కలర్‌ఫుల్ కప్పులు | Designs of Colorful cups! | Sakshi
Sakshi News home page

కలర్‌ఫుల్ కప్పులు

Published Sun, Jul 17 2016 3:01 AM | Last Updated on Thu, May 24 2018 2:36 PM

కలర్‌ఫుల్ కప్పులు - Sakshi

కలర్‌ఫుల్ కప్పులు

అందరి ఇళ్లలో ఎన్నో రకాల కాఫీ కప్పులుంటాయి. కొన్ని ప్లెయిన్‌గా.. మరికొన్ని డిజైన్స్‌తో ఉంటాయి. ఈ మధ్య నెయిల్ పాలిష్ కప్స్ బాగా హల్‌చల్ చేస్తున్నాయి. మరి మీరు కూడా ఇంట్లోనే కప్పులకు నెయిల్ పాలిష్ రంగులు అద్దాలనుకుంటే.. వెంటనే ట్రై చేయండి. ఎలా అంటారా? ఇదిగో ఇలా...
 
కావలసినవి: కప్పులు, ఓ బౌల్ లేదా బకెట్‌లో నీళ్లు, రంగురంగుల నెయిల్ పాలిష్‌లు
 
తయారీ: కప్పులకు రంగులు అద్దాలంటే... నెయిల్ పాలిష్‌ను బ్రష్ సాయంతో కూడా డిజైన్స్ వేయొచ్చు. కానీ ఒకసారి ఇలా చేసి చూడండి. ఈ డిజైన్ల అందమేంటో మీకే అర్థమవుతుంది. ముందుగా బౌల్ లేదా బకెట్‌లో నీళ్లు పోయాలి. ఇప్పుడు అందులో మీకు నచ్చిన రంగుల నెయిల్ పాలిష్ వేయాలి. తర్వాత ఏదైనా సన్నని స్టిక్‌తో ఆ పాలిష్‌పై డిజైన్‌ను డ్రా చేయాలి. ఆపైన కప్పును ఆ డిజైన్‌పై ముంచాలి.

అంతే, ఆ డిజైన్ ఇప్పుడు మీ కప్పులకు ఫొటోలో కనిపిస్తున్న విధంగా అంటుకుంటుంది. కొద్దిసేపు ఆ కప్పులను గాలికి పెడితే... పాలిష్ పూర్తిగా ఆరిపోతుంది. ఒకే రంగు కాకుండా రెండు మూడు రంగులను కూడా వాడొచ్చు. కప్పు మొత్తానికి లేదా అడుగు భాగానికి ఇలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు. భలే తమాషాగా అందంగా ఉన్నాయి కదూ.. ఎంతో సులువైన ఈ డిజైనింగ్ పద్ధతిని మీరూ కానివ్వండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement