భారీగా ఎర్రచందనం స్వాధీనం
Published Sun, Aug 11 2013 2:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
భాకరాపేట, న్యూస్‌లైన్: శేషాచలం కొండల్లోని దట్టమైన ఆరిపెంట అటవీ ప్రాంతంలో రూ.20 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్ డీఎన్‌కె ప్రసాద్ తెలిపారు. శనివారం ఫారెస్టు కార్యాలయుంలో ఆయన స్థానిక విలేకరులతో వూట్లాడారు. ఫారెస్టు సెక్షన్ అధికారి జి మునికృష్ణరాజు ఆధ్వర్యంలో సిబ్బందితో కలసి 5 కిలోమీటర్ల దూరం గాలింపు చేపట్టగా ముళ్ల పొదల్లో దాచిన దుంగలు కనిపించాయన్నారు. 1500 కిలోల బరువు గల 47 దుంగలను వెలికి తీసి, శుక్రవారం రాత్రి భాకరాపేట కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. వీటి విలువ రూ 20 లక్షలు వుంటుందన్నారు. ఈ గాలింపులో ఎఫ్‌ఎస్‌వో జిఎంకెరాజు, ఎఫ్‌బీవో శోభారాణి, సిబ్బంది శ్రీనివాసన్, మూర్తి, శంకర్‌నాయుక్, హేవూవతి, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.
రూ.60లక్షల ఎర్ర చందనం పట్టివేత
తిరుపతి(మంగళం): తిరుపతి రేంజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ.60 లక్షల ఎర్రచందనాన్ని శనివారం వైల్డ్‌లైఫ్ అధికారులు పట్టుకున్నారు. మామండూరు, టీఎన్‌పాళెం, కృష్ణాపురం బీట్లలో శనివారం వైల్డ్‌లైఫ్ రేంజ్ ఆఫీసర్ రామ్లానాయక్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. టెంపోట్రావెలర్, ఈచర్ వాహనం, స్వరాజ్ మజ్దా తదితర నాలుగు వాహనాలను, వాటిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనం 6,672 కిలోల బరువు ఉంటుందని రామ్లానాయక్ తెలిపారు. దీంతోపాటు ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ దాడుల్లో డెప్యూటీ రేంజ్ ఆఫీసర్లు ఎన్.లక్ష్మీపతి(కృష్ణాపురం), పి.రామకోటి(మామండూరు), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ టివి. రమణారెడ్డి(టిఎన్‌పాళెం), ఎఫ్‌బీవోలు రమేష్, నటరాజ్, టి. హరిప్రియ, జిడి.సంపత్ పాల్గొన్నారు.
రూ.10 లక్షల ఎర్రచందనం పట్టివేత
ఏర్పేడు: మండలంలోని అముడూరు పొలాల్లో రెండు ఎడ్లబండ్లపై తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాలతో ఎస్‌ఐ విక్రమ్ తమ సిబ్బందితో దాడిచేసి అముడూరు పొలాల్లో ఎడ్లబండ్లపై తరలిస్తున్న 50 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు ఎడ్లబండ్లు, 4 ఎద్దులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని రేణిగుంట సీఐ రామ్‌కుమార్ తెలిపారు. శ్రీకాళహస్తి మండలం గొల్లపల్లెకు చెందిన బిల్లు సురేష్(25)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసులు మునికృష్ణ, శ్రీరాములు, ప్రసాద్, సుబ్రమణ్యం, కరీముల్లా, మునస్వామిరెడ్డి, రాజేష్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
లారీ సహా రూ.36లక్షల ఎర్రచందనం స్వాధీనం
నారాయణవనం: లారీ సహా అక్రమంగా తరలిస్తున్న రూ.36 లక్షల విలువైన ఎర్రచంద్రనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పుత్తూరు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని పాలమంగళం దక్షిణం కండ్రిగకు చెందిన శంకర్‌రెడ్డి 15 ఎర్రచందనం చెట్లను పెంచుతున్నాడు. సుమారు 35 సంవత్సరాల వయస్సున్న రెండు చెట్లను తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకు చెందిన నలుగురు కూలీలు నరికారు. సుమారు 800 కేజీల బరువున్న ఏడు దుంగలను శనివారం సాయంత్రం టర్బో లారీలో తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది.
ఎస్‌ఐ ప్రసాదరావు, సిబ్బంది రాజు, గోపి, ప్రసాద్‌తో మండలంలోని తుంబూరు వద్ద లారీని అడ్డగించారు. పోలీసులను గమనించి ముగ్గురు కూలీలు పరారయ్యూరు. తివణ్ణామలై సమీపంలోని సంగం గ్రామానికి చెందిన కూలీ కాళీ అమ్మన్(35), హోసూరుకు చెందిన లారీ డ్రైవర్ నవీన్(36), క్లీనర్ బాబు(37)ను అరెస్టు చేసి, ఏడు ఎర్రచందనం దుంగలను పోలీ సులు స్వాధీనం చేస్తుకున్నారు. ఎర్రచందనం దుంగల విలువ సుమారు 16 లక్షలు కాగా, లారీ విలువ సుమారు 20 లక్షలకుపైగా ఉంటుందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement