పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే...
ఇంటిప్స్
♦ బాత్రూమ్ నుంచి వదలకుండా దుర్వాసన వస్తుంటే... బాత్రూమ్‌లో రెండు మూడు ఆగ్గిపుల్లలను వెలిగించి ఆర్పేయండి. కాసేపటికి ఆ వాసన పోతుంది.
♦ పాలు కాచినప్పుడు గిన్నె అడుగున అంటుకుంటూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే పాలను తడి గిన్నెలో వేసి స్టౌ మీద పెట్టాలి. లేదంటే ముందు నీళ్లు పోసి, తర్వాత పాలు పోయాలి.
♦ అరిగి మిగిలిపోయిన సబ్బు ముక్కలను ఓ గిన్నెలో వేసి, వాటిపై కొద్దిగా గ్లిజరిన్‌ను నీటిని పోయాలి. కాసేపటికి సబ్బు కరిగిపోతుంది. అప్పుడా లిక్విడ్‌ని బాటిల్‌లో వేసి పెట్టుకుంటే హ్యాండ్‌వాష్‌లా వాడుకోవచ్చు.
♦ అద్దాలు, గాజు వస్తువులు కిందపడి పగిలినప్పుడు ఎంత శుభ్రం చేసినా కంటికి కనిపించనంత చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడా ఉండిపోతాయి. వాటిని శుభ్రం చేయాలంటే... బ్రెడ్ సై్‌లస్‌తో ఆ ప్రాంతమంతా అద్దాలి. అప్పుడా ముక్కలు వాటికి అంటుకుంటాయి.
♦ పచ్చి టొమాటోలు త్వరగా పండాలంటే... వాటిని ఓ బ్రౌన్ బ్యాగ్‌లో వేసి గాలి, వెలుతురు తగలని చోట ఉంచాలి.