Convocation Ceremony
-
ఘనంగా తమన్నా మేకప్ అకాడమీ కాన్వకేషన్ (ఫొటోలు)
-
హైదరాబాద్: "ICBM- స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్" 16వ స్నాతకోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
సోషల్ మీడియా దుర్వినియోగంపై... జర జాగ్రత్త: సీజేఐ
సాక్షి, చెన్నై: వేగంగా జనబాహుళ్యంలోకి చేరేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమాలు, అన్ని రంగాల్లోకి విస్తరించిన కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగాన్ని అరికట్టే సాంకేతికత అందరికీ అందుబాటులోకి రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఆయన శనివారం ఐఐటీ మద్రాస్ 60వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మానవీయ విలువలు, వ్యక్తిగత గోప్యతలకు అత్యున్నత ప్రాధాన్యత కలి్పంచాలని సీజేఐ తెలిపారు. ఆధునిక సాంకేతికతను సానుకూలంగా వాడుకునేందుకు వీలుగా రక్షణలు ఏర్పాటు చేసి నిరుపాయకరమైందిగా మార్చా లన్నారు. సాంకేతికతతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ప్రజలు భయపడక ముందే నమ్మకమైన వినియోగాన్ని సులభతరం చేయాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల రాకతో సరిహద్దులు, వయస్సు, జాతీయత వంటి అవరోధాలు తొలగినప్పటికీ ఆన్లైన్లో వేధింపులు, ట్రోలింగ్ వంటివి కొత్తగా పుట్టుకొచ్చా యని సీజేఐ పేర్కొన్నారు. -
వ్యవసాయ విద్య ఆధునీకరణతోనే పూర్తిస్ధాయి ఆహార భద్రత
సాక్షి, విజయవాడ/తిరుపతి: పోషకాహార లోపం, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలన క్రమంలో ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ విద్య ఆధునికతను సంతరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి యువతను ఈ రంగంలో ప్రోత్సహించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ వృత్తిలో వారు నిలదొక్కుకోవటానికి మంచి శిక్షణ అవసరమని సూచించారు. భారత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. చదవండి: సీఎం జగన్ అండగా నిలిచారు.. వారి ఆనందానికి అవధుల్లేవ్.. ఆచార్య ఎన్.జి వ్యవసాయ విశ్వవిద్యాలయం 51వ స్నాతకోత్సవం శుక్రవారం తిరుపతి వేదికగా నిర్వహించారు. విజయవాడ.. రాజ్‌భవన్ నుండి కులపతి హోదాలో హైబ్రీడ్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఐఎఎస్ అధికారిగా ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో పనిచేసి ప్రస్తుతం భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని నేషనల్ రెయిన్-ఫెడ్ ఏరియా అథారిటీ సిఇఓ డాక్టర్ అశోక్ దల్వాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావటం విద్యార్ధులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. గవర్నర్ మాట్లాడుతూ ప్రథమ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీని “వ్యవసాయ విద్యా దినోత్సవం”గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. గ్రామీణ ప్రజలకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంపొందించడం వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విధులలో ఒకటిగా ఉండాలన్నారు. పాఠశాల చదువులను ముగించుకున్న వారికి వ్యవసాయం, అనుబంధ శాస్త్రాలలో శిక్షణ ఇవ్వడం, వ్యవసాయ పాలిటెక్నిక్, సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్, సేంద్రీయ వ్యవసాయంలో డిప్లొమాలు అందించడం కోసం విశ్వవిద్యాలయం చొరవ తీసుకోవటం అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగంలో పుష్కలంగా ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. విద్యార్ధులు స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని, రైతు సంఘం పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల ఉన్న బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలని సూచించారు. ఆహార భద్రతపై పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా, సాంకేతికత స్వీకరణ వేగవంతం కావాలన్నారు. భారతీయ వ్యవసాయం డిజిటల్ సాంకేతికతలను అవలంబించాల్సిన అవసరం ఉందన్న గవర్నర్ స్మార్ట్ టెక్నాలజీతో రైతులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే అవకాశం ఉందన్నారు. యువత శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, ధ్యానం సాధన చేయాలని, జీవితాంతం నేర్చుకునే అలవాటును పెంపొందించుకుంటే విజయం సుసాధ్యమని బిశ్వభూషణ్ అన్నారు. రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువత, ఇతర భాగస్వాములకు దూరవిద్య ద్వారా వ్యవసాయ విద్యను విస్తరించాలనే నినాదంతో "ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్"ను ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. డ్రోన్ టెక్నాలజీ, జియో-స్పేషియల్ టెక్నాలజీ, నానో-టెక్నాలజీ వంటి వ్యవసాయ సాంకేతికతలను ఉపయోగించడంలో విశ్వవిద్యాలయం మంచి పురోగతిని కనబరిచిందని,సుస్థిర వ్యవసాయాన్ని సమర్ధించడంలో జరుగుతున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. స్నాతకోత్సవంలో విజయవాడ నుండి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, తిరుపతి నుండి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. -
మార్పు దిశగా భారత్ అడుగులు
న్యూఢిల్లీ: భారత్ మార్పు దిశగా అడుగులు వేస్తోందని రాబోయే 25 ఏళ్లు దేశాభివృద్దికి అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకునే సమయానికి దేశాన్ని అత్యంత పటిష్టంగా నిలపాల్సిన బాధ్యత యువతరంపై ఉందన్నారు. పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ (పీడీపీయూ) కాన్వకేషన్ సదస్సులో శనివారం విద్యార్థులనుద్దేశించి ప్రధాని ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. ‘‘ప్రస్తుతం భారత్ మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఒక రకంగా దేశంలో స్వర్ణయుగం నడుస్తున్న సమయంలో మనం ఉన్నాం. దేశ భవిష్యత్తుని వైభవంగా తీర్చిదిద్దే బాధ్యత మీ పైనే ఉంది’’అని ప్రధాని చెప్పారు. ఎవరైతే దేశాన్ని ముందుకు నడిపించాలని బాధ్యత తీసుకుంటారో వారే విజయం సాధిస్తారని, బాధ్యతని బరువుగా భావించే వారు ఓటమి పాలవుతారని హితవు పలికారు. కర్బన ఉద్గారాలను 30 నుంచి 35శాతం వరకు తగ్గించడమే తమ లక్ష్యమని ప్రధాని చెప్పారు. గత దశాబ్ద కాలంలో సహజ వాయువుల వినియోగం 4 రెట్లు పెరిగిందని, వచ్చే అయిదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తామని తెలిపారు. ఒకప్పుడు సోలార్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.12–13 ఉంటే, ఇప్పడు యూనిట్ రూ.2కే లభిస్తోందన్నారు. 2022 నాటికి 175 గిగావాట్ల సౌర విద్యుత్ వాటకం పెరుగుతుందని మోదీ చెప్పారు. -
దేశంలో మీ కోసం అపారమైన అవకాశాలు ఉన్నాయి: మోదీ
-
'కరోనా తర్వాత ప్రపంచం భిన్నంగా'
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచంలో టెక్నాలజీ, ఆవిష్కరణలు ప్రధానపాత్ర పోషిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 51వ కాన్వొకేషన్ వేడుకకు మోదీ ముఖ్య అతిధిగా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 'కోవిడ్ తర్వాత ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. సాంకేతికత అందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మహమ్మారి రోజూవారీ జీవన విధానంలో ఎన్నో మార్పులు తెచ్చింది. వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇప్పుడు వర్కింగ్ రియాలిటీగా మారుతున్నాయి. గ్లోబలైజేషన్ ముఖ్యం అయితే, స్వావలంబన కూడా అంతే ముఖ్యం. (ట్రంప్‌ని కూడా ఇలానే పంపాల్సి వస్తుందేమో..) ఆత్మనిర్భర్ భారత్ దేశ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మీ ఆలోచనలు, ఆవిష్కరణల ద్వారా పేదల జీవితాలు సులువుగా జీవించేలా ఉపయోగపడాలి. దేశంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాల కోసం కృషి చేయాలని మోడీ ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకతపై భారతీయులకు అపారమైన నమ్మకం ఉంది. దేశంలో మీ కోసం అపారమైన అవకాశాలు ఉన్నాయి. దేశం ఎదుర్కొంటున్న అపారమైన సవాళ్లు కూడా మీ ముందు ఉన్నాయి. వీటికి మీరు పరిష్కారాలు చూపాలి. (జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు) విపత్తు నిర్వహణ, భూగర్భజలాలను నిర్వహించడం, సౌర విద్యుత్ ఉత్పత్తి, టెలిమెడిసిన్ మరియు బిగ్‌డేటా విశ్లేషణ వంటి రంగాలలో అనేక అవకాశాలు ఉన్నాయి. దేశ అవసరాలకు అనేక ఇతర ఉదాహరణలను నేను మీ ముందు ఉంచగలను అని మోదీ అన్నారు. సవాళ్లను ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు, ప్రయత్నాలతో పరిష్కరించవచ్చు అని మోడీ అన్నారు. అందుకే దేశ అవసరాలను గుర్తించి ఆత్మనిర్భర్ భారత్‌తో మిమ్మల్ని అనుబంధించాలన్నది నా అభ్యర్థన' అంటూ మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
సాంకేతిక సవాళ్లు అధిగమించాలి
సాక్షి, బొల్లారం: దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సాంకేతిక సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ) ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన 96వ స్నాతకోత్సవ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో పట్టభద్రులైన అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. దేశ భద్రతకు సంబంధించి కాలాన్ని బట్టి ఆధునిక టెక్నాలజీని వినియోగించేలా ఎంసీఈఎంఈ మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అణు దాడులు, సైబర్ నేరాల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దేశ రక్షణ కోసం త్రివిధ దళాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్యాపింగ్ లేని సెల్‌ఫోన్ వ్యవస్థ రావాలని, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేలా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. కంప్యూటర్లు హ్యాక్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 100వ డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులో (డీఈ–100) అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కెప్టెన్ నరేంద్ర గోరాకు డీజీఈఎంఈ ట్రోఫీని, 32వ టెక్నికల్ ఎంట్రీ స్కీం కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లెఫ్టెనెంట్ బదూర్‌సింగ్‌తో పాటు 64 మంది అధికారులకు గవర్నర్ తమిళిసై ట్రోఫీ లను అందజేశారు. -
న్యాయవ్యవస్థలో స్థిరపడాలి
న్యూఢిల్లీ: న్యాయవిద్య అభ్యసించిన చాలామంది యువతీయువకులు న్యాయవ్యవస్థలో కాకుండా ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని జస్టిస్ రంజన్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ లా యూనివర్సిటీ 7వ స్నాతకోత్సవంలో జస్టిస్ గొగోయ్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ‘లాయర్ల పాత్ర, పనితీరును మనం పరిశీలించాల్సిన అవసరముంది. న్యాయ రంగంలో గొప్ప అవకాశాలు, ఆకర్షణ ఉన్నప్పటికీ న్యాయవిద్యను అభ్యసించినవారిలో చాలామంది ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. చాలామంది న్యాయవాదులు మధ్యవర్తులుగా, ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేవారిగా, న్యాయాధికారులుగా, సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతకాలంలో కార్పొరేట్ న్యాయవాదుల కెరీర్ చాలా ఆకర్షణీయంగా మారింది. ఇందులోని ఆర్థిక మూలాలకు నేను పోదల్చుకోలేదు. అదే సమయంలో బార్, బెంచ్‌లోని ఆసక్తికరమైన బాధ్యతలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరముంది. నేను బార్, బెంచ్‌లో 20 ఏళ్ల పాటు పనిచేశా. ఇక్కడ పని కారణంగా దొరికే సంతృప్తి చాలాఎక్కువ. ప్రస్తుతం మనం అందిస్తున్న ఐదేళ్ల ‘లా’ డిగ్రీ కోర్సును సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో ఈ పద్ధతి అనుకున్నంతగా విజయవంతం కాలేదు. అదే సమయంలో పూర్తిగా విఫలం కూడా కాలేదు. బార్ వ్యవస్థను పటిష్టం చేసేందుకే ‘లా’ స్కూళ్లను ఏర్పాటుచేశాం. ప్రస్తుతం ఎన్ని ‘లా’ స్కూళ్లు తమ ఏర్పాటు వెనుకున్న లక్ష్యాన్ని అందుకుంటున్నాయి? ఈ విషయమై బార్ విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. -
