joint operation
-
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
జాయింట్ ఆపరేషన్ సూపర్ సక్సెస్
న్యూఢిల్లీ: కచ్చితమైన వ్యూహం, సైనిక దళాల మధ్య సరైన సమన్వయం, పటిష్టమైన ప్రణాళిక ఉంటే ఎలాంటి ఆపరేషన్ అయినా విజయవంతం కావాల్సిందే. భారత వైమానిక దళం, నావికాదళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌తో సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టయ్యింది. సోమాలియా పైరేట్లు మూడు నెలల క్రితం హైజాక్ చేసిన సరుకు రవాణా నౌక ‘ఎంవీ రూయెన్’ను భారత వైమానిక దళం, నావికాదళం జాయింట్ ఆపరేషన్ ద్వారా విజయవంతంగా విడిపించాయి. ఈ నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను నావికాదళం అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నౌకలో బందీలుగా ఉన్న 17 మంది సిబ్బందిని విడిపించారు. నౌకలో రూ.8.29 కోట్ల విలువైన 37,800 కోట్ల టన్నుల సరుకు ఉందని, నౌకను ఇండియాకు చేరుస్తున్నామని నావికాదళం వెల్లడించింది. ఎంవీ రూయెన్ షిప్‌ను సముద్రపు దొంగల చెర నుంచి విడిపించడంలో భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్)కు చెందిన సి–17 టాక్టికల్ రవాణా విమానం కీలకంగా వ్యవహరించింది. జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా రెండు కాంబాట్ రబ్బరైజ్డ్ రైడింగ్ క్రాఫ్ట్(సీఆర్ఆర్సీ) బోట్లను, ‘మార్కోస్’ మెరైన్ కమాండోలను ఈ విమానం ద్వారా భారత తీరానికి 2,600 కిలోమీటర్ల దూరంలో ఆరేబియా సముద్రంపైకి క్షేమంగా జారవిడిచారు. కమాండోలు అపూర్వమైన ధైర్యసాహసాలతో సముద్రపు దొంగలను లొంగదీసుకున్నారు. మొత్తం ఆపరేషన్ 40 గంటలపాటు జరిగింది. -
Azadi Ka Amrit Mahotsav: పంజాబ్‌లో ఉగ్ర ముఠా గుట్టు రట్టు
చండీగఢ్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఉగ్రవాద ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు టెర్రరిస్టులను అరెస్టు చేశారు. వారినుంచి హాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక మందుపాతరలు, పిస్టళ్లు, 40 బులెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ‘‘వీరికి పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుంది. అంతేగాక కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన కరడుగట్టిన భారత సంతతి గ్యాంగ్స్టర్లు అర్‡్ష డల్లా, గుర్జంత్ సింగ్‌లతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి’’ అని వివరించారు. పంద్రాగస్టు సందర్భంగా పేలుళ్లకు పాల్పడి దేశంలో కల్లోలం సృష్టించాల్సిందిగా వీరికి ఆదేశాలున్నట్టు చెప్పారు. నలుగురినీ ఐదు రోజుల రిమాండ్‌లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. జైషే ఉగ్రవాది అరెస్టు లఖ్‌నవూ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హబీబుల్ ఇస్లాం అలియాస్ సైఫుల్లా అనే 19 ఏళ్ల యువకున్ని యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్టు చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌కు చెందిన జైషే సభ్యులతో అతను సోషల్ మీడియా ద్వారా లింకులు పెట్టుకున్నట్టు తెలిపారు. సస్పెండెడ్ బీజేపీ నేత నుపుర్ శర్మ హత్య కోసం జైషే పంపిన మహ్మద్ నదీమ్‌ను ఇటీవల ఏటీఎస్ అరెస్టు చేసింది. అతనిచ్చిన సమాచారం ఆధారంగా సైఫుల్లాను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘వర్చువల్ ఐడీలు సృష్టించడంలో సైఫుల్లా దిట్ట. నదీమ్‌తో పాటు పాక్, అఫ్గాన్‌కు చెందిన ఉగ్రవాదులకు 50కి పైగా వాటిని అందజేశాడు’’ అని వివరించింది. -
200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: అంతర్జాతీయ మార్కెట్లో రూ. 200 కోట్ల విలువ చేసే 40 కేజీల హెరాయిన్‌ను పంజాబ్ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు కలసి సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. భారత్–పాక్ సరిహద్దు దగ్గర్లోని అమృత్‌సర్‌లో ఉన్న పంజ్‌గ్రైన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు అమృత్సర్ (రూరల్) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఘరిందా ప్రాంతానికి చెందిన అక్రమ రవాణాదారు నిర్మల్ సింగ్ పాకిస్తాన్ నుంచి రానున్న హెరాయిన్‌ను తీసుకుంటాడని పోలీసులకు సమాచారం అందింది. భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు ద్వారా ఈ అక్రమరవాణా జరగనుందని గుర్తించిన పోలీసులు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు సమాచారం ఇచ్చారు. దీంతో ఇరు బలగాలు కలసి అక్రమరవాణా పనిపట్టారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన 40.810 కేజీల హెరాయిన్(39 పాకెట్లు), 180 గ్రాముల ఓపియం, రెండు ప్లాస్టిక్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పాకిస్తాన్లో తయారు చేసినట్లు గుర్తించారు. నిర్మల్ సింగ్‌ను పట్టుకునేం దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదైనట్లు తెలిపారు. -
ఏవోసీబీలో కూంబింగ్ ముమ్మరం
సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా–ఛత్తీస్‌గఢ్ (ఏవోసీబీ) సరిహద్దుల్లోని ట్రై జంక్షన్ ప్రాంతంలో పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతల కదలికల నేపథ్యంలో మన్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మంగళవారం, విశాఖ మన్యంలో బుధవారం జరిగిన వరుస ఎన్కౌంటర్లతో మన్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎదురుకాల్పుల నుంచి కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్ అలియాస్ మహేందర్‌రెడ్డి, అరుణ తప్పించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి అర కి.మీ. దూరంలోని మరో ప్రాంతంలో వారు ఉండటంతో కాల్పుల మోత వినగానే తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది మావోయిస్టుల రక్షణతో వారు ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుల్లోని కట్ ఆఫ్ ఏరియాలోని ట్రై జంక్షన్ వైపు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకే వారి కోసం మూడు వైపుల నుంచి కుంబింగ్‌ను ముమ్మరం చేశారు. ట్రై జంక్షన్‌లోనే అగ్రనేతలు? ఆంధ్రా–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (ఏఓబీజెడ్‌సీ) ఆధ్వర్యంలో మళ్లీ కేడర్‌ను బలోపేతం చేసుకోవాలని మావోయిస్టులు సన్నద్ధమవుతన్నట్లు నిఘా వర్గాలకు స్పష్టమైన సమాచారం అందింది. జూన్–జులైలలో అందుకోసం పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారని కూడా పసిగట్టాయి. దీంతో బస్తర్ కేంద్రంగా మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు గత నెలలో సమావేశమైనట్లు సమాచారం. వరుస లొంగుబాట్లు, ఆనారోగ్య సమస్యలతోపాటు కరోనాతో కూడా మావోయిస్టులు గత కొద్దిరోజులుగా బలహీనపడిన నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా గాలింపు చర్యలు చేపట్టాలని వారు నిర్ణయించారు. శిక్షణా తరగతుల నిర్వహణకు ఇతర ప్రాంతాల నుంచి అగ్రనేతలు వచ్చేవరకు వేచి చూడాలని ముందుగానే నిర్ణయించారు. ఇంతలో అగ్రనేతలు చేరుకున్నారన్న సమాచారం రావడంతో గ్రేహౌండ్స్, కోబ్రా, ఎస్పీఎఫ్, ఐటీబీటీ, బీఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా జూన్ రెండోవారం నుంచి కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో.. ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో సోమ, మంగళవారాల్లో జరిగిన ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం తీగలంమెట్ట వద్ద బుధవారం ఎన్కౌంటర్లో ఇద్దరు డివిజన్ కమిటీ సభ్యులతోపాటు ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనలతో మల్కనగిరి, విశాఖ మన్యంలలో ఎన్కౌంటర్లపై మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించి కూంబింగ్‌ను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అరుణ్, అరుణలు 40 మంది మావోయిస్టుల రక్షణతో ట్రై జంక్షన్‌కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దాంతోపాటు ఏఓబీజెడ్‌సీ ఇన్చార్జ్ డుడుమలతోపాటు మరికొందరు అగ్రనేతలు ఆ ప్రాంతంలోనే ఉండొచ్చన్నది పోలీసు ఉన్నతాధికారుల అంచనా. అగ్రనేతల్లో ఎవరు ఉండొచ్చన్న దానిపై అప్పుడే ఏమీ చెప్పలేమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కానీ, ఆ ప్రాంతంలో భారీస్థాయిలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని.. ఇన్ఫార్మర్లు చెప్పినదాన్ని బట్టి ఒకరిద్దరు అగ్రనేతలు కూడా ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. దీంతో ఏఓసీబీలో పోలీసు బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. -
ఉమ్మడిగా ఉద్యమిస్తాం
లక్డీకాపూల్: తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీలు ఐక్యతా రాగాన్ని ఆలపించాయి. రాష్ట్ర ప్రజల సమస్యలపై ఉమ్మడి పోరాటాన్ని కొనసాగించేందుకు ఉమ్మడిగా పోరాడతామని ఆయా పార్టీ అధినేతలు ప్రొఫెసర్ కోదండరాం, డాక్టర్ చెరుకు సుధాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి లక్ష్యాల కోసం తాము కలిసి పోరాడనున్నట్లు వెల్లడించారు. ఉద్యమకారులు, అట్టడుగు వర్గాలకు పాలన, నిర్ణయాధికారం ద్వారా అసమానతలు లేని తెలంగాణ దిశగా ఉద్యమించనున్నట్లు పేర్కొ న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం కలుషితమైపోయిందని, ఎన్నికల్లో డబ్బే ప్రధానాంశంగా మారిందని కోదండరాం అన్నారు. ఈ తరుణంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ఇంటి పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తమకు భేషజాలు లేవని, ఎవరితోనైనా కలిసి పనిచేస్తామ న్నారు. ప్రజాపక్షంగా సమస్యల పరిష్కారా నికి నిర్మాణాత్మక పాత్రను పోషించనున్నట్లు తెలిపారు. ఇందుకు టీజేఎస్, ఇంటి పార్టీ కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. -
ముగ్గురు అనుమానిత ఉగ్రవాదలు అరెస్ట్
-
డ్రగ్స్ మాఫియాపై జాయింట్ ఆపరేషన్, 12మంది అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని శివారు ప్రాంతాల్లో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న డ్రగ్స్ మాఫియాపై బుధవారం ఎస్ఓటీ, నార్కొటిక్స్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ జరిపింది. ఈ అపరేషన్‌లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన పలురకాల డ్రగ్స్ స్థావరాలపై అధికారులు ఒక్కసారిగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో నిల్వ ఉంచిన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ మాఫియా స్మగ్లింగ్ కార్యాకలపాలకు పాల్పడుతుందన్న సమాచారం మేరకు అధికారులు జాయింట్ ఆపరేషన్ చేసి మహారాష్ట్ర, హైదరాబాద్, చైన్నై గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 12మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారినుంచి 2 లక్షల నగదు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్ సిటీ పోలీస్ పేర్కొన్నారు. -
శేషాచలం కొండల్లో పోలీసులు, అటవీ సిబ్బంది జాయింట్ ఆపరేషన్
సాక్షి, తిరుపతి: శేషాచలం కొండల్లో ఎర్ర చందనం దొంగలతో అటవీ, పోలీసు సిబ్బంది యుద్ధానికి సన్నద్ధమయ్యూరు. జాయింట్ ఆపరేషన్‌లో భాగం గా శనివారం నుంచి ‘ఎర్ర’ దొంగలవేట ప్రారంభమైంది. తిరుపతి అర్బన్ ఎస్పీ ఎస్వి రాజ శేఖర్ బాబు వీరితో సమావేశమై వ్యూహ రచన చేసిన విషయం తెలిసిందే. వీరికి కొన్ని విచక్షణాధికారాలు ఇవ్వడంతో కూంబింగ్ ప్రారంభించారు. తెల్లవారు జామున 5.30 గంటలకు వివిధ మార్గాల ద్వారా 145 మంది పోలీసులు అటవీ సిబ్బందితో కలిసి అడవుల్లోకి వెళ్లారు. తిరుపతి, భాకరాపేట, రేణిగుంట, కడప, రాజంపేట మీదుగా శేషాచలం అడవిలోకి చేరుకున్నారు. భాకరాపేట మీదుగా నామాల గుండుకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో 15 మంది ఎర్ర కూలీలను పోలీసులు గుర్తించారు. పోలీసులను చూడగానే వారు పారిపోయే ప్రయత్నం చేయగా, పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి పట్టుపడగా, మిగిలిన వారు పరారయ్యూరు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. అదే విధంగా భారీ ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. తమిళనాడులోని వేలూరు, తిరునల్వేలి జిల్లాల ఎస్పీలతో తిరుపతి అర్బన్ ఎస్పీ తరుచూ మాట్లాడుతూ, అక్కడ నుంచి కూలీలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తుపాకులతో వేట ప్రారంభించిన విషయాన్ని తమిళ కూలీలు ఉండే గ్రామాల్లో ప్రచారం చేరుుస్తున్నారు. అటవీ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ఇక ఎర్ర కూలీలను, స్మగ్లర్లను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కీలక స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామన్నారు. చంద్రగిరిలో మరో స్మగ్లర్ అరెస్ట్ చంద్రగిరి, న్యూస్‌లైన్: శ్రీనివాస మంగాపురం రైల్వేగేట్ సమీపంలో శనివారం ఆరుగురు ఎర్ర కూలీలను అరెస్టు చేసి, రెండు వాహనాలు, 19 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ నాగభూషణం వివరాల మేరకు.. ముందుగా అందిన సమాచారం మేరకు సీఐ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. శ్రీనివాస మంగాపురం రైల్వేగేట్ వద్ద టాటా ఇండికా కారు, లగేజీ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు ఉన్నారుు. అక్కడ ఆరుగురుని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విచారణలో ఒకరు ప్రధాన స్మగ్లర్‌గా గుర్తించారు. తిరుత్తణికి చెందిన దైవశిఖామణ అలియాస్ తిరుత్తణి మణిగా తేలింది. వాహనాల సహా 19 ఎర్రదుంగల విలువ రూ.25 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిచించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.