జాయింట్‌ ఆపరేషన్‌ సూపర్‌ సక్సెస్‌ | IAF Shares Visuals of C-17 Precision Airdrop from Joint Op with Navy | Sakshi
Sakshi News home page

జాయింట్‌ ఆపరేషన్‌ సూపర్‌ సక్సెస్‌

Published Mon, Mar 18 2024 5:54 AM | Last Updated on Mon, Mar 18 2024 5:54 AM

IAF Shares Visuals of C-17 Precision Airdrop from Joint Op with Navy - Sakshi

సోమాలియా పైరేట్ల ఆట కట్టించిన భారత వైమానిక దళం, నావికాదళం  

న్యూఢిల్లీ: కచ్చితమైన వ్యూహం, సైనిక దళాల మధ్య సరైన సమన్వయం, పటిష్టమైన ప్రణాళిక ఉంటే ఎలాంటి ఆపరేషన్‌ అయినా విజయవంతం కావాల్సిందే. భారత వైమానిక దళం, నావికాదళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌తో సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టయ్యింది.

సోమాలియా పైరేట్లు మూడు నెలల క్రితం హైజాక్‌ చేసిన సరుకు రవాణా నౌక ‘ఎంవీ రూయెన్‌’ను భారత వైమానిక దళం, నావికాదళం జాయింట్‌ ఆపరేషన్‌ ద్వారా విజయవంతంగా విడిపించాయి. ఈ నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను నావికాదళం అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.

నౌకలో బందీలుగా ఉన్న 17 మంది సిబ్బందిని విడిపించారు. నౌకలో రూ.8.29 కోట్ల విలువైన 37,800 కోట్ల టన్నుల సరుకు ఉందని, నౌకను ఇండియాకు చేరుస్తున్నామని నావికాదళం వెల్లడించింది. ఎంవీ రూయెన్‌ షిప్‌ను సముద్రపు దొంగల చెర నుంచి విడిపించడంలో భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌)కు చెందిన సి–17 టాక్టికల్‌ రవాణా విమానం కీలకంగా వ్యవహరించింది.

జాయింట్‌ ఆపరేషన్‌లో భాగంగా రెండు కాంబాట్‌ రబ్బరైజ్డ్‌ రైడింగ్‌ క్రాఫ్ట్‌(సీఆర్‌ఆర్‌సీ) బోట్లను, ‘మార్కోస్‌’ మెరైన్‌ కమాండోలను ఈ విమానం ద్వారా భారత తీరానికి 2,600 కిలోమీటర్ల దూరంలో ఆరేబియా సముద్రంపైకి క్షేమంగా జారవిడిచారు. కమాండోలు అపూర్వమైన ధైర్యసాహసాలతో సముద్రపు దొంగలను లొంగదీసుకున్నారు. మొత్తం ఆపరేషన్‌ 40 గంటలపాటు జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement