పుష్పవజ్రమా? అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? గని నుంచి తవ్వి తీయకపోయినా, అచ్చంగా వజ్రంలాగానే ఉంటుంది. చైనీస్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూలతో వజ్రాన్ని తయారు చేశారు. గులాబీల మాదిరిగా కనిపించే ఎర్రని పీయనీ పూల నుంచి వేరుచేసిన కార్బన్ అణువులతో మూడు కేరట్ల వజ్రాన్ని తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు.
ఈ వజ్రం తయారీ కోసం హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లువోయాంగ్ నగరంలోని నేషనల్ పీయనీ గార్డెన్స్ నుంచి సేకరించిన పూలను ఉపయోగించారు. కృత్రిమ వజ్రాల తయారీకి ప్రసిద్ధి చెందిన లువోయాంగ్ ప్రామిస్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అరుదైన ఘనతను సాధించారు. పూలతో వజ్రాన్ని తయారుచేయాలని సంకల్పించినట్లు లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ చెప్పడంతో ఆ కంపెనీకి కావలసిన పీయనీ పూలను సరఫరా చేసేందుకు నేషనల్ పీయనీ గార్డెన్ అంగీకరించింది.
బయోజెనిక్ కార్బన్ ఎక్స్‌ట్రాక్టింగ్ టెక్నాలజీతో ఈ పూల నుంచి కార్బన్ అణువులను వేరుచేసి, వాటిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అత్యధిక పీడనకు గురిచేయడం ద్వారా ఈ వజ్రాన్ని తయారు చేయగలిగామని లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ సీఈవో వాంగ్ జింగ్ తెలిపారు. ఈ వజ్రం విలువను మూడు లక్షల యువాన్లుగా (రూ.35.19 లక్షలు) అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇవి చదవండి: వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ..
Comments
Please login to add a commentAdd a comment