stove
-
మీ పనులు సులువుగా అవ్వాలంటే.. ఇవి వాడాల్సిందే..!
కొన్ని పనులు చేయాలంటే.. విరక్తి కలిగేలా, విసుగు పుట్టించేలా ఉంటాయి. కానీ అవి చేయకతప్పదు. అవి మన నిత్యవసరాలను తీర్చే పనులే అయితే.. వాయిదా వేయడం చాలా కష్టం. కానీ వాటిని కూడా ఈ సరికొత్త పరికరాలతో సులువుగా చెయ్యొచ్చు. మరి అవేంటో చూద్దామా!టేబుల్‌టాప్ స్టవ్..చిత్రంలోని ఈ మినీ స్టవ్.. స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందింది. ఇది చాలా తేలికగా, వినియోగించడానికి సులభంగా ఉండటంతో పాటు.. వేగంగానూ పని చేస్తుంది. స్నేహితులతో దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇంట్లో వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు.. క్షణాల్లో అందరి ఆకలి తీర్చేస్తుందీ గాడ్జెట్. పైగా దీనికి ప్రత్యేకంగా ఇంధనమే అక్కర్లేదు. కొన్ని చెక్కముక్కలు వేసి నిప్పు రాజేసి కబాబ్ స్టిక్స్ సాయంతోనూ అప్పటికప్పుడు గ్రిల్ చేసుకోవచ్చు. పైనాపిల్, చికెన్ పీసెస్ ఇలా అన్నింటినీ నచ్చిన విధంగా కాల్చుకుని తినొచ్చు.మినీ పాత్రలను ఉపయోగించి టీ, కాఫీలు, సూప్స్, కర్రీస్ వంటివీ రెడీ చేసుకోవచ్చు. దీనికి అదనంగా పెల్లెట్ బర్నర్ అడాప్టర్ కూడా లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో చెక్క ముక్కలు, కట్టె పుల్లలు దొరకని సమయంలో.. పెల్లెట్ గుళికల ప్యాకెట్ ఒకటి వెంట ఉంచుకుంటే దీనిపై కుకింగ్ ఈజీ అవుతుంది. ఈ స్టవ్‌ని టేబుల్ మీద పెట్టి.. ఉపయోగించినా ఏం కాదు. ఎందుకంటే స్టవ్ కింద భాగంలో.. ప్రత్యేకమైన బేస్ ట్రే ఉంటుంది. అవసరాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు లేదా తీసేయొచ్చు. ధర 69 డాలర్లు (రూ.5,749)స్మార్ట్ మగ్ వార్మర్..కాఫీ, టీలు లేనిదే రోజు గడవదనుకునేవారికి.. ఈ స్మార్ట్ మగ్ వార్మర్ చక్కగా యూజ్ అవుతుంది. సిస్టమ్ ముందు పనిచేసేవాళ్లు.. క్షణం తీరికలేని షెడ్యూల్స్‌తో ఉండేవారు ఈ డివైస్‌కి ఫిదా కావాల్సిందే. చిత్రంలోని ఎలక్ట్రిక్ డెస్క్‌టాప్ కాఫీ వార్మర్ 40 డిగ్రీల.. 50 డిగ్రీల.. 75 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో.. మూడు ఆప్షన్స్‌తో పనిచేస్తుంది. దీని మినీ డిజిటల్ డిస్ప్లే పక్కన.. టెంపరేచర్ పెంచుకోవడానికి ఒక బటన్, తగ్గించుకోవడానికి మరో బటన్ ఉంటాయి.అలాగే టైమ్ సెట్టింగ్ బటన్ తో పాటు పవర్ ఆఫ్.. ఆన్ బటన్ కూడా ఉంటుంది. ఇది కాఫీ, టీ, హనీ టీ, మిల్క్, మిల్క్ షేక్, హాట్చాక్లెట్ వంటివాటికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆటో ఆఫ్ ఆఫ్షన్ ఉంటుంది. సేఫ్టీ ఫంక్షన్ తో పని చేస్తుంది. ఈ వార్మర్ చాలా రకాల మగ్లకు అనువుగా ఉంటుంది. దాంతో దీన్ని ఆఫీస్ టేబుల్ మీదా పెట్టుకోవచ్చు. ధర 30 డాలర్లు (రూ. 2,499)స్మార్ట్ మగ్ వార్మర్, ఆపిల్ కోరెర్ టూల్ఆపిల్ కోరెర్ టూల్..స్టెయిన్ లెస్ స్టీల్, ట్విన్ బ్లేడ్‌తో రూపొందిన ఈ కోరెర్ టూల్.. ఆపిల్, పైనాపిల్, పియర్ వంటి పండ్లను ఈజీగా కట్ చేసిపెడుతుంది. దీన్ని పిట్టర్లా, సీడ్ రిమూవర్‌గానూ వాడుకోవచ్చు. స్మూత్ ఎర్గోనామిక్ హ్యాండిల్‌తో ఉన్న ఈ మినీ గాడ్జెట్‌ని.. పిల్లలైనా, వృద్ధులైనా సులభంగా వినియోగించుకోవచ్చు.ఈ టూల్‌తో ఉల్లిపాయలు, టొమాటోల మధ్య భాగాలనూ తొలగించి, శుభ్రం చేసుకోవచ్చు. చెత్తలో వేయాల్సిన సీడ్స్ భాగాన్ని ఈ టూల్లోంచి బయటికి తీసి పారేయడం, దీన్ని క్లీన్ చేయడం రెండూ తేలికే! యాపిల్ కట్టర్స్, పిట్టర్స్, డివైడర్స్, వెడ్జర్, హల్లర్, కోర్స్లైసర్, ప్రోగ్రెసివ్ స్లైసర్ వంటి ఉపకరణాలతో పోలిస్తే.. ఈ కోరెర్ భలే ఉపయోగకరంగా ఉంటుంది. ధర 9 డాలర్లు (రూ.749)ఇవి చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..? -
వంట అయిపోగానే దానంతట అదే ఆఫ్ అయిపోతుంది
వండివార్చేవాళ్లకు ఈ ఎలక్ట్రిక్ పోర్టబుల్ స్టవ్ దొరికితే పండుగే! ఎందుకంటే దీనిపై ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పాత్రతోనైనా సులభంగా వండుకోవచ్చు. ఏ వంటకాన్నయినా నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఈ మినీ ఎలక్ట్రిక్ స్టవ్‌ని పవర్‌తో కనెక్ట్ చేసుకుని.. కుడివైపు ముందు భాగంలో ఉన్న రెగ్యులేటర్‌ను సెట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన.. రైస్ ఐటమ్స్ దగ్గర నుంచి కూరలు, సూప్స్, టీ, కాఫీలన్నిటినీ తయారు చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ క్లోజింగ్ ఫంక్షన్‌తో రూపొందటంతో ఔట్ డోర్ క్యాంపింగ్ బర్నర్‌గా యూజ్ అవుతుంది. స్టీల్, గ్లాస్, అల్యూమినియం.. ఇలా అన్నిపాత్రలూ దీనికి సెట్ అవుతాయి. ఇలాంటి మోడల్స్.. అనేక రంగుల్లో అమ్ముడుపోతున్నాయి. పవర్ వాట్స్ లేదా సెట్టింగ్స్‌లో చిన్న చిన్న మార్పులతో లభించే ఇలాంటి స్టవ్‌లకు మంచి గిరాకే ఉంది. ధర కూడా తక్కువే. కేవలం15 డాలర్లు (రూ.1,251) మాత్రమే. -
ఇదేమిటో తెలుసా? 90ల నాటి పిల్లలైతే ఇట్టే చెప్పేస్తారు!
మీరు 90లలో పుట్టారా? మీ సమాధానం ‘అవును’ అయితే పైన కనిపించే ఫొటోను చూస్తే మీ బాల్యం తప్పకుండా గుర్తుకువస్తుంది. ఆ సమయంలో ఈ వస్తువును ప్రతీ ఇంటిలోనూ వినియోగించేవారు. ఆ రోజుల్లో ఇంటింటా కిరోసిన్ వాసన వచ్చేది. వంటవండేందుకు కిరోసిన్ స్టవ్‌తో తంటాలు పడేవారు. మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇదేమిటో ఇట్టే చెప్పేస్తారు. అయితే మీరు దీనిని మరచిపోయి ఉంటే ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. ఇప్పటికైనా ఇదేమిటో మీకు తెలిసిందా? ఈ వస్తువును ప్రిమస్ పిన్ అని అంటారు. సాధారణంగా దీనిని పిన్ అనే అని పిలుస్తుంటారు. ఈ పిన్ను ఆనాటి రోజుల్లో కిరోసిన్ స్టవ్‌ను శుభ్రపరిచేందుకు వినియోగించేవారు. స్టవ్ బర్నర్ మూసుకుపోయినప్పుడు ఈ పిన్సాయంతో స్టవ్ బర్నర్‌ను శుభ్రం చేసేవారు. ఫలితంగా స్టవ్ పూర్తి ఫ్లేమ్‌తో మండేది. ఈ పిన్ను వినియోగించి స్టవ్‌ను శుభ్రం చేసినప్పుడు కిరోసిన్ బర్నర్ వరకూ చేరుకునేది. నాటి రోజుల్లో అధికశాతం ఇళ్లలో కిరోసిన్ స్టవ్ మాత్రమే ఉన్నకారణంగా, ఈ పిన్ ప్రతీ కిరాణా దుకాణంలో దొరికేది. How many of you know what this is ????? pic.twitter.com/9bzsy15kU5 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 26, 2023 ‘బాల్యం గుర్తుకు వచ్చింది’ ఈ ఫొటోను ట్విట్టర్లో @HasnaZarooriHai పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. ఈ ఫొటోతో పాటు దీనిని ఏమంటారో తెలుసా? అనే ప్రశ్న కూడా అడిగారు. దీనికి చాలామంది సమాధానం రాశారు. కొందరు దీనికి సరైన సమాధానం రాయగా, మరికొందరు తాము జీవితంలో ఇలాంటి వస్తువును చూడలేదని పేర్కొన్నారు. అయితే పలువురు దీనిని చూడగానే తమకు బాల్యం గుర్తుకువచ్చిందంటూ తమ అనుభవాలను షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ పోస్టుకు 22 లక్షల వీక్షణలు దక్కాయి. 5 వేల మంది దీనిని లైక్ చేశారు. ఇది కూడా చదవండి: ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. సంబరపడిన బంధువులకు సడెన్ షాక్! -
స్టౌల్లో కోటిన్నర బంగారం
నెల్లూరు (మినీ బైపాస్): ఎలక్ట్రిక్, బొగ్గు స్టౌల్లో రూ.కోటిన్నర విలువ చేసే బంగారం అమర్చి రైల్లో తరలిస్తుండగా నెల్లూరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) శాఖ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం డీఆర్ఐ అధికారులు మీడియాకు వివరాలు తెలియజేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా అక్రమంగా రైల్లో బంగారాన్ని రవాణా చేస్తున్నారని డీఆర్ఐ అధికారులకు ఆదివారం సమాచారం అందింది. దీంతో ఆ శాఖ అధికారులు రైళ్లలో తనిఖీలు చేశారు. ఆదివారం సాయంత్రం గౌహతి నుంచి తాంబరంకు గౌహతి ఎమ్మెస్ ఎక్స్‌ప్రెస్ నెల్లూరు రైల్వేస్టేషన్ చేరుకుంది. తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడి వద్ద ఊదా రంగు బ్యాగ్‌లో అల్యూమినియంతో తయారు చేసిన ఎలక్ట్రిక్, బొగ్గు స్టౌలను కనుగొన్నారు. వాటి బరువు భారీగా ఉండడంతో అధికారులకు అనుమానం వచ్చింది. వాటిని పరిశీలించి, వాటిపై ఉన్న ప్లేట్లను తొలగించారు. వాటి కింద ఉన్న మైనపు తొడుగును తొలగించడంతో అందులో దాచిన బంగారం బయటపడింది. రెండు స్టౌల్లో 4 భాగాలుగా బంగారాన్ని తయారు చేసి అమర్చారు. రూ.1.43 కోట్లు విలువ చేసే 4.658 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం మయన్మార్‌కు చెందినదిగా అధికారులు తెలిపారు. అయితే బంగారం ఎవరిది, దీని వెనుక ఎవరున్నారన్నది అధికారులు విచారిస్తున్నారు. -
ఇంటిప్స్
స్టవ్ మీద పడిన మరకలు ఓ పట్టాన పోవు. అలాంటప్పుడు టొమాటోను మధ్యకు కోసి, ఓ ముక్కను ఉప్పులో ముంచి స్టవ్ తుడవండి. మరకలు పోయి తళతళలాడుతుంది!సోఫా మీద నూనె మరకలు పడితే... నిమ్మరసం చల్లి, ఓ నిమిషం నాననిచ్చి, దూదితో తుడవాలి. మరకలు పోతాయి. ఒకవేళ నిమ్మరసంలోని తేమ ఇంకా అలాగే ఉంటే... ఓ టిష్యూ పేపర్ని వేసి కాసేపు ఉంచితే తడిని పీల్చేసుకుంటుంది. పచ్చికొబ్బరిని త్వరగా బయటకు తీయడానికి ఆ చిప్పను పావుగంట సేపు నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే కొబ్బరి ముక్కలు సులువుగా వస్తాయి. కూరగాయలు తరిగే చాకులు, కటింగ్బోర్డు వంటివి దుర్వాసన వాసన వేస్తుంటే ... ఒకసారి కాఫీపొడితో రుద్ది కడగండి. దుర్వాసన వదిలిపోతుంది! కిటికీల అద్దాల మీద పడిన మరకలు ఎంతకీ వదలకపోతే... బియ్యపుగంజిని కాస్త వేడి చేసి, అందులో ముంచిన గుడ్డతో తుడవాలి. ఒక నిమిషం ఆగి మంచినీటిలో ముంచిన గుడ్డతో మళ్లీ తుడవాలి. ఇలా చేస్తే మరకలు పోయి అద్దాలు శుభ్రంగా ఉంటాయి! బాత్రూములో క్రిములు చేరి విసిగిస్తుంటే... ఓ కప్పు నీటిలో చెంచాడు వేపనూనె కలిపి బాత్రూములో చల్లితే సరి... క్రిములు పారిపోతాయి. -
ఇంటి చిట్కాలు
స్టవ్ మీద పడిన మరకలు ఓ పట్టాన పోవు. అలాంటప్పుడు టొమాటోను మధ్యకు కోసి, ఓ బద్దను ఉప్పులో ముంచి స్టవ్ తుడవండి. మరకలు పోయి తళతళలాడుతుంది!కూరగాయలు కోసే చాకులు, కటింగ్బోర్డు వంటివి దుర్వాసన వాసన వేస్తుంటే ... ఒకసారి కాఫీపొడితో రుద్ది కడగండి. దుర్వాసన వదిలిపోతుంది!సోఫా మీద నూనె మరకలు పడితే... నిమ్మరసం చల్లి, ఓ నిమిషం నాననిచ్చి, దూదితో తుడవాలి. మరకలు పోతాయి. ఒకవేళ నిమ్మరసంలోని తేమ ఇంకా అలాగే ఉంటే... ఓ టిష్యూ పేపర్ని వేసి కాసేపు ఉంచితే తడిని పీల్చేసుకుంటుంది. బాత్రూములో క్రిములు చేరి విసిగిస్తుంటే... ఓ కప్పు నీటిలో చెంచాడు వేపనూనె కలిపి బాత్రూములో చల్లితే క్రిములు నశిస్తాయి. కిటికీల అద్దాల మీద పడిన మరకలు ఎంతకీ వదలకపోతే... బియ్యపుగంజిని కాస్త వేడి చేసి, అందులో ముంచిన గుడ్డతో తుడవాలి. ఒక నిమిషం ఆగి మంచినీటిలో ముంచిన గుడ్డతో మళ్లీ తుడవాలి. ఇలా చేస్తే మరకలు పోయి అద్దాలు శుభ్రంగా ఉంటాయి! -
గురూ..! చెయ్యి పప్పుచారూ..!
‘పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం తేలిక. ‘చేయడం మాత్రం చాలా కష్టం’ కానే కాదు. కావలసినవి: కాస్త ఆత్మవిశ్వాసం. వినడానికి పాత పాటలు కొన్ని. కందిపప్పు: తగినంత ఉల్లిపాయ: ఒకటి ఎండు మిర్చి: రెండు టొమాటో: ఒకటి పచ్చిమిర్చి: రెండు వెల్లుల్లి: మూడు రేకలు ఉప్పు: తగినంత నూనె: రెండు టేబుల్ స్పూన్లు కారం: ఒక టీ స్పూను ఇంకా కరివేపాకు, తాలింపు దినులు. ఇప్పుడు ఇలా చేయండి: ఆడుతు పాడుతు పని చేస్తుంటే... పాట ప్లే చేయండి. పప్పుని కుక్కర్లో ఉడకబెట్టండి. చింతపండుని ఒక పాత్రలో నాన పెట్టండి. ఒక గిన్నెలో నూనె పోసి స్టవ్ మీద పెట్టండి. నూనె కాస్త కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు అందులో వేయండి. ఆ తరువాత రెండు గ్లాసుల నీళ్లు పోయండి చింతపండు నీళ్లని పప్పులో వేసి బాగా కలపాలి. వేగిన ఉల్లిపాయ, టొమాటో ముక్కలను దీనిలో కలపండి తగినంత ఉప్పు, కారం వేసి కలిపి స్టవ్ మీద పెట్టండి. మరోవైపు ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు... మొదలైన వాటితో తాలింపు పెట్టి, దాన్ని ఉడుకుతున్న పప్పులో కలపండి. పప్పుచారు తయారు! -
స్టవ్ ప్రమాద బాధితుల్లో మరొకరు మృతి
=47 రోజులు మృత్యువుతో పోరాటం =కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరు సంతమార్కెట్ వద్ద నవంబరు 12న జరిగిన స్టవ్ ప్రమాద బాధితుల్లో మరొకరు ఆదివారం మృతిచెందారు. ఆస్పత్రిలో 47 రోజులుగా చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా కోమటిలంక గ్రామానికి చెందిన పెనుగొండ సలోమి (17) ఆదివారం తుదిశ్వాస విడిచింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆరోజు బజ్జీల బండి వద్ద సలసల కాగే కళాయిలో నూనె చిమ్మడంతో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విజయవాడలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు చికత్స కోసం తరలించారు. వారిలో నలుగురు ఇంతకుముందు మృతిచెందగా, సలోమి చికిత్స పొందుతోంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి గ్రామానికి వస్తుందని ఆశగా ఎదురుచూసిన గ్రామస్తులకు ఆమె మరణవార్త విషాదాన్ని నింపింది. బజ్జీల బండి యజమాని తోట పోతురాజు, అడపా సుబ్బలక్ష్మి, కంభంపాటి మేరి సరోజిని, గురజ తేరేజమ్మ నవంబరు 19న చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. సంఘటన జరిగిన రోజున సలోమి తల్లితో పాటు సంతమార్కెట్ వద్దకు వచ్చింది. ఇంటర్ వరకు చదివి కుట్టుమిషన్ పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె మృతితో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. సోమవారం ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.