smell
-
వాసన కోల్పోవడం..ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో..!
వాసన కోల్పోవడానికి ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో ముందుగానే సంకేతం ఇస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇది ఒకరకంగా ఘ్రాణ శక్తి ప్రాధాన్యతను హైలెట్ చేసింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో మన ముక్కు పనితీరు చాలా కీలకమని వెల్లడయ్యింది. ఈ కొత్త అధ్యయనం వాసనం కోల్పోవడాన్ని ఏకంగా 140 వైద్య పరిస్థితుల ద్వారా ముందుగానే హెచ్చరిస్తుందని పేర్కొంది. అది వృద్ధాప్యం, మోనోపాజ్, నరాలు, శారీరక వ్యాధుల రూపంలో సంకేతమిస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది ఫ్రాంటియర్స్ ఇన్ మాలిక్యులర్ న్యూరోసైన్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యింది. అంతేగాదు రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన కూడా దీనిపై ఆదారపడి ఉంటుందట. మంచి ఘ్రాణ శక్తి ఉంటే వారికి అపారమైన జ్ఞాపక శక్తి ఉందని అర్థమట. అంతేగాదు ఆహ్లదకరమైన సువాసనలు మెదడు ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయట. ఘ్రాణ శక్తిని కోల్పోతున్నట్లుగా ముందుగానే దాదాపు 139 వ్యాధుల రూపంలో తెలియజేస్తుందట.అందువల్ల ముందుగా ఈ ఘ్రాణ శక్తికి మంచి చికిత్సను అందిస్తే ఆ 140 రకాల వ్యాధులు రాకుండా నివారించొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఈ పరిశోధనలో కొన్ని కాంప్లీకేషన్స్ కూడా ఉన్నాయని అన్నారు. ఇక ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తల బృందం పలువురిపై అధ్యయనం చేయగా చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 9 వేల మంది సుదీర్ఘ కోవిడ్ కారణంగా వాసన కోల్పోగా, దాదాపు మూడు వేల మందికి పైగా మోనోపాజ్ వల్ల వాసనను కోల్పోయారు. మరో మూడు వేలమంది డిప్రెషన్ కారణంగా ఘ్రాణ శక్తిని కోల్పోయారు. అంతేగాదు ఈ వాసన కోల్పోవడానికి పర్యావరణ కారకాలు కూడా కొంత కారణమని వైద్యులు చెబుతున్నారు. ముందుగానే వివిధ రకాల వ్యాధుల రూపంలో సంకేతం ఇచ్చినప్పుడే.. ఘ్రాణ శక్తికి సత్వరమే మంచి చికిత్స ఇస్తే ఎలాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండదని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం వాసన ప్రాముఖ్యతను తెలియజేయడమే గాక భవిష్యత్తులో చేసే మరిన్ని పరిశోధనలకు ఇది పునాదిగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పరిశోధకులు. (చదవండి: ఇలాంటి క్రేజీ గ్రౌండ్ఫ్రిడ్జ్ని చూశారా..? కరెంట్‌తో పని లేకుండానే..) -
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ (కూర) వాసనలతో నిండిపోతుందని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమల భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇటీవల ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే వైట్‌హౌస్‌లో కూర వాసనలే ఉంటాయి. వైట్‌హౌస్‌లో ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా వినిపిస్తాయి. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవలం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది’’ అని లూమర్ పేర్కొన్నారు. నేషనల్ గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా కమలా హారిస్ సోషల్ మీడియా పోస్టు చేసిన చేసిన ఫోటోపై ఆమె పై విధంగా స్పందించారు. కమలా హారిస్‌పై లూమర్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్–పియర్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
వంట చేయడం వల్ల వచ్చే పొగ నుంచి గాలి కాలుష్యమవుతుంది. ఇటీవల కార్లలో వాసన చూస్తే కేన్సర్ వస్తుందని పలు నివేదికలు హల్ చల్ చేశాయి. తాజాగా మరో అధ్యయనం దిగ్భ్రాంతి రేపుతోంది. అదేంటో తెలియాలంటే మీరీ కథనం చదవాల్సిందే!పప్పు పోపు, పులిహోర తాలింపు, చికెన్, మటన్ మసాలా ఘుమ ఘుమలు లాంటివి రాగానే గాలి ఒకసారి అలా గట్టిగాపైకి ఎగ పీల్చి.. భలే వాసన అంటాం కదా. కానీ ఇలా వంట చేసేటపుడు వచ్చే వాసన గాలిని కలుషితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో తినుబండారాలను కలిగి ఉన్న లాస్ వెగాస్‌లో గాలి నాణ్యత సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) చేసిన ఈ పరిశోధనలో రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు , వీధి వ్యాపారుల వద్ద వంట చేసే రుచికరమైన వాసన గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కనుగొంది. పట్టణ వాయు కాలుష్యం ప్రభావంపై కెమికల్ సైన్సెస్ లాబొరేటరీ (CSL) పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను విడుదల చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్ ,కొలరాడోలోని బౌల్డర్ మూడు నగరాలపై దృష్టి సారించారు. ఈ నగరాల్లో వంటకు సంబంధించిన మానవ-కారణమైన అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCలు) కొలుస్తారు. మీకు వాసన వచ్చిందంటే, అది గాలి నాణ్యతను ప్రభావితం చేసే మంచి అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.వెగాస్ బహిరంగ గాలిలో ఉన్న మొత్తం కర్బన సమ్మేళనాల్లో 21 శాతం వంటలనుంచి వచ్చినవేనని అధ్యయన రచయిత మాట్ కాగన్ చెప్పారు. వాహనాలు, అడవి మంటల పొగ, వ్యవసాయం, వినియోగదారు ఉత్పత్తులు వంటి విభిన్న వనరుల ఉద్గారాలను పరిశోధకులు అంచనా వేశారు. పట్టణాల్లో వీటిని లాంగ్-చైన్ ఆల్డిహైడ్లు అని పిలుస్తామని వెల్లడించారు. అయితే వంట చేయడం వల్ల వచ్చే వాయు కాలుష్యం చాలా తక్కవే అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్గారాలకు వంట వాసన కారణమవుతుందని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాదు ఇంటి లోపల ,ఇళ్ల లోపల సమస్య మరింత తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరించారు. -
వానకు తడిచిన బట్టల నుంచి వాసన రాకుండా ఇలా చేయండి..
ఇంటిప్స్ ►వానాకాలంలో బట్టలను ఉతికాక కర్పూరం కలిపిన నీటిలో జాడించడం వల్ల దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. ► ఆరీ ఆరని దుస్తులను ఇస్త్రీ చేసినా అదోవిధమైన వాసన వస్తాయి. అందువల్ల దుస్తులు పూర్తిగా ఆరిన తర్వాతనే ఐరన్ చేయాలి. ► అల్మారాలో బట్టలను పెట్టేముందు అక్కడక్కడ కొన్ని కర్పూరం బిళ్లలు ఉంచాలి. దీనివల్ల చిమటల వంటి కీటకాలు చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా బట్టల్లో దుర్వాసన తొలగితుంది. -
ఇదేం పువ్వురా బాబూ.. ముక్కు పేలిపోతోంది.. ఇది ప్రపంచంలోనే
అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుష్పం.. అయితే దానిని చూడాలని ముచ్చట పడితే.. అంతే సంగతులు. ఎందుకంటే దానికి మనం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగానే.. దాని నుంచి మన ముక్కులు పేలిపోయేంత దుర్వాసన వస్తుంది. రండి.. ఆ పువ్వు కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన వెదజల్లే పువ్వు పేరు ‘కార్ప్స్ ఫ్లవర్’ ఈ పుష్పం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పువ్వు పదేళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. ఈ పువ్వు వికసించగానే దాని నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ దుర్వాసన వ్యాపిస్తుంది. కార్ప్స్ ఫ్లవర్‌ను టైటాన్ వాన్కాగ్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో వికసించింది. ఈ పుష్పం 24 గంటల నుంచి 48 గంటల పాటు వికసిస్తుంది. దీని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అందుకే దీనిని శవ పుష్పమని, మృత్యు పుష్పమని కూడా అంటారు. దీనికి ముందు ఈ పుష్పం కరోనా కాలంలో అమెరికాలోని ఫ్రాన్సిస్కోలో కనిపించింది. అప్పుడు కూడా ఈ పుష్పం చర్చల్లో నిలిచింది. కొన్ని కిలోమీటర్ల వరకూ దీని దుర్వాసన వ్యాపిస్తుండంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతుంటారు. 2011లోనూ ఈ పుష్పం వికసించింది. ఇది చూసేందుకు ఎంతో వింతగా ఉంటుంది. ఇది అతి అరుదైన పుష్పం. ఈ పుష్పం 12 అడుగుల ఎత్తు కలిగివుంటుంది. ఈ పుష్పం వికసించేందుకు 10 ఏళ్లు పడుతుంది. ఈ కాలం ముగిశాకనే అది పూర్తిస్థాయిలో వికసిస్తుంది. అప్పుడు అది ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే దీనిని చూడాలనుకుంటే ముక్కు మూసుకోవాల్సిందే. ఇది కూడా చదవండి: ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు! -
ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్ వెనుక సింపుల్ లాజిక్!
వాసన అనేది మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని పదార్థాలను వాసన చూసి, అదేమిటో గుర్తుపట్టవచ్చు. ఒక్కోసారి వాసనను పసిగట్టి ప్రమాదాలను కూడా నివారించవచ్చు. ఇంటిలోని విద్యుత్ వైర్ ఏదైనా ఓవర్‌హీట్ అయినప్పుడు దాని నుంచి వాసన వస్తుంది. దానిని వెంటనే పసిగడితే పెను ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. కొన్ని వాసననలు మనం ఎంతగానో ఇష్టపడుతుంటాం. ఉదాహరణకు తొలకరి చినుకులు పడుతున్నప్పడు మట్టి నుంచి వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుందని కొందరు చెబుతుంటారు. పెట్రోల్ వాసన, కొత్త పుస్తకాల వాసనను ఇష్టపడేవారు కూడా అధికంగానే ఉంటారు. కొందరు అయోడెక్స్, నెయిల్ పాలిష్ వాసనలను ఇష్టపడుతుంటారు. అయితే కొందరికి ఏ వాసనలు నచ్చుతాయో అవే మరికొందరికి అస్సలు నచ్చవు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాసనల వెనుకనున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు గ్రహిద్దాం. సువాసన, దుర్వాసనల వెనుక.. ప్రముఖ శాస్త్రవేత్త రేచల్ ఎస్ హర్జ్ రాసిన The Scent of Desire పుస్తకంలో ఏ వాసన అయినా బాగుందని, బాగోలేదని విభజించలేమన్నారు.అయితే మనం వాసన పీల్చుకునేటప్పుడు కలిగే ఎక్స్పీరియన్స్ ప్రకారం అది బాగుందని, లేదా బాగోలేదని చెబుతుంటామన్నారు. మనం మానసిక భావోద్వేగాల మధ్య ఉన్నప్పుడు ఏదైనా స్మెల్ బాగుందనో లేదా బాగోలేదనో చెబుతుంటాం. దీనిప్రకారం చేస్తూ మనం ఎమోషన్స్‌కు దూరంగా ఉన్నప్పుడు ఏ వాసన అయినా మనకు సాధరణంగానే అనిపిస్తుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం మనకు పాజిటివ్ ఫీల్ కలిగించిన వాసనలను మనం ఇష్టపడుతుంటాం. కొత్త దుస్తులు, కొత్త పుస్తకాలు మొదలైన వాటి వాసన ఈ కోవలోకే వస్తుంది. కొందరు విచిత్రమైన వాసనలను ఇష్టపడుతుంటారు. అంతమాత్రాన వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రతీవాసనను ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్వీకరిస్తారు. అందుకే కొందరికి సువాసన అనిపించేది మరికొందరికి నచ్చదు. ఇది కూడా చదవండి: దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్వర్క్ ఉన్నా.. -
వాసనలు పసిగట్టే రోబో
టెల్ అవీవ్: మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, అనుమతి లేని వస్తువులను వాసన ద్వారా క్షణాల్లో గుర్తించే శక్తిమంతమైన రోబోను ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో ఇలాంటి రోబో ఇదే మొదటిదట. సమీప భవిష్యత్తులో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో ఇవి సేవలందిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాసనను పసిగట్టే ఎలక్ట్రానిక్ పరికరాల కంటే ఈ రోబో 10,000 రెట్లు ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తుంది. సున్నితమైన వాసనలను సులువుగా గుర్తించేలా ఇందులో బయో సెన్సార్ అమర్చారు. మెషిన్ లెర్నింగ్ అల్గరిథంతో ఈ సెన్సార్‌ను ఎలక్ట్రానిక్ వ్యవస్థగా మార్చారు. ప్రతి వాసనలోని ఎలక్ట్రిక్ చర్యను బట్టి అది ఏ రకం వాసనో చెప్పేస్తుంది. మనిషి ఎన్ని రకాల ఆధునిక టెక్నాలజీలను అభివృద్ధి చేసినా అవి ప్రకృతిలోని జీవులతో పోటీ పడలేవని వర్సిటీ ప్రతినిధులు డాక్టర్ బెన్ మావోజ్, ప్రొఫెసర్ అమీర్ అయాలీ చెప్పారు. ‘‘కొన్ని రకాల కీటకాలు వాసనలను సరిగ్గా గుర్తిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ స్థాయిని దోమలు కేవలం 0.01 శాతం వ్యత్యాసంతో సరిగ్గా గుర్తిస్తాయి. కీటకాల తరహాలో వాసనలను పసిగట్టే సెన్సార్ల అభివృద్ధిలో మనమింకా వెనకబడే ఉన్నాం’’ అని వివరించారు. పరిశోధన వివరాలు బయో సెన్సార్ అండ్ బయో ఎలక్ట్రానిక్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి. -
అదిరిపోయే గాడ్జెట్‌తో ఇంట్లో దుర్వాసనకు చెక్ పెట్టండిలా
ఇదో కొత్తతరహా ఎయిర్‌ప్యూరిఫయర్. మార్కెట్లో దొరికే మిగిలిన ఎయర్ప్యూరిఫయర్ల కంటే ఇది చాలా తేలిక. పోర్టబుల్ టేబుల్‌ఫ్యాన్ పరిమాణంలో ఉండే దీనిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. కోరుకున్న చోట తేలికగా అమర్చుకోవచ్చు. ఇళ్లలోను, కార్యాలయాల్లోను వాడుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ‘డాక్టర్ ఎయిర్పిక్’ పేరిట దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి సంస్థ పిక్సెల్రో కంపెనీ ఇటీవల దీనిని మార్కెట్లోకి తెచ్చింది. ఇందులోని కార్బన్ మల్టీకంపోజిట్ ఫిల్టర్, ప్లాస్మా డీయాడరైజర్లు గాలిలోని దుమ్ము ధూళి, పొగ, సూక్ష్మజీవకణాలు వంటివి తొలగించడమే కాకుండా, పరిసరాల్లోని ఎలాంటి దుర్వాసననైనా నిమిషాల్లో మటుమాయం చేస్తాయి. దీని ధర 75 డాలర్లు (రూ.6,134) మాత్రమే! ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
ఒంటివాసనే దోమకాటుకు మూలం
న్యూయార్క్: దోమలు. మనందరికీ ఉమ్మడి శత్రువులు. మలేరియా, జైకా, డెంగీ ప్రాణాంతక జ్వరాలకు కారణం. ఇవి కొందరినే ఎక్కువగా కుట్టడానికి కారణం ఏమిటి? ఫలానా రక్తం గ్రూప్ ఉన్నవారిని, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఉన్నవారిని, వెల్లుల్లి, అరటిపండ్లు ఎక్కువగా తినేవారిని, మహిళలను దోమలు అధికంగా కుడుతుంటాయని అనుకుంటుంటారు. కానీ, ఇవేవీ నిజం కాదని అమెరికాలోని రాక్ఫెల్లర్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. శరీరం నుంచి వెలువడే ఓ రకం వాసనే దోమలను ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని, అలాంటి వారినే అవి ఎక్కువగా కుడుతుంటాయని తేల్చారు. ఈ వాసనకు కారణం శరీరంలోని కొవ్వు అమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్). ఇవి దోమలను ఆకర్షించే వాసనను ఈ ఉత్పత్తి చేస్తాయట! అధ్యయనం వివరాలను ‘జర్నల్ సెల్’లో ప్రచురించారు. మస్కిటో మ్యాగ్నెట్ మారదు చర్మంలో కార్బోజైలిక్ యాసిడ్స్ స్థాయిలు అధికంగా ఉన్నవారి పట్ల దోమలు విపరీతంగా ఆకర్షణకు గురవుతాయని అమెరికాలోని ‘రాక్ఫెల్లర్స్ ల్యాబొరేటరీ ఆఫ్ న్యూరోలింగ్విస్ట్ అండ్ బిహేవియర్’ ప్రతినిధి లెస్లీ వూషెల్ చెప్పారు. చర్మంలో భారీగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దోమల ముప్పు అధికమేనని వివరించారు. జైకా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి జ్వరాలకు కారణమయ్యే ‘ఎడిస్ ఈజిప్టి’ దోమలపై మూడేళ్లు అధ్యయనం చేశారు. చర్మంలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు బాగా ఉన్నవారే ఎక్కువగా దోమకాటుకు గురవుతున్నట్లు గుర్తించారు. ఆ అమ్లాల నుంచి ఉత్పత్తయ్యే గ్రీజులాంటి కార్బోజైలిక్ యాసిడ్స్ చర్మంపై కలిసి పొరలాగా పేరుకుంటాయి. వాటి నుంచి వచ్చే ఒక రకమైన వాసన దోమలను ఆకట్టుకుంటుందట!. -
అంతరిక్షం రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా?
భూమ్మీద ఏ చోటకు వెళ్లినా అక్కడి వాతావరణం ఏదో ఒక అనుభూతిని కలిగిస్తుంది. ఆ పరిసరాల్లో ఉండే పరిస్థితులను బట్టి ధ్వనులు వినిపిస్తుంటాయి. మట్టి నుంచి మొక్కలు, జంతువుల దాకా ఎక్కడికక్కడ వాసన, రుచి అనుభూతులు ఉంటాయి. మరి అంతరిక్షంలో ఎలాంటి ధ్వనులు వినిపిస్తాయి? అక్కడి రుచి, వాసన ఎలా ఉంటాయో తెలుసా? దీనిపై పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో తేల్చిన వివరాలు ఇవీ.. గెలాక్సీల మధ్య ధ్వని ప్రయాణం సాధారణంగా వాతావరణం లేనిచోట ధ్వని ప్రయాణించదు అనేది భౌతికశాస్త్ర సూత్రం. విశ్వంలో చాలా భాగం శూన్యమే కాబట్టి ధ్వని ప్రసారం ఉండదనే భావన ఉంది. ఇది కొంతవరకు నిజమే. అయితే వేలకొద్దీ నక్షత్ర సమూహాలు (గెలాక్సీలు) ఉండే గెలాక్సీ క్లస్టర్లు భారీ ఎత్తున గ్యాస్‌తో నిండి ఉంటాయి. వాటిలో ధ్వని ప్రయాణిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతరిక్ష ధ్వనులను విడుదల చేసిన నాసా.. 2003లో పెర్సెయస్ గెలాక్సీ క్లస్టర్ మధ్య ఉన్న ఒక కృష్ణ బిలం (బ్లాక్ హోల్) నుంచి వచ్చిన ధ్వనిని చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ సాయంతో గుర్తించారు. అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్న ఆ ధ్వని ఫ్రీక్వెన్సీని నాసా శాస్త్రవేత్తలు ఇటీవల కొన్నికోట్ల రెట్లు పెంచారు. మనకు వినపడే స్థాయికి తీసుకొచ్చి విడుదల చేశారు. గ్రహాల ‘పాటలు’ ఇవి నాసా ప్రయోగించిన రోవర్లు, ఉపగ్రహాల సాయంతో పలు గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కల ధ్వనులనూ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. అంగారకుడు, శుక్రుడు, జూపిటర్, శనిగ్రహాలతోపాటు పలు తోకచుక్కల ధ్వనులను నమోదు చేశారు. పర్సవరెన్స్రోవర్ మార్స్పైచేసిన ప్రయోగాలతో.. అక్కడి పలుచని వాతావరణం కారణంగా ధ్వనిఅతి మెల్లగా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. విజిల్స్, గంటలు, పక్షుల కూతలు వంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే ధ్వనులు దాదాపుగా వినిపించవని తేల్చారు. ఏదో కాలిపోతున్నట్టు వాసనతో.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండే శాస్త్రవేత్తలు అప్పుడప్పుడూ మరమ్మతులు, ప్రయోగాల కోసం.. బయట శూన్యంలో స్పేస్ వాక్ చేస్తుంటారు. అలా స్పేస్ వాక్ చేసి, తిరిగి ఐఎస్ఎస్లోకి వెళ్లిన తర్వాత.. తమకు ‘ఏదో కాల్చిన మాంసం’.. ‘బాగా వేడి చేసిన ఇనుము నుంచి వెలువడిన లేదా వెల్డింగ్ చేసినప్పుడు వెలువడే పొగ’ వంటి వాసన వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే ఐఎస్ఎస్ బయట అంతరిక్షంలో భారీస్థాయి రేడియేషన్ ఉంటుందని.. దానికి లోనైనప్పుడు స్పేస్ సూట్, ఇతర పరికరాల్లోని పరమాణువులు తీవ్రస్థాయి కంపనాల (హైఎనర్జీ వైబ్రేషన్స్)కు గురవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వారు తిరిగి ఐఎస్‌ఎస్‌లోనికి వచ్చాక ఆ హైఎనర్జీ పార్టికల్స్‌లో కూడిన గాలిని పీల్చడం వల్ల.. వెల్డింగ్ తరహా వాసన వస్తున్నట్టు తేల్చారు. ‘టచ్’లో మార్పు లేదట! అంతరిక్షంలో మన స్పర్శ విషయంలో ఎలాంటి తేడాలు కనిపించలేదని కెనడా ఆస్ట్రోనాట్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ వెల్లడించారు. అయితే వరుసగా రెండు నెలలపాటు ఐఎస్ఎస్లో గడిపిన వ్యోమగాముల్లో పాదాల అడుగుభాగం గరుకుదనం తగ్గి మెత్తగా అయితే.. పాదాలపైన చర్మం అత్యంత సున్నితంగా మారుతోందని గుర్తించారు. రకరకాల రుచుల్లో నక్షత్రాలు సాధారణంగా వివిధ రసాయనాలను బట్టి పదార్థాలకు రుచి వస్తుంటుంది. అలాగే అంతరిక్షంలో నక్షత్రాలు, ఇతర ఖగోళ పదార్థాల రుచినీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మన పాలపుంతలోని సాగిట్టారియస్ బీ2 గా పిలిచే ధూళిమేఘంలో ఈథైల్ ఫార్మేట్ రసాయనం ఉన్నట్టు గుర్తించారు. దానితో అది గులాబీ జాతికి చెందిన ‘రాస్ప్బెర్రీ’ పండ్ల రుచిని తలపిస్తుందని పేర్కొన్నారు. ఇక నక్షత్రాలు, ఖగోళ పదార్థాల్లో ఆల్కహాల్, యాసిడ్లు, ఆల్డిహైడ్స్గా పిలిచే రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు అనుగుణంగా వగరు, పులుపు, ఒకరకమైన చేదు వంటి రుచులను తలపించొచ్చని అంచనా వేశారు. కళ్లు ‘ఫ్లాట్’ అవుతాయట! అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపే వ్యోమగాముల్లో ‘స్పేస్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్ (సాన్స్)’ సమస్య వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గురుత్వాకర్షణ లేని వాతావరణం వల్ల కళ్లలోని ఆప్టిక్ డిస్క్‌లో మార్పులు వచ్చి.. కళ్లు గుండ్రని ఆకారాన్ని కోల్పోతూ, దృష్టి సామర్థ్యం తగ్గుతోందని తేల్చారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ ఇదీ చదవండి: భూమి గుండ్రంగా కాదు.. దీర్ఘవృత్తంగా ఉండును! -
వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వృద్ధురాలు... ఆశ్చర్యపోతున్న వైద్యులు
ఒక వృద్ధురాలు కేవలం వాసనతోనే వ్యాధిని గుర్తించేస్తోంది. ఆమె ముక్కు అలాంటి ఇలాంటి వ్యాధిని కాదు అరుదైన పార్కిన్సన్ వ్యాధిని గుర్తిస్తోంది. ఈ వ్యాధి దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి తీవ్రతను బట్టి శరీరంలోని మొత్తం ప్రధాన వ్యవస్థను నియంత్రించేస్తుంది. ఈ వ్యాధి కారణంగా వణుకుతూ ధృఢంగా లేకుండా ఉంటారు. క్రమంగా కదలిక మందగించడమే కాకుండా నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి 500 మందిలో ఒకరు ఈ వ్యాధి భారినపడతారు. అంతేకాదు పార్కిన్సన్స్ వ్యాధికి మందు లేదు. స్కాట్లాండ్కి చెందిన జాయ్మిల్నే అనే 72 ఏళ్ల వృద్ధురాలు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంది. ఆమె ముక్కుకి ఒక విలక్షణమైన లక్షణ ఉంది. ఆమె వాసన ద్వారా పార్కిన్సన్ వ్యాధిని పసిగట్టేస్తుంది. దీన్ని మొదటసారిగా తన భర్తలో గుర్తించింది. తన భర్తకు 45 ఏళ్ల వయసులో పార్కిన్సన్ వ్యాధి భారిన పడతారని చెప్పేసింది. అంటే ఆమె 12 ఏళ్లకు ముందే నాడిసంబంధిత వ్యాధితో బాదపడుతున్నాడని నిర్థారించగలిగింది. తన భర్తకు 33 ఏళ్లు వచ్చేటప్పటికి తన భర్త శరీరం నుంచి ఒక విధమైన వాసన వచ్చేదని అప్పుడే తాను ఈ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వివరించింది. ఆమెకు శరీర వాసనలో వింత మార్పును పసిగట్టగల సామర్థ్యం కలిగి ఉంది. దీంతో శాస్త్రవేత్తలు, వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆమె సాయంతో ఈ విషయాన్ని అధ్యయనం చేసే పనిలో నిమగ్నమయ్యారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలోని విద్యావేత్తలు ఆమె సాయంతో పార్కిన్సన్తో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించే విధానాలపై పలు పరిశోధనలు చేస్తున్నారు. (చదవండి: హౌస్‌కీపర్‌ని పెళ్లి చేసుకున్న డాక్టర్) -
తెలుసా..! కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు... ఎలాగంటే..
Coffee is Being Widely Used as a COVID-19 Diagnostic Tool: కాఫీ తాగేవారు కరోనాను ముందుగానే పసిగట్టేస్తారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ వ్యాపించిన వారిలో రుచి, వాసన లక్షణాలు కోల్పోవడంతోపాటు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయనే విషయం తెలిసిందే! కొంత మంది వీటిని పసిగట్టలేకపోవడం కూడా చూస్తున్నాం! దీనికీ కాఫీకి సంబంధం ఏమిటనే కదా అనుకుంటున్నారు! ఉందండీ.. కాఫీ పరిమళాన్ని, రుచిని ఆశ్వాదిస్తూ తాగడం మనలోచాలా మందికి అలవాటే. కరోనాను పసిగట్టంలో కూడా ఇదే టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఎప్పటిలా కాఫీ నుంచి వచ్చే కమ్మని పరిమళం మీ ముక్కును తాకడంలో ఏదైనా ఇబ్బంది కలిగినా.. లేక రుచిని తెలుసుకోలేకపోయినా వెంటనే అనుమానించవల్సిందే. కోవిడ్‌ను పసిగట్టడానికి పరిశోధకులు కాఫీనే ఎక్కువగా వాడుతున్నారట కూడా. వాసన చూడలేకపోయినవారిని పరీక్షిస్తే, వారిలో కోవిడ్ బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మీకెప్పుడైనా కోవిడ్ గురించిన బెంగ పట్టుకుంటే వెంటనే ఈ కాఫీ టెస్ట్ చేసుకుంటే.. టెన్షన్ ఫ్రీ!! చదవండి: Lingcod Fish Interesting Facts: ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు!!.. ఇప్పటికీ రహస్యమే.. -
‘ఆ సువాసన’ వెదజల్లే కారు... ప్రపంచంలోనే మొదటి సారి
FORD MUSTANG MACH-E ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. వాహనాల తయారీలో ఉన్న కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్నాయి. ఎక్కువ కంపెనీలు ఛార్జింగ్, మైలేజీపై దృష్టి సారించగా... ఫోర్డ్ ఓ అడుగు ముందుకు వేసి సరికొత్త ఫీచర్‌తో కస్టమర్లను ఆకట్టుకోవాలని ప్లాన్ వేసింది. ఆ ఫీలే వేరు ఇంతకాలం పెట్రోలు, డీజిల్ కార్లదే హవా నడిచింది. ఏళ్ల తరబడి పెట్రోలు కార్లు ఉపయోగించాం. దీంతో ఆ కార్లతో తెలియకుండానే ఒక అనుబంధం ఏర్పడింది. పైకి ఎవరు చెప్పకున్నా కారుకు సంబంధించి కంఫర్ట్, కంపాటబులిటీలతో పాటు పెట్రోల్ ఇంజన్ వాసనను కూడా ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉంటారు. అయితే కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఈ అనుభూతి మిస్ అవుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాసన మిస్ అవుతున్నాం పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిన తర్వాత పెట్రోలు వాసనను మిస్ అవుతున్నామని 70 శాతం మంది తెలిపినట్టు ఫోర్డ్ జరిపిన సర్వేలో తేలింది, వైన్, ఛీజ్ కంటే కూడా పెట్రోలు వాసనే ఎక్కువ ఇష్టపడతామని చెప్పిన వారి సంఖ్య కూడా చాంతాడంత తేలింది. తొలిసారిగా దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు ఉపయోగించే వారికి పెట్రోలు కారు స్మెల్ ఫీల్ మిస్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక మాక్ ఈవ్ పేరుతో సరికొత్త ఫ్రాగ్రెన్స్ని తయారు చేసింది ఫోర్డ్. ప్రత్యేక పద్దతిలో తయారు చేసిన ఈ పరిమళాన్ని మొదటగా ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ ఈ-జీటీ మోడల్‌తో ప్రవేశ పెట్టనుంది. పెట్రోలు వాసన మిస్ అవుతున్న వారికి ప్రత్యామ్నయం చూపనుంది. పెట్రోల్ వాసన అందించే తొలి ఈవీ కారుగా ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ - ఈ జీటీ నిలవనుంది. -
‘వాసన రావడం లేదా.. అయితే కరోనానే’
బెంగళూరు: మాల్స్‌కు వెళ్లి షాపింగ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఒకసారి మీ ముక్కు సరిగా పని చేస్తుంది లేనిది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక మీదట బెంగళూరులో షాపింగ్ మాల్స్‌లోకి వచ్చే వారికి టెంపరేచర్‌తో పాటు స్మెల్ టెస్ట్ కూడా చేయాలని నగర మేయర్ గౌతమ్ కుమార్ సూచించారు. ఎవరైనా వాసనను గుర్తించలేకపోతే.. వారికి కరోనా సోకినట్లే అంటున్నారు గౌతమ్ కుమార్. ఈ క్రమంలో మంగళవారం మేయర్ మాట్లాడుతూ.. ‘మాల్స్‌లోకి వచ్చే వారు ఎవరైనా స్మెల్ టెస్ట్‌లో ఫెయిలయితే.. వారిని లోనికి అనుమతించకండి. ఎందుకంటే కరోనా సోకిన వారు రుచి, వాసన గుర్తించలేరు. దీని గురించి కర్ణాటక ముఖ్యమంత్రికి, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాస్తాను. మాల్స్‌లో స్మెల్ టెస్ట్‌లు చేయడం తప్పని సరి చేస్తూ ఆదేశించాల్సిందిగా లేఖలో కోరతాను’ అన్నారు గౌతమ్ కుమార్. (వైద్యుడి కుటుంబాన్ని వెంటాడిన కరోనా) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన దాని ప్రకారం కరోనా రోగుల్లో జ్వరం, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలతో పాటు వాసన, రుచి కోల్పోవడం వంటి వాటితో కూడా బాధపడుతున్నట్లు వెల్లడించింది. కానీ ఇంతవరకు ఒక్క కరోనా రోగిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించలేదని సమాచారం. అయితే రుచి, వాసన కోల్పోటం అనే లక్షణాలు కరోనాలో మాత్రమే కాక ఫ్లూ, ఇన్ఫ్లూఎంజా ఉన్నప్పుడు కనిపిస్తాయంటున్నారు వైద్యులు. వ్యాధి ప్రారంభ దశలో ఈ లక్షణాలు కన్పిస్తాయని వీటిని గుర్తించిన వెంటనే చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు.ఆకస్మికంగా రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలను కరోనా పరీక్షకు ప్రామాణికంగా గత నెలలో ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
కరోనా నుంచి కోలుకున్నా ఈ కష్టాలు తప్పవా!
