తక్షణమే ఏటీఎం పిన్ మార్చుకోండి!
ముంబై: బ్యాంకు ఏటీఎం కార్డు పిన్, ఆన్ లైన్ లావాదేవీల పాస్ వర్డ్ లు మార్చుకోవాల్సిందిగా బ్యాంకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హెచ్ డీఎఫ్ సీ, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంకు అధికారులు తమ ఖాతాదారులను ఎస్ ఎంఎస్ ల ద్వారా అలర్డ్ చేస్తున్నారు. కేరళ, ఢిల్లీ, చండీఘడ్ రాష్ట్రాల్లో వెలుగు చూసిన స్కాం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల ఇక్కడ ఏటీఎం కార్డు దారుల లక్షల రూపాయలు మాయమైన కేసులు నమోదు కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఏటీఎం మోసాలు పెరుగుతున్నాయంటూ ఖాతాదారులకు సేఫ్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. గార్డు లేని, జనావాసాలు లేని ప్రాంతాలలోని ఏటీఎం లావాదేవీలను నివారించాలని బ్యాంకులు కోరాయి. కాగా కేరళలో గత నెలలో రోమేనియన్ వ్యక్తి ఏటీఎం కేంద్రంలో స్కిమ్మింగ్ పరికరాన్ని అమర్చుతూ అరెస్టయిన సంగతి తెలిసిందే.