ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. దాదాపు ప్రతీ బ్యాంకు ఖాతాదారుడికి క్రెడిట్ కార్డు ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే అకౌంట్‌లో తగినంత డబ్బు లేకపోయినా, క్రెడిట్ ద్వారా సులువుగా కొనుగోళ్లు చేసుకునే వెసులుబాటుతోపాటు, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్‌ల , డిస్కౌంట్‌ల వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు క్రెడిట్ స్కోరుతో లోన్లను సులువుగా పొందవచ్చు. ఈనేపథ్యంలోనే గత రెండేళ్లలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తమ లిమిట్‌ను భారీగా పెంచు కున్నారు. క్రెడిట్ కార్డ్‌లపై బకాయిల మొత్తం రెండేళ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. అదేసమయంలో క్రెడిట్ కార్డ్‌లపై లావాదేవీ విలువ రెండింతల పెరిగిందని TruBoardPartners అధ్యయనం తెలిపింది.
రూ. 951 కోట్లు పెరిగిన క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్
సమాచార హక్కు చట్టం (RTI) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు 2022 ఆర్థిక సంవత్సంలో లో రూ. 3,122 కోట్ల నుండి 2023లో రూ.951 కోట్లు పెరిగి రూ. 4,073 కోట్లకు చేరాయి. (ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?)
క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అంటే ఏమిటి?
అవకాశం ఉంది కదా అని ఇబ్బబిముబ్బడిగావాడటం, చెల్లింపులు చేయకపోవడం ఆందోళన కరంగా మారుతోంది. విచక్షణా రహితంగా క్రెడిట్ కార్డు వాడేసి, తరువాత చెల్లించడంలో విఫలమైనా, అనుకోని కారణాలతో చెల్లింపులు చేయలేకపోయినా కూడా తిప్పలు తప్పవు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డ్ చెల్లింపు డిఫాల్ట్ అయితే పరిష్కారం ఏమిటి అనే విషయాలను ఒకసారి చూద్దాం. (జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్! )
క్రెడిట్ కార్డ్ ద్వారా సాధారణ ఖర్చులు, మెడికల్ బిల్లు,తదితర అత్యవసర కొనుగోళ్లు చేయవచ్చు. ఆ తరువాత వీటిని బ్యాంకు నిర్దేశించిన గడువు లోపల చెల్లించాలి. ఒకవేళ భారీగా ఖర్చు చేసి, దానిని చెల్లించలేకపోతే, వాయిదా పద్దతిలో చెల్లించే విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, దురదృష్టవశాత్తూ, ఉద్యోగం కోల్పోవడం, లేదా వ్యాపారంలో నష్టాలు, ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా క్రెడిట్ కార్డ్ బిల్ తిరిగి చెల్లించడం మీకు కష్టంగా అనిపించే సందర్భాలు ఉండవచ్చు. కష్టం కావచ్చు.కానీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించడంలో విఫలమైతే, మీరు అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్.
నెలల తరబడి క్రెడిట్ కార్డ్ బిల్లుకనీస మొత్తాన్ని కూడా చెల్లించడంలో విఫలమైతే..దానినే క్రెడిట్ కార్డ్ పేమెంట్ డిఫాల్ట్ అంటారు. 30 రోజుల పాటు చెల్లింపు చేయడంలో విఫలం కావడం తొలి తప్పు. ఆరు నెలలు పాటు కనీస చెల్లింపులు చేయకుండా ఉంటే మాత్రం క్రెడిట్ కార్డ్ ఖాతా వెంటనే డియాక్టివేట్ అవుతుంది. డిఫాల్ట్ లిస్ట్‌లోకి వెళుతుంది.
రీపేమెంట్‌కు సంబంధించి సదరు బ్యాంకు ఆయా ఖాతాదారులను సంప్రదిస్తాయి. దీని తర్వాత కూడా మీరు చెల్లించకపోతే, ఖాతా మూతపడుతుంది. ఈ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నో పేమెంట్ రిపోర్ట్ చేస్తారు.దీంతో క్రెడిట్ స్కోర్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. భవిష్యత్తులో రుణం తీసుకోవడం లేదా కొత్త క్రెడిట్ కార్డ్‌ని పొందడం కష్టం.
క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ పరిణామాలు
ఆలస్య చెల్లింపు రుసుములు ,అదనపు వడ్డీ ఛార్జీలు బ్యాంకులు బకాయిలపై 38 నుండి 42 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. లోన్లు రావడం కష్టం. క్రెడిట్ పరిమితి తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపును డిఫాల్ట్ అధిక-రిస్క్ రుణగ్రహీతగా మారిపోతారు.
చట్టపరమైన చర్యలు: రికవరీ కోసం బ్యాంక్ సివిల్ దావా వేయవచ్చు.కొన్ని సందర్భాల్లో, బ్యాంక్ మోసం చేసినందుకు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయవచ్చు.లీగల్ నోటీసును పంపవచ్చు.
రికవరీ ఏజెంట్ల బాధలు: క్రెడిట్ కార్డ్ చెల్లింపును తిరిగి పొందడానికి బ్యాంకు రుణ సేకరణ ఏజెన్సీల ద్వారా రికవరీ ఏజెంట్లను నియమిస్తే, వారి దూకుడుని, వేధింపులను తట్టు కోవడం కష్టం. ఇది లేనిపోని అవమానాలు,ఆందోళనకు కారణం కావచ్చు.
క్రెడిట్ కార్డ్ చెల్లింపు డిఫాల్ట్ అయితే ఏమి చేయాలి?
ఫస్ట్‌చేయాల్సిన పని: బ్యాంక్‌ని సంప్రదించి పరిస్థితిని వివరించడం, క్రెడిట్ స్కోర్‌కు మరింత నష్టం జరగకుండా ఉండాలంటే పాక్షిక చెల్లింపు చేయడం. తక్కువ వడ్డీ రేటు, తగ్గిన ఫీజులు లేదా ఆలస్య చెల్లింపు ఛార్జీల మినహాయింపు కోసంబ్యాంక్ అధికారులతో చర్చించాలి. వృత్తిపరమైన సహాయం కోరవచ్చు. తద్వారా రుణ చెల్లింపు, అలాగే క్రెడిట్ కార్డును తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకోవచ్చు. అలాగే వన్-టైమ్ సెటిల్‌మెంట్ అవకాశముందేమో పరిశీలించి సెటిల్ చేసుకోవడం.
మరిన్ని విషయాలు
కాబట్టి, సకాలంలో చెల్లింపులు చేయడం, క్రెడిట్ కార్డ్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించడం చాలా అవసరం. ఒక వేళ ఆర్థిక ఇబ్బందులెదురైతే, మీ క్రెడిట్ కార్డ్ చెల్లింపులో డిఫాల్ట్ కాకుండా ఉండటానికి మీ బ్యాంక్‌ను సంప్రదించి, సంబంధిత ఆప్షన్స్ ఎంచుకోవడం బెటర్.జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చే RBI మార్గదర్శకాల ప్రకారం, కార్డ్ జారీచేసేవారు కార్డ్ హోల్డర్‌లకు 7-రోజుల నోటీసు వ్యవధిని ఇవ్వాలి, క్రెడిట్ బ్యూరోలకు డిఫాల్టర్‌గా నివేదించాలనే ఉద్దేశ్యం గురించి సంబంధిత ఖాతాదారులకు తెలియజేయాలి. బకాయిలనుచెల్లించడానికి గడువు ఇవ్వాలి. సెటిల్మెంట్ , డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. ఇవి 7 సంవత్సరాల వరకు మీ రికార్డ్‌లో కనిపిస్తాయి!
Comments
Please login to add a commentAdd a comment