Viral: Endangered Giant Flower Emitting Rotten Meat Like Smell In Warsaw - Sakshi
Sakshi News home page

బాబోయ్‌ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం

Published Wed, Jun 16 2021 2:32 PM | Last Updated on Wed, Jun 16 2021 10:22 PM

Endangered Sumatran Titan Arum Bloom At A Botanical Garden In Warsaw - Sakshi

వార్సా(పోలాండ్): పువ్వుల వాసనకు పరవశించిపోతాం.. వాసన లేని పువ్వును.. పూజకు పనికిరాదని పడేస్తాం!  మనిషికి వాసన ఓ వరం, అవసరం కూడా. తేడా వస్తే మాత్రం.. కలవరమే! అయితే పోలాండ్‌లోని వార్సా యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్‌లో ఓ పుష్పం ఆదివారం వికసించింది. దాని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అయిన్పటికీ ఈ పుష్పాన్ని చూడటాకిని వందల మంది జనం క్యూ కడుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ పుష్పాన్ని అమోర్ఫోఫాలస్ టైటనం అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 3 మీటర్లు (10 అడుగులు) ఎత్తు వరకు ఉంటుంది.

కొన్ని పూల రెక్కల సమూహంతో ఉండే ఈ పుష్పం వికసించడం చాలా అరుదు. అంతరించిపోతున్న సుమత్రన్ టైటాన్ అరుమ్ అనే పుష్పం మాంసాన్ని తినిపించే పరాగసంపర్క కీటకాలను ఆకర్షించడానికి కుళ్లిన శవం వాసనను విడుదల చేస్తుంది. అయితే ఈ మొక్క సుమత్రాలోని వర్షారణ్యాలలో మాత్రమే పెరుగుతుంది. కానీ అటవీ నిర్మూలన కారణంగా దీనికి ప్రమాదం వచ్చి పడింది. దీంతో వార్సా యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్‌లో దీన్ని సంరక్షిస్తున్నారు. కాగా ఈ పుష్పం చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇక సుమత్రా అడవుల్లో కాకుండా ఈ పుష్పం మొట్టమొదట 1889లో క్యూలోని లండన్ రాయల్ బొటానికల్ గార్డెన్స్‌లో వికసించింది.

చదవండి: నేపాల్‌లో వర్ష బీభత్సం.. భారత్‌లోనూ ప్రభావం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement