సాక్షి, తిరుపతి: శేషాచలం కొండల్లో ఎర్ర చందనం దొంగలతో అటవీ, పోలీసు సిబ్బంది యుద్ధానికి సన్నద్ధమయ్యూరు. జాయింట్ ఆపరేషన్‌లో భాగం గా శనివారం నుంచి ‘ఎర్ర’ దొంగలవేట ప్రారంభమైంది. తిరుపతి అర్బన్ ఎస్పీ ఎస్‌వి రాజ శేఖర్ బాబు వీరితో సమావేశమై వ్యూహ రచన చేసిన విషయం తెలిసిందే. వీరికి కొన్ని విచక్షణాధికారాలు ఇవ్వడంతో కూంబింగ్ ప్రారంభించారు. తెల్లవారు జామున 5.30 గంటలకు వివిధ మార్గాల ద్వారా 145 మంది పోలీసులు అటవీ సిబ్బందితో కలిసి అడవుల్లోకి వెళ్లారు. తిరుపతి, భాకరాపేట, రేణిగుంట, కడప, రాజంపేట మీదుగా శేషాచలం అడవిలోకి చేరుకున్నారు. భాకరాపేట మీదుగా నామాల గుండుకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో 15 మంది ఎర్ర కూలీలను పోలీసులు గుర్తించారు. పోలీసులను చూడగానే వారు పారిపోయే ప్రయత్నం చేయగా, పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు.
ఒక వ్యక్తి పట్టుపడగా, మిగిలిన వారు పరారయ్యూరు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. అదే విధంగా భారీ ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. తమిళనాడులోని వేలూరు, తిరునల్వేలి జిల్లాల ఎస్పీలతో తిరుపతి అర్బన్ ఎస్పీ తరుచూ మాట్లాడుతూ, అక్కడ నుంచి కూలీలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తుపాకులతో వేట ప్రారంభించిన విషయాన్ని తమిళ కూలీలు ఉండే గ్రామాల్లో ప్రచారం చేరుుస్తున్నారు. అటవీ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ఇక ఎర్ర కూలీలను, స్మగ్లర్లను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కీలక స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామన్నారు.
చంద్రగిరిలో మరో స్మగ్లర్ అరెస్ట్
చంద్రగిరి, న్యూస్‌లైన్: శ్రీనివాస మంగాపురం రైల్వేగేట్ సమీపంలో శనివారం ఆరుగురు ఎర్ర కూలీలను అరెస్టు చేసి, రెండు వాహనాలు, 19 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ నాగభూషణం వివరాల మేరకు.. ముందుగా అందిన సమాచారం మేరకు సీఐ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. శ్రీనివాస మంగాపురం రైల్వేగేట్ వద్ద టాటా ఇండికా కారు, లగేజీ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు ఉన్నారుు. అక్కడ ఆరుగురుని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విచారణలో ఒకరు ప్రధాన స్మగ్లర్‌గా గుర్తించారు. తిరుత్తణికి చెందిన దైవశిఖామణ అలియాస్ తిరుత్తణి మణిగా తేలింది. వాహనాల సహా 19 ఎర్రదుంగల విలువ రూ.25 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిచించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
శేషాచలం కొండల్లో పోలీసులు, అటవీ సిబ్బంది జాయింట్ ఆపరేషన్
Published Sun, Dec 22 2013 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement
Advertisement