seshachalam hills
-
శేషాచలంలో సాగర ఘోష!
ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ సంగీత విద్వాంసుడికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి ‘అలాగే, అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని’ చెప్పి పంపాడు.ప్రయాణం మొదలైనప్పటినుంచీ ఆ సాధకుల్లో ఓ సందేహం మొదలయ్యింది. ‘తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు, మరి గురువు ఎందుకు అలా చెప్పాడో...’ అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను విచారించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. ‘అయినా గురువు తప్పు చెప్పడు కదా!’ అని ఆలోచించారు. ‘ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం!’ అనుకున్నారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడమంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, వారికి గురువు చెప్పింది గుర్తుకొచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా వీరి వైపు వింతగా చూశారు. ‘తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా, సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని’ బయలుదేరారు. ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకుని కొండ దిగడం ్రపారంభించారు.వారికి దారిలో ఏడవ మైలు వద్ద ఆకాశం ఎత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. భక్తితో నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చున్నారు. వారి చెవులకు... లీలగా... మైకులో నుంచి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము... పదివేల శేషుల పడగల మయము‘ అనే అన్నమాచార్య కీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన ‘సముద్రం’ లోతు తెలిసింది. ఏడు స్వరాలు ఏడుకొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు.‘మనమనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండల దగ్గర ఉంది’ అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే ముప్పది రెండువేల సంకీర్తనలు తెలుగులో అందించిన ఆ పదకవితా పితా మహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణలు చేస్తూ కొండ దిగారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
తిరుమల: ఎట్టకేలకు చిక్కిన చిరుత.. ఆపరేషన్ సక్సెస్
సాక్షి, తిరుపతి: తిరుమల శేషాచలం కొండల్లో ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసింది. వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు ఆదివారం రాత్రి బోనులో చిక్కింది. దీంతో ఇకపై నడకదారి మార్గంలో భక్తులు ప్రశాంతంగా సంచరించే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో చిరుత.. బోను దాకా వచ్చిపడకుండా పోతోంది అది. అలా వారం గడిచింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిక్కింది. ఈ చిరుత పట్టివేతతో.. ఆపరేషన్ చిరుత ముగిసినట్లేనని అధికారులు అంటున్నారు. చిరుతల పట్టివేత పూర్తి కావడంతో.. ఇకపై భక్తులు ప్రశాంతంగా నడకమార్గంలో సంచరించే అవకాశం ఉందని అంటున్నారు. టీటీడీ అప్రమత్తత చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. విజయవంతమయ్యారు. మరో 500 ట్రాప్ కెమెరాల ఏర్పాటు చిరుత చిక్కిన ప్రదేశాన్ని సీసీఎఫ్‌వో నాగేశ్వరరావు పరిశీలించారు. ‘‘చిరుతను ఎస్వీ జూపార్క్‌కు తరలించాం. ఇది మగ చిరుత. రెండేళ్ల వయసుంది. నడక మార్గంలో ట్రాప్ కెమెరాలు నిరంతరం ఉంటాయి. నడకమార్గంలో ప్రస్తుతం 300 కెమెరాలు ఉన్నాయి. మరో 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. -
తిరుమల: శేషాచలం.. సంజీవని ఔషధ వనం
శేషాచలం అంటే ఔషధ వనం. ఇప్పటివరకూ మనకు శేషాచల కొండలు అంటే వేంకటేశ్వర స్వామి నిలయం, ఎర్రచందనం అడవులని మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ అపర సంజీవని వంటి వన మూలికలు, ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఆస్పత్రులే లేని కాలంలో రాజులు, జమీందార్లకు ఈ శేషాచలమే వైద్యశాల. ఔషధ మొక్కలు.. వనమూలికలతోనే ఎలాంటి జబ్బులైనా నయం చేసేవారు. నిజానికి ఆ నాటి నుంచి నేటికీ అడవిలో లభించే ఈ ఔషధ మొక్కల గురించి కొందరికి మాత్రమే తెలుసు. నేటి తరానికి ఒకింత విడ్డూరం అనిపించినా.. నాటి ఆయుర్వేద వైద్య మూలాలే నేటి అల్లోపతి, హోమియోపతి, ఆయుష్ తదితర అన్ని రకాల వైద్యానికి ఆధారం. ఇంతటి అద్భుతమైన ఔషధ మొక్కలు, వనమూలికలు, వృక్షాలను తనలో దాచుకున్న శేషాచలం కొండల్లో అన్వేషణ సాగిస్తే తెలిసిన విశేషాలు.. తిరుపతి అలిపిరి.. శేషాచల అటవీ ప్రాంతం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లా వ్యాప్తంగా 526చదరపు కిలో మీటర్లు (82,500 హెక్టార్ల)లో వ్యాపించి ఉంది. దీన్ని రెండు విభాగాలుగా విభజించారు. శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్కు–353చదరపు కిలోమీటర్లు టీటీడీ పర్యవేక్షణలో, వన్యప్రాణి అభయారణ్యం – 526చదరపు కిలోమీటర్లు అటవీశాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ఈశాన్య పర్వత శ్రేణుల్లో భాగమైన శేషాచలం కొండలు ఎన్నో వింతలు, విశేషాలు, చరిత్రలు, అద్భుతాలకు ఆలవాలం. దేవతా మూర్తులకు నిలయంగా నానుడిలో ఉన్న శేషాచలం కొండలను బొటానికల్ స్వర్గం అని పరిశోధకులు పిలుస్తుంటారు. అత్యంత అరుదైన ఔషధ, వన మూలికలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు మానవాళికి ఆయువుతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. ఈ కారడవిలో 176 కుటుంబాలకు చెందిన 1500కు పైగా జాతుల మొక్కలను పరిశోధకులు గుర్తించారు. ప్రతి మూలిక, మొక్క కూడా ఏదో ఒకరకమైన మానవ, జంతు, పక్షు వ్యాధులను నయం చేసే గుణాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ వ్యతికినా దొరకని అతి అరుదైన జాతి వృక్షాల్లో ఎర్రచందనం ఇక్కడి ప్రత్యేకత. దీంతోపాటు జాలారీ, తంబ జాలారి, తెల్లకరక, మొగిలి వంటివి ఇక్కడ దర్శనమిస్తాయి. శేషాచల అడవుల్లో దొరికే ఈ అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులపై నిత్యం జాతీయ, అంతర్జాతీయ పరిశోదనలు జరుగుతుండటం విశేషంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ గుర్తింపు అరుదైన పక్షి, జంతు, వృక్ష జాతులు ఇక్కడ మాత్రమే దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలోనే శేషాచల పర్వత శ్రేణిని బయోస్పియర్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ సంచరించేందుకు అడవులపై ఆధారపడి జీవనం సాగించే వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. దీనినే బఫర్ జోన్ అంటారు. బయోస్పియర్ జాతీయ, అంతర్జాతీయ పరిశోధనలు జరుగతూనే ఉంటాయి. శేషాచల అడవులకు అంతర్జాతీయ గుర్తింపు రావటం విశేషం. ఊడుగ చెట్టు(అంకోలము) వేర్లు, పండ్లు, విత్తనాలను ఉపయోగించి ఆయుర్వేద మందులు తయారుచేస్తారు. అలంగియేసి కుటుంబానికి చెందినది ఈ మొక్క. ఆంగ్లంలో అలంగియం సాలి్వఫోలియం అని పిలుస్తారు. ఆ్రస్టింజెంట్, ఆంథెలి్మంటిక్, డయేరియా, లెప్రసీ, ఎరిసిపెలాస్, చర్మ వ్యాధులు, మూత్ర సంబంధిత రుగ్మతలు, జ్వరము, రక్తస్రావము, వెఱి< కుక్కలు, కండ్లకలక తదితర వ్యాధుల నివారణకు దీనిని ఉపయోగిస్తారు. గిల్లతీగ గిల్లతీగ ప్రత్యేకించి శేషాచలంలోని తలకోన అటవీ ప్రాంతంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇది లయనాసి తీగల జాతికి చెందినది. చెట్టుకు చెట్టును ఆధాంరం చేసుకొని అడివంతా అల్లుకుంటూపోతుంది. ఇది మూడు వతాబ్దాల నాటి దని పరిశోధకులు చెబుతున్నారు. తలకోన ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల మేర అల్లుకుపోవడాన్ని చూడవచ్చు. దీని చుట్టుకొలత 260 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ తీగకు కాసే కాయలు సుమారు 100సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. వృక్ష కాయలలో అతిపెద్ద కాయగా పరిగణిస్తారు. కొండజాతి ప్రాంతీయులు దీని కాయల్లో ఉన్న గుజ్జును తొలిగించి అగ్గిపెట్టెగా వాడుకుంటారు. మరి కొందరు నసిం డబ్బాగాను వాడతారు. తీగ బెరడులో సఫోనిక్ అనే చేపల చంపే పదార్థం ఉంటుంది. నేలవేము ఈ రకం చెట్టు శేషాచలం అడవిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మొక్కననుయాంటిపైరేటిక్, యాంటిపెరియాడిక్, యాంటీ ఇన్ప్ల్లమేటరీ, అల్సర్లు, దీర్ఘకాలిక జ్వరాలు, బ్రాంకైటిస్, చర్మ వ్యాధులు, లెప్రసీ, పేగు పురుగులు, హేమోరాయిడ్స్, కామెర్లు, కడుపు పూతలకు వినియోగిస్తారు. ఇది అకాంతసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని ఇంగ్లీషులో ఆండ్రొగ్రాఫిస్ పానిక్యులేటా అని అంటారు. తెల్ల కరక శేషాచలంలో మాత్రమే అరుదుగా దొరికే ఈ తెల్లకరకను మూత్రవిసర్జన, వాపులు, యాంటిపైరేటిక్, ప్రక్షాళన, విరేచనాలు, పెప్టిక్ అల్సర్లు, మధుమేహం, వెనిరియల్ వ్యాధులు, దగ్గు, జలుబు, విరేచనాలు, పగుళ్లుకు వాడతారు. కాంబ్రెటేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను ఆంగ్లంలో టెర్మినలియా పల్లిడా అని పిలుస్తారు. దీనిలో పండు భాగాన్ని వినియోగించి మందు తయారు చేస్తారు. నక్కతోక ఇది అకాంతసి కుటుంబానికి చెందిన మొక్క. నక్కతోక మొక్కలోని అన్ని భాగాలు పలు రకాల ఆయుర్వే మందులకు వినియోగిస్తారు. దీనిని ఆంగ్లంలో ఎక్బోలియం వైరైడ్ అంటారు. గౌట్, డైసూరియా, స్ట్రిక్చర్, కామెర్లు, మెనోరాగియా, రుమాటిజం. కణితుల నివా రణకు ఉపయోగిస్తారు. మొగిలి పాండనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులను పంటి నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, రుమాటిజం, మూత్ర విసర్జన, యాంటి వైరల్‌కు దీనిని వినియోగిస్తారు. దీనిని ఆంగ్లములో పాండనస్ అమరిల్లిఫోలియస్ అని అంటారు. కప్పరిల్లాకు ఈ ఆకుతో మూత్ర సంబంధిత వ్యాధులు, యోని ఉత్సర్గ, కోలిక్ మరియు డిస్పెప్సియా, కాలేయం, ఆస్తమా, బ్రోన్కైటిస్, జలుబు, దీర్ఘకాలిక దగ్గు పనితీరును ప్రేరేపిస్తుంది. ఇది లామియాసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని కోలియస్ అంబోనికస్ అని అంగ్లంలో పిలుస్తారు. బ్రయోపైలం బ్రయోఫిలమ్ కలిసినం అని ఆంగ్లములో పేర్కొనే ఈ మొక్క క్రాసులేసి కుటుంబానికి చెందినది. దీని ఆకులను చర్మ సమస్యలు, రక్త ప్రసరణ, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు దోహదపడుతాయి. ఇది శేషాచలంలో మాత్రమే లభించే ఔషధ మొక్క చంపకము(మాను సంపంగి) మాగ్నోలియాసీ కుటుంబానికి చెందిన ఈ మొక్కను అజీర్తి, వికారం, మూత్రపిండ వ్యాధులలో స్కాల్డింగ్, మహిళల నెలసరి నియంత్రణ, ఉన్మాదం, మతిమరుపు, అబారి్టఫేసియంట్(రూట్ జ్యూస్)కు వాడతారు. మిచెలియా చంపాకా అని ఆంగ్లంలో పిలుస్తారు. భూ తులసి(విభూది పత్రి) లామియాసి కుంటుబానికి చెందిన ఈ మొక్కను ఓసిమమ్ బాసిలికం అని అంగ్లంలో పిలుస్తారు. బెణుకులు, ఉబ్బసం, విరేచనాలు, బ్రోన్కైటిస్, గోనేరియా, నెఫ్రైటిస్, అంతర్గత పైల్స్ వంటి జబ్బులు నయం కావడానికి వినియోగిస్తారు. జాలారి ఈ వృక్షం తలకోన అడవుల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. జలపాతానికి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని ఆలయ ధ్వజçస్తంభాలకు వాడతారు. దీని చేవ అతిగట్టిగానూ ధృడంగానూ ఉంటుంది. ఈ చెట్టు ఆకులను కామెర్ల నివారణకు వినియోగిస్తారు. కృష్ణ తులసి(తులసి) లామియాసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులు, కాండము, వేర్లను సాధారణ జలుబు, దగ్గు, బ్రోంకోస్పస్్మ, సాధారణ బలహీనత, ఒత్తిడి రుగ్మతలు, చర్మవ్యాధులు, గాయాలు, అజీర్ణం, వికారం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీనిని అంగ్లంలో ఓసిమమ్ శాన్్కటమ్ అని పిలుస్తారు. చిన్నబిక్కి దీనిని ఆంగ్లములో గలినీయా రజినిపెరా అని పిలుస్తారు. ఇది రూజియేసా కుటుంబానికి చెందినది. దీని సమూలాన్ని పూత ద్వారా తేలుకాటుకు వాడతారు. బిక్కి చెట్టు శేషాచలంలోని చామల, దిన్నెల, కోడూరు, నాగపట్ల అటవీ ప్రాంతంలో విరివిగా దొరుకుతుంది. బిల్లుడు ఫ్లిండర్ సీయాసీ అనే ఈ బిల్లుడు జాతిని ఆంగ్లములో క్లోరోక్జిలాన్ అని పిలుస్తుంటారు. దీని బెరడు తీసి రసం తయారు చేసి చర్మవ్యాధులకు ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా శేషాచల అటవీ ప్రాంతంలోని పాపవినాశనం, బాలపల్లి, రాజంపేట, భాకరాపేట, తలకోన అటవీ ప్రాంతంలో చూడవచ్చు. రాజ వైద్యుల కట్టుమాత్రలు ఇక్కడి గుహల్లో.. ఈ ఫోటోలో కనిపిస్తున్నవి చూస్తే రాళ్లు అనుకుంటారు. కాదు ఇవి కట్టుమాత్రలు (సాధుడు మాత్రలు) అని సిద్ధవైద్యం చెబుతోంది. పురాతన కాలంలో రాజవైద్యులు శేషాచల గుహల్లో ఉంటూ అక్కడి ఆయుర్వేద మందులు తయారుచేసేవారు. 200ఏళ్ల ముందు రాజవైద్యులు తయారు చేసిన ఈ కట్టుమాత్రలను సాధువులు గుర్తించారు. లోహాలను, రసాయనాలను ఇక్కడ దొరికే వనమూలికా పసరుతో నూరి పుటం వేసి నాటు మందులు తయారు చేసేవారు. పూర్వం నాటు, మూలిక వైద్యానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు బయటపడినట్లు సాధువుల ద్వారా సమాచారం. హిమాలయాల్లో కూడా దొరకని అరుదైన మూలికలు ఈ శేషాచలం కొండల్లో దొరుకుతాయని మునులు అన్వేషణ సాగిస్తుంటారు. శేషాచలంలో దొరికే మూలికలతో తరాలుగా వైద్యం శేషాచల అటవీ ప్రాంతాల్లో దొరికే మూలికలు, ఔషశ మొక్కలతో ఆయుర్వేద వైద్యం అందిస్తున్నాం. ఈ విద్య మా పూరీ్వకుల నుంచి మాకు వచ్చింది. ఇప్పుడు నా వయస్సు 74 సంవత్సరాలు. క్యాన్సర్ మొదలుకొని తలనొప్పి, ఆయాసం వంటి అనేక జబ్బులకు మూలికల ద్వారా నయం చేస్తాం. కట్టుమాత్రలు తయారు చేసేంత మహానిపుణులు ఇప్పుడు లేరు. మా నాన్న, తాత కాలంలో ఎక్కువగా ఈ నాటు వైద్యం ద్వారానే జబ్బులు నయం అయ్యేవి. దానికి సంబంధించి మూలికలు మన ప్రాంతంలోనే దొరుకుతాయి. – రాజన్న, ఆయుర్వేద వైద్యులు, వెంకటగిరి నాడు ఆరోగ్యం క్షీణిస్తే.. అడవులకే వెళ్లేవారు.. నాటి పూరీ్వకుల కాలంలో ఆరోగ్యం క్షీణిస్తే అడవుల బాటపట్టడమే ఉత్తమంగా పరిగణించేవారని గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలు చెబుతున్నారు. తలనొప్పి, ఆయాసం, కీళ్లనొప్పులు వంటి జబ్బులతో బాధపడేవారు సమీప శేషాచల పర్వత శ్రేణి నుంచి వచ్చే జలపాతంలో స్నానాలు ఆచరించినా, ఇక్కడ వీచే గాలి పీల్చినా జబ్బులు మటుమాయం అవుతాయని చెప్పేవారు. శేషాచల తీర్థాలు వేర్లు, మూలికలు, ఔషధ మొక్కల నుంచి ఊట ద్వారా రావడం వల్ల వ్యాధులు నశించేగుణం ఈ నీళ్లకు ఉంటుందని చెబుతుంటారు. శేషాచలం అణువణువూ ఉపయోగకరమే.. ఔషధ, వనమూలికలు ఎక్కడ దొరకనివి ఈ పర్వతాల్లోనే దొరుకుతాయని మునులు, సాధువులు, నాటువైద్యులను కలిసినప్పుడు అనేక అంశాలను చెప్పారు. శేషాచల విశేషాలపై దాదాపు 15ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నాను. పూర్వీకులు, గ్రామీణులను నుంచి తెలుసుకొన్న ఎన్నో అంశాలు ఆశ్యర్యానికి గురి చేశాయి. రాజవైద్యులు, మునులు, సిద్ధమునులు ఈ ప్రాంతంలో ఆయుర్వేద వైద్యం చేసేవారని తెలిసింది. శేషాచలం అడవుల పరిరక్షణ ఎంతో అవసరం. ఎన్నో చరిత్రలకు ఇక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. శేషాచల పర్వతం అణువణువు మానవాళికి ఉపయోగకరమే. – బాబ్జిరెడ్డి, శాస్త్రవేత్త, ఎస్వీ యూనివర్సిటీ . -
Seshachalam Hills: ట్రెక్కింగ్‌కు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, చిత్తూరు: ఉరుకులు పరుగుల జీవితం. కాంక్రీటు వనాల్లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైన పని. ఒకేచోట నివసిస్తున్నామనే మాటే కానీ.. నోరు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి. పక్కింట్లో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేనంతగా మనిషి మారిపోతున్నాడంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోతూ.. ఆయుష్షు క్షీణిస్తోంది. రోజంతా కష్టపడినా.. సాయంత్రానికి కష్టసుఖాలు పంచుకునే స్నేహితులు ఉంటే జీవితంలో అంతకు మించిన సుఖం మరొకటి లేదనేది వాస్తవం. కనీసం వారంలో ఒక్క రోజైనా స్నేహితులు, బంధువులతో కలిస్తే.. మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ సంతోషమే సగం బలం. ఇలా కలవాలనుకునే వారిని ఒక్కటి చేస్తోంది ‘ట్రెక్కింగ్’. ఆ విశేషాల సమాహారమే ఈవారం ‘సాక్షి’ సండే స్పెషల్.. రొటీన్ జీవితానికి భిన్నంగా ఆటవిడుపు కోసం అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలో వీకెండ్లో పర్వతారోహణం చేస్తుంటారు. భారత దేశంలో పర్యటన పూర్తిగా మతంతో ముడిపడి ఉంటుంది. తీర్థయాత్రలు, యాత్రలు ఉంటాయి. ఇందుకు భిన్నంగా తిరుపతికి చెందిన బీవీ రమణ, పున్నా కృష్ణమూర్తి, ఈశ్వరయ్య 25 ఏళ్ల క్రితం అడవిలో చెట్ల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్లడం ఆరంభించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, లోయలు, సెలయేళ్లు, నీటి ప్రవాహాలు, ఆ నీటి ప్రవాహ ఒరిపిడికి ఏర్పడిన శిలా రూపాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తరువాత శ్వేత మాజీ డైరెక్టర్ భూమన్(74), సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ(70), మధు(స్విమ్స్‌లో డయాలసిస్ టెక్నీషియన్), యుగంధర్, ట్రెక్కింగ్ బాలసుబ్రమణ్యం గ్రూపులుగా ఏర్పడి ప్రతి ఆదివారం ట్రెక్కింగ్‌కు వెళ్లి వస్తున్నారు. మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు వైఎస్సార్సీపీ యువ నాయకుడు భూమన అభినయ్‌రెడ్డి మిత్ర బృందం సభ్యులు మరో గ్రూపుగా ఏర్పడి ట్రెక్కింగ్‌ను ఆస్వా దిస్తున్నారు. 1997లో జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి విజయవాడ నుంచి తిరుపతికి బదిలీపై వచ్చి.. విధులు ముగించుకుని అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఆ తరువాత స్థానిక ఉద్యోగి బీవీ రమణతో కలిసి శేషాచలంలో అన్వేషణ ప్రారంభించారు. ఇలా ట్రెక్కింగ్‌కు బీజం పడింది. ఆషామాషీ కాదు.. ట్రెక్కింగ్ అనేది ఆషామాషీ కాదు. సాహసంతో కూడుకున్న యాత్ర. చెప్పాలంటే మిలిటరీలో ట్రైనింగ్ లాంటిది. తాళ్లు, ట్యూబ్స్, టెంట్లు, నీరు, భోజనం, పండ్లు, బిస్కెట్స్ తీసుకుని నిట్టనిలువుగా ఉండే కొండలు, గుట్టలు ఎక్కడం సరికొత్త అనుభూతి. ఒక్కొక్కరు కనీసం 20 నుంచి 30 కిలోల బరువు మోసుకెళ్లాల్సి వస్తుంది. 25 ట్రెక్కింగ్ గ్రూపుల్లో కొందరు 100 నుంచి 200 సార్లు కొండా కోనల్లో తిరిగిరావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ట్రెక్కింగ్‌తో లాభాలు ► ఫిట్‌నెస్‌కు, కష్టానికి శరీరం అలవాటు పడుతుంది. ► శరీరాన్ని ఎలా అయినా తిప్పేందుకు వీలు కలుగుతుంది. ► సమష్టితత్వం అలవడుతుంది. ► ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం నేర్పుతుంది. ► నడవలేని వారికి చేయి అందించడం, లేదా మోసుకెళ్లడం ద్వారా పరోపకారాన్ని తెలియజేస్తుంది. ► అడవిలో మంచి ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి. ► కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఎదుర్కొనేలా మానసిక దృఢత్వం. పక్కా ప్రణాళికతో.. ►ట్రెక్కింగ్‌కు వారం ముందే ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. ► ఏ అడవికి వెళ్లాలి, అక్కడకు ఎన్ని కిలోమీటర్లు? దారి ఎలా ఉంటుంది? అందుకు సంబంధించిన ఏర్పాట్లు. ► ట్రెక్కింగ్‌లో భాగస్వాములయ్యే సభ్యులతో ఓ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవడం. ► ఎలాంటి సమాచారమైన అందులోనే చర్చించుకోవడం. లొకేషన్ షేరింగ్. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► ట్రెక్కింగ్‌కు వెళ్లేవారు వేకువజామునే లేచి ఎంపిక చేసుకున్న ప్రాంతానికి ఉదయం 6–7 గంటల మధ్య చేరుకోవాలి. ► ప్రతి సభ్యుడు ఒక బ్యాగు, అందులో 2, 3 నీళ్ల బాటిల్స్, స్నాక్స్, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకెళ్లాలి. ► కొండలు, గుట్టలు ఎక్కేందుకు వీలుగా కాటన్ దుస్తులు ధరించాలి. విధిగా షూ ధరించాలి. ► మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందస్తు ఏర్పాట్లు. ► ఎంపిక చేసుకున్న ప్రాంతానికి వెళ్లే కంటే ముందు సమీపంలోని గ్రామాల ప్రజలతో మమేకం కావడం. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం నేను 30 ఏళ్లకు ముందే ట్రెక్కింగ్ మొదలు పెట్టాను. ఇప్పటి వరకు సుమారు 200 ట్రెక్కింగ్‌లు చేసుంటా. నాతోపాటు ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు అందరినీ తీసుకెళ్తుంటా. నా భార్యను కూడా ట్రెక్కింగ్‌లో భాగస్వామిని చేశా. ప్రకృతి ఒడిలోకి వెళ్తే కలిగే సంతోషం మాటల్లో చెప్పలేం. జీవవైవిధ్యంతో పాటు జంతువులు, అనేక రకాల మొక్కలు, పూల మధ్య గడపడం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. – భూమన్, శ్వేత మాజీ డైరెక్టర్ పెద్ద పులిని చూసి షాక్ అయ్యాం 2006లో తలకోన నుంచి సుమారు 30 కి.మీ దూరంలో రుద్రగళతీర్థం వరకు వెళ్లాం. ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేశాం. రాత్రి 10 గంటల సమయంలో కణితి అరుపులు వినిపించాయి. ఇది మామూలే అనుకున్నాం. 15 నిమిషాల తర్వాత పెద్దపులి గాడ్రింపుతో భయమేసింది. ఆ పెద్దపులి కణితి గొంతును పట్టుకుని ఈడ్చుకెళ్తుండడం చూసి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఆ సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ చప్పుడు చేయకుండా ఉండిపోయాం. – కుమార రాధాకృష్ణ, కృష్ణాపురం, రాత్రి విగ్రహాల శిల్పి -
గుప్తనిధుల కోసం భారీ సొరంగం
సాక్షి, తిరుపతి: శేషాచలంలో ఎర్రబంగారమే కాదు.. అపారమైన గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో ఓ ముఠా పథకం వేసింది. ఏడాది పాటు శ్రమించి భారీ సొరంగం తవి్వంది. మరికొంత సొరంగం తవ్వితే.. గుప్తనిధులు బయటపడేవని ముఠా సభ్యులు చెబుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలకు యత్నించిన కొందరిని శనివారం అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనకాపల్లికి చెందిన పెయింటర్ నాయుడు 2014లో తిరుపతికి మకాం మార్చాడు. భార్య నుంచి విడిపోయిన అతడు తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటూ కూలీల మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడికి గుప్తనిధుల మీద ఆశ మొదలైంది. నెల్లూరుకు చెందిన రామయ్యస్వామితో పరిచయం ఏర్పడింది. తవ్వకాల సమీపంలో రాయిపై ఉన్న గుర్తులు కొన్ని పురాతన రాగిరేకులను బట్టి శేషాచలం అడవుల్లో గుప్తనిధి ఉందని భావించారు. నాయుడు, రామయ్యస్వామి.. ఆరుగురు కూలీలతో కలిసి ఏడాది కిందట తవ్వకాలు ప్రారంభించారు. విషయం బయటకు తెలియకుండా సొరంగం తవ్వుతూ వచ్చారు. ఏడాది పాటు గుట్టుచప్పుడు కాకుండా.. రేయింబవళ్లు 80 అడుగుల సొరంగం తవ్వారు. మరికొంత తవ్వేందుకు శుక్రవారం రాత్రి కూలీలతో బయలుదేరారు. మరికొందరి కోసం మంగళం వెంకటేశ్వరకాలనీ సమీపంలో ఎదురు చూడసాగారు. ఈ ముఠా కదలికలతో అనుమానం వచ్చిన కాలనీవాసులు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. గుప్తనిధుల తవ్వకాలకు వచ్చినట్లు వారు విచారణలో తెలిపారు. వారిద్వారా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేరకు తవ్వితే సరిపోయేదని ముఠా సభ్యులు చెబుతున్నారు. -
శేషాచలం అడవుల్లో రెచ్చిపోయిన స్మగ్లర్లు
సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో మరోసారి తమిళ స్మగ్లర్లు రెచ్చిపోయారు. లాక్డౌన్ కారణంగా కొంతకాలం అడవుల్లోకి ప్రవేశించని స్మగ్లర్లు ఇప్పుడు మళ్లీ తమ వేట ప్రారంభించారు. రెండు రోజులుగా పెద్ద ఎత్తున శేషాచల అడవుల్లోకి వచ్చిన తమిళ స్మగ్లర్లు భారీ ఎత్తున ఎర్ర చందనం దుంగలు తరలించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తిరుపతి టాస్క్ పోర్స్ సిబ్బంది కుంబింగ్‌కు వెళ్ళింది. చంద్రగిరి మండలం భీమవరం ఘాట్‌లో కుంబింగ్ పార్టీకి స్మగ్లర్లు తారస పడ్డారు. స్మగ్లర్లు మొదట పోలీసుల మీద రాళ్ళ దాడి చేశారు. పోలీసులు ప్రతి గతించడం తో స్మగ్లర్లు దుంగలు వదిలేసి పారిపోయారు. తమ వెంట ఉన్న బ్యాగ్‌లను వదిలేసి పోయారు. మొత్తం 33 దుంగలను స్వాదీనం చేసుకొన్నారు. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. -
శేషాచలం అడవుల్లో రెచ్చిపోయిన స్మగ్లర్లు
-
శేషాచలం సానువుల్లో....
భ్రమణ కాంక్షే అసలైన మానవ కాంక్ష అని పెద్దలు అంటారు. తిరిగినవారే గెలుస్తారు అని కూడా అంటారు. నాలుగు వైపులకు వెళ్లకపోతే, నాలుగు దిశలలో నడవకపోతే బతుకు బావిలా మారుతుంది. కనుచూపు కురచబారుతుంది. ‘ఎదగాలంటే తిరగాలి’ అంటారు భూమన అభినయ్ రెడ్డి. అతనికి శేషాచలం కొండలు కొట్టిన పిండి. పదిహేనేళ్ల కిందట బ్రహ్మదేవుని గుండంకు చేసిన తొలి ట్రెక్కింగ్ నుంచి ఇటీవల తలకోనతో మొదలెట్టి యుద్ధగళ వరకు వారం రోజుల పాటు శేషాచలం అడవుల్లో సాగిన ట్రెక్కింగ్ వరకు అతడు పోగు చేసుకున్న అనుభూతులు ఎన్నో. వాటిలో కొన్ని ఇవి. ‘పదేళ్ల క్రితం మా అమ్మ రేవతి ‘యుద్ధగళ’కు వెళ్లి వచ్చి, ఆ విశేషాలు చెప్పినప్పుడు ఆ ప్రాంతాన్ని సందర్శించాలను కున్నాను. అందురూ నడిచే మార్గంలో కాకుండా కొత్తదారిలో ఆ తీర్థానికి వెళ్లాలనుకున్నాను. ట్రెక్కింగ్ చేసే ఔత్సాహికులతో కలిసి యుద్ధగళకు పయనమయ్యాను. యుద్ధగళ ట్రెక్కింగ్ అడుగడుగునా ఆశ్చర్యంతో పాటు ఆనందానుభూతిని కలిగించింది. వారం రోజులు అడవిలోనే! యాభై మందితో సాగిన మా ట్రెక్కింగ్ యాత్ర.. శేషాచలం కొండలకు పడమర దిక్కున ఉన్న తలకోన నుంచి తాబేలు బావి, యుద్ధగళ, మూడేళ్ల కురవ, కంగుమడుగు, ఆదిమానుబండలు, ఎర్రంరెడ్డి మడుగు మీదుగా వైఎస్సార్ కడప జిల్లాలోని కుక్కలదొడ్డి వరకు సాగింది. ఎత్తైన తలకోన జలపాతాన్ని తనివి తీరా చూసుకుంటూ, ఆ కొండ ఎక్కి నాగరికత ఆనవాళ్లకు దూరంగా వారం రోజులు అడవిలోనే గడిపాం. నా చిరకాల కాంక్షను తీర్చే నడక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించే మహావృక్షాలు, మానవ అలికిడికి భయపడి పారిపోయే జంతు జాలాలు, లెక్కలేనన్ని వృక్షజాతులు ఈ శేషాచలం అడవుల్లో ఉన్నాయి. జలపాత సోయగాల తలకోన అక్టోబర్ 8న ఉదయం తిరుపతి నుంచి తెల్లవారుజామునే బయల్దేరి తలకోనకు వెళ్ళాం. ఒక్కొక్కరి వీపుమీద దాదాపు ఇరవై కిలోల బరువుతో కొండపైకి నడక మొదలు పెట్టాం. రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతమైన తలకోన అందాలను, ఆ జలపాత సోయగాలను వీక్షిస్తూ ఆ కొండ కొసకు చేరాం. ఉదయం తొమ్మిదైంది. అప్పుడు కానీ మాకు సూర్యదర్శనం కాలేదు. అలా అడవిలో నాలుగు గంటలు నడిచాక మాకు అడ్డంగా ప్రవహిస్తున్న ఏరు కనిపించింది. ఆ ఏరు ప్రవాహానికి ఎదురుగా వెళితే తాంబేలేరు కనిపించింది. కొండపైన అంత ఎత్తులో ఎంతో స్వచ్ఛమైన నీళ్లు.! ఇక నేరుగా యుద్ధగళ తీర్థానికి వెళ్లాం. బొట్లు బొట్లుగా.. యుద్ధగళ యుద్ధగళ తీర్థంలో శ్రీవేంకటేశ్వర స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ గీసిన హనుమంతుడి బొమ్మలు చూశాం. ఆ రాత్రికి అక్కడే బసచేశాం. అడవిన కాసిన వెన్నెలను మేం తనివితీరా అనుభవించాం. మర్నాడు యుద్ధగళ తీర్థం దిగువున ఉన్న విష్ణుగుండంలోకి దిగాం. ఎనిమిది వందల మీటర్ల లోపలికి తాడు సాయంతో కిందకు దిగాం. అదొక గొప్ప