ముంబై: కోర్టు తీర్పులను అన్ని భారతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు కృత్రిమ మేథ(ఏఐ)ను వినియోగించుకుంటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమాచార అంతరాలను తొలగించడంలో సాంకేతికత చాలా కీలకమైందని ఆయన అన్నారు. ఇంగ్లిష్‌లో ఉండే కొన్ని చక్కని అంశాలు గ్రామీణ ప్రాంతాల లాయర్లు ఆకళింపు చేసుకోలేరు. లాయర్లందరికీ ఉచితంగా సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నదే నా ఉద్దేశం.
ఇందుకోసం తీర్పుల ప్రతులను ఏఐను వినియోగించుకుని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయిస్తాం’అని చెప్పారు. శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. విచారణల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా లా విద్యార్థులు, టీచర్లు కోర్టుల కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. తద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను గుర్తించగలుగుతారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment