పురుషులు ఏదైనా టాస్క్ పూర్తి చేస్తే టార్గెట్ చుట్టుపక్కలవి కూడా అన్యాయంగా ధ్వంసం అయిపోతాయి. కొల్లాటరల్ డ్యామేజ్! మహిళలు అలాక్కాదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి క్షణాల్లో పక్కకు వచ్చేస్తారు. ఇది నిరూపణ అయిన సంగతే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో తాజాగా ఒక అజ్ఞాత మహిళా ఫైటర్ పైలట్ కు మిగ్– 29 యుద్ధ విమానాన్ని నడపడంలో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఎంత ఎగువకు లేచి, ఎంత వాలున మలుపు తీసుకుని, ఎంత దిగువకు చేరి ఆపరేషన్ ‘పూర్తి’ చేయాలో కూడా ఆ మహిళా పైలట్ నేర్చుకుంటారు. బైసన్, సుఖోయ్, రఫెల్ అయ్యాయి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ తన మహిళా ఫైటర్ పైలట్ల చేతికి మిగ్ 29ను అందించబోతోందన్న మాట! అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎంతమంది మహిళా ఫైటర్ పైలట్లు ఉన్నారు? ఎన్ని రకాల యుద్ధ విమానాలు ఉన్నాయి? యుద్ధం వస్తే కనుక కొల్లాటరల్ డ్యామేజ్‌ని తగ్గించడం కోసం మొదట గగనతలంలోకి ఎగరబోతున్నది మహిళా ఫైటర్ లేనా? భారత వాయుసేనలోని యుద్ధ విమానాల మహిళా పైలట్లు ఇప్పటికే మిగ్–21 బైసన్, సుఖోయ్–30, రఫేల్ వంటి ఫైటర్ జెట్లను నడుపుతున్నారు. క్షణాల్లో నిటారుగా లేచి, కనురెప్పపాటులో ఏటవాలుగా తిరిగి, చప్పున సమాంతర రేఖగా మారి, భూ ఉపరితలానికి దాదాపుగా దగ్గరగా దిగి, శత్రుస్థావరాలను ఒక్క ఉదుటన పేల్చేసి, రయ్యిన పైకి లేచి వచ్చే విన్యాసాలలో నైపుణ్యాన్ని సాధించినవారే వారంతా! ఇప్పుడిక మిగ్–29 వంతు. భూగోళమే దద్దరిల్లేలా పిడుగుపాటు వేగంతో కదలే ఈ యుద్ధ విమానాన్ని నడపడంలో తొలిసారి ఒక మహిళా ఫైటర్ పైలట్‌కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐ.ఎ.ఎఫ్) శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే వాయుసేనలో ఉన్న ఫైటర్ పైలట్లలో ఆమె ఒకరైనప్పటికీ, ఆమె ఎవరన్నదీ ప్రస్తుతానికైతే గోప్యమైన సంగతే. బహుశా శిక్షణ పూర్తయ్యాకో, శిక్షణాసమయంలోనో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆమె పేరును బయటపెట్టవచ్చు. మిగ్–29 : భారత వాయుసేన బాహుబలి తొంభై ఏళ్ల నుంచీ భారత వాయుసేన ఉన్నప్పటికీ ఇటీవల ఐదేళ్ల క్రితం మాత్రమే ఐ.ఎ.ఎఫ్ తొలిసారి మహిళల్ని ఫైటర్ పైలట్లుగా తీసుకుంది! భారత రక్షణ దళంలో అదొక చరిత్రాత్మక పరిణామం. అమ్మాయిలేంటీ, శత్రువు వెన్ను విరిచేందుకు గాలిలోకి యుద్ధ విమానాలను తిప్పడం ఏంటి అని అప్పుడే పురుష ప్రపంచం నొసలు విరిచింది. ఐ.ఎ.ఎఫ్ ఆ విరుపుల్ని పట్టించుకోలేదు. పైగా.. ఫైటర్ జెట్‌కి ఏం తెలుసు.. తనను నడుపుతోంది పురుష పైలటో, మహిళా పైలటో అని నవ్వేసి, స్త్రీ పురుషుల మధ్య జెండర్ యుద్ధవాతావరణాన్ని తేలికపరిచింది. ఐ.ఎ.ఎఫ్.లోని ఫైటర్ జట్లు ఒక్కోటీ ఒక్కో రకంగా ఉంటాయి. వాటిని ఒక్కో విధమైన ప్రత్యేక నైపుణ్యంతో నడపవలసి ఉంటుంది. వాటన్నింటిలో ఆరితేరిన మహిళా పైలట్లకు నేర్చుకోడానికి ఇప్పుడు మిగిలింది మిగ్–29 మాత్రమే. అందులోనూ శిక్షణ పొందితే భారత వాయుసేనకు ఇక కొండంత ధైర్యం. ఏ అమ్మాయి ఏ జెట్నైనా ‘డీల్’ చేయగలదు. ఎలాంటి అనూహ్య పరిస్థితిలోనైనా జెట్‌ను బయటికి తీయగలదు. చైనా, పాకిస్తాన్లను విశ్వసించలేని ప్రస్తుత తరుణంలో మహిళా పైలట్లకు ఇది అత్యవసర శిక్షణ. గత ఏడాది ఫ్లయిట్ లెఫ్ట్‌నెంట్ శివాంగి సింగ్‌కు ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న రఫేల్ యుద్ధ విమానాన్ని అప్పగించింది ఐ.ఎ.ఎఫ్.! హర్యానాలోని అంబాలాలో ఉన్న వైమానిక స్థావరం నుంచి రఫేల్‌ను నడపడంతో శివాంగి శిక్షణ పొందుతున్నారు. భారత వాయుసేన 2015 నుంచీ తీసుకుంటూ వచ్చిన పది మంది మహిళా ఫైటర్ పైలట్లలో శివాంగి ఒకరు. ఈ పదిమందికి కూడా మిగ్–21తో శిక్షణ ప్రారంభం అయింది. తర్వాత మిగతా యుద్ధ విమానాల శిక్షణ. ప్రస్తుతం ఒక మహిళాపైలట్ చేతికి అందబోతున్నదని రూఢీగా తెలుస్తోన్న మిగ్–29 గత పదేళ్లలోనూ అనేకమైన మార్పులతో వృద్ధి చెందుతూ వస్తోంది. ఏవియానిక్స్, వెపన్స్, రాడార్, ‘హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే’ (హెచ్.ఎం.డి.) వంటివన్నీ అధునాతనం అయ్యాయి. ఉదా : హెచ్.ఎం.డి.! మొదట్లో ఈ హెల్మెట్.. పైలట్ కళ్లకు గ్రాఫిక్స్‌గా హెచ్చరికల సమాచారం అందించేది. ఇప్పుడిది ఇమేజెస్‌గా డిస్ప్లే అవుతోంది. ఈ కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకోవడం, ఆపరేట్ చెయ్యడం, ప్రమాదాలను తప్పించుకోవడం, ఎదురు దాడుల నుంచి కాపాడుకోవడం.. ఇవన్నీ శిక్షణలో ప్రాథమికమైనవిగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పదిమంది మహిళా ఫైటర్ పైలట్లతో పాటు 18 మంది మహిళా నేవిగేటర్లు (భూమి పై నుంచి విమాన మార్గాన్ని, విమాన కదలికల్ని నియంత్రించేవారు) భారత వాయు సేనలో ఉన్నారు. వీళ్లు కాక 1875 మంది మహిళా ఆఫీసర్లు ఐ.ఎ.ఎఫ్.లో అత్యన్నతస్థాయి విధుల్ని నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాలను.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. కలిపి చూస్తే మహిళా ఆఫీసర్ల సంఖ్య గత ఏడాది సెప్టెంబరు నాటికి 9,118. రక్షణ దళాలలోకి మరింత మంది మహిళల్ని తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఈ మధ్యే పార్లమెంటులో వెల్లడించింది. ‘‘ఇది మహిళల అవసరం కాదు. మన రక్షణ వ్యవస్థ అవసరం. మూడు రక్షణ దళాలూ మహిళల శక్తి సామర్థ్యాలతో బలోపేతం కావలసి ఉంది’’ అని ఇటీవలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రిటైర్డ్ వింVŠ కమాండర్ అనుపమా జోషి అన్నారు. 1990ల ఆరంభంలో ఐ.ఎ.ఎఫ్.లోకి వచ్చిన తొలి మహిళా ఆఫీసర్ల బ్యాచ్‌కి చెందినవారు అనుపమ. ఆర్మీలోని వైమానిక విభాగం (ఏవియేషన్ వింగ్)లోకి కూడా త్వరలోనే మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు రాబోతున్నారు! ఆర్మీ ఏవియేషన్ వింగ్ లో ప్రస్తుతం ఉన్న మహిళా అధికారులు గ్రౌండ్‌కు మాత్రమే పరిమితమై ఉన్నారు. ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లను కూడా ఆపరేట్ చేస్తుంటుంది. వాటిని నడిపేందుకు ఈ జూలైలో తొలి బ్యాచ్ మహిళా అధికారులకు పైలట్లుగా శిక్షణ ప్రారంభిస్తున్నారు. 2022 జూలై నాటికి వారి శిక్షణ పూర్తవుతుంది. నేవీ మరికాస్త ముందుంది. గత సెప్టెంబరులో శిక్షణ పూర్తి చేసుకున్న ఇద్దరు మహిళల్ని తొలిసారి యుద్ధ నౌకల్లోని హెలికాప్టర్లకు ఫైటర్ పైలట్‌గా తీసుకుని చరిత్ర సృష్టించింది. లక్ష్యాన్ని గురి చూసి ఛేదించగల శక్తి పురుషుల కన్నా మహిళలకే ఎక్కువని అనేక శాస్త్రీయ పరిశోధనల్లో రుజువైన సంగతే. పురుషులూ ఛేదిస్తారు కానీ.. లక్ష్యానికి ఆనుకుని ఉన్న జనావాసాలు కూడా ధ్వంసం అవుతాయి. పౌరులూ మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ నష్టాన్నే ‘కొల్లాటరల్ డ్యామేజ్’ అంటారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే కనుక కొల్లాటరల్ డ్యామేజ్‌ని నివారించేందుకు లేదా తగ్గించేందుకు మొదట మహిళా ఫైటర్ పైలట్లనే గగనతలంలోకి భారత వాయు సేన పంపే అవకాశాలైతే లేకపోలేదు. వాయుసేనకు మహిళాశక్తి భారత సరిహద్దుల్లో చైనా, పాక్‌ల అతిక్రమణలు ఎప్పటికైనా యుద్ధానికి దారి తీసేవే. గత ఏడాది జూలైలో చైనా మన సరిహద్దుల్లోకి చొచ్చుకుని వచ్చిన సమయంలోనే ఫ్రాన్స్‌కు మనం ఆర్డరు పెట్టిన 36 రఫేల్ యుద్ధ విమానాలలో తొలి విడతగా ఐదు విమానాలు భారత్‌తో దిగాయి. వైమానిక దాడుల అవసరమే కనుక కలిగితే చైనా పాక్‌ల కంటే కూడా శక్తిమంతమైన యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయన్న సంగతి ప్రపంచానికి తెలియని వాస్తవమేమీ కాదు. భారత వాయు సేనలో ఇప్పటికే ఉన్న ‘తేజస్’లు దేశవాళీ ఫైటర్ జెట్లు కాగా, సుఖోయ్‌లు రష్యాలో తయారై వచ్చినవి. మిరాజ్ 2000 లు ఫ్రాన్స్ తయారీ. మిగ్–21లు (బైసన్ అని కూడా అంటారు) మిగ్–29లు కూడా రష్యా నుంచి తెప్పించుకున్నవే. సెపెక్యాట్ జాగ్వార్లది బ్రిటన్, ఫ్రాన్స్‌ల ఉమ్మడి టెక్నాలజీ. వీటన్నిటిలోనూ మన మహిళా ఫైటర్ పైలట్లు శిక్షణ పొందినవారే. ఇప్పుడు మిగ్–29 శిక్షణకు తొలిసారి ఒక మహిళా ఫైటర్ పైలట్‌ను భారత వాయు సేన పంపబోతోంది. -
