సాక్షి, హైదరాబాద్: టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. మునుపెన్నడూలేని రీతిలో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. శివార్లలోని రైతులు ధరలు గిట్టుబాటు కాకపోవడంతో తెంపకుండా తోటల్లోనే వదిలేసేందుకు మొగ్గు చూపుతుండగా.. కొందరు మాత్రం మార్కెట్‌కు తెచి్చనా ధరలు రాకపోవడంతో రోడ్లపై పారబోస్తున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో నగర మార్కెట్‌లో కిలో రూ. 15 ఉన్న టమాటా ప్రస్తుతం కిలో రూ. రూ.10కి పడిపొయింది.
మార్కెట్లకు దిగుబడులు పోటెత్తడంతో సామాన్యులకు మాత్రం టమాటాలు అందుబాటులోకి వచ్చా యి. జంటనగరాల అవసరాలకు సరిపడా టమాటా పెరగడంతో ప్రస్తుతం నగరంలోని గుడిమల్కాపూర్, మోండా, బోయిన్‌పల్లి, మాదన్నపేట, ఎల్‌బీనగర్ మార్కెట్లలో టమాటా ధరలు తగ్గాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో టమాటా రూ.3–8 ఉండగా రిటైల్ మార్కెట్‌లో ధర కిలో 7–10 పలుకుతోంది.
డిమాండ్‌కు తగిన సరఫరా
నగరానికి నిత్యం దాదాపు 100 నుంచి 120 లారీల టమాటా డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లకు 150 లారీల మేర దిగుమతులు వస్తున్నాయి.దీంతో నగర డిమాండ్ కంటే 30 లారీల టమాటా ఎక్కువగా దిగుమతి అవడంతో ధరలు విపరీతంగా పడిపోయాయి. తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి రోజురోజుకూ దిగుమతులు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి రోజుకు 30 నుంచి 40 లారీలు వస్తుండగా, పొరుగు రాష్ట్రాల నుంచి మరో 90–120 లారీల మేరకు టమాటా దిగుమతి అవుతోంది. ఈ నెల చివరి వరకు దిగుమతులు ఇలాగే ఉంటాయని, ఫిబ్రవరి రెండో వారం నుంచి దిగుమతులు తగ్గుతాయని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. దిగుమతులు తగ్గితే ధరలు పెరిగే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment