settlement
-
పరువు నష్టం కేసులో రాజీ.. ట్రంప్‌కు రూ.127 కోట్లివ్వనున్న ఏబీసీ
న్యూయార్క్: పరువు నష్టం కేసులో కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఏబీసీ న్యూస్ ఛానల్ రాజీ కుదుర్చుకోనుంది. ఇందులో భాగంగా సుమారు రూ.127 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తమ వెబ్సైట్లో ఒక నోట్‌ను ఉంచేందుకు ముందుకొచ్చింది. ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ రచయిత్రి జీన్ కరోల్ కోర్టు కెక్కారు. గతేడాది విచారణ చేపట్టిన న్యాయస్థానం లైంగిక దాడి, ప్రతిష్టకు భంగం కలిగించడం వంటి నేరాలకు రూ.42 కోట్లు ఆమెకు చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. ఇదే కేసులో ఈ ఏడాది జనవరిలో మరికొన్ని ఆరోపణలపై మరో రూ.700 కోట్ల చెల్లించాలని తీర్పు వెలువరించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ కోర్టు రేప్ అనే మాటను ఎక్కడా పేర్కొనలేదు. అయితే, ఏబీసీ న్యూస్ ఛానెల్ ప్రముఖ యాంకర్ జార్జి స్టెఫనోపౌలోస్ మార్చి 10వ తేదీన కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ మేస్తో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా జీన్ కరోల్‌ను ట్రంప్ రేప్ చేసినట్లు రుజువైందంటూ పదేపదే వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. -
500 షేర్లకు T+0 సెటిల్మెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా టీప్లస్‌జీరో (T+0) సెటిల్మెంట్ను మరింత విస్తరించింది. లావాదేవీ చేపట్టిన రోజే సెటిల్మెంట్కు వీలు కల్పించే విధానంలోకి 500 కంపెనీల షేర్లను చేర్చింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా 500 కంపెనీల స్టాక్స్‌కు ఆప్షనల్‌గా టీప్లస్‌జీరో సెటిల్మెంట్ను వర్తింపచేయనుంది.నిబంధనలకు లోబడి టీప్లస్‌జీరో, టీప్లస్వన్ సెటిల్మెంట్ సైకిళ్లకు విభిన్న బ్రోకరేజీ చార్జీలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సెబీ తొలుత 2024 మార్చిలో 25 కంపెనీల స్టాక్స్ ద్వారా టీప్లస్‌జీరో సెటిల్మెంట్కు తెరతీసింది. నాన్కస్టోడియన్ క్లయింట్లకు మాత్రమే ఇది వర్తింపచేసింది. తదుపరి అభిప్రాయ సేకరణ చేపట్టి సెటిల్మెంట్ను విస్తరించింది. 2024 డిసెంబర్31కల్లా టాప్–500 కంపెనీల షేర్లు టీప్లస్‌జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేర్చుతూ సర్క్యులర్‌ను జారీ చేసింది.2025 జనవరి నుంచి అట్టడుగున ఉన్న 100 కంపెనీలు సెటిల్‌మెంట్‌లోకి రానున్నాయి. ఆపై ప్రతీ నెలా ఇదే రీతిలో 100 కంపెనీలు చొప్పున జత కానున్నాయి. వెరసి ప్రస్తుత 25 కంపెనీలతో కలిపి 525 షేర్లు టీప్లస్‌జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేరనున్నాయి. వీటికి ఉదయం 8.45–9 సమయంలో ప్రత్యేక బ్లాక్ డీల్ విండోను ఏర్పాటు చేయనుంది. ఐసీఈఎక్స్కు చెల్లు సెబీ తాజాగా ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఐసీఈఎక్స్) మూసివేతకు అనుమతించింది. రెండేళ్ల క్రితమే స్టాక్ ఎక్స్ఛేంజీ గుర్తింపును రద్దు చేయగా.. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఐసీఈఎక్స్ కార్యకలాపాల నిలిపివేతకు ఓకే చెప్పింది. వెరసి ఎక్స్ఛేంజీ విభాగం నుంచి ఐసీఈఎక్స్ వైదొలగనుంది. అయితే ఆదాయపన్ను నిబంధనలను అమలు చేయవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. పేరు మార్పుసహా గతకాలపు లావాదేవీలను డేటాబేస్ నుంచి తొలగించవలసిందిగా ఐసీఈఎక్స్ను సెబీ ఆదేశించింది. -
కొల్లేరులోని లంక గ్రామాల్లో పెద్దలదే పెత్తనం
కొల్లేరులో పెదరాయుళ్ల జమానా బలంగా నడుస్తోంది. అడ్డగోలు తీర్పులతో కుటుంబాలను విభజించడం, అన్యాయంగా కొన్ని కేసుల్లో బాధితులను ఇబ్బందులు పెట్టేలాంటి తీర్పులు తరచూ లంక గ్రామాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే తరహా తీర్పులతో కుల కట్టుబాట్ల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నా ఉన్నతాధికారులు నోరుమెదపలేని పరిస్థితి. అనేక ఘటనలు తెర మీదకు వచ్చి ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా విచారణల పేరుతో వదిలేస్తున్నారు. తాజాగా చేతబడి నెపంతో ఒక కుటుంబాన్ని తీవ్రంగా కొట్టి గాయపరచడం, మరో కేసులో అడ్డగోలుగా భార్యాభర్తలకు విడాకులు ఇప్పించడం వివాదాస్పదంగా మారాయి. – సాక్షి ప్రతినిధి, ఏలూరుకొల్లేరులో పంచాయతీలకు సమాంతరంగా బంటాపెద్దలు తీర్పులు చెబుతూ సమాంతర పంచాయితీ నడుపుతున్నారు. సాధారణంగా తప్పు చేస్తే స్టేషన్‌కు వెళ్లే సంస్కృతి లేకుండా తప్పు జరిగితే బంటా పెద్దలకు ఫిర్యాదు చేయడం, వారే సెటిల్మెంట్ చేయడం కొల్లేరులోని ప్రజలు వారి తీర్పును వ్యతిరేకిస్తే గ్రామానికి వచ్చే అక్రమ చేపల చెరువుల ఆదాయంలో వాటాలు ఇవ్వబోమని బెదిరించడం, సాంఘిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించడం చేస్తూ నిరాటంకంగా తమ జమానా కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొల్లేరు పెదరాయుళ్ళ హవా రెట్టించింది. అన్ని రాజకీయ పార్టీలకూ కొల్లేరు ఓట్లు అత్యంత కీలకం. 4 నియోజకవర్గాలు.. 9 మండలాల్లో విస్తరించిన కొల్లేరులో 122 గ్రామాలున్నాయి. బంటా పెద్దలదే పెత్తనం, ఓటింగ్ విషయంలో వీరి మాటే చెల్లుతుండటంతో అధికార పార్టీ సహా అందరూ పెద్దల మాటకు తలొగ్గాల్సిన పరిస్థితులున్నాయి.కొల్లేరు స్వరూపం ఇదీ..నియోజకవర్గాలు: ఉంగుటూరు, దెందులూరు, ఉండి, కైకలూరు మండలాలు: కైకలూరు, మండవల్లి, ఏలూరు రూరల్ మండలం, పెదపాడు, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, ఉండిగ్రామాలు : 122జనాభా: 3.50 లక్షలుకుటుంబాలు: 78 వేలుఓట్లు : 1.75 లక్షలుకట్టేసి కొట్టడమే కొన్నింటిలో శిక్షలుఉదాహరణకు భార్య, భర్త విడిపోతే వివాహ సమయంలో భర్త తీసుకున్న లాంచనాలు సర్వం చెల్లించేస్తే విడాకులు మంజూరవుతాయి. వివాహేతర సంబంధం కేసుల్లో అయితే వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి వివాహిత భర్తకు పరిహారం ఇస్తే కేసు సెటిల్ అయిపోతుంది. అది కూడా కేసును బట్టి లక్షల్లోనే ఉంటుంది. ఇక చేతబడులు, ఇతరత్రా అనుమానాలు అయితే కట్టేసి కొట్టడమే శిక్ష. ఇలాంటి అనైతిక చర్యలు నేటికీ కొల్లేరులో కొనసాగుతున్నాయి. తాజాగా కైకలూరు మండలం చటాకాయి గ్రామంలో చేతబడి నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను కొల్లేరు పెద్దల తీర్పుతో చితకబాదారు. అక్టోబరు 25న కమ్యూనిటీ హాలు వద్ద స్తంభాలకు కట్టేసి గ్రామపెద్దల సమక్షంలో 18 మంది కలసి కర్రలతో కొట్టారు. వీరిలో బాధితుడు సైదు రఘు ఏకంగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. మరో ఇద్దరు మోరు రాంబాబు, జయమంగళ ధనుంజయ ఏలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ కేసులో ఆరుగురిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కొందరు బాధితులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏలూరు రూరల్ మండల శ్రీపర్రులో భార్యాభర్తలకు విడాకులు అడ్డగోలుగా ఇప్పించడంపై భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శ్రీపర్రు గ్రామానికి చెందిన సుభాష్‌తో కైకలూరు మండలం చటాకాయి గ్రామానికి చెందిన మహిళకు 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. గత నెల 27న గ్రామ పెద్దలు ఏకంగా రాతపూర్వకంగా విడాకుల తంతు పూర్తి చేశారు. దీంతో బాధిత మహిళ.. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిషోర్‌లకు ఇటీవల ఫిర్యాదు చేసింది.1952 నుంచి తీర్పులుఒడిశాకు చెందిన ఒక తెగ వందల ఏళ్ల క్రితం కొల్లేరు ప్రాంతానికి వచ్చి చేపలు పట్టుకోవడం ప్రధాన వృత్తిగా ఎంచుకుని లంక గ్రామాల్లో స్థిరపడిపోయింది. 1952 నుంచి కొల్లేరులో బంటా పెద్దల పాలనకు తెర లేచింది. అందరికీ ఆదాయాన్ని చూపి పెద్దల పెత్తనం సాగిస్తుంటారు. ఉదాహరణకు ఒక గ్రామ పరిధిలో 500 ఎకరాల్లో అభయారణ్యం ఉంటే దానిలో కొందరు పెట్టుబడిదారులతో చెరువులు వేయించి ఎకరాకు రూ.లక్ష చొప్పున కౌలుకు తీసుకుని గ్రామంలో ఎంతమంది మగవారు ఉంటే అంతమందికి వాటాలేసి ప్రతి ఏటా బంటా పెద్దలు ఆదాయం ఇస్తుంటారు. కొన్ని కీలక ఘటనల్లో బాధితులు స్టేషన్లకువెళ్లినా..ఉన్నతాధికారులను కలిసినా వారిని కట్టుబాట్ల పేరుతో వేధించడం, బహిష్కరణకు గురి చేస్తున్నారు. 122 గ్రామాల్లో పంచాయతీ పాలన ఉండి, సర్పంచులు ఉన్నప్పటికీ వ్యవస్థ నడిపేది బంటా పెద్దలే. ఒక్కో గ్రామంలో 10 మందితో పెద్దలు కమిటీలా ఏర్పడి ప్రతిరోజూ కమ్యూనిటీ హాలు వద్ద పంచాయితీలు చేస్తుంటారు. -
బైజూస్‌కు మరో ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్(థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌క్లాట్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సెటిల్మెంట్ నగదు రూ.158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్(సీఓసీ) వద్ద డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. ఎన్‌క్లాట్ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. 61 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో బైజూస్‌పై ఆ కంపెనీ వ్యవస్థాపకులైన బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజూ రవీంద్రన్ మరోసారి నియంత్రణ కోల్పోనున్నారు. బీసీసీఐతో రూ.158.9 కోట్ల వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి బైజూస్ అంగీకరించడంతో ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా ఆగస్టు 2న ఎన్‌క్లాట్ తీర్పు ఇచ్చింది. -
కస్టమర్లకు భారీ పరిహారం చెల్లిస్తున్న యాపిల్..
-
కోర్టులతో ప్రజలు విసిగిపోయారు: సీజేఐ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: న్యాయప్రక్రియపై చీఫ్‌జస్టిస్‌ఆఫ్‌ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. శనివారం(ఆగస్టు3) సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక లోక్‌అదాలత్ వారోత్సవాల కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రజలు సెటిల్మెంట్లు కోరుకుంటున్నారన్నారు. జడ్జిలకు ఇది ఆందోళన కలిగించే విషయమేనని అభిప్రాయపడ్డారు. కేసుల సెటిల్మెంట్లో లోక్‌అదాలత్‌లది కీలక పాత్ర అని చెప్పారు. లోక్‌అదాలత్‌లో సెటిల్ చేసుకున్న కేసుల్లో అప్పీల్ ఉండదని తెలిపారు. -
దివాలా అస్త్రం నుంచి బయటపడ్డ బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దివాలాకు సంబంధించిన ఎన్సీఎల్టీ వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈమేరకు బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. బెంగళూరు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్– చెన్నై బెంచ్) కొట్టివేసింది. దాంతో బైజూస్‌కు ఊరట లభించినట్లయింది.బీసీసీఐ స్పాన్సర్షిప్ కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బైజూస్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు కుదిరిన రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, అండర్‌టేకింగ్‌లో పేర్కొన్న నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగితే, తిరిగి బైజూస్‌పై దివాలా ప్రక్రియ పునరుద్ధరించేలా హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసింది. అమెరికా రుణదాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. బైజూస్ తాను తీసుకున్న రుణాలను నిర్దిష్ట లక్ష్యాలకు కాకుండా ‘రౌండ్–ట్రిప్పింగ్’కు వినియోగించుకుందని పేర్కొన్నారు. గతంలో చేసిన ఈ ఆరోపణలను కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. దానికి తగిన సాక్ష్యాలను అందించడంలో రుణదాతలు విఫలమయ్యారని పేర్కొంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ సోదరుడు–రిజు రవీంద్రన్ తన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను ఇప్పటివరకూ రుణ చెల్లింపులకు వినియోగించినట్లు పేర్కొంటూ... రౌండ్ ట్రిప్పింగ్ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని తెలిపింది. రుణ చెల్లింపుల షెడ్యూల్ ఇదీ... ఒప్పందం ప్రకారం, రిజు రవీంద్రన్ జూలై 31న బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లు చెల్లించారు. శుక్రవారం (ఆగస్టు 2న) మరో రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 9న ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు. వివాదమేమిటీ? బీసీసీఐ, బైజూస్‌లు 2019 జూలై 25న కుదుర్చుకున్న ’టీమ్ స్పాన్సర్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..భారత క్రికెట్ జట్టు కిట్‌పై తన ట్రేడ్‌మార్క్/బ్రాండ్ పేరును ప్రదర్శించే ప్రత్యేక హక్కు బైజూస్‌కు ఉంది. అలాగే క్రికెట్ సిరీస్‌ల ప్రసార సమయంలో ప్రకటనలు, ఆతిథ్య హక్కులనూ కలిగి ఉంది. 2023 మార్చి 31 తేదీ వరకూ ఈ సర్వీసులు బైజూస్‌కు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి బైజూన్ (కార్పొరేట్ డెబిటార్), ఆపరేషనల్ క్రెడిటార్ (బీసీసీఐ)కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2022లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్‌కు సంబంధించి బైజూస్ ఒక ఇన్వాయిస్పై రూ. 25.35 కోట్లు చెల్లించింది. తదుపరి ఇన్వాయిస్లకు చెల్లించడంలో విఫలమైంది. రూ.143 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని బీసీసీఐ క్యాష్ చేసుకున్నప్పటికీ అది పూర్తి బకాయిని కవర్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆసియా కప్, ఐసీసీ టి20లతో సహా సిరీస్‌లు, టూర్లకు ఆగస్టు 2022 నుంచి జనవరి 2023 మధ్య స్పాన్సర్షిప్ రుసుము రూ.158.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనితో బీసీసీఐ బైజూస్‌పై ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించింది. బైజూన్ రూ.159 కోట్లు చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ, మాతృ సంస్థ థిక్ అండ్ లేర్న్పై దివాలా చర్యలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్‌ను జులై 16న అనుమతిస్తూ, ఎన్సీఎల్టీ మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవను నియమించింది. దాంతో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రన్ ఐఆర్‌పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. అయితే దీనిపై బైజూస్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.కష్టాల కడలిలో... బైజూస్ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే మహమ్మారి నియంత్రణలను సడలించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడం ఎడ్టెక్ సంస్థకు గొడ్డలిపెట్టయ్యింది. బ్లాక్‌రాక్ ఇటీవల సంస్థ విలువను 1 బిలియన్ డాలర్లను తగ్గించింది. రెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ డెడ్లైన్లను పాటించడంలో విఫలమవడం, రాబడి అంచనాలకు 50 శాతానికి పైగా తగ్గించడం వంటి అంశాలతో కంపెనీ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రోసస్ అండ్ పీక్ 15సహా బైజూస్ మాతృసంస్థలో పెట్టుబడిపెట్టిన వారంతా ఫిబ్రవరిలో జరిగిన అసాధారణ సమావేశంలో (ఈజీఎం) ‘‘తప్పుడు నిర్వహణ విధానాలు– వైఫల్యాల‘ ఆరోపణలతో రవీంద్రన్‌ను సీఈఓగా తొలగించాలని వోటు వేశారు. అయితే రవీంద్రన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వోటింగ్ చట్టబద్దతను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.భారీ విజయమిది: బైజూస్ ఎడ్టెక్ సంస్థకు, వ్యవస్థాపకులకు ఇది భారీ విజయమని బైజూస్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్ ఈ పరిణామంపై మాట్లాడుతూ, తాజా ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వు్య కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదని, గత రెండేళ్లలో బైజూ కుటుంబం చేసిన వీరోచిత ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. తమ వ్యవస్థాపక బృందం సభ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, వారి త్యాగం నిరుపమానమైందన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ప్రతి కష్టం పోరాడాలన్న తమ దృఢ నిశ్చయాన్ని పటిష్ట పరిచాయని అన్నారు. -
రూ.20 వేల కోట్ల సెటిల్మెంట్కు వారెన్ బఫ్ఫెట్
వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ ‘హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ అమెరికా దేశవ్యాప్తంగా వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20 వేల కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది.రియల్ బ్రోకరేజీలు తమ నుంచి అధికంగా బ్రోకర్ కమీషన్లు వసూలు చేశాయంటూ అమెరికాలోని గృహ యజమానులు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రతిపాదిత సెటిల్మెంట్ ద్వారా తమ 51 బ్రాండ్లు, దాదాపు 70,000 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, 300 ఫ్రాంఛైజీలకు ఈ వ్యాజ్యాల నుంచి విముక్తి లభిస్తుందని హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా తెలిపింది.కెల్లర్ విలియమ్స్ రియాల్టీ, రీ/మ్యాక్స్, కంపాస్, ఎనీవేర్ రియల్ ఎస్టేట్‌తో సహా అనేక ఇతర పెద్ద బ్రోకరేజ్ సంస్థలు ఇదివరకే సెటిల్మెంట్కు సిద్ధమైన నేపథ్యంలో ‘హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ కంపెనీ కూడా సెటిల్మెంట్ సిద్ధమైంది. గత నెలలో, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ 418 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది. -
25 షేర్లలో నేటి నుంచి కొత్త సెటిల్మెంట్.. టీప్లస్‌జీరో
స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నేటి(గురువారం) నుంచి టీప్లస్‌జీరో సెటిల్మెంట్కు తెరతీస్తున్నాయి. తొలుత 25 షేర్లలో ఆప్షనల్ పద్ధతిన అమలు చేయనున్నాయి. ఈక్విటీ నగదు మార్కెట్లో ప్రస్తుతం అమలవుతున్న టీప్లస్1 సెటిల్మెంట్కు జతగా పరిశీలన పద్ధతిలో టీప్లస్0కు శ్రీకారం చుడుతున్నాయి. కొద్దిమంది బ్రోకర్ల ద్వారా మాత్రమే ఇందుకు వీలు కలి్పస్తున్నాయి. వెరసి ఈ నెల 28 నుంచి లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్మెంట్ పూర్తికానుంది. ఈ జాబితాలో బజాజ్ ఆటో, వేదాంతా, హిందాల్కో, ఎస్బీఐ, ట్రెంట్, టాటా కమ్యూనికేషన్స్, నెస్లే, సిప్లా, ఎంఆర్ఎఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, అంబుజా సిమెంట్స్ తదితరాలున్నాయి. తాజా సెటిల్మెంట్తో సమయం, వ్యయాలు ఆదా అవుతాయని అంచనా. మార్కెట్ లావాదేవీల్లో ఈ వ్యవస్థ మరింత పారదర్శకత తీసుకువస్తుందని భావిస్తున్నారు. -
తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు..
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ పూర్తయింది. తహసీల్దార్ల నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వరకు పలు రకాల దరఖాస్తు లను పరిష్కరించే అధికారాలను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ స్థాయి అధికారులకు ఏయే దర ఖాస్తులను పరిష్కరించేఅధికారం ఇవ్వాలో నిర్దేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలో ధరణి పోర్టల్ దరఖాస్తులను పరిష్కారించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా స్థాయిల్లోని అధికారులు వారికి కేటాయించిన మాడ్యూళ్లలోని దరఖాస్తుల పరిష్కారంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్నీ భద్రపర్చాల్సిందే.. క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల నేతృత్వంలో కలెక్టర్లు కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించనున్నాయి. ఒకవేళ దరఖాస్తుదారుడు తగిన డాక్యుమెంట్లను సమర్పించని పక్షంలో వాటిని తెప్పించుకోవాల్సి ఉంటుంది. పెండింగ్ దరఖాస్తులన్నింటినీ వేగంగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఏ దరఖాస్తునూ పెండింగ్‌లో లేకుండా చర్యలకు ఉపక్రమించాలి. ప్రతి లావాదేవీని ఎలక్ట్రానిక్ రికార్డ్ చేసి భద్రపర్చాలి. ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దరఖాస్తుల పరిష్కారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి.. తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తుల పరిష్కారానికి సేత్వార్, ఖాస్రా పహాణీ, సేస్లా పహాణీ, ఆర్వోఆర్ రికార్డులను సరిచూసుకోవాలి. ఫీల్డ్ లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలపాలి. ఆర్డీవో స్థాయి అధికారికి టీఎం 33లోని డేటా కరెక్షన్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్ల మిస్సింగ్‌ల పరిష్కార బాధ్యతలు అప్పగించారు. వారికి ఎకరం రూ. 5 లక్షలోపు ఉన్న భూములు, ఏరియాలకు సంబంధించిన అధికారం కట్టబెట్టారు. ఆర్డీవోలు తహసీల్దార్ ద్వారా విచారణ జరపాలి. తహసీల్దార్ ఇచ్చింన నివేదికలు, ఆర్డర్లను పున:పరిశీలించాలి. అన్ని స్థాయిల్లో సమస్యలు, పెండింగ్‌ల పరిష్కారానికి ఈ దఫా నిర్ణీత కాలపరిమితి నిర్దేశించారు. తహసీల్దార్, ఆర్డీవోల స్థాయిల్లో జరుగుతున్న పురోగతిని కలెక్టర్లు, జిల్లాలవారీ పురోగతిని సీసీఎల్ఏ పర్యవేక్షించాల్సి ఉంటుంది. -
అదే రోజు సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ట్రేడ్ చేసిన రోజే సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చే దిశగా సెబీ కీలక అడుగు వేసింది. అదే రోజు సెటిల్మెంట్ (సేమ్‌డే), వెనువెంటనే (రియల్ టైమ్) సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ప్రవేశపెట్టడానికి సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో షేర్ల కొనుగోలు, విక్రయ లావాదేవీలకు ప్రస్తుతం టీప్లస్1 విధానం అమల్లో ఉంది. అంటే ట్రేడ్ చేసిన రోజు కాకుండా తదుపరి పని దినం రోజున ఆ షేర్ల సెటిల్మెంట్ (విక్రయించిన వారి నుంచి తీసుకుని, కొనుగోలు చేసిన వారికి జమ చేయడం) చేస్తున్నారు. టీప్లస్1 విధానాన్ని సెబీ 2021లో దశలవారీగా అమల్లోకి తీసుకొచి్చంది. అంతకుముందు వరకు టీప్లస్2 విధానం ఉండేది. టీప్లస్5 స్థానంలో టీప్లస్3ని 2002లో ప్రవేశపెట్టారు. 2003లో టీప్లస్2 అమల్లోకి వచి్చంది. అదే రోజు సెటిల్మెంట్ విధానం వల్ల షేర్లను విక్రయించిన వారికి ఆ రోజు ముగింపు లేదా మరుసటి రోజు ఉదయానికి నిధులు అందుబాటులోకి వస్తాయి. షేర్లను కొనుగోలు చేసిన వారికి ఖాతాల్లో అదే రోజు జమ అవుతాయి. దీనివల్ల మరింత లిక్విడిటీ, ఇన్వెస్టర్లకు సౌకర్యం లభిస్తుంది. ఈ సంప్రదింపుల పత్రంపై జనవరి 12 వరకు సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రజలను సెబీ కోరింది. ఐచ్ఛికంగా.. సెక్యూరిటీలు, నిధుల క్లియరింగ్, సెటిల్మెంట్కు టీప్లస్0, ఇన్స్టంట్ సెటిల్మెంట్ సైకిల్‌ను ప్రస్తుత టీప్లస్1 విధానంతోపాటు ఐచి్ఛకం అమలును ప్రతిపాదిస్తున్నట్టు సెబీ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెక్యూరిటీల మార్కెట్ల అభివృద్ధికి సెబీ వరుసగా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. తక్షణ సెటిల్మెంట్ సైకిల్‌ను అమల్లోకి తీసుకురావడమే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఉద్దేశ్యంగా ఉంది. నిజానికి ఇన్వెస్టర్ షేర్లను కొనుగోలు చేయాలంటే, ముందుగా అందుకు సంబంధించిన నిధుల మొత్తాన్ని తన ఖాతాకు జోడించుకోవడం తప్పనిసరి. అప్పుడే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అలాగే, షేర్ల విక్రయానికి (డెలివరీ) సైతం ఆయా సెక్యూరిటీలను కలిగి ఉండాలి. అప్పుడే బ్రోకర్లు ట్రేడ్లను అనుమతిస్తారు. కనుక తక్షణ సెటిల్మెంట్ ఆచరణ సులభమేనని సెబీ భావిస్తోంది. దీనివల్ల సెక్యూరిటీలు, నిధులను తక్షణమే ఇన్వెస్టర్లు పొందడానికి వీలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆందోళనలు.. ‘‘నూతన విధానం వల్ల లిక్విడిటీ తగ్గిపోతుందని, సమర్థమైన ధరల అన్వేషణపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అలాగే, ట్రేడ్లు చేయడానికి ముందే నిధులు, సెక్యూరిటీలు కలిగి ఉండాల్సి రావడం వల్ల ట్రేడింగ్ వ్యయం పెరిగిపోతుందని.. ఫలితంగా టీప్లస్1 సెటిల్మెంట్ సైకిల్‌తో పోలిస్తే టీప్లస్0 విధానంలో ధరల వ్యత్యాసానికి దారితీస్తుంద్న ఆందోళన ఉంది’’అని సెబీ పేర్కొంది. ఈ ఆందోళనలను తగ్గించేందుకు వీలుగా టీప్లస్0, టీప్లస్1నూ వినియోగించుకునే వెసులుబాటును కలి్పస్తున్నట్టు తెలిపింది. తద్వారా రెండు విధానాల మధ్య ధరల అంతరాన్ని తొలగించుకోవచ్చని పేర్కొంది. రెండింటి మధ్య సెక్యూరిటీ ధరల్లో అంతరం ఉంటే ఆర్బిట్రేజ్ ద్వారా ప్రయోజనం, లిక్విడిటీని పొందొచ్చని తెలిపింది. రెండు దశల్లో మొదటి దశలో టీప్లస్0 విధానాన్ని మధ్యా హ్నం 1.30 గంటల వరకు ఐచి్ఛకంగా అమలు చేయవచ్చు. ఈ వ్యవధిలోపు నమోదైన ట్రేడ్స్‌కు సంబంధించి నిధులు, సెక్యూరిటీల పరిష్కారాన్ని సాయంత్రం 4.30 గంటలకు పూర్తి చేస్తారు. రెండో దశలో ఇన్స్టంట్ ట్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది 3.30 గంటల వరకు ఉంటుందని సెబీ సంప్రదింపుల పత్రం స్పష్టం చేస్తోంది. -
తుది దశకు డ్రోన్ సర్వే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో కీలకమైన డ్రోన్ సర్వే (డ్రోన్లతో భూముల కొలత) తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 97 శాతం సర్వే పూర్తయింది. మిగిలిన 3 శాతాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయడానికి సర్వే, సెటిల్మెంట్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని 17,595 గ్రామాలకు గాను, డ్రోన్ సర్వే సాధ్యం కాని 4,135 గ్రామాలను మినహాయిస్తే 13,460 గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 13,075 గ్రామాల్లో దాదాపు 1.75 కోట్ల ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఇంకా కేవలం 385 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కావాల్సి ఉంది. వీటిలో శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వే జరగాల్సి ఉంది. ఈ నెలాఖరుకు మొత్తం గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని సర్వే శాఖ అధికారులంటున్నారు. ఇది పూర్తయితే రీ సర్వేలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసినట్లవుతుంది. మొత్తం 1.80 కోట్ల ఎకరాలను కొలిచినట్లవుతుంది. ఇది ఒక రికార్డుగా అధికారులు చెబుతున్నారు. వేగంగా పూర్తి చేసేందుకు... వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏరియల్ సర్వే కోసం డ్రోన్లతోపాటు విమానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. సర్వే ఆఫ్ ఇండియాతోపాటు ప్రైవేట్ డ్రోన్ ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 వేలమంది సర్వేయర్లను నియమించడంతోపాటు సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేయర్లకు పైలెట్లుగా శిక్షణ ఇచ్చి సర్వే చేయిస్తోంది. దీంతో సర్వే అత్యంత వేగంగా పూర్తవుతోంది. -
కొంపముంచుతున్న క్రెడిట్ కార్డు బకాయిలు: డిఫాల్ట్ అయితే ఏం చేయాలో తెలుసా?
ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. దాదాపు ప్రతీ బ్యాంకు ఖాతాదారుడికి క్రెడిట్ కార్డు ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే అకౌంట్లో తగినంత డబ్బు లేకపోయినా, క్రెడిట్ ద్వారా సులువుగా కొనుగోళ్లు చేసుకునే వెసులుబాటుతోపాటు, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్ల , డిస్కౌంట్ల వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు క్రెడిట్ స్కోరుతో లోన్లను సులువుగా పొందవచ్చు. ఈనేపథ్యంలోనే గత రెండేళ్లలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తమ లిమిట్‌ను భారీగా పెంచు కున్నారు. క్రెడిట్ కార్డ్‌లపై బకాయిల మొత్తం రెండేళ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. అదేసమయంలో క్రెడిట్ కార్డ్‌లపై లావాదేవీ విలువ రెండింతల పెరిగిందని TruBoardPartners అధ్యయనం తెలిపింది. రూ. 951 కోట్లు పెరిగిన క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ సమాచార హక్కు చట్టం (RTI) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు 2022 ఆర్థిక సంవత్సంలో లో రూ. 3,122 కోట్ల నుండి 2023లో రూ.951 కోట్లు పెరిగి రూ. 4,073 కోట్లకు చేరాయి. (ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?) క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అంటే ఏమిటి? అవకాశం ఉంది కదా అని ఇబ్బబిముబ్బడిగావాడటం, చెల్లింపులు చేయకపోవడం ఆందోళన కరంగా మారుతోంది. విచక్షణా రహితంగా క్రెడిట్ కార్డు వాడేసి, తరువాత చెల్లించడంలో విఫలమైనా, అనుకోని కారణాలతో చెల్లింపులు చేయలేకపోయినా కూడా తిప్పలు తప్పవు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డ్ చెల్లింపు డిఫాల్ట్ అయితే పరిష్కారం ఏమిటి అనే విషయాలను ఒకసారి చూద్దాం. (జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్! ) క్రెడిట్ కార్డ్ ద్వారా సాధారణ ఖర్చులు, మెడికల్ బిల్లు,తదితర అత్యవసర కొనుగోళ్లు చేయవచ్చు. ఆ తరువాత వీటిని బ్యాంకు నిర్దేశించిన గడువు లోపల చెల్లించాలి. ఒకవేళ భారీగా ఖర్చు చేసి, దానిని చెల్లించలేకపోతే, వాయిదా పద్దతిలో చెల్లించే విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, దురదృష్టవశాత్తూ, ఉద్యోగం కోల్పోవడం, లేదా వ్యాపారంలో నష్టాలు, ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా క్రెడిట్ కార్డ్ బిల్ తిరిగి చెల్లించడం మీకు కష్టంగా అనిపించే సందర్భాలు ఉండవచ్చు. కష్టం కావచ్చు.కానీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించడంలో విఫలమైతే, మీరు అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్. నెలల తరబడి క్రెడిట్ కార్డ్ బిల్లుకనీస మొత్తాన్ని కూడా చెల్లించడంలో విఫలమైతే..దానినే క్రెడిట్ కార్డ్ పేమెంట్ డిఫాల్ట్ అంటారు. 30 రోజుల పాటు చెల్లింపు చేయడంలో విఫలం కావడం తొలి తప్పు. ఆరు నెలలు పాటు కనీస చెల్లింపులు చేయకుండా ఉంటే మాత్రం క్రెడిట్ కార్డ్ ఖాతా వెంటనే డియాక్టివేట్ అవుతుంది. డిఫాల్ట్ లిస్ట్‌లోకి వెళుతుంది. రీపేమెంట్‌కు సంబంధించి సదరు బ్యాంకు ఆయా ఖాతాదారులను సంప్రదిస్తాయి. దీని తర్వాత కూడా మీరు చెల్లించకపోతే, ఖాతా మూతపడుతుంది. ఈ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నో పేమెంట్ రిపోర్ట్ చేస్తారు.దీంతో క్రెడిట్ స్కోర్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. భవిష్యత్తులో రుణం తీసుకోవడం లేదా కొత్త క్రెడిట్ కార్డ్‌ని పొందడం కష్టం. క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ పరిణామాలు ఆలస్య చెల్లింపు రుసుములు ,అదనపు వడ్డీ ఛార్జీలు బ్యాంకులు బకాయిలపై 38 నుండి 42 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. లోన్లు రావడం కష్టం. క్రెడిట్ పరిమితి తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపును డిఫాల్ట్ అధిక-రిస్క్ రుణగ్రహీతగా మారిపోతారు. చట్టపరమైన చర్యలు: రికవరీ కోసం బ్యాంక్ సివిల్ దావా వేయవచ్చు.కొన్ని సందర్భాల్లో, బ్యాంక్ మోసం చేసినందుకు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయవచ్చు.లీగల్ నోటీసును పంపవచ్చు. రికవరీ ఏజెంట్ల బాధలు: క్రెడిట్ కార్డ్ చెల్లింపును తిరిగి పొందడానికి బ్యాంకు రుణ సేకరణ ఏజెన్సీల ద్వారా రికవరీ ఏజెంట్లను నియమిస్తే, వారి దూకుడుని, వేధింపులను తట్టు కోవడం కష్టం. ఇది లేనిపోని అవమానాలు,ఆందోళనకు కారణం కావచ్చు. క్రెడిట్ కార్డ్ చెల్లింపు డిఫాల్ట్ అయితే ఏమి చేయాలి? ఫస్ట్చేయాల్సిన పని: బ్యాంక్‌ని సంప్రదించి పరిస్థితిని వివరించడం, క్రెడిట్ స్కోర్‌కు మరింత నష్టం జరగకుండా ఉండాలంటే పాక్షిక చెల్లింపు చేయడం. తక్కువ వడ్డీ రేటు, తగ్గిన ఫీజులు లేదా ఆలస్య చెల్లింపు ఛార్జీల మినహాయింపు కోసంబ్యాంక్ అధికారులతో చర్చించాలి. వృత్తిపరమైన సహాయం కోరవచ్చు. తద్వారా రుణ చెల్లింపు, అలాగే క్రెడిట్ కార్డును తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకోవచ్చు. అలాగే వన్-టైమ్ సెటిల్మెంట్ అవకాశముందేమో పరిశీలించి సెటిల్ చేసుకోవడం. మరిన్ని విషయాలు కాబట్టి, సకాలంలో చెల్లింపులు చేయడం, క్రెడిట్ కార్డ్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించడం చాలా అవసరం. ఒక వేళ ఆర్థిక ఇబ్బందులెదురైతే, మీ క్రెడిట్ కార్డ్ చెల్లింపులో డిఫాల్ట్ కాకుండా ఉండటానికి మీ బ్యాంక్‌ను సంప్రదించి, సంబంధిత ఆప్షన్స్ ఎంచుకోవడం బెటర్.జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చే RBI మార్గదర్శకాల ప్రకారం, కార్డ్ జారీచేసేవారు కార్డ్ హోల్డర్లకు 7-రోజుల నోటీసు వ్యవధిని ఇవ్వాలి, క్రెడిట్ బ్యూరోలకు డిఫాల్టర్‌గా నివేదించాలనే ఉద్దేశ్యం గురించి సంబంధిత ఖాతాదారులకు తెలియజేయాలి. బకాయిలనుచెల్లించడానికి గడువు ఇవ్వాలి. సెటిల్మెంట్ , డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. ఇవి 7 సంవత్సరాల వరకు మీ రికార్డ్‌లో కనిపిస్తాయి! -
సెబీకి రూ. 72.64 కోట్లు కట్టిన ఎన్ఎస్ఈ..
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ 2021 ఫిబ్రవరిలో ఎదురైన ట్రేడింగ్ అవాంతర కేసును పరిష్కరించుకుంది. సొంత అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ క్లియరింగ్ లిమిటెడ్(ఎన్సీఎల్)తో కలసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 72.64 కోట్లు చెల్లించడం ద్వారా ట్రేడింగ్ అవాంతర వివాదాన్ని సెటిల్ చేసుకుంది. ఎన్ఎస్ఈ దాదాపు రూ. 50 కోట్లు, ఎన్సీఎల్ సుమారు రూ. 23 కోట్లు చొప్పున చెల్లించాయి. 2021 ఫిబ్రవరి 24న ఎన్ఎస్ఈలో దాదాపు నాలుగు గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టెలికం లింకులు విఫలంకావడంతో ఎన్‌సీఎల్‌కు చెందిన ఆన్లైన్ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోయినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. ఎన్ఎస్ఈలో నమోదయ్యే అన్ని లావాదేవీలనూ క్లియరింగ్తోపాటు సెటిల్మెంట్ బాధ్యతలను ఎన్సీఎల్ నిర్వహిస్తుంది. -
టిక్‌టాక్ కార్ థెఫ్ట్ చాలెంజ్: రాజీకి వచ్చిన హ్యూందాయ్, కియా..
హ్యూందాయ్, కియా కంపెనీలకు చెందిన కొన్ని మోడళ్ల కార్లను ఎంత సులువుగా దొంగిలించవచ్చో చూపించారు కొందరు టిక్‌టాకర్లు. ‘టిక్‌టాక్ థెఫ్ట్ ఛాలెంజ్’ పేరుతో అమెరికాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీని తర్వాత కార్ దొంగతనం బాధితులు ఈ రెండు కార్ల కంపెనీలపై కోర్టులో 200 మిలియన్ డాలర్లకు ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించుకునేందుకు హ్యుందాయ్, కియా కంపెనీలు ఎట్టకేలకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు బాధితులతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం... దావా పరిష్కారం కోసం దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల కంపెనీలకు 200 మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుంది. దీంట్లో అధిక మొత్తం కార్ల దొంగతనం సంబంధిత నష్టాలను భర్తీ చేసేందుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బాధితులతో కార్ల కంపెనీలు చేసుకున్న రాజీ ఒప్పందాన్ని ఆమోదించాలా వద్దా అనేది కోర్టు ఇష్టం. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు హ్యూందాయ్, కియా కంపెనీల కార్లను సులభంగా దొంగిలించవచ్చని చూపించే వీడియోలు టిక్‌టాక్‌లో వ్యాప్తి చెందడంతో అమెరికాలో గత సంవత్సరం ఆయా కంపెనీలకు చెందిన కార్ల దొంగతనాలు పెరిగాయి. యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) ప్రకారం.. ఛాలెంజ్‌తో ముడిపడి ఉన్న కారు దొంగతనాలు కనీసం 14 క్రాష్‌లు, ఎనిమిది మరణాలకు దారితీశాయి. దొంగతనాలపై సోషల్ మీడియాలో జరిగిన ప్రమోషన్ వల్ల అమెరికాలో ప్రస్తుతం ఉన్న సుమారు 9 మిలియన్ల హ్యుందాయ్, కియా కార్లు ప్రమాదంలో పడ్డాయని ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్హెచ్టీఎస్ఏ ప్రకారం.. హ్యుందాయ్, కియా కంపెనీలు తమ కార్లలో ఇప్పటికే యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేశాయి. కార్ ఓనర్లకు పదివేల స్టీరింగ్ వీల్ లాక్‌లను అందించాయి. ఇదీ చదవండి: కారు కొన్న ఆనందం.. డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహింద్రా స్పందనేంటో తెలుసా? -
వివాద్ సే విశ్వాస్–2 స్కీము ముసాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన వివాద్ సే విశ్వాస్ 2 స్కీము ముసాయిదాను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, కాంట్రాక్టర్లు, ప్రజలు దీనిపై మార్చి 8లోగా తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. ముసాయిదా ప్రకారం వివాదంపై విచారణ దశను బట్టి కాంట్రాక్టర్లకు సెటిల్మెంట్ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. ఒకవేళ న్యాయస్థానం లేదా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసి ఉంటే .. క్లెయిమ్ అమౌంటులో 80 శాతం లేదా ఉత్తర్వుల్లో పేర్కొన్న దానిలో 60 శాతం మొత్తం ఆఫర్ చేయవచ్చు. ఇక పనులు నిలిపివేసినా లేదా రద్దయిన కాంట్రాక్టులకు సంబంధించి ఇది నికరంగా క్లెయిమ్ చేసిన దానిలో 30 శాతంగా ఉంటుంది. వివాదాస్పద కాంట్రాక్టుపై లిటిగేషన్, పనులు కొనసాగుతుంటే ఇది 20 శాతానికి పరిమితమవుతుంది. ఒకవేళ మొత్తం క్లెయిమ్ అమౌంటు రూ. 500 కోట్లు దాటిన పక్షంలో ఆర్డరు ఇచ్చిన సంస్థలకు కాంట్రాక్టరు ఇచ్చే సెటిల్మెంట్ ఆఫర్‌ను తిరస్కరించే ఆప్షను ఉంటుంది. కానీ, అందుకు తగిన కారణాన్ని చూపాలి. సంబంధిత శాఖ, విభాగం కార్యదర్శి లేదా కంపెనీ అయితే సీఈవో దీన్ని ఆమోదించాలి. -
Russia-Ukraine War: యుద్ధం– శాంతి కింకర్తవ్యం!