అనుభూతి. మధ్యాహ్నం యుద్ధగళ తీర్థం సమీపంలో పెట్రోగ్లిఫ్‌లుగా పిలిచే చిత్రాలను పెద్ద బండపై ఉలితో చెక్కి ఉండడాన్ని చూశాం. ఆ చిత్రాలను ఎన్నో సామాజిక, సాంస్కతిక, మార్మిక అంశాలను పొందపరిచారు. ఉరకడానికి సిద్ధంగా ఉన్న రెండు ఆంబోతులు, ఒక గణాచారి ఈ చిత్రసంచయానికి హైలైట్. ఈ చిత్రాలపై పూర్తిస్థాయిలో పురావస్తు శాస్త్ర పరిశీలన జరగాల్సి ఉంది. పరిశోధన జరిగితే అదిమానవునికి సంబంధించిన ఆనవాళ్లు మరిన్ని బయటపడచ్చు. సాయంత్రం తిరిగి మడుగు వద్దకు వచ్చాం. యుద్ధగళ అసలు పేరు రుద్రగళ. ఆ తీర్థంలో రాత్రి నిద్రించినప్పుడు అందులో బొట్లు బొట్లుగా పడే నీళ్లు యుద్ధ శబ్దాలను తలపించేటట్టు ఉంటాయి. అందుకే ఈ తీర్థానికి యుద్ధగళ అని పేరొచ్చింది. మూడేర్ల కురవ.. కంగుమడుగు కంగుమడుగుకు సమీపంలో మూడేర్ల కురవ అనే ఏరు ఉంది. మూడు ప్రాంతాల నుంచి వచ్చే ఏర్లు కలిసి ప్రవహించడం వల్ల దీనికా పేరొచ్చింది. మరుసటి రోజు కంగు మడుగుకు ప్రయాణమయ్యాం. కంగు మడుగు పెద్ద ఏరు. ఏనుగులు నీటి కోసం, జలకాలాడటం కోసం వస్తాయి. కనుకే ఏనుగుల రాకను గమనిస్తూ ఉండాలి. అవి వచ్చి పడ్డాయంటే, తప్పించుకోవడం కష్టమే. ఇక్కడ ఏనుగులు సంచరించిన ఆనవాళ్లను గమనించాం. ఇక్కడ అటవీ శాఖ వారి బేస్ క్యాంప్ కూడా ఉంది. ఆ రాత్రి కంగుమడుగు ప్రాంతంలోనే బస చేశాం. తెల్లని వెన్నెల్లో.. అరిమాను బండలు మరుసటి రోజు ఉదయమే మళ్లీ మా నడక. మ«ధ్యాహ్నానికి అరిమాను బండలకు చేరుకోగలిగాం. అదొక ఎత్తైన ప్రదేశం. పౌర్ణమికి సరిగ్గా రెండు రోజులు ముందు కావడంతో ఆ రాత్రి చందమామ కురిపించే తెల్లని వెన్నెల ఎంత చల్లగా ఉందో. మరుసటి రోజు అరిమాను బండ కింద నుంచి గద్దలపీతుగుండం వెళ్లాం. ఇక్కడ కొన్ని గద్దలు సంచరించడం మాకు కనిపించింది. ఈ గుండానికి రెండు కిలోమీటర్ల దూరంలో మరో అద్బుతమైన సుందర ప్రదేశం బూడిదపునుకు. ఇది రమణీమైన గుండం. లేలేత సూర్యకిరణాలు నీటిని తాకుతున్న సుందర దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆదిమానవుడు గీసిన చిత్రాలు ఇక్కడ కూడా చరిత్ర పూర్వయుగం నాటి ఆదిమానవుడు గీసిన చిత్రాలు ఉన్నాయి. అనంతరం ఓ నాలుగు వందల మీటర్ల దూరాన్ని చిన్న కొండల మధ్య నడిచాం. అక్కడ ఓ చిత్రం మా కంటపడింది. అది ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లను తెలియజేసేది. జంతువులను వేటాతున్న మహిళల చిత్రం చూసి అబ్బుర పడ్డాం. సాయంత్రం ఆరిమానుబండకు తిరిగి వచ్చాం. రాత్రి అక్కడే బస చేశాం. నీటి మడుగుల్లో దీపాలు మా అడవి యాత్రలో ప్రయాణం ఆఖరి ఘట్టానికి చేరింది. బూడిదపునుకు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రమరెడ్డి మడుగుకు మరుసటి రోజు నడక ప్రారంభించాం. ఆ రోజంతా అక్కడే గడిపాం. అక్కడ దగ్గర దగ్గరగానే రెండు మడుగులున్నాయి. ఆ రోజు పున్నమి. మడుగులను దీపాలతో అలంకరించాం. ఆ దీపాల ప్రతిబింబాలతో మడుగులు చూడచక్కగా ఉన్నాయి. కళ్లార్పకుండా ఎంత సేపైనా చూడాలనిపించేంత అద్భుతంగా వెలుగొందాయి. పౌర్ణమి రాత్రి నీటిలో దాదాపు మూడు గంటల పాటు తనివితీరా గడిపాం. మా యాత్రలో ఆ చివరి రాత్రి ఎర్రమరెడ్డి మడుగు వద్దే గడిచింది. మరునాడు సోమవారం ఉదయం అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లా కుక్కల దొడ్డికి చేరుకున్నాం.’ అని ముగించాడు అభినయ్. జీవవైవిధ్యం అన్ని సదుపాయాలూ ఉన్న నగరాలను, కాంక్రీటు వనాలను వదిలి అచ్చమైన, స్వచ్ఛమైన అడవిలోకి నడుచుకుంటూ వెళ్లి వారం రోజుల పాటు ఉండటం గొప్ప అనుభూతి. ప్రకృతితో లీనమైపోవడం, ప్రకృతిపైన ప్రేమను పెంచుకోవడం, అడవి అంటే ఇష్టం పెంచుకోవడం, అడవులను కాపాడాలన్న భావన కలిగించుకోవడం స్వయంగా అనుభూతించాం. మానవ మనుగడకు అడవుల రక్షణ, వాటిలోని జంతుజాలం రక్షణ ఎంతగా ఉపకరిస్తాయో స్వయంగా తెలుసుకున్నాం. – భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి -
అమ్మ, నాన్న..ఇద్దరు కొడుకులు.. ఓ ‘ఎర్ర’ గ్యాంగ్
చిత్తూరు: అమ్మా, నాన్న.. వారి ఇద్దరు కుమారులు ముఠాగా ఏర్పడి ఎర్రచందనం తరలిస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. చివరికి పోలీసులకు దొరికిపోయారు. ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం .. తమిళనాడులోని వేలూరు అళగిరి నగర్‌కు చెందిన నాగేంద్రన్(48), జ్యోతి(43), దంపతులు ఎర్ర చందనం స్మగ్లర్లు. వీరికి విశ్వనాథన్ (24), వీరాస్వామి (22) అనే ఇద్దరు కుమారులున్నారు. వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)లో విశ్వనాథన్ బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా వీరాస్వామి ఎంఎస్ చదువుతున్నాడు. నాగేంద్రన్, జ్యోతి 2013 నుంచి ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శేషాచలంలో ఎర్రచందనం చెట్లను నరకడానికి తమిళనాడులోని జవ్వాదిమలై నుంచి కూలీలను పిలిపించుకుని, నరికిన దుంగలను బెంగళూరులోని మాలూర్ భాషాకు విక్రయిస్తుంటారు. ఇలా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఎర్రచందనం దుంగల్ని ఎగుమతి చేస్తుంటారు. వెనుక లారీలో ఎర్రచందనం దుంగలు వస్తుంటే ముందర స్కార్పియో వాహనంలో కుటుంబ సమేతంగా పైలట్‌లా వ్యవహరించి పోలీసుల నిఘాను పసిగడుతూ చాకచక్యంగా తప్పించుకుంటారు. అయితే, ఆదివారం సాయంత్రం ముందస్తు సమాచారం మేరకు బెంగళూరు– తిరుపతి బైపాస్ రోడ్డులోని పి.కొత్తూరు వద్ద లారీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందులో టన్ను బరువున్న 30 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకున్నారు. జ్యోతి, నాగేంద్రన్తోపాటు వారి ఇద్దరు కుమారులు, జ్యోతి చెల్లెలి కొడుకు వెట్రివేల్ (22)లతో పాటు డ్రైవర్ కె.కుమార్ (22)ను అరెస్టు చేశారు. నాగేంద్రన్ దంపతులపై జిల్లాలో నాలుగు కేసులు ఉన్నాయి. వీరు వంద టన్నుల వరకు ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా తరలించి రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. వేలూరులో ఎర్రచందనం కేసులో అక్కడి పోలీసులు ఓ డీఎస్పీను సైతం అరెస్టు చేసినట్లు సమాచారం. -
