తిరుమల: శేషాచలం.. సంజీవని ఔషధ వనం | Special Story On Various Herbs In Seshachalam Hills | Sakshi
Sakshi News home page

తిరుమల: ఔషధ వనం.. శేషాచలం సప్తగిరులు..

Published Sun, Jan 8 2023 11:06 AM | Last Updated on Sun, Jan 8 2023 11:30 AM

Special Story On Various Herbs In Seshachalam Hills - Sakshi

శేషాచలం అంటే  ఔషధ వనం. ఇప్పటివరకూ మనకు శేషాచల కొండలు అంటే వేంకటేశ్వర స్వామి నిలయం, ఎర్రచందనం అడవులని మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ అపర సంజీవని వంటి వన మూలికలు, ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి.  ఆస్పత్రులే లేని కాలంలో రాజులు, జమీందార్లకు ఈ శేషాచలమే వైద్యశాల.  ఔషధ మొక్కలు.. వనమూలికలతోనే ఎలాంటి జబ్బులైనా నయం చేసేవారు. నిజానికి ఆ నాటి నుంచి నేటికీ అడవిలో లభించే ఈ ఔషధ మొక్కల గురించి కొందరికి మాత్రమే తెలుసు.  నేటి తరానికి ఒకింత విడ్డూరం అనిపించినా.. నాటి ఆయుర్వేద వైద్య మూలాలే నేటి అల్లోపతి, హోమియోపతి, ఆయుష్‌ తదితర అన్ని రకాల వైద్యానికి ఆధారం. ఇంతటి అద్భుతమైన ఔషధ మొక్కలు, వనమూలికలు, వృక్షాలను తనలో దాచుకున్న శేషాచలం కొండల్లో అన్వేషణ సాగిస్తే తెలిసిన విశేషాలు.. తిరుపతి అలిపిరి..  

శేషాచల అటవీ ప్రాంతం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లా వ్యాప్తంగా 526చదరపు కిలో మీటర్లు (82,500 హెక్టార్ల)లో వ్యాపించి ఉంది. దీన్ని రెండు విభాగాలుగా విభజించారు. శ్రీ వేంకటేశ్వర నేషనల్‌ పార్కు–353చదరపు కిలోమీటర్లు టీటీడీ పర్యవేక్షణలో, వన్యప్రాణి అభయారణ్యం – 526చదరపు కిలోమీటర్లు అటవీశాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ఈశాన్య పర్వత శ్రేణుల్లో భాగమైన శేషాచలం కొండలు ఎన్నో వింతలు, విశేషాలు, చరిత్రలు, అద్భుతాలకు ఆలవాలం.  

దేవతా మూర్తులకు నిలయంగా నానుడిలో ఉన్న శేషాచలం కొండలను బొటానికల్‌ స్వర్గం అని పరిశోధకులు పిలుస్తుంటారు. అత్యంత అరుదైన ఔషధ, వన మూలికలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు మానవాళికి ఆయువుతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. ఈ కారడవిలో 176 కుటుంబాలకు చెందిన 1500కు పైగా జాతుల మొక్కలను పరిశోధకులు గుర్తించారు. ప్రతి మూలిక, మొక్క కూడా ఏదో ఒకరకమైన మానవ, జంతు, పక్షు వ్యాధులను నయం చేసే గుణాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ వ్యతికినా దొరకని అతి అరుదైన జాతి వృక్షాల్లో ఎర్రచందనం ఇక్కడి ప్రత్యేకత. దీంతోపాటు జాలారీ, తంబ జాలారి, తెల్లకరక, మొగిలి వంటివి ఇక్కడ దర్శనమిస్తాయి. శేషాచల అడవుల్లో దొరికే ఈ అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులపై నిత్యం జాతీయ, అంతర్జాతీయ పరిశోదనలు జరుగుతుండటం విశేషంగా చెప్పవచ్చు. 

అంతర్జాతీయ గుర్తింపు 
 అరుదైన పక్షి, జంతు, వృక్ష జాతులు ఇక్కడ మాత్రమే దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలోనే శేషాచల పర్వత శ్రేణిని బయోస్పియర్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ  సంచరించేందుకు అడవులపై ఆధారపడి జీవనం సాగించే వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. దీనినే బఫర్‌ జోన్‌ అంటారు. బయోస్పియర్‌ జాతీయ, అంతర్జాతీయ పరిశోధనలు జరుగతూనే ఉంటాయి. శేషాచల అడవులకు అంతర్జాతీయ గుర్తింపు రావటం విశేషం.  

ఊడుగ చెట్టు(అంకోలము)
వేర్లు, పండ్లు, విత్తనాలను ఉపయోగించి ఆయుర్వేద మందులు తయారుచేస్తారు. అలంగియేసి కుటుంబానికి చెందినది ఈ మొక్క. ఆంగ్లంలో అలంగియం సాలి్వఫోలియం అని పిలుస్తారు. ఆ్రస్టింజెంట్, ఆంథెలి్మంటిక్, డయేరియా, లెప్రసీ, ఎరిసిపెలాస్, చర్మ వ్యాధులు, మూత్ర సంబంధిత రుగ్మతలు, జ్వరము, రక్తస్రావము, వెఱి< కుక్కలు, కండ్లకలక తదితర వ్యాధుల నివారణకు దీనిని ఉపయోగిస్తారు.

గిల్లతీగ
గిల్లతీగ ప్రత్యేకించి శేషాచలంలోని తలకోన అటవీ ప్రాంతంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇది లయనాసి తీగల జాతికి చెందినది. చెట్టుకు చెట్టును ఆధాంరం చేసుకొని అడివంతా అల్లుకుంటూపోతుంది. ఇది మూడు వతాబ్దాల నాటి దని పరిశోధకులు చెబుతున్నారు. తలకోన ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల మేర అల్లుకుపోవడాన్ని చూడవచ్చు. దీని చుట్టుకొలత 260 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ తీగకు కాసే కాయలు సుమారు 100సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. వృక్ష కాయలలో అతిపెద్ద కాయగా పరిగణిస్తారు. కొండజాతి ప్రాంతీయులు దీని కాయల్లో ఉన్న గుజ్జును తొలిగించి అగ్గిపెట్టెగా వాడుకుంటారు. మరి కొందరు నసిం డబ్బాగాను వాడతారు. తీగ బెరడులో సఫోనిక్‌ అనే చేపల చంపే పదార్థం ఉంటుంది.

నేలవేము
ఈ రకం చెట్టు శేషాచలం అడవిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మొక్కననుయాంటిపైరేటిక్, యాంటిపెరియాడిక్, యాంటీ ఇన్‌ప్ల్లమేటరీ, అల్సర్లు, దీర్ఘకాలిక జ్వరాలు, బ్రాంకైటిస్, చర్మ వ్యాధులు, లెప్రసీ, పేగు పురుగులు, హేమోరాయిడ్స్, కామెర్లు, కడుపు పూతలకు వినియోగిస్తారు. ఇది అకాంతసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని ఇంగ్లీషులో ఆండ్రొగ్రాఫిస్‌ పానిక్యులేటా అని అంటారు. 

తెల్ల కరక
శేషాచలంలో మాత్రమే అరుదుగా దొరికే ఈ తెల్లకరకను మూత్రవిసర్జన, వాపులు, యాంటిపైరేటిక్, ప్రక్షాళన, విరేచనాలు, పెప్టిక్‌ అల్సర్లు, మధుమేహం, వెనిరియల్‌ వ్యాధులు, దగ్గు, జలుబు, విరేచనాలు, పగుళ్లుకు వాడతారు. కాంబ్రెటేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను ఆంగ్లంలో టెర్మినలియా పల్లిడా అని పిలుస్తారు. దీనిలో పండు భాగాన్ని వినియోగించి మందు తయారు చేస్తారు.

నక్కతోక 
ఇది అకాంతసి కుటుంబానికి చెందిన మొక్క. నక్కతోక మొక్కలోని అన్ని భాగాలు పలు రకాల ఆయుర్వే మందులకు వినియోగిస్తారు. దీనిని ఆంగ్లంలో ఎక్బోలియం వైరైడ్‌ అంటారు. గౌట్, డైసూరియా, స్ట్రిక్చర్, కామెర్లు, మెనోరాగియా, రుమాటిజం. కణితుల నివా రణకు ఉపయోగిస్తారు. 

మొగిలి
పాండనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులను పంటి నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, రుమాటిజం, మూత్ర విసర్జన, యాంటి వైరల్‌కు దీనిని వినియోగిస్తారు. దీనిని ఆంగ్లములో పాండనస్‌ అమరిల్లిఫోలియస్‌ అని అంటారు. 

కప్పరిల్లాకు
ఈ ఆకుతో మూత్ర సంబంధిత వ్యాధులు, యోని ఉత్సర్గ, కోలిక్‌ మరియు డిస్పెప్సియా, కాలేయం, ఆస్తమా, బ్రోన్కైటిస్, జలుబు, దీర్ఘకాలిక దగ్గు పనితీరును ప్రేరేపిస్తుంది. ఇది లామియాసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని కోలియస్‌ అంబోనికస్‌ అని అంగ్లంలో పిలుస్తారు. 

బ్రయోపైలం
బ్రయోఫిలమ్‌ కలిసినం అని ఆంగ్లములో పేర్కొనే ఈ మొక్క క్రాసులేసి కుటుంబానికి చెందినది. దీని ఆకులను చర్మ సమస్యలు, రక్త ప్రసరణ, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు దోహదపడుతాయి. ఇది శేషాచలంలో మాత్రమే లభించే ఔషధ మొక్క

చంపకము(మాను సంపంగి)
మాగ్నోలియాసీ కుటుంబానికి చెందిన ఈ మొక్కను అజీర్తి, వికారం, మూత్రపిండ వ్యాధులలో స్కాల్డింగ్, మహిళల నెలసరి నియంత్రణ, ఉన్మాదం, మతిమరుపు, అబారి్టఫేసియంట్‌(రూట్‌ జ్యూస్‌)కు వాడతారు. మిచెలియా చంపాకా అని ఆంగ్లంలో పిలుస్తారు. 

భూ తులసి(విభూది పత్రి)
లామియాసి కుంటుబానికి చెందిన ఈ మొక్కను ఓసిమమ్‌ బాసిలికం అని అంగ్లంలో పిలుస్తారు. బెణుకులు, ఉబ్బసం, విరేచనాలు, బ్రోన్కైటిస్, గోనేరియా, నెఫ్రైటిస్, అంతర్గత పైల్స్‌ వంటి జబ్బులు నయం కావడానికి వినియోగిస్తారు. 

జాలారి
ఈ వృక్షం తలకోన అడవుల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది.   జలపాతానికి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని ఆలయ ధ్వజçస్తంభాలకు వాడతారు. దీని చేవ అతిగట్టిగానూ ధృడంగానూ ఉంటుంది. ఈ చెట్టు ఆకులను కామెర్ల నివారణకు వినియోగిస్తారు. 

కృష్ణ తులసి(తులసి)
లామియాసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులు, కాండము, వేర్లను సాధారణ జలుబు, దగ్గు, బ్రోంకోస్పస్‌్మ, సాధారణ బలహీనత, ఒత్తిడి రుగ్మతలు, చర్మవ్యాధులు, గాయాలు, అజీర్ణం, వికారం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీనిని అంగ్లంలో ఓసిమమ్‌ శాన్‌్కటమ్‌ అని పిలుస్తారు. 

చిన్నబిక్కి
దీనిని ఆంగ్లములో గలినీయా రజినిపెరా అని పిలుస్తారు. ఇది రూజియేసా కుటుంబానికి చెందినది. దీని సమూలాన్ని పూత ద్వారా తేలుకాటుకు వాడతారు. బిక్కి చెట్టు శేషాచలంలోని చామల, దిన్నెల, కోడూరు, నాగపట్ల అటవీ ప్రాంతంలో విరివిగా దొరుకుతుంది. 

బిల్లుడు
ఫ్లిండర్‌ సీయాసీ అనే ఈ బిల్లుడు జాతిని ఆంగ్లములో క్లోరోక్జిలాన్‌ అని పిలుస్తుంటారు. దీని బెరడు తీసి రసం తయారు చేసి చర్మవ్యాధులకు ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా శేషాచల అటవీ ప్రాంతంలోని పాపవినాశనం, బాలపల్లి, రాజంపేట, భాకరాపేట, తలకోన అటవీ ప్రాంతంలో చూడవచ్చు. 

