Stains
-
బట్టలపై మరకలు పడ్డాయా? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి
బట్టలపై మరకలు పడ్డప్పుడు డ్రై క్లీనింగ్‌కి ఇద్దామంటే ఆ ధరకు కొత్తదే వస్తుందమే అనిపిస్తుంది. అయితే మరకలను తొలగించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేమిటో చూద్దాం. ►మీ దుస్తులు మెరిసేలా చేయాలంటే ఆస్పిరిన్ మాత్రలు బాగా ఉపయోగపడతాయి. ఆస్పిరిన్‌లో ఉండే ఎసిటైల్సాలిసిలిక్ ఆమ్లం బట్టలపై పడిన మరకలను తొలగించేందుకు సాయం చేస్తుంది. ►తెల్లని దుస్తులను నాలుగైదు ఆస్పిరిన్ టాబ్లెట్లు వేసిన నీళ్ల బకెట్లో బాగా నానబెట్టండి. తరవాత బట్టల సబ్బుతో ఉతకడమో లేదా వాషింగ్ మెషీన్లో వేసి మామూలుగా ఉతికి జాడించి ఆరేస్తే సరి! ► రక్తపు మరకలను తొలగించడానికి.. ఆస్పిరిన్‌ను చల్లటి నీటిలో కరిగించి బట్టలను నానబెట్టండి. వేడినీటితో రక్తపు మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. ఇది ప్రోటీన్లు గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఆ తరువాత మరకను తొలగించడం కష్టం అవుతుంది. చేస్తుంది. ► నూనె, గ్రీజు మరకలకు.. ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోయాలి. ఒక ముక్క మీద ఉప్పు వేసి మరకపై రుద్దాలి. ఇది నిమిషాల్లో బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది. ► వక్కపొడి, పాన్ మసాలా మరకలు పెరుగు లేదా మజ్జిగను మరక పడ్డ చోట ఉంచి పది నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన నీటితో వస్త్రాన్ని కడగాలి. ఇది బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది. ► టీ–కాఫీ మరకలు టీ–కాఫీ మరకలు పడ్డప్పుడు ముందుగా గోరువెచ్చటి నీటిలో ఆ వస్త్రాన్ని పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత లిక్విడ్ డిటర్జెంట్‌లో నానబెట్టాలి. తర్వాత మరక పడ్డ చోట చేతితో రుద్దితే మరకలు తొలగుతాయి. ► టర్కీ టవళ్లు, దుప్పట్ల వంటి వాటిని బట్టలుతికే సోడా కలిపిన నీటిలో నానబెట్టి ఉతికితే త్వరగా శుభ్ర పడతాయి. -
అతీక్ అహ్మద్ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు?
లక్నో: ఇటీవల దారుణ హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్‌కు చెందిన కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు కన్పించడం చర్చనీయాంశమైంది. ఈ ఆఫీస్‌ను అధికారులు పాక్షికంగా కూల్చారు. అయితే కార్యాలయం లోపల రక్తపు మరకలు, ఓ తెల్లటి వస్త్రం కన్పించడం చూసి షాకయ్యారు. అక్కడే ఓ కత్తి కూడా లభించింది. దీంతో ఈ రక్తపు మరకలు ఎవరివై