శేషాచలం కొండల్లో మళ్లీ అగ్ని ప్రమాదం
తిరుమల: శేషాచలం అటవీ ప్రాంతంలో మళ్లీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. గోగర్భం సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
శేషాచలంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డుకు సమీపంలోని దట్టమైన అటవీప్రాంతంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రభుత్వ అటవీశాఖ పరిధిలోని తిమ్మినాయుడు పరిధిలోని సానరాళ్ల మిట్ట ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి పొగ అల్లుకుంది. దీనిపై సంబంధిత విభాగం అధికారులు, సిబ్బంది స్పందన అంతగా కనిపించలేదు. ఫలితంగా సాయంత్రం తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు వైపునకు మంటలు వ్యాపించాయి. దీనిపై టీటీడీ అటవీశాఖ అప్రమత్తమైంది. 34వ మలుపు ఎలుగుబంటి బోర్డునకు ఉత్తరదిశలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలోకి మంటలు వ్యాపించాయి. తమ పరిధి కాకపోయినా మంటలు ఆర్పేందుకు టీటీడీ సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. సుమారు వందమంది కార్మికులు అటవీప్రాంతంలోకి వెళ్లి మంటలు ఆర్పే పనిలో ఉన్నారు. ఈ రాత్రి 10 గంటల వరకు మంటలు ఎగసిపడ్డాయి. ఈ రాత్రికి మంటలు పూర్తిగా ఆర్పివేస్తామని టీటీడీ డీఎఫ్‌వో శివరామ్‌ప్రసాద్ తెలిపారు. -
శేషాచల అడవుల్లో పోలీసుల కూంబింగ్
తిరుపతి: తిరుమల శేషాచల అడవుల్లో ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి ఆమండూరు వద్ద ఎర్రచందనం కూలీలపై ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో 54 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం చంద్రగిరి పీఎస్ తరలించారు. గత నెల చివర్లో శేషాచల అడవుల్లో ఎర్రచందనం దొంగలు, ఎస్టీఎఫ్ దళాల మధ్య జరిగిన భీకర పోరులో ముగ్గురు దొంగలు మృతిచెందగా, నలుగురు పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో వంద మంది కూలీలు ఒక్కసారిగా రాళ్లు, విల్లంబులతో దాడిచేశారు. -
శేషాచలంలో భీకరపోరు
ముగ్గురు ఎర్రచందనం దొంగల మృతి సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో బుధవారం అర్ధరాత్రి ఎర్రచందనం దొంగలు, ఎస్టీఎఫ్ దళాల మధ్య జరిగిన భీకర పోరులో ముగ్గురు దొంగలు మృతిచెందగా, నలుగురు పోలీసులు గాయపడ్డారు. మృతులు తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన కూలీలు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. తిరుమల ఆలయానికి పడమర దిశలో పది కిలోమీటర్ల దూరంలో తలకోన ఛామలారేంజ్‌లో బుధవారం ఉదయం నుంచి ఎస్టీఎఫ్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు వంద మంది కూలీలు ఒక్కసారిగా వారిపై రాళ్లు, విల్లంబులతో దాడిచేశారు. అప్రమత్తమైన పోలీసులు రెండు గంటలపాటు సుమారు నలభై రౌండ్ల దాకా ఎదురుకాల్పులు జరిపారు. అయితే, గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా మూడు ఎర్రచందనం దొంగల మృతదేహాలు కనిపించాయి. అలాగే, స్మగ్లర్లు వాడిన గొడ్డళ్లు, కత్తులు, దాడి చేసేందుకు సిద్ధం చేసిన విల్లబులు, రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్మగ్లర్లను ఏరిపారేస్తామని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. -
శేషాచలం కొండల్లో పోలీసులు, అటవీ సిబ్బంది జాయింట్ ఆపరేషన్
సాక్షి, తిరుపతి: శేషాచలం కొండల్లో ఎర్ర చందనం దొంగలతో అటవీ, పోలీసు సిబ్బంది యుద్ధానికి సన్నద్ధమయ్యూరు. జాయింట్ ఆపరేషన్‌లో భాగం గా శనివారం నుంచి ‘ఎర్ర’ దొంగలవేట ప్రారంభమైంది. తిరుపతి అర్బన్ ఎస్పీ ఎస్వి రాజ శేఖర్ బాబు వీరితో సమావేశమై వ్యూహ రచన చేసిన విషయం తెలిసిందే. వీరికి కొన్ని విచక్షణాధికారాలు ఇవ్వడంతో కూంబింగ్ ప్రారంభించారు. తెల్లవారు జామున 5.30 గంటలకు వివిధ మార్గాల ద్వారా 145 మంది పోలీసులు అటవీ సిబ్బందితో కలిసి అడవుల్లోకి వెళ్లారు. తిరుపతి, భాకరాపేట, రేణిగుంట, కడప, రాజంపేట మీదుగా శేషాచలం అడవిలోకి చేరుకున్నారు. భాకరాపేట మీదుగా నామాల గుండుకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో 15 మంది ఎర్ర కూలీలను పోలీసులు గుర్తించారు. పోలీసులను చూడగానే వారు పారిపోయే ప్రయత్నం చేయగా, పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. ఒక వ్యక్తి పట్టుపడగా, మిగిలిన వారు పరారయ్యూరు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. అదే విధంగా భారీ ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. తమిళనాడులోని వేలూరు, తిరునల్వేలి జిల్లాల ఎస్పీలతో తిరుపతి అర్బన్ ఎస్పీ తరుచూ మాట్లాడుతూ, అక్కడ నుంచి కూలీలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తుపాకులతో వేట ప్రారంభించిన