flower
-
Success Story: రూ. 5 కోట్ల టర్నోవర్‌కు మార్గం చూపిన ‘గుడిమల్కాపూర్’
నేటి కాలంలో యువత ఉద్యోగం చేసేకన్నా వ్యాపారం చేయడమే ఉత్తమమని భావిస్తోంది. ఈ దిశగా అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ కోవలో అమోఘమైన విజయాలు సాధించినవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే అరూప్ కుమార్ ఘోష్. హైదరాబాద్‌లోని గుడిమాల్కాపూర్ను చూసిన ఆయన తన జీవితాన్నే పూలబాటగా మలచుకున్నారు.కలలు సాకారమయ్యేందుకు..పశ్చిమ బెంగాల్‌లోని కోలాఘాట్(Kolaghat)కు చెందిన అరూప్ కుమార్ ఘోష్ (33) కాలేజీ డ్రాపౌట్. అయితే ఆయన తన వ్యాపారంలో చూపిన అంకితభావం, కృషి అతనిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. చాలామంది యువకులు కలలను కనడంవరకే పరిమితమైతే అరూప్ మాత్రం ఆ కలలను సాకారం చేసుకున్నాడు. ఒకప్పుడు రూ.3500 జీతానికి పనిచేసిన అరూప్ ఇప్పుడు భారీ స్థాయిలో పూల వ్యాపారం చేస్తున్నాడు. బంతి పూలు, వాటి విత్తనాలను విక్రయిస్తూ, తన వ్యాపార వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లను దాటించాడు. అయితే ఈ దిశగా సాగిన ప్రయాణంలో ఎన్నో ఒడిదుకులను ఎదుర్కొన్నాడు.పూల దుకాణంలో పనికి కుదిరి..అరూప్కి చిన్నప్పటి నుంచి పూలంటే ఎంతో ఆసక్తి ఉంది. అరూప్ కుటుంబం తొలుత వరి సాగు చేసేది. అయితే దాని నుండి వచ్చే సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. ఇదే సమయంలో పూల వ్యాపారంలో అరూప్‌కు మంచి అవకాశాలు కనిపించాయి. దీంతో అరూప్ కళాశాల చదువును వదిలివేసి, పూల వ్యాపారం(Flower business)లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. తన 17 ఏళ్ల వయస్సులోనే పూల అమ్మకందారులతో కలసి పనిచేయడం మొదలుపెట్టాడు. పూల వ్యాపారం గురించి మరింత తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌ను సందర్శించాడు. తరువాత నెలకు రూ.3,500 జీతం వచ్చేలా ఒక పూల దుకాణంలో పనికి కుదిరాడు. జీతం చాలా తక్కువే అయినప్పటికీ, పూల వ్యాపారం నేర్చుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని అరూప్ భావించాడు. ఉద్యోగం చేస్తూ పూల వ్యాపారంలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు.ఆరంభంలో భారీ నష్టాలుకొంతకాలం తరువాత అరూప్ కోలాఘాట్లోని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు. దేశంలోని వివిధ నగరాల్లోని పూల దుకాణాలకు బంతి పూలను విక్రయించడం మొదలుపెట్టాడు. మొదట్లో రూ.2000 నుంచి రూ.3000 వరకు లాభం వచ్చింది. దీంతో 2011లో కొంత భూమిని కౌలుకు తీసుకుని అరూప్ బంతిపూల సాగును ప్రారంభించాడు. ఆరంభంలో అరూప్ భారీ నష్టాలను చవిచూశాడు. తొలుత కోల్‌కతా రకం బంతి పూలు(Kolkata type marigolds) సాగుచేశాడు. ఆ పూలు చిన్నవిగా ఉండటంతో అమ్ముడుపోయేవికాదు. దీంతో అరూప్‌కు వ్యాపారంలో నష్టం వచ్చింది. అయినా అరూప్ నిరాశపడలేదు. 2011లో థాయ్ లాండ్ వెళ్లి మూడు నెలల పాటు అక్కడే ఉండి, పూల సాగులో మెళకువలు నేర్చుకున్నాడు. టెన్నిస్ బాల్ మేరిగోల్డ్ పూలు, వాటి విత్తనాలను ఉత్పత్తి చేసే సాంకేతికతను తెలుసుకున్నాడు. అక్కడి నుంచి ఒక్కో బంతిపూల రకానికి చెందిన విత్తనాలు తీసుకుని కోలాఘాట్కు చేరుకున్నాడు.ఏటా రూ. 5 కోట్లకుపైగా ఆదాయంథాయ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన అరూప్ మరింత భూమిని లీజుకు తీసుకుని, అక్కడ టెన్నిస్ బాల్ రకం బంతి పూలను సాగుచేశాడు. కోలాఘాట్ మార్కెట్లో కిలో 100 రూపాయల చొప్పున బంతిపూలను విక్రయించాడు. డిమాండ్ పెరగడంతో బంతి పూల సాగును మరింతగా పెంచాడు. బంతిపూల విత్తనాలను కూడా అమ్మడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అరూప్ బంతిపూలు, మొక్కలు, విత్తనాలను విక్రయించడం ద్వారా ఏటా రూ.5 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.ఇది కూడా చదవండి: Paramahansa Yogananda: ‘ఒక యోగి ఆత్మకథ’తో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపి.. -
నిజానికి ఇదో పువ్వు.. కుళ్లిన మాంసం వాసన దీని స్పెషాలిటీ!
చూట్టానికి బాగా ఎదిగిన మొలకలా కనిపిస్తోంది కదా. కానీ నిజానికి ఇదో పువ్వు! భారీ పరిమాణంతో పాటు ముక్కుపుటాలను అదరగొట్టే కుళ్లిన మాంసం తరహా కంపు వాసన దీని స్పెషాలిటీ. అందుకే దీన్ని కార్ప్స్ ఫ్లవర్ అని పిలుస్తారు. పదేళ్లకోసారి మాత్రమే పూయడం దీని మరో ప్రత్యేకత. పూసిన ఒకట్రెండు రోజుల్లో వాడిపోతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని బొటానికల్ గార్డెన్లో ఇలా కనువిందు చేసింది. దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటూనే ఆసక్తిగా పదేపదే వాసన చూసి మరీ వెళ్తున్నారు! అంతరిస్తున్న జాబితాలో ఉన్న ఈ పువ్వు శాస్త్రీయ నామం అమర్ఫోఫలస్ టైటానియం. టైటన్ ఆరమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని అడిలైడ్ నుంచి 2021లో మెల్బోర్న్కు తరలించారు. అప్పటినుంచీ ఎప్పుడు వికసిస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొచ్చారు. క్షిపణి ప్రయోగం విజయవంతం మంగళవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ప్రయోగశాల నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్న లాంగ్ రేంజ్ లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం). సైంటిస్టులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు దీన్ని వీక్షించారు. ప్రయోగ సందర్భంగా క్షిపణిలోని అన్ని వ్యవస్థలూ అద్భుత పనితీరు కనబరిచినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు వెల్లడించింది. పనితీరును మెరుగుపరిచే అత్యాధునిక వైమానిక, సాఫ్ట్వేర్ వ్యవస్థలు దీని సొంతం. డీఆర్డీఓతో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (బెంగళూరు) ఈ క్షిపణిని తయారు చేసింది. బీఈఎల్ తదితర సంస్థలు కూడా ఇందులో భాగం పంచుకున్నాయి. వాహనాల నుంచి కూడా ప్రయోగించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రయోగాన్ని విజయవంతం చేసిన సైంటిస్టులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు.చదవండి: విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు! -
పుష్ప సిస్టర్స్ తగ్గేదేలే...
పూలు రోడ్డు మీద దొరుకుతాయి. కాని వాటిని స్విగ్గీలో తెప్పించుకునే కస్టమర్లు కూడా ఉంటారు అని గ్రహించారు యశోద, రియా కారుటూరి.ఈ ఇద్దరూ కలిసి ‘వూహూ ఫ్రెష్’ పేరుతోమొదలెట్టిన బ్రాండ్ ఇంతింతై ఇంతి ఇంతై అన్నట్టు సాగుతోంది. తాజాగా వీరు అగరు బత్తీల రంగంలో అడుగు పెట్టారు. బంతి, నిమ్మ, మందారం... వీరి అగర్బత్తీల పేర్లు.పూలతో 50 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరి ఆలోచనలు...ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియా రావడమే సగం విజయం. మిగిలింది ఆచరణ మాత్రమే. ఐడియాలు అందరికీ ఎందుకు రావు? ఎవరో అన్నట్టు బుర్ర పారాచూట్ లాంటిది. తెరిచి పెడితే పని చేస్తుంది. లేదంటే ఏం ఉపయోగం. బెంగళూరులో నివాసం ఉండే ఇద్దరు అక్కచెల్లెళ్లు 2019లో తల్లి తరచూ చేసే ఫిర్యాదును వినేవారు. ‘బెంగళూరులో ఉన్నామన్న మాటేగాని పూజ చేద్దామంటే తాజా పూలే దొరకవు’ అని. ఆ అక్కచెల్లెళ్ల పేర్లు యశోద కారుటూరి, రియా కారుటూరి. యశోద వాషింగ్టన్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివితే రియా స్టాన్‌ఫోర్డ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ చదివింది. అంటే వీళ్లకు టెక్నాలజీ తెలుసు. బిజినెస్ తెలుసు. ఐడియా వెలగకుండా ఉంటుందా?పూలు తెలుసురియ, యశోదల తండ్రి వాళ్ల బాల్యంలో కెన్యా వెళ్లి గులాబీ పంట వేసి పండించేవాడు. ఒకప్పుడు కెన్యా గులాబీలకు పెద్ద మార్కెట్ ఉండేది. ఆ తర్వాత ΄ోయింది. చిన్నప్పడు ఆ తోటల్లో తిరిగిన రియ, యశోదలు అందరూ ఏవేవో వ్యాపారాలు చేస్తారు... మనం పూలతో ఎందుకు చేయకూడదు అనుకున్నారు. ఆలోచన వస్తే వెంటనే పని మొదలెట్టాలి. 2019 పూలకు ప్రాధాన్యం ఉండే ప్రేమికుల దినోత్సవం నాడు ‘వూహూ ఫ్రెష్’ అనే ఆన్లైన్ రిటైల్ బ్రాండ్ మొదలెట్టారు. ‘వూహూ’ అంటే కన్నడలో పువ్వు. తాజాపూలను కస్టమర్లకు అందించడమే లక్ష్యం.ఇంటికి చేరాలిభారతీయలకు భక్తి జాస్తి. పూలతోనే దైవారాధన చేస్తారు. కాని గుడికి పూలు తీసుకెళ్లాలంటే గుడి చుట్టూ ఉన్న అంగళ్లలో కొనాలి. లేదా రోడ్డు మీద కొనాలి. అవి ఫ్రెష్‌గా ఉండొచ్చు... లేక΄ోవచ్చు. అప్పుడు మాత్రమే కాదు శుభకార్యాలకు, అలంకరణలకు, స్త్రీలు జడల్లో ముడుచుకోవడానికి, సన్మానాలకు.. సంస్మరణలకు... ఇళ్లల్లో పెద్దల పటాలకు పూలే కావాలి. కాని ఆ పూలుపాల ΄్యాకెట్టు అందినట్టు న్యూస్‌పేపర్ అందినట్టు ఇంటికి ఎందుకు అందవు అనుకున్నారు అక్కచెల్లెళ్లు. అందేలా చేశారు. విజయం సాధించారు.చందాదారులుగా...న్యూస్‌పేపర్ చందాదారుల్లానే ‘వూహూ ఫ్రెష్’కు కూడా చందాదారులుగా చేరితే రోజంతా పూలు ఇంటికే వస్తాయి. మరి ఇవి ఫ్రెష్‌గా ఎలా ఉంటాయి. దీనికోసం ప్రత్యేకమైన ΄్యాకింగ్ తయారు చేశారు. 3 రోజుల నుంచి 15 రోజుల వరకూ వాడకుండా ఉంటాయి. చేయి తగిలితే పూలు నలిగి΄ోతాయి కదా. అందుకే ‘జీరో టచ్’ ΄్యాకింగ్ కూడా ఉంది. డబ్బాల్లో పెట్టి పంపుతారు. స్విగ్గి, జొమాటో, అమేజాన్ ద్వారా కూడా అందే ఏర్పాటు చేశారు. పండగల్లో పబ్బాల్లో ఆ పండగలకు తగ్గ పూలు, హారాలు, పత్రి, దళాలు కలిపిన ప్రత్యేక బాక్సులు అమ్ముతారు. అవి హాట్‌కేకుల్లా అమ్ముడు΄ోతున్నాయి.రైతులతో కలిసిబెంగళూరులో కేంద్రస్థానంగా ఉంటూ ఇతర ముఖ్య నగరాల్లో విస్తరించుకుంటూ పూల సరఫరా చైన్లను రియా, యశోదలు స్థాపించారు. 500 మంది పూల రైతులతో ఒడంబడిక చేసుకుని కోసిన పూలను వీలైనంత త్వరగా ΄్యాకింగ్ కేంద్రానికి పంపే ఏర్పాటు చేశారు. ఆర్డర్లకు తగ్గ ΄్యాకింగ్ కోసం మహిళా ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం 300 ఆలయాలలో దేవుళ్లు రోజూ వీరు పంపే పూలతోనే పూజలు, హారతులు అందుకుంటున్నారు.2023 షార్క్ ట్యాంక్ షోలో రియా, యశోదాల బిజినెస్ గురించి విని అందరూ ఆశ్చర్య΄ోయారు. సంవత్సరానికి దాదాపు 8 నుంచి 10 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వీరి బ్రాండ్ విలువ 50 కోట్లకు చేరింది. వాడి΄ోయిన పూలతో అగర్ బత్తీలు తయారు చేస్తూ ఆ రంగంలోనూ విజయం సాధించారు ఈ బెంగళూరు స్టిస్టర్స్. ఐడియా వీరిని గెలిపిస్తూనే ఉంది. -
పూల ధరలకు రెక్కలు
-
ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
వాతావరణంలో జరిగే కాలాల మార్పుల కారణంగా అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ప్రతీ సంవత్సరం కేవలం మే నెలలో మాత్రమే ఈ పువ్వు పూస్తుందట. మరి అదేంటో చూసేద్దామా!ఆదిలాబాద్, సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామంలో మే పుష్పం వికసించింది. ఏటా మే నెలలో మాత్రమే పూసే ఈ పువ్వు గ్రామానికి చెందిన ఎలుగు రాజలింగం ఇంటి ఆవరణలో మంగళవారం వికసించింది. ఒకేసారి మూడు పువ్వులు పూయడం సంతోషంగా ఉందని రాజలింగం కుటుంబ సభ్యులు తెలిపారు. ఈఏడాది మొత్తం ఐదు పువ్వులు పూశాయని పేర్కొన్నారు. ఈ పూలను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నట్లు వారు తెలిపారు.ఇవి చదవండి: కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..? -
'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా?