ఉంటాయని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ టీంను రప్పించారు. వారు నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు. అతీక్ అహ్మద్‌కు చెందిన ఈ ఆఫీస్ ప్రయాగ్‌రాజ్‌లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కర్బాల ప్రాంతంలో ఉంది. ఈ కార్యాలయం ఆవరణలోనే 10 అక్రమ ఆయుధాలతో పాటు రూ.74.62 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లోని ఓ హోటల్లో.. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సుశీల్ కుమార్ సింగ్ మృతదేహాన్నిగుర్తించడం కలకలం రేపింది. పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేసుకున్నాడా అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. కాగా.. అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా ముందే ముగ్గరు యువకులు వీరిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
హర్ట్ చేయకండి
ఎప్పుడూ కనిపించే అమ్మాయి కూడా దుపట్టా మార్చగానే కొత్తగా కనిపిస్తుంది! దుపట్టాలోని విశేషమే అది. అయితే, మీరెంతో ఇష్టపడే దుపట్టాపై టమాటో సాసో, గ్రేవీనో, చాక్లెట్ మరకో పడితే వాటిని తేలిగ్గా తొలగించే ఉపాయాలు కూడా తెలిసుండాలి. అప్పుడే మీ దుపట్టా కొంచెం కూడా హర్ట్ అవకుండా మీరు ఆ మరకల్ని తొలగించుకోగలరు. కాటన్ దుపట్టాపై మరక పడితే: ఓ కప్పు గోరు వెచ్చని నీళ్లలో రెండు టేబుల్ స్ఫూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలియదిప్పండి. ఈ నీళ్లను దుపట్టాపై మరక పడిన చోట పోయండి. పదిహేను నిముషాలు ఆగాక చల్లటి నీటితో కడిగేయండి. అంతే. మరక మాయం! సిల్క్ దుపట్టాపై మరక పడితే: మరక పడిన చోట మొదట కొన్ని చుక్కల నీళ్లు పొయ్యండి. (చన్నీళ్లే). తర్వాత నిమ్మకాయను సగానికి కోసి, ఒక చెక్కతో మృదువుగా మరకపై రుద్దండి. తర్వాత ఎప్పటిలా ఉతికేయండి. అయితే అందుకు మీరు ఉపయోగించే బట్టల సబ్బు, లేదా పౌడర్ మరీ శక్తిమంతమైనది కాకుండా ఉండాలి. లేదా అది సిల్క్ దుస్తుల కోసమే తయారు చేసిన సబ్బు గానీ పౌడరు గానీ అయి ఉండాలి. నెట్ దుపట్టాపై మరక పడితే: ఒక పాత్రలోకి ఒక కప్పు చల్లటి నీటిని, ఒక టీ స్పూను (టేబుల్ స్పూను కాదు. గుర్తుంచుకోండి) తేలికపాటి డిటర్జెంట్ పౌడర్‌ను వేసి కలపండి. ఆ మిశ్రమాన్ని దుపట్టాపై మరకపడిన చోట పోసి, వలయాకారంలో వేళ్లతో మృదువుగా రుద్దండి. మామూలుగానే మృదువుగా రుద్దాలి. ఇది నెట్ క్లాత్ కనుక మరి కాస్త మృదువుగా రుద్దాలి. టీ మరకలను, జ్యూస్ మరకలను కూడా ఈ మిశ్రమం పోగొడుతుంది. -
మరకా? మరేం పర్వాలేదు
కొన్ని క్షణాలు తర్జనభర్జన పడి, ధైర్యంగా లేచి నిల్చుని సెల్యూట్ కొట్టారు మంజీత. అంత వరకు బాగానే ఉంది. ఆమె వెనుక చాలామంది అధికారులు ఉన్నారు. ఆమె కదిలితేనే గానీ వాళ్లు కదలడానికి లేదు. లేస్తే వాళ్ల కంట్లో మరక పడుతుంది. ఇదీ ఆమె సంకోచం. గోడలపై మరకలు ఉంటాయి. రోడ్లపై మరకలు ఉంటాయి. వాహనాలపై మరకలు ఉంటాయి. మరకలేని చోటు ప్రపంచంలో ఎక్కడా లేదు. అవన్నీ మనం పట్టించుకోం. అసలు మరక ఉన్నట్లుగానే గుర్తించం. అదే మరక ఒక మహిళ బట్టల మీద ఉంటే? ఆ మరకనూ మనం పట్టించుకోకపోవచ్చు.. కానీ ఆ మహిళ పట్టించుకుంటుంది. ఎవరైనా చూస్తున్నారేమోనన్న అనుమానంతో ఆమె కదలికలు ఇబ్బందిగా మారతాయి. అందులో ఆమె తప్పులేదు. ఆమె దేహధర్మం.. ఆమెకు అంటించిన మరక అది. నలుగురిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పైకి కనిపించిన ఆ మర క ఆమెను నిలువెల్లా బిడియంతో కుంగిపోయేలా చేస్తుంది. ఆ క్షణంలో అక్కడి నుంచి తన మాయం అయిపోతే ఎంత బాగుండు అని కూడా అనుకుంటుంది. అహ్మదాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మంజీతకు కూడా ఇటీవల ఇలాంటి అనుభవమే ఎదురైంది. యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఆమె. ఆ రోజు అహ్మదాబాద్‌లో నేరాలపై పోలీసు అధికారుల సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఆ సదస్సు జరిగింది. మంజీత యూనిఫామ్‌లో ఉన్నారు. కుర్చీలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ఆమె నెలసరి వచ్చినట్లు అర్థమైంది. పైగా అక్కడ తను ఒక్కరే మహిళా అధికారి. చుట్టూ అంతా పురుషులు. పైకి లేవాలన్నా ఇబ్బంది, అక్కడి నుంచి వెళ్లాలన్నా ఇబ్బందే. సాయంత్రం సదస్సు పూర్తయ్యేవరకు అలాగే కూర్చొని ఉన్నారు మంజీత. ప్రొటోకాల్ ప్రకారం పై అధికారికి సెల్యూట్ చేసే వంతు వచ్చింది. కొన్ని క్షణాలు తర్జనభర్జన పడి, ధైర్యంగా లేచి నిల్చుని సెల్యూట్ కొట్టారు మంజీత. అంతవరకు బాగానే ఉంది. ఆమె వెనుక చాలామంది అధికారులు ఉన్నారు. ఆమె కదిలితేనే గానీ వాళ్లు కదలడానికి లేదు. లేస్తే వాళ్ల కంట్లో మరక పడుతుంది. ఇదీ ఆమె సంకోచం. ‘‘అంతకుముందు ఇటువంటి సందర్భంలో నేను వెనకవైపు డైరీ కాని ఫైల్ కాని అడ్డు పెట్టుకుని నడిచేదాన్ని. ఇప్పుడు అలా చేయకూడదను కున్నాను.. ఏదైతే అదైందని ముందుకు నడిచేశాను. నా తోటి ఆఫీసర్లంతా మౌనంగా నా వెనక నడిచారు. కాని నా గన్‌మెన్ మాత్రం ‘మేడమ్ మీ బట్టల మీద మరక ఉంది’ అని చెప్పాడు. అందుకు నేను నవ్వుతూ, ‘ఇది మామూలే. ఏం పర్వాలేదు’ అని చెప్పి కారు ఎక్కేశాను’’ అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు మంజీత. ఆ తర్వాత ఆమె ఇదే విషయం తన కింది అధికారులకు కూడా చెప్పారు. విధులలో ఉండగా మహిళా సిబ్బందికి నెలసరి వస్తే వారికి కాస్త విశ్రాంతి ఇవ్వండి అని సలహా ఇచ్చారు. ‘‘ఒక మహిళగా ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఆ మరకతో ఎలాంటి సమస్యా లేదు. ఎప్పుడైనా మరక కనిపిస్తే, నాకు చెప్పమని నా గన్‌మెన్‌కి చెప్పాను. ఇటువంటి మార్పు ప్రతి మహిళలోను రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అన్నారు మంజీత వంజర. – రోహిణి -
ఇలా చేస్తే మరకలు మాయం
బ్యూటిప్స్ కొత్త తువ్వాళ్లను ఉతికేటప్పుడు సాధారణంగా రంగుపోతుంది. అలా పోకుండా ఉండాలంటే, తువ్వాళ్లను మొదటిసారి ఉతికేటప్పుడు అర కప్పు ఉప్పు జత చేసిన నీళ్లలో నానబెడితే సరి.స్కెచ్ పెన్నుల గీతలు దుస్తుల మీద పడినప్పుడు, ముందు కాస్తంత నెయిల్‌పాలిష్ రిమూవర్ వేసి రుద్ది, ఆ తరవాత సబ్బుతో రుద్దితే ఆ మరకలు ఇట్టే పోతాయి.బట్టలపై చాకొలేట్ మరకలు పడితే, ముందుగా కొద్దిగా బట్టల సోడా కలిపిన నీటిలో ఉంచి, కాసేపయ్యాక సబ్బుతో ఉతికేయాలి.పట్టుచీరలు ఉతికేటప్పుడు ఆ నీళ్లలో కొంచెం నిమ్మరసం వేస్తే, రంగు, మెరుపుపోకుండా ఉంటాయి. బట్టల మీద పడిన ఇంకు మరకలను పోగొట్టాలంటే, ముందుగా ఇంకు మరక ఉన్న చోట నిమ్మ చెక్కతో కాని, టూత్‌పేస్ట్‌తో గాని రాసి ఉతికితే సరి. మరో చిట్కా కూడా ఉంది. ఇంకు మరకలు పడిన చోట నీళ్లు జల్లి ఉప్పుతో రుద్ది, గోరువెచ్చటి నీళ్లలో ఉతికినా కూడా మరకలు మాయమవుతాయి.గ్రేవీ చిక్కగా రావాలంటే, కొద్దిగా కొబ్బరి పాలు లేదా గిలక్కొట్టిన పెరుగు వేసుకోవచ్చు.కూరలో నూనె ఎక్కువైతే, రెండు బ్రెడ్‌స్లైసుల్ని పొడిలా చేసి అందులో వేస్తే సరి. -
ఇంటిప్స్
జిగురు గట్టిపడితే అందులో కాస్త వెనిగర్ కలిపితే మామూలుగా అయిపోతుంది. గోళ్ళరంగు సీసాలను ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడకుండా ఉంటాయి. స్కెచ్‌పెన్ పనిచేయకపోతే లోపల స్పాంజ్లో అయిదారు చుక్కల వేడినీళ్లు పోసి కాసేపు ఉంచాలి. ఇలా చేస్తే తిరిగి మళ్ళీ పనిచేస్తాయి. బట్టలపైన పడిన మరకలు పోవాలంటే... మరకలు పడిన చోట నిమ్మరసం వేసి తొక్కతో రుద్ది, తరువాత సబ్బుతో ఉతికితే మరకలు మాయమవుతాయి. -
ఇంటిప్స్
కిచెన్ ప్లాట్‌ఫాం మీద కాని, స్టవ్ మీద కాని జిడ్డు మరకలుంటే ముందుగా కొద్దిగా నీళ్లు చల్లి సోడాబైకార్బనేట్ చల్లాలి. రెండు - మూడు నిమిషాల తర్వాత స్పాంజ్‌తో కాని క్లాత్‌తో కాని తుడవాలి. థర్మాస్ ఫ్లాస్కు లోపల వాసన వస్తుంటే ఒక టేబుల్ స్పూన్ సోడాబైకార్బనేట్ వేసి నిండా నీటిని పోయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగితే వాసనపోయి శుభ్రంగా ఉంటుంది. అవసరమనిపిస్తే బ్రష్‌తో రుద్దవచ్చు. కిచెన్‌లో అవెన్, స్టవ్, ప్లాట్‌ఫాం తుడిచే స్పాంజ్లు, బ్రష్‌లు కొద్దిరోజులు వాడిన తరవాత వాసన పట్టేస్తుంటాయి. వాటిని నీటిలో ఒక టేబుల్‌స్పూన్ సోడాబైకార్బనేట్, నాలుగు చుక్కల డిష్‌వాష్ లిక్విడ్ కలిపి రాత్రంతా నానబెట్టి శుభ్రం చేయాలి. {ఫిజ్‌ను శుభ్రం చేయాలంటే లీటరు నీటిలో కప్పు సోడా బైకార్బనేట్ కలిపి ఆ మిశ్రమంలో స్పాంజ్‌ను ముంచి లోపలి అరలన్నీ తుడవాలి. తరవాత మంచినీటిలో ముంచి పిండేసిన స్పాంజ్‌తో మరొకసారి తుడవాలి.స్టెయిన్లెస్ స్టీల్ సింకులో రెండు స్పూన్ల సోడా బైకార్బనేట్ చల్లి కొద్దిగా నీటిని చల్లి రుద్ది కడిగితే కొత్తదానిలా మెరుస్తుంది. పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. -
ఇంటిప్స్
బట్టలపై బురద మరకలు పడితే వాటిని బంగాళాదుంపలు ఉడకబెట్టిన నీళ్లలో నానబెట్టి ఉతకాలి. బట్టల మీద హెన్నా మరకలు అయిన చోట ఆ భాగాన్ని పాలలో నానబెట్టి చల్లని నీటితో ఉతకాలి. ప్లాస్క్ వాడనప్పుడు దానిలో పావు చెంచా పంచదార వేసి ఉంచితే తర్వాత ఉపయోగించేటప్పుడు దుర్వాసన రాదు. కర్పూరం డబ్బా అడుగు భాగాన కొన్ని బియ్యపు గింజలు వేస్తే కర్పూరం కరిగిపోదు. ఉప్పు ఉంచిన డబ్బాలో అడుగున కొన్ని బియ్యపు గింజలు వేస్తే ఉప్పు ఉండలు కట్టకుండా ఉంటుంది. విరిగిపోయిన, మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలను ఎండలో పెట్టి, పొడి చేసి నిల్వ చేసుకుంటే గ్రేవీలు, కూరల తయారీలో వాడుకోవచ్చు. మిక్సీలో పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఫ్రిజ్ నీళ్లు పోస్తే పిండి బాగా పొంగుతుంది. అన్నం ముద్దవకుండా ఉండాలంటే బియ్యానికి నీళ్లు చేర్చే ముందు దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండాలి. -
ఇంటిప్స్
దుస్తుల మీద మరకలు పోగొట్టాలంటే... చెమట మరకలు సులువుగా తొలగించాలంటే నిమ్మరసంతో రుద్ది, శుభ్రం చేయాలి. {Xk మరక పోవాలంటే సోడాతో రుద్ది, కడగాలి. రక్తపు మరకలను తొలగించడానికి హైడ్రోజెన్ పెరాక్సైడ్‌ను వాడాలి. నూనె మరకలు పోవాలంటే చాక్‌పీస్ పొడి చల్లి, రుద్ది, అరగంట తర్వాత లిక్విడ్ సోప్‌తో శుభ్రపరచాలి. కాఫీ మరక పోవాలంటే బేకింగ్ సోడాను ఉపయోగిం చాలి. -
ఇంటిప్స్
పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి.పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి. పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. -
ఇంటిప్స్
టీ ఫ్లాస్కులు, పాల ఫ్లాస్కులను శుభ్రం చేయడం చాలా కష్టం. అలాంటప్పుడు కొద్దిగా సబ్బు నీటిలో పాత పేపర్లను ముక్కలు ముక్కలుగా చేసి అందులో వేయాలి. పదిహేను నిమిషాలు వాటిని అలాగే ఉంచి, తర్వాత ఆ ఫ్లాస్క్‌ను బాగా కదపాలి. అప్పుడు ఆ నీటిని పారబోసి, మళ్లీ మంచి నీటితో కడిగితే ఆ ఫ్లాస్క్ పరిశుభ్రంగా ఉంటుంది.చాలామంది ఇళ్లల్లో తులసి మొక్కకు తరచు తెగులు సోకుతుంది. అలా జరగకుండా ఉండాలంటే తులసి కోట మట్టిలో ఒక ఉల్లిగడ్డను పాతి పెట్టాలి. అలా చేసేటప్పుడు దాని పైపొర తీసేయాలి. తెల్లటి దుస్తులకు కానీ తెల్లటి షూలకు కానీ ఏవైనా మరకలు అంటితే - వాటిని అలాగే శుభ్రం చేయకూడదు. ముందు ఒక దూది ఉండను తీసుకొని, దాన్ని నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచి ఆ మరకలపై రుద్దాలి. అలా చేస్తే మరకలు తగ్గుముఖం పడతాయి. -
ఇంటిప్స్
వేయించేటప్పుడు పచ్చి, పండు మిరపకాయలు చిటపటలాడి నూనె ఎగరి పడకూడదంటే... మిరపకాయలకు చిన్నగా గాట్లు పెట్టాలి.బట్టలపై ముడతలు ఎక్కువగా ఉంటే... ఇస్త్రీ చేసేటప్పుడు బట్ట అడుగున అల్యూమినియం ఫాయిల్ పెట్టండి. దానికి వేడిని రిఫ్లెక్ట్ చేసే గుణం ఉండటం వల్ల కింద నుంచి కూడా మంచి వేడి తగిలి ముడతలు తేలికగా పోతాయి.గసగసాలను కాసేపు నానబెట్టి రుబ్బితే ముద్ద మెత్తగా, మృదువుగా ఉంటుంది. బట్టలపై మైనపు మరకలు పడినప్పుడు వాటిపై కొద్దిగా వెజిటబుల్ ఆయిల్ వేసి నానబెట్టి, తర్వాత ఉతికితే పోతాయి.చేపలు శుభ్రం చేశాక నీచు వాసన చేతుల్ని, ఇంటికి కూడా త్వరగా వదలదు. అలా వాసన అంటకుండా ఉండాలంటే... ముందుగా చేపల్ని కాసేపు ఉప్పునీటిలో నానబెట్టి, తర్వాత శుభ్రం చేస్తే సరి. -
ఇంటి చిట్కాలు
స్టవ్ మీద పడిన మరకలు ఓ పట్టాన పోవు. అలాంటప్పుడు టొమాటోను మధ్యకు కోసి, ఓ బద్దను ఉప్పులో ముంచి స్టవ్ తుడవండి. మరకలు పోయి తళతళలాడుతుంది!కూరగాయలు కోసే చాకులు, కటింగ్బోర్డు వంటివి దుర్వాసన వాసన వేస్తుంటే ... ఒకసారి కాఫీపొడితో రుద్ది కడగండి. దుర్వాసన వదిలిపోతుంది!సోఫా మీద నూనె మరకలు పడితే... నిమ్మరసం చల్లి, ఓ నిమిషం నాననిచ్చి, దూదితో తుడవాలి. మరకలు పోతాయి. ఒకవేళ నిమ్మరసంలోని తేమ ఇంకా అలాగే ఉంటే... ఓ టిష్యూ పేపర్ని వేసి కాసేపు ఉంచితే తడిని పీల్చేసుకుంటుంది. బాత్రూములో క్రిములు చేరి విసిగిస్తుంటే... ఓ కప్పు నీటిలో చెంచాడు వేపనూనె కలిపి బాత్రూములో చల్లితే క్రిములు నశిస్తాయి. కిటికీల అద్దాల మీద పడిన మరకలు ఎంతకీ వదలకపోతే... బియ్యపుగంజిని కాస్త వేడి చేసి, అందులో ముంచిన గుడ్డతో తుడవాలి. ఒక నిమిషం ఆగి మంచినీటిలో ముంచిన గుడ్డతో మళ్లీ తుడవాలి. ఇలా చేస్తే మరకలు పోయి అద్దాలు శుభ్రంగా ఉంటాయి!