ఈసారి పరేడ్‌లో ఒక ఫైటర్ ఒక టాపర్
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌పథ్ మీదుగా ఇండియా గేట్ వరకు ఎనిమిది కి.మీ. దూరం సాగవలసిన రిపబ్లిక్ డే పరేడ్ ఈ ఏడాది మునుపటంత సందడితో ఉండబోవడం లేదు. ఎప్పుడూ లక్షమంది వరకు వీక్షకులను అనుమతించేవారు. ఈ ఏడాది ఆ సంఖ్యను ఇరవై ఐదు వేలకు కుదించారు. ఆ ఇరవై ఐదు వేల మందిలో నాలుగు వేల మంది మాత్రమే సాధారణ ప్రజలు. మిగతావారంతా వి.ఐ.పి.లు, వి.వి.ఐ.పీలు. ఎప్పుడూ చిన్నాపెద్దా అందరూ పరేడ్‌ను చూడ్డానికి వచ్చేవారు. ఈ ఏడాది పదిహేనేళ్ల వయసు లోపువారికి, అరవై ఐదేళ్లు దాటిన వారికి రాజ్‌పథ్ ప్రవేశాన్ని నిషేధించారు. బయటి అతిథులు కూడా ఎవరూ రావడం లేదు. కారణం తెలిసిందే. సోషల్ డిస్టెన్స్. అయితే.. ఇన్ని నిరుత్సాహాల నడుమ రెండంటే రెండే ఉల్లాసకరమైన విషయాలుగా కనిపిస్తున్నాయి. ఫ్లయింట్ లెఫ్ట్‌నెంట్ భావనా కాంత్ మన వాయుసేనలోని ఫైటర్ జెట్‌తో గగనతలంలో విన్యాసాలు చేయబోతున్నారు! రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక మహిళా ఫైటర్ పైలట్.. యుద్ధ విమానాన్ని చక్కర్లు కొట్టించబోవడం ఇదే మొదటిసారి. అలాగే దివ్యాంగి త్రిపాఠీ అనే విద్యార్థినికి పరేడ్ గ్రౌండ్స్‌లోని ప్రధాన మంత్రి బాక్స్‌లో కూర్చొని వేడుకలను తిలకించే అవకాశం లభించడం దేశంలోని బాలికలు, మహిళలందరికీ స్ఫూర్తినిచ్చే పరిణామం. భావనా కాంత్ (28) భారతదేశపు తొలి మహిళా ఫైటర్ పైలట్. జనవరి 26 న ఆమె రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్ అవుతారు. భారత వాయుసేన ఆమెకు ఈ అరుదైన, ఘనమైన, చరిత్రాత్మక అవకాశాన్ని కల్పించింది. 2016 లో తొలి ఫైటర్ పైలట్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐ.ఎ.ఎఫ్) లోకి వచ్చారు భావన. ఇంచుమించుగా ఆమెతో పాటే అవని చతుర్వేది, మోహనా సింగ్ ఫైటర్ పైలట్ శిక్షణలో చేరారు. అప్పటి వరకు మన సైన్యంలో మహిళా ఫైటర్ పైలట్లే లేరు. మూడేళ్ల అంచెలంచెల శిక్షణానంతరం 2019 మే లో యుద్ధ విమానాలు నడిపేందుకు భావన పూర్తి అర్హతలు సంపాదించారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని వైమానిక స్థావరంలో విధి నిర్వహణలో ఉన్నారు. మిగ్–21 యుద్ధ విమానాన్ని అన్ని కోణాల్లో మలుపులు తిప్పి శత్రువు వెన్ను విరచడంలో నైపుణ్యం ఉన్న యోధురాలు భావనా కామత్ ఇప్పుడు. భావన 1992 డిసెంబర్ 1న బిహార్‌లోని దర్భంగా లో జన్మించారు. అయితే ఆమె పెరిగింది అక్కడికి సమీపంలోని బెగుసరాయ్‌లోని రిఫైనరీ టౌన్షిప్లో. ఆమె తండ్రి తేజ్ నారాయణ్.. ఇంజనీర్. ఆ టౌన్‌షిప్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో ఆయన ఉద్యోగం. భావన తల్లి రాధాకాంత్ గృహిణి. భావన తమ్ముడు నీలాంబర్, భావన చెల్లి తనూజ. వారిద్దరికీ భావనే అన్నిటా స్ఫూర్తి. భావనకు డ్రైవింగ్ అంటే ఇష్టం. అందుకే కావచ్చు డ్రైవింగ్‌కి అత్యున్నతస్థాయి అనుకోదగిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలటింగ్‌ను కెరీర్‌గా ఎన్నుకున్నారు. ఇంకా ఆమెకు ఖోఖో, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డిబేట్స్, సినిమాలు ఇష్టం. టౌన్‌షిప్‌లోని స్కూల్లో చదువు పూర్తయ్యాక భావన బెంగళూరులోని బి.ఎం.ఎస్. కాలేజ్‌లో మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో కొన్నాళ్లు పని చేశారు. ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యేందుకు కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసి ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ట్రైనింగ్ అయ్యాక మేడ్చెల్ జిల్లాలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్అకాడమీ నుంచి ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బయటికి వచ్చారు. భారత రాష్ట్రపతి గత ఏడాది ఆమెకు నారీ శక్తి పురస్కారం ప్రదానం చేశారు. ∙ ∙ ఇక రిపబ్లిక్ డే పరేడ్‌ను పీఎం పక్కన కూర్చొని వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానాన్ని పొందిన దివ్యాంగీ త్రిపాఠీ (18) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ అమ్మాయి. 2020 సీబీఎస్ఇ 12వ తరగతి పరీక్షల్లో 99.6 శాతం మార్కులతో జిల్లాలోనే టాపర్‌గా నిలవడంతో దివ్యాంగికి ఈ అరుదైన అవకాశం లభించింది. ఆమెతో పాటు ఈ అవకాశం దేశంలోని మిగతా రాష్ట్రాల టాపర్స్కీ దక్కింది. ఇప్పుడు ఆమెకు స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఎదురౌతున్న ప్రశ్న ఒక్కటే. ‘ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఆయనతో ఏం మాట్లాడతావు?’ అని! దివ్యాంగి తండ్రి ఉమేశ్‌నాథ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్. తల్లి ఉష గృహిణి. ఈ నెల 13న కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ‘పరేడ్’ను చూసేందుకు ఆహ్వానం వచ్చిందని ఆమె ఎంతో సంతోషంతో తెలిపారు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ -
వీరుడా వందనం
న్యూఢిల్లీ : త్రివిధ బలగాల్లో సేవలందించి ప్రత్యేకత చాటుకున్న ఒకే ఒక్క భారతీయుడు, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సాహసికుడు, ప్రీతిపాల్ సింగ్ గిల్ 100 ఏళ్ల పుట్టిన రోజు పండుగని కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా జరుపుకున్నారు. ఆర్మీలో కల్నల్‌గా రిటైర్ అయిన ప్రీతిపాల్ సింగ్ గిల్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం తన నూరవ పుట్టిన రోజు నాడు బొటనవేలు పైకెత్తి చూపిస్తూ ప్రీతిపాల్ పోస్టు చేసిన ఫొటోకి నెటిజన్లు చెయ్యెత్తి జై కొట్టారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట జిల్లా పాఖీ గ్రామానికి చెందిన ప్రీతిపాల్ కుటుంబం తరతరాల నుంచి సైన్యంలోనే పనిచేస్తోంది. 1920 డిసెంబర్ 11న పాటియాలాలో పుట్టిన ప్రీతిపాల్ సింగ్ 1942లో భారత వాయుసేనలో చేరారు. అయితే ఆయన తండ్రి తన కుమారుడు విమానం కూలి ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో నేవీకి పంపించారు. కార్గో నౌకలకు ఎస్కార్ట్‌గా ప్రీతిపాల్‌సింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. కొన్నేళ్ల తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆర్మీకి బదిలీ చేశారు. గ్వాలియర్ మౌంటెన్ రెజిమెంట్‌లో సేవలు అందిస్తూ 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ సెక్టార్ కమాండర్‌గా పని చేస్తూ 1970లో రిటైర్ అయ్యారు. పదవీ విరమణ తర్వాత తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య ప్రమీందర్ కౌర్‌కి ఇప్పుడు 95 ఏళ్లు. వారిద్దరికీ ఒకే ఒక్క కుమారుడు ఉన్నారు. సింగ్ శరీరానికే వయ సు వచ్చిందే తప్ప ఆయన మనసు ఎప్పు డూ నిత్య యవ్వనంతో ఉరకలేస్తూ ఉంటుం దని ప్రీతిపాల్ మనవడు అభయ్‌పాల్ చెప్పారు. టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడడం అం టే ఆయనకి చాలా ఇష్టం. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌తో పాటు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. -
సీన్ తొలగించాల్సిందే
అనిల్ కపూర్, పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏకే వర్సెస్ ఏకే’. విక్రమాదిత్యా మోత్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 24న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ డ్రస్‌లో కనిపిస్తారు. అలాగే ఆయన మాట్లాడిన డైలాగుల్లో అభ్యంతరకర పదజాలం ఉంది. ఈ విషయంలో ‘ఐఏఎఫ్’ (భారత వైమానిక దళం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎఫ్ అధికారిగా అనిల్ కపూర్ ధరించిన డ్రెస్ కోడ్ సరిగ్గా లేదని ఐఏఎఫ్ పేర్కొంది. అలాగే ట్రైలర్లో ఉపయోగించిన పదజాలం ఇబ్బందికరంగా ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై అనిల్ కపూర్ క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేశారు. -
అందుకే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: ధనోవా
న్యూఢిల్లీ: ‘‘ఆరోజు నేను, అభినందన్ తండ్రి గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాం. మేమిద్దరం కలిసి పనిచేసిన నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నాం. కార్గిల్ యుద్ధ సమయంలో నా ఫ్లైట్ కమాండర్ అహుజా పట్టుబడ్డారు. ఆయన విమానం కూలిపోయింది. అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కినపుడు అహుజా విషయం నా మదిలో మెదిలింది. అప్పుడు.. ‘‘సర్.. అహుజాను వెనక్కి తీసుకురాలేకపోయాం. కానీ అభినందన్‌ను కచ్చితంగా తీసుకొస్తాం’’ అని నేను ఆయన తండ్రికి చెప్పాను. పాకిస్తాన్‌కు భారత్ సామర్థ్యమేమిటో తెలుసు. అందుకే అభినందన్‌ను అప్పగించారు’’ అని భారత మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా గతేడాది ఫిబ్రవరి నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.(చదవండి: పుల్వామా దాడి; పాక్ సంచలన ప్రకటన) కాగా పాకిస్తాన్ ఎంపీ అయాజ్ సాదిఖ్ నేషనల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ప్రతిపక్షాలు హాజరయ్యాయని, ఆ సమయంలో అభినందన్ విడుదల చేయడమే తప్ప తమకు వేరే మార్గం లేదని మంత్రి చెప్పినట్లు ఆయాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. లేనిపక్షంలో భారత్ ప్రతీకారం తీర్చుకోనుందన్న సమాచారం నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా కాళ్లు వణికాయని, ఒళ్లంతా చెమటతో తడిసిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ మాజీ చీఫ్ ధనోవా ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘ ఆనాడు పాకిస్తాన్‌పై రెండు అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఒకటి, దౌత్య, రాజకీయపరంగా వస్తున్న ఒత్తిడి. మరోవైపు భారత ఆర్మీ శక్తిసామర్థ్యాలు తెలిసి ఉండటం. ఆయన(సాదిఖ్) చెప్పినట్లు అతడి(జనరల్ కమర్ జావేద్ బజ్వా) కాళ్లు వణకడం వంటివి జరిగింది అందుకే. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యం గురించి వారికి అవగాహన ఉంది. ఫిబ్రవరి 27న వాళ్లు దాడికి సిద్ధమయ్యారు. అందుకు దీటుగా బదులిచ్చేందుకు, వాళ్ల ఫార్వర్డ్ బ్రిగేడ్స్‌ను నామరూపాల్లేకుండా చేసేందుకు సన్నద్ధమయ్యాం. అప్పటికే వాళ్లకు విషయం అర్థమైంది. భారత ఆర్మీని తట్టుకుని నిలబడిగే శక్తి తమ మిలిటరీకి ఉందా లేదా అన్న విషయం గురించి ఆలోచన మొదలైంది. ‘‘స్పీక్ సాఫ్ట్ అండ్ క్యారీ ఏ బిగ్ స్టిక్(శాంతియుతంగా చర్చలు జరుపుతూనే, తోకజాడిస్తే బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలనే అర్థంలో)’’ అని అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ చెబుతూ ఉండేవారు కదా.. ఇక్కడ బిగ్‌స్టిక్‌గా మిలిటరీ పనిచేసింది. అభినందన్‌ను విడిచిపెట్టడం తప్ప వాళ్లకు వేరే మార్గం లేకపోయింది’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: అప్పటికే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: పాక్ నేత)) బీఎస్ ధనోవా(ఫైల్ ఫొటో) పాక్ ఆర్మీ దురాగతానికి బలైన ఆహుజా కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో.. గతేడాది ఫిబ్రవరి 27న భారత పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన ఆయనను.. పాక్ ఆర్మీ అధికారులు దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలోకి తీసుకున్నారు. అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ భారత్‌కు చేరుకున్నారు. దాయాది దేశ సైన్యానికి చిక్కినప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. ధైర్యసాహసాలు ప్రదర్శించి కర్తవ్యాన్ని నెరవేర్చిన అభినందన్‌కు యావత్ భారతావని నీరాజనాలు పట్టింది. ఇక అభినందన్ తండ్రి ఎస్ వర్థమాన్ సైతం ఐఏఎఫ్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కాగా స్వ్యాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా 1999లో పాకిస్తానీ సాయుధ బలగాల చేతిలో మరణించారు. తాను నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో పాక్ ఆర్మీ చేతికి చిక్కిన ఆహుజా.. దేశ రక్షణకై ప్రాణాలు అర్పించారు. -
‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్‌ను ఆదివారం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజయవంతంగా పరీక్షించింది. స్టెల్త్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ చెన్నై’నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని అధికారులు తెలిపారు. ‘సముద్ర జలాలపై లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్ యుద్ధ నౌక అజేయశక్తిని మరింత ఇనుమడింపజేసిందని, భారత నేవీ వద్ద ఉన్న మరో ప్రమాదకర అస్త్రాల్లో ఒకటిగా మారిందని రక్షణ శాఖ తెలిపింది. భారత్–రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో రూపొందిన బ్రహ్మోస్ క్షిపణులను జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాలతో పాటు నేలపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), బ్రహ్మోస్ ఏరోస్పేస్, భారత నేవీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. క్షిపణి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, సిబ్బందిని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్ రెడ్డి కూడా అభినందించారు. మన సైనిక పాటవం బ్రహ్మోస్ క్షిపణితో మరింత పెరుగుతుం దన్నారు. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్.. నేలపై నుంచి నేలపైకి బ్రహ్మోస్‌ను, యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్‌ను, అణు సామర్థ్యం ఉన్న శౌర్య క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. -
రుద్రం.. శత్రు రాడార్లు ఇక ధ్వంసం
బాలాసోర్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి మన దేశం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వరసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ భారత వాయుసేనను బలోపేతం చేస్తోంది. శత్రు దేశాల రాడార్లను సర్వ నాశనం చేసే యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్–30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి కచ్చితంగా తన లక్ష్యాలను ఛేదించడం ఒక మైలురాయిగా నిలి చిపోయింది. దూర ప్రాంతాల నుంచి శత్రువుల రాడార్ వ్యవస్థ, ట్రాకింగ్, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్రం ప్రయోగం విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేసి, శాస్త్రవేత్తలను అభినందించారు. ఇప్పటికే నిర్భయ, శౌర్య వంటి క్షిపణుల్ని ప్రయోగించి చూసిన భారత్ ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి ప్రయోగంతో శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రుద్రం ప్రత్యేకతలు ► దీన్ని సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలతో ప్రయోగించవచ్చు. ► శత్రువుల రాడార్, సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్వీర్వం చేయగలదు. ► 0.6 మాక్ నుంచి 2 మాక్ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ► న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ (ఎన్‌జీఏఆర్‌ఎం) 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదిస్తుంది ► గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే ఈ వ్యూహాత్మక క్షిపణిలోని పాసివ్ హోమింగ్ హెడ్ శత్రు దేశ రక్షణ వ్యవస్థ రేడియేషన్‌ను తట్టుకుంటూ లక్ష్యాలను ఛేదిస్తుంది. ► ఐఎన్ఎస్–జీపీఎస్ ద్వారా దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. ► దీని ప్రయోగానంతరం శత్రుదేశాలు తమ రాడార్ వ్యవస్థను నిలిపివేసినా, ఇది లక్ష్యాలను నాశనం చేయగలదు. ► 2017లో అమెరికా ఈ తరహా యాంటీ రేడియేషన్ క్షిపణిని నావికా రంగంలో ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యం సాధించిన మూడేళ్లలోనే భారత్ అలాంటి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం విశేషం. -
విజయవంతంగా రుద్రం-1 క్షిపణి ప్రయోగం
భువనేశ్వర్ : శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాల సన్నాద్ధమవుతోంది. దేశ రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే వాయుసేన అమ్ముల పొదలోని తిరుగులేని అస్త్రాన్ని పరీక్షించింది. శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన రుద్రం -1 క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో సుఖోయ్-30 నుంచి శుక్రవారం ఉదయం ప్రయోగించిన ఈ మిసైల్ నిర్దేశిత లక్ష్యాలను ఛేదించినట్లు డీఆర్డీఓ అధికారికంగా ప్రకటించింది. చదవండి: 'శౌర్యం' చూపుతున్న భారత క్షిపణి సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి కూడా ప్రయోగించిన ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ఇది కనిష్టంగా 500 మీటర్లు, గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇటీవల వరుసగా క్షిపణి పరీక్షలను డీఆర్డీవో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భారత్.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ను పరీక్షించింది. క్షిపణి ప్రయోగం విజయవంతమవడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. చదవండి: సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు -
ఏకకాలంలో చైనా, పాక్‌లతో యుద్ధానికి రెడీ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఎలాంటి సంఘర్షణ తలెత్తినా భారత వైమానిక దళాని(ఐఏఎఫ్)దే పైచేయిగా ఉంటుందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సంసిద్ధంగా ఉందన్నారు. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన అన్ని చోట్లా పటిష్టంగా మోహరించినట్లు తెలిపారు. చైనాతో తూర్పు లద్దాఖ్‌లో ఐదు నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న వైమానిక దళం దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ సార్వభౌమత్వాన్ని, ప్రయోజనాలను పరిరక్షించడానికి సర్వశక్తులూ ఒడ్డుతామన్నారు. లద్దాఖ్‌లో ఐఏఎఫ్ సామర్థ్యంలో భారత్‌తో పోలిస్తే చైనా వెనుకబడి ఉందనీ, అయినప్పటికీ శత్రువును తక్కువగా అంచనా వేయజాలమన్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తే ఎలాంటి పరిస్థితులకైనా తక్షణం, వేగంగా స్పందించేలా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఐఏఎఫ్ మోహరింపులు చేపట్టిందని చెప్పారు. అవసరమైతే ఉత్తర(చైనా), పశ్చిమ(పాక్) సరిహద్దుల వెంట ఏకకాలంలో పోరాటం జరిపే సత్తా ఐఏఎఫ్‌కు ఉందన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనా నుంచి ముప్పు ఉంది కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన..‘అవసరమైన అన్ని చోట్లా మోహరించాం. లద్దాఖ్ అందులో చిన్న ప్రాంతం’అని పేర్కొన్నారు. లద్దాఖ్‌లోకి సులువుగా ప్రవేశించేందుకు వీలున్న అన్ని చోట్లా ఈ మోహరింపులు ఉన్నాయని తెలిపారు. మన ఆర్మీని, ఆయుధ సామగ్రిని శత్రువు కూడా ఊహించలేని ప్రాంతాల్లోకి సైతం వేగంగా తరలించేందుకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల చేరికతో ఉత్తర సరిహద్దుల్లో శత్రువు కంటే మెరుగైన సామర్థ్యంతో ఉన్నామన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మరిన్ని రఫేల్‌లను సమకూర్చుకునే విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. చైనా బలాలు చైనాకున్నాయి.. చైనా కూడా కొన్ని అంశాల్లో బలంగా ఉందన్న బదౌరియా.. వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలను ఐఏఎఫ్ సిద్ధం చేసిందన్నారు. ‘చైనాకు సుదూర లక్ష్యాలను ఛేదించే, భూమిపై నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు, ఐదో తరం జె–20 యుద్ధ విమాన దళం, అత్యాధునిక సెన్సార్లు, ఆయుధాలు ఉన్నాయి. సాంకేతిక, వ్యవస్థల ఏర్పాటు కోసం భారీగా వెచ్చిస్తోంది’అని తెలిపారు. -
చరిత్ర సృష్టించిన శివాంగి సింగ్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి అడుగుపెట్టనున్న మహిళా పైలట్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అంబాలా కేంద్రంగా పనిచేసే ‘గోల్డెన్ యారోస్’ 17 స్క్వాడ్రన్‌లోకి ఎంపికైన తొలి మహిళగా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివాంగి సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా శివాంగికి అభినందనలు తెలుపుతూ.. ‘‘దేశమంతా నిన్ను చూసి గర్విస్తోంది’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా వారణాసికి చెందిన శివాంగి 2017లో భారత వైమానిక దళంలో చేరారు. మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆమె సొంతం. రాజస్తాన్ బార్డర్ బేస్‌లో అభినందన్ వర్ధమాన్‌తో కలిసి ఫైటర్ జెట్లు నడిపిన శివాంగి త్వరలోనే రఫేల్ స్క్వాడ్రన్‌లో చేరేందుకు అంబాలాలో అడుగుపెట్టనున్నారు. (చదవండి: నావికా నాయికలు) ఇక వారణాసిలో ప్రాథమిక విద్యనభ్యసించిన శివాంగికి చిన్ననాటి నుంచే వైమానిక దళంలో చేరాలని కలలు కనేవారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరిన అనంతరం తన ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులుపడ్డాయి. అక్కడే నేషనల్ క్యాడెట్ కార్స్ప్ 7 యూపీ ఎయిర్ స్వాడ్రాన్‌లో భాగస్వామ్యమయ్యే అవకాశం లభించింది. ఈ క్రమంలో 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరి శిక్షణ ప్రారంభించారు. కాగా భారత్- చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రఫేల్ ఫైటర్ జెట్లు తూర్పు లద్ధాక్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఇక ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు ఈనెల 10న అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. -
