ఇంటిప్స్
వేయించేటప్పుడు పచ్చి, పండు మిరపకాయలు చిటపటలాడి నూనె ఎగరి పడకూడదంటే... మిరపకాయలకు చిన్నగా గాట్లు పెట్టాలి.బట్టలపై ముడతలు ఎక్కువగా ఉంటే... ఇస్త్రీ చేసేటప్పుడు బట్ట అడుగున అల్యూమినియం ఫాయిల్ పెట్టండి. దానికి వేడిని రిఫ్లెక్ట్ చేసే గుణం ఉండటం వల్ల కింద నుంచి కూడా మంచి వేడి తగిలి ముడతలు తేలికగా పోతాయి.గసగసాలను కాసేపు నానబెట్టి రుబ్బితే ముద్ద మెత్తగా, మృదువుగా ఉంటుంది.
బట్టలపై మైనపు మరకలు పడినప్పుడు వాటిపై కొద్దిగా వెజిటబుల్ ఆయిల్ వేసి నానబెట్టి, తర్వాత ఉతికితే పోతాయి.చేపలు శుభ్రం చేశాక నీచు వాసన చేతుల్ని, ఇంటికి కూడా త్వరగా వదలదు. అలా వాసన అంటకుండా ఉండాలంటే... ముందుగా చేపల్ని కాసేపు ఉప్పునీటిలో నానబెట్టి, తర్వాత శుభ్రం చేస్తే సరి.