విషయాన్ని తమిళ కూలీలు ఉండే గ్రామాల్లో ప్రచారం చేరుుస్తున్నారు. అటవీ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ఇక ఎర్ర కూలీలను, స్మగ్లర్లను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కీలక స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామన్నారు. చంద్రగిరిలో మరో స్మగ్లర్ అరెస్ట్ చంద్రగిరి, న్యూస్‌లైన్: శ్రీనివాస మంగాపురం రైల్వేగేట్ సమీపంలో శనివారం ఆరుగురు ఎర్ర కూలీలను అరెస్టు చేసి, రెండు వాహనాలు, 19 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ నాగభూషణం వివరాల మేరకు.. ముందుగా అందిన సమాచారం మేరకు సీఐ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. శ్రీనివాస మంగాపురం రైల్వేగేట్ వద్ద టాటా ఇండికా కారు, లగేజీ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు ఉన్నారుు. అక్కడ ఆరుగురుని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విచారణలో ఒకరు ప్రధాన స్మగ్లర్‌గా గుర్తించారు. తిరుత్తణికి చెందిన దైవశిఖామణ అలియాస్ తిరుత్తణి మణిగా తేలింది. వాహనాల సహా 19 ఎర్రదుంగల విలువ రూ.25 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిచించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
భారీగా ఎర్రచందనం స్వాధీనం
భాకరాపేట, న్యూస్‌లైన్: శేషాచలం కొండల్లోని దట్టమైన ఆరిపెంట అటవీ ప్రాంతంలో రూ.20 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్ డీఎన్‌కె ప్రసాద్ తెలిపారు. శనివారం ఫారెస్టు కార్యాలయుంలో ఆయన స్థానిక విలేకరులతో వూట్లాడారు. ఫారెస్టు సెక్షన్ అధికారి జి మునికృష్ణరాజు ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి 5 కిలోమీటర్ల దూరం గాలింపు చేపట్టగా ముళ్ల పొదల్లో దాచిన దుంగలు కనిపించాయన్నారు. 1500 కిలోల బరువు గల 47 దుంగలను వెలికి తీసి, శుక్రవారం రాత్రి భాకరాపేట కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. వీటి విలువ రూ 20 లక్షలు వుంటుందన్నారు. ఈ గాలింపులో ఎఫ్ఎస్వో జిఎంకెరాజు, ఎఫ్‌బీవో శోభారాణి, సిబ్బంది శ్రీనివాసన్, మూర్తి, శంకర్నాయుక్, హేవూవతి, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు. రూ.60లక్షల ఎర్ర చందనం పట్టివేత తిరుపతి(మంగళం): తిరుపతి రేంజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ.60 లక్షల ఎర్రచందనాన్ని శనివారం వైల్డ్‌లైఫ్ అధికారులు పట్టుకున్నారు. మామండూరు, టీఎన్పాళెం, కృష్ణాపురం బీట్లలో శనివారం వైల్డ్‌లైఫ్ రేంజ్ ఆఫీసర్ రామ్లానాయక్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. టెంపోట్రావెలర్, ఈచర్ వాహనం, స్వరాజ్ మజ్దా తదితర నాలుగు వాహనాలను, వాటిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం 6,672 కిలోల బరువు ఉంటుందని రామ్లానాయక్ తెలిపారు. దీంతోపాటు ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ దాడుల్లో డెప్యూటీ రేంజ్ ఆఫీసర్లు ఎన్.లక్ష్మీపతి(కృష్ణాపురం), పి.రామకోటి(మామండూరు), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ టివి. రమణారెడ్డి(టిఎన్పాళెం), ఎఫ్‌బీవోలు రమేష్, నటరాజ్, టి. హరిప్రియ, జిడి.సంపత్ పాల్గొన్నారు. రూ.10 లక్షల ఎర్రచందనం పట్టివేత ఏర్పేడు: మండలంలోని అముడూరు పొలాల్లో రెండు ఎడ్లబండ్లపై తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాలతో ఎస్ఐ విక్రమ్ తమ సిబ్బందితో దాడిచేసి అముడూరు పొలాల్లో ఎడ్లబండ్లపై తరలిస్తున్న 50 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు ఎడ్లబండ్లు, 4 ఎద్దులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని రేణిగుంట సీఐ రామ్‌కుమార్ తెలిపారు. శ్రీకాళహస్తి మండలం గొల్లపల్లెకు చెందిన బిల్లు సురేష్(25)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసులు మునికృష్ణ, శ్రీరాములు, ప్రసాద్, సుబ్రమణ్యం, కరీముల్లా, మునస్వామిరెడ్డి, రాజేష్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు. లారీ సహా రూ.36లక్షల ఎర్రచందనం స్వాధీనం నారాయణవనం: లారీ సహా అక్రమంగా తరలిస్తున్న రూ.36 లక్షల విలువైన ఎర్రచంద్రనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పుత్తూరు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని పాలమంగళం దక్షిణం కండ్రిగకు చెందిన శంకర్‌రెడ్డి 15 ఎర్రచందనం చెట్లను పెంచుతున్నాడు. సుమారు 35 సంవత్సరాల వయస్సున్న రెండు చెట్లను తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకు చెందిన నలుగురు కూలీలు నరికారు. సుమారు 800 కేజీల బరువున్న ఏడు దుంగలను శనివారం సాయంత్రం టర్బో లారీలో తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ ప్రసాదరావు, సిబ్బంది రాజు, గోపి, ప్రసాద్‌తో మండలంలోని తుంబూరు వద్ద లారీని అడ్డగించారు. పోలీసులను గమనించి ముగ్గురు కూలీలు పరారయ్యూరు. తివణ్ణామలై సమీపంలోని సంగం గ్రామానికి చెందిన కూలీ కాళీ అమ్మన్(35), హోసూరుకు చెందిన లారీ డ్రైవర్ నవీన్(36), క్లీనర్ బాబు(37)ను అరెస్టు చేసి, ఏడు ఎర్రచందనం దుంగలను పోలీ సులు స్వాధీనం చేస్తుకున్నారు. ఎర్రచందనం దుంగల విలువ సుమారు 16 లక్షలు కాగా, లారీ విలువ సుమారు 20 లక్షలకుపైగా ఉంటుందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. కేసులు దర్యాప్తు చేస్తున్నారు.