
సాక్షి, చెన్నై: వేగంగా జనబాహుళ్యంలోకి చేరేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమాలు, అన్ని రంగాల్లోకి విస్తరించిన కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగాన్ని అరికట్టే సాంకేతికత అందరికీ అందుబాటులోకి రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఆయన శనివారం ఐఐటీ మద్రాస్ 60వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మానవీయ విలువలు, వ్యక్తిగత గోప్యతలకు అత్యున్నత ప్రాధాన్యత కలి్పంచాలని సీజేఐ తెలిపారు.
ఆధునిక సాంకేతికతను సానుకూలంగా వాడుకునేందుకు వీలుగా రక్షణలు ఏర్పాటు చేసి నిరుపాయకరమైందిగా మార్చా లన్నారు. సాంకేతికతతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ప్రజలు భయపడక ముందే నమ్మకమైన వినియోగాన్ని సులభతరం చేయాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల రాకతో సరిహద్దులు, వయస్సు, జాతీయత వంటి అవరోధాలు తొలగినప్పటికీ ఆన్‌లైన్‌లో వేధింపులు, ట్రోలింగ్ వంటివి కొత్తగా పుట్టుకొచ్చా యని సీజేఐ పేర్కొన్నారు.