పారిస్: మహమ్మారి కరోనా బారినపడి కోలుకుంటున్నవారికి ఓ చేదు వార్త. వైరస్‌ను జయించినవారిలో కొందరు అతిముఖ్యమైన వాసన గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశముందని ఫ్రాన్స్‌కు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. జీవితంలో కీలకమైన వాసన చూసే శక్తి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అనోస్మి.ఆర్గ్ అధ్యయనానికి నేతృత్వం వహించిన జేన్ మైఖేల్ మైలార్డ్ పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలలో వాసన గ్రహించలేకపోవడం ఒకటని తెలిసిందే. అయితే, అనోస్మియా (వాసన గ్రహించలేకపోవడం) నెల, రెణ్నెళ్లపాటు ఉంటే ఫరవాలేదని మైలార్డ్ చెప్పారు. కానీ, ఆరు నెలలపైబడి అనోస్మియాతో బాధపడుతుంటే.. తిరిగి మామూలు స్థితికి రావడం కష్టమేనని మైలార్డ్ వెల్లడించారు. (చదవండి: భయపెట్టే వార్త చెప్పిన చైనా!) మాతృత్వాన్ని దగ్గించుకున్న ఓ మహిళ.. తన నవజాత శిశువు లేలేత బుగ్గల వాసన చూడలేకపోవం ఇబ్బందే కదా అని ఆయన అన్నారు. ఉదయం లేచి కాఫీ వాసన చూడకపోతే ఆ అనుభూతి కోల్పోయినట్టే కదా అని చెప్పుకొచ్చారు. అనోస్మియాతో ప్రమాదాలూ ఉన్నాయని హెచ్చరించారు. గ్యాస్ లీకేజీ సమయంలో, మంటలు అంటుకున్నప్పుడు, దుర్గంధం కనిపెట్టలేకపోవడం ఇవన్నీ ఇబ్బందులేనని చెప్పారు. ఇక కమ్మనైనా ఆహారాన్ని దాని రుచికంటే ముందుగా వాసనతోనే అంచనావేస్తామని అన్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఇతరుల సహాయంపై ఆధారాపడాల్సిందేని మైలార్డ్ వెల్లడించారు. కాగా, కరోనా కారణంగా ముక్కు లోపలి సున్నితమైన న్యూరాన్లు ప్రభావితమై అనోస్మియాకు దారితీస్తుందని పారిస్‌లో చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్టు అలెన్ కోరే చెప్పారు. అయితే, ఈ న్యూరాన్లు తిరిగి ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. (గల్వాన్ లోయలో కీలక పరిణామం) -
ఆ సువాసనలు ఇకపై సామన్యులకు..
స్పేస్‌లో వ్యోమగాములు వాసన కోసం ఉపయోగించే సువాసనలు ఇకపై సామాన్యులకు సైతం చేరువ కానున్నాయి. స్పేస్‌లో వాసన పీల్చుకోవడానికి వ్యోమగాములకు ప్రత్యేకమైన సువాసనలు అందిస్తారు. వ్యోమగాములు అంతరిక్ష వాసనకు అలవాటు పడటానికి అభివృద్ధి చేసిన కొన్ని సంవత్సరాల తరువాత, అలాంటి వాసనలే ఉండే సువాసనలను త్వరలో సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. యూ డి స్పేస్‌ను రసాయన శాస్త్రవేత్త, ఒమేగా ఇన్‌గ్రీడియన్స్ వ్యవస్థాపకుడు స్టీవ్ పియర్స్ అభివృద్ధి చేశారు. (అంతరిక్షంలో దోశ) మిస్టర్ పియర్స్ నాసాతో అంతరిక్ష వాసనను తయారుచేయడానికి 2008 లో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు అక్కడ ఉండే వాసనలు భిన్నంగా అనిపించకుండా ఉండటానికి దీనిని అభివృద్ధి చేయమని నాసా పియర్స్‌ను కోరింది. దీనిని తయారు చేయడానికి అతనికి నాలుగు సంవత్సరాలు పట్టింది. బాహ్య అంతరిక్ష వాసన ఎలా ఉంటుందో అనే విషయాన్ని వ్యోమగామి, పెగ్గి విట్సన్ 2002 లో ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తూ ‘కాల్చిన వెంటనే తుపాకీ నుంచి వచ్చిన వాసన లాగా ఉంటుంది’ అని తెలిపారు. ‘పొగ వాసన, కాలిపోయిన వాసనకు తోడు ఇది దాదాపు చేదుగా ఉండే వాసన కలిగి ఉంటుంది’ అని కూడా ఆయన చెప్పారు. యునిలాడ్ ప్రకారం, పియర్స్ వ్యోమగాముల నుంచి అంతరిక్షంలో ఉండే వాసన ఎలా ఉంటుందో తెలుసుకొని దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. వ్యోమగాములలో చాలా మంది అంతరిక్ష వాసనను ‘గన్‌పౌడర్, సీరెడ్ స్టీక్, కోరిందకాయలు, రమ్ కలయిక’ అని అభివర్ణించారు. (వైరల్‌గా మారిన సూర్యుడి వీడియో..) -
వాసనతోనే కడుపు నిండుతుందట!
వాషింగ్టన్: ఊబకాయం, బరువు పెరగడం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీంతో బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకుంటూ బతికేస్తున్నారు. నోరూరించే ఆహార పదార్థాలు కనిపించినప్పుడల్లా తినాలా? వద్దా? అంటూ వారిలో ఓ యుద్ధమే జరుగుతుంది. మానసికంగా బలవంతులైతే ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి తమను తాము నియంత్రించుకుంటారు. అదే బలహీనులైతే.. ‘ఈ ఒక్కసారికే..’ అని తమకుతాము సర్దిచెప్పుకొని లాగించేస్తారు. తీరా తిన్నాక మళ్లీ సమస్య మొదటికి వచ్చేసిందంటూ బాధపడతారు. అయితే ఇలాంటివారు ఇకపై అలా బాధపడాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. పిజ్జా, బర్గర్, బిర్యానీ వంటి కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినకూడని పరిస్థితిలో ఉంటే.. వాటిని తినకుండానే, తిన్నామనే సంతృప్తి పొందొచ్చని చెబుతున్నారు. ఓ రెండు నిమిషాలపాటు సదరు ఆహార పదార్థాల వాసన చూస్తే చాలట.. తిన్నామన్న సంతృప్తి కలుగుతుందని.. ఆ తర్వాత తీసుకునే ఆహారం ఏదైనా తక్కువగా ఆరగిస్తామని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఆహార పదార్థాల సువాసన వల్ల పూర్తి సంతృప్తి లభించి కడుపు నిండినట్లు అనిపించడమే దీనికి కారణమట. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. -
కాఫీ వాసన గుప్పుమంటే.. మెదడుకు చురుకు!
ఉదయాన్నే కాఫీ తాగితే రోజంతా చురుకుగా ఉంటామని కొందరు అంటూ ఉంటారు. దీని మాటేమిటోగానీ కాఫీ వాసన తగిలినా చాలు.. మీరు వేగంగా లెక్కలు వేసేస్తారు అంటోంది స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆశ్చర్యంగా అనిపిస్తోందా? వివరాలు తెలుసుకుందాం. జీమ్యాట్ పరీక్ష గురించి మీకు తెలిసే ఉంటుంది. బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి నిర్వహిస్తూంటారు దీన్ని. స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓ వంద మందికి పది ప్రశ్నలతో ఈ పరీక్ష పెట్టారు. విడదీసిన రెండు గుంపుల్లో ఒకదానికి మంచి కాఫీ వాసన వచ్చేలా చేశారు. ఇంకో గుంపులోని వ్యక్తులకు మామూలుగా పరీక్ష పెట్టారు. ఫలితాలను బేరీజు వేసినప్పుడు కాఫీ వాసన ఉన్న గదిలో పరీక్ష రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇదంతా కాఫీ వల్లనే జరిగిందా? అన్నది తెలుసుకునేందుకు ఇంకో 200 మందిపై నాలుగు దఫాలుగా సర్వే జరిపారు. చివరకు తేలింది ఏమిటి అంటే.. కాఫీ వాసన వచ్చినప్పుడు తాము మరింత అలర్ట్‌గా, చురుకుగా ఉండగలుగుతున్నామూ అని! మిగిలిన సువాసనలతో పోలిస్తే కాఫీ వాసన మెదడుకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవకాశమిస్తున్నాయని తెలిసింది. -
ముక్కుతోనే చిక్కు!
