India missiles
-
నిజానికి ఇదో పువ్వు.. కుళ్లిన మాంసం వాసన దీని స్పెషాలిటీ!
చూట్టానికి బాగా ఎదిగిన మొలకలా కనిపిస్తోంది కదా. కానీ నిజానికి ఇదో పువ్వు! భారీ పరిమాణంతో పాటు ముక్కుపుటాలను అదరగొట్టే కుళ్లిన మాంసం తరహా కంపు వాసన దీని స్పెషాలిటీ. అందుకే దీన్ని కార్ప్స్ ఫ్లవర్ అని పిలుస్తారు. పదేళ్లకోసారి మాత్రమే పూయడం దీని మరో ప్రత్యేకత. పూసిన ఒకట్రెండు రోజుల్లో వాడిపోతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని బొటానికల్ గార్డెన్లో ఇలా కనువిందు చేసింది. దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటూనే ఆసక్తిగా పదేపదే వాసన చూసి మరీ వెళ్తున్నారు! అంతరిస్తున్న జాబితాలో ఉన్న ఈ పువ్వు శాస్త్రీయ నామం అమర్ఫోఫలస్ టైటానియం. టైటన్ ఆరమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని అడిలైడ్ నుంచి 2021లో మెల్బోర్న్కు తరలించారు. అప్పటినుంచీ ఎప్పుడు వికసిస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొచ్చారు. క్షిపణి ప్రయోగం విజయవంతం మంగళవారం ఒడిశా తీరంలోని చాందీపూర్ ప్రయోగశాల నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్న లాంగ్ రేంజ్ లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం). సైంటిస్టులతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు దీన్ని వీక్షించారు. ప్రయోగ సందర్భంగా క్షిపణిలోని అన్ని వ్యవస్థలూ అద్భుత పనితీరు కనబరిచినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు వెల్లడించింది. పనితీరును మెరుగుపరిచే అత్యాధునిక వైమానిక, సాఫ్ట్వేర్ వ్యవస్థలు దీని సొంతం. డీఆర్డీఓతో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (బెంగళూరు) ఈ క్షిపణిని తయారు చేసింది. బీఈఎల్ తదితర సంస్థలు కూడా ఇందులో భాగం పంచుకున్నాయి. వాహనాల నుంచి కూడా ప్రయోగించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రయోగాన్ని విజయవంతం చేసిన సైంటిస్టులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు.చదవండి: విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు! -
శాంతికోసం మరేదైనా చేయండి
♦ చర్చలపై ఏకాభిప్రాయంవస్తున్నపుడు క్షిపణులెందుకు? ♦ బ్రహ్మోస్ మోహరింపుపై చైనా వ్యాఖ్య బీజింగ్: భారత్, చైనా దేశాల మధ్య చర్చల ప్రక్రియపై ఏకాభిప్రాయం వస్తున్న తరుణంలో సరిహద్దుల్లో భారత్ క్షిపణులను మోహరించటం సరైంది కాదని చైనా వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత ఆర్మీ బ్రహ్మోస్ క్షిపణలను పంపిస్తుండటంపై రెండ్రోజులుగా నిప్పులు చెరిగిన చైనా గురువారం తన స్వరాన్ని తగ్గించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవటంతోపాటు శాంతి నెలకొనేందుకు ఉద్దేశించిన చర్చల ప్రక్రియలో పురోగతి ఉన్న సమయంలో క్షిపణులను మోహరించడం తగదని తెలిపింది. చర్చల ప్రక్రియకు భంగం కలిగించేలా భారత్ విరుద్ధంగా ప్రవర్తించకూడదంది. ‘భారత్, చైనా దేశాల మధ్య శాంతి, స్థిరత్వం నెలకొనేందుకు జరుగుతున్న చర్చల్లో కీలకమైన ఏకాభిప్రాయం కుదిరినట్లే. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు భారత్ ఇతర కార్యక్రమాలు చేపట్టవచ్చు. కానీ ఇలాంటి చర్యలు వద్దు’ అని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వు కియాన్ గురువారం తెలిపారు. భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు మరో సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణిని తరలించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనా రక్షణ శాఖ ఈ ప్రకటన చేసింది. అటు చైనా సరిహద్దుల్లో రూ.4,300 కోట్లతో నాలుగో బ్రహ్మోస్ రెజిమెంట్ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పిందని ఢిల్లీలోని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.