ఏకంగా 12 బంగారు పతకాలు సాధించిన ఆటో డ్రైవర్ కుమార్తె !
మైసూరు విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో ఆటో డ్రైవర్ కుమార్తె ఏకంగా 12 బంగారు పతకాలు, మూడు నగదు బహుమానాలను సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మైసూరులోని ఇట్టిగెగూడ ప్రాంతానికి చెందిన సుమ ఆటో డ్రైవర్ కుమార్తె. ఎంఎస్సీ (రసాయనశాస్త్రం)లో తాను 12 బంగారు పతకాలు సాధించినట్లు సుమ ఈ సందర్భంగా తెలిపింది.
నిరుపేదలైన తన తల్లిదండ్రులు తనకు ఎక్కడ కూడా కష్టం కలిగించలేదని, తాను కూడా సమయం వృథా కాకుండా కష్టపడి చదవ టం వల్లనే ఈ అనూహ్య విజయం సాధించానని చెప్పారు. తన విజయానికి కారకులైన మహారాణి కళాశాల యాజమాన్యం, ప్రొఫెసర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. - మైసూరు