
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం జనవరి 30... బొటానికల్ గార్డెన్స్ సమీపంలో ప్లాస్టిక్ సంచుల్లో గుర్తు తెలి యని మహిళ శరీర భాగాలు దొరికాయి. అత్యంత కిరాతకంగా ఆ హత్య జరిగింది. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక కుండా హంతకులు జాగ్రత్త పడ్డారు. అయినా పది రోజుల్లోనే చిక్కారు. వీరిని పట్టించడంలో కీలక పాత్ర పోషించింది సీసీ కెమెరాలే. ఇలా.. రాజధానిలో ఏటా ఎన్నో కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ‘మూడో కన్ను’ కీలకపాత్ర పోషిస్తోంది. ‘ఒక్క కెమెరా 10 మంది పోలీసులతో సమానం’ అనే నినాదంతో పోలీసు విభాగం ముందుకు వెళ్తోంది. ఢిల్లీ, ముంబై, సూరత్‌కు దీటుగా నగరంలో ఇవి ఏర్పాటవుతున్నాయి.
అవసరమైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలకు ప్రత్యేక అనలెటిక్స్ సైతం జోడించడానికి పోలీసు విభాగం సన్నాహాలు చేస్తోంది. నగరంలో ఏర్పాటు చేసిన కెమెరాలు అన్నింటినీ కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు అనుసంధానం చేయడం ప్రారంభించారు. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. నగరంలో మొత్తం 10లక్షల కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment