pin
-
పిన్నీసు మింగిన మూడునెలల పసికందు..ప్రాణం కాపాడిన ఆంకురా ఆస్పత్రి వైద్యులు
అంకురా ఆస్పత్రి వైద్యులు ప్రాణ ప్రదాతలుగా నిలిచారు. అరుదైన ఆపరేషన్ చేసి మూడు నెలల పసికందుకు ప్రాణం పోశారు. ఇటీవల మూడు నెలల పసికందును.. పక్కనే ఆడుకొంటున్న తోబుట్టువుల వద్ద కుటుంబ సభ్యులు పడుకోబెట్టారు. ఆ సమయంలో పసికందు ఓ పన్నీసును మింగేసింది. ఊపిరి పీల్చుకోవడంతో పాటు ఇతర సమస్యలు తలెత్తడంతో అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు అంకురా ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రికి వచ్చిన వెంటనే అంకురా ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్టోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్ డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి పరీక్షలు నిర్వహించారు. రేడియోగ్రాఫిక్ పరీక్షల్లో పిన్నీసు కడుపులో గుచ్చుకున్నట్లు నిర్ధారించారు. ఇది ప్రాణాంతకంగా మారి పసికందుకు ప్రమాదమని భావించారు.వెంటనే డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠిల వైద్యుల బృందం పసికందు పొట్ట భాగంలో క్లిష్టమైన ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స చేశారు. మినిమల్ ఇన్వాసివ్ టెక్నిక్ ను ఉపయోగించి రెండు సెంటీమీటర్ల పిన్నీసును తొలగించారు. పసికందు ప్రాణాన్ని కాపాడారు. ఈ సందర్భంగా అంకురా హాస్పిటల్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ.. గృహోపకరణాలతో చిన్న పిల్లలకు ప్రమాదం పొంచిఉందని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ప్రాణాంతక పరిస్థితులను నివారించడంలో తల్లిదండ్రుల అవగాహన, వేగంగా స్పందించడం చాలా అవసరమని తెలిపారు. అంకురా హాస్పిటల్ సంరక్షణను అందించడమే కాకుండా రోగుల భద్రతకు కట్టుబడి ఉందని అన్నారు.మూడు నెలల పసికందుకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి మాట్లాడుతూ.. మేము ఎండోస్కోపీ ద్వారా పిన్నీసును విజయవంతంగా తొలగించాం. తీవ్రమైన సమస్యలను నివారించడానికి సకాలంలో చర్య అవసరం. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈ విధానం ద్వారా బాధితులకు ఓపెన్ సర్జరీ అవసరాన్ని తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. వెంటనే కోలుకోవచ్చని తెలిపారు. -
ఇదేమిటో తెలుసా? 90ల నాటి పిల్లలైతే ఇట్టే చెప్పేస్తారు!
మీరు 90లలో పుట్టారా? మీ సమాధానం ‘అవును’ అయితే పైన కనిపించే ఫొటోను చూస్తే మీ బాల్యం తప్పకుండా గుర్తుకువస్తుంది. ఆ సమయంలో ఈ వస్తువును ప్రతీ ఇంటిలోనూ వినియోగించేవారు. ఆ రోజుల్లో ఇంటింటా కిరోసిన్ వాసన వచ్చేది. వంటవండేందుకు కిరోసిన్ స్టవ్‌తో తంటాలు పడేవారు. మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇదేమిటో ఇట్టే చెప్పేస్తారు. అయితే మీరు దీనిని మరచిపోయి ఉంటే ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. ఇప్పటికైనా ఇదేమిటో మీకు తెలిసిందా? ఈ వస్తువును ప్రిమస్ పిన్ అని అంటారు. సాధారణంగా దీనిని పిన్ అనే అని పిలుస్తుంటారు. ఈ పిన్ను ఆనాటి రోజుల్లో కిరోసిన్ స్టవ్‌ను శుభ్రపరిచేందుకు వినియోగించేవారు. స్టవ్ బర్నర్ మూసుకుపోయినప్పుడు ఈ పిన్సాయంతో స్టవ్ బర్నర్‌ను శుభ్రం చేసేవారు. ఫలితంగా స్టవ్ పూర్తి ఫ్లేమ్‌తో మండేది. ఈ పిన్ను వినియోగించి స్టవ్‌ను శుభ్రం చేసినప్పుడు కిరోసిన్ బర్నర్ వరకూ చేరుకునేది. నాటి రోజుల్లో అధికశాతం ఇళ్లలో కిరోసిన్ స్టవ్ మాత్రమే ఉన్నకారణంగా, ఈ పిన్ ప్రతీ కిరాణా దుకాణంలో దొరికేది. How many of you know what this is ????? pic.twitter.com/9bzsy15kU5 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 26, 2023 ‘బాల్యం గుర్తుకు వచ్చింది’ ఈ ఫొటోను ట్విట్టర్లో @HasnaZarooriHai పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. ఈ ఫొటోతో పాటు దీనిని ఏమంటారో తెలుసా? అనే ప్రశ్న కూడా అడిగారు. దీనికి చాలామంది సమాధానం రాశారు. కొందరు దీనికి సరైన సమాధానం రాయగా, మరికొందరు తాము జీవితంలో ఇలాంటి వస్తువును చూడలేదని పేర్కొన్నారు. అయితే పలువురు దీనిని చూడగానే తమకు బాల్యం గుర్తుకువచ్చిందంటూ తమ అనుభవాలను షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ పోస్టుకు 22 లక్షల వీక్షణలు దక్కాయి. 5 వేల మంది దీనిని లైక్ చేశారు. ఇది కూడా చదవండి: ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. సంబరపడిన బంధువులకు సడెన్ షాక్! -
పిన్ అవసరం లేదు!.. పేమెంట్ ఫెయిల్ అయ్యే సమస్యే లేదు!
దేశీయ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన పేటీఎం యూపీఐ లైట్ (Paytm UPI LITE) యాప్ ద్వారా వన్ ట్యాప్ రియల్ టైమ్ యూపీఐ చెల్లింపులను ప్రారంభించింది. దీనివల్ల లావాదేవీలు ఎక్కువగా ఉండే సమయాల్లో చిన్న మొత్తంలో చేసే ఈ చెల్లింపులు విఫలమయ్యే ఆస్కారం ఉండదు. యూపీఐ పీర్ టు మర్చంట్ (పీ2ఎం) చెల్లింపులలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అగ్రగామిగా ఉంది. ఇదీ చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి! పేటీఎం తాజాగా ప్రారంభించిన యూపీఐ లైట్ యాప్ ఆన్లైన్ లావాదేవీలను వేగవంతం చేయడానికి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను 'ఆన్-డివైస్' వాలెట్‌తో భర్తీ చేస్తుంది. అంటే పేటీఎం యూజర్లు లావాదేవీలు చేయడానికి వారి పేటీఎం వాలెట్ లాగే యూపీఐ లైట్ వాలెట్‌కు కూడా డబ్బును జోడించుకోవచ్చు. ఒకసారికి ఎంత మొత్తం చేయొచ్చు? ఈ సర్వీస్‌ను సెటప్ చేసుకున్న యూజర్లు పేటీఎం యూపీఐ లైట్ ద్వారా రూ. 200 వరకు తక్షణ చెల్లింపులు చేయవచ్చు. ఇందు కోసం ఎటువంటి పిన్ అవసరం లేదు. పేటీఎం యూపీఐ లైట్ యూజర్లు రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2,000 జోడించుకోవచ్చు. అంటే మొత్తంగా రూ. 4,000 యాడ్ చేసుకోవచ్చు. అయితే ఒకసారికి గరిష్టంగా రూ.200 వరకు మాత్రమే చెల్లింపు చేయవచ్చు. ఏయే బ్యాంకులు? పేటీఎం యూపీఐ లైట్ యాప్‌కు ప్రస్తుతం 10 బ్యాంకులు మాత్రమే మద్దతిస్తున్నాయి. అవి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సగానికి పైగా చిన్న మొత్తాలే.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) 2022 మేలో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం యూపీఐ లావాదేవీలలో 50 శాతం రూ. 200 అంతకంటే తక్కువ మొత్తానివే. ఇటువంటి చిన్న మొత్తం లావాదేవీలు భారీ సంఖ్యలో ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థను ఆక్రమించాయి. దీంతో యూపీఐ లావాదేవీలు కొన్ని సార్లు నిలిచిపోతున్నాయి. రూ. 100 క్యాష్‌బ్యాక్ చిన్న మొత్తాల్లో చేసిన యూపీఐ చెల్లింపులు కస్టమర్ల బ్యాంక్ పాస్‌బుక్‌లను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ లైట్ ద్వారా చేసే చెల్లింపులు బ్యాంక్ పాస్‌బుక్‌లో కనిపించవు. ఈ చెల్లింపులను పేటీఎం బ్యాలెన్స్, హిస్టరీ విభాగంలో చూసుకోవచ్చు. పేటీఎం యూపీఐ లైట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. యూపీఐ లైట్ సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకునే యూజర్లకు పేటీఎం రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ఇదీ చదవండి: Fact Check: ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్! నిజమేనా? -
వామ్మో.. 8 నెలల చిన్నారి ఛాతి మధ్యలో ఏముందో తెలిస్తే షాకే..!
సాక్షి, కర్నూలు: మొనదేలిన పిన్నీసును 8 నెలల చిన్నారి మింగడంతో కర్నూలు వైద్యులు చాకచక్యంగా ఎండోస్కోపీ పరికరంతో దాన్ని తొలగించారు. శనివారం స్థానిక గాయత్రి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన చిన్నారి 8 నెలల నక్షత్ర శనివారం ఉదయం ఆడుకుంటూ పొరపాటును పిన్నీసును మింగేసిందన్నారు. చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం దీంతో తల్లిదండ్రులు పాపను తమ వద్దకు తీసుకు రాగా ఎక్స్‌రే తీసి చూడగా ఛాతి మధ్యలో ఊపిరితిత్తులకు దగ్గరగా ఉన్నట్లు గమనించామన్నారు. మొనదేలి ఉన్నందున లోపల గుచ్చుకోకుండా ఎండోస్కోపి పరికరంతో చాకచక్యంగా బయటకు తీశామన్నారు. చిన్నారులను తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలని, వారికి సమీపంలో ఇలాంటి వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. -
గుండుపిన్నుపై మట్టి గణపతి విగ్రహాన్ని తయారుచేసిన దయాకర్
-
బాలుడి గుండెలో గుండుసూది
యశవంతపుర: విద్యార్థి హృదయ భాగంలోని గుండుసూదిని వైద్యులు శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు. కర్ణాటకలోని మంగళూరు నగరంలో బజార్ పక్కలడ్కకి వీధికి చెందిన ఆబ్దుల్ ఖాదర్ కుమారుడు ముఖశ్కీర్(12)కు పదేపదే జ్వరం వస్తుండేది. పలువురు వైద్యుల వద్ద చూపించినా నయం కాలేదు. దీంతో మంగళూరులోని చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ రామ్‌గోపాలశాస్త్రి వద్దకు తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీయించి పరిశీలించగా హృదయ భాగంలో గుండుసూది ఉన్నట్లు తేలింది. దీంతో శుక్రవారం వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండుసూదిని బయటకు తీసి బాలుడి ప్రాణం కాపాడారు. చదవండి: చేపకు.. ఆపరేషన్ -
ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
అఫ్జల్‌గంజ్: ప్రమాదవశాత్తు సేప్టీ పిన్‌మింగిన బాలుడికి శస్త్రచికిత్స చేసి తొలగించిన సంఘటన ఉస్మానియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కొండన్నగూడ గ్రామానికి చెందిన చంద్రశేఖర్, అనూష దంపతుల కుమారుడు (8 నెలలు) ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ సేఫ్టీ పిన్ మింగాడు. దీనిని గుర్తించిన అతడి తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఎక్స్‌రే తీసిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారు బాలుడిని నీలోఫర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా వైద్యులు ఉస్మానియా ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి రెఫర్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఉస్మానియా ఎమర్జెన్సీ విభాగానికి రాగా, గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగాధిపతి డాక్టర్ రమేష్ నేతృత్వంలో 15 నిమిషాల్లోనే ఓపెన్ ఎడ్జ్డ్ సేప్టీ పిన్ను బయటికి తీశారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... ఎండోస్కోపి ద్వారా ఫారిన్ బాడీ స్కాన్‌చేసి తీయడం పెద్దవారిలో సహజమే అయినా 8 నెలల పసికందుకు ఎండోస్కోపి ద్వారా ఓపెన్ ఎడ్జ్డ్ సేప్టీపిన్ తీసివేయడం క్లిష్టమైన, అరుదైన విషయమన్నారు. చికిత్స నిర్వహించిన డాక్టర్ రమేష్, సహకరించిన ఇతర డాక్టర్లను ఆయన అభినందించారు. తమ బిడ్డను కాపాడిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
తక్షణమే ఏటీఎం పిన్ మార్చుకోండి!
ముంబై: బ్యాంకు ఏటీఎం కార్డు పిన్, ఆన్ లైన్ లావాదేవీల పాస్ వర్డ్ లు మార్చుకోవాల్సిందిగా బ్యాంకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హెచ్ డీఎఫ్ సీ, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంకు అధికారులు తమ ఖాతాదారులను ఎస్ ఎంఎస్ ల ద్వారా అలర్డ్ చేస్తున్నారు. కేరళ, ఢిల్లీ, చండీఘడ్ రాష్ట్రాల్లో వెలుగు చూసిన స్కాం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల ఇక్కడ ఏటీఎం కార్డు దారుల లక్షల రూపాయలు మాయమైన కేసులు నమోదు కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఏటీఎం మోసాలు పెరుగుతున్నాయంటూ ఖాతాదారులకు సేఫ్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. గార్డు లేని, జనావాసాలు లేని ప్రాంతాలలోని ఏటీఎం లావాదేవీలను నివారించాలని బ్యాంకులు కోరాయి. కాగా కేరళలో గత నెలలో రోమేనియన్ వ్యక్తి ఏటీఎం కేంద్రంలో స్కిమ్మింగ్ పరికరాన్ని అమర్చుతూ అరెస్టయిన సంగతి తెలిసిందే. -
మెదడులోని భావాలను మార్చవచ్చా?
ఎడిన్బర్గ్: గుండు సూది తీసుకొని మన శరీరం మీద గుచ్చుకుంటే కించిత్తు బాధ కలుగుతుంది. ఓ నిమ్మకాయ ముక్క తీసుకొని నాలుకకు రాసుకుంటే పులుపు, వగరు కలిసిన రుచి మనకు తెలుస్తుంది. ఇది మన ఒక్కరికే కాదు. ఎవరికైనా కలిగేదే. శాస్త్రవేత్తలకు కూడా ఇది అనుభవమే. ఏదైనా వస్తువును మనం చూసినప్పుడు అది మనల్ని ఆకర్షించడానికి, ఆకర్షించకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ వస్తువు ఆకృతి, డైమెన్షన్లు, రంగును బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని రంగులను చూస్తే మనకు ఆహ్లాదకరంగా ఉంటాయి. కొన్ని రంగులను చూస్తే ఇబ్బందిగా ఉంటాయి. డా విన్చీ వేసిన ‘మోనాలిసా’ చిత్రాన్ని చూస్తే ప్రశాంతమైన భావం కలుగుతుంది. ఎడ్వర్డ్ మంచ్ వేసిన ‘ది స్క్రీమ్’ చిత్రాన్ని చూస్తే కాస్తా ఆందోళన కలుగుతుంది. రంగులనుబట్టి మన మెదళ్లలో భావాలు మారుతాయని శాస్త్రవేత్తలు ఇదివరకే కనిపెట్టారు. నీలం, ఆకుపచ్చ రంగులు ప్రశాంతత కలిగిస్తే ఎరుపు రంగు ఆత్రుతను కలిగిస్తుంది. అందుకనే కోకకోలా క్యాన్స్, లిప్స్టిక్స్ ఎక్కువగా ఎరుపు రంగులోనే ఉంటాయి. అందరిలో ఒకే భావాలు కలుగుతాయా? అలా జరిగితే వారి మెదళ్లో కలిగే భావాలను మార్చవచ్చా? అన్న సందేహం స్కాట్‌ల్యాండ్‌లోని హెరైట్ వాట్ యూనివర్శిటీలో సీనియర్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ జార్జి స్టిలియోస్కు కలిగింది. ఆయన వెంటనే తన పీహెచ్డీ స్టూడెంట్ను తీసుకొని ఈ అంశంపై ప్రయోగానికి దిగారు. ఆయన తన పరిశోధన కోసం 20 మందిని ఎంపిక చేసుకున్నారు. అలాగే 20 రకాల బొమ్మలను ఎంపిక చేసుకున్నారు. అందులో కొన్ని ఒకే డిజైనివికాగా, కొన్ని పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒకే డిజైన్‌తో ఉన్నవి కూడా ఒకటి పలుచగా, మరొకటి మందంగా ఉండేలా చూసుకున్నరు. రంగుల వల్ల భావాలు మారే అవకాశం ఉండడంతో నలుపు, తెలుపులో ఉండే డిజైన్లనే ఎన్నుకున్నారు. వాటిని పరిశోధనల్లో పాల్గొన్న 20 మందికి చూపించి, ఏ బొమ్మలు బాగున్నాయో గుర్తించి మదిలో కలిగిన భావాలను తెలియజేయమన్నారు. అప్పుడు వారి గుండె, మెదడులో కలిగే స్పందనలను ఈఈజీ, ఈసీజీల మానిటర్ల ద్వారా రికార్డు చేశారు. వారిలో 80 శాతం మందిలో గుండె, మెదడు స్పందనలు ఒకేరకంగా ఉండడమే కాకుండా వారు వ్యక్తం చేసిన భావాలు, అభిప్రాయాలు కూడా ఒకే కరంగా ఉన్నాయని తేల్చారు. రెండో ప్రయోగం కింద కంప్యూటర్లో ఓ వస్త్రాన్ని మొదటి ప్రయోగం తరహాలోనే 20 రకాలుగా తయారు చేసి వారికి చూపించారు. మొదటి ప్రయోగం తరహాలోనే ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. 80 శాతం మంది ఒకే రకం అభిప్రాయలను, భావాలను వ్యక్తం చేయగా, మెదడులో ఏర్పడిన స్పందనలు కూడా ఒకేరకంగా ఉన్నాయి. ఆ తర్వాత వస్త్రం డిజైన్లను ఒకటి నుంచి రెండోదానికి, మూడు నుంచి నాలుగోదానికి, అటు నుంచి మళ్లీ మొదటికి ఇలా తారుమారు చేసి పలుసార్లు చూపించారు. అప్పుడు వారి అభిప్రాయాలు, భావాలు మారుతూ వచ్చాయి. ఏ భావాలు మెదడులో ఎక్కడ స్పందిస్తాయో అక్కడే స్పందనలు కనిపించాయి. అందరిలో ఒకే రకమైన భావాలు కూకుండా వేరువేరుగా కనిపించాయి. దీనిర్థం మెదడులో కలిగే భావాలను కూడా మనం ప్రభావితం చేయవచ్చని ఈ ప్రయోగం ద్వారా తేలిందని ప్రొఫెసర్ జార్జి స్టిలియోస్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని మరోసారి రంగుల చిత్రాలతో చేసి ఓ నిర్ధారణకు వస్తామని ఆయన చెప్పారు. మానసిక ఒత్తిడి, స్కిజోఫ్రేనిక్ లాంటి జబ్బులను నయం చేయడానికి తమ పరిశోధనలు దోహదపడతాయని జార్జి అన్నారు. దృష్టి వైద్యం అని కూడా పిలవచ్చన్నారు. అలాగే సైకోఆర్ట్, సైకోఆర్కిటెక్చర్, సైకోఇంటీరియర్ రంగాల అభివృద్ధికి బాటలు వేస్తుందని, చిత్రకళ బోధనకు కూడా ఓ అవగాహన ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
శ్రీవారి లడ్డూలో పిన్ను
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూలో పిన్ను కనిపించింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీవారి లడ్డూలు అందించేందుకు హైదరాబాద్ కు చెందిన శ్రీవారి సేవకులు సోమవారం తిరుమలకు వచ్చారు. భక్తులకు వారు లడ్డూలు మంజూరు చేస్తుండగా, ఓ లడ్డూలో పిన్ను ఉందంటూ ఓ భక్తుడు దాన్ని తిరిగిచ్చేశాడు. లడ్డూలో ఉన్న పిన్ను చూసి శ్రీవారి సేవకులు కూడా కంగుతిన్నారు. దాన్ని కొందరు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. భక్తులు ఇచ్చిన లడ్డూలో పిన్ను కనిపించిన మాట వాస్తవమేనని, దాన్ని టీటీడీ సిబ్బంది తీసుకుని డ్యామేజీ కింద రాసుకున్నారని శ్రీవారి సేవకుడు ఒకరు మంగళవారం మీడియాకు తెలిపారు. లడ్డూ తయారీ, నాణ్యత విషయంలో టీటీడీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటం గమనార్హం. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణనించారు. ఆ మేరకు పొరపాట్లకు సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తున్నారు.