రఫేల్‌కు మహిళా పైలట్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో ఇటీవలే చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి త్వరలో మహిళా పైలట్ ఒకరు చేరనున్నారు. మిగ్–21 ఫైటర్ జెట్ల మహిళా పైలట్ ఒకరు అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఎంపికయ్యారని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధికారి ఒకరు తెలిపారు. రఫేల్ ఫైటర్ జెట్ పైలట్ కోసం చేపట్టిన అత్యంత కఠినమైన పరీక్షల్లో ఎంపికయిన ఈ మహిళా పైలట్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ఆ అధికారి వెల్లడించారు. అత్యంత సమర్థమైనవిగా పేరున్న రఫేల్ యుద్ధ విమానాలకు మహిళా పైలట్ ఎంపిక కావడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని పేరు వెల్తడించటానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2018లో యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆమె మిగ్–21 బైసన్ విమానాన్ని సొంతంగా నడిపారు. యుద్ధ విమానాల కోసం ప్రయోగాత్మకంగా మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు.. 2016 జూలైలో ఎంపికైన ముగ్గురు మహిళల బృందంలో ఈమె కూడా ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో 10 మంది మహిళా పైలట్లు, సహాయకులుగా మరో 18 మంది ఉన్నారు. ఐఏఎఫ్‌లో మొత్తం మహిళా అధికారుల సంఖ్య 1,875. కాగా, రఫేల్ ఫైటర్ జెట్లు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న భారత్, చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో ఈ నెల 10వ తేదీన అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. మొట్టమొదటి సారిగా 1951లో అంబాలా వైమానిక స్థావరంలో ఏర్పాటయిన ఈ స్క్వాడ్రన్ పేరిట పలు రికార్డులు నమోదై ఉన్నాయి. 1955లో మొట్టమొదటి ఫైటర్ జెట్ డి హవిల్లాండ్ వాంపైర్ ఈ స్క్వాడ్రన్లోనే చేరింది. ఫ్రాన్సుతో కుదుర్చుకున్న రూ.59వేల కోట్ల ఒప్పందంలో భాగంగా జూలైలో మొదటి విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ కల్లా రెండో విడతలో మరో నాలుగు, 2021 చివరి నాటికి మొత్తం 36 విమానాలు చేరనున్నాయి. రష్యా నుంచి సుఖోయ్ జెట్లను కొనుగోలు చేసిన 23 ఏళ్ల తర్వాత భారత్ యుద్ధ విమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న భారీ ఒప్పందమిది. -
అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు
అంబాలా: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన దేశ వాయుసేన మరింత బలోపేతమైంది. భారత్ అమ్ములపొదిలోకి అయిదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా వాయుసేనలోకి ఐదు అధునాతన రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తదితరుల సమక్షంలో ఈ యుద్ధ విమానాలను వాయుసేనలోని 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్‌కి అప్పగించారు. దీనికి సంబంధించిన ఒక పత్రాన్ని గ్రూప్ కెప్టెన్ హర్కీరత్ సింగ్‌కు రాజ్‌నాథ్ అందించారు. రఫేల్ అప్పగింత సమయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు విమానాలకు వాటర్ కెనాన్లతో సెల్యూట్ చేశారు. ఆ తర్వాత జరిగిన వైమానిక విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొత్త పక్షులకు స్వాగతం అని భారత వైమానిక దళం ట్వీట్ చేసింది. రూ.59 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో నాలుగేళ్ల క్రితమే భారత్ ఒప్పందం చేసుకుంది. గత జూలై 29న మొదటి విడతగా 5విమానాలు హరియాణాలో అంబాలా వైమానికి స్థావరానికి వచ్చాయి. సార్వభౌమాధికారంపై కన్నేస్తే ఊరుకోం: రాజ్‌నాథ్ రఫేల్ యుద్ధ విమానాలను వాయుసేనలో ప్రవేశపెట్టాక రాజ్‌నాథ్ మాట్లాడారు. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని నేరుగానే ప్రస్తావించారు. మన దేశ సార్వభౌమాధికారంపై కన్ను వేసే వారందరికీ ఈ యుద్ధ విమానాల ద్వారా అతి పెద్ద , గట్టి సందేశాన్ని ఇస్తున్నామన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళతామని ఇదివరకే స్పష్టం చేశానని చెప్పారు. ‘సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో యుద్ధ విమానాలు మన అమ్ములపొదిలోకి చేరడం అత్యంత కీలకంగా మారింది. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మనమూ సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రధాని మోదీ దేశ భద్రతకే పెద్ద పీట వేస్తారని చెప్పడానికి గర్విస్తున్నాను’అని రాజ్‌నాథ్ అన్నారు. ప్రపంచంలో రఫేల్ యుద్ధ విమానాలే అత్యుత్తమమైనవని, వాటిని కొనుగోలు చేయడం గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు. దేశ రక్షణ వ్యవస్థని బలోపేతం చేస్తున్నప్పటికీ తాము శాంతిని కాంక్షిస్తామని స్పష్టం చేశారు. భారత్, ఫ్రాన్స్ బంధాల్లో కొత్త అధ్యాయం రఫేల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలోకి చేరికతో భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ అన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు. భారత రక్షణ వ్యవస్థ బలోపేతం కావడానికి తాము పూర్తిగా సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గోల్డెన్ ఏరోస్‌కే ఎందుకు ? మొదటి బ్యాచ్‌లో వచ్చిన 5 రఫేల్ యుద్ధ విమానాలు 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ ద్వారా సేవలు అందిస్తాయి. వాయుసేనలో గోల్డెన్ ఏరోస్‌కి ప్రత్యేక స్థానముంది. అంబాలాలో 1951 అక్టోబర్ 1న లెఫ్ట్‌నెంట్ జనరల్ డీఎల్ స్ప్రింగెట్ నేతృత్వంలో ఈ ప్రత్యేక దళం ఏర్పడింది. ఎలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లయినా ఈ దళమే చేపడుతుంది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల నుంచి గత ఏడాది బాలాకోట్ దాడుల వరకు ఎన్నో ఆపరేషన్లలో 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ అద్భుతమైన ప్రతిభని చూపించింది. హార్వార్డ్ 2బీ, హాకర్ హంటర్, మిగ్ 21 వంటి యుద్ధ విమానాలన్నింటినీ తొలుత గోల్డెన్ ఏరోస్ దళం నడిపింది. గత ఏడాది సెప్టెంబర్ 10న రఫేల్ యుద్ధ విమానాల కోసం ఈ దళాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఈ యుద్ధ విమానం నడపడంలో ఇప్పటికే కొందరు పైలట్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు ఫ్రాన్స్‌లో శిక్షణ తీసుకున్నారు. -
రఫేల్ రాక.. చైనాకు స్ట్రాంగ్ కౌంటర్
అంబాలా, హరియాణా : సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత అమ్ముల పొదిలోకి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రఫేల్ రాకను గేమ్ చేంజర్‌గా వర్ణించారు. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్లను ప్రవేశపెట్టడం చారిత్రాత్మక క్షణంగా వర్ణించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘రఫేల్ రాకతో ప్రపంచానికి ముఖ్యంగా మనల్ని వక్ర దృష్టితో చూసే ధైర్యం చేసేవారికి ఒక బలమైన సందేశాన్ని పంపుతున్నాం. ప్రస్తుత సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది చాలా కీలకమైన ఘటన’ అంటూ పరోక్షంగా చైనాకు వార్నింగ్ ఇచ్చారు రాజ్‌నాథ్. అంతేకాక ‘ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతల సమయంలో ఐఏఎఫ్ చూపించిన సమయస్ఫూర్తిని, నిబద్ధతని ఈ సందర్భంగా నేను ప్రశంసిస్తున్నాను. సరిహద్దులో మోహరించిన వాయుసేన దళాలను చూస్తే.. వారు ఏలాంటి పరిస్థితిని ఎదుర్కొగలరని.. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే.. ఐఏఎఫ్ కీలక నిర్ణయాధికారిగా ఉంటుందని’ అన్నారు రాజ్‌నాథ్. (చదవండి: రఫేల్... గేమ్ చేంజర్) దేశంలోని పురాతన వైమానిక దళ స్థావరం అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫోరెన్స్ పార్లీ, డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ పాల్గొన్నారు. భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాల కోసం భారత్ 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ రఫేల్ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫేల్ చేరికతో భారత ఎయిర్‌ఫోర్స్ సామర్ధ్యం మరింత బలోపేతమైంది. -
అప్పటివరకు క్షణమొక యుగంలా గడిపాడు..
రాయ్‌పూర్: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చత్తీస్‌గఢ్‌లోని ఖారున్ నది పరవళ్లు తొక్కుతోంది. బిలాస్‌పూర్‌లోని ఖుతాఘాట్ డ్యామ్ వద్ద ఖారున్ నది మహోగ్ర రూపం దాల్చింది. అయితే, ఓ వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడో ఏమో తెలియదు గానీ ఆ డ్యామ్ మధ్యలో చిక్కుకుపోయాడు. రక్షించండని స్థానికులను వేడుకున్నాడు. కానీ, వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో స్థానికులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంతలోనే సమాచారం అందుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలీకాప్టర్‌తో రంగంలోకి దిగింది. బిలాస్పూర్ చేరుకుని కిందకు తాడు వేసి బాధితున్ని పైకి లాగి రక్షించింది. అప్పటివరకు క్షణమొక యుగంలా గడిపిన ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) తక్షణ స్పందనపై స్థానికులు సెల్యూట్ చేశారు. సోమవారం ఉదయం సంఘటన జరిగింది. -
బిలాస్పూర్: నదిలో చిక్కుకుపోయిన వ్యక్తి
-
దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం : సచిన్
ఢిల్లీ : క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్ భారత వైమానిక దళాన్ని(ఐఏఎఫ్) ప్రశంసలతో ముంచెత్తాడు. రఫేల్ యుద్ద విమానాల రాకతో భారతీయ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతంగా తయారైందని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. ఫ్రాన్స్‌లోని దసో ఏవియేషన్ తయారు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలను రూ. 59 వేల కోట్లకు కొనుగోలు చేయడానికి 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన అయిదు రఫేల్ యుద్ధ విమానాలు ఏడు వేల కి.మీ.లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా సచిన్ ట్విటర్ వేదికగా స్పందించారు.' అత్యాధునిక ఫైటర్ జెట్ రాఫెల్ విమానాలకు చేర్చినందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ యుద్ధ విమానాల చేరికతో మన దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతంగా తయారైంది. రఫేల్ విమానాల రాకతో రక్షణ దళాల్లో నూతన నవీకరణ మొదలైంది. జైహింద్' అంటూ ట్వీట్ చేశాడు.సచిన్ టెండూల్కర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌గా గౌరవ పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. Heartiest congratulations to #IndianAirForce for adding the state-of-the-art fighter jet Rafale, to our fleet. It’s a massive upgrade for our Defence Forces who are tirelessly protecting our nation in the skies. Jai Hind 🇮🇳 https://t.co/c6iIXjIzxd — Sachin Tendulkar (@sachin_rt) July 30, 2020 -
వెల్కమ్ రఫెల్
-
అంబాలా ఎయిర్‌బేస్‌కు రఫేల్ యుద్ధ విమానాలు
-
రఫేల్... గేమ్ చేంజర్
న్యూఢిల్లీ: చైనా అండదండలతో జిత్తులమారి పాకిస్తాన్ కూడా కయ్యానికి కాలుదువ్వుతుందన్న అంచనాలున్న నేపథ్యంలో భారత్ అమ్ములపొదిలోకి రఫేల్ చేరడంతో భారత్ వాయుసేన సామర్థ్యం మరింతగా పెరిగింది. సరిహద్దుల్లో చైనా ఆటలు ఇక సాగవని, రఫేల్ ఒక గేమ్ చేంజర్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా యుద్ధవిమానం చెంగ్డూ జే–20 కంటే రఫేల్ అత్యంత శక్తిమంతమైనదని చెబుతున్నారు. ‘‘జే–20 కంటే రఫేల్ అత్యంత శక్తిసామర్థ్యాలు కలిగినది. జే–20 అయిదో తరానికి చెందిన యుద్ధవిమానమని చైనా చెబుతున్నప్పటికీ దాని ఇంజిన్ మూడో జనరేషన్‌కి చెందినది. సుఖోయ్ యుద్ధ విమానం తరహా ఇంజిన్ అందులో ఉంది’’ అని రఫేల్ యుద్ధ విమానాన్ని పరీక్షించి చూసిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ నంబియార్ చెప్పారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దగ్గరున్న జే–20 అత్యంత ఆధునికమైనదైతే ఆ దేశం రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలను కొనాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. గగనతలం నుంచి గగనతలం లక్ష్యాలను ఛేదించే మీటియోర్ క్షిపణి వ్యవస్థ, ఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగిన స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ కలిగి ఉన్న రఫేల్ యుద్ధ విమానం దరిదాపుల్లోకి కూడా చైనా జే–20 రాలేదని బాలా కోట్ దాడుల వ్యూహకర్త, మాజీ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనూవా అభిప్రాయపడ్డారు. -
పక్షుల్లా వచ్చేశాయ్
చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ నిప్పులు చిమ్ముకుంటూ పిడుగులు కురిపించేందుకు శత్రువుల్ని గాలిదుమారంలా చుట్టేయడానికి మన దేశ వాయుసేనకు మరింత సత్తా చేకూర్చేలా జాతి యావత్తూ ఎదురుచూపులు ఫలించేలా ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రఫేల్ యుద్ధ విమానాలు రెక్కలు కట్టుకొని మరీ పక్షుల్లా వాలిపోయాయి. అంబాలా: రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన అయిదు రఫేల్ యుద్ధ విమానాలు ఏడు వేల కి.మీ.లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. రఫేల్ విమానాలు భారత్ గగనతలంలోకి ప్రవేశించగానే రెండు సుఖోయ్–30 యుద్ధ విమానాలు వాటికి ఎదురేగి వెంట వచ్చాయి. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియాతో పాటుగా భారత వైమానికి దళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు అంబాలా ఎయిర్‌బేస్‌లో స్వాగతం పలికారు. సంప్రదాయ బద్ధమైన వాటర్ కెనాన్లతో విమానాలకు సెల్యూట్ కార్యక్రమం నిర్వహించారు. శత్రువుల వెన్నులో వణుకు: రాజ్‌నాథ్ రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకోగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ట్వీట్లు చేశారు. పక్షులు సురక్షితంగా దిగాయంటూ ట్వీట్ చేశారు. చైనాకు హెచ్చరికలు పంపారు. మన ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించాలనుకునే వారికి రఫేల్ రాకతో వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. భారత్ భూభాగంలోకి రఫేల్ యుద్ధవిమానాలు దిగడం మన దేశ సైనిక చరిత్రలో నవ శకానికి నాందిగా అభివర్ణించారు. యుద్ధ విమానాల్లో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని రాజ్‌నాథ్ తన ట్వీట్లో వివరించారు. రఫేల్ యుద్ధ విమానాల రాక దేశానికే గర్వకారణమని హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఫ్రాన్స్‌లోని దసో ఏవియేషన్ తయారు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలను రూ. 