వంటలు ఘుమఘుమలాడుతుంటే ఎవరైనా రెండు ముద్దలు ఎక్కువ లాగించేస్తారు. దీంతో కొంచెం ఒళ్లు చేయడం సహజమే. అయితే మీకు వాసన పీల్చే శక్తి ఎక్కువగా ఉంటే చాలు.. మోతాదుగా ఆహారం తీసుకున్నా లావెక్కిపోతారని అంటున్నారు కాలిఫోర్నియా బర్క్లీ శాస్త్రవేత్తలు. ఘ్రాణశక్తి బాగా ఉన్న ఒక ఎలుకకు.. ఆ శక్తి అసలు లేని ఇంకో ఎలుకకు ఒకే రకమైన ఆహారం పెట్టారు. కొంతకాలానికి మొదటి ఎలుక బాగా లావెక్కిపోతే.. రెండోది ఉన్నది ఉన్నట్లుగానే ఉంది. దీంతో ఘ్రాణ శక్తిలేని ఎలుకకు వాసన పీల్చే శక్తిని కృత్రిమంగా పెంచి మరోసారి ప్రయోగం చేశారు. ఫలితం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వాసన శక్తి ఎక్కువగా ఉన్న ఎలుకలు మరింత లావెక్కిపోయాయి. దీన్ని బట్టి.. శరీరం స్వీకరించే కేలరీలతో ఏం చేయాలన్నది ఈ వాసనపై ఆధారపడి ఉంటుంది అని! వాసన రాకపోతే.. శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేస్తుంది.. ఎంత వాసన పసిగట్టే శక్తి ఉంటే అంత మేర ఎక్కువగా కేలరీలను శరీరంలో నిల్వ చేస్తుంది అనీ! ఇంకోలా చెప్పాలంటే.. వాసన ఎక్కువ వస్తే శరీరంలో కొవ్వు అంత ఎక్కువ పెరుగుతుందన్న మాట. జీవక్రియలను నియంత్రించే మెదడులోని హైపోథలమస్కూ.. వాసనలను గుర్తించే వ్యవస్థకూ మధ్య సంబంధాలు ఉండటం వల్లే ఇలా జరుగుతోందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న క్లైన్ రియారా అనే శాస్త్రవేత్త తెలిపారు. వయసు వల్ల, వ్యాధుల వల్ల, లేదా గాయాల వల్ల వాసన పీల్చే శక్తి తగ్గినప్పుడు మనం సన్నబడటానికి కారణం ఇదేనని చెబుతున్నారు. -
చేతులు కట్టుకుని శ్లోకాలు చెబితే చాలా!!
మానవీయం అనుష్ఠానబలంచేత జనన మరణ చక్రంనుండి విడుదల పొందడం అనేది వాసనాబలం ఉన్న మనుష్యజన్మలో మాత్రమే సాధ్యం. వాసనలలో అన్నివేళలా మంచివే ఉండవు. ఎన్ని మంచి గుణాలు ఉన్నా, ఒకొక్కదాంట్లో చెడు వాసన కూడా ఉంటుంది. వాసన అంటే ముక్కుతో పీల్చేదికాదు, గత జన్మలనుంచి తెచ్చుకున్న వాసనలలో ఒకటి. అన్నీ ఆయనకు ప్రీతే. కానీ ధనమునందు ఆయనకు విశేషమైన అపేక్ష. అప్పుడేమవుతుంది? ఆయన తనను తాను సంస్కరించుకోకపోతే’ జ్ఞానఖలునిలోని శారదయువోలె..’... అంటే మీరక్కడ తాంబూలం పెడితే తప్ప ఆయనేదీ చెప్పడు. మీరెంతిస్తారో చెబితే తప్ప ఆయన సభకు రాడు. అంటే అమ్ముకోవడానికి అదో వస్తువయింది. తాంబూలం పుచ్చుకుంటే తప్పేంలేదు. నాకింతిస్తేనే రామాయణం చెబుతానన్నాననుకోండి. అది చాలా ప్రమాదం. రామాయణం తెలుసు. డబ్బుకోసం తప్ప, రామాయణం ధర్మంకోసం కాకుండా పోయింది. ఇలా ఒక్క వాసన, మిగిలి ఉన్న మంచి గుణాలను పాడు చేసేస్తుంది. ఇది పోవాలంటే భగవంతుడిని శరణాగతి వేడుకోవాలి. లేదా మహాపురుషుల స్పర్శచేత కూడా పోతుంది.పెద్దలతో కలిసి తిరిగితే ఆ దోషం పోతుంది. ‘ఛీ! ఛీ! నేనిలా బతక్కూడదు...’ అనే బుద్ధి ఉండిపోతుంది. రామకృష్ణ పరమహంస ఏమంటారంటే... ‘‘ఏనుగు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు తొండం ఎత్తి ఒక జాజితీగ పీకుతుంది, ఓ చెట్టుకొమ్మను పట్టుకుని విరిచేస్తుంది. అలావెడుతూ పక్కన ఒక దుకాణంలోంచి ఒక అరటిపళ్ళ గెల ఎత్తి లోపల పడేసుకుంటుంది. అదే ఏనుగు పక్కన మావటివాడు అంకుశం పట్టుకుని నడుస్తూ పోతున్నాడనుకోండి. అదిలా తొండం ఎత్తినప్పుడల్లా అంకుశం చూపగానే దించేస్తుంది తప్ప దేనినీ పాడుచేయదు. అలాగే మహాపురుషులతో కలిసి తిరిగిన సాంగత్యబలంచేత నీలో ఉన్న వాసనాబలం పాడవకుండా రక్షింపబడుతుంది’’ అంటారు. ‘‘నేను ఫలానా గురువుగారి శిష్యుణ్ణి, అయన నడవడి ఎలా ఉంటుందో, ఆయనెలా ప్రవర్తిస్తారో తెలిసి నేనిలా ప్రవర్తించొచ్చా ! నేనిలా ఉండకూడదు, మార్పు చెందాలి’’అనుకొని దుష్కర్మలకు దూరంగా ఉండిపోతారు. చెడుబాట పట్టిన వాసనాబలం మహాత్ముల సంగమం చేత విరుగుతుంది. ఇది ఇతర ప్రాణులకు ఎక్కడుంటుంది? ఉండదు. ఒక మహాత్ముడి ఇంట్లో క్కు... సంగమం చేత ఏమయినా ప్రయోజనం లభిస్తుందా? త్రివేణీ సంగమంలో మొసలి... దానికేమయినా స్నానఫలితం వస్తుందా? ఎవడు కాలుపెడతాడా లాగేద్దామని చూస్తుంటుంది. సంగమం ప్రయోజనం వాటికుండదు. ఒక్క మనుష్యప్రాణికే ఉంటుంది. తరించగలడు, వాసనాబలాన్ని పోగొట్టుకోగలడు. ఆవుదూడ నోటికి చిక్కం వేస్తారు. ఎందుకని? రుచి. మట్టి తింటుంది. మట్టి తింటే కడుపులో ఎలికపాములు పెరిగి దూడ చనిపోతుంది. అందుకే చిక్కం. రుచి, వాసన-ఈ రెండింటినీ చంపగలవాడు భగవంతుడు. ఆ పరమాత్మ పాదాలను పట్టుకుని ‘‘ఈశ్వరా ! నేను ఈ దుర్గుణాల నుంచి బయటపడలేకపోతున్నాను’’ అని త్రికరణశుద్ధిగా ఎవడు మనసువిప్పి చెప్పుకుంటాడో వాడిని ఆ దుర్గుణం నుంచి పెకైత్తుతాడు. అలా చెప్పుకోవడం శరణాగతి తప్ప ఊరికే చేతులు కట్టుకుని శ్లోకాలు చెప్పడం శరణాగతి కాదు. మనసు అప్పటికప్పుడు లొంగినట్లుంటుంది. అప్పటికప్పుడే తిరగబడుతుంటుంది. ‘‘పాసీపాయదు పుత్రమిత్రజనసంపద్భ్రాంతి వాంఛాలతల్, కోసీకోయదు నామనంబకట నీకుంబ్రీతిగా సత్క్రియల్ చేసీచేయదు దీని తృళ్ళణపడవే శ్రీకాళహస్తీశ్వరా!’’అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. పుత్రజనం, మిత్రజనం, సంపదలు వీటి పట్ల మనసు ప్రీతిని పూర్తిగా వదలడం లేదు. ఆ కోరికలను పూర్తిగా కోసివేయడం లేదు. దీన్ని త్రుళ్ళు అణచవయ్యా. దీనిని నీవే లొంగదీసుకోవయ్యా. నేను సక్రమ మార్గంలో ఉండేటట్లు చేయి’’ అని ధూర్జటి వేడుకున్నాడు. దేవాలయం దగ్గర ఆయనెవరో వచ్చారట. ఉపన్యాసం వినడానికి వెడదాం అని ఉత్సాహపడి అప్పటికి లొంగి ఉన్నట్లు కనబడే మనసే, ఆయనకేం వస్తాడు పనాపాటా... హాయిగా ఇంటికెళ్ళి టీవి చూద్దాం పద... అని అప్పటికప్పుడే తిరగబడుతుంది. తుంటరి ఏనుగును మావటి లొంగదీసుకున్నట్లే, నా వశపడని ఈ మనసును నీవే దారిలో పెట్టు భగవాన్... అంటూ అటువంటి శరణాగతి చేసి వాసనాబలంనుండి పైకి వస్తాడు అంటే ఈశ్వరుని అనుగ్రహంచేత తన దుర్గుణాలను పోగొట్టుకునేటట్టు చేసే ప్రార్థనకు శరణాగతి అని పేరు. అటువంటి శరణాగతి చేసి వాసనాబలం నుండి విముక్తిపొందుతాడు, లేదా సాధనచేత పొందుతాడు. ‘అరే, నేనెందుకు చేయాలి ఇటువంటి పని. ఎంతోమంది ఇలా చేసి పాడైపోయారు. గురువుగారు చెప్పిన ఒక్క మాట చాలు’ అనుకుని మారిపోవాలన్న ఆర్ద్రత మనసులో కలగాలి. ఒక్కసారి కలిగిందా... ఆ మార్పు వచ్చేస్తుంది. భూమిలో తడి ఉందా... అందులో వేపగింజ వేసావా, జామగింజ వేసావా, మామిడి టెంక వేసావా... సంబంధం ఉండదు. మొక్క వచ్చేస్తుంది. ఒక వేళ అది రాతినేల అనుకోండి, అందులో ఏ గింజవేసినా అంకురం రాదు. మేకు తీసుకెళ్ళి ఇనుపదూలంలో కొట్టారనుకోండి. మేకు వంగిపోతుంది తప్ప, దిగదు. అదే గోడకు గుల్లతనం ఉంటే మేకు దిగుతుంది. మనసులో ఆర్ద్రత ఉన్నప్పుడు గురువుగారి ఒక్కమాట చాలు, జీవితం మారిపోవడానికి. అందుకు భగవాన్ రమణులు అంటుంటారు. అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తుంటాయి. వాటికి ప్రాధాన్యతేం ఉంటుంది. అది అడవికాబట్టి అరుస్తాయి. సింహం వచ్చి ఒక్కసారి గర్జన చేసిందా... అంతే మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి. అన్ని జంతువులు పారిపోవడానికి సింహగర్జన ఎలా పనిచేస్తుందో, ఒక్క గురువుగారి మాట మనలోని దుర్గుణాలను పార్రదోలడానికి అలా పనికి వస్తుంది. మనలో మార్పునకు కారణం అవుతుంది. తుంటరి ఏనుగును మావటి లొంగదీసుకున్నట్లే, నా వశపడని ఈ మనసును నీవే దారిలో పెట్టు భగవాన్... అంటూ అటువంటి శరణాగతి చేసి వాసనాబలంనుండి పైకి వస్తాడు అంటే ఈశ్వరుని అనుగ్రహంచేత తన దుర్గుణాలను పోగొట్టుకునేటట్టు చేసే ప్రార్థనకు శరణాగతి అని పేరు. అటువంటి శరణాగతి చేసి వాసనాబలం నుండి విముక్తిపొందుతాడు, లేదా సాధనచేత పొందుతాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే...
ఇంటిప్స్ ♦ బాత్రూమ్ నుంచి వదలకుండా దుర్వాసన వస్తుంటే... బాత్రూమ్లో రెండు మూడు ఆగ్గిపుల్లలను వెలిగించి ఆర్పేయండి. కాసేపటికి ఆ వాసన పోతుంది. ♦ పాలు కాచినప్పుడు గిన్నె అడుగున అంటుకుంటూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే పాలను తడి గిన్నెలో వేసి స్టౌ మీద పెట్టాలి. లేదంటే ముందు నీళ్లు పోసి, తర్వాత పాలు పోయాలి. ♦ అరిగి మిగిలిపోయిన సబ్బు ముక్కలను ఓ గిన్నెలో వేసి, వాటిపై కొద్దిగా గ్లిజరిన్‌ను నీటిని పోయాలి. కాసేపటికి సబ్బు కరిగిపోతుంది. అప్పుడా లిక్విడ్‌ని బాటిల్లో వేసి పెట్టుకుంటే హ్యాండ్‌వాష్‌లా వాడుకోవచ్చు. ♦ అద్దాలు, గాజు వస్తువులు కిందపడి పగిలినప్పుడు ఎంత శుభ్రం చేసినా కంటికి కనిపించనంత చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడా ఉండిపోతాయి. వాటిని శుభ్రం చేయాలంటే... బ్రెడ్ సై్లస్తో ఆ ప్రాంతమంతా అద్దాలి. అప్పుడా ముక్కలు వాటికి అంటుకుంటాయి. ♦ పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే... వాటిని ఓ బ్రౌన్ బ్యాగ్‌లో వేసి గాలి, వెలుతురు తగలని చోట ఉంచాలి. -
అదే పనిగా తుమ్ములు... తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కు బిగుసుకున్నట్లుగా ఉండటం, వాసనలు గ్రహించలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. నేను చాలా మంది వైద్యులను సంప్రదించాను. సమస్య తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. కాబట్టి హోమియోలో దీనికి పరిష్కారం చెప్పగలరు. - నరసింహారావు, కర్నూలు మీరు చెబుతున్న సమస్య ఈ రోజుల్లో చాలా మందిని బాధిస్తోంది. దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో వేరే సమస్యలు (దుమ్ము, పుప్పొడి, ఘాటు వాసనలు) తగిలి ముక్కుల్లోని పొరలు ఉబ్బి, ఈ సమస్య మొదలువుతుంది. ఇది అలర్జీ వల్ల జరుగుతుంద. అలర్జి సమయంలో శరీరంలో హిస్టమైన్స్ విడుదల అవుతాయి. దీనివల్ల ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయిపోయి, పొరలు కూడా ఉబ్బి ఆగకుండా తుమ్ములు, ముక్కు వెంట నీరు కారడం మొదలువుతుంది. తర్వాత ముక్కు బిగుసుకుపోవడం జరుగుతుంది. ఈ దశలోనే చికిత్స తీసుకోవడం మంచిది. కారణాలు : ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం, కొంతమందిలో ముక్కు దూలం, రంధ్రాల మధ్య గోడ కాస్త వంకరంగా ఉండటం కొన్ని కారణాలు. ఇవి మాత్రమే గాక చాలా అంశాలు ఈ సమస్యకు దారితీస్తాయి. లక్షణాలు : ఆగకుండా విపరీతంగా తుమ్ములు రావడం ముక్కుకారడం ముక్కు బిగదీసుకుపోయినట్లుగా అనిపించడం ముక్కులో మొదలైన అలర్జీ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి రావచ్చు. ముక్కులోని పొరలు ఉబ్బటం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్య మెల్లమెల్లగా అధికమై మున్ముందు సైనసైటిస్, ముక్కులో కండపెరగడం, ఘ్రాణశక్తి తగ్గిపోవడం వంటి పెద్దపెద్ద సమస్యలు రావడానికి అవకాశం ఉంది. నిర్ధారణ : వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం, ఎక్స్‌రే, సీటీ స్కాన్ నివారణ : అలర్జీలు కలిగించే అంశాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం సరైన పోషకాహారం తీసుకోవడం చల్లని వాతావరణానికి దూరంగా ఉండటం పొగతాగే అలవాటును మానేయడం. చికిత్స: రోగి స్వభావాలను బట్టి తగిన కాన్స్టిట్యూషనల్ చికిత్స అదించడం ద్వారా రోగనిరోధకశక్తిని క్రమంగా పెంచుతూ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ ఫిట్స్ అదుపులోకి వచ్చేదెలా..? నా వయసు 25 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా మూర్చ వ్యాధి (ఫిట్స్)తో బాధపడుతున్నాను. ఉదయం నిద్రలేవగానే ఎక్కువగా ఉలిక్కిపడుతున్నాను. చేతిలోని వస్తువులు కింద పడిపోతున్నాయి. కాళ్లు, చేతులు కొట్టుకుంటూ స్పృహతప్పి పడిపోతాను. మా అమ్మకు కూడా ఇలాగే ఉండేదట. తల స్కానింగ్ చేసి బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపించండి. - సుందర్, నల్లగొండ మీరు చెబుతున్న అంశాలను బట్టి జువెనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది జన్యుపరమైన కారణాల వల్ల వంశపారంపర్యంగా వస్తుంది. మీరు ఈఈజీ అనే పరీక్ష చేయించుకోవాలి. దానితో జబ్బు తీవ్రత తెలుస్తుంది. తర్వాత వాల్ప్రొయేట్ అనే మందులు వాడటం ద్వారా ఫిట్స్‌ను కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అయితే ఈ మందులు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. నా వయసు 30 ఏళ్లు. గత రెండు నెలలో మూడు సార్లు ఫిట్స్ వచ్చాయి. కొంచెం తలనొప్పిగా ఉంటోంది. మా ఊళ్లో డాక్టర్‌ను కలిసి మందులు తీసుకున్నాను. ఆ మందులు వాడాక కూడాఫిట్స్ వచ్చాయి. అవి తగ్గడానికి ఏం చేయాలి? - సుభాష్, జడ్చర్ల మీరు ఒకసారి సీటీ స్కాన్ చేయించుకోవాలి. ఒక్కోసారి మన కడుపులో ఉండే నులిపురుగులు మెదడులోకి ప్రవేశించి ఫిట్స్ రావడానికి కారణమవుతాయి. దీనికి రెండు వారాల నుంచి నాలుగు వారాల వరకు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. మీ ఫిట్స్ మందులు కూడా మార్చాల్సి రావచ్చు. మీ స్కానింగ్ రిపోర్ట్‌ల ఆధారంగా మందులు ఎన్నాౠఉ్ల వాడాలనేది చెప్పవచ్చు. మీకు మద్యం తీసుకునే అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి. నా వయసు 60 ఏళ్లు. పక్షవాతం వచ్చి నాలుగేళ్లు అయ్యింది. అయితే గత నెల రోజులుగా నాలుగుసార్లు ఫిట్స్ వచ్చాయి. డాక్టర్‌కు చూపిసుఏ్త పెద్దాసుపత్రికి వెళ్లమని చెప్పారు. నాకు సరైన సలహా ఇవ్వండి. - సుదర్శన్‌రావు, వరంగల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ఇస్కిమిక్ సీజర్స్‌తో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. పక్షవాతం వచ్చినవారిలో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంద. మీరు సీటీస్కాన్, ఈఈజీ ద్వారా ఫిట్స్‌ను తగ్గించవచ్చు. మీరు ఈ మందులను కనీసం మూడేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమంది జీవితాంతం కూడా మందులు వాడాల్సి రావచ్చు. నాకు ఇరవైఏళ్లు. గత పదేళ్లుగా ఫిట్స్ వస్తున్నాయి. అవి వచ్చే ముందు పిచ్చిచేష్టలు, వెకిలినవ్వులు చేస్తుంటానని చూసినవాళ్లు చెప్పారు. నాకైతే అవేమీ తెలియదు. దీనివల్ల నేను పనికి కూడా వెళ్లలేకపోతున్నాను. సరైన సలహా ఇవ్వండి. - కిశోర్, మంచిర్యాల మీరు టెంపోరల్ ఎపిలెప్సీ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జబ్బుకు ఇప్పుడు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. సరైన మోతాదులో మందులు వాడటం వల్ల జబ్బు తగ్గుతుంది. దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌కు చూపించండి. ఒకవేళ మందులతో జబ్బు తగ్గకపోతే ఆపరేషన్ ద్వారా కూడా ఫిట్స్‌ను నియంత్రించవచ్చు. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్ -
వాసన మాయం సబ్బు శాశ్వతం
చేపల కూరను చాలామంది ఇష్టపడతారు. అది ఎంత రుచిగా ఉంటుందో.. వాటిని శుభ్రం చేశాక మన చేతులు అదే రేంజ్లో వాసన వేస్తాయి. ఎన్ని రకాల సబ్బులు వాడినా ఒక పట్టాన వాసన వదలదు... అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఆ కోవకే వస్తాయి. ఆ సమస్య నుంచి మనల్ని బయట పడేసేందుకు వచ్చిందే ఈ ‘రబ్ అవే బార్’.. ఇది అరగదు.. తరగదు.. కానీ మీ చేతులను శుభ్రంగా, ఎలాంటి వాసనలు లేకుండా చేస్తుంది. దీన్ని స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు. చల్లటి నీటి కింద ఈ బార్‌తో చేతులు కడుక్కుంటే చాలు. ఈ రబ్ అవే బార్‌కు, కూల్ వాటర్‌కు మధ్య జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల వాసనలు దూరమవుతాయట. ఇదేదో బాగుంది కదూ... ఒక్కసారి కొనేస్తే సరి. ఎన్ని రోజులైనా దీన్ని హాయిగా వాడుకోవచ్చు. ఇవి వివిధ రకాల షేపుల్లో, సైజుల్లో దొరుకుతున్నాయి. -
మరణిస్తే వాసన ఎందుకు?
మనిషి బతికున్నపుడు అనేక సెంట్లు, ఫెర్ఫ్యూములు వాడతాడు. కానీ, చనిపోగానే దుర్గంధం రావడం మొదలవుతుంది. దీనికి కారణం ఏంటంటే? శరీరంలో ఉండే బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలు సూక్ష్మ జీవులు. ఇవి పరపోషితాలు. ఇతర జీవులపై ఆధారపడి జీవనం సాగిస్తాయి. మనిషి బతికి ఉన్నంత కాలం మనిషిలో చేరి మన శరీరంలోని ఆహార పదార్థాలని తింటూ జీవిస్తాయి. బ్యాక్టీరియాలు మనిషిలోని ఆహార పదార్థాలను వాటికనుకూలంగా మార్పు చేసుకుని తింటాయి. ఈక్రమంలో కొన్ని రకాల రసాయనాలు కూడా విడుదలవుతాయి. మనిషి బతికి ఉన్నపుడు ఎలాంటి రసాయనాలు విడుదలైనా మనలో ఉండే రక్షణ వ్యవస్థ వాటిని ఎప్పటికప్పుడు నిర్మూలిస్తుంది. కానీ, మరణించాక రక్షణ వ్యవస్థ పనిచేయదు. దీనివల్ల బ్యాక్టీరియాలు శరీరంలో వివిధ రకాల రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో దుర్గంధం బయటికి వస్తుంది. అందుకే మనిషి లేదా జంతువులు మరణించినపుడు దుర్వాసన వస్తుంటుంది. -
ఇంటిప్స్
వేయించేటప్పుడు పచ్చి, పండు మిరపకాయలు చిటపటలాడి నూనె ఎగరి పడకూడదంటే... మిరపకాయలకు చిన్నగా గాట్లు పెట్టాలి.బట్టలపై ముడతలు ఎక్కువగా ఉంటే... ఇస్త్రీ చేసేటప్పుడు బట్ట అడుగున అల్యూమినియం ఫాయిల్ పెట్టండి. దానికి వేడిని రిఫ్లెక్ట్ చేసే గుణం ఉండటం వల్ల కింద నుంచి కూడా మంచి వేడి తగిలి ముడతలు తేలికగా పోతాయి.గసగసాలను కాసేపు నానబెట్టి రుబ్బితే ముద్ద మెత్తగా, మృదువుగా ఉంటుంది. బట్టలపై మైనపు మరకలు పడినప్పుడు వాటిపై కొద్దిగా వెజిటబుల్ ఆయిల్ వేసి నానబెట్టి, తర్వాత ఉతికితే పోతాయి.చేపలు శుభ్రం చేశాక నీచు వాసన చేతుల్ని, ఇంటికి కూడా త్వరగా వదలదు. అలా వాసన అంటకుండా ఉండాలంటే... ముందుగా చేపల్ని కాసేపు ఉప్పునీటిలో నానబెట్టి, తర్వాత శుభ్రం చేస్తే సరి.