వేలిముద్రలు.. కనుపాపల స్కానింగ్.. ఫేస్ రికగ్నిషన్.. ఇవన్నీ అత్యంత భద్రమైన ‘పాస్‌వర్డ్’లు.. వ్యక్తుల ‘గుర్తింపు’ కోసం ఉపయోగించే పద్ధతులు. తాజాగా ఈ జాబితాలోకి మన శరీరం వాసన కూడా చేరింది.
న్యూయార్క్: వేలిముద్రలు.. కనుపాపల స్కానింగ్.. ఫేస్ రికగ్నిషన్.. ఇవన్నీ అత్యంత భద్రమైన ‘పాస్‌వర్డ్’లు.. వ్యక్తుల ‘గుర్తింపు’ కోసం ఉపయోగించే పద్ధతులు. తాజాగా ఈ జాబితాలోకి మన శరీరం వాసన కూడా చేరింది. శారీరక లక్షణాల కారణంగా ప్రపంచంలోని వ్యక్తులందరికీ.. ఎవరిది వారికే ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దాని ఆధారంగా పనిచేసే ప్రత్యేకమైన పరికరాలను స్పెయిన్‌కు చెందిన డి మాడ్రిడ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ పరికరాలు 85 శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నాయని వారు చెబుతున్నారు.