Coffee cups
-
మీ పనులు సులువుగా అవ్వాలంటే.. ఇవి వాడాల్సిందే..!
కొన్ని పనులు చేయాలంటే.. విరక్తి కలిగేలా, విసుగు పుట్టించేలా ఉంటాయి. కానీ అవి చేయకతప్పదు. అవి మన నిత్యవసరాలను తీర్చే పనులే అయితే.. వాయిదా వేయడం చాలా కష్టం. కానీ వాటిని కూడా ఈ సరికొత్త పరికరాలతో సులువుగా చెయ్యొచ్చు. మరి అవేంటో చూద్దామా!టేబుల్‌టాప్ స్టవ్..చిత్రంలోని ఈ మినీ స్టవ్.. స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందింది. ఇది చాలా తేలికగా, వినియోగించడానికి సులభంగా ఉండటంతో పాటు.. వేగంగానూ పని చేస్తుంది. స్నేహితులతో దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇంట్లో వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు.. క్షణాల్లో అందరి ఆకలి తీర్చేస్తుందీ గాడ్జెట్. పైగా దీనికి ప్రత్యేకంగా ఇంధనమే అక్కర్లేదు. కొన్ని చెక్కముక్కలు వేసి నిప్పు రాజేసి కబాబ్ స్టిక్స్ సాయంతోనూ అప్పటికప్పుడు గ్రిల్ చేసుకోవచ్చు. పైనాపిల్, చికెన్ పీసెస్ ఇలా అన్నింటినీ నచ్చిన విధంగా కాల్చుకుని తినొచ్చు.మినీ పాత్రలను ఉపయోగించి టీ, కాఫీలు, సూప్స్, కర్రీస్ వంటివీ రెడీ చేసుకోవచ్చు. దీనికి అదనంగా పెల్లెట్ బర్నర్ అడాప్టర్ కూడా లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో చెక్క ముక్కలు, కట్టె పుల్లలు దొరకని సమయంలో.. పెల్లెట్ గుళికల ప్యాకెట్ ఒకటి వెంట ఉంచుకుంటే దీనిపై కుకింగ్ ఈజీ అవుతుంది. ఈ స్టవ్‌ని టేబుల్ మీద పెట్టి.. ఉపయోగించినా ఏం కాదు. ఎందుకంటే స్టవ్ కింద భాగంలో.. ప్రత్యేకమైన బేస్ ట్రే ఉంటుంది. అవసరాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు లేదా తీసేయొచ్చు. ధర 69 డాలర్లు (రూ.5,749)స్మార్ట్ మగ్ వార్మర్..కాఫీ, టీలు లేనిదే రోజు గడవదనుకునేవారికి.. ఈ స్మార్ట్ మగ్ వార్మర్ చక్కగా యూజ్ అవుతుంది. సిస్టమ్ ముందు పనిచేసేవాళ్లు.. క్షణం తీరికలేని షెడ్యూల్స్‌తో ఉండేవారు ఈ డివైస్‌కి ఫిదా కావాల్సిందే. చిత్రంలోని ఎలక్ట్రిక్ డెస్క్‌టాప్ కాఫీ వార్మర్ 40 డిగ్రీల.. 50 డిగ్రీల.. 75 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో.. మూడు ఆప్షన్స్‌తో పనిచేస్తుంది. దీని మినీ డిజిటల్ డిస్ప్లే పక్కన.. టెంపరేచర్ పెంచుకోవడానికి ఒక బటన్, తగ్గించుకోవడానికి మరో బటన్ ఉంటాయి.అలాగే టైమ్ సెట్టింగ్ బటన్ తో పాటు పవర్ ఆఫ్.. ఆన్ బటన్ కూడా ఉంటుంది. ఇది కాఫీ, టీ, హనీ టీ, మిల్క్, మిల్క్ షేక్, హాట్చాక్లెట్ వంటివాటికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆటో ఆఫ్ ఆఫ్షన్ ఉంటుంది. సేఫ్టీ ఫంక్షన్ తో పని చేస్తుంది. ఈ వార్మర్ చాలా రకాల మగ్లకు అనువుగా ఉంటుంది. దాంతో దీన్ని ఆఫీస్ టేబుల్ మీదా పెట్టుకోవచ్చు. ధర 30 డాలర్లు (రూ. 2,499)స్మార్ట్ మగ్ వార్మర్, ఆపిల్ కోరెర్ టూల్ఆపిల్ కోరెర్ టూల్..స్టెయిన్ లెస్ స్టీల్, ట్విన్ బ్లేడ్‌తో రూపొందిన ఈ కోరెర్ టూల్.. ఆపిల్, పైనాపిల్, పియర్ వంటి పండ్లను ఈజీగా కట్ చేసిపెడుతుంది. దీన్ని పిట్టర్లా, సీడ్ రిమూవర్‌గానూ వాడుకోవచ్చు. స్మూత్ ఎర్గోనామిక్ హ్యాండిల్‌తో ఉన్న ఈ మినీ గాడ్జెట్‌ని.. పిల్లలైనా, వృద్ధులైనా సులభంగా వినియోగించుకోవచ్చు.ఈ టూల్‌తో ఉల్లిపాయలు, టొమాటోల మధ్య భాగాలనూ తొలగించి, శుభ్రం చేసుకోవచ్చు. చెత్తలో వేయాల్సిన సీడ్స్ భాగాన్ని ఈ టూల్లోంచి బయటికి తీసి పారేయడం, దీన్ని క్లీన్ చేయడం రెండూ తేలికే! యాపిల్ కట్టర్స్, పిట్టర్స్, డివైడర్స్, వెడ్జర్, హల్లర్, కోర్స్లైసర్, ప్రోగ్రెసివ్ స్లైసర్ వంటి ఉపకరణాలతో పోలిస్తే.. ఈ కోరెర్ భలే ఉపయోగకరంగా ఉంటుంది. ధర 9 డాలర్లు (రూ.749)ఇవి చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..? -
కాఫీతో ఆ ముప్పు దూరం..
లండన్ : రోజుకు ఆరు కప్పుల కాఫీతో అకాల మరణం ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు ఆరు నుంచి ఏడు సార్లు కాఫీ తాగే వారు ఎలాంటి వ్యాధితోనైనా మరణించే ముప్పు 16 శాతం తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, కుంగుబాటు, డిమెన్షియాలను కాఫీ నిరోధిస్తుందని చాలా కాలంగా పలు నివేదికలు వెల్లడించాయి. ఆరోగ్యకర ఆహారంలో కాఫీ ఒకటని తాము చేపట్టిన తాజా అథ్యయనంలో మరోసారి నిరూపితమైందని నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు పేర్కొన్నారు. 2006 నుంచి 2016 వరకూ 5 లక్షల మందిపై ఈ అథ్యయనం నిర్వహించారు. ఇక రోజుకు ఐదు కప్పులు, ఒక కప్పు కాఫీ తీసుకునే వారికి అకాల మరణం ముప్పు వరుసగా 12, 8 శాతం మేరకు తక్కువగా ఉందని అథ్యయనంలో వెల్లడైందని రచయిత డాక్టర్ ఎరికా లోఫ్ట్‌ఫీల్డ్ చెప్పారు. శరీరంలో వాపులను తగ్గించి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో కాఫీలో ఉండే కెఫిన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. -
మానవాళి శ్రేయస్సుకు.. జర్మనీ కొత్త పద్దతి
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచంలో వాతావరణం మార్పు పెద్ద తలనొప్పిగా మారింది. ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులకు సంభవిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు జర్మనీ దేశంలోని ఫ్రీబర్గ్ కంపెనీ ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. మనం రోజుకు అనేక సార్లు ప్లాస్టిక్‌ను వాడతాము. కూల్‌డ్రింక్స్, కాఫీ, టీ తదితర పానీయాలను తాగడానికి ప్లాస్టిక్, పేపర్ డిస్పోజబుల్ కప్స్‌ను వాడతారు. ఇవి విచ్ఛిన్నం చెంది భూమిలో కలసిపోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. తద్వార భూమి కాలుష్యం అవుతుంది. అయితే, ఇందుకు ప్రత్యామ్నాయ పద్దతిని జర్మన్ కంపెనీ కనుగొంది. ఒకసారికే వాడి పడేయకుండా 400 సార్లు వినియోగించేలా ఓ ప్రత్యేక కప్పును తయారు చేసింది. ఈ కప్పులను నగరంలోని అన్ని చోట్లా ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా వంద కంపెనీలతో ఓ విధానాన్ని జర్మనీ ప్రభుత్వం రూపొందించనుంది. ఒకరి ఒకసారి వినియోగించిన కప్పు వేరొకరికి వెళ్లకుండా ఉండేందుకు కప్పులపై ప్రత్యేకమైన బార్ కోడ్‌ను తీసుకొచ్చారు. జర్మనీలో గంటకు దాదాపు 3 లక్షల కాఫీ కప్పులను వినియోగిస్తారట. సంవత్సరానికి దాదాపు 2.8 బిలియన్ కప్పులను వాడతారు. ప్రతీ కప్పును దాదాపు 13నిమిషాల పాటు వినియోగిస్తారు. ఈ సమస్య కేవలం జర్మనీది మాత్రమే కాదు. అమెరికా 2010లో 23 బిలియన్ల పేపర్ కప్పులను వాడినట్టు ఓ అంచనా. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 25 బిలియన్ల స్టైరోఫోం కాఫీ కప్పులను, ప్రతి గంటకు 2.5 మిలియన్ల కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను వాడి పడేస్తారనీ ఒక అంచనా. ఇవి భూమిలో డీకంపోజ్ కావడానికి దాదాపు 500 సంవత్సరాలు పడతాయి. -
కాఫీ కప్పులు
విడ్డూరం ఇదిగో ఈ ఫొటోల్లో కనిపిస్తున్నవి అచ్చంగా కాఫీ కప్పులు. మాకు తెల్దేంటి అని కోప్పడిపోకండి. వీటిలో కాఫీ మాత్రమే తాగాలనే రూలేమీ లేదు. నిక్షేపంగా టీ కూడా తాగొచ్చు. ఊరకే సోదంతా దేనికి గానీ విషయానికి రమ్మంటారా..? ఆగండాగండి... విషయానికే వచ్చేద్దాం. ఇంతకీ విషయం ఏమిటంటారా? ఇవి పింగాణీ కప్పులో, గాజు కప్పులో కావు. కనీసం మట్టితో తయారు చేసి, రంగు పూసినవి కూడా కాదు. కాఫీతో తయారు చేసిన అచ్చమైన కాఫీ కప్పులు ఇవి. కాఫీ గింజలను మిషన్‌లో వేసి తయారు చేసుకున్నా, ఇంట్లో డికాక్షన్ కాచుకుని ఫిల్టర్ కాఫీ తయారు చేసుకున్నా, అడుగున మిగిలిపోయిన కాఫీ పొడిని సాధారణంగా చెత్తబుట్టలో పారేస్తూ ఉంటాం. కొందరు పర్యావరణ ప్రేమికులు మాత్రం ఆ పొడిని చెత్తబుట్టలో పడేయకుండా మొక్కలకు గత్తంగా కూడా వాడుతూ ఉంటార్లెండి. అది వేరే విషయం. కాఫీ కాచుకున్నాక మిగిలిపోయిన పొడిని చెత్తబుట్టలో పడేయడమో, గత్తంగా వాడటమో కాకుండా వెరైటీగా ఏదైనా చేయాలని ఆలోచించింది ‘కాఫీ ఫార్మ్’ అనే జర్మన్ కంపెనీ. ఆలోచన వచ్చిందే తడవుగా వృథాగా మిగిలిన కాఫీ పొడితో కప్పుల తయారీకి ప్రయోగాలు చేసింది. ఎట్టకేలకు ప్రయోగాలు విజయవంతమై చూడచక్కని కాఫీ కప్పులు తయారయ్యాయి. అలాగని ఇవి వాడి పారేసే ‘యూజ్ అండ్ త్రో’ కప్పుల్లాంటివి కావు. పింగాణీ, గాజు కప్పుల మాదిరిగానే మన్నికగా ఉంటాయి. -
కలర్‌ఫుల్ కప్పులు
అందరి ఇళ్లలో ఎన్నో రకాల కాఫీ కప్పులుంటాయి. కొన్ని ప్లెయిన్‌గా.. మరికొన్ని డిజైన్స్‌తో ఉంటాయి. ఈ మధ్య నెయిల్ పాలిష్ కప్స్ బాగా హల్చల్ చేస్తున్నాయి. మరి మీరు కూడా ఇంట్లోనే కప్పులకు నెయిల్ పాలిష్ రంగులు అద్దాలనుకుంటే.. వెంటనే ట్రై చేయండి. ఎలా అంటారా? ఇదిగో ఇలా... కావలసినవి: కప్పులు, ఓ బౌల్ లేదా బకెట్లో నీళ్లు, రంగురంగుల నెయిల్ పాలిష్‌లు తయారీ: కప్పులకు రంగులు అద్దాలంటే... నెయిల్ పాలిష్‌ను బ్రష్ సాయంతో కూడా డిజైన్స్ వేయొచ్చు. కానీ ఒకసారి ఇలా చేసి చూడండి. ఈ డిజైన్ల అందమేంటో మీకే అర్థమవుతుంది. ముందుగా బౌల్ లేదా బకెట్లో నీళ్లు పోయాలి. ఇప్పుడు అందులో మీకు నచ్చిన రంగుల నెయిల్ పాలిష్ వేయాలి. తర్వాత ఏదైనా సన్నని స్టిక్‌తో ఆ పాలిష్‌పై డిజైన్‌ను డ్రా చేయాలి. ఆపైన కప్పును ఆ డిజైన్‌పై ముంచాలి. అంతే, ఆ డిజైన్ ఇప్పుడు మీ కప్పులకు ఫొటోలో కనిపిస్తున్న విధంగా అంటుకుంటుంది. కొద్దిసేపు ఆ కప్పులను గాలికి పెడితే... పాలిష్ పూర్తిగా ఆరిపోతుంది. ఒకే రంగు కాకుండా రెండు మూడు రంగులను కూడా వాడొచ్చు. కప్పు మొత్తానికి లేదా అడుగు భాగానికి ఇలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు. భలే తమాషాగా అందంగా ఉన్నాయి కదూ.. ఎంతో సులువైన ఈ డిజైనింగ్ పద్ధతిని మీరూ కానివ్వండి.