59 వేల కోట్లకు కొనుగోలు చేయడానికి 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, రఫేల్ యుద్ధ విమానాల రావడంపై భారత వాయుసేనకి రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఒక్కో యుద్ధ విమానంపై రూ.526 కోట్లకు బదులుగా రూ.1670 కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సంస్కృతంలో ప్రధాని ట్వీట్ యుద్ధ విమానాలకు స్వాగతం చెప్తూ ప్రధాని మోదీ సంస్కృతంలో ట్వీట్ చేశారు. ‘జాతి రక్షణకు మించిన ధర్మం లేదు. దేశ భద్రతకు మించిన అత్యుత్తమ యజ్ఞం లేదు’ అని అన్నారు. కీర్తి ప్రతిష్టలతో సమున్నతంగా ఆకాశాన్ని తాకాలని ఆకాక్షించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హర్యానా: నేడు రఫెల్ యుద్ధ విమానాల రాక
-
రా.. రా.. రఫేల్!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్సు నుంచి బయలుదేరాయి. చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇవి చేరుకోవడంతో ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి ఈనెల 29వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సోమవారం సాయంత్రం దిగాయి. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో మొదటి రఫేల్ జెట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది. ఈ విమానం ప్రత్యేకతలు.. శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రఫేల్ జెట్లకు ఉంది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించగలిగే మెటియోర్, స్కాల్ప్ క్షిపణులను ఇది తీసుకెళ్లగలదు. క్షిపణి వ్యవస్థలతోపాటు ఈ జెట్లలో భారత్ కోరిన విధంగా..ఇజ్రాయెలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లో–బ్యాండ్ జామర్లు, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఇన్ఫ్రా రెడ్ సెర్చ్, ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి అదనపు ఏర్పాట్లున్నాయి. మొత్తం భారత్‌కు వచ్చే 36 రఫేల్ విమానాల్లో 30 యుద్ధ విమానాలు(ఒకటే సీటుండేది) కాగా, 6 శిక్షణ విమానాలు రెండు సీట్లుండేవి. ఈ తేడా తప్పితే రెండింటి సామర్థ్యం ఒక్కటే. ఒక స్క్వాడ్రన్ రఫేల్ జెట్లను అంబాలా ఎయిర్ బేస్‌లో. మరో స్క్వాడ్రన్‌ను బెంగాల్‌లోని హసిమారా బేస్‌లోనూ ఉంచనున్నారు. వీటి పరిరక్షణ, నిర్వహణ ఏర్పాట్లకు ఐఏఎఫ్ రూ.400 కోట్లు వెచ్చించింది. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచేందుకు రఫేల్‌లను మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో భారత్‌కు సంఘీభావ సూచకంగా వైద్య పరికరాలు, నిపుణులతో కూడిన విమానాన్ని కూడా ఫ్రాన్సు పంపిస్తోందని ఫ్రాన్సులోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
40 వేల మంది చైనా సైనికుల తిష్ట!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం విషయంలో భారత వాయుసేన చురుకుగా వ్యవహరించి ప్రత్యర్థికి బలమైన సందేశాన్ని పంపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కొనియాడారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధవిమానాలను వేగంగా మోహరించడం ద్వారా వాయుసేన తన యుద్ధ సన్నద్ధతను చాటిందని, తద్వారా పాకిస్థాన్‌పై భారత్ జరిపిన బాలాకోట్ దాడిని చైనాకు గుర్తు చేసిందని ఆయన బుధవారం ఢిల్లీలో మొదలైన వాయుసేస సదస్సులో అన్నారు. వాయుసేన ఉన్నతస్థాయి అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో దేశ ప్రజలందరి నమ్మకం త్రివిధ దళాలపై ఉందని రాజ్‌నాథ్ అన్నారు. సరిహద్దులు దాటి మరీ బాలాకోట్‌పై వాయుసేన జరిపిన దాడిని గుర్తు చేస్తూ వాయుసేన ఈ విషయంలో అత్యంత నైపుణ్యంతో వ్యవహరించిందని అన్నారు. (చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్) తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో వాయుసేన యుద్ధ విమానాల మోహరింపు ఇలాంటిదేనని మంత్రి పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించిన మంత్రి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా వాయుసేన సిద్ధంగా ఉండాలని కోరారు. శత్రువులను ఎదుర్కొనేందుకు వాయుసేన సన్నద్ధంగా ఉంటుందని సదస్సులో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధూరియా స్పష్టం చేశారు. 40 వేల మంది చైనా సైనికుల తిష్ట! తూర్పు లద్ధాఖ్ సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి మళ్లిస్తున్నామని పైకి చెబుతున్న చైనా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బలగాల మళ్లింపుపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా పీపుల్స్ రిబరేషన్ ఆర్మీ లెక్కచేయడం లేదు. ప్రస్తుతం అక్కడ దాదాపు 40,000 మంది చైనా సైనికులు తిష్ట వేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. భారీ ఎత్తున ఆయుధ సామగ్రిని సైతం కలిగి ఉన్నట్లు తెలియజేసింది. భారత్–చైనా కమాండర్ల స్థాయి చర్చలు గత వారంలోనే జరిగాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. అయినా చైనా తన పంథా మార్చుకోవడం లేదు. (చైనా కాన్సులేట్‌లో పత్రాల కాల్చివేత) -
రాత్రి వేళ ఆపరేషన్లకు ఐఏఎఫ్ రెడీ
సాక్షి, న్యూఢిల్లీ: ఓ వైపు చైనా బలగాలు వాస్తవాధీన రేఖ నుంచి రెండు కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లినా, భారత్ మాత్రం గల్వాన్ వ్యాలీ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగేస్తోంది. డ్రాగన్ దుర్భుద్దిని దృష్టిలో పెట్టుకుని ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేందుకు వైమానిక దళాలను సంసిద్ధంగా ఉంచింది. సుఖోయ్, చినూక్, అపాచీలతో సహా మిగ్–29 ఫైటర్ జెట్లు రాత్రి వేళల్లో ఆపరేషన్లకు సిద్ధంగా ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని పెద్దాఫీసరు మంగళవారం తెలిపారు. (చైనా యాప్‌ల బ్యాన్ దిశగా అమెరికా?) గతంలో రాత్రిపూట పైటర్ జెట్లతో గస్తీ ఇబ్బందికరంగా ఉండేదని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ చెప్పారు. చైనా మళ్లీ దుందుడుకు చర్యకు దిగితే దీటుగా బదులిచ్చేందుకే లడఖ్‌లోని ఎయిర్‌బేస్‌లు హైఅలర్డ్లో ఉన్నాయని మరో అధికారి వెల్లడించారు. గల్వాన్ ఘటన తర్వాత సైనికులను లడఖ్ తరలించడంలో వాయుసేనకు చెందిన సీ–17 గ్లోబ్ మాస్టర్ 3, సీ130జే సూపర్ హెర్క్యూలిస్ విమానాలు కీలకపాత్ర పోషించాయని ఆయన తెలిపారు. (భారీ కుంభకోణం : బ్యాంకు మాజీ సీఈఓ ఆత్మహత్య?) చైనా విదేశాంగ మంత్రితో భారత భద్రతా సలహాదారు ధోవల్ సమావేశం తర్వాత గల్వాన్ వ్యాలీ, హాట్ స్పింగ్స్తో పాటు గోగ్రా ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల మేర చైనా సైనికులు వెనక్కు వెళ్లారు. కీలకమైన పాంగ్యాంగ్ సో వద్ద గల ఫింగర్ పాయింట్ లో ఉంటున్న చైనా సైనికుల సంఖ్య తగ్గింది. -
దేనికైనా సిద్ధం!
-
ఎల్ఏసీలో సంసిద్ధంగా వైమానిక దళం
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా సైనిక సంపత్తిని తరలించడంతో భారత్ దీటుగా చర్యలు తీసుకుంటోంది. అమెరికా, రష్యా తయారీ యుద్ధ, రవాణా విమానాలను ఈ ప్రాంతంలో వాడుతోంది. కీలకప్రాంతాల్లో నిఘా విధులతోపాటు ఫార్వర్డ్ పోస్టులకు జవాన్లను, ఇతర ముఖ్యమైన పరికరాలు, సామగ్రిని ఇవి తరలిస్తున్నాయి. రష్యా తయారీ అత్యాధునిక సుఖోయ్–30 ఎంకేఐలు, ఎంఐజీ–29 యుద్ధ విమానాలు ఇప్పటికే గగనతలంలో పహారాకాస్తున్నాయి. సరిహద్దులకు సమీపంలోని ఈ వైమానిక కేంద్రంలో అమెరికా తయారీ రవాణా వాహనాలు సీ–17, సీ–130జేతోపాటు రష్యా తయారీ ఇల్యుషిన్–76, ఆంటొనొవ్–32లు కూడా ఇక్కడ మోహరించారు. తూర్పు లద్దాఖ్ సెక్టార్లో యుద్ధ విధుల కోసమే ప్రత్యేకించిన అపాచీ యుద్ధ విమానాలను వినియోగించుకుంటున్నారు. ఆర్మీ, ఐటీబీపీ బలగాలను సరిహద్దుల సమీపంలోకి తరలించేందుకు చినూక్, ఎంఐ–17వీఐ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మొత్తమ్మీద ఈ ఎయిర్ బేస్ విమానాల రాకపోకలతో సందడిగా మారింది. ‘ఈ ప్రాంతంలో ఈ ఎయిర్ బేస్ చాలా కీలకమైంది. యుద్ధ విధులతోపాటు, ఇతర అవసరాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరాలు అందుతుంటాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది’ ఓ అధికారి అన్నారు. -
జూలై నెలాఖరులోగా 6 రఫెల్ జెట్ ఫైటర్లు
సాక్షి, న్యూ ఢిల్లీ: భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వాయుసేన యుద్ధ విమానాలను సమకూర్చుకోడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన రఫెల్ యుద్ద విమానాలను జూలై నెలాఖరులోగా వాయుసేన పొందనున్నట్లు తెలుస్తోంది. పరిస్థిలను బట్టి ఐఎఎఫ్ పైలెట్లు ఫ్రాన్స్‌లో తీసుకుంటున్న శిక్షణ అనంతరం పూర్తి స్థాయిలో తయారు చేయబడిన ఆరు రఫెల్ యుద్ధ విమానులను భారత్ ఎయిర్ ఫోర్స్(ఐఎఎఫ్) పొందనుంది. నాలుగు రఫెల్ జెట్ విమానాల్లో మూడు ట్విన్ సీటర్ వెర్షన్‌కి సంబంధించిన పైలెట్లు అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో శిక్షణ పొందుతున్నారు. భారత్‌లో ఇది మొదటి రఫెల్ జెట్ విమానాల ఎయిర్ బేస్. రెండో రఫెల్ ఎయిర్ బేస్ పశ్చిమ బెంగాల్‌లోని హషిమారాలో ఉన్నది. (‘చైనా, పాక్ కుట్రను అప్పట్లోనే బయటపెట్టారు’) చైనా సరిహద్దులో ఉద్రిక్తత, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే నేపథ్యంలో ఈ యుద్ధ విమానాలు భారత్‌కు చేరనున్నాయి. రఫెల్ యుద్ధ విమానాలు జూలై నెలాఖరులో భారత్ చేరుతాయని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. అదే విధంగా మొదటి ఎయిర్ ఫోర్స్ పైలెట్ల బృందం ట్రైనింగ్ పూర్తి కాగా, రెండో పైలెట్ల బృందం శిక్షణ లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2016లో భారత్.. 36 రఫెల్ యుద్ద విమానాలకు సంబంధించి ఫ్రాన్స్‌తో రూ.60 వేల కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. -
సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు..!
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వన్ లోయపై పొరుగు దేశం చైనా ఆక్రమణకు దిగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో చైనా ఆగడాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది. తన అమ్ములపొదిలో దాగిఉన్న అస్త్రాలను బయటకు తీస్తోంది. భారత సైన్యంలో కీలకమైన సుఖోయ్-300 ఎయ్కేఐ, మిగ్-29, జాగ్వార్ ఫైట్ జెట్స్‌ను రంగంలో దింపింది. అలాగే అమెరికా నుంచి దిగుమతి చేసుకుని అత్యాధునికమైన యుద్ధ విమానం అపాచీలను సైతం చైనా సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీనగర్, అవంతిపుర, లేహ్ ప్రాంతాల్లో చైనా చొరబాట్లను పసిగట్టేందుకు వాయు సేనను సైతం సన్నద్ధం చేసింది. మరోవైపు హిందు మహాసముద్ర తీరంలో నౌకాదళాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత వైమానిక దళాధిపతి చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా గురు, శుక్రవారాల్లో లేహ్, శ్రీనగర్‌ల్లో పర్యటించారు. సరిహద్దుల్లో ఎయిర్‌ఫోర్స్ సన్నద్ధతను పరిశీలించారు. (వాయుసేన.. సిద్ధంగా ఉండాలి) మరోవైపు భారత్‌కు ధీటుగా చైనా సైతం భారీగా సైన్యాన్ని, యుద్ధ విమానాలను సరిహద్దుకు తరలిస్తోంది. వీటి గర్జనలు, సైనికుల కవాతుతో చల్లని హిమాలయ కొండలు వేడెక్కుతున్నాయి. పాంగాంగ్ సరస్సు సమీపంలో డ్రాగన్ సైనిక క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారత్ సైతం మొత్తం 3400 కిమీ గల సరిహద్దుల్లో ఆర్మీని అప్రమత్తం చేసినట్లు సైనిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇరు దేశాలు సైనిక దళాలను సరిహద్దుల్లోకి తరలిస్తుండటంతో యుద్ధ వాతావరణం కనబడుతోంది. అయితే సైనిక సన్నద్ధపై మాత్రం కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) కాగా ఈనెల 15 జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ చీఫ్ భారత్-చైనా సరిహద్దుల్లో పర్యటించారు. మరోవైపు సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చైనా దురాక్రమనకు దిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ క్లిష్ట సమయంలో అన్ని పక్షాలు కేంద్ర ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మద్దతుగా నిలవాలని మోదీ పిలుపునిచ్చారు. ఇంచు భూభాగం కూడా వదలుకునే ప్రసక్తే లేదని మోదీ ప్రకటించారు. ఇక ప్రధాని మోదీ ప్రకటకపై చైనా ఘాటుగా స్పందించింది. గాల్వన్ లోయ ముమ్మాటికీ చైనాలో అంతర్భాగమేనని మరోసారి ఘంటాపథంగా స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం మరో ప్రకటన విడుదల చేసింది. భారత ఆర్మీ వాదిస్తున్నట్లు గాల్వన్ లోయ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)కి అవతలవైపు లేదని, తమ భూభాగంలోనే ఉందని పేర్కొంది. అంతేకాకుండా భారతకు చెందిన పదిమంది జవాన్లను చైనా నిర్బంధించిందంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, తమ కస్టడీలో ఎవరూ లేరని స్పష్టం చేసింది.