టేబుల్‌టాప్ స్టవ్
కొన్ని పనులు చేయాలంటే.. విరక్తి కలిగేలా, విసుగు పుట్టించేలా ఉంటాయి. కానీ అవి చేయకతప్పదు. అవి మన నిత్యవసరాలను తీర్చే పనులే అయితే.. వాయిదా వేయడం చాలా కష్టం. కానీ వాటిని కూడా ఈ సరికొత్త పరికరాలతో సులువుగా చెయ్యొచ్చు. మరి అవేంటో చూద్దామా!
టేబుల్‌టాప్ స్టవ్..
చిత్రంలోని ఈ మినీ స్టవ్.. స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందింది. ఇది చాలా తేలికగా, వినియోగించడానికి సులభంగా ఉండటంతో పాటు.. వేగంగానూ పని చేస్తుంది. స్నేహితులతో దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇంట్లో వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు.. క్షణాల్లో అందరి ఆకలి తీర్చేస్తుందీ గాడ్జెట్. పైగా దీనికి ప్రత్యేకంగా ఇంధనమే అక్కర్లేదు. కొన్ని చెక్కముక్కలు వేసి నిప్పు రాజేసి కబాబ్ స్టిక్స్ సాయంతోనూ అప్పటికప్పుడు గ్రిల్ చేసుకోవచ్చు. పైనాపిల్, చికెన్ పీసెస్ ఇలా అన్నింటినీ నచ్చిన విధంగా కాల్చుకుని తినొచ్చు.
మినీ పాత్రలను ఉపయోగించి టీ, కాఫీలు, సూప్స్, కర్రీస్ వంటివీ రెడీ చేసుకోవచ్చు. దీనికి అదనంగా పెల్లెట్ బర్నర్ అడాప్టర్ కూడా లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో చెక్క ముక్కలు, కట్టె పుల్లలు దొరకని సమయంలో.. పెల్లెట్ గుళికల ప్యాకెట్ ఒకటి వెంట ఉంచుకుంటే దీనిపై కుకింగ్ ఈజీ అవుతుంది. ఈ స్టవ్‌ని టేబుల్ మీద పెట్టి.. ఉపయోగించినా ఏం కాదు. ఎందుకంటే స్టవ్ కింద భాగంలో.. ప్రత్యేకమైన బేస్ ట్రే ఉంటుంది. అవసరాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు లేదా తీసేయొచ్చు. ధర 69 డాలర్లు (రూ.5,749)
స్మార్ట్ మగ్ వార్మర్..
కాఫీ, టీలు లేనిదే రోజు గడవదనుకునేవారికి.. ఈ స్మార్ట్ మగ్ వార్మర్ చక్కగా యూజ్ అవుతుంది. సిస్టమ్ ముందు పనిచేసేవాళ్లు.. క్షణం తీరికలేని షెడ్యూల్స్‌తో ఉండేవారు ఈ డివైస్‌కి ఫిదా కావాల్సిందే. చిత్రంలోని ఎలక్ట్రిక్ డెస్క్‌టాప్ కాఫీ వార్మర్ 40 డిగ్రీల.. 50 డిగ్రీల.. 75 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్‌లో.. మూడు ఆప్షన్స్‌తో పనిచేస్తుంది. దీని మినీ డిజిటల్ డిస్‌ప్లే పక్కన.. టెంపరేచర్ పెంచుకోవడానికి ఒక బటన్, తగ్గించుకోవడానికి మరో బటన్ ఉంటాయి.
అలాగే టైమ్ సెట్టింగ్ బటన్ తో పాటు పవర్ ఆఫ్.. ఆన్ బటన్ కూడా ఉంటుంది. ఇది కాఫీ, టీ, హనీ టీ, మిల్క్, మిల్క్ షేక్, హాట్‌చాక్లెట్ వంటివాటికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆటో ఆఫ్ ఆఫ్షన్ ఉంటుంది. సేఫ్టీ ఫంక్షన్ తో పని చేస్తుంది. ఈ వార్మర్ చాలా రకాల మగ్‌లకు అనువుగా ఉంటుంది. దాంతో దీన్ని ఆఫీస్ టేబుల్ మీదా పెట్టుకోవచ్చు. ధర 30 డాలర్లు (రూ. 2,499)
స్మార్ట్ మగ్ వార్మర్, ఆపిల్ కోరెర్ టూల్
ఆపిల్ కోరెర్ టూల్..
స్టెయిన్ లెస్ స్టీల్, ట్విన్ బ్లేడ్‌తో రూపొందిన ఈ కోరెర్ టూల్.. ఆపిల్, పైనాపిల్, పియర్ వంటి పండ్లను ఈజీగా కట్ చేసిపెడుతుంది. దీన్ని పిట్టర్‌లా, సీడ్ రిమూవర్‌గానూ వాడుకోవచ్చు. స్మూత్ ఎర్గోనామిక్ హ్యాండిల్‌తో ఉన్న ఈ మినీ గాడ్జెట్‌ని.. పిల్లలైనా, వృద్ధులైనా సులభంగా వినియోగించుకోవచ్చు.
ఈ టూల్‌తో ఉల్లిపాయలు, టొమాటోల మధ్య భాగాలనూ తొలగించి, శుభ్రం చేసుకోవచ్చు. చెత్తలో వేయాల్సిన సీడ్స్ భాగాన్ని ఈ టూల్‌లోంచి బయటికి తీసి పారేయడం, దీన్ని క్లీన్ చేయడం రెండూ తేలికే! యాపిల్ కట్టర్స్, పిట్టర్స్, డివైడర్స్, వెడ్జర్, హల్లర్, కోర్స్‌లైసర్, ప్రోగ్రెసివ్ స్లైసర్ వంటి ఉపకరణాలతో పోలిస్తే.. ఈ కోరెర్ భలే ఉపయోగకరంగా ఉంటుంది. ధర 9 డాలర్లు (రూ.749)
ఇవి చదవండి: సమ్మర్‌లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
Comments
Please login to add a commentAdd a comment