పుష్పవజ్రమా? అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? గని నుంచి తవ్వి తీయకపోయినా, అచ్చంగా వజ్రంలాగానే ఉంటుంది. చైనీస్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూలతో వజ్రాన్ని తయారు చేశారు. గులాబీల మాదిరిగా కనిపించే ఎర్రని పీయనీ పూల నుంచి వేరుచేసిన కార్బన్ అణువులతో మూడు కేరట్ల వజ్రాన్ని తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు.ఈ వజ్రం తయారీ కోసం హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లువోయాంగ్ నగరంలోని నేషనల్ పీయనీ గార్డెన్స్ నుంచి సేకరించిన పూలను ఉపయోగించారు. కృత్రిమ వజ్రాల తయారీకి ప్రసిద్ధి చెందిన లువోయాంగ్ ప్రామిస్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అరుదైన ఘనతను సాధించారు. పూలతో వజ్రాన్ని తయారుచేయాలని సంకల్పించినట్లు లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ చెప్పడంతో ఆ కంపెనీకి కావలసిన పీయనీ పూలను సరఫరా చేసేందుకు నేషనల్ పీయనీ గార్డెన్ అంగీకరించింది.బయోజెనిక్ కార్బన్ ఎక్స్‌ట్రాక్టింగ్ టెక్నాలజీతో ఈ పూల నుంచి కార్బన్ అణువులను వేరుచేసి, వాటిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అత్యధిక పీడనకు గురిచేయడం ద్వారా ఈ వజ్రాన్ని తయారు చేయగలిగామని లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ సీఈవో వాంగ్ జింగ్ తెలిపారు. ఈ వజ్రం విలువను మూడు లక్షల యువాన్లుగా (రూ.35.19 లక్షలు) అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇవి చదవండి: వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ.. -
తిరుమల గిరుల్లో తులిప్ విరులు
తులిప్స్.. ఎన్నెన్నో రంగుల్లో మనసుల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. మగువలు సిగలో అలంకరించుకునేందుకు ఉపయోగపడకపోయినా.. వేడుకల అలంకరణలో మాత్రం రాజసాన్ని చాటుతాయి. నింగీనేలా చుంబించే లాలిలో ఓలలాడించే ఈ పుష్ప రాజాలు కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం సాగులో ఉన్నాయి. కళ్లు తిప్పుకోనివ్వని అందాలతో ఆహ్లాదాన్నిపంచే ఈ పుష్పాలు ఉద్యాన శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు తిరుమల గిరులపైనా విరబూస్తున్నాయి. సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న తులిప్ పూలను ఏపీలోనూ సాగు చేయించాలన్న తలంపుతో వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని సిట్రస్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. వీటి సాగుకు తిరుమల గిరుల్లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు సత్ఫలితాలనివ్వడంతో భవిష్యత్‌లో మరిన్ని రకాల సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. శీతల పరిస్థితులు గల ఎత్తైన కొండ ప్రాంతాల్లో మాత్రమే సాగయ్యే ఈ పూల మొక్కలు జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తులిప్స్ రానున్న రోజుల్లో కలియుగ దైవం కొలువైన ఏడుకొండలపైనా ఇకపై కనువిందు చేయనున్నాయి. తులిప్స్ పూలకు ప్రత్యేకతలెన్నో..: లిలియాసీ (లిల్లీ) పూల జాతికి చెందిన ఈ పుష్పాలు ప్రపంచంలోనే టాప్–10 కట్ ఫ్లవర్స్‌లో ఒకటిగా ఖ్యాతి చెందాయి. తులిప్‌లో దాదాపు వందకు పైగా రకాలు ఉన్నాయి. వీటిని దుంపల ద్వారా సాగు చేస్తారు. తల్లి దుంపల(బల్బ్సŠ)ను నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. తల్లి దుంపల్ని 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో 3 నెలలపాటు ఫ్రీజ్ చేస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వీటిని నాటుకుంటారు. దుంపకు దుంపకు మధ్యలో 8–10 సెం.మీ. దూరంలో దుంప సైజును బట్టి 5–8 సెం.మీ. లోతులో నాటుకోవాలి. మొక్కల మధ్య 15 సెం.మీ., వరుసల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూస్తారు. 20 చదరపు అడుగులకు 100 దుంపల చొప్పున ఎకరాకు 45 వేల దుంపల వరకు నాటుకోవచ్చు. ఏడాది పాటు భూమిలోనే ఉంచితే పిల్ల దుంపలు పుట్టుకొస్తాయి. వాటిని సేకరించి మరుసటి ఏడాది నాటుకోవచ్చు. పుషి్పంచే కాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు. నాటిన 45–60 రోజుల్లో పుషి్పస్తాయి. పుష్పించే సమయంలో రాత్రి పూట 5–12 డిగ్రీలు, పగటి పూట 20–26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండాలి. 10 రోజుల పాటు తాజాగా..: రెండాకులు ఉండేలా పూలను కత్తిరించి, వాటి తాజాదనం కోల్పోకుండా ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. మొక్కకు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కత్తిరించిన తర్వాత కనీసం 5–10 రోజుల వరకు తాజాదనం కోల్పోకుండా ఉంటాయి. పూలు కోసిన తరువాత 10 రోజుల్లో మొక్క ఎండిపోతుంది. ఎండిన మొక్కను తొలగించి భూగర్భంలో ఉన్న దుంప బయటకు తీసి మళ్లీ ఫ్రీజ్ చేయాలి. మరుసటి ఏడాది సీజన్ ప్రారంభమైన తర్వాత మళ్లీ నాటుకోవాలి. ఎత్తైన మడుల్లో డ్రిప్ ఇరిగేషన్ సాయంతో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. వసంతకాలంలో 3–7 రోజుల పాటు వికసించే ఈ పూలు దాదాపు అన్ని రంగుల్లోనూ కనువిందు చేస్తాయి. మెజార్టీ రకాల పూలు ఒకే విధమైన ఆకృతిలో ఉంటాయి. అత్యంత ఖరీదైన ఈ పూల రెమ్మలను తింటారు. కొన్ని వంటకాల్లో ఉల్లికి బదులు వీటి రెబ్బలనే వాడుతుంటారు. మార్కెట్లో ఒక్కో పువ్వు రూ.50 నుంచి రూ.75 వరకు ధర పలుకుతుంది. ఫలించిన పరిశోధన తిరుపతిలోని మైదాన ప్రాంతాలతోపాటు సముద్ర మట్టానికి 980 మీటర్ల ఎత్తులో ఉన్న తిరుమల కొండ ప్రాంతాల్లో ప్రత్యేక నర్సరీ నెలకొల్పి వీటి సాగుపై అధ్యయనం చేశారు. ఏడీ రెమ్, డెన్మార్క్, డౌ జోన్స్, రాజవంశం, ఎస్కేప్, గోల్డెన్ పరేడ్, పింక్ ఆర్డోర్, పురిస్సిమా, పర్పుల్ ఫ్లాగ్ సూపర్ మోడల్ రకాలకు చెందిన తులిప్ దుంపలను డిసెంబర్ 2023లో ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లో నాటారు. రెండుచోట్ల మొలకెత్తినట్టు గమనించినప్పటికీ తిరుమలలో మాత్రం నాటిన ప్రతి దుంప మొలకెత్తింది. డెన్మార్క్ రకం 10–12 రోజుల్లో పూర్తిగా పూలు విచ్చుకోవడాన్ని గుర్తించారు. తిరుమలలో తులిప్ పార్క్ అత్యంత శీతల ప్రాంతంలో సాగయ్యే ఈ పూల సాగుపై మేం చేసిన పరిశోధనలు ఫలించాయి. శ్రీనగర్ తరహాలోనే తులిప్ గార్డెన్స్ పెంచేందుకు తిరుమల గిరులు కూడా అనుకూలమని గుర్తించాం. భవిష్యత్‌లో టీటీడీ సౌజన్యంతో వీటి సాగు దిశగా సన్నాహాలు చేయబోతున్నాం. గుర్రం కొండతోపాటు ఇతర ఎత్తైన ప్రాంతాల్లో వీటి సాగును విస్తరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు గల అవకాశాలపై కూడా పరిశోధన చేస్తున్నాం. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి -
ఈ ఫోటోలో కనిపిస్తున్నవి పూలగుత్తులనుకుంటే పప్పులో కాలేసినట్లే..!
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వాటిని పూలగుత్తులనుకుంటున్నారా?! అయితే పొరపాటే! ఇవి అచ్చంగా పూలగుత్తుల్లాగానే కనిపించే ఐస్‌క్రీములు. జపాన్‌లోని క్యోటో నగరానికి చెందిన షిజెన్ కేఫ్ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఇటీవల ఈ పూలగుత్తుల ఐస్‌క్రీమ్‌లను తన మెన్యూలోకి ప్రవేశపెట్టింది. జపాన్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు వీటిని అమితంగా ఇష్టపడుతుండటమే కాకుండా, వీటితో ఫొటోలు దిగుతూ వీడియోలు చేస్తుండటంతో అనతికాలంలోనే ఈ పూలగుత్తుల ఐస్‌క్రీములు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అచ్చంగా అసలైన పూలనే తలపించే రంగుల్లో, ఆకారాల్లో వీటిని కళాఖండాల్లా మలచి అందిస్తున్న తీరు కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. పూల రకాలు, ఆకారాలు, రంగులు, పరిమాణం బట్టి ఈ ఐస్‌క్రీముల ధర 200 యెన్ల నుంచి 1350 యెన్ల (రూ.113 నుంచి రూ.763) వరకు ఉంటోంది. మామూలు ఐస్‌క్రీములతో పోల్చుకుంటే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉన్నా, వీటిని ఆస్వాదించడానికి విపరీతంగా ఎగబడుతున్నారు. ఈ ఐస్‌క్రీములను అందించే షిజెన్ కేఫ్ పర్యాటక ప్రదేశాలైన క్యోటో మ్యూజియం, నిజో కోటలకు దగ్గరగా ఉండటంతో పూలగుత్తుల ఐస్‌క్రీముల అమ్మకాలు ప్రారంభించాక దీనికి విదేశీ పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. (చదవండి: ఆ గ్రామం పూల రాజధాని! అక్కడ ఎటు చూసినా..!) -
హారతి వేళ.. హెలికాప్టర్ నుంచి పూలవాన!
మరికొద్ది సేపట్లో అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా రాములోరికి హారతులు పట్టే సమయాన ఆలయంపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 30 మంది కళాకారులు తమ సంగీత ప్రతిభను చాటనున్నారు. హారతి సమయంలో అతిథులంతా గంటలు మోగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రామాలయంలోనికి ప్రధాని నరేంద్ర మోదీ అడుగిడనున్నారు. ఈ చారిత్రాత్మక ఉత్సవంలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలు, ఆలయ ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. కార్యక్రమం అనంతరం ప్రధాని ప్రసంగించనున్నారు. మొత్తం 121 మంది ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి సమక్షంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇది కూడా చదవండి: ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం? -
కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి పూలను తెప్పించారు. అయోధ్యను అలంకరించేందుకు కాశీ నుంచి కూడా పూలు తెప్పించారు. పూర్వాంచల్‌లోని అతిపెద్ద పండ్ల మార్కెట్ నుంచి 50 క్వింటాళ్ల పూలను రెండు రోజుల క్రితం అయోధ్యకు తరలించారు. ఈ పూలలో ఆరెంజ్, పసుపు రంగు బంతిపూలు ఉన్నాయి. ఇదేవిధంగా కాశీ నుంచి అయోధ్యకు పెద్ద మొత్తంలో గులాబీలను పంపించామని, పది వేల బంతిపూల దండలను కూడా పంపినట్లు మాల్దాహియా పూల మార్కెట్ హెడ్ విశాల్ దూబే తెలిపారు. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పటికీ, కొద్దిమొత్తంలోనే పూలను అయోధ్యకు పంపించామన్నారు. కాగా కాన్పూర్, లక్నో, కోల్‌కతాల నుంచి కూడా అయోధ్యకు పూలను ఆర్డర్ చేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి యూపీలో ప్రస్తుతం పూలకు విపరీతమైన గిరాకీ ఉంది. జనవరి 22న వివిధ ఆలయాల్లో పూజలు, వేడుకలు నిర్వహించనున్న దృష్ట్యా వివిధ రకాల పూలకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. బంతిపూలతో పాటు గులాబీ, మల్లె పూలకు విపరీతమైన ఆర్డర్లు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: బాలరామునికి భారీ వేణువు -
అగ్గిపుల్లతో ఇలా చేస్తే..మొక్కలు పూలతో కళకళలాడతాయి!
గార్డెన్లో ఎంతో ఇష్టంగా మొక్కలు పెంచుతుంటాము. సమయానికి నీళ్లుపోసి, మొక్కల ఎదుగుదలకోసం ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ కొన్ని మొక్కలు బలహీనంగా, వాడిపోయినట్టుగా ఉంటాయి. ఇలాంటి మొక్కలను పూలతో చక్కగా కళకళలాడేలా చేయాలంటే పాదులో అగ్గిపుల్లలు గుచ్చాలి. అవును అగ్గిపుల్లలే... అగ్గిపుల్లతో ఏం చేయాలంటే.. అగ్గిపుల్లలను యాంటీమోనీ సల్ఫైడ్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్ రసాయనాలతో తయారు చేస్తారు. ఈ రసాయనాలు మొక్కలకు క్రిమిసంహారాలుగా పనిచేస్తాయి. అంతేగాక ఇవి వేర్లకు బలాన్ని ఇస్తాయి. సల్ఫర్, మెగ్నీషియం, క్లోరేట్లు మొక్కలు వేళ్లనుంచి చక్కగా పెరిగేందుకు దోహద పడతాయి. ముందుగా కుండిలోని మొక్క చుట్టూ కొన్ని నీళ్లుపోయాలి. ఇప్పుడు పది అగ్గిపుల్లలను రసాయనం ఉన్నవైపు మట్టిలోకి గుచ్చాలి. పుల్ల పుల్లకు కొద్దిగా దూరం ఉండేలా .. అగ్గిపుల్ల పూర్తిగా మట్టిలోకి చొచ్చుకుపోయేలా గుచ్చాలి. ఇలా నెలకు ఒక్కసారి మాత్రమే పుల్లలను గుచ్చాలి. గుచ్చిన పుల్లలను పదిహేను రోజుల తరువాత తీసేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అగ్గపుల్లల నుంచి అంది, మొక్క బలంగా పెరిగి పూలూ, పండ్లను చక్కగా ఇస్తుంది. (చదవండి: విద్యా బాలన్ కళ్ల అందం సీక్రేట్ ఇదే! అది పెట్టకుండా గడప కూడా..) -
పువ్వుకు పూజలు..
-
ఇదేం పువ్వురా బాబూ.. ముక్కు పేలిపోతోంది.. ఇది ప్రపంచంలోనే
అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుష్పం.. అయితే దానిని చూడాలని ముచ్చట పడితే.. అంతే సంగతులు. ఎందుకంటే దానికి మనం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగానే.. దాని నుంచి మన ముక్కులు పేలిపోయేంత దుర్వాసన వస్తుంది. రండి.. ఆ పువ్వు కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన వెదజల్లే పువ్వు పేరు ‘కార్ప్స్ ఫ్లవర్’ ఈ పుష్పం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పువ్వు పదేళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. ఈ పువ్వు వికసించగానే దాని నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ దుర్వాసన వ్యాపిస్తుంది. కార్ప్స్ ఫ్లవర్‌ను టైటాన్ వాన్కాగ్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో వికసించింది. ఈ పుష్పం 24 గంటల నుంచి 48 గంటల పాటు వికసిస్తుంది. దీని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అందుకే దీనిని శవ పుష్పమని, మృత్యు పుష్పమని కూడా అంటారు. దీనికి ముందు ఈ పుష్పం కరోనా కాలంలో అమెరికాలోని ఫ్రాన్సిస్కోలో కనిపించింది. అప్పుడు కూడా ఈ పుష్పం చర్చల్లో నిలిచింది. కొన్ని కిలోమీటర్ల వరకూ దీని దుర్వాసన వ్యాపిస్తుండంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతుంటారు. 2011లోనూ ఈ పుష్పం వికసించింది. ఇది చూసేందుకు ఎంతో వింతగా ఉంటుంది. ఇది అతి అరుదైన పుష్పం. ఈ పుష్పం 12 అడుగుల ఎత్తు కలిగివుంటుంది. ఈ పుష్పం వికసించేందుకు 10 ఏళ్లు పడుతుంది. ఈ కాలం ముగిశాకనే అది పూర్తిస్థాయిలో వికసిస్తుంది. అప్పుడు అది ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే దీనిని చూడాలనుకుంటే ముక్కు మూసుకోవాల్సిందే. ఇది కూడా చదవండి: ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు! -
అద్భుతం..అంతరిక్షంలో వికసించిన పువ్వు! ఫోటో వైరల్
అనంతమైన విశ్వం పరిశోధకులను, శాస్త్రవేత్తలను ఏదో రకంగా ఆకర్షిస్తుంది. అది కొత్త పరిశోధనలకు నాంది అయ్యి ప్రంపంచానికి సరికొత్త అద్భుతాలను అందించేందుకు దోహదపడుతుంది. అదీగాక అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త ప్రయోగాలతో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు కూడా. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో మానవ అవసరాలకు సంబంధించిన ఎన్నో పరిశోధనలు చేశారు. అక్కడ మనం నివశించగలమా? మొక్కలు పెరుగతాయా? తదితరాలన్నింటి గురించి అధ్యయనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అమెరికాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్షసంస్థ అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని మొక్కలు పెరుతాయా లేఆదా అనే దానిపై 1970ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధన ఫలించింది. వారు పెంచిన ఓ మొక్క పెరగడమే గాక షష్పించింది. అత్యంత అసాధారణమైన వాతావరణంలో పుష్పించడం అనేది విస్మయానికి గురిచేసే విషయం. ఇది నాసా విజయానికి ప్రతీక. విశ్వ రహస్యాలను చేధించటానికి ఈ పరిశోధన ఉపకరిస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోని నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ జిన్నియా మొక్క అంతరిక్ష కేంద్రంలో వెజ్జీ సదుపాయంలో భాగంగా కక్ష్యలో పెరిగిందని ఓ క్యాప్షన్‌ని కూడా జోడించారు. ఈ మేరకు వ్యోమగామి కెజెల్ లిండ్‌గ్రెన్ మాట్లాడుతూ..మా అంతరిక్ష ఉద్యానవనం కేవలం ప్రదర్శ కోసం పెంచటం లేదని కక్షలో మొక్కలు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకోవడం తోపాటు భూమి నుంచి పంటలు ఎలా పెంచాలో తెలుసుకునేందుకు ఉపకరిస్తుందన్నారు. ఇప్పటి వరకు పాలకూర, టొమాటో, చిల్లీ పిప్పర్ వంటి వాటిని అంతరిక్ష కేంద్రంలో పెంచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, నాసా షేర్ చేసిన ఫోట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇది అద్భుతం, పైగా అందమైనది అని ప్రశంసించగా, మరికొందరూ ఈ మొక్క పెరగడానికి ఎంత సమయం తీసుకుందని ప్రశ్నస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోకి ఆర లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by NASA (@nasa) (చదవండి: ఐస్ క్రీమ్ తింటున్న కొద్దీ ఇంకా తినాలని ఎందుకు అనిపిస్తుంది?) -
భలే.. భలే.. కొబ్బరిపువ్వు
సాక్షి, అమలాపురం: దేవాలయాల్లోనో, శుభకార్యాల్లోనో కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ కొబ్బరి పువ్వు ఇప్పుడు కొంతమంది వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. సాధారణంగా కొబ్బరికాయలోని నీరు ఇంకిపోయాక మొక్క మొలకెత్తే సమయంలో ఈ కొబ్బరిపువ్వు కాయ లోపల తయారవుతుంది. ఈ సమయంలో కొబ్బరికాయను కొడితే లోపల దూదిలా తెల్లగా ఉండే కొబ్బరిపువ్వు ఉంటుంది. దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. గతంలో ఇవి కొబ్బరి పంట ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా లభించేవి. ఇప్పుడు మహానగరాల్లో కూడా లభిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చెన్నై వంటి నగరాల్లో కొబ్బరి పువ్వుకు మంచి డిమాండ్ ఉంది. ఈ ప్రాంతాలకు గోదావరి జిల్లాల నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల ద్వారా రోజూ కొబ్బరి పువ్వు ఎగుమతి అవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ముంజవరం, ముంగండ, మలికిపురం మండలం రామరాజులంక, పెదతిప్ప, రాజోలు, మామిడికుదురు మండలాలతో పాటు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, దెందులూరు, పెదవేగి ప్రాంతాల్లో కొబ్బరి పువ్వు ఎక్కువగా లభ్యమవుతోంది. గోదావరి ప్రాంతం నుంచి ఈ వేసవి సీజన్లో రోజుకు 3 వేల నుంచి 5 వేల పువ్వులు హైదరాబాద్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ రోజుకు 8 వేల నుంచి 10 వేల వరకు ఎగుమతి అవుతాయి. కాయ కన్నా ప్రియం కొబ్బరి పువ్వును వాడుక భాషలో కొబ్బరి గుడ్డుగా పిలుస్తారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కొబ్బరి గుడ్డుకు సైజును బట్టి రూ. 30 నుంచి రూ.70 వరకూ ధర ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా చెన్నై, బెంగళూరు మార్కెట్లకు ఈ పువ్వులు ఎగుమతి అవుతున్నాయి. పెద్దసైజు పువ్వులను ఆ మార్కెట్లలో రూ. 100 వరకూ అమ్ముతున్నారు. గోదావరి జిల్లాల్లో కొబ్బరి రైతుల వద్ద నుంచి వ్యాపారులు అన్ సీజన్లో పువ్వు సైజును బట్టి రూ. 4 నుంచి రూ. 9 మధ్యలోనే కొంటున్నారు. అదే సీజన్లో రూ.12 నుంచి రూ.15 వరకూ ధర చెల్లిస్తున్నారు. నీళ్ల కంటే ఎక్కువ పోషకాలు కొబ్బరి నీళ్లు, కొబ్బరి కంటే కూడా కొబ్బరి పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పువ్వు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడంలో బాగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుందని వివరిస్తున్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలో కొబ్బరి పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను దరి చేరకుండా చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని సైతం రెట్టింపు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మంచిది కొబ్బరి పువ్వులో 66 శాతం కార్బోహైడ్రేట్లు, 64 శాతం సాల్యుబుల్ సుగర్స్ ఉంటాయి. ఫైబర్‌తో పాటు మినరల్స్, న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని తినడం ఆరోగ్యపరంగా మంచిది. – బి.శ్రీనివాసులు, వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్రం అధిపతి, అంబాజీపేట, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గతం కన్నా ఎగుమతులు పెరిగాయి ఐదారేళ్ల క్రితం కొబ్బరి గుడ్డు ఉచితంగా ఇచ్చేవారు. మరీ డిమాండ్ ఉంటే పువ్వు రూపాయి ఉండేది. ఇప్పుడు కొబ్బరి కాయకన్నా ఎక్కువ ధర పలుకుతోంది. ఇటీవల ఎగుమతులు బాగా పెరిగాయి. కోనసీమ నుంచే కాకుండా ఏలూరు నుంచి కూడా ఎగుమతి అవుతోంది. అప్పుడప్పుడు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా హైదరాబాద్‌కు కొబ్బరి గుడ్డు వస్తోంది. – సూదాబత్తుల వెంకట రామకృష్ణ, వ్యాపారి, అంబాజీపేట -
పసిఫిక్ మహాసముద్రంలో వింత ‘పుష్ప’ జీవి గుర్తింపు
న్యూఢిల్లీ: అచ్ఛంగా విచ్చుకున్న పుష్పంలాగా ఉన్న కొత్త జీవిని పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధకులు గుర్తించారు. ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన పసిఫిక్ అడుగు భాగాన అన్వేషిస్తుండగా, ఈ జీవి దర్శనమిచ్చింది. సంబంధిత వీడియో దృశ్యాలను ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు విడుదల చేసింది. సముద్ర ఉపరితలం నుంచి 9,823 అడుగుల(2,994 మీటర్లు) లోతున ఈ జీవి కనిపించిందని పరిశోధకులు చెప్పారు. పువ్వుకు ఉన్నట్టుగానే దీనికి కాండం, రేకుల (తంతువుల) లాంటివి ఉండడం విశేషం. కాండం వంటి భాగం 7 అడుగులు (2 మీటర్లు) కాగా, ఒక్కో తంతువు 16 అంగుళాలు (40 సెం.మీ.) పొడవున్నాయట! ఇదో భారీ సముద్ర జీవి అని చెబుతున్నారు. అయితే ఇతర సముద్ర జీవజాతుల తరహాలో కాకుండా భిన్నంగా కనిపిస్తుండడం దీని ప్రత్యేకత. ఇలాంటి వింత జీవి ఒకటి కనిపిస్తుందని ఎప్పుడూ ఊహిచలేదని పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే.. -
Photo Feature: తొలి పువ్వు పదహారేళ్లకు..
శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వనప్రేమికుడు కోమనేని రఘు ఇంటి ఆవరణలో పదహారేళ్ల క్రితం సీయర్స్ జామకారు మొక్కను నాటారు. మండకారు అని కూడా పిలిచే క్యాక్టస్ జాతికి చెందిన ఈ మొక్క ఇదిగో ఇప్పుడు తొలి పువ్వును పూసింది. తెల్లటి రేఖలతో వికసించిన ఈ పువ్వును చూసేందుకు గ్రామస్తులు తరలివస్తున్నారు. చదవండి: చీమ.. బలానికి చిరునామా.. -
ఓ కుటుంబాన్ని కోటిశ్వరులుగా మార్చిన ప్లవర్‌వేజ్
ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. మన దగ్గర ఉన్నవాటి నుంచే అదృష్టం తలుపుతడుతుందని కూడా అనుకోం. ఒక్కోసారి చాలా వింతగా అనుకోను కూడా అనుకోని, ఊహించని సంఘటనలు ఎదరువుతుంటాయి. ఇలాంటి సంఘటనల కారణంగానే మన కళ్లముందు అప్పటి వరకు చాలా సాదాసీదాగా ఉన్నవాడు ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ అయ్యిపోతుంటాడు. అలాంటి వారిని ఇప్పటి వరకు ఎంతోమందిని చూసుంటాం. కానీ ఇంట్లో వృద్ధాగా పడి ఉన్న ఒక ఫ్లవర్ వేజ్ ఒక కుటుంబాన్ని కోటిశ్వరుణ్ణి చేసిందంటే నమ్మగలరా!.ఔను నిరుపయోగంగా ఒక మూలన పడి ఉన్న ప్లవర్ వేజ్ ఓ కుటుంబం తలరాతని మార్చేసింది. వివరాల్లోకెళ్తే...యూకేలోని మిడ్‌ల్యాండ్స్‌లో నివసిస్తున్న ఒక కుటుంబం 1980లలో ఒక ప్లవర్ వేజ్ జాడీని కొనుగోలు చేశారు. ఐతే వాళ్లు దాన్ని ఇంట్లో అలంకరణ వస్తువుగా కొన్నేళ్లు ఉపయోగించారు. కాలక్రమేణ పగుళ్లు రావడంతో దాన్ని వంటగదిలో ఓ మూలన పెట్టేశారు. ఆ ప్లవర్ వేజ్‌ని వాడడం మానేసి చాలా ఏళ్లయ్యింది. ఐతే అనుకోకుండా ఒక రోజు వారింటికి వచ్చిన ఓ ఆర్కియాలజిస్ట్ దృష్టిలో ఆ ప్లవర్ వేజ్ పడింది. ఆయన ఆ ప్లవర్ వేజ్ జాడీ విశిష్టత గురించి వివరించి చెప్పాడు. ఇది నీలిరంగులో ఉన్న వెండి, గోల్డ్‌తో తయారు చేయబడిన పాత్ర అని చెప్పాడు. ఇది 18వ శతాబ్దపు రాజు కియాన్లాంగ్ కాలంలో ఉపయోగించేవారని ఆ పాత్రపై ఉన్న ఆరు అక్షరాల ముద్ర ద్వారా తెలియజేశాడు. అంతేకాదు ఈ రాజరికపు ప్లవర్ వేజ్ జాడీతో బంగారం, వెండికి సంబంధించిన పనులు చేసేవారని తెలుసుకుని ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. దీనిపై ఎనిమిది అమర చిహ్నాలు ఉన్నాయని, అవి దీర్ఘాయువును శ్రేయస్సును సూచిస్తుందని ఆ నిపుణుడు వివరించాడు. ప్రస్తుతం ఈ జాడి ధర రూ. 1 కోటి 44 లక్షల రూపాయల వరకు పలుకుతుందని కూడా చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక చైనా ధనవంతుడు ఆ ఫ్లవర్ వేజ్ జాడీని 1.2 మిలియన్ పౌండ్లకు (దాదాపు రూ.11 కోట్ల 53 లక్షలు) కొనుగోలు చేశాడు. అంతేగాదు తమ వంశీయులు పోగొట్టుకున్న వారసత్వ సంపదను తిరిగి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడతను. (చదవండి: బోనులో ఉన్న సింహంతో పరాచకాలు ఆడాడు...ముచ్చెమటలు పట్టించేసిందిగా: వీడియో వైరల్) -
పువ్వులతోనే వేడినీళ్లు
మనం వేడి నీళ్లు కావాలంటే హీటర్ పెట్టుకోవడం లేదా గేజర్ ఆన్ చేసుకుంటాం కదా. కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు దాని స్థానంలో మనం పువ్వులతో నీళ్లని వేడి చేసుకోవచ్చు ఎలా అని ఆశ్చర్యంగా ఉంది కదూ!. ఏం లేదండి సోలార్ ప్యానెల్‌తో తయారు చేసిన పూలు మరి. ఇవి నీటిలో వేసినప్పుడు అవి సూర్యకాంతిని గ్రహించి చాలా తక్కువ సమయంలోనే నీళ్లను వేడిగా మార్చేస్తాయట. అందుకే చాలా మంది వీటిని కోనేసుకుని వాళ్ల స్విమ్మింగ్ పూల్‌లో వేసేసుకుంటున్నారట. (చదవండి: ఓల్డ్ కార్ సీట్ బెల్ట్‌తో బ్యాగ్‌లు) మరికొంత మంది అయితే బకెట్లలో ఆ పువ్వులు వేసుకుని బాల్కనీలో ఆరుబయట సూర్యునికి ఎదురుగా కాసేపు పెట్టి ఆ తరువాత వాడేసుకుంటున్నరట. ఈ పూలు చూడటానికి అందంగా ఆకర్షణియంగా ఉండటంతో పాటు పూల్ నీటి కొలనులో ఉండే తామర పూలు మాదిరి అందంగా ఉంటుంది. అంతేకాదండోయ్ ఇవి ప్యాక్‌కి 12 ఉంటాయట. ఇవి ఎక్కువగా నీలం,నలుపు, రెయిన్బో హ్యూడ్ రంగులలో లభిస్తాయట. ఇక మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి (చదవండి: స్వచ్ఛ కార్యక్రమాలతో అలరించిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్) -
పువ్వును వాసన చూసి నరకం అనుభవించిన అమ్మాయిలు
ఒట్టావా : కొన్ని కొన్ని సార్లు కటౌట్ చూసి నమ్మటం మనల్ని ప్రమాదంలో పడేయొచ్చు. బయట కనిపించే అందం లోపలి మంచికి ఎప్పటికి కొలమానం కాదు. ఈ విషయం ఏంజిల్స్ ట్రంపెట్ పువ్వును వాసన చూసిన ఆ ఇద్దరు యువతులకు ఎరుకలోకి వచ్చింది. ఆ అందమైన పువ్వు వారిని ప్రాణాపాయంలో పడేసింది. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని టొరొంటోకు చెందిన సింగర్, పాటల రచయిత రఫెలా వేమ్యాన్ కొద్దిరోజుల క్రితం తన మిత్రురాలితో ఓ బర్త్‌డే పార్టీకి వెళుతోంది. మార్గం మధ్యలో ఓ పొడవాటి పువ్వు వీరి దృష్టిని ఆకర్షించింది. దీంతో వారు దాని దగ్గరకు వెళ్లారు. రఫెలా పువ్వును తెంపి చేతుల్లోకి తీసుకుంది. అనంతరం ఇద్దరూ దాన్ని వాసన చూశారు. దీన్నంతా వీడియో తీసి, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ తర్వాత అక్కడినుంచి బర్త్‌డే పార్టీలోకి అడుగు పెట్టిన వీరి ఆరోగ్య పరిస్థితి కొంచెం కొంచెంగా క్షీణించసాగింది. దీంతో ఇంటికి వచ్చేశారు. ఇంటి దగ్గర తన పరిస్థితి వివరిస్తూ..‘‘ నా శరీరం నా ఆధీనంలో లేకుండా పోయింది. వచ్చి బెడ్‌పై పడుకున్నాను. కొద్ది సేపటి తర్వాత బ్లాక్ డ్రెస్ వేసుకున్న మనిషి నా గదిలోకి ప్రవేశించాడు. బెడ్‌పై నా పక్కన కూర్చున్నాడు. అతడు నాకు ఇంజెక్షన్ వేస్తుంటే కదలేని.. మాట్లాడలేని.. అరవలేని స్థితిలో ఉన్నాను. మూలుగుతూ పడుకుని ఉన్నాను’’ అని రఫెలా తెలిపింది. అయితే అదృష్టవశాత్తు ఆ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఏంజిల్స్ ట్రంపెట్ : రఫెలా వాసన చూసిన అందమైన ఆ పువ్వు పేరు ఏంజిల్స్ ట్రంపెట్. ఇది విషపూరితమైనది. స్కోపోలమైన్ అనే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన డ్రగ్ఇందులో ఉంటుంది. View this post on Instagram A post shared by * 𝐑𝐀𝐋𝐏𝐇 * (@songsbyralph) -
బాబోయ్ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం
వార్సా(పోలాండ్): పువ్వుల వాసనకు పరవశించిపోతాం.. వాసన లేని పువ్వును.. పూజకు పనికిరాదని పడేస్తాం! మనిషికి వాసన ఓ వరం, అవసరం కూడా. తేడా వస్తే మాత్రం.. కలవరమే! అయితే పోలాండ్లోని వార్సా యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్‌లో ఓ పుష్పం ఆదివారం వికసించింది. దాని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అయిన్పటికీ ఈ పుష్పాన్ని చూడటాకిని వందల మంది జనం క్యూ కడుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ పుష్పాన్ని అమోర్ఫోఫాలస్ టైటనం అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 3 మీటర్లు (10 అడుగులు) ఎత్తు వరకు ఉంటుంది. కొన్ని పూల రెక్కల సమూహంతో ఉండే ఈ పుష్పం వికసించడం చాలా అరుదు. అంతరించిపోతున్న సుమత్రన్ టైటాన్ అరుమ్ అనే పుష్పం మాంసాన్ని తినిపించే పరాగసంపర్క కీటకాలను ఆకర్షించడానికి కుళ్లిన శవం వాసనను విడుదల చేస్తుంది. అయితే ఈ మొక్క సుమత్రాలోని వర్షారణ్యాలలో మాత్రమే పెరుగుతుంది. కానీ అటవీ నిర్మూలన కారణంగా దీనికి ప్రమాదం వచ్చి పడింది. దీంతో వార్సా యూనివర్శిటీ బొటానికల్ గార్డెన్స్‌లో దీన్ని సంరక్షిస్తున్నారు. కాగా ఈ పుష్పం చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇక సుమత్రా అడవుల్లో కాకుండా ఈ పుష్పం మొట్టమొదట 1889లో క్యూలోని లండన్ రాయల్ బొటానికల్ గార్డెన్స్‌లో వికసించింది. చదవండి: నేపాల్‌లో వర్ష బీభత్సం.. భారత్‌లోనూ ప్రభావం -
అలంకారప్రాయం
గోదావరిఖని: రెండు జిల్లాలను కలిపే వారధి. కింద నుంచి గలగలా ప్రవహించే గోదావరి. కానీ ఈ వారధిపై ఉన్న పూల మొక్కలకు గుక్కెడు నీరు కరువైంది. రెండు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వంతెన గుండానే రాకపోకలు సాగిస్తున్నా వాడిపోయిన పూల మొక్కలు పట్టించుకే వారే కరువయ్యారు. లక్షలు ఖర్చు చేసి వంతెనపై పెట్టిన పూల కుండీలు చివరకు అలంకారప్రాయమయ్యాయి. వంతెను కొత్త అందాలను తీసుకువచ్చేందుకు రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ చేపట్టిన పని ఆరంభ శూరత్వమే అయ్యింది. హరితహారం స్ఫూర్తి ఆవిరైపోయింది. సాక్షి ఫోటోగ్రాఫర్, పెద్దపల్లి -
పెళ్లి కూతురుతో పూల ‘బామ్మలు’
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు సినిమాల్లో యువ రాణులు తమ చెలికత్తెలతో కలిసి పూల బుట్టలు పట్టుకొని పూదోటలకు వెళ్లి రావడం, గుళ్లూ గోపురాలు చుట్టి రావడం మనలో ఎక్కువ మంది చూసే ఉంటారు. మరి ఇలాంటి అనుభవం అమెరికాకు చెందిన లిండ్సే రాబీకి ఎక్కడ ఎదురయిందో తెలియదు గానీ, తన పెళ్లికి మాత్రం పూల బామలు కాకుండా పూల బామ్మలు కావాలని పంతం పట్టింది. అంటే తన నలుగురు బామ్మలు పూల బుట్టలు పట్టుకొని తన ముందు పూలు చల్లుకుంటూ నడుస్తుంటే పెళ్లి కూతురు దుస్తుల్లో ముస్తాబై తాను పెళ్లి పీటలపైకి నడిచి వస్తానంటూ తన మనోగతాన్ని పెళ్లి ఏర్పాట్లు చూసే పెద్దలకు చెప్పింది. అంతే లిండ్సే నలుగురు బామ్మలకు ఒకే నీలి రంగుపై నీలి, తెలుపు, కాస్త నలుపు రంగు చుక్కలు కలిగిన దుస్తులను ఆగ మేఘాల మీద వెళ్లి కుట్టి తెప్పించారు. లిండ్సే ముత్తవ్వ (తల్లి తల్లికి తల్లీ) కథ్లీన్ బ్రౌన్, 72 ఏళ్ల బెట్టీ బ్రౌన్, 76 ఏళ్ల వాండా గ్రాంట్ (వారిలో ఒకరు తన తల్లికి తల్లి కాగా, మరొకరు తన తండ్రికి తండ్రి), ఇక పెళ్లి కుమారుడు ట్యానర్ రాబీ తల్లి జాయ్ రాబీలు ఆ ఒకే తీరు దుస్తులను ధరించి అట్టలతో చేసిన పూల బుట్టలను పట్టుకొని పెళ్లి కూతురు కోరిక మేరకు ఆమె ముందు నడుస్తూ, దారంటూ పూల చల్లుతూ పెళ్లి కూతరును పీటలపైకి ఆహ్వానించారు. బామ్మలకు కూడా మనుమరాలిని అలా ఆహ్వానించడం తెగ ముచ్చటేసింది. బామ్మల పట్ల మనమరాలికున్న అనుబంధానికి ఈ వెంట్ నిదర్శనమని పెళ్లికి హాజరైన బంధువులు, మిత్రులు వేనోళ్ల ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలోని బెంటాన్ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ముచ్చటైన సంఘటనను ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ నటాలీ కాహో వాటిని ‘ఇన్స్టాగ్రామ్’ బిజినెస్ పేజీలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తున్న యూజర్లు ఎవరికి వారు, ఇలాంటి పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని కలలుగంటున్నారు. -
ఈ పూవుతో కేన్సర్ మందు!
