న్యూఢిల్లీ: అచ్ఛంగా విచ్చుకున్న పుష్పంలాగా ఉన్న కొత్త జీవిని పసిఫిక్ మహాసముద్రంలో పరిశోధకులు గుర్తించారు. ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన పసిఫిక్ అడుగు భాగాన అన్వేషిస్తుండగా, ఈ జీవి దర్శనమిచ్చింది. సంబంధిత వీడియో దృశ్యాలను ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టు విడుదల చేసింది. సముద్ర ఉపరితలం నుంచి 9,823 అడుగుల(2,994 మీటర్లు) లోతున ఈ జీవి కనిపించిందని పరిశోధకులు చెప్పారు.
పువ్వుకు ఉన్నట్టుగానే దీనికి కాండం, రేకుల (తంతువుల) లాంటివి ఉండడం విశేషం. కాండం వంటి భాగం 7 అడుగులు (2 మీటర్లు) కాగా, ఒక్కో తంతువు 16 అంగుళాలు (40 సెం.మీ.) పొడవున్నాయట! ఇదో భారీ సముద్ర జీవి అని చెబుతున్నారు. అయితే ఇతర సముద్ర జీవజాతుల తరహాలో కాకుండా భిన్నంగా కనిపిస్తుండడం దీని ప్రత్యేకత. ఇలాంటి వింత జీవి ఒకటి కనిపిస్తుందని ఎప్పుడూ ఊహిచలేదని పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే..
Comments
Please login to add a commentAdd a comment