Corpse Flower Is Worlds Most Worst Smelling Flower, Know Its Facts Inside - Sakshi
Sakshi News home page

World Most Worst Smelling Flower: ‘ఇదేం పువ్వురా బాబూ.. ముక్కు పేలిపోతోంది’

Published Tue, Jul 4 2023 1:41 PM | Last Updated on Wed, Jul 5 2023 8:28 AM

corpse flower is the worlds most foul smelly flower - Sakshi

అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుష్పం.. అయితే దానిని చూడాలని ముచ్చట పడితే.. అంతే సంగతులు. ఎందుకంటే దానికి మనం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగానే.. దాని నుంచి మన ముక్కులు పేలిపోయేంత దుర్వాసన వస్తుంది. రండి.. ఆ పువ్వు కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన వెదజల్లే పువ్వు పేరు ‘కార్ప్స్‌ ఫ్లవర్‌’ ఈ పుష్పం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పువ్వు పదేళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. ఈ పువ్వు వికసించగానే దాని నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ దుర్వాసన వ్యాపిస్తుంది.

కార్ప్స్‌ ఫ్లవర్‌ను టైటాన్‌ వాన్‌కాగ్‌ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది అమెరికాలోని వాషింగ్టన్‌ ‍స్టేట్‌ యూనివర్శిటీలో వికసించింది. ఈ పుష్పం 24 గంటల నుంచి 48 గంటల పాటు వికసిస్తుంది. దీని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అందుకే దీనిని శవ పుష్పమని, మృత్యు పుష్పమని కూడా అంటారు. 

దీనికి ముందు ఈ పుష్పం కరోనా కాలంలో అమెరికాలోని ఫ్రాన్సిస్కోలో కనిపించింది. అప్పుడు కూడా ఈ పుష్పం చర్చల్లో నిలిచింది. కొన్ని కిలోమీటర్ల వరకూ దీని దుర్వాసన వ్యాపిస్తుండంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతుంటారు. 

2011లోనూ ఈ పుష్పం వికసించింది. ఇది చూసేందుకు ఎంతో వింతగా ఉంటుంది. ఇది అతి అరుదైన పుష్పం. ఈ పుష్పం 12     అడుగుల ఎత్తు కలిగివుంటుంది. ఈ పుష్పం వికసించేందుకు 10 ఏళ్లు పడుతుంది. ఈ కాలం ముగిశాకనే అది పూర్తిస్థాయిలో వికసిస్తుంది. అప్పుడు అది ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే దీనిని చూడాలనుకుంటే ముక్కు మూసుకోవాల్సిందే.

ఇది కూడా చదవండి: ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్‌ అవ్వొచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement