botanical garden
-
కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి..
కొమ్మ కొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి.. అన్నట్లు కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన బర్డ్స్ వాక్ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఇందులో 55 మంది వీక్షకులు భాగస్వామ్యం కాగా.. 62 రకాల పక్షి జాతులను గుర్తించారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్, మేనేజర్ సుమల్ పర్యవేక్షణలో వివిధ రకాల థీమ్ పార్కులు, వృక్షపరిచయ క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ సఫారీ గురించి వీక్షకులకు వివరించారు.. – గచ్చిబౌలి పికిలిపిట్ట, షిక్రా, లొట్టకన్నుజిట్ట, నల్ల ఎట్రింత, అడవిరామదాసు, మగ నెమలి, ఆడ నెమలి, లకుముకి పిట్ట, టైగర్ స్వాలోటైల్ సీతాకోకచిలుక వంటి పక్షులను సందర్శకులు వీక్షించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ‘బర్డ్స్‌వాక్’ లో 62 రకాల పక్షి జాతులను సందర్శకులు గుర్తించారు. కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్స్ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్, మేనేజర్ సుమల్ పర్యవేక్షణలో 55 మంది వీక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పక్షిజాతుల పేర్లు, వాటి శాస్త్రీయ నామాలు, సహజమైన పేర్లు, వాటి అలవాట్లు, ప్రవర్తన గురించి పక్షుల నిపుణులు అపరంజని, ప్రవర్తన, మనోజ్ థామ్సన్, అబ్దుల్ వివరించారు. పాకెట్ గైడ్ ద్వారా పక్షులను ఎలా గుర్తించాలో, అవి ఎలాంటి శబ్దాలు చేస్తాయో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. జీవావరణ పరిరక్షణకు.. ప్రకృతి, జీవావరణ వ్యవస్థలో పక్షులు ప్రధాన భూమిక పోషిస్తాయని పక్షుల నిపుణులు సందర్శకులకు వివరించారు. విత్తనాల వ్యాప్తి, పర్యావరణ సమతుల్యతలో పక్షుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అందుకే ఆయా జాతుల మనుగడ మానవ మనుగడకు, ప్రకృతి మనుగడకు కీలకమన్నారు. ఎకో టూరిజమ్‌లో భాగంగా.. బొటానికల్ గార్డెల్స్లో బర్డ్స్‌వాక్ కార్యక్రమంలో భాగంగా అడవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పక్షుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 23న వికారాబాద్‌లో, మార్చి 2న గజ్వేల్ ఫారెస్ట్‌లో బర్డ్స్ వాక్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. – రంజిత్‌నాయక్, ఎకో టూరిజమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ -
నిజానికి ఇదో పువ్వు.. కుళ్లిన మాంసం వాసన దీని స్పెషాలిటీ!
చూట్టానికి బాగా ఎదిగిన మొలకలా కనిపిస్తోంది కదా. కానీ నిజానికి ఇదో పువ్వు! భారీ పరిమాణంతో పాటు ముక్కుపుటాలను అదరగొట్టే కుళ్లిన మాంసం తరహా కంపు వాసన దీని స్పెషాలిటీ. అందుకే దీన్ని కార్ప్స్ ఫ్లవర్ అని పిలుస్తారు. పదేళ్లకోసారి మాత్రమే పూయడం దీని మరో ప్రత్యేకత. పూసిన ఒకట్రెండు రోజుల్లో వాడిపోతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని బొటానికల్ గార్డెన్లో ఇలా కనువిందు చేసింది. దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటూనే ఆసక్తిగా పదేపదే వాసన చూసి మరీ వెళ్తున్నారు! అంతరిస్తున్న జాబితాలో ఉన్న ఈ పువ్వు శాస్త్రీయ నామం అమర్ఫోఫలస్ టైటానియం. టైటన్ ఆరమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని అడిలైడ్ నుంచి 2021లో మెల్బోర్న్కు తరలించారు. అప్పటినుంచీ ఎప్పుడు వికసిస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొచ్చారు. క్షిపణి ప్రయోగం విజయవంతం మంగళవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ప్రయోగశాల నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్న లాంగ్ రేంజ్ లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం). సైంటిస్టులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు దీన్ని వీక్షించారు. ప్రయోగ సందర్భంగా క్షిపణిలోని అన్ని వ్యవస్థలూ అద్భుత పనితీరు కనబరిచినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు వెల్లడించింది. పనితీరును మెరుగుపరిచే అత్యాధునిక వైమానిక, సాఫ్ట్వేర్ వ్యవస్థలు దీని సొంతం. డీఆర్డీఓతో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (బెంగళూరు) ఈ క్షిపణిని తయారు చేసింది. బీఈఎల్ తదితర సంస్థలు కూడా ఇందులో భాగం పంచుకున్నాయి. వాహనాల నుంచి కూడా ప్రయోగించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రయోగాన్ని విజయవంతం చేసిన సైంటిస్టులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు.చదవండి: విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు! -
ఎర్రచందనం..ఎనీటైమ్ ప్రొటెక్షన్
చిప్ పనితీరు ఇలా.. రియల్‌టైం ప్రొటెక్షన్ చిప్ సెన్సార్ పరికరం 3.6 వాల్ట్స్ లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఎర్రచందనం చెట్లను ఎవరైనా నరికినా, దొంగిలించేందుకు ప్రయత్నించినా క్షణాల్లోనే మొబైల్ అప్లికేషన్స్, వాట్సాప్‌లకు అలర్ట్స్ పంపిస్తుంది. చెట్ల వద్ద ఉన్న హూటర్ ఎలక్ట్రానిక్ సైరన్ మోగిస్తుంది. వెంటనే అప్రమత్తమై చెట్లను రక్షించుకోవచ్చు.మొబైల్ అప్లికేషన్స్‌తో క్లౌడ్ సర్వర్‌ను అనుసంధానం చేయడంతో యూజర్స్‌కు వివిధ రకాల నివేదికలు చేరవేస్తుంది. గచ్చిబౌలి : ఖరీదైన ఎర్రచందనం చెట్లను పరిరక్షించేందుకు అధునాతన పరికరం (రియల్‌టైం ప్రొటెక్షన్ చిప్) అందుబాటులోకి వచ్చింది. నగరంలోని బొటానికల్ గార్డెన్లో ప్రయోగాత్మకంగా చిప్ సెట్లు అమర్చినట్టు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) వైస్‌చైర్మన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో విలేకరుల సమావేశంలో అధునాతన టెక్నాలజీని ఆయన వివరించారు. బొటానికల్ గార్డెన్లో 10 వేల ఎర్రచందనం మొక్కలు ఉన్నాయని, మొదటి విడతలో 50 ఎర్రచందనం చెట్లకు రియల్ టైం ప్రొటెక్షన్ చిప్‌లు అమర్చామని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన సీబీఐఓటీ టెక్నాలజీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. చిప్‌ల అమరికతో దొంగల నుంచి ఎర్రచందనం చెట్లను రక్షించుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే వీలుంటుందన్నారు. సీబీఐఓటీ సీఈఓ సత్యనారాయణ చొప్పదండి మాట్లాడుతూ ఎర్రచందనం చెట్ల రక్షణకు తమ సంస్థ ఇండియన్ ఉడ్ సైన్స్ టెక్నాలజీస్(ఐడబ్ల్యూఎస్‌టీ) సహకారంతో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ టెక్నాలజీని ఐడబ్ల్యూఎస్టీతో పాటు ఢిల్లీ ఐకార్, బెంగళూరు, ఝాన్సీ నగరాల్లో వాడుతున్నట్టు వివరించారు. సెన్సార్ కేసింగ్ (యాంటినో)తో అనుసంధానం చేయడంతో మొబైల్ ఫోన్లోనే చెట్ల రక్షణ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎవరైనా చెట్టును కొట్టేందుకు ప్రయత్నించినా చిప్ సెట్ సాయంతో అలారం మోగుతుందన్నారు. ఒక్క సెన్సార్ కేసింగ్‌తో కిలోమీటరు దూరంలో ఉన్న 500 చెట్లకు చిప్‌లను అమర్చుకోవచ్చన్నారు.