పారిస్: మహమ్మారి కరోనా బారినపడి కోలుకుంటున్నవారికి ఓ చేదు వార్త. వైరస్‌ను జయించినవారిలో కొందరు అతిముఖ్యమైన వాసన గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశముందని ఫ్రాన్స్‌కు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. జీవితంలో కీలకమైన వాసన చూసే శక్తి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అనోస్మి.ఆర్గ్ అధ్యయనానికి నేతృత్వం వహించిన జేన్ మైఖేల్ మైలార్డ్ పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలలో వాసన గ్రహించలేకపోవడం ఒకటని తెలిసిందే. అయితే, అనోస్మియా (వాసన గ్రహించలేకపోవడం) నెల, రెణ్నెళ్లపాటు ఉంటే ఫరవాలేదని మైలార్డ్ చెప్పారు. కానీ, ఆరు నెలలపైబడి అనోస్మియాతో బాధపడుతుంటే.. తిరిగి మామూలు స్థితికి రావడం కష్టమేనని మైలార్డ్ వెల్లడించారు. (చదవండి: భయపెట్టే వార్త చెప్పిన చైనా!)
మాతృత్వాన్ని దగ్గించుకున్న ఓ మహిళ.. తన నవజాత శిశువు లేలేత బుగ్గల వాసన చూడలేకపోవం ఇబ్బందే కదా అని ఆయన అన్నారు. ఉదయం లేచి కాఫీ వాసన చూడకపోతే ఆ అనుభూతి కోల్పోయినట్టే కదా అని చెప్పుకొచ్చారు. అనోస్మియాతో ప్రమాదాలూ ఉన్నాయని హెచ్చరించారు. గ్యాస్ లీకేజీ సమయంలో, మంటలు అంటుకున్నప్పుడు, దుర్గంధం కనిపెట్టలేకపోవడం ఇవన్నీ ఇబ్బందులేనని చెప్పారు. ఇక కమ్మనైనా ఆహారాన్ని దాని రుచికంటే ముందుగా వాసనతోనే అంచనావేస్తామని అన్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఇతరుల సహాయంపై ఆధారాపడాల్సిందేని మైలార్డ్ వెల్లడించారు. కాగా, కరోనా కారణంగా ముక్కు లోపలి సున్నితమైన న్యూరాన్లు ప్రభావితమై అనోస్మియాకు దారితీస్తుందని పారిస్‌లో చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్టు అలెన్ కోరే చెప్పారు. అయితే, ఈ న్యూరాన్లు తిరిగి ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. (గల్వాన్ లోయలో కీలక పరిణామం)
Comments
Please login to add a commentAdd a comment