ఫొటోలో ఉన్న పువ్వును మీరెప్పుడైనా చూశారా? చూసే ఉంటారులెండి. ఈ పూల నుంచి సేకరించిన ఒక రసాయనం కేన్సర్‌కు విరుగుడుగా పనిచేస్తుందని అంటున్నారు బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఫీవర్‌ఫ్యూ అని పిలిచే ఈ పువ్వును కొన్నిచోట్ల చాలాకాలంగా తలనొప్పి నివారణకు వాడుతూంటారు. కానీ పువ్వులోని పార్థీనియోలైడ్ అనే రసాయనం క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా కణాలపై ప్రభావం చూపుతున్నట్లు బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్ కణాల్లోని రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (రాస్) మోతాదులను పెంచడం ద్వారా ఈ రసాయనం పనిచేస్తున్నట్లు తెలిసింది. కేన్సర్ కణాల్లో సహజంగానే ఎక్కువగా ఉండే రాస్‌ను మరింత పెంచడం ద్వారా ఈ రసాయనం కణాలను నాశనం చేస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాన్ ఫోసే తెలిపారు. మెడ్‌కెమ్ కామ్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. మరిన్ని జంతు, మానవ ప్రయోగాలు జరిగితే పార్ఠీనియోలైడ్కున్న లక్షణాలు నిర్ధారణ అవుతాయని తద్వారా దీన్ని కేన్సర్ చికిత్సకు మరో మందుగా వాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. -
వికసించిన ఏప్రిల్ పుష్పం
పెద్దవూర (నాగార్జునసాగర్) : మండలంలోని ముసలమ్మచెట్టు స్టేజీ గ్రామంలోని కత్తి ఎల్లారెడ్డికి చెందిన బాబాయ్ హోటల్ ఎదుట ఏప్రిల్ పుష్పం వికసించింది. ఈ పుష్పం ఏడాదిలో ఏప్రిల్ నెలలో ఒకసారి మాత్రమే పూస్తుంది. హోటల్‌కు వచ్చే వారితో పాటు దేవరకొండ–మిర్యాలగూడెం ప్రధాన రహదారిపై వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఈ పూలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
పూలలో కన్నీరు
మూర పూలకు జానెడు పొట్టకు లంకె. నాలుగు రెక్కలకు నాలుగు వేళ్లకు ముడి. బుట్టనిండా సువాసనే. ఇంట్లో గంజి వాసన కూడా రాదు. పూలమ్మే వాళ్ల జీవితాలు రాళ్లు మోసే వారి కంటే ఘోరంగా ఉన్నాయి. శ్రీరామనవమి పండుగ... ఇళ్లు, గుళ్లు కోలాహలంగా ఉన్నాయి. పూలదండలు వేళ్లాడుతున్నాయి. చుట్టిన దండలు బుట్టల్లో ఉన్నాయి. మరో పక్క విడిపూల గంపలు. గుళ్లో పూజారి మంత్రాలకంటే పూల బుట్టల దగ్గర బేరాలే గట్టిగా వినిపిస్తున్నాయి. ‘‘అవ్వా! రెండు మూరల బంతిపూల దండ ఇస్తావా’’ అన్నాడు వివేక్ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో నుంచి పర్సు తీస్తూ. వెంకటమ్మ పూలు మూర కొలిచి వేలిని మెలిపెట్టి తుంచబోతూ ఆగి, ‘‘రెండు మూరలు చాలా నాయనా! దేవుడికా, వాకిలికా’’ అడిగింది. అప్పటికే వివేక్కీ అదే సందేహం... రెండు మూరల బారును చూస్తూ ద్వారబంధానికి సరిపోతుందా, అమ్మను ఎన్ని మూరలని అడగలేదే... అన్నట్లు చూస్తున్నాడు. ‘‘వాకిలికి వేయడానికే’’ అన్నాడు. ‘‘వాకిలికి మూడు మూరలు పడతాయి’’ అని వివేక్ ముఖంలోకి చూస్తూ ఆగింది. ‘‘అలాగే మూడు మూరలివ్వు... ఎంత’’ అడిగాడు వివేక్. ‘‘పాతిక... మూర’’ పాతిక పెద్దగా అంటూ... మూర చిన్నగా పలికింది. మూడు మూరలకూ కలిపి ఏకంగా డెబ్బై అయిదు అంటే పర్సులో డబ్బు పర్సులోనే పెట్టుకుని వెళ్లిపోతాడేమోనని బెరుకు. ‘‘డెబ్బై అయిదు రూపాయలా! బంతిపూలు’’ బంతిపూలు పదాన్ని నొక్కి పలికాడు వివేక్. ‘‘బంతిపువ్వయినా గులాప్పువ్వయినా నా తోటలో పూస్తుందా నాయనా? మార్కెట్లో కొనాలె, దండల్లి అమ్మాలె. అక్కడే కేజీ బంతిపూలు వంద రూపాయిలు పలుకుతున్నాయీరోజు. పండగ గిరాకీ అట్లుంది మరి’’ కన్విన్స్ చేసి కొనిపించాలనే ప్రయత్నం ఆమె మాటల్లో. ‘‘సరే ఇవ్వవ్వా’’ అన్నాడే కానీ వివేక్కి ‘అంత ధర పెట్టి తెచ్చావా, బేరమాడలేదా’ అని అమ్మ కోప్పడుతుందేమోనని భయంగానే ఉంది. ‘‘గులాబీలు ఇవ్వనా’’ వాకిలికి బంతిపూలు వేస్తే దేవుడికి గులాబీలు పెట్టవా? అన్నట్లుందా మాట. ‘‘పది రూపాయలకివ్వు’’ అన్నాడు తనతో తెచ్చిన పెద్ద షాపింగ్ బ్యాగ్ ఓపెన్ చేస్తూ. ‘‘ఈ రోజు పదిరూపాయలకి రావు నాయనా, ఇరవై రూపాయలు, రేపట్నుండి మార్కెట్ అగ్వవుంటది గప్పుడు పదిరూపాయలకిస్తా’’ అంటూ చిన్న పాలిథిన్ కవర్లో గులాబీలు వేసింది. పిల్లాడు గీచి బేరం చేయట్లేదులే అనుకుంటూ మరో గుప్పెడు గులాబీలను అదే కవర్లో కుక్కినట్లు పెట్టింది. ‘‘పూలతోనే బిల్డింగులు కట్టేట్లున్నారు’’ చిరాగ్గా అన్నది ఆ పక్కనే ఉన్న వసంత ఏ బుట్ట దగ్గర ఆగాలో తేల్చుకోలేక అటూ ఇటూ తిరుగుతూ. ‘‘ఈ ఒక్కరోజే వేలాదిరూపాయల వ్యాపారం చేస్తారు. రూపాయి కూడా తగ్గించరు. పండక్కి కొనక చస్తారా అని వాళ్ల ధీమా’’ మరింత విసుగ్గా బదులిచ్చింది మాలతి. వాకిలికి పూలదండ వేసి దేవుడి పటాలన్నింటికీ పూలు అలంకరించాలి, తలలోకి మల్లెలు కొనాలంటే రెండొందలైనా అయ్యేట్లుంది. నిన్న ఆఫీస్ నుంచొస్తూ తెమ్మంటే ఆయనకి పట్టనేలేదు. ఉడికిపోతోంది వసంత. ‘‘అంతేసి మాటెందుకు బిడ్డా! మాకు గిట్టేది మా కష్టమేనమ్మా. ఈ రోజు మార్కెట్లోనే మస్తు గిరాకుంటది. గిట్ల బేరం అడుగుతానికి కూడా ఉండదక్కడ. ఎన్ని కిలోల పూలు కావాలో చెప్పాలె, వాళ్లు చెప్పిన ధరకు తెచ్చుకోవాలె’’ నొచ్చుకుంది వెంకటమ్మ. తమ మాటలు ఆమెను నొప్పించాయని అర్థమైంది మాలతికి. వసంతను మాట్లాడవద్దని గిల్లుతూ ‘‘బంతిపూలు మూర ఇరవైకిస్తావా’’ అన్నది వెంకటమ్మ దృష్టి పూల వైపు మరలడానికి. వసంత మరొక పూల బుట్ట దగ్గరకు నడిచింది. ‘‘అత్తా! ఓ సారి బస్తీలో తిరిగొస్తా, అన్నం పెట్టుకు తిను. పిల్లలొచ్చాక వాళ్లకీ పెట్టు’’ పూల బుట్ట సర్దుకుంటూ అన్నది సుజాత. వెంకటమ్మ గుడి దగ్గర అమ్మగా మిగిలిపోయిన పూలను ఇంటికి తెచ్చింది. ఆ పూలను మళ్లీ వేటికి వాటిని విడిగా సర్దుతోంది సుజాత. ‘‘సర్లేవే సుజాతా, మరీ పొద్దుపోయే దాకా ఉండొద్దు. ఎన్ని అమ్మితే అంతే అమ్మి తొందరగా ఇంటికొచ్చెయ్. బస్తీలో మూలలకెళ్లకు’’ వెంకటమ్మ మాటల్లో భయం. ఆ భయం సుజాతకూ అర్థమవుతోంది. ‘‘అలాగేలే’’ అని బుట్ట చంకన పెట్టుకుని కాలు బయటపెట్టింది. ఎలాగైనా మిగిలిన పూలను రాత్రికి అమ్మకపోతే రేపు కొనేవాళ్లుండరు. గులాబీల రెక్కలు రాలిపోతాయి. బంతిపూలు వాడి ముడుచుకుంటాయి. మూర పదికైనా సరే ఇచ్చేయాలి... అనుకుంటూ వీథిలో నడుస్తూంది. ‘‘అమ్మా! అన్నం తిన్నావా! పిల్లలు తిన్నారా? సుజాత కనిపించదే ఎటెళ్లింది’’ అంటూనే మంచం మీద వాలిపోయాడు యాదగిరి. ‘‘పిల్లలు, నేనూ తిన్నాం కొడకా, సుజాత మిగిలిన పూలు అమ్ముకొత్తానని బస్తీలకెళ్లింది. నువ్వు తిందువు రా మల్లా పొద్దుగాలే మార్కెట్కెళ్లాలె, నీకు నిద్దరుండట్లేదసలే’’ వెంకటమ్మ తల్లి మనసు పడుతున్న తపన. ‘‘సుజాతకు ఎన్ని అమ్ముడుపోతయ్యో ? ఎన్ని పూలు మిగిలి తెస్తదో? రేప్పొద్దున మార్కెట్కెళ్లడానికి ఎన్ని డబ్బులున్నాయమ్మా’’ అంటూ కళ్లు మూసుకున్నాడు. ఇంట్లోకి సుజాత వస్తున్న ఆనవాలుగా పూలవాసన వచ్చింది. యాదగిరిని పూల వాసన తాకింది. అతడి ముక్కుపుటాలు పూల వాసనను గుర్తించడం మానేసి ఎన్నో ఏళ్లయింది. పూలు అందరికీ సువాసననిస్తాయి, పూలతో బతికే వాళ్లకు ఆ వాసనే తెలియదు. ‘‘అమ్మా! ఈ పూలు నేను పెట్టుకుంటా’’ సుజాత తెచ్చిన బుట్టలో నుంచి మల్లెపూల దండ తీసుకున్నది పదేళ్ల లావణ్య. ‘‘పెట్టుకో’’ అంటూ లోపలికెళ్లింది సుజాత. భర్తకు తనకు భోజనాలు వడ్డించుకోవడానికి. కూతురి జడలో పూలు చూస్తే ముచ్చటగానే ఉంది. కానీ ఆ మూర కూడా అమ్ముడైతే పూలు కొన్న డబ్బయినా వచ్చేది. తల్లి ముఖం అభావంగా ఉందని తెలిసే వయసు కాదు లావణ్యది. జడ పొడవునా చుట్టుకున్న మల్లెల దండను జడతోపాటు ముందుకు వేసి బుగ్గకు రాసుకుంటూ సంతోషపడుతోంది. కూతురి సంతోషం చూస్తుంటే... యాదగిరికి నిండుగా విరిసిన పూలతోటను చూసినట్లుంది. ‘‘బిడ్డకు నాలాగ పూలమ్మేవాడు వద్దే సుజాతా, భార్యకు తల నిండా పూలు కొనిపెట్టగలిగినోడితో పెళ్లి చేస్తా’’ అంటూ భోజనానికి కూర్చున్నాడు. సుజాత భోజనం వడ్డిస్తూ యాదగిరి ముఖంలోకి చూసింది ‘మా నాన్న కూడా ఇలాగే అనుకుని ఉంటాడు’ అనుకుందామె మనసులో. పది తిండికి... పది ఇంటికి! మాది మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్. అక్కడ చారెడు పొలం ఉండేది. ఆ తిండి గింజలతో ఏడాదంతా వెళ్లబారేది కాదు. పొలం పనులు చేయడానికి నా మొగునికి ఒంట్లో బలం లేదు. దాంతో హైద్రాబాద్ సిటీకొస్తే తేలిక పనులు చేసుకుని బతకొచ్చనుకున్నాం. మేము సిటీకొచ్చేనాటికి కొడుకు, కూతురు చిన్నపిల్లలు. మేమొచ్చి నలభై ఏళ్లయింది. నా పెనిమిటి మార్కెట్ నుంచి పూలు తెస్తే నేను దండలు కట్టేదాన్ని. రోజూ పొద్దున్నే గుడిమల్కాపూర్ మార్కెట్‌కో, జాంబాగ్ మార్కెట్‌కో పోయి పూలు తెచ్చేటోడు. అప్పట్లో దినాలు బాగానే వెళ్లబారినాయి. ఇప్పుడున్నన్ని ఇంగ్లిష్ పూలు అప్పట్లో లేవు. ఏ పండుగయినా, వేడుకైనా ఈ బంతిపూలు, చేమంతులు, మల్లెలే. ఇప్పుడు అరచెయ్యంత పూలు అక్కడెక్కడో సీమదేశాల్లో పూస్తాయట. మరీ డబ్బున్నోళ్లు ఆ పూలతోనే డెకరేషన్ చేస్తున్రు. మా పూలు పండగలప్పుడే కొంటున్రు. ఈ పూల మీదనే కొడుకుని పదో తరగతి వరకు చదివించినం. కూతురికి పెళ్లి చేసినం. బతుకైతే వెళ్లబారుతోంది. ఇంటద్దెలు కట్టుకుని, నలుగురూ తినాలంటే జరిగే పని కాదని తెలిసింది. ఊర్లో ఉన్న పొలం అమ్మి బోరబండలో 120 గజాల జాగా కొనుక్కున్నాం. అందులో గోడలు లేపి రేకులు దించింనం. ఆ గోడలు లేపి రేకులు వేయడానికి పడిన పాట్లు చిన్నవి కాదు. పూలమ్మిన డబ్బుల్లో పది రూపాయలు ఇంటి కోసం పక్కన పెట్టి, పది రూపాయలు తినడానికి ఖర్చు చేసుకున్నం. కాస్త నిమ్మళించాం అనుకునేంతలో నా పెనిమిటి రాములుకి జబ్బు చేసింది. నాలుగేళ్లయింది క్యాన్సర్‌తో పోయాడు. ఇప్పుడు నా కొడుకు, కోడలు, నేను ముగ్గురం పూలతోనే బతుకుతున్న. రోజుకు మూడు వందలు మిగిలితే ఆ రోజు గుండె నిండినట్లవుతాది. – వెంకటమ్మ, పూలమ్మే మహిళ – వాకా మంజులారెడ్డి -
పూలవనం.. ఎల్బీ స్టేడియం
సాక్షి, హైదరాబాద్: మంగళవారం నాడు ఉయ్యాలో.. లేచెనే గౌరమ్మ ఉయ్యాలో..చన్నీటి జలకాలు ఉయ్యాలో..ఆడెనే గౌరమ్మ ఉయ్యాలో..ముత్యమంత పసుపు ఉయ్యాలో..ముఖమంతా పూసి ఉయ్యాలో..చింతాకు పట్టుచీర ఉయ్యాలో..చింగులు మెరవంగ ఉయ్యాలో.. రంగురంగుల బతుకమ్మలు.. తీరొక్క పూల గుబాళింపు.. వినసొంపైన జానపదాలు.. కోలాటాలు.. వేలాది మంది ఆడపడుచుల ఆటపాటలు.. మంగళవా రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ముద్దబంతై మురి సింది! సాయంత్రం నిర్వహించిన మహా బతుకమ్మ వేడుక ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పడతులు తరలి వచ్చి బతుకమ్మ ఆడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ వేడుకలను ప్రారంభించారు. మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృ తిక వైభవాన్ని చాటేదే బతుకమ్మ అని చెప్పారు. ‘‘గతంలో బతుకమ్మ ఆట ఆడుకునేందుకు నగరంలో కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అదే హైదరాబాద్‌లో వేలాది మందితో మహా బతుకమ్మ నిర్వహించడం ఆనందంగా ఉంది. ఎల్బీ స్టేడియం పూలవనాన్ని తలపిస్తోంది. అన్ని జాతులు కలిస్తేనే మానవ జాతి. అన్ని పూలు కలిస్తేనే బతుకమ్మ’’ అని అన్నారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించేందుకు మహిళలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. బహ్మకుమారి డైరెక్టర్ బీకే కులదీప్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తోందన్నారు. అందరిదీ ఒకే కుటుంబం.. అంతా కలసి పువ్వుల్లా నవ్వులు చిందించిననప్పుడే విశ్వశాంతి పరిఢవిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందు కు దేశంలోని 15 రాష్ట్రాల నుంచి తమ ప్రతినిధులు తరలివచ్చారన్నారు. ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మందికిపైగా మహిళలు తరలివచ్చినట్టు అంచనా. రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ఎండీ క్రిస్టినా చొంగ్తు, కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా పాల్గొన్నారు. -
హారతి పళ్లెం... ఆత్మకు ప్రతీక
పరమాత్మను దర్శించాలంటే మూర్తి ప్రతిమ కావాలి. ఘంటానాదంలో నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేయవచ్చు. సగుణమైనా, నిర్గుణమైనా... రెండూ అర్చనలో అనుసరణీయాలే! గంట మధ్యలో వేలాడుతూ నాదానికి కారణమయ్యే కడ్డీ ‘కంకిణి’. ఘంటానాదం ఓంకార నాదం. పంచతీర్థ పాత్రలు పంచేంద్రియాలకు ప్రతీక. హారతి పళ్లెం ఆత్మకు ప్రతీక. ఆచమనం శుచి కొరకు. సంకల్పం కాలపురుషుని ఆరాధన. కలశం సంపూర్ణ పరమాత్మ రూపం. దీపం స్వప్రకాశ జ్ఞానం. ధూపం వాయు రూపంలోని సర్వాంతర్యామికి ప్రతీక. గంధం భూ తత్త్వానికి ప్రతీక. జలం బ్రహ్మతత్త్వం. ఇక పుష్పం హృదయానికి ప్రతీక. నైవేద్యం అంటే నివేదన దృష్టితో స్వీకరించడం. ఏది మనం తింటున్నామో, తినాలనుకొన్నామో దానినే ముందుగా పరమాత్మకు అర్పిస్తాం. ఏం తినాలన్నా ముందుగా ఎదుటివారికి ఇచ్చి తర్వాత మనం స్వీకరించాలి. నీరాజనం జ్ఞానకాంతికి ప్రతీక. మంత్రపుష్పం అంటే పరమాత్మ దివ్య స్వరూపాన్ని మననం చేయడమే. కొబ్బరికాయ బొప్పె, పీచుటెంక – ఈ మూడు స్థూల సూక్ష్మ కారణ దేహాలకు ప్రతీక. అందులోని నీరు చంచలమైన మన మనసుకు ప్రతీక. మానవుడి జ్ఞాననేత్రంతో కలిపి మూడు కన్నులు – కొబ్బరి కాయకు ఉన్న మూడు కన్నులకు ప్రతీక. కనుక కొబ్బరికాయ మన దేహానికి, ఆత్మకు ప్రతీక. తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. అకాల మృత్యువును హరించి, వ్యాధులను వారించి, పాపాలను నశింపజేయడం ద్వారా తీర్థం పవిత్రతను, శుభాన్ని మనకు కలిగిస్తుందని తీర్థం తీసుకుంటాం మనం. చివరగా, అన్నిటికన్నా ముఖ్యం పూజ చేసే సమయంలో మనసు ఇతర విషయాల వైపు పోకుండా చూసుకోవడం. అర్ధమనస్కంగానో, అన్యమనస్కంగానో పూజచేస్తే అది నిష్ఫలం అవుతుంది. పరమాత్మ మీద మనసు లగ్నం చేస్తేనే పూజ పూర్ణఫలాన్ని ఇస్తుంది. -
పూదోటలో విహారం.. ఓ పువ్వుకు మోదీ పేరు
టెల్ అవివ్: మిష్మర్ హషివలోని డాంజిగర్ పూదోటను నెతన్యాహూతో కలసి మోదీ సందర్శించారు. ఈ తోట జెరూసలేంకు 56 కిలోమీటర్ల దూరంలో.. 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడి నుంచి దాదాపు 60 దేశాలకు పూలు ఎగుమతవుతాయి. అనంతరం యాద్ వాషెం స్మారకాన్ని మోదీ సందర్శించి నివాళులర్పించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ ఊచకోతకు బలైన 60 లక్షల మంది యూదుల స్మృత్యర్థం ఈ మ్యూజియం నిర్మించారు. కాగా, యూదు దేశం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీని ఆ దేశ ప్రభుత్వం కొత్త రీతిలో గౌరవించింది. ఇజ్రాయెల్‌లో వేగంగా పెరిగే ‘క్రిసెంతమన్’ పుష్పానికి ‘మోదీ’ అని నామకరణం చేసినట్లు ఇజ్రాయెల్ అధికారిక మీడియా ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. పూదోటను మోదీ సందర్శించిన సందర్భంగా క్రిసెంతమన్ పువ్వుకు మోదీ పేరు పెట్టారు. యూదు మతవాద స్థాపకుడిగా భావించే థియోడర్ హెర్జ్ స్మారకాన్ని కూడా మోదీ సందర్శించారు. ముందుగా అనుకోకపోయినా నెతన్యాహూ సలహాపై ఆయన అక్కడికి వెళ్లారు. యాద్ వాషెం స్మారకం పక్కనే హెర్జ్ సమాధి ఉంటుంది. సమాధిపై మోదీ చిన్న రాయి పెట్టి ప్రార్థనలు చేశారు. -
పుష్పశోభితం..మల్లన్న వైభవం
శ్రీశైలం: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీశైలంలో పుష్పపల్లకోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు కాత్యాయనీ అలంకారంలో దర్శనమివ్వగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారు సర్వాలంకారభూషితులై అలంకార సమేతంగా పుష్పపల్లకీలో విహరించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబాదేవిని గురువారం రాత్రి కాత్యాయనిగా అలంకరించారు. పూజలు నిర్వహించిన తరువాత అమ్మవారి అలంకార రూపాన్ని, స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కృష్ణదేవరాయగోపురం గుండా రథశాల వద్దకు చేర్చారు. అక్కడ ఏర్పాటు చేసిన పుష్పపల్లకీలో అలంకార రూపాన్ని, శ్రీ స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేశారు. ఈ సందర్భంగా ఈఓ నారాయణభరత్ గుప్త మాట్లాడుతూ..పుష్పపల్లకీ కోసం 500 కేజీలకు పైగా పుష్పాలను వినియోగించామన్నారు. గజమాలకు శ్రీరంగం నుంచి తెప్పించామన్నారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడికి పుష్పార్చన ఎంతో ప్రీతికరమని స్థలపురాణ కథలు చెబుతున్నాయన్నారు. రథశాల నుంచి బయలుదేరిన పుష్పపల్లకీ అంకాలమ్మగుడి, నందిమండపం వరకు కొనసాగి తిరిగి ఆలయం చేరుకుంది. పుష్పపల్లకీ మహోత్సవాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరణ చేశారు.దీనిని డాక్యుమెంటరీ చేస్తున్నట్లు దేవస్థానం అధికారవర్గాలు తెలిపాయి. అలంకార సహిత అమ్మవారిని, స్వామిఅమ్మవార్లను దర్శించుకుని వేలాది మంది భక్తులు పునీతులయ్యారు. జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
పూలజాతర షురూ..!
-
చినుకు దరహాసం..
-
తినే పూలు...
పువ్వు... దేవుడి పాదాల దగ్గర ఉంటుంది. అమ్మాయి కురుల మీద అందాలొలికిస్తూ ఉంటుంది. అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పువ్వు ఆరోగ్యానికి కూడా మంచిదే. పూజలకూ, పురస్కారాలకే కాదు... రాజాలాంటి ఆరోగ్యం కోసం కూడా పూలు పనికి వస్తాయి. హెల్త్‌కు పుష్పహారం... ఈ పుష్పాహారం! ఈ పువ్వులు తినండి... హెల్దీగా ఉండండి!! కాలీఫ్లవర్... గోబీ పువ్వు అని తెలుగులోనూ ఫూల్ గోబీ అని హిందీలోనూ పిలుచుకునే ఈ పువ్వు కూరలా వండుకోడానికి ఉద్దేశించినదే. గోబీ పకోడీలంటూ శ్నాక్స్ రూపంలోనూ కాలీఫ్లవర్‌ను తీసుకోవచ్చు. కాలీఫ్లవర్‌లోని సల్ఫోరఫేన్ వంటి వృక్షరసాయనాలు (ఫైటో కెమికల్స్) క్యాన్సర్లతో పోరాడతాయి. దాంతో ఈ పువ్వు క్యాన్సర్‌ను నివారిస్తుంది. సల్ఫోరఫేన్ అనే పోషకం ఆటిజమ్‌ను నివారించడంలో కూడా తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇవి ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి. కాలీఫ్లవర్‌లోని ఇండోల్-3-కార్బినాల్ అనే స్టెరాల్ కూడా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా సమరం చేస్తుంది. ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్ల నివారణకు సమర్థమైనది. కణాలు క్యాన్సరస్‌గా మారిపోతే అందులోనే అంతర్గతంగా క్యాన్సర్‌ను హరించే విషాలను (సైటోటాక్సిన్స్)ను పుట్టించి వాటిని తుదముట్టిస్తుందీ పువ్వు. బ్రకోలీ / బ్రోకలీ... బ్రకోలీ అనేది నిజానికి ఇటాలియన్ పేరు. ఇటాలియన్ భాషలో ‘బ్రొకోలో’ అంటే క్యాబేజీ తాలూకు పుష్ప శిఖరాగ్రం (ఫ్లవరింగ్ క్రెస్ట్ ఆఫ్ క్యాబేజీ) అని అర్థం. గతంలో క్యాలీఫ్లవర్ అంతటి విస్తృతంగా లభ్యం కాకపోయినా... ఇప్పుడు మన మార్కెట్లలోనూ చాలా ఎక్కువగానే దొరుకుతోంది. ఇందులో విటమిన్ ఏ పాళ్లు చాలా ఎక్కువ. మేని నిగారింపుకూ, మంచి కనుచూపుకూ ‘విటమిన్-ఏ’ దోహదపడుతుంది. ఇక ఇందులోని పోషకాలు (ఫైటోన్యూట్రియెంట్స్) శరీరంలో పేరుకుపోయిన అనే విషాలను తొలగించే ‘డీ-టాక్సిఫైయర్స్’గా ఉపయోగపడతాయి. అరటిపువ్వు ... ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం, కొవ్వులు, క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, పొటాషియమ్, మెగ్నీషియమ్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అరటిపువ్వుతో ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. అరటిపువ్వుతో కూరలను వండి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. ఉదాహరణకు... ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: అరటిలోని పోషకగుణాలు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఇథనాల్ హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, గాయం త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. అరటిపువ్వు నుంచి సేకరించిన పోషకాలు మలేరియా కారక క్రిములను ఎదుర్కొంటాయని ఒక అధ్యయనం చెబుతోంది. అయితే ఈ విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఫ్రీరాడికల్స్‌ను హరిస్తుంది : క్యాన్సర్ కారకాలుగా మారే ఫ్రీరాడికల్స్ అనే కాలుష్య పదార్థాలను అరటిపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్ సమర్థంగా హరిస్తాయి. వయసుపైబడే ప్రక్రియనూ అరటిపువ్వు మందగింపజేస్తుంది. అలా ఏజింగ్‌ను ఆపుతుంది. డయాబెటిస్ నియంత్రణ- రక్తహీనత నివారణ : అరటిపువ్వు రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తుంది. అలాగే ఇందులో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనతను అరికడుతుంది. రుతు సమస్యల నివారణ : అరటిపువ్వుల కూర తినడం మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అరటిపువ్వుతో అనేక రుతుబాధలు నివారితమవుతాయి. రుతు సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ కావడం తగ్గుతుంది. రుతుస్రావం వచ్చే ముందు మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం, కడుపునొప్పి వంటి అనేక సమస్యలు కనిపించే ప్రీ-మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎమ్ఎస్) తగ్గిపోతుంది. ఇందులోని మెగ్నీషియమ్ వల్ల యాంగ్జైటీ తగ్గి, మంచి మూడ్స్ సమకూరుతాయి. పాలను పెంచుతుంది : బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో బాగా పాలు పడేలా చేస్తుంది అరటిపువ్వు. కుంకుమపువ్వు... కుంకుమపువ్వును ఎంతోకాలంగా మనం సుగంధద్రవ్యంగా వాడుతూనే ఉన్నాం. బిర్యానీలోనూ, కశ్మీరీ వంటకాల్లోనూ ఈ పువ్వును ఉపయోగిస్తాం. కుంకుమపువ్వులో యాంటీసెప్టిక్, యాంటీడిప్రెసెంట్ గుణాలున్నాయి. క్యాన్సర్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మంచి రంగుతో పండంటి బిడ్డ పుట్టడానికి కుంకుమపువ్వు దోహదం చేస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఈ మాటలో ఎంత వాస్తవం ఉందన్న సంగతి పక్కన పెడితే కుంకుమపువ్వు ఒక హెర్బ్గా, సుగంధద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే చాలా న్యూట్రిటివ్ ప్రయోజనాలు మాత్రం ఉన్నాయి. కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రించి, మూడ్స్ త్వరత్వరగా మారిపోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇందులో బీ-కాంప్లెక్స్ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా ఇది గర్భవతులకు ఇది మేలు చేస్తుంది. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడం సురక్షితం. అది అపోహే కానీ... ప్రయోజనం ఇలా... కుంకుమపువ్వు కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనే అపోహ చాలామందిలో ఉంది. దీనికి తగిన శాస్త్రీయ నిర్ధారణ మాత్రం లేదు. కాకపోతే... పాలు సంపూర్ణాహారం. గర్భవతులు తాగితే చాలా మేలు. అయితే మొదటి మూడు నెలల పాటు గర్భవతులు తమ వేవిళ్లు, వికారం కారణంగా పాలు తాగడానికి అంత సుముఖంగా ఉండరు. కుంకుమపువ్వు అనే సుగంధద్రవ్యం పాలను మరింత రుచికరంగా, సుగంధభరితంగా చేస్తుంది. పైగా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. ఇక కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటకు మరింత రుచిని తీసుకొస్తారు. అప్పుడు దీనివల్ల కలిగే పైన పేర్కొన్న ప్రయోజనాలన్నీ కేవలం గర్భవతులకే కాకుండా మిగతావాళ్లకూ చేకూరుతాయి. కాబోయే అమ్మలకు కాషన్ కుంకుమపువ్వును గర్భవతులు వాడే సమయంలో తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పాలలో దీన్ని చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకే మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే గర్భస్రావమూ అయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకుని చిటికెడంటే చిటికెడే వాడాలి. వేప పువ్వును ఉగాది పచ్చడి రూపంలో ఆహారంలో వాడడం తెలుగు వారికి ఎప్పటినుంచో తెలిసిన సంప్రదాయమే! గులాబీ... మన దగ్గర ఆహారంలో దీని ఉపయోగం చాలా తక్కువే అయినా చైనీయులు తమ ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇందులో ఫీనాలిక్స్ అనే పోషకాలు ఉన్నాయి. అవి గాయం వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. రోజాపువ్వు రేకులతో టీ కాచుకోవడం చాలా మంచిది. ఇది గుండెజబ్బు ముప్పునూ, క్యాన్సర్, డయాబెటిస్లనూ రిస్క్‌ను తగ్గిస్తుంది. పవ్వులకే కాదు... హీలింగ్ గుణానికీ ఇది రాజా అని చాలా మంది అంటుంటారు. అయితే దీన్ని పరిమితంగా టీ కాచుకోడానికీ లేదా ఫ్లేవర్‌గా ఉపయోగించడమే మంచిది. మందారపువ్వు... చాలా మంది దీన్ని పువ్వులను ఎండబెట్టుకొని టీ కాచుకొని తాగుతారు. మందారపువ్వు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. శరీర జీవక్రియలు క్రమబద్ధం చేస్తుంది. ఇందులో విటమిన్-సితో పాటు అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి కాలేయ క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్లను నివారిస్తాయి. మందారపూలతో కాచిన టీ వల్ల రక్తపోటు, యాంగ్జైటీ కూడా తగ్గుతాయి. అయితే ఈ చాయ్‌ను పరిమితంగా తాగితేనే మేలు. తామరపువ్వులు (లోటస్) ... తామరపూలతో చాలామంది టీ కాచుకొని తాగుతుంటారు. అయితే ఆసియా ఖండంలో అనేకమంది తామరతూళ్లను వంటకోసం ఉపయోగిస్తుంటారు. తామరపూలలో విటమిన్ ఏ, బీ, సి లు చాలా ఎక్కువ. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక విటమిన్ బి కాంప్లెక్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ సి అన్నది స్వాభావికమైన యాంటీ ఆక్సిడెంట్ అన్న విషయం తెలిసిందే. దాంతో ఇది క్యాన్సర్లతో పోరాడుతుంది. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్-సి రోగనిరోధకశక్తిని పెంచి ఎన్నో వ్యాధులకు కవచంగా పనిచేస్తాయి. డా. సుజాతా స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్ మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్ -
బంగారు కుసుమం
ఏకంగా 12 బంగారు పతకాలు సాధించిన ఆటో డ్రైవర్ కుమార్తె ! మైసూరు విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో ఆటో డ్రైవర్ కుమార్తె ఏకంగా 12 బంగారు పతకాలు, మూడు నగదు బహుమానాలను సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మైసూరులోని ఇట్టిగెగూడ ప్రాంతానికి చెందిన సుమ ఆటో డ్రైవర్ కుమార్తె. ఎంఎస్సీ (రసాయనశాస్త్రం)లో తాను 12 బంగారు పతకాలు సాధించినట్లు సుమ ఈ సందర్భంగా తెలిపింది. నిరుపేదలైన తన తల్లిదండ్రులు తనకు ఎక్కడ కూడా కష్టం కలిగించలేదని, తాను కూడా సమయం వృథా కాకుండా కష్టపడి చదవ టం వల్లనే ఈ అనూహ్య విజయం సాధించానని చెప్పారు. తన విజయానికి కారకులైన మహారాణి కళాశాల యాజమాన్యం, ప్రొఫెసర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. - మైసూరు -
సింగిల్ శాటిన్ పూల అందాలు!
మేడ్ ఇన్ హోమ్ ఓ చిన్న క్లిప్... కురులకు కొత్త అందాన్ని అద్దుతుంది. అందుకే మార్కెట్ నిండా రకరకాల మోడళ్ల క్లిప్పులు దర్శనమిస్తున్నాయి. కానీ ఎన్నని కొంటాం! రేట్లు మండిపోతున్నాయి కదా! అందుకే ఇంట్లోనే క్లిప్పులు తయారు చేయడం మొదలుపెట్టండి. పెద్ద కష్టమేమీ కాదు. మొదట క్లాత్ మీద కావలసిన ఆకారంలో రేకుల డిజైన్ వేసుకోవాలి. తర్వాత రేకుల్ని కత్తిరించి, వాటి అంచుల్ని కొద్దిగా వెనక్కి రోల్ చేయాలి. తర్వాత వీటన్నిటినీ పువ్వులా పేర్చుకుంటూ గమ్‌తో అతికించాలి లేదా పిన్ చేయాలి. ఆపైన మధ్యలో ఓ పూస కానీ రాయి కానీ అతికిస్తే అందమైన పువ్వు తయారవుతుంది. దీన్ని రబ్బర్ బ్యాండ్‌కి అతికించాలి. లేదంటే సింపుల్‌గా ఉండే మెటల్ క్లిప్స్ మార్కెట్లో దొరుకుతాయి. కొన్ని కొని పెట్టుకుంటే వాటికి కూడా అతికించుకోవచ్చు. క్లాత్ పెద్ద ఖరీదు కాదు కాబట్టి రకరకాల రంగుల బట్టని కొద్దికొద్దిగా కొని పెట్టుకుంటే, అవసరమైనప్పుడు క్షణాల్లో డ్రెస్సుకి తగ్గ క్లిప్ తయారు చేసుకోవచ్చు. మీకోసం ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి... చూసి ప్రయత్నించవచ్చు. -
ఏడాదికి ఒకసారి పూసే కుసుమం
-
విరబూసిన బ్రహ్మకమలం
మణికొండ(హైదరాబాద్): సంవత్సరానికి ఒకేసారి పూసే బ్రహ్మకమలం మణికొండలోని ఓ ఇంట్లో విరబూసింది. ఒకే సారి ఐదు పువ్వులు పూయడంతో స్థానికులు దాన్ని చూసేందుకు క్యూ కట్టారు. మణికొండ పంచాయతీ పరిధిలోని సెక్రటేరియట్ కాలనీలో నివసిస్తున్న నీటి పారుదల శాఖ విశ్రాంత ఎస్ఈ ముప్పర కుమారరత్నం గత కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మకమలం మొక్కను తెచ్చి పెంచుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా... ఏటా ఒకే పువ్వు పూయగా ఈ ఏడాది మాత్రం మంగళవారం అర్ధరాత్రి ఏకంగా ఐదు పువ్వులు పూసిందని ఆయన తెలిపారు. హిమాలయాల్లోనే ఉండే ఈమొక్క ఇంట్లో ఉంటే మంచిదని తెలపటంతో తెచ్చి పెంచుకుంటున్నామని చెప్పారు. -
పువ్వు.. పారదర్శకంగా..
ఈ పువ్వు పేరు డైఫిలియా గ్రేయై. జపాన్, చైనాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ప్రత్యేకత చూడగానే తెలిసిపోతుంది కదూ.. వర్షం పడినప్పుడు ఈ పుష్పం ఇలా పారదర్శకంగా మారిపోతుంది. మళ్లీ ఎండ రాగానే.. మామూలుగా అయిపోతుంది. దీన్ని స్థానికంగా ‘స్కెలెటన్ ఫ్లవర్’ అని కూడా పిలుస్తారు. -
మండుతున్న కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: వివిధ ప్రాంతాల నుంచి రావల్సిన కూర గాయలు 30 శాతం తగ్గిపోవడంతో ముంబైసహా ఠాణే, నవీ ముంబైలో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు గృహిణులకు కొంత ఊరట కల్గించిన కూరగాయల ధరలు మళ్లీ చుక్కలనంటుతున్నాయి. నగరంతోపాటు ఠాణే, నవీముంబైకి నిత్యం నాసిక్, గుజరాత్, పుణే, కర్నాటక తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. గత రెండు వారాలుగా వాటి దిగుమతి 30 శాతం మేర తగ్గిపోవడంతో క్యాబేజీ, ఫ్లవర్ మినహా మిగత కూరగాయల కొరత ఏర్పడింది. ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ఈ మాసంలో ఉపవాసాలు కొనసాగుతున్నాయి. ఈ మాసంలో అనేక మంది మాంసాహారాలకు దూరంగా ఉంటారు. ఈ కారణంగా ఒక్కసారిగా కూరగాయలకు మరింత డిమాండ్ పెరిగి పోయింది. ఇదే సందర్భంలో కూరగాయల కొరత ఏర్పడడం హోల్ సెల్ వ్యాపారులకు కలిసొచ్చింది. రైతులు రూపాయి పెంచితే ఇక్కడ వ్యాపారులు ఏకంగా ఐదు రూపాయలు పెంచేసి అందినంత దండుకుంటున్నారు. సాధారణంగా ఏటా శీతాకాలంలో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) ప్రాంగణం కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ శీతాకాలంలో వాహనాల సందడి అంతగా కనిపించడం లేదని ఏపీఎంసీ మాజీ డెరైక్టర్ శంకర్ పింగళే అన్నారు. సాధారణంగా ఎపీఎంసీలోకి రోజు కూరగాయల లోడుతో సుమారు 450-475 వరకు ట్రక్కులు, టెంపోలు వస్తుంటాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 100-150 వరకు తగ్గిపోయింది. ఫలితంగా సరుకు నిల్వలు తగ్గిపోవడంతో కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయని వ్యాపారి గోపినాథ్ మాల్సురే అన్నారు. విదర్భ, మరఠ్వాడాలో ఏర్పడిన కరువు ప్రభావం కూడా కూరగాయల దిగుబడులపై చూపుతున్నాయి. అక్కడి నుంచి నగరానికి రావల్సిన సరుకు ఇప్పటికే నిలిచిపోయింది. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కావాల్సిన కూరగాయలు 30 శాతం తగ్గిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీని ప్రభావం గహిణీల ఆర్థిక బడ్జెట్‌పై పడుతోంది. -
ఫ్లవర్ మేకింగ్
కాగితం విరిస్తే... పువ్వు అవుతుంది. వాడని పూలతో ఇంటిని అలంకరించాలనే సరదా ఉంటే, ఆ పూలను సొంతంగా పూయించాలనే ముచ్చట ఉంటే చాలు. రంగు కాగితం పవ్వులా రెక్కలు విరుచుకుంటుంది. ఏమేం కావాలి! రంగు కాగితం, కత్తెర, హాట్ గ్లూ గన్, సన్నటి పుల్ల (టూత్‌పిక్ సరిపోతుంది) ఏలా చేయాలంటే! రంగు పేపర్ తీసుకుని గులాబీ రెక్కల ఆకారాన్ని గీసి ఆ మేరకు పేపర్‌ను కత్తిరించాలి. లేదాకంప్యూటర్ నుంచి గులాబీ రెక్కల డిజైన్‌ను తెల్ల కాగితం మీద ప్రింట్ తీసుకుని రెక్కలను కట్ చేయవచ్చు. లేత ఆకుపచ్చ కాగితం మీద ఫొటోలో కనిపిస్తున్న మూడు ఆకుల ఆకారాన్ని కూడ కత్తిరించుకోవాలి. రెక్కల అంచులను కత్తెర మొన సాయంతో వంపు తిప్పాలి. ప్రతి రెక్కకూ రెండు అంచులను ఇలా వంపు తిప్పాలి. ఆకుల ఆకారంలో కత్తిరించిన కాగితంలోని ప్రతి ఆకునూ మధ్యలోకి నొక్కాలి. పుల్లకు గ్లూ రాసి ముందుగా ఒక్క రెక్కను పుల్లకు చుట్టినట్లు అతికించాలి. సింగిల్ రెక్కలను అతికించిన తర్వాత రెండు రెక్కల కాగితాలను అతికించాలి. ఎక్స్ట్రాగా ఉన్న పుల్లను తుంచేసి, ఆ తర్వాత మూడురెక్కల కాగితాల మధ్యలో గ్లూ వేస్తూ అతికిస్తే పువ్వు రెడీ. చివరగా ఆకుల మధ్యలో గ్లూ వేసి పువ్వుని ఆకులకు అతికించాలి. పువ్వుని ఫ్లవర్ వేజ్లో అలంకరించడానికి వీలుగా ఉండడానికి టూత్‌పిక్‌ను అలాగే ఉంచుకోవచ్చు. ఆకు కింద వైపు గమ్ కానీ వ్యాక్స్ కానీ రాస్తే ఈ కాగితం గులాబీని నీటి పళ్లెంలో(ఉళ్లేలు) కూడా అలంకరించుకోవచ్చు. -
కళాత్మకం : బుద్ధునికో ఇకబెనా!
పూల తోటలో చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారా? అనిపిస్తుంది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువై ఉన్న బుద్ధుని వర్ణచిత్రాలను చూస్తే! ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చిన వ్యాపార కుటుంబంలో జన్మించిన అనీశ టాండన్ ఎం.బి.ఏ చేశారు. ఇకబెనా ఇంటర్నేషనల్ కార్యదర్శిగా ఇకబెనా శిక్షణాతరగతులనూ నిర్వహిస్తున్నారు. పెయింటింగ్‌ను ప్రవృత్తిగా స్వీకరించారు. బుద్ధుని జీవితంలోని ముఖ్యఘట్టాలను ఇరవై పెయింటింగ్లుగా వేసి చంద్రునికో నూలుపోగు అన్నట్లుగా, ఒక్కో పెయింటింగ్ ఎదురుగా ఒక్కో పుష్పాలంకరణను అమర్చారు. ‘సమ-సంబుద్ధ’గా పరిమళభరితంగా ఎగ్జిబిషన్‌ను తీర్చిదిద్దిన అనీశ టాండన్‌తో ఇంటర్వ్యూ... ‘ఇకబెనా’ అంటే ఏమిటి? బుద్ధుడు ఉద్యానవనప్రియుడు. ఆయన తత్వమూ ఆయన ఇష్టపడే పరిసరాల్లా ఆహ్లాదకరమైనదే. బుద్ధుడిని... తెంపిన పూలతో కాకుండా మొక్కలతో, లతలతో సజీవంగా ఉన్న పుష్పాలతో గౌరవించడం బౌద్ధంలో ఒక ఆరాధనా విధానం. ఈ పద్ధతి మన దేశం నుంచే క్రీ.శ. 6వ శతాబ్దిలో జపాన్‌కు చేరింది. కొలను సమీపంలో నివసించే ఒక భిక్షువు జీవించిన పూలతో బుద్ధుని ఆరాధించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. అతని పేరుతో రూపొందిన ‘ఇకబెనా’ (ఇక=కొలను, బెన=సాధువు) పుష్పాలంకరణ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ‘ఇకబెనా’లో మీ కృషి గురించి చెప్పండి? ఏమీ తెలియని బాల్యంలోనే ‘ఇకబెనా’ అందమైన అమరికకు ఆకర్షితురాలినయ్యాను. ఓహర స్కూల్ ఆఫ్ ఇకబెనా, జపాన్ నుంచి డిప్లమా పొందాను. ప్రస్తుతం ఇకబెనా క్లాసెస్ తీసుకుంటున్నాను. వర్క్‌షాప్స్, డెమోలు నిర్వహిస్తున్నాను. శ్రీనగర్ కాలనీలోని ‘ఆశ్రయ్ ఆకృతి’, జూబ్లిహిల్స్‌లోని ‘నచికేత తపోవన్’ వంటి అండర్ ప్రివిలేజ్డ్ బాలల స్కూల్స్‌లో ‘ఇకబెనా’ నేర్పుతున్నాను. వినలేని, మాట్లాడలేని బాలలు ‘ఇకబెనా’ సౌందర్యానికి ముగ్ధులవుతారు! ఆర్ట్‌ను ఇకబెనాను కలపాలనే ఆలోచన ఎలా వచ్చింది? బుద్ధుని ఆరాధనలో ప్రాముఖ్యత పొందిన ఇకబెనాను బుద్ధుని పెయింటింగ్‌లతో సమన్వయపరిస్తే బావుంటుంది కదా అనిపించింది. ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌లో ఈ ప్రక్రియను తొలిసారిగా నేను మాత్రమే చేశానని పలువురు క్యూరేటర్స్, ఆర్ట్ లవర్స్ అంటున్నారు. సాధారణ వీక్షకులు సైతం గ్యాలరీకి వచ్చినట్లు లేదు, ప్రార్థనా స్థలానికి వచ్చినట్లుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెయింటింగ్‌లు వాటి ముందుంచిన ఇకబెనాల గురించి చెప్పండి! బుద్ధుని జీవితాన్ని నేను అర్థం చేసుకుని నా వ్యక్తీకరణను కళాభిమా నులకు చూపాలని మొత్తం ఇరవై పెయింటింగ్‌లు వేశాను. ఇకబెనాలో ప్రతి కొమ్మకు, రెమ్మకు పువ్వుకు సంకేతాలుంటాయి. ఉదాహరణకు కొమ్మలోని రెండు కాండాలలో ఒకటి భూమి, మరొకటి ఆకాశం. ప్రతి పువ్వుకూ, రంగుకూ సంకేతాలుంటాయి. హేకా స్లాంటింగ్, ఇన్క్లైనింగ్ ఫాం, సర్క్యులర్ ఫాం, మోరీ బన ప్లాంటింగ్, డ్రిఫ్ట్ ఉడ్-రింపా తదితర అమరికలను బుద్ధుని జీవితంలోని వివిధ ఘట్టాలకు సంకేతంగా అమర్చి ఆయా పెయింటింగ్‌ల ముందు ఉంచాను. బుద్ధుని జ్ఞానోదయాన్ని సూచిస్తూ కలువపూలతో ‘రైజింగ్ స్టయిల్’ అమరికను ఉంచాను. రావిచెట్టు క్రింద జ్ఞానోదయాన్ని పొందడాన్ని సూచిస్తూ పెయింటింగ్‌లో కొలనులో రావిచెట్టు ప్రతిబింబాన్ని చూపిస్తూ ‘రావిచెట్టు’ ఆకులు, లతలతో ఇకబెనాను అమర్చాను. ఏసియాటిక్ లిలీ, జెర్బ్రా, గ్లాడియోల్డీ, మొరి మోనో, కరోండా, పీపల్ తదితర పుష్పాలను చిత్రించి, అమర్చిన ఈ ప్రదర్శన కళాప్రేమికుల్లో ఇకబెనా పట్ల ఆసక్తిని కలుగజేస్తుందని ఆశిస్తున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? ఇరవై పెయింటింగ్‌ల ఇమేజెస్‌తో పుస్తకాన్ని, డీవీడీని రూపొందించాలని భావిస్తున్నాను. ఒక్కో పెయింటింగ్‌ను పరిచయం చేయడం, సంబంధించిన ఇకబెనాను ఎలా రూపొందించిందీ, వాటి అమరికల వెనుక ఉన్న శాస్త్రీయత, కళాత్మకత గురించి వివరించడం, అంతిమంగా ఇకబెనా పట్ల పాఠకులు ఆకర్షితులయ్యేందుకు దోహదపడడం రాబోయే పుస్తకం ఉద్దేశం. లతలను, పువ్వులను సేకరించి అందంగా అలంకరించాలనే ఆసక్తి ఏర్పడితే, మన చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశీలించడం అలవాటవుతుంది. ప్రకృతిని పరిశీలించే అలవాటు ఏర్పడితే పరిరక్షించుకోవాలనే చైతన్యమూ కలుగుతుంది కదా! - పున్నా కృష్ణమూర్తి