అధికగాలి, జంతువుల రాపిడిని గుర్తించే విధంగా చిప్ సెట్ ఉంటుందన్నారు. ప్రతిరోజూ రాత్రి చెట్టుకు సంబంధించిన సమాచారాన్ని సర్వర్‌కు చేరవేస్తుందన్నారు. చెట్టును కొట్టాలని చూస్తే అలారం మోగుతుందని, చెట్టు ఎక్కడ ఉందనే వివరాలు ఫోన్‌కు చేరవేసి మ్యాప్ ద్వారా డైరెక్షన్ చూపిస్తుందన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్‌నాయక్, డైరెక్టర్ అక్బర్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల: శేషాచలం.. సంజీవని ఔషధ వనం
శేషాచలం అంటే ఔషధ వనం. ఇప్పటివరకూ మనకు శేషాచల కొండలు అంటే వేంకటేశ్వర స్వామి నిలయం, ఎర్రచందనం అడవులని మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ అపర సంజీవని వంటి వన మూలికలు, ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఆస్పత్రులే లేని కాలంలో రాజులు, జమీందార్లకు ఈ శేషాచలమే వైద్యశాల. ఔషధ మొక్కలు.. వనమూలికలతోనే ఎలాంటి జబ్బులైనా నయం చేసేవారు. నిజానికి ఆ నాటి నుంచి నేటికీ అడవిలో లభించే ఈ ఔషధ మొక్కల గురించి కొందరికి మాత్రమే తెలుసు. నేటి తరానికి ఒకింత విడ్డూరం అనిపించినా.. నాటి ఆయుర్వేద వైద్య మూలాలే నేటి అల్లోపతి, హోమియోపతి, ఆయుష్ తదితర అన్ని రకాల వైద్యానికి ఆధారం. ఇంతటి అద్భుతమైన ఔషధ మొక్కలు, వనమూలికలు, వృక్షాలను తనలో దాచుకున్న శేషాచలం కొండల్లో అన్వేషణ సాగిస్తే తెలిసిన విశేషాలు.. తిరుపతి అలిపిరి.. శేషాచల అటవీ ప్రాంతం ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లా వ్యాప్తంగా 526చదరపు కిలో మీటర్లు (82,500 హెక్టార్ల)లో వ్యాపించి ఉంది. దీన్ని రెండు విభాగాలుగా విభజించారు. శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్కు–353చదరపు కిలోమీటర్లు టీటీడీ పర్యవేక్షణలో, వన్యప్రాణి అభయారణ్యం – 526చదరపు కిలోమీటర్లు అటవీశాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ఈశాన్య పర్వత శ్రేణుల్లో భాగమైన శేషాచలం కొండలు ఎన్నో వింతలు, విశేషాలు, చరిత్రలు, అద్భుతాలకు ఆలవాలం. దేవతా మూర్తులకు నిలయంగా నానుడిలో ఉన్న శేషాచలం కొండలను బొటానికల్ స్వర్గం అని పరిశోధకులు పిలుస్తుంటారు. అత్యంత అరుదైన ఔషధ, వన మూలికలతో తయారు చేసిన ఆయుర్వేద మందులు మానవాళికి ఆయువుతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. ఈ కారడవిలో 176 కుటుంబాలకు చెందిన 1500కు పైగా జాతుల మొక్కలను పరిశోధకులు గుర్తించారు. ప్రతి మూలిక, మొక్క కూడా ఏదో ఒకరకమైన మానవ, జంతు, పక్షు వ్యాధులను నయం చేసే గుణాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ వ్యతికినా దొరకని అతి అరుదైన జాతి వృక్షాల్లో ఎర్రచందనం ఇక్కడి ప్రత్యేకత. దీంతోపాటు జాలారీ, తంబ జాలారి, తెల్లకరక, మొగిలి వంటివి ఇక్కడ దర్శనమిస్తాయి. శేషాచల అడవుల్లో దొరికే ఈ అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులపై నిత్యం జాతీయ, అంతర్జాతీయ పరిశోదనలు జరుగుతుండటం విశేషంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ గుర్తింపు అరుదైన పక్షి, జంతు, వృక్ష జాతులు ఇక్కడ మాత్రమే దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలోనే శేషాచల పర్వత శ్రేణిని బయోస్పియర్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ సంచరించేందుకు అడవులపై ఆధారపడి జీవనం సాగించే వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. దీనినే బఫర్ జోన్ అంటారు. బయోస్పియర్ జాతీయ, అంతర్జాతీయ పరిశోధనలు జరుగతూనే ఉంటాయి. శేషాచల అడవులకు అంతర్జాతీయ గుర్తింపు రావటం విశేషం. ఊడుగ చెట్టు(అంకోలము) వేర్లు, పండ్లు, విత్తనాలను ఉపయోగించి ఆయుర్వేద మందులు తయారుచేస్తారు. అలంగియేసి కుటుంబానికి చెందినది ఈ మొక్క. ఆంగ్లంలో అలంగియం సాలి్వఫోలియం అని పిలుస్తారు. ఆ్రస్టింజెంట్, ఆంథెలి్మంటిక్, డయేరియా, లెప్రసీ, ఎరిసిపెలాస్, చర్మ వ్యాధులు, మూత్ర సంబంధిత రుగ్మతలు, జ్వరము, రక్తస్రావము, వెఱి< కుక్కలు, కండ్లకలక తదితర వ్యాధుల నివారణకు దీనిని ఉపయోగిస్తారు. గిల్లతీగ గిల్లతీగ ప్రత్యేకించి శేషాచలంలోని తలకోన అటవీ ప్రాంతంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇది లయనాసి తీగల జాతికి చెందినది. చెట్టుకు చెట్టును ఆధాంరం చేసుకొని అడివంతా అల్లుకుంటూపోతుంది. ఇది మూడు వతాబ్దాల నాటి దని పరిశోధకులు చెబుతున్నారు. తలకోన ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల మేర అల్లుకుపోవడాన్ని చూడవచ్చు. దీని చుట్టుకొలత 260 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ తీగకు కాసే కాయలు సుమారు 100సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. వృక్ష కాయలలో అతిపెద్ద కాయగా పరిగణిస్తారు. కొండజాతి ప్రాంతీయులు దీని కాయల్లో ఉన్న గుజ్జును తొలిగించి అగ్గిపెట్టెగా వాడుకుంటారు. మరి కొందరు నసిం డబ్బాగాను వాడతారు. తీగ బెరడులో సఫోనిక్ అనే చేపల చంపే పదార్థం ఉంటుంది. నేలవేము ఈ రకం చెట్టు శేషాచలం అడవిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మొక్కననుయాంటిపైరేటిక్, యాంటిపెరియాడిక్, యాంటీ ఇన్ప్ల్లమేటరీ, అల్సర్లు, దీర్ఘకాలిక జ్వరాలు, బ్రాంకైటిస్, చర్మ వ్యాధులు, లెప్రసీ, పేగు పురుగులు, హేమోరాయిడ్స్, కామెర్లు, కడుపు పూతలకు వినియోగిస్తారు. ఇది అకాంతసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని ఇంగ్లీషులో ఆండ్రొగ్రాఫిస్ పానిక్యులేటా అని అంటారు. తెల్ల కరక శేషాచలంలో మాత్రమే అరుదుగా దొరికే ఈ తెల్లకరకను మూత్రవిసర్జన, వాపులు, యాంటిపైరేటిక్, ప్రక్షాళన, విరేచనాలు, పెప్టిక్ అల్సర్లు, మధుమేహం, వెనిరియల్ వ్యాధులు, దగ్గు, జలుబు, విరేచనాలు, పగుళ్లుకు వాడతారు. కాంబ్రెటేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను ఆంగ్లంలో టెర్మినలియా పల్లిడా అని పిలుస్తారు. దీనిలో పండు భాగాన్ని వినియోగించి మందు తయారు చేస్తారు. నక్కతోక ఇది అకాంతసి కుటుంబానికి చెందిన మొక్క. నక్కతోక మొక్కలోని అన్ని భాగాలు పలు రకాల ఆయుర్వే మందులకు వినియోగిస్తారు. దీనిని ఆంగ్లంలో ఎక్బోలియం వైరైడ్ అంటారు. గౌట్, డైసూరియా, స్ట్రిక్చర్, కామెర్లు, మెనోరాగియా, రుమాటిజం. కణితుల నివా రణకు ఉపయోగిస్తారు. మొగిలి పాండనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులను పంటి నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, రుమాటిజం, మూత్ర విసర్జన, యాంటి వైరల్‌కు దీనిని వినియోగిస్తారు. దీనిని ఆంగ్లములో పాండనస్ అమరిల్లిఫోలియస్ అని అంటారు. కప్పరిల్లాకు ఈ ఆకుతో మూత్ర సంబంధిత వ్యాధులు, యోని ఉత్సర్గ, కోలిక్ మరియు డిస్పెప్సియా, కాలేయం, ఆస్తమా, బ్రోన్కైటిస్, జలుబు, దీర్ఘకాలిక దగ్గు పనితీరును ప్రేరేపిస్తుంది. ఇది లామియాసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని కోలియస్ అంబోనికస్ అని అంగ్లంలో పిలుస్తారు. బ్రయోపైలం బ్రయోఫిలమ్ కలిసినం అని ఆంగ్లములో పేర్కొనే ఈ మొక్క క్రాసులేసి కుటుంబానికి చెందినది. దీని ఆకులను చర్మ సమస్యలు, రక్త ప్రసరణ, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు దోహదపడుతాయి. ఇది శేషాచలంలో మాత్రమే లభించే ఔషధ మొక్క చంపకము(మాను సంపంగి) మాగ్నోలియాసీ కుటుంబానికి చెందిన ఈ మొక్కను అజీర్తి, వికారం, మూత్రపిండ వ్యాధులలో స్కాల్డింగ్, మహిళల నెలసరి నియంత్రణ, ఉన్మాదం, మతిమరుపు, అబారి్టఫేసియంట్(రూట్ జ్యూస్)కు వాడతారు. మిచెలియా చంపాకా అని ఆంగ్లంలో పిలుస్తారు. భూ తులసి(విభూది పత్రి) లామియాసి కుంటుబానికి చెందిన ఈ మొక్కను ఓసిమమ్ బాసిలికం అని అంగ్లంలో పిలుస్తారు. బెణుకులు, ఉబ్బసం, విరేచనాలు, బ్రోన్కైటిస్, గోనేరియా, నెఫ్రైటిస్, అంతర్గత పైల్స్ వంటి జబ్బులు నయం కావడానికి వినియోగిస్తారు. జాలారి ఈ వృక్షం తలకోన అడవుల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. జలపాతానికి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని ఆలయ ధ్వజçస్తంభాలకు వాడతారు. దీని చేవ అతిగట్టిగానూ ధృడంగానూ ఉంటుంది. ఈ చెట్టు ఆకులను కామెర్ల నివారణకు వినియోగిస్తారు. కృష్ణ తులసి(తులసి) లామియాసి కుటుంబానికి చెందిన ఈ మొక్క ఆకులు, కాండము, వేర్లను సాధారణ జలుబు, దగ్గు, బ్రోంకోస్పస్్మ, సాధారణ బలహీనత, ఒత్తిడి రుగ్మతలు, చర్మవ్యాధులు, గాయాలు, అజీర్ణం, వికారం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీనిని అంగ్లంలో ఓసిమమ్ శాన్్కటమ్ అని పిలుస్తారు. చిన్నబిక్కి దీనిని ఆంగ్లములో గలినీయా రజినిపెరా అని పిలుస్తారు. ఇది రూజియేసా కుటుంబానికి చెందినది. దీని సమూలాన్ని పూత ద్వారా తేలుకాటుకు వాడతారు. బిక్కి చెట్టు శేషాచలంలోని చామల, దిన్నెల, కోడూరు, నాగపట్ల అటవీ ప్రాంతంలో విరివిగా దొరుకుతుంది. బిల్లుడు ఫ్లిండర్ సీయాసీ అనే ఈ బిల్లుడు జాతిని ఆంగ్లములో క్లోరోక్జిలాన్ అని పిలుస్తుంటారు. దీని బెరడు తీసి రసం తయారు చేసి చర్మవ్యాధులకు ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా శేషాచల అటవీ ప్రాంతంలోని పాపవినాశనం, బాలపల్లి, రాజంపేట, భాకరాపేట, తలకోన అటవీ ప్రాంతంలో చూడవచ్చు. రాజ వైద్యుల కట్టుమాత్రలు ఇక్కడి గుహల్లో.. ఈ ఫోటోలో కనిపిస్తున్నవి చూస్తే రాళ్లు అనుకుంటారు. కాదు ఇవి కట్టుమాత్రలు (సాధుడు మాత్రలు) అని సిద్ధవైద్యం చెబుతోంది. పురాతన కాలంలో రాజవైద్యులు శేషాచల గుహల్లో ఉంటూ అక్కడి ఆయుర్వేద మందులు తయారుచేసేవారు. 200ఏళ్ల ముందు రాజవైద్యులు తయారు చేసిన ఈ కట్టుమాత్రలను సాధువులు గుర్తించారు. లోహాలను, రసాయనాలను ఇక్కడ దొరికే వనమూలికా పసరుతో నూరి పుటం వేసి నాటు మందులు తయారు చేసేవారు. పూర్వం నాటు, మూలిక వైద్యానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు బయటపడినట్లు సాధువుల ద్వారా సమాచారం. హిమాలయాల్లో కూడా దొరకని అరుదైన మూలికలు ఈ శేషాచలం కొండల్లో దొరుకుతాయని మునులు అన్వేషణ సాగిస్తుంటారు. శేషాచలంలో దొరికే మూలికలతో తరాలుగా వైద్యం శేషాచల అటవీ ప్రాంతాల్లో దొరికే మూలికలు, ఔషశ మొక్కలతో ఆయుర్వేద వైద్యం అందిస్తున్నాం. ఈ విద్య మా పూరీ్వకుల నుంచి మాకు వచ్చింది. ఇప్పుడు నా వయస్సు 74 సంవత్సరాలు. క్యాన్సర్ మొదలుకొని తలనొప్పి, ఆయాసం వంటి అనేక జబ్బులకు మూలికల ద్వారా నయం చేస్తాం. కట్టుమాత్రలు తయారు చేసేంత మహానిపుణులు ఇప్పుడు లేరు. మా నాన్న, తాత కాలంలో ఎక్కువగా ఈ నాటు వైద్యం ద్వారానే జబ్బులు నయం అయ్యేవి. దానికి సంబంధించి మూలికలు మన ప్రాంతంలోనే దొరుకుతాయి. – రాజన్న, ఆయుర్వేద వైద్యులు, వెంకటగిరి నాడు ఆరోగ్యం క్షీణిస్తే.. అడవులకే వెళ్లేవారు.. నాటి పూరీ్వకుల కాలంలో ఆరోగ్యం క్షీణిస్తే అడవుల బాటపట్టడమే ఉత్తమంగా పరిగణించేవారని గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలు చెబుతున్నారు. తలనొప్పి, ఆయాసం, కీళ్లనొప్పులు వంటి జబ్బులతో బాధపడేవారు సమీప శేషాచల పర్వత శ్రేణి నుంచి వచ్చే జలపాతంలో స్నానాలు ఆచరించినా, ఇక్కడ వీచే గాలి పీల్చినా జబ్బులు మటుమాయం అవుతాయని చెప్పేవారు. శేషాచల తీర్థాలు వేర్లు, మూలికలు, ఔషధ మొక్కల నుంచి ఊట ద్వారా రావడం వల్ల వ్యాధులు నశించేగుణం ఈ నీళ్లకు ఉంటుందని చెబుతుంటారు. శేషాచలం అణువణువూ ఉపయోగకరమే.. ఔషధ, వనమూలికలు ఎక్కడ దొరకనివి ఈ పర్వతాల్లోనే దొరుకుతాయని మునులు, సాధువులు, నాటువైద్యులను కలిసినప్పుడు అనేక అంశాలను చెప్పారు. శేషాచల విశేషాలపై దాదాపు 15ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నాను. పూర్వీకులు, గ్రామీణులను నుంచి తెలుసుకొన్న ఎన్నో అంశాలు ఆశ్యర్యానికి గురి చేశాయి. రాజవైద్యులు, మునులు, సిద్ధమునులు ఈ ప్రాంతంలో ఆయుర్వేద వైద్యం చేసేవారని తెలిసింది. శేషాచలం అడవుల పరిరక్షణ ఎంతో అవసరం. ఎన్నో చరిత్రలకు ఇక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. శేషాచల పర్వతం అణువణువు మానవాళికి ఉపయోగకరమే. – బాబ్జిరెడ్డి, శాస్త్రవేత్త, ఎస్వీ యూనివర్సిటీ . -
బొటానికల్ గార్డెన్లో అరుదైన తూనీగ
జడ్చర్ల టౌన్: జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని బొటానికల్ గార్డెన్లో రియోథెమిస్ వరిగేటా జాతికి చెందిన రంగురంగుల తూనీగను గుర్తించినట్లు గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన భరత్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ గార్డెన్‌ను సందర్శించి పక్షులు, జంతువులను కెమెరాలో బంధిస్తుండగా అరుదైన తూనీగను గుర్తించినట్లు తెలిపారు. సాధారణంగా ఇలాంటి తూనీగలు చిత్తడి నేలలో ఎక్కువగా నివసిస్తూ చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటూ జీవిస్తాయన్నారు. ఈ రకమైన తూనీగలు మనదేశంతో పాటు, చైనా, వియత్నాం, జపాన్ దేశాల్లో మాత్రమే జీవిస్తాయన్నారు. అనేక అరుదైన మొక్కలు, జంతువులకు తెలంగాణ బొటానికల్ గార్డెన్ నిలయంగా మారుతోందన్నారు. -
ఇంతింతై.. కొలనంతై
సాక్షి, వైఎస్సార్: కొలనులో తేలియాడుతున్న ఈ ఆకులను ఆరంభదశలో చూస్తే సాధారణ కలువ ఆకులనే అనుకుంటారు. కానీ రోజు రోజుకూ పెరిగిపోతూ అతి తక్కువ కాలంలోనే ఇవి భారీ పత్రాలుగా రూపుదిద్దుకుని చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఒక్కో ఆకు దాదాపు 2.5 మీటర్ల వెడల్పు పెరిగి 40 కేజీల వరకు బరువు మోయగలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జెయింట్ వాటర్ లిల్లీ అనే ఈ మొక్కలు వైఎస్సార్ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్లో ఉన్నాయి. కొలను నిండుగా పత్రాలు నెమలి పింఛంలా ఉన్న పత్రం వెనుకభాగం వైవీయూ బొటానికల్ గార్డెన్ నిర్వాహకులు డాక్టర్ ఎ. మధుసూదన్‌రెడ్డి 2019లో కలకత్తా బొటానికల్ గార్డెన్ నుంచి వీటిని తీసుకొచ్చారు. రెండు మొక్కలు తీసుకువచ్చి గార్డెన్‌లోని కొలనులో వేసి సంరక్షించగా ప్రస్తుతం దాదాపు 100 మొక్కలు వరకు పెరిగాయి. విక్టోరియా కృజియానా అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క 1800 సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది. – వైవీయూ మొక్క నాటిన తర్వాత తొలి దశలో పత్రాలు ఇలా.. -
బాబోయ్ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం
వార్సా(పోలాండ్): పువ్వుల వాసనకు పరవశించిపోతాం.. వాసన లేని పువ్వును.. పూజకు పనికిరాదని పడేస్తాం! మనిషికి వాసన ఓ వరం, అవసరం కూడా. తేడా వస్తే మాత్రం.. కలవరమే! అయితే పోలాండ్లోని వార్సా యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్‌లో ఓ పుష్పం ఆదివారం వికసించింది. దాని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అయిన్పటికీ ఈ పుష్పాన్ని చూడటాకిని వందల మంది జనం క్యూ కడుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ పుష్పాన్ని అమోర్ఫోఫాలస్ టైటనం అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 3 మీటర్లు (10 అడుగులు) ఎత్తు వరకు ఉంటుంది. కొన్ని పూల రెక్కల సమూహంతో ఉండే ఈ పుష్పం వికసించడం చాలా అరుదు. అంతరించిపోతున్న సుమత్రన్ టైటాన్ అరుమ్ అనే పుష్పం మాంసాన్ని తినిపించే పరాగసంపర్క కీటకాలను ఆకర్షించడానికి కుళ్లిన శవం వాసనను విడుదల చేస్తుంది. అయితే ఈ మొక్క సుమత్రాలోని వర్షారణ్యాలలో మాత్రమే పెరుగుతుంది. కానీ అటవీ నిర్మూలన కారణంగా దీనికి ప్రమాదం వచ్చి పడింది. దీంతో వార్సా యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్‌లో దీన్ని సంరక్షిస్తున్నారు. కాగా ఈ పుష్పం చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇక సుమత్రా అడవుల్లో కాకుండా ఈ పుష్పం మొట్టమొదట 1889లో క్యూలోని లండన్ రాయల్ బొటానికల్ గార్డెన్స్‌లో వికసించింది. చదవండి: నేపాల్‌లో వర్ష బీభత్సం.. భారత్‌లోనూ ప్రభావం -
బొటానికల్ గార్డెన్‌కు అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్:ఎకో టూరిజం పేరుతో హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌కు ఐఎస్వో 9001–2015 సర్టిఫికెట్ లభించింది. దీంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల శివార్లలోని అటవీ భూములను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పార్కుల్లో ఒకదానికి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లయింది. ఒక పార్కుకు ఐఎస్వో సర్టిఫికెట్ రావడం దేశంలోనే మొదటిసారి కాగా బొటానికల్ గార్డెన్ ఈ అరుదైన ఘనతను సాధించింది. శనివారం బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ రఘువీర్, ఇతర అధికారులు ఐఎస్వో సర్టిఫికెట్ అందుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అటవీ శాఖ అర్బన్ ఫారెస్ట్ పార్కులను తీర్చిదిద్దుతోందని, బొటా నికల్ గార్డెన్‌కు ఐఎస్వో సర్టిఫికెట్ రావడానికి కృషి చేసిన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి ఇంద్రకరణ్ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో బొటానికల్ గార్డెన్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని, సందర్శకులు, వాకర్స్‌కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఫారెస్ట్ కార్పొరేషన్ వీసీ, ఎండీ రఘువీర్, హెచ్వైయం సీఈవో అలపాటి శివయ్య, తదితరులు పాల్గొన్నారు. -
‘కళ్లు’గప్పలేరు!
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం జనవరి 30... బొటానికల్ గార్డెన్స్ సమీపంలో ప్లాస్టిక్ సంచుల్లో గుర్తు తెలి యని మహిళ శరీర భాగాలు దొరికాయి. అత్యంత కిరాతకంగా ఆ హత్య జరిగింది. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక కుండా హంతకులు జాగ్రత్త పడ్డారు. అయినా పది రోజుల్లోనే చిక్కారు. వీరిని పట్టించడంలో కీలక పాత్ర పోషించింది సీసీ కెమెరాలే. ఇలా.. రాజధానిలో ఏటా ఎన్నో కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ‘మూడో కన్ను’ కీలకపాత్ర పోషిస్తోంది. ‘ఒక్క కెమెరా 10 మంది పోలీసులతో సమానం’ అనే నినాదంతో పోలీసు విభాగం ముందుకు వెళ్తోంది. ఢిల్లీ, ముంబై, సూరత్‌కు దీటుగా నగరంలో ఇవి ఏర్పాటవుతున్నాయి. అవసరమైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు ప్రత్యేక అనలెటిక్స్ సైతం జోడించడానికి పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది. నగరంలో ఏర్పాటు చేసిన కెమెరాలు అన్నింటినీ కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు అనుసంధానం చేయడం ప్రారంభించారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. నగరంలో మొత్తం 10లక్షల కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకెళ్తోంది. -
ఎడిన్‌బరో చెప్పే మన మొక్కల కథ..!
సాక్షి, హైదరాబాద్ : పొడవాటి ఆకులు.. వాటి చివరలు గులాబీ ఆకులకున్నట్టు ముళ్లతో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.. వాటికీ పూలు పూస్తాయి, కానీ గులాబీలు కాదు, చిన్నచిన్న కాయలు, అవి పళ్లుగా మారిన దాఖలాలు... అదో విచిత్రంగా కనిపిస్తున్న చెట్టు. తెలుగు నేలపై విస్తారంగా కనిపించేవట.. కానీ ఇప్పుడు వాటి జాడే లేదు. ఒక్క మొక్క కూడా కానరావటం లేదు. అంతరించాయట. ఇలా ఇదొక్కటే కాదు, ఒకప్పుడు మనుగడ సాగించిన ఇలాంటి మొక్కలెన్నో ఇప్పుడు కనుమరుగయ్యాయి. ‘మన మొక్కలు’ఎందుకు మాయమయ్యాయో మన దగ్గర వివరాలు లేవు, కనీసం వాటి ఆనవాళ్లు కూడా లేవు. కానీ స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బరోలో వాటి చిత్రాలున్నాయి. కొన్ని రకాల మొక్కలు తెలుగు నేలపై ఏ ప్రాంతంలో మనుగడ సాగించాయో కూడా వివరాలు వాటితోపాటు నిక్షిప్తమై ఉన్నాయట. ఇప్పుడు వాటిల్లో కొన్ని చిత్రాల రూపంలో హైదరాబాద్‌కు రాబోతున్నాయి. ఏమా చిత్రాల కథ..? ‘బొటానికల్ ఆర్ట్’...మొక్కను చూసి ఉన్నది ఉన్నట్టుగా చిత్రించటం. ఎప్పటి నుంచో వస్తున్న కళ ఇది. మన దేశంలో అంతగా ప్రాచుర్యంలో లేదు. కానీ, ఐరోపా దేశాల్లో ఇప్పటికీ కళకళలాడుతోంది. మన దేశం ఆంగ్లేయుల పాలనలో ఉన్న సమయంలో దీనికి ప్రాధాన్యం ఉండేది. ఆ సమయంలో బ్రిటిష్ కళాకారులతోపాటు కొందరు స్థానిక కళాకారులు కూడా బొటానికల్ డ్రాయింగ్స్‌లో ప్రతిభ చూపారు. ఈ ప్రాంతంలోని విశేష ప్రాధాన్యమున్న మొక్కల చిత్రాలను సిద్ధం చేశారు. అలా రూపుదిద్దుకున్న చిత్రాలు ఎన్నో ఎడిన్‌బరోలోని విశ్వవిఖ్యాత బొటానికల్ గార్డెన్ మ్యూజియంలో కొలువు దీరాయి. వాటిల్లో ‘తెలుగు మొక్కలు’కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ చిత్రాలతో నగరంలో ఓ ప్రదర్శన ఏర్పాటు కాబోతోంది. మార్చి 6 నుంచి 31 వరకు స్టేట్ మ్యూజియంలోని భగవాన్ మహావీర్ ఆడిటోరియంలో ఇది కొనసాగనుంది. హెరిటేజ్ తెలంగాణ, ఎడిన్‌బరో రాయల్ బొటానికల్ గార్డెన్, గోథె జంత్రమ్ సంయుక్తాధ్వర్యంలో ఇది ఏర్పాటు కాబోతోంది. ఫారెస్ట్స్ అండ్ గార్డెన్స్ ఆఫ్ సౌత్ ఇండియా పేరుతో ఇది ఏర్పాటవుతోంది. ఆంగ్లేయుల పాలనకాలంలో రూపుదిద్దుకున్న దక్షిణ భారత దేశంలోని మొక్కల పెయింటింగ్స్‌ను ఇందులో ప్రదర్శిస్తారు. కనుమరుగైనట్టు తేల్చినవి ఇవే... గతంలో ఎడిన్‌బరో రాయల్ బొటానికల్ గార్డెన్ మ్యూజియం క్యూరేటర్‌గా పనిచేసిన హెన్రీ నోల్టే ఆ చిత్రాలకు సంబంధించి ఎన్నో వివరాలను తెలుసుకుని పుస్తక రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్రాయింగ్స్ ఆధారంగా ఆ మొక్కలను ప్రత్యక్షంగా చూడాలని భావించి గతంలో ఆయన దక్షిణ భారత దేశంలో పర్యటించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రూపం)కు కూడా వచ్చారు. ఇక్కడ మొక్కలను పరిశోధిస్తుండగా, కొన్ని రకాలు అంతరించినట్టు గుర్తించారు. అసలు వాటి మనుగడే లేదని, ప్రస్తుతం అవి బొటానికల్ ఆర్ట్‌కే పరిమితమైనట్టు తేల్చారు. ఆ చిత్రాలను 19వ శతాబ్దంలో చిత్రించినందున, అప్పట్లో అవి మనుగడలో ఉన్నట్టు పేర్కొంటూ తన పరిశోధన వివరాలను పుస్తకంలో నిక్షిప్తం చేశారు. చెన్నై సమీపంలో ఉన్న ‘దక్షిణ్ చిత్ర’నిర్వాహకులు ఇటీవల ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో ఎడిన్‌బరో బొటానికల్ ఆర్ట్ కూడా భాగం కావటంతో సందర్శకులను ఆకట్టుకుంది. దీంతో హెరిటేజ్ తెలంగాణ నగరంలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గోథె జంత్రమ్, ఎడిన్‌బరో బొటానికల్ గార్డెన్ నిర్వాహకులతో సంప్రదించటంతో వారు అంగీకరించారు. గుర్తింపు పొందిన నేపాల్‌కు చెందిన నీరా జోషి ప్రధాన్, బెంగళూరుకు చెందిన నిరుప రావు, మీన సుబ్రమణియన్‌లు పాల్గొనబోతున్నట్టు హెరిటేజ్ తెలంగాణ డైరక్టర్ విశాలాచ్చి తెలిపారు. -
‘బెంగళూరు’ నగరానికి ఏమైందీ?
సాక్షి, న్యూఢిల్లీ : 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఎటు చూసినా పచ్చిక బయళ్లు, అందమైన సరస్సులతో అలరించిన బెంగళూరు నగరం 21వ శతాబ్దంలో బోసి పోయింది. ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరుపొందిన నగరం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్‌గా పేరు మార్చుకుంటోంది. 17వ శతాబ్దంలో కూరగాయల పంటలతో పచ్చగా కనిపించిన నగరంలో 18వ శతాబ్దంలో ఆనాటి పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు మొదటిసారిగా ల్యాండ్ స్కేప్ గార్డెన్లను డిజైన్ చేశారు. 1799లో బ్రిటీష్ పాలకులు టిప్పు సుల్తాన్‌ను ఓడించి బెంగళూరు నగరాన్ని స్వాధీనం చేసుకున్నాక నగరంలోని అతి ప్రాచీన ‘లాల్ బాగ్’ పార్క్‌లో ఫలపుష్పాల పెంపకాన్ని ప్రోత్సహించారు. అందుకోసం వారు ప్రతి ఏటా భారీ ఎత్తున పూల ప్రదర్శన పోటీలను కూడా నిర్వహించేవారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పార్కులను అభివృద్ధి చేసిన బ్రిటీష్ పాలకులు, ఓరాంగుటాన్, నల్ల పులుల లాంటి జంతువులను విదేశాల నుంచి తీసుకొచ్చి జంతు సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. నాడు బ్రిటీష్ పర్యాటనకులను కూడా విశేషంగా ఆకర్షించిన బెంగళూరు నగరం అనతికాలంలోనే ఇతర దేశాల పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షించింది. ఫలితంగా భిన్న సంస్కృతల సమ్మిళిత నిలయంగా నగరం కనిపిచ్చేది. 1970వ దశకంలో, 1990వ దశకంలో నగరంలో పార్కులను దేశ పాలకులు బాగా అభివృద్ధి చేశారు. 1973లో నగరంలో 68.27 శాతం చెట్లు ఉండగా, 2013 నాటికి అవి 15 శాతానికి చేరుకున్నాయని, అంటే ప్రతి ఏడుగురు పౌరులకు ఒక్క చెట్టు చొప్పున మిగిలిందని ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’కు చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. నేడు నగరంలో 1200 పార్కులు ఉన్నట్లు ‘బృహత్ బెంగళూరు మహానగర పాలిక’ ఘనంగా చెప్పుకుంటోంది. కానీ ఆ పార్కుల మొత్తం విస్తీర్ణం కలిపి రెండు చదరపు కిలోమీటర్లు మాత్రమే. మొత్తం బెంగళూరు నగరం విస్తీర్ణం 2,196 చదరపు కిలోమీటర్లు. అంటే నగర విస్తీర్ణంలో పార్కుల శాతం 0.1 శాతం మాత్రమే. ప్రస్తుతం ఆ పార్కులు కూడా వాకర్లకు తప్పించి మరెవరికీ ఉపయోగపడడం లేదు. ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది లేదా పది గంటల వరకు, మళ్లీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకే తెరిచి ఉంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా వాకర్లే పార్కుల్లో తిరుగుతుంటారు. ఏ మూలో బాగుందగదా అని కాసేపు కూర్చుంటే విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. అవి ఏ పిట్టల అరుపులో అనుకుంటే పొరపాటే. పార్కు సెక్యూరిటీ గార్డుల విజిల్స్. పార్క్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరికలు. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పార్కులను సంఘవిద్రోహ శక్తులు, మందుబాబులు, పడుపుకత్తెల బెడద పేరుతో మూసేస్తున్నారు. ఈ మాత్రపు పచ్చదనాన్ని అనుభవించే భాగ్యం ప్రవేశ రుసుంల కారణంగా పేదలకు, కార్మికులకు అందుబాటులో లేకుండా పోతోంది. (నగరంలోని ఆజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ ప్రొఫెసర్ హరిణి నాగేంద్ర తన నగరానికి ఏమైందన్న ఆందోళనతో రాసిన ‘నేచర్ ఇన్ ది సిటీ’లో అంశాలివి) -
బొటానికల్ గార్డెన్‌ను ప్రారంభించిన కేటీఆర్
-
పాపం.. పసివాడు
గచ్చిబౌలి: అమ్మ కనిపించక 19 రోజులైంది.. నాన్నేమో దూరంగా ఉన్నాడు.. హోంలో ఆ ఎనిమిదేళ్ల బాలుడు అనాథలా మిగిలిపోయాడు. పింకీ హత్య కేసు నేపథ్యంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. బిహార్‌కు చెందిన పింకీ కుటుంబసభ్యులు ఇటుక బట్టీలలో కూలీ పనులు చేస్తున్నారు. పింకీకి 13 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన దినేష్‌తో వివాహం జరిగింది. కొడుకులు దేవ్(10), జతిన్(08), కూతురు నందిని(05) ఉన్నారు. పెద్ద కొడుకు దేవ్, కూతురు న ందిని భర్త వద్ద వెళ్లి చిన్న కొడుకు జతిన్‌ను తీసుకొని మూడేళ్ల క్రితమే వికాస్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లింది. నమ్మి వంచిచిన వికాస్ కశ్యప్ మరో ఇద్దరితో కలిసి దారుణంగా హత్య చేసి, శరీర భాగాలను కోసి మూటగట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పేడేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు రానున్న కుటుంబ సభ్యులు పింకి కుటుంబ సభ్యలు కటిక పేదరికంలో ఉన్నారు. కనీసం చిన్నప్పటి నుంచి పోటో కూడా దిగలేదని పోలీసులు చెబుతున్నారు. కూలీ పనులు చేసుకునే పింకీ తల్లిదండ్రులు, సోదరుడు హైదరాబాద్‌కు వచ్చేందుకు రవాణా ఖర్చులు కూడా లేక పోవడంతో ఎవరూ వచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పింకీ తండ్రి డప్పూ లియా, సోదరుడు సింతూ లియా, సోదరికి మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలున్నాయి. ఉస్మానియా మార్చురీలో ఉన్న పింకీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సన్నహాలు చేస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే పింకీ మృతదేహం తీసుకునేందుకు కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు పంపాలని బీహర్ పోలీసులతో మాట్లాడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు ఇష్ట ప్రకారమే అంత్య క్రియలు జరుగుతాయని పోలీసులు తెలిపారు. వారికి ఇష్టమైతే మృతదేహాన్ని తీసు కెళ్లవచ్చని, లేదా హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు చేస్తామంటే తమ సహకారం ఉంటుందన్నారు. జతిన్‌ను తీసుకెళ్లేందుకు తండ్రి అంగీకరించాడని పోలీసులు తెలిపారు. -
గర్భిణీని ముక్కలుగా చేసింది వీళ్లే...!
-
ఆ కిరాతకానికి పాల్పడింది వీళ్లే..!
సాక్షి, హైదరాబాద్: సంచలనం రేపిన బొటానికల్ గార్డెన్ వద్ద గర్భిణీ మృతదేహం పడేసిన కేసులో పోలీసులు నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిండు గర్భిణీ అన్న కనీస కనికరం లేకుండా ఆమెను హతమార్చిన నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధాలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. మృతురాలు పింకీ స్వస్థలం బిహార్‌లోని కుగ్రామమని, వివాహేతర అక్రమ సంబంధాలే ఆమెను బలిగొన్నాయని తెలిపారు. దారుణం జరిగిందిలా.. బిహార్‌కు చెందిన బింగి అలియాస్ పింకీకి దినేశ్ అనే వ్యక్తితో 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. 2017లో భర్తను విడిచిపెట్టిన పింకీ.. వికాస్ అనే వ్యక్తితో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. అయితే, వికాస్‌కు అంతకుముందు నుంచే మమతా ఝా అనే మహిళతో అక్రమ సంబంధం ఉంది. మమతా ఝా, అనిల్ ఝా భార్యాభర్తలు.. వారి కుమారుడు అమర్‌కాంత్ ఝా. బతుకుదెరువు కోసం వీరు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో తన ప్రియుడు వికాస్‌ను వెతుక్కుంటూ పింకీ కూడా హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ అమర్ కాంత్ కుటుంబంతో కలిసి ఉంటున్న వికాస్‌కు అతని తల్లి మమతతో అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని పింకీ గ్రహించింది. దీని గురించి వికాస్‌ను నిలదీసింది. ఈ కోపంలోనే గత నెల 29న పింకీపై నలుగురూ దాడి చేశారు. వారు కిరాతకంగా కొట్టడంతో కడుపులోని పాప సహా పింకీ చనిపోయింది. ఆ తర్వాత స్టోన్ కట్టర్‌తో మృతదేహాన్ని ముక్కలు చేసి..గోనెసంచిలో పడేసి.. రాత్రి సమయంలో బైక్ మీద మృతదేహాన్ని తరలించారు. ఈ కేసులో నిందితులైన మమతా ఝా, అనిల్ ఝా, అమర్‌కాంత్ ఝా, వికాస్‌లను అరెస్ట్ చేశారు. చాలెంజ్‌గా మారిన ఈ మర్డర్ మిస్టరీని సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. 150 సీసీ కెమెరాల్లో ఈ ఘటనను పరిశీలించి.. నిందితుల ఆచూకీ కనిపెట్టినట్టు సీపీ సందీప్ శాండిల్య మీడియాకు తెలిపారు. -
కొండాపూర్ గర్భిణి హత్య కేసులో నిందితుల గుర్తింపు
-
బొటానికల్ గార్డెన్ హత్యకేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : కొండాపూర్‌లో సంచలనం కలిగించిన గర్భిణీ హత్యకేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నాగ్‌పూర్‌కు చెందిన విజయ్‌కుమార్ భార్య ఉండగానే మహారాష్ట్రకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో వివాహం చేసుకోవాలంటూ వత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలి చూసిన విజయ్‌కుమార్ పధకం ప్రకారం ఆమెను హతమార్చాడు. గత నెల 28న ఆమెను హత్య చేసి చిన్న చిన్న ముక్కలుగా నరికి, గోనె సంచిలో కుక్కి, బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. హత్య చేసిన రెండు రోజులకే విజయ్ హైదరాబాద్ విడిచి పారిపోయాడు. మరో వ్యక్తి ఈ హత్యకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. మాదాపూర్‌లోని సిద్ధిక్ నగర్‌లోని విజయ్ ఇంటిని పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజీల ద్వారా ఇప్పటికే నిందితులను గుర్తించిన పోలీసులు హంతకుల కోసం గాలింపు చేపట్టారు. విజయ్‌కుమార్ వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయమే ఈ కేసులో పోలీసులు అసలు నిందితులను గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులు చివరకు కేసును ఓ కొలిక్కితీసుకొచ్చారు. -
యమహాపై వచ్చి.. శవాన్ని పడేసి
సాక్షి, హైదరాబాద్ : కొండాపూర్ బొటానికల్ గార్డెన్ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పలు కీలక ఆధారాలతో పాటు మృతురాలి వివరాలను సేకరించారు. ఈ హత్య కేసులో కీలక నిందితులను సీసీటీవీ పుటేజీ ద్వారా గుర్తించారు. మృతదేహాన్ని ఏపీ 10 ఏఎల్ 9947 నంబర్ ఉన్న యమహా బైక్‌పై తీసుకువచ్చి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసి వెళ్లిపోయినట్లు నిర్ధారించారు. బైక్ ఎవరిదని విచారించగా బౌద్దనగర్‌లోని ఆనంద్ కుటీర్‌కు చెందిన గర్డే విజయ్‌కుమార్‌కు చెందినదిగా గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. గచ్చిబౌలి పోలీసులు మృతురాలు మహారాష్ట్ర వాసిగా గుర్తించారు. కొండాపూర్‌తో పాటు నగరంలో నివాసం ఉంటున్న మహారాష్ట్ర, అస్సాం వాసులను పోలీసులు విచారిస్తున్నారు. పదిరోజుల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్రితం మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనె సంచిలో పెట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పడేసిన సంగతి తెలిసిందే. -
తమిళనాడులోని పార్క్ వింత నిర్ణయం
-
మహిళను హత్య చేసి మూటలో పడేశారు
-
ఆ పార్క్‌కి వెళ్లే జంటలకు షాక్
సాక్షి, చెన్నై : చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే జంటలను కట్టడి చేసేందుకు తమిళనాడులోని ఓ పార్క్ వింత నిర్ణయం తీసుకుంది. పార్క్‌లోకి ప్రవేశించాలంటే వారు తప్పనిసరిగా వివాహ ధృవీకరణ పత్రం చూపించాల్సిందన్న నియమం విధించింది. కోయంబత్తూర్ మరుధామలియా రోడ్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్ లో జంటల వెకిలి చేష్టలు గత కొంతకాలంగా బాగా పెరిగిపోయాయి. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయటంతో అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. పార్క్‌కి వెళ్లే జంటలు తమ వెంట తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. సర్టిఫికెట్ చూపించకపోతే వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తారు. తొలుత జంటల ఓటర్ ఐడీ, ఆధార్ తరహాలో గుర్తింపుకార్డులు, ఫోన్ నంబర్లను పరిశీలించాలని భావించారు. కానీ, చివరకు వివాహ ధృవీకరణ పత్రం అయితేనే సబబన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ నిర్ణయంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవటం మంచిదేనని.. అందుకోసం ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం సరికాదని వారంటున్నారు. పార్క్‌ను ‘ఫ్యామిలీ బిజినెస్’గా మార్చారంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం అమలయ్యాక విద్యార్థుల తాకిడి బాగా తగ్గిందంటూ సిబ్బంది చెబుతున్నారు. -
కావాలంటే గూగుల్‌పై దావా వేసుకో
హైదరాబాద్ : కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ అభివృద్ధిపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు, ఓ కాంగ్రెస్కార్యకర్తకు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్‌కు సంబంధించి 2011, 2016 సంవత్సరాల్లో గూగుల్ మ్యాప్స్ నుంచి తీసిన రెండు ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నగరపౌరులకు ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న బొటానికల్ గార్డెన్‌ను 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవైట్ సంస్థలకు కట్టబెట్టి నాశనం చేయాలని చూసిందని 2011లో తీసిన ఓ ఫోటోనుపెట్టారు. 270 ఎకరాల పార్క్‌ను కాపాడి అందులో పచ్చదనాన్ని పెంపొందించామని పేర్కొంటూ.. గూగుల్ మాప్స్ నుంచి నవంబర్ 2016లో తీసిన మరో ఫోటోని పోస్ట్ చేశారు. ఈ రెండు చిత్రాల్లో 2011లో తీసిన ఫోటోలో చెట్లు చాలా పలుచగా ఉన్నట్టు, 2016లో తీసిన ఫోటోలో చెట్లు దట్టంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. Pictures do tell a story! Attached are two pics of Botanical Garden, Kondapur 1st pic from 2011 when the then Cong Govt wanted to privatise & destroy precious urban lungspace 2nd pic is from Nov 2016 which shows how we’ve been able to restore greenery & save the 270 Acre park😊 pic.twitter.com/TPuxe4pyd0 — KTR (@KTRTRS) November 20, 2017 అయితే కేటీఆర్ పెట్టిన పోస్టుపై ప్రియబ్రతా త్రిపాఠి(కాంగ్రెస్ కార్యకర్త- ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం) లయ్యర్(అబద్దాలకోరు) అంటూ మండిపడ్డారు. 2012లో ఇదే బొటానికల్ గార్డెన్లో ఎన్నో మొక్కలు, పూలను నా కెమెరాతో ఫోటోలు తీశాను. 2016లో తిరిగి అదే గార్డెన్‌కు వెళ్లాను కానీ అప్పుడు బొటానికల్ గార్డెన్ మొత్తం చెత్తగా ఉంది అని పేర్కొన్నారు. Go ahead and sue Google sir 😀 and while at it, you may also want to change the lens of your camera Scamgress men can’t handle the truth https://t.co/Gscfc7f9LD — KTR (@KTRTRS) November 20, 2017 దీనికి కేటీఆర్ ట్విట్టర్లో బదులిస్తూ.. అయితే గూగుల్ పై కేసు వేయండి సర్, పనిలోపనిగా మీ కెమెరా లెన్స్ కూడా మార్చండి.. అంటూ ఛలోక్తి విసిరారు. స్కామ్గ్రెస్మెన్ ( స్కాం+ కాంగ్రెస్.. అర్థం వచ్చేలా) నిజాన్ని ఒప్పుకోలేరని పేర్కొన్నారు. లయ్యర్ పదాన్ని వాడినందుకు క్షమించండి అంటూ ప్రియబ్రతా త్రిపాఠి మరో ట్వీట్ చేశారు. అయితే ఇప్పటి వరకు స్కాముల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ పార్టీ వారిని మీరు ఎంతమందిని విచారించారు. వ్యక్తిగతంగా మీపై ఎలాంటి ఆరోపణలు లేవా అంటూ పోస్ట్ పెట్టారు. Go ahead and sue Google sir 😀 and while at it, you may also want to change the lens of your camera Scamgress men can’t handle the truth https://t.co/Gscfc7f9LD — KTR (@KTRTRS) November 20, 2017 మీరు చేస్తున్న మంచి పనికి కృతజ్ఞతలు.అనవసరపు ఆరోణలపై స్పందించకండి సర్ అంటూ ఓ నెటిజన్ కేటీఆర్‌కు సూచించారు. దీనికి స్పందిస్తూ.. స్వాతంత్ర్యం పొంది 70 ఏళ్లుగడిచినా, ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. వీటికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే నిరాధారమైన, బాధ్యత లేకుండా చేస్తున్న ఆరోపణలు మాత్రమే ఖండించానని తెలిపారు. Sorry for the word, Lair! By the way sir, how many scamsters from Congress have you prosecuted yet? :) How many Congis you have bought through inducements? There is an accusation against you personally no! :) Sure, I will visit again. https://t.co/Y4tmhHSwzI — Priyabrata Tripathy (@PriyabrataT) November 20, 2017 I am adding two photos: Jan-2012 and Oct-2012. Clearly the phenomenon is seasonal. pic.twitter.com/wx9bqpsIpc — Priyabrata Tripathy (@PriyabrataT) November 20, 2017 2012 జనవరి, అక్టోబర్ 2012లో బొటానికల్ గార్డెన్‌కు సంబంధించి తీసిన రెండు గూగుల్ మ్యాప్స్ ఫోటోలను ప్రియబ్రతా త్రిపాఠి పోస్ట్ చేశారు. వాతావరణ మార్పుల ఆధారంగానే గూగుల్ మ్యాప్స్ ఫోటోల్లో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. -
పుష్ప వికాసం..
-
పా..పా..పాము..ట్రాఫిక్ జాం
గచ్చిబౌలి(హైదరాబాద్): రోడ్డుకు అడ్డంగా నాగుపాము రావడంతో భయంతో వాహనదారులు ఆగిపోయారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్ రోడ్డుపైకి దాదాపు మూడడుగుల పొడవైన తాచుపాము వచ్చింది. అక్కడే అర్ద గంటపాటు ఉంది. దీంతో అటుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఫోన్ చేయడంతో స్నేక్ సొసైటీ సభ్యుడు ప్రశాంత్ వచ్చి దానిని పట్టుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు గుంతలుగా ఉండటంతో పాము పాకలేక రోడ్డుపైనే ఉండిపోయిందని స్థానికులు చెబుతున్నారు. -
జూ జోలికొస్తే ఖబడ్దార్..
విశాఖపట్నం: విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును తరలించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో చరిత్ర గల జూపార్కును తరలించడమేంటని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జూపార్కులోనే బొటానికల్ గార్డెన్‌ను అభివృద్ధి చేయవచ్చుకదా! అని అంటున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ఇది అవివేకం రియల్ భూముల కోసం జూను తరలిస్తామనడం సరికాదు. విశాఖకు పర్యాటకులు వస్తున్నారంటే అందులో సగం మంది జూని సందర్శిస్తున్నారు. పర్యాటకుల వల్ల విశాఖ అభివృద్ధి చెందుతోంది. అలాంటి జంతు ప్రదర్శన శాలను తరలిస్తామనడం అవివేకర . - బెహరా భాస్కరరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జూ ఉంటేనే నగరానికి అందం విశాఖకు జూ పార్కు ఉంటేనే అందం. అది లేని విశాఖను ఊహించుకోలేం. ఫారెస్ట్ ఏరియా నుంచి డీనోటిఫై చేయకుండా ఎలా తరలిస్తారో అర్థం కావడం లేదు. ఎక్కడికి తరలించినా విశాఖకు నష్టమే. - పి.వి.నారాయణరావు, బీజేపీ నగర అధ్యక్షుడు ఎంతో చరిత్ర ఉన్న జూ ... హుద్‌హుద్ తుపానుకు జూ పార్కు బాగా దెబ్బతింది. జంతువులకు గాయాలయ్యాయి. కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా జంతువులు, పక్షుల కోసం ఖర్చు చేయలేదు. దాదాపు 800కు పైగా ఎకరాలున్న జూ పార్కును కబ్జా చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి కుట్రపూరిత పనులు చేపడుతున్నారు. - గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జూ మార్పు మంచిదికాదు జూ పార్కును ఉన్నచోట నుంచి తరలించడం సరైన పద్ధతి కాదు. మనమే కొన్ని రోజులు అలవాటు పడిన స్థలం నుంచి మార్పు చెందితే జలుబు , జ్వరం వస్తాయి. అలాంటిది ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు పడిన ప్రాంతం నుంచి వాటిని తరలిస్తే వాటికి ఇంకెన్ని ఇబ్బందులు తలెత్తుతాయో..మనం అయితే నోరు తెరిచి మన బాధ చెప్పుకోగలం. కానీ ఆ మూగ జీవులు ఏమని చెప్పుకుంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చోటుకు అలవాటు పడ్డాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మారిస్తే ఆ వాతావరణానికి తట్టుకోవడం కష్టం. రియల్ ఎస్టేట్ పనుల మీద తరలించడం సరికాదు. -జేవీ రత్నం, గ్రీన్‌క్లైమేట్ ప్రతినిధి. -
మూడేళ్ల తర్వాత మోక్షం
నోయిడా: ప్రతిపాదిత బొటానికల్ గార్డెన్ (నోయిడా)-కాళిందీకుంజ్ (ఢిల్లీ) మార్గానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆమోదముద్ర వేశారు. దీంతో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ కారిడార్‌కు ఎట్టకేలకు మోక్షం లభిచింది. మూడో దశలో భాగంగా ప్రతిపాదించిన ఈ కారిడార్‌కు సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై సంతకం చేయాలని నోయిడా అథారిటీ చైర్మన్ రమారమణ్ను ఆయన ఆదేశించారు. యూపీ ప్రభుత్వం... ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)తో ఇందుకు సంబంధించి త ్వరలో ఓ ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. దీంతో ఇప్పటిదాకా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రా జెక్టు పనులు ఆగమేఘాలపై ముందుకు సాగనున్నాయి. ఈ విషయమై నోయిడా అథారిటీ చైర్మన్ రమారమణ్ మీడియాతో మాట్లాడుతూ డీఎంఆర్‌సీతో సంతకం చేయాల్సిన ఒప్పందానికి సంబంధించిన అన్ని లాంఛనాలను సిద్ధం చేశామన్నారు. అవగాహనపత్రం ముసాయిదాను ఆమో దం కోసం ఈ ఏడాది మే నెలలోనే ప్రభుత్వానికి పంపించామన్నారు. డీఎంఆర్సీ అధికారులతో సమావేశమవనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన తేదీని ఖరారు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పనులు మొదలుపెడతామన్నారు. కాగా ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 845 కోట్లు. 2016, మార్చినాటికల్లా దీనిని పూర్తి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 80 శాతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, 20 శాతం కేంద్ర ప్రభుత్వం భరించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీఎంఆర్సీ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది. ఈ విషయమై నోయిడా అథారిటీ చైర్మన్ రమారమణ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం డీఎంఆర్సీకి ఇప్పటికే దాదాపు రూ. 41 కోట్లు చెల్లించామన్నారు. సంబంధిత అధికారులు ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో సమగ్ర అధ్యయనం చేస్తారని తెలిపారు. సెక్టార్-51లో యార్డు నిర్మాణం కోసం డీఎంఆర్సీకి ఇప్పటికే 55 వేల చదరపు మీటర్ల స్థలాన్ని అప్పగించామన్నారు. కాగా ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. అవి బొటానికల్ గార్డెన్, ఓఖ్లా బర్డ్ శాంక్చురీ (నోయిడా), కాళిందీ కుంజ్ (ఢిల్లీ). ఈ మార్గంలో ఆరు, ఎనిమిది బోగీలు కలిగిన మెట్రో రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తారు. ఒక్కొక్క బోగీలో 1,756 నుంచి 2,352 మంది ప్రయాణించేందుకు వీలవుతుంది. కాగా మరో రెండు కారిడార్లను కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అవి నోయిడా సెంటర్-సెక్టార్ 62, నోయిడా-గ్రేటర్ నోయిడా. అయితే ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించాల్సి ఉంది -
ఐటీవో టన్నెల్ పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీవో మెట్రోస్టేషన్‌కి సంబంధించిన రెండో టన్నెల్ ఏర్పాటు మంగళవారం పూర్తయింది. మెట్రోఫేజ్-3లో భాగంగా సెంట్రల్ సెక్రెటేరియట్ నుంచి ఐటీవో వరకు నిర్మిస్తున్న టన్నెల్ పనులను డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్, ఇతర డెరైక్టర్లు పర్యవేక్షించారు. సొరంగం తవ్వకం పనులు విజయవంతంగా పూర్తవడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. 700 మీటర్ల పొడవైన ఈ మార్గాన్ని మండీహౌస్ స్టేషన్ కిందిగా తవ్వారు. తిలక్ బ్రిడ్జి కిందిగా నిర్మిస్తున్న ఈ సొరంగ మార్గం భూఉపరితలం నుంచి 18 మీటర్ల లోతులో ఉన్నట్టు డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. సొరంగం తవ్వేందుకు షాంగై మెట్రోషీల్డ్ కార్పొరేషన్ నుంచి తెప్పించిన భూమి పీడనాలు తట్టుకునే ప్రత్యేక టీబీఎం మిషన్‌ను వాడారు. 5.7 మీటర్ల వ్యాసంతో తవ్విన ఈ సొరంగ మార్గంలో 467 రింగ్‌లను ఉపయోగించినట్టు వెల్లడించారు. సమయం మరింత ఆదా.. ఎన్సీఆర్లోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నోయిడాలోని బొటానికల్ గార్డెన్ ఎన్సీఆర్లో మొట్టమొదటి ఇంటర్చేంజ్ మెట్రోస్టేషన్ రాబోతోంది. ఎన్సీఆర్లోని మెట్రో ప్రయాణికులకు మరింత సమయం ఆదా చేయడంతోపాటు మెట్రోరైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్ వరకు నిర్మించనున్న మెట్రోలైన్ నిర్మాణం శరవేగంతో జరుగుతోంది. ఈ లైన్ నిర్మాణంతో దక్షిణ ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు తగ్గనున్నాయి. గుర్గావ్ వె ళ్లేందుకు సైతం అరగంట సమయం ఆదా అవుతుంది. 2016 వరకు ఈ లైన్ నిర్మాణం పూర్తవుతుందని డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఢిల్లీ బయట ఇంటర్చేంజ్ మెట్రోస్టేషన్ లేదు. మెట్రోరైలు మూడో ఫేజ్ నిర్మాణం పూర్తయితే నోయిడావాసులకు మరిన్ని ఇబ్బందులు తగ్గనున్నాయి. ఇంటర్చేంజ్ అయ్యేందుకు స్టేషన్ అందుబాటులోకి వస్తుంది. ఈ కారిడర్లో నిర్మాణంతో నోయిడా నుంచి ఢిల్లీలోని కల్కాజీ, నెహ్రూ ప్లేస్, హజ్కాస్ ప్రాంతాలకు ప్రయాణం సులభతరం అవుతుంది. మెట్రో అధికారులు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)లో పేర్కొన్న ప్రకారం 2016 వరకు బొటానికల్ గార్డెన్ మెట్రోస్టేషన్ రోజుకు 97,980 మంది ప్రయాణికులకు సేవలందించనుంది. ప్రతిరోజూ 14 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లవచ్చు. నోయిడా నుంచి గుర్గావ్ వెళ్లే ప్రయాణికులు ప్రస్తుతం రాజీవ్‌చౌక్ మెట్రోస్టేషన్‌కి వెళ్లి అక్కడి నుంచి గుర్గావ్ వెళ్లాల్సి వస్తోంది. బొటానికల్ గార్డెన్ మెట్రోస్టేషన్ నిర్మాణంతో హజ్కాస్లో మెట్రోలైన్ మారి గుర్గావ్ వెళ్లొచ్చు. అధికారులు చెబుతున్న ప్రకారం ఇలా చేస్తే అరగంట వరకు సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం గుర్గావ్- హుడా సిటీ సెంటర్ లైన్లో నోయిడా నుంచి బొటానికల్ గార్డెన్ స్టేషన్ మధ్య ప్రయాణానికి గంటన్నర పడుతోంది. రాజీవ్ చౌక్‌లో మెట్రో మారడం తప్పనిసరి. పశ్చిమ జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్ కారిడార్‌లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సైతం ఓ స్టేషన్‌గా మారుతుంది. ఈ నిర్మా ణం పూర్తయితే బొటానికల్‌గార్డెన్ నుంచి ఎయిర్‌పోర్టుకి నేరుగా 45 నిమిషాల్లో చే రుకోగలుగుతారు. 2016 వరకు ఈ నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఎంఆర్సీ అధికారి అనూజ్దయాల్ తెలిపారు. -
బొటానికల్ గార్డెన్ ప్రైవేట్ కంపెనీలకా?
సాక్షి, హైదరాబాద్: జంటనగరాల్లో బొటానికల్ గార్డెన్ స్థలాన్ని ఎకో టూరిజం పేరిట ప్రైవేట్ సంస్థలకు కేటాయించటంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమానికి వెనకాడబోమని హెచ్చరించారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆదివారమిక్కడ కొత్తగూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బొటానికల్ గార్డెన్లో మీడియా టూర్ నిర్వహించింది. డెలారా టూరిజం, ట్రాక్ ఇండియా సంస్థలకు కేటాయించిన స్థలాలను పరిశీలించింది. మల్టిప్లెక్స్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్మాణం కోసం చెట్లను నరికి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారని కోదండరామ్ దుయ్యబట్టారు. వీటికి సంబంధించిన ఫైల్ కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో ఉందని, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్క్‌ల నిర్మాణాన్ని విదేశాల్లో ప్రభుత్వాలు విధిగా భావిస్తాయని మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య చెప్పారు. బొటానికల్ గార్డెన్లో నిర్మాణాలు ప్రకృతి విధ్వంసానికి దారి తీస్తాయని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ నాయకుడు అద్దంకి దయాకర్, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.