
ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed Deposits) మరోసారి వడ్డీ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఇది రెండో సారి. తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.
కొత్త వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నవంబర్ 7 నుంచి అమలులోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలకు ఈ పెంపు వర్తిస్తుంది. 15 నెలల ఒక రోజు నుంచి 18 నెలల లోపు కాలవ్యవధి ఎఫ్‌డీలు 6.40% వడ్డీని పొందుతారు. 18 నెలల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీపై 6.50% వడ్డీని పొందనున్నారు.
సీనియర్ సిటిజన్స్
హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు ఎఫ్‌డీల వడ్డీ రేటు పెంచిన సంగతి తెలిసింతే. అయితే 60 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం పెంచిన వడ్డీ రేటుపై మరో 0.50 శాతం అదనపు రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో ఈ బ్యాంక్ ఖాతాదారులకు ఒకే సారి రెండు శుభవార్తలను అందించింది. బ్యాంక్‌లో వీరికి వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం కాగా గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. వీటితో పాటు రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచేసింది. 15 నెలల ఒక రోజు నుండి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి ఇప్పుడు 6.90% వడ్డీని అందిస్తోంది.
చదవండి: ఆ ఐఫోన్‌ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’!
Comments
Please login to add a commentAdd a comment