మీరు 90లలో పుట్టారా? మీ సమాధానం ‘అవును’ అయితే పైన కనిపించే ఫొటోను చూస్తే మీ బాల్యం తప్పకుండా గుర్తుకువస్తుంది. ఆ సమయంలో ఈ వస్తువును ప్రతీ ఇంటిలోనూ వినియోగించేవారు. ఆ రోజుల్లో ఇంటింటా కిరోసిన్ వాసన వచ్చేది. వంటవండేందుకు కిరోసిన్ స్టవ్‌తో తంటాలు పడేవారు. మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇదేమిటో ఇట్టే చెప్పేస్తారు. అయితే మీరు దీనిని మరచిపోయి ఉంటే ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇప్పటికైనా ఇదేమిటో మీకు తెలిసిందా?
ఈ వస్తువును ప్రిమస్ పిన్ అని అంటారు. సాధారణంగా దీనిని పిన్ అనే అని పిలుస్తుంటారు. ఈ పిన్‌ను ఆనాటి రోజుల్లో కిరోసిన్ స్టవ్‌ను శుభ్రపరిచేందుకు వినియోగించేవారు. స్టవ్ బర్నర్ మూసుకుపోయినప్పుడు ఈ పిన్‌సాయంతో స్టవ్ బర్నర్‌ను శుభ్రం చేసేవారు. ఫలితంగా స్టవ్ పూర్తి ఫ్లేమ్‌తో మండేది. ఈ పిన్‌ను వినియోగించి స్టవ్‌ను శుభ్రం చేసినప్పుడు కిరోసిన్ బర్నర్ వరకూ చేరుకునేది. నాటి రోజుల్లో అధికశాతం ఇళ్లలో కిరోసిన్ స్టవ్ మాత్రమే ఉన్నకారణంగా, ఈ పిన్ ప్రతీ కిరాణా దుకాణంలో దొరికేది.
How many of you know what this is ????? pic.twitter.com/9bzsy15kU5
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 26, 2023
‘బాల్యం గుర్తుకు వచ్చింది’
ఈ ఫొటోను ట్విట్టర్‌లో @HasnaZarooriHai పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. ఈ ఫొటోతో పాటు దీనిని ఏమంటారో తెలుసా? అనే ప్రశ్న కూడా అడిగారు. దీనికి చాలామంది సమాధానం రాశారు. కొందరు దీనికి సరైన సమాధానం రాయగా, మరికొందరు తాము జీవితంలో ఇలాంటి వస్తువును చూడలేదని పేర్కొన్నారు. అయితే పలువురు దీనిని చూడగానే తమకు బాల్యం గుర్తుకువచ్చిందంటూ తమ అనుభవాలను షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ పోస్టుకు 22 లక్షల వీక్షణలు దక్కాయి. 5 వేల మంది దీనిని లైక్ చేశారు.
ఇది కూడా చదవండి: ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. సంబరపడిన బంధువులకు సడెన్ షాక్!
Comments
Please login to add a commentAdd a comment