అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి పూలను తెప్పించారు. అయోధ్యను అలంకరించేందుకు కాశీ నుంచి కూడా పూలు తెప్పించారు. పూర్వాంచల్‌లోని అతిపెద్ద పండ్ల మార్కెట్ నుంచి 50 క్వింటాళ్ల పూలను రెండు రోజుల క్రితం అయోధ్యకు తరలించారు.
ఈ పూలలో ఆరెంజ్, పసుపు రంగు బంతిపూలు ఉన్నాయి. ఇదేవిధంగా కాశీ నుంచి అయోధ్యకు పెద్ద మొత్తంలో గులాబీలను పంపించామని, పది వేల బంతిపూల దండలను కూడా పంపినట్లు మాల్దాహియా పూల మార్కెట్ హెడ్ విశాల్ దూబే తెలిపారు. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పటికీ, కొద్దిమొత్తంలోనే పూలను అయోధ్యకు పంపించామన్నారు. కాగా కాన్పూర్, లక్నో, కోల్‌కతాల నుంచి కూడా అయోధ్యకు పూలను ఆర్డర్ చేశారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
యూపీలో ప్రస్తుతం పూలకు విపరీతమైన గిరాకీ ఉంది. జనవరి 22న వివిధ ఆలయాల్లో పూజలు, వేడుకలు నిర్వహించనున్న దృష్ట్యా వివిధ రకాల పూలకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. బంతిపూలతో పాటు గులాబీ, మల్లె పూలకు విపరీతమైన ఆర్డర్లు అందుతున్నాయి.
ఇది కూడా చదవండి: బాలరామునికి భారీ వేణువు
Comments
Please login to add a commentAdd a comment