నేడు ఐఐటీ హైదరాబాద్ 8వ స్నాతకోత్సవం
సాక్షి, సంగారెడ్డి: జిల్లాకు తలమానికంగా ఉన్న హైదరాబాద్ ఐఐటీ దేశంలోనే ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులను తయారుచేస్తోంది. సుమారుగా 11ఏళ్ల ప్రస్థానంలో 250 మంది విద్యార్థులను పీహెచ్‌డీలో గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దింది. ఈ ఐఐటీ ప్రాంగణం 8వ స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 10వ తేదీ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు స్నాతకోత్సవం జరగనుంది. ఇందుకు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. స్నాతకోత్సవానికి సంబంధించి ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని 2008లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన ఈ ఐఐటీని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్.వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జిల్లాకు కేటాయించారు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఐఐటీలో ప్రారంభంలో కేవలం మూడు ఇంజనీరింగ్ కోర్సులను మాత్రమే ప్రవేశపెట్టారు. ప్రారంభ సంవత్సరంలో బీటెక్ సీఎస్ఈ, ఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉండేవి. వీటిలో 40 మంది విద్యార్థులకు ఒక కోర్సు చొప్పున 120 మంది విద్యార్థులకే ప్రవేశం ఉండేది. ఇంతితై.. వటుడింతై హైదరాబాద్ ఐఐటీ ప్రస్తుతం దేశంలోనే 8వ ర్యాంకులో ఉందంటే.. కేవలం దశాబ్ధ కాలంలోనే ఎంత ఎత్తుకు ఎదిగిందో ఊహించవచ్చు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. నాడు 120 మంది విద్యార్థులు.. మూడు ఇంజనీరింగ్ కోర్సులతో ప్రారంభమైన ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రస్తుతం 10 కోర్సులు (డిపార్ట్మెంట్స్)తో 2,900 మంది విద్యార్థులున్నారు. సీఎస్ఈ, ఈఈ, మెకానికల్ కోర్సులతో పాటు గా ప్రస్తుతం సివిల్, కెమికల్, మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులలో విద్యాబోధన జరుగుతున్నది. ఈ సంవత్సరం నుంచి బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఎం టెక్‌లో క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు లు) అనే కోర్సులను ప్రవేశపెడుతున్నారు. టీచింగ్‌తో పాటు రీసెర్చ్‌కు ప్రాధాన్యం హైదరాబాద్ ఐఐటీలో కేవలం విద్యాబోధనకే కాకుండా రీసెర్స్ (పరిశోధన), ఇన్నోవేషన్స్ (కొత్త విషయాలను కనుక్కోవడం)కు ప్రాధాన్యత నిస్తున్నారు. కేవలం 120 మంది విద్యార్థులు.. 3 కోర్సులతో ప్రారంభమైన ఈ ఇన్స్టిట్యూట్లో ఈ విద్యాసంవత్సరంలో 2,900 మంది విద్యార్థులు.. 900 మంది పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారంటే అనతికాలంలోనే ఎంత ఉన్నతస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. టీచింగ్‌తో పాటు రీసెర్చ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మరో మూడేళ్లలో 5 నుంచి 6 వేల మంది విద్యార్థులు.. ప్రస్తుతం 2,900 మంది ఉన్న ఈ ఐఐటీలో రానున్న మూడేళ్ల కాలంలో మొత్తం 5 నుంచి 6 వేల మంది వరకు ఉండే అవకాశం ఉంది. రెండో దశ భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్లో కూడా రూ.90 కోట్లు కేటాయించారు. ఈ నిర్మాణాలను జపనీస్ సంస్థ ‘జైకా‘ చేపట్టింది. ఎల్అండ్టీ ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తవుతాయి. దీంతో ప్రస్తుతం ఉన్న విద్యార్థులతో కలిపి 5 నుంచి 6 వేల మంది విద్యార్థులకు ఈ ప్రాంగణం విద్యతో పాటుగా ఆశ్రమం (అకామిడేషన్) కల్పించనుంది. ఒకేసారి సుమారుగా 800 మంది కూర్చోవడానికి గాను ఆడిటోరియం నిర్మిస్తున్నారు. మధ్యాహ్నం కార్యక్రమం.. హైదరాబాద్ ఐఐటీ 8వ స్నాతకోత్సవం శనివారం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ముఖ్య అతిథిగా రానున్నారు. పాస్అవుట్ విద్యార్థులతో పాటుగా ప్రతీ విద్యార్థి వెంట ఇద్దరిని అనుమతిస్తున్నారు. సుమారుగా 2వేల మంది ఈ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ఈయనతో పాటుగా అతిథులుగా హైదరాబాద్ ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్.మోహన్‌రెడ్డి, అఫిసియేటింగ్ (ఇంచార్జి) డైరెక్టర్ సీహెచ్.సుబ్రమణ్యన్ హాజరుకానున్నారు. మ ధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ ఐఐటీ నుంచి 560 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ శిక్షణ పూర్తిచేసుకొని పాస్అవుట్ అవుతున్నారు. వీరిలో 68 మంది పీహెచ్డీ స్కాలర్స్ ఉన్నారు. కొత్త ఆవిష్కరణలకు వేదిక దేశంలోని ఏ ఐఐటీకి కూడా తీసిపోని విధంగా హైదరాబాద్ ఐఐటీని కొత్త ఆవిష్కరణలకు వేదిక చేశాం. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా ఈ ఐఐటీలో ప్రవేశం పొందుతున్నారు. టీచింగ్‌తో పాటుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. దేశంలోని 23 ఐఐటీలలో ప్రస్తుతం 8వ ర్యాంకులో ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ ఐఐటీని దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. మరో ప్రత్యేకత ఏమిటంటే..ఈ ఇన్స్టిట్యూట్లో విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు గల విద్యార్థులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. ఫ్యాకల్టీకి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. – సీహెచ్. సుబ్రహ్మణ్యన్, ఇన్చార్జి డైరెక్టర్, హైదరాబాద్ ఐఐటీ -
ఐఐటీ-బాంబే కాన్వోకేషన్ : మోదీ ఎందుకొస్తున్నారంటూ..
న్యూఢిల్లీ : దేశ ప్రధాన మంత్రిగా యూనివర్సిటీల్లో జరిగే కాన్వోకేషన్ వేడుకల్లో పాల్గొనడం సాధారణం. ఎలాగైనా ప్రధాని తమ యూనివర్సిటీకి ముఖ్య అతిథిగా రావాలని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్థులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. యూనివర్సిటీలో జరిగే కాన్వోకేషన్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటూ ఓ గ్రూప్ విద్యార్థులు ప్రశ్నించారు. నేడు(శనివారం) ఈ వేడుక జరుగుతుండగా... విద్యార్థులు ఇలా ప్రశ్నించడంతో మేనేజ్మెంట్ షాకైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘విద్యార్థి వ్యతిరేక రాజకీయాలు’ చేస్తుందని ఆరోపిస్తూ.. తమ స్టేట్మెంట్ను సోషల్ మీడియాలో షేర్చేశారు. ఈ స్టేట్మెంట్లో ఉన్నత విద్యకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సస్ లాంటి ఇన్స్టిట్యూట్లలో రిజర్వడ్ కేటగిరీ విద్యార్థులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ను రద్దు చేయడం, కొత్త ఉన్నత విద్య కమిటీలోని లోపాలు వంటి పలు అంశాలపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తాము లేవనెత్తిన ఈ అంశాలన్నీ కేవలం తమ ఇన్స్టిట్యూట్కు వేసే ప్రశ్నలు కావని, డైరెక్ట్‌గా ప్రధానినే ప్రశ్నిస్తున్నట్టు విద్యార్థులు పేర్కొన్నారు. ఉన్నత విద్యా సంస్థలకు కేటాయించే నిధుల్లో ఈ ప్రభుత్వం చాలా చెత్త రికార్డును కలిగి ఉందని విమర్శిస్తున్నారు. నిజంగా ప్రధానమంత్రికి అందరికి విద్య అందించాలని ఉందా? లేదా విద్యలో బ్రహ్మణ ఆలోచన విధానాన్ని ప్రోత్సహిస్తుందా?(కొంతమంది విద్యార్థులు అంటే ఉన్నత తరగతికి చెందిన విద్యార్థులకు మాత్రమే విద్య) అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉన్నత విద్యపై వెచ్చించే ఖర్చులను తగ్గించడంతో, దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఫీజులను పెంచాయని పేర్కొన్నారు. ఉన్నత విద్య సంస్థల్లో పెరుగుతున్న రుణాలు, దీంతో విద్యార్థులకు యూనివర్సిటీలు పెంచుతున్న ఫీజులు వంటి పలు సమస్యలను విద్యార్థులు లేవనెత్తారు. ఆయన పార్టీ నేతలు సపోర్టు చేస్తున్న ద్వేషపూరిత నేరాలను ఖండించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ స్టేట్మెంట్ను కో-ఆర్డినేషన్ ఆఫ్ సైన్సస్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్ అసోసియేషన్ ఫేస్బుక్ పేజీపై కూడా షేర్ చేశారు. మరోవైపు ఐఐటీ-బాంబేలో కాన్వోకేషన్ వేడుకలో పాల్గొనడానికి ముంబై వెళ్తున్నట్టు నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ఐఐటీ-బాంబే యవతతో తాను సమావేశం కాబోతున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ సైన్సస్ అండ్ ఇంజనీరింగ్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కొత్త భవంతిని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీ హాజరయ్యే ఈ వేడుకలో కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొనబోతున్నారు. -
ఫ్యాషన్ హంగామా
-
ఘనంగా ఆర్మీ డెంటల్ కాలేజీ స్నాతకోత్సవం
-
బంగారు కుసుమం
ఏకంగా 12 బంగారు పతకాలు సాధించిన ఆటో డ్రైవర్ కుమార్తె ! మైసూరు విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో ఆటో డ్రైవర్ కుమార్తె ఏకంగా 12 బంగారు పతకాలు, మూడు నగదు బహుమానాలను సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మైసూరులోని ఇట్టిగెగూడ ప్రాంతానికి చెందిన సుమ ఆటో డ్రైవర్ కుమార్తె. ఎంఎస్సీ (రసాయనశాస్త్రం)లో తాను 12 బంగారు పతకాలు సాధించినట్లు సుమ ఈ సందర్భంగా తెలిపింది. నిరుపేదలైన తన తల్లిదండ్రులు తనకు ఎక్కడ కూడా కష్టం కలిగించలేదని, తాను కూడా సమయం వృథా కాకుండా కష్టపడి చదవ టం వల్లనే ఈ అనూహ్య విజయం సాధించానని చెప్పారు. తన విజయానికి కారకులైన మహారాణి కళాశాల యాజమాన్యం, ప్రొఫెసర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. - మైసూరు -
డాలర్ల కోసం పరుగులు తీయొద్దు
విద్యార్థులకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ హితవు న్యూఢిల్లీ: కెరీర్‌ను కేవలం ధనసంపాదన కోణంలోనే చూడొద్దని, డాలర్లకోసం విదేశాలకు పరుగులు తీయొద్దని లెఫ్టినెంట్ గవర్నర్, ఛాన్సలర్ నజీబ్‌జంగ్ హితవు విద్యార్థులకు హితవు పలికారు. సమాజ సువిశాల ప్రయోజనాల కోసం ముందుకు సాగాలన్నారు. ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం (డీటీయూ)లో బుధవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉన్నత విద్యకోసం వందలాదిమంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారని, దేశాన్ని గాలికొదిలేస్తున్నారంటూ విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి విద్యార్థులంతా వెనక్కి రావాలని ఆయన సూచిం చారు. ఇంకా అనేకమంది విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశమే రావడం లేదన్నారు. దేశ పురోభివృద్ధికి పాటుపడాలన్నారు. సమయం కేటాయించండి ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై వివిధ రూపాల్లో ఎంతో పెట్టుబడి పెట్టారని ఎల్జీ పేర్కొన్నా రు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని విద్యార్థులు కొంత సమయాన్ని దేశం కోసం కేటాయిస్తారని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా 72 మంది అండర్గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయే ట్ విద్యార్థులకు ఎల్జీ పట్టాలను అందజేశా రు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు పతకాలను అందజేశారు. నైతిక విలువల్ని పెంపొందించుకోవాలి అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నైతిక విలువలను పెంపొం దించుకోవాలని హితవు పలికారు. జీవి తంలో విజయపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. డిగ్రీ పట్టా ప్రతి ఒక్కరికీ అవసరమేనని, నైతిక విలువలు కూడా అంతకంటే ముఖ్యమని అన్నారు. వార్షిక నివేదికను సమర్పించిన వీసీ ఈ సందర్భంగా ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం (డీటీయూ) వైస్ ఛాన్సలర్ ప్రదీప్ కుమార్ డీటీయూ వార్షిక నివేదికను ఆహూతులకు చదివి వినిపించారు. 2013-14 విద్యా సంవత్సరంలో మొత్తం 13 నూతన ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. విద్యలో నాణ్యత పెంపుకోసం రూ. 12.5 కోట్ల మేర నిధులను వెచ్చించామన్నారు.