వాసన కోల్పోవడానికి ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో ముందుగానే సంకేతం ఇస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇది ఒకరకంగా ఘ్రాణ శక్తి ప్రాధాన్యతను హైలెట్ చేసింది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో మన ముక్కు పనితీరు చాలా కీలకమని వెల్లడయ్యింది.
ఈ కొత్త అధ్యయనం వాసనం కోల్పోవడాన్ని ఏకంగా 140 వైద్య పరిస్థితుల ద్వారా ముందుగానే హెచ్చరిస్తుందని పేర్కొంది. అది వృద్ధాప్యం, మోనోపాజ్, నరాలు, శారీరక వ్యాధుల రూపంలో సంకేతమిస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది ఫ్రాంటియర్స్ ఇన్ మాలిక్యులర్ న్యూరోసైన్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యింది.
అంతేగాదు రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన కూడా దీనిపై ఆదారపడి ఉంటుందట. మంచి ఘ్రాణ శక్తి ఉంటే వారికి అపారమైన జ్ఞాపక శక్తి ఉందని అర్థమట. అంతేగాదు ఆహ్లదకరమైన సువాసనలు మెదడు ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయట. ఘ్రాణ శక్తిని కోల్పోతున్నట్లుగా ముందుగానే దాదాపు 139 వ్యాధుల రూపంలో తెలియజేస్తుందట.
అందువల్ల ముందుగా ఈ ఘ్రాణ శక్తికి మంచి చికిత్సను అందిస్తే ఆ 140 రకాల వ్యాధులు రాకుండా నివారించొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఈ పరిశోధనలో కొన్ని కాంప్లీకేషన్స్ కూడా ఉన్నాయని అన్నారు. ఇక ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తల బృందం పలువురిపై అధ్యయనం చేయగా చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఏకంగా 9 వేల మంది సుదీర్ఘ కోవిడ్ కారణంగా వాసన కోల్పోగా, దాదాపు మూడు వేల మందికి పైగా మోనోపాజ్ వల్ల వాసనను కోల్పోయారు. మరో మూడు వేలమంది డిప్రెషన్ కారణంగా ఘ్రాణ శక్తిని కోల్పోయారు. అంతేగాదు ఈ వాసన కోల్పోవడానికి పర్యావరణ కారకాలు కూడా కొంత కారణమని వైద్యులు చెబుతున్నారు.
ముందుగానే వివిధ రకాల వ్యాధుల రూపంలో సంకేతం ఇచ్చినప్పుడే.. ఘ్రాణ శక్తికి సత్వరమే మంచి చికిత్స ఇస్తే ఎలాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండదని చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం వాసన ప్రాముఖ్యతను తెలియజేయడమే గాక భవిష్యత్తులో చేసే మరిన్ని పరిశోధనలకు ఇది పునాదిగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పరిశోధకులు.
(చదవండి: ఇలాంటి క్రేజీ గ్రౌండ్‌ఫ్రిడ్జ్‌ని చూశారా..? కరెంట్‌తో పని లేకుండానే..)
Comments
Please login to add a commentAdd a comment