రాజ వైద్యుల కట్టుమాత్రలు ఇక్కడి గుహల్లో..  
ఈ ఫోటోలో కనిపిస్తున్నవి చూస్తే రాళ్లు అనుకుంటారు. కాదు ఇవి కట్టుమాత్రలు (సాధుడు మాత్రలు) అని సిద్ధవైద్యం చెబుతోంది. పురాతన కాలంలో రాజవైద్యులు శేషాచల గుహల్లో ఉంటూ అక్కడి ఆయుర్వేద మందులు తయారుచేసేవారు. 200ఏళ్ల ముందు రాజవైద్యులు తయారు చేసిన ఈ కట్టుమాత్రలను సాధువులు గుర్తించారు. లోహాలను, రసాయనాలను ఇక్కడ దొరికే వనమూలికా పసరుతో నూరి పుటం వేసి నాటు మందులు తయారు చేసేవారు. పూర్వం నాటు, మూలిక వైద్యానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు బయటపడినట్లు సాధువుల ద్వారా  సమాచారం. హిమాలయాల్లో కూడా దొరకని అరుదైన మూలికలు ఈ శేషాచలం కొండల్లో దొరుకుతాయని మునులు అన్వేషణ సాగిస్తుంటారు. 

శేషాచలంలో దొరికే మూలికలతో తరాలుగా వైద్యం  
శేషాచల అటవీ ప్రాంతాల్లో దొరికే మూలికలు, ఔషశ మొక్కలతో ఆయుర్వేద వైద్యం అందిస్తున్నాం. ఈ విద్య మా పూరీ్వకుల నుంచి మాకు వచ్చింది.  ఇప్పుడు నా వయస్సు 74 సంవత్సరాలు. క్యాన్సర్‌ మొదలుకొని తలనొప్పి, ఆయాసం వంటి అనేక జబ్బులకు మూలికల ద్వారా నయం చేస్తాం. కట్టుమాత్రలు తయారు చేసేంత మహానిపుణులు ఇప్పుడు లేరు. మా నాన్న, తాత కాలంలో ఎక్కువగా ఈ నాటు వైద్యం ద్వారానే జబ్బులు నయం అయ్యేవి. దానికి సంబంధించి మూలికలు మన ప్రాంతంలోనే దొరుకుతాయి. 
– రాజన్న, ఆయుర్వేద వైద్యులు, వెంకటగిరి 

నాడు ఆరోగ్యం క్షీణిస్తే.. అడవులకే వెళ్లేవారు.. 
నాటి పూరీ్వకుల కాలంలో ఆరోగ్యం క్షీణిస్తే అడవుల బాటపట్టడమే ఉత్తమంగా పరిగణించేవారని గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలు చెబుతున్నారు. తలనొప్పి, ఆయాసం, కీళ్లనొప్పులు వంటి జబ్బులతో బాధపడేవారు సమీప శేషాచల పర్వత శ్రేణి నుంచి వచ్చే జలపాతంలో స్నానాలు ఆచరించినా, ఇక్కడ వీచే గాలి పీల్చినా జబ్బులు మటుమాయం అవుతాయని చెప్పేవారు. శేషాచల తీర్థాలు వేర్లు, మూలికలు, ఔషధ మొక్కల నుంచి ఊట ద్వారా రావడం వల్ల వ్యాధులు నశించేగుణం ఈ నీళ్లకు ఉంటుందని చెబుతుంటారు. 

శేషాచలం అణువణువూ ఉపయోగకరమే.. 
ఔషధ, వనమూలికలు ఎక్కడ దొరకనివి ఈ పర్వతాల్లోనే దొరుకుతాయని మునులు, సాధువులు, నాటువైద్యులను కలిసినప్పుడు అనేక అంశాలను చెప్పారు. శేషాచల విశేషాలపై దాదాపు 15ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నాను. పూర్వీకులు, గ్రామీణులను నుంచి తెలుసుకొన్న ఎన్నో అంశాలు ఆశ్యర్యానికి గురి చేశాయి. రాజవైద్యులు, మునులు, సిద్ధమునులు ఈ ప్రాంతంలో ఆయుర్వేద వైద్యం చేసేవారని తెలిసింది. శేషాచలం అడవుల పరిరక్షణ ఎంతో అవసరం. ఎన్నో చరిత్రలకు ఇక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. శేషాచల పర్వతం అణువణువు మానవాళికి ఉపయోగకరమే. 
– బాబ్జిరెడ్డి, శాస్త్రవేత్త, ఎస్వీ యూనివర్సిటీ .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement