చూట్టానికి బాగా ఎదిగిన మొలకలా కనిపిస్తోంది కదా. కానీ నిజానికి ఇదో పువ్వు! భారీ పరిమాణంతో పాటు ముక్కుపుటాలను అదరగొట్టే కుళ్లిన మాంసం తరహా కంపు వాసన దీని స్పెషాలిటీ. అందుకే దీన్ని కార్ప్స్ ఫ్లవర్ అని పిలుస్తారు. పదేళ్లకోసారి మాత్రమే పూయడం దీని మరో ప్రత్యేకత. పూసిన ఒకట్రెండు రోజుల్లో వాడిపోతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలోని బొటానికల్ గార్డెన్‌లో ఇలా కనువిందు చేసింది.
దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటూనే ఆసక్తిగా పదేపదే వాసన చూసి మరీ వెళ్తున్నారు! అంతరిస్తున్న జాబితాలో ఉన్న ఈ పువ్వు శాస్త్రీయ నామం అమర్ఫోఫలస్ టైటానియం. టైటన్ ఆరమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని అడిలైడ్ నుంచి 2021లో మెల్‌బోర్న్‌కు తరలించారు. అప్పటినుంచీ ఎప్పుడు వికసిస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొచ్చారు.
క్షిపణి ప్రయోగం విజయవంతం
మంగళవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ప్రయోగశాల నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్న లాంగ్ రేంజ్ లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం). సైంటిస్టులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు దీన్ని వీక్షించారు. ప్రయోగ సందర్భంగా క్షిపణిలోని అన్ని వ్యవస్థలూ అద్భుత పనితీరు కనబరిచినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు వెల్లడించింది.
పనితీరును మెరుగుపరిచే అత్యాధునిక వైమానిక, సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు దీని సొంతం. డీఆర్‌డీఓతో కలిసి ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (బెంగళూరు) ఈ క్షిపణిని తయారు చేసింది. బీఈఎల్ తదితర సంస్థలు కూడా ఇందులో భాగం పంచుకున్నాయి. వాహనాల నుంచి కూడా ప్రయోగించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రయోగాన్ని విజయవంతం చేసిన సైంటిస్టులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు.
చదవండి: విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment