ఇంటి చిట్కాలు
స్టవ్ మీద పడిన మరకలు ఓ పట్టాన పోవు. అలాంటప్పుడు టొమాటోను మధ్యకు కోసి, ఓ బద్దను ఉప్పులో ముంచి స్టవ్ తుడవండి. మరకలు పోయి తళతళలాడుతుంది!కూరగాయలు కోసే చాకులు, కటింగ్‌బోర్డు వంటివి దుర్వాసన వాసన వేస్తుంటే ... ఒకసారి కాఫీపొడితో రుద్ది కడగండి. దుర్వాసన వదిలిపోతుంది!సోఫా మీద నూనె మరకలు పడితే... నిమ్మరసం చల్లి, ఓ నిమిషం నాననిచ్చి, దూదితో తుడవాలి. మరకలు పోతాయి. ఒకవేళ నిమ్మరసంలోని తేమ ఇంకా అలాగే ఉంటే... ఓ టిష్యూ పేపర్‌ని వేసి కాసేపు ఉంచితే తడిని పీల్చేసుకుంటుంది.
బాత్రూములో క్రిములు చేరి విసిగిస్తుంటే... ఓ కప్పు నీటిలో చెంచాడు వేపనూనె కలిపి బాత్రూములో చల్లితే క్రిములు నశిస్తాయి. కిటికీల అద్దాల మీద పడిన మరకలు ఎంతకీ వదలకపోతే... బియ్యపుగంజిని కాస్త వేడి చేసి, అందులో ముంచిన గుడ్డతో తుడవాలి. ఒక నిమిషం ఆగి మంచినీటిలో ముంచిన గుడ్డతో మళ్లీ తుడవాలి. ఇలా చేస్తే మరకలు పోయి అద్దాలు శుభ్రంగా ఉంటాయి!