(ఎస్.రాజమహేంద్రారెడ్డి) ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. రష్యా సేనలు ప్రతీకారేచ్ఛతో ముందూ వెనకా చూసుకోకుండా వరుసపెట్టి దాడులు చేస్తున్నాయి. కీవ్‌ను హస్తగతం చేసుకుని ఉక్రెయిన్ను తమ కబంధ హస్తాలతో ఆక్రమించుకోవాలనేదే రష్యా ఆశగా కనిపిస్తోంది. తలవంచడానికి సిద్ధంగా లేని ఉక్రెయిన్ వీరోచితంగా ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ స్థాయి ప్రతిఘటనను ఆర్నెల్ల కింద యుద్ధం మొదలైనప్పుడు ఎవరూ ఊహించలేదు. రష్యా ఒక్క ఉదుటున ఉక్రెయిన్‌లోకి చొరబడి దాడికి దిగగానే కథ రెండు మూడు వారాల్లోనే ముగుస్తుందని భావించారు. ఉక్రెయిన్ పరిస్థితిని చూసి జాలి పడ్డవాళ్లూ ఉన్నారు. అటు నాటో కానీ, ఇటు అమెరికా కానీ తొలినాళ్లలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు సంశయించాయి. కానీ, ఆర్నెల్లు దాటిపోయినా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతి దాడులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అంచనాలను వమకమే చేస్తూ ఉక్రెయిన్ నిలబడి పోరాడుతూనే ఉంది. ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మంకుపట్టు వీడటం లేదు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్థైర్యాన్ని కోల్పోవడం లేదు. మరి యుద్ధం ఎప్పుడు ముగిసేను?! ఉక్రెయిన్ రష్యా నీడలోకి వచ్చేదాకా అని పుతిన్ అంటాడు, వచ్చే ఏడాదిలో తమ విజయంతోనే ముగుస్తుందని అంటాడు! పెనం నుంచి పొయ్యిలోకి... ఉక్రెయిన్‌లో యుద్ధం ఇప్పుడు రెండు ప్రాంగణాలుగా విడిపోయింది. తూర్పులో డోన్బాస్ ప్రాంతాన్ని రష్యా దాదాపు పూర్తిగా ఆక్రమించేసుకుంది. మిగతా కొద్ది ప్రాంతాన్ని కాపాడుకుందామని ఉక్రెయిన్ సేనలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు దక్షిణాన చేజారిన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకోవడానికి ఉక్రెయిన్ సంసిద్ధమవుతోంది. ప్రాణనష్టం లెక్కలపై వైరిపక్షాలు ఎంత బింకానికి పోయినా భారీ మూల్యాన్నే చెల్లించాయి. రష్యా దాదాపు 80 వేల మంది సైనికులను కోల్పోయిందని పెంటగాన్ అంచనా. క్షతగాత్రులు ఇంకెంతమందో! రష్యా అమ్ములపొది కూడా ఖాళీ అవుతూ వస్తోంది. ఉక్రెయిన్‌కూ ప్రాణనష్టం భారీగానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం దాడుల తీవ్రతను బట్టి రోజుకు 100 నుంచి వెయ్యి మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా కనీసం 12 వేల మంది సామాన్యులు కూడా చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఐరాస అంచనా. నిజానికి పౌర నష్టం అంచనాలకు మించి ఉందనేది నిపుణుల వాదన. మరింత ఆయుధ సాయం చేయాలనడమే కాకుండా నేరుగా కీవ్‌లో అమెరికా రక్షణ దళాలను మోహరించాలని జెలెన్స్కీ తాజాగా అభ్యర్థించడం పరిస్థితికి అద్దం పడుతోంది. తిండికి అల్లాడుతున్న దేశాలు యుద్ధానికి మరోవైపు చూస్తే ఆహార సంక్షోభం పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గోధుమలు, మొక్కజొన్నలు, బార్లీ ఉత్పత్తుల్లో రష్యా, ఉక్రెయిన్‌లదే ప్రపంచంలో అగ్ర స్థానం. యుద్ధం వల్ల రవాణా నిలిచిపోవడంతో ఈ రెండు దేశాల దిగుమతులపై ఆధారపడ్డ పలు దేశాలు దాదాపు కరువు పరిస్థితులతో అల్లాడుతున్నాయి. గత నెల రెండు దేశాలు ఒప్పందానికి వచ్చి ఉక్రెయిన్‌లోని ఆహార ధాన్యాల ఎగుమతులకు అంగీకరించాయి. కానీ 45 దేశాల్లోని కోట్లాది మందికి ఇవి సరిపోతాయా అన్నదే ప్రశ్న. మరోవైపు యుద్ధానికి ముగింపు ఎప్పుడన్నది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నగానే ఉంది. ఇటీవలే పశ్చిమ దేశాలు సమకూర్చిన అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్ స్థైర్యం కాస్త ఇనుమడించింది. దేశ దక్షిణాది ప్రాంతాల్లో తిష్ట వేసి కూర్చున్న రష్యా సేనలను తరిమికొట్టడమే వ్యూహంగా ఉక్రెయిన్ సాగుతోంది. అత్యంత కీలకమైన ఖెర్సన్‌ను తిరిగి చేజిక్కించుకుంటే ఉక్రెయిన్ ఒక ముందడుగు వేసినట్టేనని నిపుణుల అంచనా. అదే జరిగితే రష్యాకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అసలే అరకొర సైన్యంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రష్యాను ఇది మరిన్ని కష్టాల్లోకి నెడుతుంది. రిటైరైన సైనికులను సైతం యుద్ధానికి సన్నద్ధం చేయాల్సి వస్తుంది. ఇది పుతిన్‌కు సుతరామూ ఇష్టం లేకున్నా, తప్పేట్టు లేదు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో తమ పట్టును కొనసాగిస్తే జెలెన్స్కీకి కష్టకాలం మొదలైనట్టే. మరీ మొండితనానికి పోయి యావత్ సైన్యాన్ని దక్షిణంలోనే మోహరించడానికి ఉక్రెయిన్ సిద్ధపడితే తూర్పు ప్రాంతంలో రష్యాకు పూర్తిగా తలొంచక తప్పదని అంచనా. ఇదంతా ఒకెత్తయితే ఇప్పటిదాకా అంటీముట్టనట్టు ఉన్న చైనా బాహాటంగా రష్యాకు తమ మద్దతు ప్రకటించి రంగంలోకి దిగితే యుద్ధ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. యుద్ధం తొలినాళ్లలోనే చైనాను రష్యా సైనిక మద్దతు కోరడం తెలిసిందే. మరో ప్రచ్ఛన్న యుద్ధం దిశగా... ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక, ఆయుధ సాయం ఒకరకంగా యుద్ధాన్ని ప్రేరేపించినట్టే అయిందన్న వాదన కూడా ఉంది. చినికిచినికి గాలివాన అయినట్టు చివరికిది రెండు అగ్రరాజ్యాల మధ్య పోరుగా మారితే పరిణామాలు భయానకంగా ఉంటాయి. ప్రపంచ శాంతి అల్లకల్లోలం అవుతుంది. అణ్వాయుధ ప్రయోగానికి కూడా వెనకాడనంటూ పుతిన్ ఇప్పటికే బెదిరించడం తెలిసిందే. నాటోకు, రష్యాకు మధ్య ఈ పోరు ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీయకముందే అమెరికా వంటి దేశం సంధికి ప్రయత్నిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే మధ్యేమార్గంగా కనీసం యుద్ధ విరామానికన్నా ప్రయత్నించి చర్చలకు తెర తీయాలి. పోనీ, యుద్ధం కొనసాగుతుండగానే చర్చలను మొదలుపెట్టినా బాగానే ఉంటుంది. ఏదో ఒక ముగింపు తప్పక దొరికే అవకాశముంటుంది. రష్యా తన విధ్వంసక దాడులను ఆపకపోతే అటు అమెరికా, ఇటు నాటో ఉక్రెయిన్‌కు ఇలాగే సాయాన్ని కొనసాగించడం తప్పనిసరవుతుంది. కాబట్టి యుద్ధానికి రాజకీయ పరిష్కారం దిశగా రెండు దేశాలు కదిలేలా చేయడానికి ఇదే సరైన సమయం. ఈ బాధ్యతను అమెరికా, నాటో దేశాలే భుజానికెత్తుకోవాలి. లేదంటే దౌత్యం కూడా వీలుపడని స్థాయికి పరిస్థితి చేజారే రోజు ఎంతో దూరం లేదు! -
ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్బుక్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ నెత్తిన మరోపిడుగు పడింది. ఉద్యోగుల విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో భారీ పెనాల్టీ విధించింది అమెరికా న్యాయ విభాగం. 14.5 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో సుమారు 107 కోట్ల రూపాయల దాకా) పెనాల్టీకి ఆదేశించింది. ఈ మేరకు ఫేస్బుక్ ఒక మెట్టు కిందకు దిగి.. ఒప్పందానికి రావడంతో వాదప్రతివాదనలకు ఆస్కారం లేకుండా వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్‌ను ఉల్లంఘించిందనే ఆరోపణల ఆధారంగా ఫేస్బుక్ మీద అమెరికా న్యాయ విభాగం గత డిసెంబర్లో ఒక కేసు నమోదు చేసింది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు బదులు తాత్కాలిక ఉద్యోగులకు(విదేశీ ఉద్యోగులు, హెచ్ 1-బీ వీసాదారులు తదితరులు) ప్రాధాన్యత ఇవ్వడంలాంటి చర్యలకు పాల్పడింది ఫేస్బుక్. ఇది ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ నిబంధనలకు విరుద్దమేనని లేబర్ విభాగం సైతం వాదించింది. ఈ తరుణంలో సెటిల్మెంట్కు ముందుకొచ్చిన ఫేస్బుక్.. భారీ పెనాల్టీ చెల్లింపునకు అంగీకరించింది. ఇక ఫేస్‌బుక్‌తో జరిగిన ఈ సెటిల్మెంట్ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు అమెరికా అటార్నీ జనరల్(సహాయక) క్రిస్టన్ క్లార్క్ . 35 ఏళ్లలో ఇదే అతిపెద్ద సివిల్ రైట్స్ విభాగపు సెటిల్మెంట్గా పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యోగులకు బదులు.. తాత్కాలిక వీసాదారులకు పీఈఆర్ఎం కింద (permanent labor certification program) ఫేస్బుక్ ఉద్యోగాలు ఇవ్వడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సివిల్ పెనాల్టీ కింద 4.75 మిలియన్ డాలర్లు, ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపించినందుకు మరో 9.5 మిలియన్ డాలర్లు పెనాల్టీ చెల్లించాలని ఒప్పందం చేసుకుంది ఫేస్బుక్. చదవండి: మాజీ ఉద్యోగి చిచ్చు..వందల కోట్లు ఖర్చుకు సిద్ధమైన జుకర్‌బెర్గ్ ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ కలత.. రాజీనామా? -
లైంగిక వేధింపులు.. రూ.7 వేల కోట్లకు సెటిల్మెంట్
లాస్ ఏంజెలిస్: మాజీ క్యాంపస్ గైనకాలజిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వందలాది మంది మహిళలకు 1 బిలియన్ డాలర్లకు పైగా(7,246,00,00,000 రూపాయలు) చెల్లించడానికి కాలిఫోర్నియాలోని ఒక ఉన్నత విశ్వవిద్యాలయం అంగీకరించింది. ఈ విషయాన్ని బాధితుల తరఫు న్యాయవాది ఒకరు గురువారం మీడియాకు వెల్లడించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా(యూఎస్సీ) ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు లాస్ ఏంజెలిస్ కోర్టుకు తెలిపింది. గతంలో 2018లో ఫెడరల్ క్లాస్ చర్య ఫలితంగా ఇప్పటికే 215 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఈ సందర్భంగా న్యాయవాది గ్లోరియా ఆల్రెడ్ మాట్లాడుతూ.. ‘‘సివిల్ లిటిగేషన్ చరిత్రలో లైంగిక వేధింపుల కేసులో ఇంత భారీ మొత్తంలో చెల్లించడానికి అంగీకరించడం ఇదే ప్రథమం’’ అన్నారు. ఈ లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రబుద్ధుడు ఎవరు.. ఏంటి అనే వివరాలు.. జార్జి టిండాల్(74) అనే వ్యక్తి తన 30 ఏళ్ల సర్వీసులో వందల మంది మహిళలను లైంగిక వేదింపులకు గురి చేశాడు. వీరిలో మైనర్ల నుంచి మధ్య వయసు మహిళల వరకు ఉన్నారు. మెడికల్ చెకప్ కోసం వచ్చిన ఆడవారిని టిండాల్ లైంగికంగా వేధించేవాడు. రోగుల వ్యక్తిగత శరీర అవయాలను ఫోటోలు తీయడం.. ప్రైవేట్ పార్ట్స్‌ని తాకడం.. శరీరాకృతి గురించి చండాలమైన కామెంట్స్ చేయడం వంటివి చేసేవాడు. అంతేకాక యూనివర్సిటీలో ఎక్కువగా ఉన్న ఆసియా ఖండం విద్యార్థులను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడేవాడు. ఇలా సాగిపోతున్న ఇతడి అరాచకాల గురించి 1990లో మొదటి సారి ఓ టీనేజ్ యువతి ఫిర్యాదు చేయడంతో టిండాల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. మెడికల్ చెకప్ కోసం వెళ్లిన తనను టిండాల్ అసభ్యకర రీతిలో తాకుతూ.. అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ టిండాల్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించడంలో విఫలమైనందుకు వేలాది మంది మాజీ రోగులు విశ్వవిద్యాలయంపై కేసు వేశారు. వైద్యుడి చర్యల గురించి సంస్థకు తెలుసని.. అయినప్పటికి అతడిపై చర్యలు తీసుకోకుండా సర్వీసులోనే కొనసాగించారని బాధితులు ఆరోపించారు. పైగా 2016 వరకు యూఎస్సీ అధికారులు టిండాల్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయలేదని.. ఈ విశ్వవిద్యాలయంతో ఉన్న స్నేహపూర్వక ఒప్పందం వల్ల టిండాల్ పదవీ విరమణ చేయడానికి అంగీకరించారని బాధితులు తెలిపారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్సీ ఇప్పటికే 200,000 డాలర్టు(1,45,23,803 రూపాయలు) చెల్లించినట్లు తెలిసింది. "కొన్నిసార్లు అతడి వద్ద పరీక్షలకు హాజరైన నర్సులు టిండాల్ దుర్మర్గాలను ప్రత్యక్షంగా చూశారని’’ న్యాయవాది తెలిపారు. బాధితుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘యూఎస్సీ హెల్త్ సెంటర్లో ఎన్నో వందల మంది మహిళలు ఏళ్ల తరబడి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్సీ పలు తప్పుడు కథనాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఇవన్ని అవాస్తవాలని మేం నిరూపించగలం. అలానే తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను నేను అభినందిస్తున్నాను. వారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను’’ అన్నారు. ఇక నేరం రుజువైతే టిండాల్ 53 ఏళ్ల పాటు జైళ్లో ఉంటాడు. చదవండి: తండ్రి లైంగిక వేధింపులు: కాల్చి పడేసిన కూతురు -
మిస్త్రీకి మరోసారి షాకిచ్చిన టాటా సన్స్
సాక్షి, న్యూఢిల్లీ: వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో తుది వాదనలు కొనసాగుతున్నాయి. హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాలకు బదులుగా టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లను కేటాయించాలంటూ ఎస్పీ గ్రూప్ ప్రతిపాదించింది. అయితే, ఇది అర్థరహితమైన ప్రతిపాదనంటూ టాటా సన్స్ తోసిపుచ్చింది. అలా చేస్తే టాటా గ్రూప్‌లో భాగమైన ఇతర లిస్టెడ్ కంపెనీల్లో ఎస్పీ గ్రూప్ మళ్లీ మైనారిటీ వాటాలు తీసుకున్నట్లవుతుందే తప్ప పెద్ద తేడా ఉండబోదని పేర్కొంది. టాటా సన్స్ తరఫున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, ఎస్పీ గ్రూప్‌నకు సంబంధించిన సైరస్ ఇన్వెస్ట్మెంట్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీఏ సుందరం వాదనలు వినిపించారు. దీనిపై విచారణ సోమవారం కూడాకొనసాగనుంది. టాటా సన్స్‌తో విభేదాల నేపథ్యంలో అందులో వాటాలు విక్రయించి వైదొలగాలని ఎస్పీ గ్రూప్ భావిస్తోంది. అయితే, వేల్యుయేషన్ విషయంలో సమస్య వచ్చి పడింది. టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాల విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్పీ గ్రూప్ వాదిస్తుండగా, ఇది కేవలం రూ. 70,000-80,000 కోట్ల మధ్య ఉంటుందని టాటా సన్స్ చెబుతోంది. -
ఆఖరి అస్త్రం : మాల్యా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్మెంట్ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం. అయితే మాల్యా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. బ్యాంకుల కన్సార్షియం మునుపటి ఆఫర్లను ఇప్పటికే తిరస్కరించింది. మరి తాజా ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో చూడాలి. (మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు) టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బ్యాంకులతో పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్టు మాల్యా న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే పరిష్కారం మొత్తం ఎంత ప్రతిపాదించారు అనేదానిపై స్పష్టత లేదు. అసలు రుణాలు, వాటిపై ఇప్పటి వరకు అయిన వడ్డీతో కలిపి 13,960 కోట్లు రూపాయలను చెల్లిస్తామంటూ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (మాల్యా అప్పగింతపై సందేహాలు) కాగా 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేత ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. మరోవైపు శరణార్ధిగా దేశంలో ఉండేందుకు అంగీకరించాలంటూ బిట్రన్ ప్రభుత్వాన్ని మాల్యా అభ్యర్థించిన సంగతి తెలిసిందే. -
ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!
వాషింగ్టన్: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు అమెరికా నియంత్రణ సంస్థలు భారీ జరిమానా విధించనున్నాయి. సోషల్ నెట్‌వర్క్‌ల గోప్యత, సమాచార రక్షణలో లోపాలు వంటి కారణాలకు గానూ ఫేస్‌బుక్‌పై జరిమానా విధించేందుకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) సిద్ధమవుతోంది. దర్యాప్తు సెటిల్మెంట్లో భాగంగా ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌పై రూ.34,280 కోట్ల (5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించనుంది. దీనికి సంబంధించిన వివరాలను వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో ప్రచురించింది. వ్యక్తిగత భద్రతా వైఫల్యాలకు ఓ సంస్థపై ఎఫ్‌టీసీ ఇంత భారీజరిమానా విధించడం ఇదే తొలిసారి. దీనికి అమెరికా న్యాయశాఖ ఇంకా ఆమోదించలేదు. సెటిల్మెంట్లో భాగంగా వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఫేస్‌బుక్‌కు కొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు 2011లో ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌తో ప్రైవసీ సెటిల్మెంట్ చేసుకుంది. దీని ప్రకారం వినియోగదారుల సమాచారాన్ని తమ వ్యాపార భాగస్వామ్య సంస్థలకు అందించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అలా చేయని పక్షంలో జరిమానా విధించే హక్కు ఉంటుంది. -
జెఫ్ బెజోస్ మాజీ భార్య సంచలన నిర్ణయం
అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ (54), మెకంజీ (48) దంపతులు అధికారికంగా విడిపోయారు. తాము విడిపోబోతున్నామని ఇటీవల ప్రకటించిన తెలిసిందే. గురువారం వీరి విడాకుల అంశం తేలిపోవడంతో మెకంజీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రేమించే భర్తే లేనపుడు అతని సొమ్ము మాత్రం ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదుగానీ భర్తనుంచి వచ్చే భారీ సొమ్మును తృణప్రాయంగా త్యజించేశారు. సోషల్ మీడియా వేదిక ట్విటర్లో తొలిసారి స్పందించిన మెకంజీ తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. జెఫ్‌తో వివాహ బంధం ముగిసిందనీ ట్వీట్ చేశారు. తన భవిష్యత్ ప్రణాళికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. మెకంజీ తన వాటాపై వచ్చే కీలక హక్కులను, ఇతర అధికారాలను మాజీ భర్తకే వదులుకుంటున్నట్టు వెల్లడించారు. విడాకులు ఫైనల్ కావడంతో ఆమెకు భరణం కింద లభించే వాటాల మార్కెట్ విలువ (36 బిలియన్ డాలర్లు) రూ. 2.49 లక్షల కోట్లు. అయితే ఇవేవీ తనకు అవసరం లేదని తెగేసి చెప్పారు. తనకిష్టమైనవన్నీ ఆయనకు సంతోషంగా ఇచ్చేస్తాను. ముఖ్యంగా ది వాషింగ్టన్ పోస్ట్, బ్లూ ఆరిజిన్, అమెజాన్‌లోని 75శాతం వాటాలను వదులుకుంటున్నట్టు ప్రకటించారు. అమెజాన్‌లో బెజోస్‌కు 12 శాతం వాటా వుంది. అంతేకాదు తనకు లభించే వాటాలపై ఓటింగ్ హక్కులను జెఫ్‌కే వదులుకుంటున్నాని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన జెఫ్ బెజోస్ మెకంజీతో భాగస్వామ్యం, స్నేహం కొనసాగుతుందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచి, ప్రేమ పంచిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెకంజీ తాము విడాకులు తీసుకోబోతున్నట్టు ట్విటర్ ద్వారా ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. టీవీ యాంకర్ లారెన్తో బెజోస్‌కు సంబంధాలే వీరిద్దరి విభేదాలకు కారణమైనట్టు సమాచారం. అయితే ఫోర్బ్స్ ప్రకారం ఈ విడాకుల సెటిల్మెంట్ సొమ్ముతో ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న మహిళగా మెకంజీ నిలిచే అవకాశం వుంది. కానీ ఈ అవకాశాన్ని వదులుకోవడంతోపాటు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగబోతున్నానంటూ ప్రకటించడం విశేషం. చదవండి : అమెజాన్ సీఈవో సంచలన ప్రకటన pic.twitter.com/OJWn3OOLS6 — MacKenzie Bezos (@mackenziebezos) April 4, 2019 -
రాజీకి రడీ- ఇన్ఫోసిస్
సాక్షి, ముంబై: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ వివాదంలో రాజీకి సిద్ధపడుతోంది. ఈ మేరకు ప్యాకేజీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ముందు సెటిల్మెంట్ అప్లికేషన్‌ను సమర్పించింది. సెవెరెన్స్ పే (తెగదెంపుల కోసం జరిపే చెల్లింపులు) వివాదంలో రాజీ కుదుర్చుకోనున్నామని ప్రకటించింది. ఈమేరకు సెబికి సెటిల్మెంట్ అప్లికేషన్‌ను సమర్పించినట్లు బిఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. బన్సల్‌కు సెవెరెన్స్ పే ప్యాకేజీ విషయంలో కంపెనీ సమాచార బహిర్గత నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2015లో బన్సల్ సంస్థను వీడిన సందర్భంగా రూ.17.38కోట్లను చెల్లించేందుకు అంగీకరించి... రూ.5 కోట్లుమాత్రమే చెల్లించింది. శేషశాయి ఆధ్వర్యంలోని అప్పటి ఇన్ఫీ బోర్డు వాగ్దానం చేసినట్టుగా మిగతా సొమ్మును చెల్లించాలంటూ న్యాయపోరాటానికి దిగారు. దీంతో వివాదం రేగింది. ఈ సెటిల్మెంట్ ప్యాకేజీ కోసం నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ, ఆడిట్ కమిటీ నుంచి ఇన్ఫీ బోర్డు ముందస్తు అనుమతి తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. -
కమోడిటీల్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కి సెబీ ఆమోదం
సెటిల్మెంట్, ట్రేడింగ్ వేళలపై మార్గదర్శకాలు న్యూఢిల్లీ: కమోడిటీ ఫ్యూచర్స్‌లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతించే ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం ఆమోదముద్ర వేసింది. అయితే, ప్రాథమికంగా ఒకే ఒక్క కమోడిటీ ఫ్యూచర్స్‌లో ఆప్షన్ ట్రేడింగ్ ప్రవేశపెట్టాలని, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేలా పటిష్టమైన రిస్కు మేనేజ్మెంట్ చర్యలు పాటించాలని కమోడిటీ ట్రేడింగ్ ఎక్సే్ఛంజీలకు సూచించింది. ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతించబోయే కమోడిటీలకు సంబంధించి కఠినతరమైన నిబంధనలు విధించింది. వీటి ప్రకారం ఆప్షన్స్ ట్రేడింగ్‌కు ఎంపిక చేసే కమోడిటీ... గడిచిన 12 నెలల్లో మొత్తం ట్రేడింగ్ టర్నోవరు విలువలో పరిమాణంపరంగా టాప్ 5 కమోడిటీల్లో ఒకటై ఉండాలి. అంతేగాకుండా వ్యవసాయోత్పత్తులు, అగ్రి–ప్రాసెస్డ్ కమోడిటీలకు సంబంధించి గడిచిన ఏడాది వ్యవధిలో ఫ్యూచర్స్ కాంట్రాక్టుల సగటు రోజువారీ టర్నోవరు కనీసం రూ. 200 కోట్లుగా ఉండాలి. ఇతర కమోడిటీలైతే ఈ విలువ రూ. 1,000 కోట్లుగా ఉంటుంది. ఆప్షన్స్ కాంట్రాక్టులు ప్రారంభించదల్చుకునే కమోడిటీ డెరివేటివ్స్ ఎక్సే్ఛంజీలు.. ముందస్తుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సెబీ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. పొజిషన్ పరిమితులు, సెటిల్మెంట్ విధానం, ట్రేడింగ్ వేళలకు సంబంధించి కూడా సెబీ మార్గదర్శకాలు జారీ చేసింది. కమోడిటీల్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతించాలంటూ ఎక్సే్ఛంజీలు చాన్నాళ్లుగా కోరుతున్న నేపథ్యంలో సెబీ ఆమోదముద్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వాగతించిన ఎక్సే్ఛంజీలు.. సెబీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఎంసీఎక్స్ ఎండీ మృగాంక్ పరాంజపే తెలిపారు. దేశీ కమోడిటీ మార్కెట్‌ను మరింత పటిష్టపర్చేందుకు ఇది దోహదపడగలదన్నారు. ఫ్యూచర్స్‌ను వినియోగించుకోవడం మొదలుపెట్టిన అనేక మంది రైతులతో పాటు భారీ స్థాయిలో ట్రేడింగ్ వర్గాలకు కూడా రిస్కు మేనేజ్‌మెంట్‌పరంగా ఆప్షన్స్ మెరుగైన సాధనంగా ఎన్సీడీఈఎక్స్ వర్గాలు పేర్కొన్నాయి. కమోడిటీ ఎక్సే్ఛంజీల్లో ఇన్వెస్టర్ సర్వీస్ ఫండ్ .. ఇన్వెస్టర్లకు మెరుగైన సేవలు అందించేందుకు, వారి ప్రయోజనాలు పరిరక్షించేందుకు కమోడిటీ ఎక్సే్ఛంజీలు తప్పనిసరిగా ఇన్వెస్టర్ సర్వీస్ ఫండ్ (ఐఎస్ఎఫ్), ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐపీఎఫ్) ఏర్పాటు చేయాలని సెబీ ఆదేశించింది. మరిన్ని విశేషాలు.. ⇔ సెబీ మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక దశలో ఫండ్‌కి ఎక్సే్ఛంజీలు రూ. 10 లక్షలు సమకూర్చాలి. అటుపైన సభ్యుల నుంచి వసూలు చేసే టర్నోవర్ ఫీజులో ఒక శాతాన్ని నెలవారీ ప్రాతిపదికన ఐఎస్ఎఫ్కు బదలాయించాలి. సర్వీస్ సెంటర్లలో డమ్మీ టెర్మినల్స్ కూడా ఉండాలి. ఇన్వెస్టర్ల ఫిర్యాదులను స్వీకరించేందుకు, కౌన్సెలింగ్ సర్వీసులు అందించేందుకు సదుపాయాలు ఉండాలి. ⇔ ఇన్వెస్టర్ల రక్షణ నిధికి గరిష్టంగా అయిదుగురు ట్రస్టీలు ఉండొచ్చు. సెబీ గుర్తింపు పొందిన ఇ న్వెస్టర్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు, ఎక్స్ఛేం జీకి చెందిన ఒక అధికారి ఇందులో ఉండాలి. ⇔ సెటిల్మెంట్ సంబంధ పెనాల్టీలు తప్ప ఎక్సే్ఛంజీకి జరిమానాల రూపంలో వచ్చే నిధులన్నీ కూడా ఐపీఎఫ్ ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది. ఎక్సే్ఛంజీ మెంబర్/బ్రోకింగ్ సంస్థ గానీ డిఫాల్ట్ అయితే ఇన్వెస్టర్.. ఐపీఎఫ్ నుంచి పరిహారం పొందవచ్చు. కమోడిటీ ఎక్సే్ఛంజీలు తమ తమ ఐపీఎఫ్ ట్రస్ట్‌తో సంప్రదించి తగు నష్ట పరిహార పరిమితులను నిర్ణయించాల్సి ఉంటుంది. ఐపీఎఫ్ కార్పస్ నిధిపై వచ్చే ఆదాయాన్ని ఎక్సే్ఛంజీలు ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. ఐపీఎఫ్, ఐఎస్ఎఫ్కి ఎక్సే్ఛంజీలు వేర్వేరు బ్యాంకు ఖాతాలు నిర్వహించాల్సి ఉంటుందని సెబీ నిర్దేశించింది. -
టాటా సన్స్‌కు ఊరట, ఆర్బీఐకి ఝలక్
న్యూఢిల్లీ: జాయింట్ వెంచర్ సంస్థ టాటా టెలీ సర్వీసెస్ ఎన్టీటీ డొకోమోతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా టెలికామ్‌కు ఢిల్లీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బిట్రేషన్ అవార్డును సమర్ధించడం ద్వారా ఈ ఒప్పందం విషయంలో రిజర్వ్ బ్యాంక్ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. 2016 జూన్‌లో లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ప్రకారం వివాద పరిష్కారం కింద 117 కోట్ల డాలర్లను డొకోమోకు చెల్లించేందుకు టాటా అంగీకరించింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ఈ ప్రతిపాదనను ఆర్బీఐ వ్యతిరేకించింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ తదాఖలు చేసిన మధ్యంతపర పిటీషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వివాదంలో టాటా సన్స్‌కు భారీ ఊరట లభించింది. కాగా జపాన్ టెలికామ్ సంస్థ ఎన్‌టిటి డొకోమోతో చిరకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా టెలికామ్ నిర్ణయించింది. ఈ మేరకు డొకోమోతో కోర్టు వెలుపల ఒక అంగీకారానికి వచ్చింది. వివాద పరిష్కారం కింద 117 కోట్ల డాలర్లను డొకోమోకు చెల్లించేందుకు టాటా గ్రూప్ అంగీకరించినంది. తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని తెలియజేస్తూ, రెండు సంస్థలు ఉమ్మడిగా ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాయి. కోర్టు వెలుపల కుదిరిన తమ ఒప్పందాన్ని అంగీకరించి, ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న విచారణకు స్వస్తిచెప్పాలని రెండు సంస్థలూ కోర్టును అభ్యర్ధించాయి. ఈమేరకు టాటా సన్స్ 117 కోట్ల డాలర్లను కోర్టులో డిపాజిట్ కూడా చేసింది. టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివాదాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని టాటాలు నిర్ణయించారు. అయితే దీన్ని ఆర్బీఐ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
సెటిల్మెంట్లు చేస్తే చర్యలు తప్పవు
హోం మంత్రి రాజప్ప హెచ్చరిక అమలాపురం టౌన్ : న్యాయవాద వృత్తి చేస్తూ కొందరు భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని, అలాంటి న్యాయవాదులను ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. సెటిల్మెంట్లు, భూ కబ్జాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే న్యాయవాదులపై కేసులు నమోదు చేసి జైళ్లకు కూడా పంపుతామని స్పష్టం చేశారు. అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో పలువురు ప్రజాప్రతినిధులకు ఆదివారం జరిగిన సత్కార సభకు రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమలాపురం బార్ అసోసియేషన్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ న్యాయవాదులుగా పనిచేసి నేడు న్యాయమూర్తులుగా అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని రాజప్ప గుర్తు చేశారు. అలాంటి అమలాపురంలో కొంత మంది న్యాయవాదులు సెటిల్మెంట్లు, భూకబ్జాలకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అమలాపురంలో రౌడీయిజాన్ని అణిచివేశాం, తప్పు ఎవరు చేసినా క్షమించేది లేదన్నారు. రాష్ట్రంలో సెటిల్మెంట్లు, భూ కబ్జాలకు ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్లు... నకిలీ రిజస్ట్రేషన్లతో ప్రజలను మోసగిస్తే పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుందన్నారు. విశాఖపట్నంలో ఈ తరహాలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి అణిచివేతకు గతంలో అమలాపురం డీఎస్పీగా పనిచేసిన ప్రస్తుత విశాఖ సీపీ టి.యోగానంద్ ప్రత్యేక దర్యాప్తు, విచారణతో అలాంటి నేరాలను అదపు చేస్తున్నారని రాజప్ప గుర్తు చేశారు. బార్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పేదలకు ఉచిత న్యాయం అందించాలని ఆయన ఆకాంక్షించారు. వాస్తవంగా తప్పులు చేసిన వారికి శిక్ష పడేలా న్యాయవాదులు పనిచేయాలని రాజప్ప సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజప్పను అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, రాజోలు, అమలాపురం ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్సీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం అప్పనపల్లి (మామిడికుదురు) : టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. రాజప్ప దంపతులు ఆదివారం అప్పనపల్లి శ్రీబాలబాలాజీస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో విజయవాడ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఆలయాలను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐఏఎస్ అధికారులకు అక్కడ నియమించామన్నారు. జిల్లాలో వాడపల్లి, అప్పనపల్లి పుణ్య క్షేత్రాలను కూడా అభివృద్ధి చేయడంతో పాటు స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకుని వీటిని టెంపుల్ టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు.లంక గ్రామాలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు కాజ్‌వేల ఎత్తు పెంచేలా కార్యాచరణ చేపట్టామన్నారు. తీర గ్రామాలకు సాగునీరు అందించే అప్పనపల్లి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. ఈ సీజన్లోనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని రాజప్ప తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 20 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పలువురు పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ఇంటి వద్ద పంచాయితీ.. కత్తిపోట్లు
మహబూబ్‌నగర్: ఇరు వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నిర్వహించిన పంచాయితీ వికటించింది. ఇరువర్గాలు పరస్పరం కత్తులతో పొడుచుకోవడంతో ఇద్దిరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. గత కొంతకాలంగా మున్సీపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ల మధ్య మహబూబ్‌నగర్‌లో వర్గపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజీ కుదిర్చే పనిలో ఇరువర్గాలను శ్రీనివాస్‌గౌడ్ తన ఇంటి వద్ద చర్చకు పిలిచాడు. చర్చకు మున్సిపల్ చైర్పర్సన్ భర్త అమర్, కౌన్సిలర్ ఆనంద్ హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో చర్చలు జరుగుతుండగానే ఇంటి బయట ఇరువర్గాలు కత్తులతో పొడుచుకున్నాయి. ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. -
ఎమ్మెల్యే ఇంటి ముందు కత్తిపోట్ల కలకలం
-
టీడీపీ నేతల గూండాగిరీపై హోరెత్తిన అసెంబ్లీ
-
టీడీపీ నేతల గూండాగిరీపై హోరెత్తిన అసెంబ్లీ
♦ సర్కారు తీరును సభలో ఎండగట్టిన వైఎస్సార్సీపీ ♦ ‘సెటిల్మెంట్ల సీఎం చంద్రబాబు డౌన్ డౌన్..’ అంటూ నినాదాలు ♦ ఉద్యోగులకు, పోలీసులకు, మహిళలకు ♦ రక్షణ కల్పించాలని విపక్షం డిమాండ్ సాక్షి, అమరావతి: అధికారులు, ఉద్యోగులు, మహిళలపై తెలుగుదేశం నేతల గూండాగిరీపై సోమవారం అసెంబ్లీ దద్దరిల్లింది. అందరూ చూస్తుండగా సీనియర్ ఐపీఎస్ అధికారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన, గన్‌మెన్‌పై దాడి చేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలంటూ శాసనసభ ప్రాంగణంలో మౌన దీక్ష చేపట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం, గన్‌మెన్‌పై దాడి చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సా ర్సీపీ డిమాండ్ చేసింది. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం... రౌడీ రాజ్యం, గూండా రాజ్యం... దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం’ నినాదాలతో విపక్ష సభ్యులు సభను హోరెత్తించారు. ఐపీఎస్ అధికారిపై దాడి, విపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టుపై మాట్లాడేందుకు తమ నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ 2 గంటలకు పైగా స్పీకరు పోడియంలో నిలబడి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అధికారులు, ఉద్యోగులపై దాదాగిరీ చేసిన ప్రజాప్రతినిధి సభలో మాట్లాడగా... తప్పు చేసినవారిని శిక్షించాలని కోరిన ప్రధాన విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై సభ అట్టుడికింది. శాసనసభ జరుగుతుండ గానే ఎమ్మెల్యేను పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి అరెస్టు చేయడం, హైడ్రామా కొనసాగించడం తప్పంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. నోరు నొక్కిన అధికారపక్షం జీరో అవర్ అనంతరం వాయిదా పడిన సభ మధ్యాహ్నం 2.03 గంటలకు ప్రారంభం కాగానే పద్దులపై చర్చ కొనసాగించాలని స్పీకరు సూచించారు. వెంటనే ఎమ్మెల్యే బొండా ఉమ లేచి ప్రసంగం ఆరంభిస్తుం డగానే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మైక్ ఇవ్వాలని కోరారు. స్పీకరు అనుమతితో విపక్ష నేత మైక్ తీసుకుని ‘మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు...’ అనగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మ ణ్యంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుల దౌర్జన్యం, గన్‌మెన్‌పై దాడి గురించి నిలదీస్తారని, గతం లో టీడీపీ నేతలు చేసిన దాడులను ప్రస్తావి స్తారనే భయంతోనే అధికార పక్షం జగన్ మోహన్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. విపక్ష సభ్యుణ్ణి అసెంబ్లీ ప్రాంగణంలోనే పోలీసులు అరెస్టు చేస్తే నిరసన తెలిపే హక్కు లేదా? ఇందుకు కూడా 5 నిమిషాలు మైక్ ఇవ్వరా? అని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించినా స్పందించలేదు. దీంతో ‘వియ్ వాంట్ జస్టిస్... చెవిరెడ్డిని వెంటనే విడుదల చేయాలి...’ అంటూ వైఎస్సార్సీపీ సభ్యులంతా పోడియంలోకి వెళ్లి నినాదాలు చేశారు. ఈ నినాదాలు, గందరగోళం, ఏమి మాట్లాడుతున్నారో వినిపించని పరిస్థితుల్లోనే అధికార పక్ష ఎమ్మెల్యే బొండా ఉమా ప్రసంగాన్ని కొనసాగించారు. ‘ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను నీకు కొమ్ములొచ్చాయా? ఏం బతుకు మీది...’ అంటూ అవమానించిన బొండా సభలో దర్జాగా మాట్లాడగా... అధికార పక్ష నేతల దౌర్జన్యాలను ప్రశ్నించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మాత్రం పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లి మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టడం అధికారపక్ష నియంతృత్వాన్ని బట్టబయలు చేసింది. పరామర్శించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అయిదుగురు ఎమ్మెల్యేలను కనీసం చెవిరెడ్డిని కలిసేందుకు కూడా పోలీసు అధికారి అనుమతించకపోవడానికి సర్కారు పెద్దల ఒత్తిడే కారణమన్నది బహిరంగ రహస్యం. ఈ అన్యాయంపై విపక్ష సభ్యులు మరింత గట్టినా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోడియంలో నినాదాలు చేయడంతో మధ్యాహ్నం 2.11 గంటలకు స్పీకరు సభను పది నిమిషాలు వాయిదా వేసినట్లు ప్రకటించారు. సెటిల్మెంట్ సీఎం చంద్రబాబు... మధ్యాహ్నం 3.26 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్ పద్దులపై చర్చ అని స్పీకరు అనగానే... ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వాలని కోరారు. స్పీకరు మైక్ ఇవ్వకపోవ డంతో పోడియంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ‘బొండా ఉమను వెంటనే అరెస్టు చేయాలి’, ‘ పోలీసులకు రక్షణ కల్పించాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘తెలుగుదేశం గూండాల నుంచి ఐఏఎస్‌లకు, ఐపీఎస్‌లకు రక్షణ కల్పించాలి, కానిస్టేబుళ్లకు రక్షణ కల్పించాలి, ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. ఎమ్మార్వోలకు రక్షణ కల్పించాలి.. ఇదేమి రాజ్యం... ఇదేమి రాజ్యం.. గూండా రాజ్యం, రౌడీ రాజ్యం’ అంటూ సభను హోరెత్తించారు. అధికార పక్ష నేతలవల్ల అవమానాలు ఎదుర్కొన్న, దెబ్బతిన్న అధికారుల పక్షాన విపక్షం అండగా నిలవగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సెటిల్మెంట్ రాజీల తో పక్షపాత వైఖరి ప్రదర్శించడంపై వైఎస్సా ర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అరెస్టు చేసిన పోలీసులు వదిలిపెట్టడంతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సాయం త్రం 4.40 గంటలకు అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత సాయంత్రం 5.05 గంటలకు సీఎం చంద్రబాబు సభలోకి వచ్చారు. అధికారులపై దాడులు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకుండా రాజీకుదిర్చిన సీఎం తీరుపై ఆగ్రహంతో వైఎస్సార్సీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. ‘సెటిల్మెంట్ల సీఎం చంద్రబాబు డౌన్ డౌన్..’ అంటూ నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు నినాదాలు, నిరసనల మధ్య గందరగోళ పరిస్థితుల్లోనే కేవలం గంటంపావు సమయంలోనే రికార్డుస్థాయిలో 37 పద్దులు, 12 బిల్లులను ఏకపక్షంగా, ఎలాంటి చర్చ లేకుండా ‘పాస్’ చేసేశారు. అనంతరం సాయంత్రం 5.20 గంటలకు స్పీకరు సభను మంగళవారానికి వాయిదా వేశారు. -
ఐటీ దిగ్గజం విప్రోకు ఓ గండం గట్టెక్కింది!
-
ఐటీ దిగ్గజం విప్రోకు ఓ గండం గట్టెక్కింది!
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఓ గండం నుంచి గట్టెక్కింది. నిధుల దుర్వినియోగ ఆరోపణలపై గత ఆరేళ్లుగా సాగుతున్న విచారణ నుంచి బయటపడింది. ఓ ఉద్యోగికి సంబంధించిన 4 మిలియన్ డాలర్ల(రూ.27 కోట్లకు పైగా) నిధులను విప్రో కంపెనీ దుర్వినియోగానికి పాల్పడిందని అమెరికా సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) విచారణ జరుపుతోంది. ఈ కేసులో అమెరికా ఏజెన్సీతో విప్రో సెటిల్మెంట్ కుదుర్చుకుంది. ఈ సెటిల్మెంట్ కింద కంపెనీ 5 మిలియన్ డాలర్ల(రూ.33 కోట్లకు పైగా) జరిమానా చెల్లించాల్సి ఉంది. అమెరికా ఏజెన్సీతో సెటిల్మెంట్ కుదుర్చుకున్న విషయాన్ని విప్రో దిగ్గజం నేడు బొంబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే ఈ సెటిల్మెంట్లో కంపెనీ సెక్యురిటీస్ ఎక్స్చేంజ్ యాక్ట్ 1934 నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలను విప్రో ఖండించలేదు. విప్రో ఓ ఉద్యోగికి సంబంధించిన 4 మిలియన్ డాలర్ల నిధులో దుర్వినియోగానికి పాల్పడినట్టు వెల్లడైంది. దీన్ని 2009లో కంపెనీ గుర్తించింది. 2010 సెప్టెంబర్‌లో అమెరికా ఏజెన్సీ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు గుర్తించిన వెంటనే కంపెనీ సైతం అంతర్గతంగా, బహిరంగంగా ఎన్నో విచారణలను చేపట్టింది. అదనంగా అకౌంటింగ్, ఫైనాన్స్‌కు సంబంధించిన అధికారులను నియమించుకోవడం చేసింది. ఎంతో కాలంగా సాగుతున్న ఈ విచారణ ఓ కొలిక్కి రావాలని స్టాక్ హోల్డర్స్ అందరూ భావించారని, ఈ మేరకు ఏజెన్సీలతో పరిష్కారం కుదుర్చుకున్నామని విప్రో తెలిపింది. -
ఏడాది చివరి వరకు వన్‌టైమ్ సెటిల్మెంట్
కర్నూలు(అగ్రికల్చర్): మొండి బకాయిల వసూలులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌ను అమలు చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బోర్డు సమావేశం నిర్ణయించింది. అలాగే 64 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో బోర్డు సమావేశం నిర్వహించారు. అనంతరం సర్వసభ్య సమావేశం కూడా ౖచెర్మన్ మల్లికార్జునరెడ్డి ఆధ్యక్షతన ఏర్పాటైంది. దాదాపు రూ.4 లక్షల వ్యయంతో జిల్లాలోని అన్ని సహకార సంఘాల అధ్యక్షులకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లను బహూకరించారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కింద అప్పు మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే డీసీసీబీ 35 శాతం భరిస్తుందని చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కో–ఆపరేటివ్ డెవలప్మెంటు ప్రాజెక్టు కింద జిల్లాకు రూ.143 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో సహకార సంఘాలకు రూ.124 కోట్లు, చేనేత సహకార సంఘాలకు రూ.3కోట్లు, జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు రూ.6కోట్లు, స్వయం సహాయ సంఘాలకు రూ.5కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఐబీపీఎస్ ద్వారా 64 స్టాఫ్ అసిస్టెంటు పోస్టులను భర్తీ చేయాలని తీర్మానించినట్లు వెల్లడించారు. yీ సీసీబీ ఖాతాదారులందరికీ రూపే కార్డులు, అరెకరా భూమి కల్గిన రైతులకూ రుణాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పూర్తిస్థాయి సీఈఓగా రామాంజనేయులు జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు పూర్తిస్థాయి సీఈఓగా రామాంజనేయులును నియమిస్తూ బోర్డు సమావేశం తీర్మానం చేసింది. ఇంతవరకు ఇన్చార్జిగా ఉన్న ఈయన ఇటీవలే నోటిఫికేషన్ ద్వారా పూర్తిస్థాయి సీఈఓగా ఎంపికయ్యారు. కడిమెట్ల సహకార సంఘంలో పంట రుణం తీసుకొని మరణించిన ఎర్రకోట గ్రామానికి చెందిన కురువ వెంకటేశ్వర్లు భార్య పద్మావతికి జనతా బీమా కింద రూ.లక్ష చెక్కును చైర్మన్ అందచేశారు. కార్యక్రమంలో డీసీఓ సుబ్బారావు, నాబార్డు డీడీఎం నగేష్‌కుమార్, చేనేత ఏడీ సత్యనారాయణ. డైరెక్టర్లు, సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
నయీమ్... మహా పిసినారి
-
నయీమ్... మహా పిసినారి
* సొంత మనుషులకూ సరిగా డబ్బులివ్వని వైనం * దాంతో బంగారం కుదువ పెట్టిన కుటుంబీకులు * ట్యూబ్‌లైట్ మార్చినా, ఉప్పు పొట్లం కొన్నా... * ప్రతిదానికీ డైరీలో ‘మిలిటెంట్’ లెక్కలు * తనను కలిసిన వారందరి వివరాలూ డైరీలో * ఫొటోలు, సీసీ కెమెరాల రికార్డింగులు కూడా * లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చే యోచన సాక్షి ప్రతినిధి, నల్లగొండ: భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలు, అరాచకాలతో లెక్కలేనన్ని ఆస్తులు, నగదు పోగేసుకున్న గ్యాంగ్‌స్టర్ నయీమ్, వ్యవహారంలో మాత్రం చాలా పిసినారట. చివరికి తన సొంత కుటుంబసభ్యులకు కూడా సరిపడా డబ్బులిచ్చేవాడు కాదని విచారణలో వెల్లడవుతున్న పలు అంశాలను బట్టి తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో ఉన్న నయీమ్ కుటుంబసభ్యులు కొందరు అతను చేసిన పలు నేరాల్లో పాలుపంచుకున్నారు. అ యినప్పటికీ, కుటుంబం గడవడానికి బంగా రం కుదువ పెట్టుకుని డబ్బులు తెచ్చుకున్నామని పోలీసు విచారణలో వారు వెల్లడించారు!! బంగారం కుదువ పెట్టిన రసీదులు కూడా వారింట్లో లభ్యమవడం విశేషం!! మావోయిస్టుల తరహాలో నయీమ్ పక్కాగా ‘మిలిటెంట్ డైరీ’ రాసుకునేవాడట. అదెంత పకడ్బందీగా ఉంటుందంటే... తాను ప్రతి రూపాయికీ అందులో లెక్కలు రాసుకునేవాడట. చివరికి ట్యూబ్‌లైట్ మార్చినా, ఉప్పు ప్యాకెట్ కొన్నా వాటికీ లెక్కలు రాసుకునేవాడని పోలీసు వర్గాలంటున్నాయి. ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని కలిసిందీ, ఏం పని చేసిందీ కూడా విధిగా డైరీలో నమోదు చేసుకునేవాడు. అంతేగాక తనను కలిసిన ప్రతి ఒక్కరి ఫొటో దాచి ఉంచుకునేవాడట. ఇందుకోసం తానున్న చోట తప్పనిసరిగా సీసీ కెమెరా నిఘా ఉంచేవాడని విచారణలో తేలింది. పలు వివరాలు వెల్లడించిన హరి నల్లగొండ జిల్లాకు చెందిన హరిప్రసాద్‌రెడ్డి అనే జర్నలిస్టును సీఈవోగా పెట్టి వెబ్ చానల్ ఏర్పాటు చేయించిన నయీమ్, త్వరలోనే శాటిలైట్ చానల్ పెట్టే ఆలోచన కూడా చేసినట్టు వెల్లడైంది. ‘వెబ్ చానల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ చేయాలి. తర్వాత శాటిలైట్ చానల్ పెడదాం. దానికీ నిన్నే సీఈవో చేస్తా’నని హరిప్రసాద్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. విచారణలో హరిప్రసాద్‌రెడ్డి ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలిసింది. నయీమ్ నుంచి తాను డబ్బులు ఎలా, ఎవరి ద్వారా తీసుకున్నదీ, నయీమ్‌కు సెల్ఫోన్లు, సిమ్ కార్డులు ఎలా పంపిందీ, గతేడాది వినాయక ఉత్సవాల్లో తన పాత్ర, ఆ సమయంలో ఎవరెవరికి ఏమేం ఇచ్చిందీ, నయీమ్‌ను ఎప్పుడు కలిసిందీ హరి వెల్లడించినట్టు సమాచారం. నల్లగొండ జిల్లాలో ఎంతమంది మావోయిస్టు సానుభూతిపరులున్నారో తెలుసుకుని తనకు చెప్పాలని కూడా ఆయనకు నయీమ్ సూచించినట్టు సమాచారం. జిల్లా రాజకీయాలపైనా ఆరా తీసేవాడట. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలనే భావించాడని, చానళ్ల ద్వారా జనానికి దగ్గరై, తర్వాత లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చే యోచన చేశాడనితెలుస్తోంది. ‘నయీమ్‌ను కలిసేందుకు అతని అల్లుడు తబ్రేజ్ కారులో వెళ్లాను.నా కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నాకు ఎంతోమంది ఫోన్లు చేసి ఆరా తీశారు. నయీమ్ పోయాడు గనుక అందరి ఇళ్లపైనా దాడులు జరుగుతాయని, అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించా’నని హరి వెల్లడించినట్టు సమాచారం. సిట్ అధికారుల విచారణ చౌటుప్పల్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బాధితులను నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు శనివారం విచారించినట్టు తెలిసింది. మండలంలోని తూఫ్రాన్‌పేట శివారులోని సర్వే నంబరు 12లో 50 ఎకరాల భూమిని తమను బెదిరించి నయీమ్ తన భార్య, బినామీల పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడని బాధిత రైతులు సిట్‌కు వివరించారు. ‘‘తమను బెదిరించి ఎకరా రూ.లక్షకే నయీమ్ లాక్కున్నాడు. తప్పనిసరై విక్రయించాం. నయీమ్ అనుచరుడు పాశం శ్రీను వచ్చి నయీమ్ అనుచరుల పేరిట మా భూములు రిజిస్టర్ చేయించుకున్నాడు’’ అని చెప్పినట్టు సమాచారం. -
నయీమ్‌కు చెక్ పెట్టేందుకు ‘సెటిల్మెంట్’ మార్గం
► నమ్మిన బంటుతోనే గ్యాంగ్‌స్టర్‌కు రాయబారం ► ‘ఓ డీల్ ఉంది.. చేద్దాం’ అంటూ పక్కా స్కెచ్ ► నయీమ్ రాగానే ‘డీల్’ సెటిల్ చేసిన పోలీసులు ► అధికార పార్టీ నేతలకే నయీమ్ వరుస బెదిరింపులు ► అత్యున్నత రాజకీయ కుటుంబీకులనూ లెక్క చేయని వైనం ► కొన్నేళ్లుగా అతని వ్యవహారాలపై సర్కారు కన్ను ► ఎవరైతే నాకేంటంటూ నయీమ్ చెలరేగడమే చెక్ పెట్టేందుకు తక్షణ కారణం సాక్షి, హైదరాబాద్: నయీమ్ పోలీసు అధికారులతోనే తెరపైకి వచ్చాడు.. వారి తోడ్పాటుతోనే సెటిల్మెంట్లు, దందాలు నడిపాడు.. పోలీసులనే అడ్డుపెట్టుకుని ఎన్నో డీల్స్ చేశాడు.. ఆ రోజున కూడా ఓ డీల్ జరిగింది. నయీమ్‌తో సంబంధాలున్న డీఎస్పీ స్థాయి పోలీసు అధికారే ‘ఓ డీల్ ఉంది.. చేద్దాం’ అని నయీమ్‌ను పిలిచాడు. అలవాటుగానే నయీమ్ సిద్ధమయ్యాడు. ఉదయాన్నే కలుద్దాం రమ్మని ఓ ప్లేస్ చెప్పాడు. సరిగ్గా అనుకున్న సమయానికే కలిశారు.. డీల్ పూర్తయింది.. కానీ ఈసారి డీల్ పూర్తి చేసింది పోలీసులు. ఎన్నో వేల సెటిల్మెంట్లు చేసిన నయీమ్‌కు ఇదే ఆఖరి డీల్ అయింది. పోలీసులు పక్కాగా వేసిన స్కెచ్‌లో ఇరుక్కున్న నయీమ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. పోలీసుల ‘సహకారం’తో ఎంతో కాలంగా చిక్కకుండానే దర్జాగా తిరుగుతున్న నయీమ్ కథ ఒక్కసారిగా ముగిసిపోవడానికి కారణం... అత్యున్నత రాజకీయ కుటుంబీకులనూ లెక్కచేయకపోవడమేనని సమాచారం. కొన్నేళ్లుగా నయీమ్ ఎంతో మంది ప్రజాప్రతినిధులపైనే నేరుగా బెదిరింపులకు, వసూళ్లకు దిగాడు. తన మాట వినకపోతే ఖతం చేస్తాననీ హెచ్చరించాడు. ఇటీవల అధికార పార్టీ ప్రజాప్రతినిధులనూ టార్గెట్ చేయడంతో నయీమ్ చర్యలకు ఫుల్స్టాప్ పెట్టడంపై సర్కారు దృష్టి పడింది. తాజాగా తాను డబ్బు డిమాండ్ చేసిన వ్యక్తులు తాము అత్యున్నత రాజకీయ కుటుంబీకులకు దగ్గరి వారమని చెప్పినా.. ‘ఎవరైతే నాకేంటి..? నాకు కట్టాల్సిందే’నని నయీమ్ బెదిరించడం సర్కారు నిర్ణయం అమల్లోకి రావడానికి ‘ఆఖరు డీల్’గా మారింది.. విచ్చలవిడిగా బెదిరింపులు దాదాపు పదేళ్లకుపైగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చిన నయీం సెటిల్మెంట్లు, రియల్ దందాలు, బెదిరింపులు తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెచ్చుమీరాయి. ఒక దశలో ప్రభుత్వానికి సైతం కొరకరాని కొయ్యగా మారాడు. చివరికి రాష్ట్రంలో అత్యున్నత రాజకీయ కుటుంబీకుల పేర్లు చెప్పినా లెక్కచేయని స్థాయికి తెగించాడు. రెండేళ్ల కింద నయీమ్ గ్యాంగ్ చేతిలో హతమైన టీఆర్ఎస్ నేత కోనపురి రాములు కూడా.. హత్యకు ముందు తనకు ప్రాణభయముందని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి వెళ్లి పలుమార్లు ముఖ్యమంత్రికి గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. రాములు హత్య తర్వాత నల్లగొండ జిల్లాలో కొందరు నేతలకు నయీమ్ అంటే భయం పెరిగింది. తర్వాత ఎమ్మెల్యేలు రామలింగారెడ్డిని, శేఖర్‌రెడ్డిని చంపుతామని నయీమ్ బెదిరించిన విషయాన్ని పార్టీ నాయకులు సందర్భం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ‘అప్రమత్తంగా ఉండండి.. అవసరమైతే కొంతకాలం ఎటైనా వెళ్లండి..’ అంటూ అధికార పార్టీ ముఖ్యులు సర్దిచెప్పినట్లు తెలిసింది. అయినా అధికార పార్టీ నేతలకే బెదిరింపులు రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అన్నం ఎలా తింటావో చూస్తా! ‘నయీమ్ ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు. బయట తిరగలేకపోతున్నాం.. మమ్మల్ని సైతం బెదిరిస్తున్నాడు.. కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంటే వాడికి లెక్క లేదు..’ అని ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచే నయీమ్ ఆగడాలపై పోలీసు యంత్రాంగం ఓ కన్నేసి ఉంచింది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీని రూ.25 కోట్లు ఇవ్వాల్సిందిగా నయీమ్ డిమాండ్ చేశాడు. ‘ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా..’ అని బెదిరించాడు. రాష్ట్రంలో ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాలున్న మరో పారిశ్రామికవేత్తను రూ.75 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ రెండు ఘటనలు కూడా అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించాయి. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ రాజకీయ నేతలనూ నయీమ్ లెక్కచేయలేదు. ఇలా గత రెండేళ్లలో పదుల సంఖ్యలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నయీమ్ బాధితుల జాబితాలో చేరిపోయారు. నయీమ్ ఆగడాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎవరైతే నాకేంటి? ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యుడిని నయీమ్ ముఠా డబ్బులు డిమాండ్ చేసింది. అదే సమయంలో యాదగిరిగుట్ట ప్రాంతంలో ఓ రియల్టర్‌ను టార్గెట్ చేసి, కోట్లాది రూపాయలు డిమాండ్ చేసింది. ఈ రెండు ఘటనల్లోనూ వారు డబ్బులు చెల్లించకుండా... అత్యున్నత రాజకీయ కుటుంబీకులు తమకు తెలుసని, తమ జోలికి రావద్దని నయీమ్ గ్యాంగ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తన హెచ్చరికలను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో స్వయంగా రంగంలోకి దిగిన నయీమ్... ‘ఎవరైతే నాకేంటి.. డబ్బులు కట్టాల్సిందే..’ అని ఫోన్లో బెదిరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం రియల్ వర్గాల్లో హల్చల్ కావడంతో ఏకంగా సీఎం దృష్టికి వెళ్లినట్లు ప్రచారంలో ఉంది. దీంతో నయీమ్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని అత్యున్నత స్థాయి నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసు యంత్రాంగం హుటాహుటిన నయీమ్ వేటకు రంగం సిద్ధం చేసింది. పేరుకు అజ్ఞాతంలో ఉంటున్నా నయీమ్ రెండేళ్లుగా హైదరాబాద్‌లోనే నాలుగు వాహనాల కాన్వాయ్‌లో తిరుగుతూ దర్జాగా దందా సాగిస్తున్న తీరు పోలీసు యంత్రాంగానికి సవాలు విసిరింది. అతనికి సహకరిస్తున్న పోలీసులతోనే ఎర వేయించిన అధికారులు.. పథకం ప్రకారం నయీమ్‌ను ఖతం చేశారు. తమకు ఆదేశాలు అందిన 48 గంటల వ్యవధిలోనే ఈ ఆపరేషన్‌ను చక్కబెట్టారు. మరోవైపు నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన రోజున అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆనందంలో మునిగితేలడం గమనార్హం. ‘పీడ విరగడైంది. ఇప్పటికే ఆలస్యమైంది.. ప్రభుత్వం ఇంతకాలం వేచి ఉండాల్సింది కాదు..’ అని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానించారు. -
భూమా X శిల్పా
► నేడు చంద్రబాబు వద్ద పంచాయితీ ► విజయవాడకు తరలి వెళ్లిన నేతలు నంద్యాల: కర్నూలు టీడీపీలో శిల్పా సోదరులు, ఇటీవలే పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి మధ్య పంచాయితీ సోమవారం సీఎం చంద్రబాబు కోర్టులో జరగనుంది. ఇందుకోసం వీరిద్దరితో పాటు మాజీ మంత్రి ఫరూక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కూడా ఆదివారమే విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆధిపత్యం విషయంలో ఇరువర్గాల వారు పట్టుదలగా ఉండటంతో సయోధ్య కుదిరే అవకాశం లేదని తెలుస్తోంది. సీఎం కూడా సర్ధుకుపోవాలని సూచించి పంపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు వర్గాలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
తుపాకుల కలకలం
♦ నాడు వెల్కటూర్ లో.. నేడు రాంపూర్‌లో ♦ మాఫియాకు అడ్డాగా మారుతున్న నంగునూరు ♦ పీస్‌జోన్ కావడంతో అక్రమార్కుల కన్ను ♦ సెటిల్మెంట్లు, భారీ దోపిడీలే లక్ష్యంగా అద్దెకు నంగునూరు: మూడు నెలల క్రితం వెల్కటూర్‌లో ఒక వ్యక్తి ఇంట్లో నుంచి పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకోగా తాజాగా రాంపూర్ వద్ద మూడు తుపాకులు లభించడం మండలంలో కలకలం రేపుతోంది. మండలం మారుమూల ప్రాంతం కావడంతో పాటు రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ పీస్ జోన్లో ఉండడంతో మాఫియాకు అడ్డాగా మారుతోంది. శనివారం రాత్రి రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు రెండు తుపాకులు, ఒక తపంచాతో పట్టుబడిన విషయం తెలిసిందే. వీరు ఎదైనా దోపిడీ ముఠా సభ్యులా.. లేక మాఫియా గ్యాంగ్‌కు చెందిన వారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో పోలీసులను చూసి ముగ్గురు పారిపోగా ఒక వ్యక్తి పెద్ద బ్యాగ్ భుజానికి వేసుకొని పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎక్కడో సెటిల్మెంట్ చేసి భారీగా వచ్చిన డబ్బుల పంపకాల విషయంలో తేడాలు రావడంతో దాడులు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్క జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, మండలానికి చెందిన మరో వ్యక్తితో కలసి దుబాయికి తీసుకెళ్తామని కొందరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూల్ చేసినట్లు వినికిడి. విదేశాలకు పంపించాలని డబ్బులు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతో వారిని బెదిరించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ జిల్లా వారణాసి ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులను ఇక్కడికి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. దుండగులు హన్మకొండ ప్రధాన రహదారిపై రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద గతంలో దాబా హోటల్ నడిచిన ఇంట్లో పది రోజులుగా బస చేస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా ఎవ్వరికి అనుమానం రాకపోవడం గమనార్హం. నాడు వెల్కటూర్.. నేడు రాంపూర్ మండలం సిద్దిపేట పట్టణానికి సమీపంలో ఉన్నప్పటికీ మారుమూల ప్రాంతం కావడంతో నిఘా తక్కువగా ఉంటోంది. ఇదే కాకుండా రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో క్రైం శాతం తక్కువగా ఉండడం, పీస్ జోన్ కింద ఈ ప్రాంతం ఉండడంతో మాఫియా, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ నెలలో వెల్కటూర్‌కు చెందిన బత్తిని వెంకటస్వామి ఇంట్లో పో లీసులు సోదాలు చేసి తుపాకీ స్వాధీనం చేసుకొని అతడిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి నెలలో లారీలో తరలిస్తున్న రెండు వందల క్వింటాళ్ల గంజాయిని రాజగోపాల్‌పేట ఎస్ఐ గోపాల్‌రావు పట్టుకున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి జిల్లాలోని రాజగోపాల్‌పేట వరకు ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ లేకపోవడంతో నిఘా తక్కువగా ఉంటోంది. దీంతో అసాంఘీక కార్యకలాపాలకు మండలం అనువుగా మారింది. అలాగే ఈప్రాంతం లో నాలుగు దాబా హోటళ్లు ఉండడం మద్యం, భో జనాలు లభించడంతో అక్రమార్కులకు అడ్డాగా మారింది. -
ఓ యాక్సిడెంట్...17 లక్షల సెటిల్మెంట్ !!
►మృతుని కుటుంబానికి రూ.6.5 లక్షలు ► ఒప్పించిన వారికి రూ.5లక్షలు ► మధ్యవర్తులకు మరో రూ.5లక్షలు ► సిండికేటు నుంచే డబ్బులు వసూలు తాను గీసిన గీత దాట వద్దని లక్ష్మణుడు అడవిలో తన వదినకు చెప్పి గీసిన లక్ష్మణరేఖ మాటేమిటోగాని.. ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంలో ఆ ‘గీత’ను అధికారులు జవదాటలేక పోతున్నారు. ఉన్నతాధికారులు మొదలు సిండికేట్ల వరకు అన్నింటా తానై వ్యవహరిస్తున్న ఓ మహిళ అధికార పార్టీలోనే కాదు అధికారుల్లోనూ చక్రం తిప్పుతున్నారు. ఇటీవల సాగుతున్న సెటిల్మెంట్లలో తలదూర్చేస్తూ ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసేస్తున్నారు. దీంతో అందరిలోనూ ఇప్పుడు అదే చర్చ సాగుతోంది. శ్రీకాకుళం టౌన్ : మూడు రోజుల కిందట డేఅండ్‌నైట్ జంక్షన్ సమీపాన కొత్త బ్రిడ్జి వద్ద ఓ విద్యార్థి మృతికి కారకుడైన ఎక్సైజ్ ఉన్నతాధికారిని పూర్తిగా ఆ కేసు నుంచే తప్పించే క్రమంలో ఓ ‘గీత’ చక్రం తిప్పిన తీరు పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈమె ఈ కేసు విషయంలో ఇటు మృతుని బంధువులను, అటు పోలీసులను ఒప్పించి మెప్పించడంలో లక్షల రూపారుులు చేతులు మారినట్టు తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రమాదానికి కారకుడైన ఉన్నతాధికారి తప్పతాగి ఓ విద్యార్థిని తన కారుతో చంపేస్తే ఏమి కాదన్నట్టు నేనున్నాలే అన్నట్టు.. మొత్తం చక్రం తిప్పి ఇందులో ఎటువంటి సంబంధం లేని ఓ డ్రైవర్‌ను ఒప్పించి కేసు మొత్తాన్ని నీరుగార్చేశారు. చివరకు మృతుని బంధువులకు కేసు వల్ల వచ్చే ప్రయోజనమేమి లేదని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడమే ఉంటుందని.. మీరు ఒప్పుకుంటే లక్షలు ఇప్పిస్తానని ఒప్పించి బంధువులకు ఇచ్చిన దానికంటే సెటిల్ చేసినందుకు, మధ్యవర్తులకు అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేసేందుకు అంగీకరించేటట్టు చేశారు. తీరా చూస్తే మృతుని బంధువునికి ఇచ్చేందుకు అంగీకరించిన రూ.6.5 లక్షల కంటే మధ్యవర్తులు, ఆమెకే అంతకంటే ఎక్కువ మొత్తం వసూలుకు ఒప్పందం కుదిరినట్టు చర్చ నడుస్తోంది. మొత్తం సెటిల్మెంటుకు ఒక బృందమే ఏర్పాటు చేసి చక్రం తిప్పారు. ఇదిలా ఉంటే మొత్తం డబ్బులు సిండికేట్ల నుంచి వసూలు చేసేందుకు పక్కా స్కెచ్ గీసేశారు. దీంతో తప్పు చేసిన ఉన్నతాధికారి తడిగుడ్డ వేసుకుని నిద్రిస్తుంటే చక్రం తిప్పిన మహిళ అటు ఎక్సైజ్ శాఖలో, ఇటు పోలీసు శాఖలో అంతా తానై వ్యవహరించి తాను కూడా కొంత మొత్తం మింగేసినట్టు వార్తలు వినిపిస్తున్నారుు. మృతుని బంధువులతో మాట్లాడిన మధ్యవర్తుల వాటాకు రూ.5 లక్షలు ముట్టజెప్పాలని సదరు నాయకురాలు చెప్పేశారు. మొత్తం సెటిల్ చేసేశాం కదా... మరి మాకేంటి అంటూ మరో రూ.5లక్షలు కొట్టేసినట్టు తెలిసింది. చేయని తప్పులో డ్రైవర్‌ను పెట్టినందుకు ఓ కానిస్టేబుల్ బంధువును ఒప్పించి ఆయనకు కొంత మొత్తం ఇప్పించేందుకు అంగీకరింపజేశారట. ఇంత మొత్తం ఎవరిస్తారనుకుంటే పొరపాటే.. అంతా సిండికేట్ల నుంచి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసేశారట. -
రాజీమార్గమే ఉత్తమం
కరీంనగర్: కోర్టుల చుట్టూ తిరగకుండా కక్షిదారులు ఇరువురు రాజీమార్గం అవలంబించడమే ఉత్తమమని మున్సిఫ్ కోర్టు జడ్జీ మాధవి అన్నారు. మండల కేంద్రంలోని మున్సిఫ్‌కోర్టులో శనివారం లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సమస్యలను పెద్దదిగా చేయకుండా పెద్దమనుషులు శాంతియుతంగా పరిష్కరించుకుంటే గొడవలు రావన్నారు. ఆవేశాలకు, పగలకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం వల్ల కుటుంబం ఆర్థికంగా దెబ్బతింటుందన్నారు. ఇరువురు కక్షిదారులు రాజీపడడంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. -
మాట వినలేదో..
జైలు నుంచే ‘ఎర్ర’ దొంగల బెదిరింపులు.. ఫోన్లలోనే రియల్ ఎస్టేట్ పంచాయితీలు రాయచోటి సబ్‌జైలు కేంద్రంగా నడుస్తున్న అక్రమదందా సిబ్బంది సహకారంతోనే సెటిల్మెంట్లు కడప: అన్న చెప్పినాడు... నువ్వు రామయ్యకు ఇవ్వాల్సిన మొత్తం వెనక్కు ఇవ్వు.. లేదంటే నీఇష్టం. కావాలంటే ఇదో అన్నతో మాట్లాడు. ఏం గోపయ్య నీస్థలం సుబ్బయ్య కొన్నాడంట కదా, అతను ఇచ్చిన మొత్తం మేరకు రిజిష్టర్ చేయించు, అగ్రిమెంటు షరతులంటే కుదరదు. ఎక్కడి నుంచి తెస్తాడు, అన్న చెప్పాడు... సమస్యలు సృష్టించకుండా చెప్పినట్లు విను. ఇందంతా ఏదో సినిమాలోని కథలా ఉంది కదూ. నిత్యం ఇలాంటి తంతు ఇటీవల రాయచోటిలో అధికమైంది. సబ్‌జైలు నుంచే ఆ ఇరువురు చక్రం తిప్పుతున్నారు. అందుకు యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తోంది. అధికారం అండగా ఉంటే ఇళ్లు అయితేనేం, జైలు అయితేనేం అని ఆ ఇరువురు నిరూపిస్తున్నారు. షటిల్‌మెంట్లు అక్రమదందాలల్లో ఎర్ర‘దొంగలు’ బిజీగా గడుపుతున్నారు. రాయచోటి పట్టణంలో వారు చెప్పిందే వేదంగా నిలుస్తోంది. ఫోన్లలో వారు శాసిస్తే అనుచరులు పాటిస్తున్నారు. వెరసి రాయచోటి సబ్‌జైలు నుంచే పంచాయితీలు, షటిల్‌మెంట్లు జోరుగా సాగుతున్నాయి. అందుకు సహకరిస్తోన్న సిబ్బందికి కాసుల పంట పండుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ ఇరువురు అక్రమ కార్యకలాపాలకు హద్దు ఉండదని అందరూ ఊహించారు. ‘ముందే కోతి ఆపై కల్లు తాగింది’ అన్నట్లుగా ఎర్రచందనం స్మగ్లర్లుగా కీర్తిగడించిన ఆ ఇరువురికి ఊహించని విధంగా బ్రేకులు పడ్డాయి. అనూహ్యంగా చిత్తూరు జిల్లా పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించి జైలుకు పంపారు. అయితే పీడీ యాక్టును ఎత్తివేయాలని ప్రభుత్వ పరిధిలో పలువిధాలుగా ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా పీడీ యాక్టు వైదొలుగుతోందని అనుచరులు ఆశించారు. ఆప్రయత్నం విఫలమైంది. కోర్టు ఆశ్రయం పొందినా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోయింది. వ్యూహత్మకంగా చట్టాన్ని ఆసరాగా చేసుకొని రాయచోటి సబ్‌జైలులో తిష్టవేశారు. ఆపై అక్రమదందాకు పాల్పడుతోన్నట్లు సమాచారం. జోరుగా బెదిరింపులు...షటిల్‌మెంట్లు... రాయచోటి సబ్జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న ఆ ఇరువురు పట్టణంలో శాశిస్తున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారంలో వైఫల్యాల కారణంగా ఆ ఇరువురు బిజీగా మారినట్లు సమాచారం. రాజమండ్రి జైలుకు పీడీ యాక్టు కింద వెళ్లిన ఆ ఇరువురు పలు కేసుల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఆమేరకు స్థానిక పోలీసులు చేసుకున్న దరఖాస్తు కారణంగా రాయచోటి సబ్‌జైలుకు వచ్చారు. అయితే జైలు సిబ్బంది సంపూర్ణ సహకారం కారణంగా ఆ ఇరువురు ‘మూడు షటిల్‌మెంట్లు ఆరు పంచాయితీలు’గా విరాజిల్లుతోన్నారు. సబ్‌జైలులో యధేచ్ఛగా సెల్లో మాట్లాడుతూ అనుచరుల్ని రంగంలోకి దింపి పంచాయితీలు నిర్వహిస్తున్నారు. ఆ ఇరువురి నేర చరిత్ర తెలిసిన పట్టణవాసులు భయంతో వారు చెప్పినట్లు చేస్తున్నారు. రాజమండ్రిలో ఉండాల్సిన వారు రాయచోటికి వచ్చారు, రేపోమాపో జైలు నుంచి వస్తే చెప్పినట్లు వినలేదని వారు చేసే రచ్చకంటే అనుకూలంగా ఉండడమే శ్రేయష్కరమని పలువురు భావిస్తున్నారు. తనిఖీలు చేయమని ఆదేశించాను: జిల్లా సబ్‌జైళ్ల అధికారి కృష్ణమూర్తి రాయచోటి సబ్జైల్లోని రిమాండ్ ఖైదీలు సెల్‌ఫోన్ వాడుతున్నట్లు ఇప్పటి వరకూ నా దృష్టికి రాలేదు. వెంటనే తనిఖీలు చేయాల్సిందిగా అక్కడి అధికార్ని ఆదేశిస్తాను. సెలవులో ఉన్నాను, రాగానే స్వయంగా వెళ్లి తనిఖీ చేస్తానని జిల్లా జైళ్లు అధికారి కృష్ణమూర్తి ఫోన్లో సాక్షి ప్రతినిధికి తెలిపారు. -
బిదిరి సెటిల్మెంట్లకు సహకరించేవారేమో?
హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ బెంగళూరు: సెటిల్మెంట్ ప్రభుత్వమంmiటూ సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలనను మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు శంకరబిదిరి అసత్య అరోపణలు చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. శంకరబిదిరి డీజీపీగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం సెటిల్మెంట్కు సహకరించేవాడేమోనని కే.జే జార్జ్ అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే ఇప్పుడు కూడా అటువంటి ఆలోచనలే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ అర్కావతి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అర్కావతి విషయంలో వారి వద్ద దాఖలాలు ఉంటే కెంపణ్ణ కమిషన్‌తో పాటు కోర్టుకు కాని, లోకాయుక్తకు కాని అందజేయవచ్చుకదా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే గవర్నర్ వజుభాయ్ రుడాబాయ్వాలా వారి ఒత్తిడికి తలొగ్గరని కే.జే జార్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
వసూల్ రాజా..!
అందరినీ బెదిరిస్తూ.. వ్యాపారుల దగ్గర వసూలు చేస్తూ..సెటిల్మెంట్లు చేస్తూ..సూపర్ పోలీస్‌గా చలామణి అవుతున్నాడో వ్యక్తి. చివరికి పోలీస్ సిబ్బందిలో కూడా తన మాట వినని వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తూ దారికి తెచ్చుకుంటున్నాడు. తమ కళ్లముందే ఇంత జరుగుతున్నా..పలువురు ఫిర్యాదులు చేస్తున్నా తమకేమీ పట్టనట్టు పోలీసులు వ్యవహరిస్తుండడం విశేషం. * గజపతినగరంలో అనధికార పోలీస్ ఇన్ఫార్మర్? * కేసులున్నా..చర్యలు నిల్..? సాక్షి ప్రతినిధి, విజయనగరం: గజపతినగరం పట్టణంలోని పలు బంగారు దుకాణాలు, ఇతర వ్యాపారస్తులను బెదిరిస్తూ పోలీస్ ఇన్ఫార్మర్నని చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ వ్యక్తి పట్టణానికే సమస్యగా తయారయ్యాడు. ఏ విధమైన ఉపాధి లేకపోయినా పట్టణంలో దర్జాగా పోలీసుల సహకారంతో తనపని తాను చేసుకుపోతున్నాడు. పోలీసు ఇన్ఫార్మర్గా చెప్పుకుంటున్న ఆ వ్యక్తి పట్టణంలో అనేక మంది వ్యాపారస్తులను,ఉద్యోగులను,ప్రజలను అన్యాయంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే అతను పలు నేరాలకు పాల్పడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇదేమని అడిగితే బెదిరింపులకు దిగుతు న్నాడని వాపోతున్నారు. ఆ వ్యక్తిపై పలు కేసులు నమోదవుతున్నా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోకుండా తిరిగి అతన్నే పోలీస్ ఇన్ఫార్మర్గా నియమించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో ఏమైనా సంఘటనలు జరిగితే పోలీసులను అడ్డం పెట్టుకుని వసూలు చేస్తున్నాడు.ఈ మొత్తంలో పోలీసులకు కొంత ముట్టజెప్పడంతో వారు కూడా ఇతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఎస్సీ ,ఎట్రాసిటీ కేసుతో పాటు, బెల్టు షాపుకేసుల్లో ముద్దాయిగా నమోదై ఉన్నాడు.. ఆ మధ్య పట్టణంలో ధర్నా జరుగుతుండగా పురిటిపెంట గ్రామానికి చెందిన సుజన అనే నిండు గర్భిణిని ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా దారి ఇవ్వాలని వేడుకున్న ఆమె భర్త, బంధువులపై దాడికి దిగాడు. దీంతో ఆమె తీవ్ర రక్త స్రావానికి గుైరె ఇబ్బందుల పాలైంది. ఈ సంఘటనపై పట్టణానికి చెందిన పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేసినా పోలీసులకేమీ పట్టకపోవడం విచారకరం. ఇటీవల బొండపల్లి మండలానికి చెందిన బోడసింగి పేట గ్రామంలో మైనర్‌పై లైంగికదాడి కేసుకు సంబంధించి సుమారు రూ.60వేలకు మధ్యవర్తిత్వం వహించి పోలీసులద్వారా కేసును మాఫీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. -
నయా గ్యాంగ్..
మానవహక్కుల పరిరక్షణ ముసుగులో అరాచకాలు సెటిల్ మెంట్లు.. బెదిరింపులు.. భూ దందాలు పోలీసులకు సైతం బ్లాక్ మెయిల్ కళ్లు చెదిరే భవంతులు అధునాతన సౌకర్యాలు పోలీసుల అదుపులో సాదత్ అహ్మద్ ఉలిక్కిపడ్డ పాండు బస్తీ నగరంలో నయా గ్యాంగ్ పుట్టుకొచ్చింది.. సిటీలో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్‌ను తలదన్నే రీతిలో దందాలు చేస్తోంది. మానవహక్కుల సంఘం ముగుసులో అరాచకాలకు పాల్పడుతోంది. లక్షల్లో సెటిల్ మెంట్లు.. కోట్లలో సంపాదన.. సామాన్యులే కాదు పోలీసుల్ని సైతం బ్లాక్మెయిల్ చేస్తోంది. భూ దందాలు.. సెటిల్ మెంట్లు.. హత్యలకు సైతం తెగబడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్ స్థావరాలపై మంగళవారం రాత్రి భారీ సంఖ్యలో జీడిమెట్ల పోలీసులు దాడులు చేశారు. విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఇంటి ముందేమో హ్యుమన్ రైట్స్ బోర్డులు.. లోపల అధునాతన సౌకర్యాలు. ఇంటి ముఖ ద్వారం నుంచి కార్యాలయం వరకు 12 సీసీ కెమెరాలు.. బాంబ్ డిటెక్టర్, కార్పొరేట్ సంస్థ కార్యాలయాలను తలదన్నేలా సంస్థ కార్యాలయం.. జిమ్.. పలు వాహనాలు, విలువైన డాక్యుమెంట్లు.. దుబాయ్‌కు పంపే పాస్‌పోర్టులు.. ఇవి పోలీసుల తనిఖీల్లో వెలుగుచూశాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడను సాయిబాబానగర్ పాండు బస్తీలో ఉంటున్న సాదత్ అహ్మద్ ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ‘ఎస్ఏ’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. సమాజసేవ చేస్తున్నట్టుగా ఫోజులిస్తూ చీకటి కార్యకలాపాలకు తెరలేపాడు. ఓ ముఠాను నడుపుతూ దందాలకు పాల్పడుతున్నాడు. సాదత్ సంగారెడ్డిలో ఉండగా పలు హత్యా నేరాలు, దోపిడీలు, లూఠీల్లో తలదూర్చి అక్కడ నుంచి కుత్బుల్లాపూర్‌కు మకాం మార్చాడని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఇక్కడ నుంచే ఓ గ్యాంగ్‌ను నిర్వహిస్తూ పలు సెటిల్మెంట్లకు తెరలేపాడు. అటు పోలీసులను.. ఇటు సామాన్య, మధ్యతరగతి ప్రజలను.. మరో వైపు పారిశ్రామికవేత్తలను హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ముసుగులో బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ ముఠాపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు అందాయి. శ్రుతి మించిన ఆగడాలు.. పోలీసులపైనే పెత్తనం.. గత కొన్నేళ్లుగా పోలీసులపైనే తిరగబడేంత స్థాయికి ఎదిగాడు సాదత్. జీడిమెట్ల పీఎస్‌లో పని చేసిన ఓ ఎస్ఐ నే అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించి బెదిరింపులకు దిగాడు. రూ.5 లక్షలిస్తే కేసు సెటిల్ చేయిస్తానని చెప్పి అందుకు సస్పెండైన ఓ క్రైం ఎస్ఐతో బేరసారాలు నడిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అన్యాయంగా ఎస్ఐని బలి పశువు చేశారని అప్పటినుంచి సాదత్‌పై కన్నేశారు. రోజు రోజుకు మితిమీరుతున్న ఆగడాలతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా ఓ కానిస్టేబుల్.. అన్న భార్య విషయంలో గొడవ పడితే 498 కేసు కింద ఇరికిస్తానంటూ సదరు కానిస్టేబుల్‌ను బెదిరించాడు. అతని వద్ద నుంచి రూ.1.70 లక్షలు గుంజినట్టు పోలీసులు గుర్తించారు. ఇలా పోలీసులను బెదిరింపులకు గురిచేస్తూ.. ఉన్నతాధికారులే తన జేబులో ఉన్నారని చెప్పేవాడు. శివారు ప్రాంతాల్లోని పలు పోలీస్స్టేషన్లకు నాలుగైదు కార్లలో వెళ్లి దర్జాగా వెళ్లి సీఐ స్థాయి అధికారులపై సైతం బ్లాక్ మెయిల్‌కు దిగేవాడని తెలిసింది. అంతేకాకుండా సామాన్య ప్రజలను సైతం ముప్పు తిప్పలు పెడుతూ వచ్చాడు. భార్యాభర్తల పంచాయితీలను సెటిల్మెంట్ చేస్తానని చెప్పి పలువురిని లొంగ దీసుకుని బెదిరింపులకు గురిచేశారని బాలానగర్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్‌కు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇలా ఇతని ఆగడాలు శృతి మించడంతో పోలీసులు పకడ్బందీగా ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకుని రహస్య విచారణ చేపట్టారు. గతంలో ఇతని ఆగడాలపై ‘సాక్షి’లో ‘ఇక్కడా ఉన్నాయి స్నేక్ గ్యాంగ్’ అన్న కథనం ప్రచురితం కాగా అప్పట్లో చర్చానీయాంశంగా మారింది. ఈ విషయంలో కూడా పోలీసులు మరింత లోతుగా దృష్టి సారించి వేట ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. భారీ బలగాలతో దాడులు.. జీడిమెట్ల, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఈ ముఠాపై దాడి చేశారు. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వారి ఇళ్లపైనా దాడి చేసి విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేసి 7 కేసుల్లో నిందితులుగా నమోదు చేశారు. బాలానగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, మోహన్‌రెడ్డి, పది మంది ఎస్ఐలు సుధాకర్, భూపాల్‌గౌడ్, వీరప్రసాద్, శ్రీని వాస్, 20 మంది కానిస్టేబుళ్లు దాడులు కొనసాగిం చారు. బుధవారం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నర్సిం హారెడ్డి దాడుల అనంతరం విలేకరులకు తెలిపారు. -
మనుషులు మారారు! బతుకులింకా మారలేదు!!
నల్లమల అడవుల్లో అదో కుగ్రామం.ఒకప్పుడు దాని పేరు సెటిల్మెంట్.ఇప్పుడు సిద్ధాపురం. ఆ ఊరిలో క్రీడా పతకాన్ని సాధించిన యువకుడు ఉన్నాడు. కంప్యూటర్స్‌లో పట్టభద్రులున్నారు. కానీ, పట్టా చేతపుచ్చుకుని ఉద్యోగానికెళితే ఎవరూ ఉద్యోగం ఇవ్వరు. పెళ్లి చేసుకుంటామంటే అమ్మాయినివ్వరు. ఆ ఊరి ఆడపిల్లను కోడలిగా చేసుకోవడానికి ఏ ఊరూ ముందుకు రాదు. ఇది ఏ దేవుని శాపమూ కాదు. కేవలం స్వార్థపరుల కుయుక్తుల ఫలితం! బ్రిటిష్ కాలంలో వెలసిన ఈ గ్రామ వివరాల్లోకి వెళితే... ఒకప్పుడు చెన్నై, బేతంచర్ల, దేవరకొండ, కప్పట్రాళ్లతిప్ప ప్రాంతాల్లో కరడుగట్టిన దొంగలుండేవారు. వారిలో పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. దాదాపుగా 30 మంది దొంగలను సమీకరించి, వారిని కుటుంబాలతో సహా ఒక ప్రదేశానికి తరలించింది. తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసి, దానికి సెటిల్మెంట్ అని పేరు పెట్టింది. నిత్యజీవిత అవసరాలకు తగినట్లు సౌకర్యాలు సమకూరుస్తూ క్రమంగా గ్రామంగా రూపుదిద్దింది. బడి, ఆసుపత్రి, పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసింది. ఆ గ్రామం పేరు... సిద్ధాపురం. నల్లమల అటవీ ప్రాంతంలో, కర్నూలు జిల్లా కేంద్రానికి 82 కి.మీ.ల దూరంలో ఉందీ ఊరు. నిజానికి బ్రిటిష్‌వారి కాలంలో వీరి జీవితాలను బాగు చేయడానికి చాలా కసరత్తే జరిగింది. పని మీద దృష్టి మళ్లిస్తే దొంగతనాలను మరిపించవచ్చనే ఉద్దేశంతో 70 ఎకరాల సర్కారు పొలాన్ని ఇచ్చి, చెరువు తవ్వి సాగుచేసుకోమన్నారు నాటి అధికారులు. పశువుల పెంపకం అలవాటు చేశారు. సభ్యసమాజంలో ధైర్యంగా జీవించగలిగేటట్లు వారిలో పరివర్తన తీసుకువచ్చారు. అంతా అనుకున్నట్లే జరిగితే... ఇది ఓ ఆదర్శగ్రామం అయ్యేది. అయితే నూటికి తొంభై మంది మంచిగా మారిపోయి, గౌరవప్రదంగా జీవిస్తున్నప్పటికీ పదిశాతం మంది దొంగతనాలను వదలకపోవడంతో సిద్ధాపురం ఓ ‘దొంగల గ్రామం’గా ముద్ర వేయించుకుంది. ఆ ముద్ర నుంచి బయట పడడానికి నాటి నుంచి నేటి వరకూ అష్టకష్టాలు పడుతూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చింది... కానీ! దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటిష్ పాలకులు దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. కానీ స్థానిక అధికారులకు సిద్ధాపురం గురించి అవగాహన లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. పరివర్తన చెందకుండా ఉన్న పదిశాతం మంది వీరవిహారం చేయడం మొదలు పెట్టారు. తెలుగు నేల మీదే కాక తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కడ దొంగతనాలు చేయాలన్నా వీరే ముందుండేవారు. ఒక సమయంలో వీరు తమకు తెలియకుండానే కొందరు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయారు. వారు చెప్పినట్టు నాటు సారా తయారుచేయడం, అడవిలో చెట్లను నరికి అక్రమ రవాణాకు సహకరించడం, జంతువులను వేటాడడం వంటి అరాచకాలకు పాల్పడేవారు. కేవలం వీరివల్ల ఆ ఊరు దొంగల గ్రామంగానే మిగిలి పోయింది. నిజానికి 360 కుటుంబాలున్న ఆ గ్రామం ఇప్పుడు బాగా మారింది. పిల్లలు చదువుకున్నారు. పెద్దలు వ్యవసాయం చేసుకుంటున్నారు. గేదెలను మేపుకుంటూ పాల వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ దురదృష్టం... ఇప్పటికీ ఎప్పుడు ఎక్కడ చోరీ జరిగినా అందరి చూపూ వీరి మీదికే మళ్లుతోంది. మార్పు వచ్చింది..! సిద్ధాపురం వాసుల్లో మంచి మార్పు వచ్చింది. ఇంకా కొందరు దొంగలున్నారు. వారిలోనూ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వారికి అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు ఎస్పీ రవికృష్ణ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. వారికి తరచూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్రమ మార్గంలో కాకుండా సక్రమ మార్గంలో సంపాదించేందుకు తోడ్పడుతున్నాం. - నరసింహారెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ, కర్నూలు జిల్లా కాలం మారింది... మేమూ మారాం! ‘దేశం శాస్త్ర సాంకేతికంగా ఎదుగుతోంది. ఆ ప్రకారమే మేమూ ఎదుగుతాం’ అంటున్నారు సిద్ధాపురం యువకులు. ఈ ఊళ్లో బీఏ, బీకామ్ బీఎస్సీ, కంప్యూటర్స్ కోర్సులు చేసిన వాళ్లు ఉన్నారు. స్పోర్ట్స్ అవార్డు అందుకున్న సుధాకర్ ఉన్నాడు. కానీ వీరిని నిరుద్యోగం పీడిస్తోంది. ‘‘ఎక్కడ ఉద్యోగానికి వెళ్లినా సిద్ధాపురం పేరు చెబితే వెనక్కు పంపేస్తున్నారు. పోనీ ఊళ్లోనే ఉండి ఏ గేదెలో మేపుకుంటూ బతుకుదామంటే ఎక్కడ దొంగతనం జరిగినా మమ్మల్ని అరెస్టు చేస్తారని భయం’’ అని యువకులు ఆవేదన చెందుతున్నారు. వారి భయంలో నిజం లేకపోలేదు. కొన్నిసార్లు వేరేవాళ్లు చేసిన నేరాలు కూడా వారిమీద పడుతుంటాయి పాపం. ఇటీవల శ్రీశైలం స్వామి దర్శనం కోసం వెళ్లినప్పుడు... సిద్ధాపురం వాసులని తెలిసి బట్టలూడదీసి కూర్చోబెట్టారంటే వారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇక్కడి యువకులకు అమ్మాయినివ్వడానికి ఏ ఊరివాళ్లూ ముందుకు రావట్లేదు. అలాగే ఈ ఊరి అమ్మాయిలను చేసుకోవడానికి కూడా ఏ ఊరి యువకులూ మొగ్గుచూపట్లేదు. మరోపక్క సిద్ధాపురం అన్ని రకాలుగానూ వెనుకబడి ఉంది. అభివృద్ధి పనులు లేవు. సిమెంట్ రోడ్లు, వీధిలైట్లు, మురుగు కాలువలు లేవు. వర్షం వస్తే గ్రామమంతా బురద! బ్రిటిష్ పాలకులు పెట్టిన ఆసుపత్రి మూతపడింది. వందల పశువులున్నా పశువైద్యులు లేరు. పాఠశాల కూడా శిథిలావస్థలో ఉంది. వీరి కోసం ఎవరూ ఏమీ చేయక పోవడం బాధాకరం. అయితే అంతకంటే ఎక్కువ బాధ, తమను ఇంకా దొంగలుగానే చూస్తుంటే కలుగుతోందని అంటు న్నారు వారు. ‘అక్రమ మార్గాన్ని వదిలేశాం, సక్రమంగా బతుకుతున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి, అందరిలో కలుపుకోండి’ అని వేడుకుంటున్నారు. ‘పరివర్తన చెందాం... మమ్మల్ని నమ్మండి’ అని బతిమాలుతున్నారు. వారి వేదన ఇప్పటికైనా అందరికీ అర్థమైతే అదే చాలు! - రవిరెడ్డి, సాక్షి, కర్నూలు ఫోటోలు: హుస్సేన్ -
భూదాహం
కోట్లాది రూపాయల విలువైన భూమిపై మంత్రి అనుచరుల కన్ను ఓ వ్యక్తికి అనుకూలంగా పావులు కదుపుతున్న వైనం కోర్టులో కేసు నడుస్తున్నా సెటిల్మెంట్కు అధికారులపై ఒత్తిడి మైలవరం/విజయవాడ : ‘తెలుగు తమ్ముళ్ల’ భూదందాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విజయవాడ చుట్టు పక్కల ఉన్న భూములను ఎలాగైనా దక్కించుకుని కోట్లాది రూపాయలు ఆర్జించాలని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కోర్టుల్లో ఉన్న భూములను సైతం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే నిబంధనలను తుంగలో తొక్కాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే తరహాలో ఓ జమిందారుకు చెందిన భూమిని కాజేసేందుకు జిల్లాకు చెందిన మంత్రి అనుచరులు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. గణపవరం జమిందారు భూమి కోసం పట్టు.. మైలవరం మండలం గణపవరం గ్రామ జమిందార్ దివంగత బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డికి కోడూరు గ్రామంలో సర్వే నంబర్ 22, 23లో 27.22 ఎకరాల భూమి ఉంది. ఆయనకు ఇది పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి. ఈ భూమిని గణపవరం గ్రామానికి చెందిన గుంటక వెంకటేశ్వరరెడ్డి 2009లో అతి తక్కువ ధరకు తన భార్యపేరుతో కోనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు వెంకటేశ్వరరెడ్డి మనుమడు బొల్లారెడ్డి యువరాజ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఈ భూమిని వెంకటేశ్వరరెడ్డి తన భార్య, సోదరి పేరుతో జమిందార్ వెంకటేశ్వరరెడ్డితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై యువరాజ్ రెడ్డి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 90 ఏళ్ల వయసులో ఉన్న జమిందార్ వెంకటేశ్వరరెడ్డికి మాయమాటలు చెప్పి తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేశారని, ఆ భూమి కొన్నేళ్లుగా తన అనుభవంలో ఉందని, పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి కావడంతో దీనిలో తనకు కూడా హక్కు ఉందని, అందువల్ల ఈ అమ్మకం చెల్లదని యువరాజ్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో కోర్టు 2010 జూన్ 6వ తేదీన ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ భూమికి సంబంధించి గుంటక వెంకటేశ్వరరెడ్డి భార్య అన్నపూర్ణ, సోదరి శారదలు పట్టాదారు పాసుపుస్తకాల కోసం గతంలో తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయగా, ఈ భూమి యువరాజ్‌రెడ్డి ఆధీనంలో ఉండటం, వివాదం నడుస్తుండటంతో పాస్‌పుస్తకాలు ఇవ్వడం సాధ్యం కాదని ఎండార్స్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో సదరు భూమిని ఆక్రమించడానికి జి.వెంకటేశ్వరరెడ్డి వర్గీయులు యత్నించడంతో వివాదం చెలరేగింది. అసలు ఈ భూ లావాదేవీపై విచారించాలని అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి జి.కొండూరు తహశీల్దారును ఆదేశించారు. అప్పటి తహశీల్దారు బిక్షారావు బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డిని వ్యక్తిగతంగా విచారించగా, తనకు వయోభారం వల్ల మతిస్థిమితం సరిగా ఉండటం లేదని, ఆ భూమికి సంబంధించిన ఏ విషయమైనా తన మనవడు యువరాజ్‌రెడ్డి చెప్పినట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు తహశీల్దార్ తన నివేదికలో పేర్కొని కలెక్టర్‌కు సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడి.. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ఉపయోగించుకుంటూ ఆయన పీఏగా వ్యవహరిస్తున్న ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారి రంగంలోకి దిగారు. జి.వెంకటేశ్వరరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ రెండు నెలల క్రితం కోడూరు గ్రామంలో 145 సెక్షన్ కూడా విధింపజేసి పొలంలో పనులు చేసుకుంటున్న కూలీలను సైతం భయభ్రాంతులకు గురి చేశారు. స్థానిక ఎస్ఐ నుంచి వచ్చిన సూచనను కనీసం క్షేత్రస్థాయిలో విచారణ జరపకుండా జి.కొండూరు తహశీల్దార్ 145 సెక్షన్‌ను విధించడంపై యువరాజ్‌రెడ్డి మళ్లీ కోర్టుకు వెళ్లారు. దీంతో తహశీల్దార్ ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. తాజాగా ఈ భూమిలోకి ప్రవేశించడమే కాకుండా దాన్ని ఏదో ఒక విధంగా సెటిల్ చేయాలని మంత్రి అనుచరులు స్థానిక తహశీల్దార్, పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ వివాదం గురించి ‘సాక్షి’ మైలవరం తహశీల్దార్ వద్ద ప్రస్తావించగా తనకేమీ తెలియదని చెప్పారు. అప్పట్లో ఎస్ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగానే 145 సెక్షన్ విధించామని దాటవేశారు. కోర్టులో ఉన్న అంశంపై మంత్రి అనుచరులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని యువరాజ్ రెడ్డి ప్రతినిధి డి.శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇప్పటికే తాము అధికారులను కలిసి కోర్టు కేసుకు సంబంధించిన అన్ని వివరాలు అందజేశామని ఆయన చెప్పారు. -
మనీ ట్రాన్స్ఫర్ ఇలా...
బ్యాంకు ఖాతాల్లో సత్వర నగదు బదిలీకి ఉపయోగపడే విధానాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ అని రెండు ఉన్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్కి నెఫ్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్కి ఆర్టీజీఎస్ సంక్షిప్త రూపాలు. బ్యాంకులో ఈ సేవలు వినియోగించుకోవాలంటే.. నిర్దేశిత ఫారం నింపాల్సి ఉంటుంది. లబ్ధిదారు పేరు, బ్యాంకు.. శాఖ పేరు, ఖాతా నంబరు, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (ఐఎఫ్ఎస్సీ) మొదలైన వివరాలు రాసి.. చెక్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఆన్లైన్లో సైతం ఈ విధానాల ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆర్టీజీఎస్ విధానం కింద ట్రాన్స్ఫర్ చేయాలంటే కనీసం రూ. 2 లక్షలు బదిలీ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులను బట్టి గరిష్ట మొత్తం ఆధారపడి ఉంటుంది. అదే నెఫ్ట్ విధానంలోనైతే ఒక్క రూపాయైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక చార్జీల విషయానికొస్తే.. నెఫ్ట్ విధానంలో బదిలీ చేసిన మొత్తాన్ని బట్టి రూ. 5-25 దాకా చార్జీలు ఉంటాయి. ఆర్‌టీజీఎస్‌కి సంబంధించి రూ. 2-5 లక్షల దాకా ట్రాన్స్ఫర్కి రూ. 25, రూ. 5 లక్షలకు మించిన మొత్తంపై రూ. 50 మేర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా విధానాలతో పోలిస్తే నగదు బదిలీ వేగంగా జరగడం నెఫ్ట్, ఆర్టీజీఎస్ ప్రత్యేకత. నెఫ్ట్‌లో సుమారు ప్రతి గంటకోసారి క్లియరెన్స్ ఉంటుంది. అంటే బదిలీ చేసిన నగదు.. అవతలి వారి ఖాతాలో సుమారు గంట తర్వాతకల్లా ప్రతిఫలిస్తుంది. క్లియరెన్స్ సమయాన్ని బట్టి కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలో కూడా పూర్తికావొచ్చు. ఆర్టీజీఎస్లో అప్పటికప్పుడు లావాదేవీ పూర్తవుతుంది. సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉదయం 9 నుంచి సాయంత్రం ఏడు వరకు, శనివారాల్లో ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. దాకా చాలా మటుకు బ్యాంకులు ఈ సర్వీసును అందిస్తున్నాయి. ఈ వేళలు దాటిన తర్వాత చేసే లావాదేవీలు మర్నాడు పూర్తవుతాయి. ఒకవేళ ఏదైనా కారణం చేత లావాదేవీ విఫలమైతే .. డెబిట్ చేసిన డబ్బును బ్యాంకు మళ్లీ మన ఖాతాలోకి బదిలీ చేస్తుంది. -
స్నేక్ గ్యాంగ్‌పై ఐదు కేసులు
నత్తనడకన సాగుతున్న విచారణ రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆరోపణలు ముఠా సభ్యులకు పార్టీల అండదండలు! హైదరాబాద్: అత్యాచారాలు, సెటిల్మెంట్లతో హైదరాబాద్‌ను హడలెత్తించిన స్నేక్గ్యాంక్పై పోలీసులు ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేశారు. ఫాం హౌజ్‌లో యువతిపై సామూహిక అత్యాచార ఘట నకు సంబంధించి ప్రధాన నిందితుడు ఫైసల్ దయాని, 9వ నిందితుడు సాలం హమ్దీ(స్నేక్‌గ్యాంగ్ సభ్యులు)లను విచారించిన పహాడీషరీఫ్ పోలీసులు శనివారం వారిని రిమాండ్‌కు తరలిం చారు. ఇన్స్పెక్టర్ పి.శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకా రం.. గత నెల 31న యువతిపై జరిగిన సాముహిక అత్యాచారం ఘటనతో పాటు మరో నాలుగు కేసులలో స్నేక్‌గ్యాంగ్ సభ్యులు నిందితులు. పాములను పట్టుకున్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద స్నేక్గ్యాంగ్పై సుమోటో కేసు నమోదు చేశారు. అలాగే, మతాంతర వివాహం చేసుకుందని ముస్లిం యువతిని బెదిరించిన ఘటనలో ఐపీసీ 295ఎ, 506, 509 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇంటిని ఆక్రమించి బెదిరించిన ఘటన, భార్యాభర్తల గొడవలో తలదూర్చి భర్తపై తీవ్రంగా దాడిచేసిన ఘటనలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, స్నేక్‌గ్యాంగ్ బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. సా...గుతున్న విచారణ.. స్నేక్‌గ్యాంగ్ సభ్యులను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణను నత్తనడకన సాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సెటిల్మెంట్లు, అత్యాచారాలు చేసి వాటిని తమ సెల్ఫోన్లో వీడియో తీసుకున్న ఈ ముఠా సభ్యులపై కొన్ని ఘటనలకు సంబంధించి మాత్రమే కేసులు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. నిందితుల నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కేవలం నాలుగైదు వీడియోలే లభించాయని, డిలీట్ చేసిన వాటిని రికవరీ చేస్తామని చెప్పారు. కానీ, స్నేక్‌గ్యాంగ్ అకృత్యాలకు బలమైన సాక్ష్యాలుగా నిలిచే ఆ వీడియోలను ఇప్పటివరకు రికవరీ చేయలేకపోయారు. -
సెటిల్మెంట్లు చేస్తే చర్యలు
రంపచోడవరం, మారేడుమిల్లి:న్యాయం కోసం బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వస్తే వెంటనే కేసు నమోదు చేయాలని, అలా చేయకుండా సెటిల్మెంట్లు చేస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ హెచ్చరించారు. రంపచోడవరం డివిజన్లో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తూర్పు సరిహద్దు ప్రాంతంలో మావోల కదలికలు ఎక్కువగా ఉన్నాయని గాలికొండ, కోరుకొండ దళాలు సరిహద్దులో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తూర్పు ఏజెన్సీలో 2008 నుంచి మవోల కదలికలు పూర్తిగా తగ్గాయని, ప్రస్తుతం గుర్తేడు ఏరియాలో మావోల కదలికలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. మావోయిస్టుల కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రాలో విలీనమైన మండలాల నుంచి ఆరు పోలీస్ స్టేషన్లు తూర్పు పరిధిలోకి వచ్చాయని, కొత్తగా మరో సబ్ డివిజన్ పోలీసు కార్యాలయం ఏర్పాటు అవసరం ఉందన్నారు. మావోల ప్రభావం ఎక్కువగా ఉన్న చత్తీస్గడ్ కుంట ఏరియాలో శబరి ప్లాటూన్ సంచారం ఉందని, మావోలకు చెక్ పెట్టేందుకు కూంబింగ్ జరుగుతుందని, వారి కదలికలపై నిఘా పెట్టామన్నారు. విలీన ప్రాంతంలో పోలీస్ సిబ్బంది నియమకానికి సమయం పడుతుందని, వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం గుర్తేడులో పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ఉందని ఎస్పీ చెప్పారు. గిరిజన యువత మావోల ఉద్యమంవైపు ఆకర్షితులు కావడం లేదని, ఇందుకు ఉపాధి అవకాశాలు పెరగడం చైతన్యం రావడమే కారణమని పేర్కొన్నారు. మావోల ప్రభావిత ప్రాంతాల్లో ఐఏపీ నిధులతో చేపట్టిన పనుల ప్రగతిపై పరిశీలించామని, గిరిజన యువత చైతన్యానికి వివిధ అంశాలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టామన్నారు. తూర్పు సరిహద్దులోని గ్రామాల్లో గంజాయి సాగు చేస్తూ ఏజెన్సీ ప్రాంతం మీదుగా బయటకు రవాణా చేస్తున్నారని, పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీసులు గంజాయి అక్రమార్కులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సి.హెచ్.విజయరావు ఉన్నారు. అనంతరం ఆగస్టు 15 సందర్భంగా రంపచోడవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి పోలీస్ మీట్ విజేతలకు ఎస్పీ ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో సీఐలు కృష్ణారావు, రాంబాబు, ఉమర్, ముక్తేశ్వరరావు, ఎస్సై విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే
రాష్ట్ర ఆర్టీఐ కమిషన్ తాంతియా కుమారి వెల్లడి తిరుపతి కార్పొరేషన్ : సమాచార హక్కు చట్టం కింద ఆయా సంస్థలు సమాచారం ఇవ్వాల్సిందేనని అలా కాకుండా వారిని భయభ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ లామ్ తాంతియా కుమారి అన్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం, వైఎస్ఆ ర్ సమావేశ మందిరంలో బుధవారం ఆర్టీఐ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను ఆమె విచారించారు. పీలేరుకు చెందిన అడ్వకేట్ ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి అర్బన్, అక్కారంపల్లెలో సెటిల్మెంట్ అర్డర్లపై సమాచారం అడిగితే రెండేళ్లుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీనికి డీఆర్వో ఒంగోలు శేషయ్య మాట్లాడుతూ తమవద్ద ఆ వివరాలు లేవని ఎండార్స్మెంట్ ఇచ్చామని వివరణ ఇచ్చారు. ఎండార్స్మెంట్ అంటే సమాచారం కాదు, అలా అని చేతులు దులుపుకుంటే సరికాదని కమిషనర్ సున్నితంగా హితవు పలికారు. ‘‘మీరు సరైన సమయంలో సమాచారం ఇస్తే మా వద్దకు రారుకదా, వారంలోగా సమాచారం ఇవ్వండి’’ అంటూ ఆదేశించారు. ద్రవిడవర్సిటీకి సంబంధించి కేసులు ఎక్కువగా ఉన్నా అప్లైంట్లు హాజరు కాకపోవడంపై రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. పరీక్షలకు హాజరు కాకపోతే ఇంప్రూవ్‌మెంట్‌కు ఎలా అనుమతిస్తారు. ఒకవేళ హాజరైతే అంతకు ముందు, వచ్చిన తరువాత ఏ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారో సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు. విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఎవరు అడిగినా దరఖాస్తు చేసుకున్న48 గంటల్లో ఇవ్వాలని ఆదేశించారు. అలాగే భాస్కర్ విజయసాయి పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకుంటే రూ.60వేలు కట్టించుకున్నారు. అప్లికేషన్లో మాత్రం నాట్ ఎలిజబుల్ అంటూ రిజెక్టు చేశారు, అసలు రిజెక్టు చేసిన వ్యక్తి నుంచి అంత డబ్బు ఎందుకు కట్టించుకున్నారు? దీనిపై సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు. బాధితుని వద్ద కట్టించుకున్న రూ.60వేలకు వడ్డీతో కలిపి చెల్లించాలంటూ ఆదేశించారు. షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎలాగూ సమాచారం ఇవ్వడం మీకు చేతకాదు, సమాచారం కోసం వచ్చే వారిని భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించడం సరికాదన్నారు. గతంలో హెచ్చరించినా మీలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. సమాచారం కోసం వచ్చేవారిని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. వంశీకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన కేసులో వడమాల పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కమిషన్ ముందు హాజరు కాకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25వేల జరిమాన విధిస్తూ, షోకాజ్ నోటీసు జారీ చేస్తూ, తన ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఒకసారి షోకాజ్ ఇస్తే వారి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఆగిపోతాయని దీనిని దృష్టిలో ఉంచుకుని పనిచేసుకోవాలని అధికారులకు సూచించారు. -
విడాకుల మూల్యం రూ. 27 వేల కోట్లు..
చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారం ఇది. విడాకుల వివాదం సెటిల్మెంట్ కోసం అక్షరాలా రూ. 27 వేల కోట్లు భార్యకు చెల్లించాలంటూ రష్యాకు చెందిన వ్యాపారవేత్త దిమిత్రీ రైబొలొవ్లెవ్ను అక్కడి కోర్టు ఆదేశించింది. ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 52,800 కోట్లు ఉంటుంది. దాదాపు ఆరేళ్ల నుంచి ఈ కేసు కొనసాగుతోంది. ఇలాంటివే మరికొన్ని భారీ విడాకుల కేసులు కూడా ఉన్నాయి. ఫ్రెంచ్ వ్యాపారవేత్త అలెక్ వెల్డైన్స్టెయిన్ డైవోర్స్ తీసుకున్నప్పుడు భార్య జోసెలిన్కి దాదాపు రూ. 15,000 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. అలాగే, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తన మాజీ భార్య ఆనాకి సుమారు రూ. 10,000 కోట్లు ఇచ్చారు. ఇదే కోవలో ఫార్ములా వన్ ప్రెసిడెంట్ బెర్నీ ఎక్లిస్టోన్ తన మాజీ భార్య స్లావికా నుంచి విడాకుల కోసం రూ. 9,000 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. హాలీవుడ్ స్టార్ మెల్ గిబ్సన్ కూడా భార్య రాబిన్ నుంచి విడిపోయినప్పుడు రూ. 2,000 కోట్లు పైగా ఇవ్వాల్సి వచ్చింది. -
మాట్లాడుకుందాం రా!
ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు మధ్యవర్తులతో చేతులు కలిపి జనం జేబులకు చిల్లు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయం కోసం స్టేషన్లకు వస్తే ముందుగా కలవాల్సింది మధ్యవర్తులనేనని, లేకపోతే స్టేషన్లో అడుగు పెట్టడం కుదరడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో విధంగా కేసు నమోదైనా... వెంటనే ఆయా ప్రాంతాలలో నాయకులో, పెద్దమనుషులో జోక్యం చేసుకుంటారని, వారు మాట చెప్పనిదే కేసు ముందుకు నడిచే పరిస్థితి చాలా చోట్ల లేదని తెలుస్తోంది. జిల్లాలోని పలు స్టేషన్ల అధికారులు మధ్యవర్తులతో సంబంధాలు ఏర్పర్చుకొని, వారు ‘ఎంత చెబితే అంత’ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాలు మొదలుకొని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి, ఇల్లెందు ప్రాంతాల్లో కూడా మధ్యవర్తుల పంచాయితీలు నిత్యకృత్యమయ్యాయని పలువురు చెబుతున్నారు. జిల్లాలోని కొన్ని స్టేషన్లలో తీరు ఎలా ఉందంటే... ఖమ్మం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌పై ఫిర్యాదులు వస్తున్నా... కేసులు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. టూటౌన్ పరిధిలో చైన్ స్నాచింగ్, ఇంటి తాళాలను పగులగొట్టి దోచుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా.. రికవరీలో పోలీసులు విఫలమయ్యారు. త్రీటౌన్ పరిధిలో వచ్చిన ఫిర్యాదులను కేసు నమోదు చేయకుండా సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అనేక కేసులను పోలీస్‌స్టేషన్ బయటే సెటిల్ చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇతర జిల్లాల నుంచి వచ్చి పేకాట ఆడుతున్నప్పటికీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా పోలీస్స్టేషన్లోనూ బాధితులకు న్యాయం జరగడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మధ్యవర్తులు లేకుం డా ఏ ఒక్క కేసూ నమోదు కావడంలేదనే విమర్శలున్నాయి. స్టేషన్ ఎదుట దళారులు మాటు వేసి, అధికారులతో కుమ్మక్కై ఫిర్యాదుదారులతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారని, వారికి నచ్చితే ఒక తీరుగా, లేకుంటే మరో రకంగా కేసు నమోదయ్యేలా చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వైరాలో అధికార పార్టీ నాయకులు స్టేషన్లో కేసులు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, అక్కడ వారే పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది అత్యధికంగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులు మాత్రమే నమోదయ్యాయి. పాలేరు నియోజకవర్గంలోని పోలీస్ ఠాణాలు ప్రైవేట్ పంచాయితీలకు నిలయాలుగా మారాయి. నిత్యం భూ తగాదాలు, సివిల్ విషయాలలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని, వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. ఏదైనా కేసు విషయంలో గ్రామాలకు వెళ్లిన పోలీస్ సిబ్బంది వాహన ఖర్చులంటూ ఇరు వర్గాల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల కేసులు, భూ తగాదాల్లో పోలీసులు అతిగా వ్యవహరిస్తూ ఆయా గ్రామాల పెద్ద మనుషులతో పరోక్షంగా పంచాయితీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నేలకొండపల్లి మండలం అప్పల నర్సింహాపురానికి చెందిన ఓ మహిళ.. తనను ఖమ్మానికి చెందిన యువకుడు మోసం చేశాడని, పెళ్లి చేసుకోవాలంటే పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసినా.. ఆమె ఆవేదనను పట్టించుకోలేదు. ఫిర్యాదుదారులు వస్తే రిసెప్షన్ కౌంటర్లో ఉన్న సిబ్బంది పిటిషన్ రాయాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని స్వయంగా జిల్లా పోలీస్ బాస్ చెప్పినా అది ఎక్కడా అమలు కావడంలేదు. ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి స్టేషన్లలో ఎక్కువగా అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే న్యాయం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగూడెంలో మూడు పోలీస్స్టేషన్లు ఉన్నాయి. 1/70 చట్టం అమలులో ఉన్న ఏరియా కావడంతో భూ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులలో ఎక్కువగా బయటే సెటిల్మెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు ఈ స్టేషన్ల పరిధిలో ఎక్కువగా చిన్న చిన్న గొడవలు జరగడం, అవి స్టేషన్ వరకు వస్తే రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి సెటిల్మెంట్లు చేయడం షరా మామూలవుతోంది. ఇక ఇసుక మాఫియా సైతం కొత్తగూడెం పట్టణంలో ఎక్కువగా ఉంది. వీటిపై పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాల్వంచలో రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కుటుంబ కలహాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని రాజకీయ నాయకులు బయట పంచాయితీలు పెట్టి పరిష్కరిస్తున్నారు. చోరీలకు సంబంధించిన కేసులు సక్రమంగా నమోదు కావడం లేదు. అశ్వారావుపేట పోలీసులు నల్లబెల్లం, సారా రవాణాను నియంత్రించడమే పనిగా పెట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారుల విధులు వీరు నిర్వహిస్తుండగా, కొందరు కింది స్థాయి సిబ్బంది మాత్రం నల్లబెల్లం వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దమ్మపేట, వేలేరుపాడు, చండ్రుగొండ, కుక్కునూరు, ముల్కలపల్లి మండలాల్లో ముందుగా రాజకీయ నాయకుల వద్ద పంచాయితీలు పెడతారు. అప్పటికీ పరిష్కారం కాకుంటే పోలీస్ స్టేషన్‌కు వెళుతుంటారు. ఈ కేసుల్లో పెద్దమనుషులు చెప్పినట్లుగా పోలీసులు నడుచుకుంటారు. సత్తుపల్లి పరిసర ప్రాంతాలలో క్రికెట్ బెట్టింగులు, పేకాట, కోడిపందేలు వంటివి జరుగుతున్నా.. కేసుల నమోదు నామమాత్రమే. ఇటీవల ఇక్కడి నుంచి బదిలీ అయిన ఓ సీఐ సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌ను కార్పొరేట్ కార్యాలయంగా తయారుచేశారు. స్టేషన్‌కు వెళ్లగానే చల్లని ఏసీ గాలి తగులుతుంది. స్టేషన్ మొత్తం వాస్తు పేరుతో మరమ్మతులు చేశారు. అంతా గ్లాస్ ఫిటింగ్, పచ్చని గార్డెన్తో కళకళలాడుతోంది. అయితే ప్రతి పనికి డబ్బులు లేనిదే కుదిరేది కాదనే ప్రచారం ఉంది. అతడి సంపాదనపై తోటి ఉద్యోగులే కథలు.. కథలుగా చెప్పుకుంటున్నారంటే.. ఫార్మాల్టీల పేరుతో ఆయన ఎంత వసూళ్లుకు పాల్పడ్డారో అర్ధం చేసుకోవచ్చని ఓ అధికారి ఉన్నతాధికారులకు ఉప్పందించినట్లు ప్రచా రం జరుగుతోంది. డిపార్ట్మెంట్ ఎం క్వైరీ కూడా జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. మరో యువ ఎస్సై ఫార్మాల్టీల పేరుతో డబ్బులు బాగా వసూలు చేస్తున్న ట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయ కులతోనే సెటిల్మెంట్లు చేయించి డబ్బులు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతోందనే విమర్శలున్నాయి. రాజకీయ నేతల అండదండలతో కేసుల సెటిల్మెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు గిరిజన చట్టాలు అమలులో ఉండటంతో భారీగా భూ దందాలు జరుగుతున్నాయి. కొంత మంది ముఠాలుగా ఏర్పడి ఈ దందాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఈ సెటిల్మెంట్లు, భూదందాలపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆ రోపణలున్నాయి. కొద్ది నెలల క్రితం భద్రాచలం వచ్చిన ఎస్పీ రంగనాథ్ సెటిల్మెం ట్లను సహించేది లేదని, ఎటువంటి అధికారులనైనా ఉపేక్షించబోమని హెచ్చరించినా పరి స్థితులలో మార్పు రాకపోవడం గమనార్హం. ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల పోలీస్‌స్టేషన్ బయట పిటీ కేసుల పరిష్కారం కోసం అప్పుడప్పుడు పంచాయితీలు కొనసాగుతాయి. ఫిర్యాదులకు పోలీస్‌స్టేషన్‌లో రశీదులు ఇచ్చేదే లేదు. కామేపల్లి పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదులకు రశీదులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఫిర్యాదుదారుడు ఎవరైనా.. వెంటనే కేసు నమోదు చెయ్యరు.. రశీదు ఇవ్వరు. ఇక్కడ అధిక మొత్తంలో కేసులు సెటిల్మెంట్ ద్వారానే పరిష్కారం అవుతుంటాయి. అయితే కామేపల్లి పీహెచ్సీలో వ్యాపారులు గత నెల 21న అక్రమంగా సుబాబుల్ చెట్లు నరకగా వైద్యాధికారి వారిపై గత నెల 24న ఫిర్యాదు కూడా చేశారు. దానిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు.. కనీసం విచారణ కూడా చేపట్టలేదు. -
ఇసుకాసురులపై కన్నెర్ర
=జరిమానాలకు తాజా మార్గదర్శకాలు విడుదల =గత ఆదేశాల అమలులో కరువైన చిత్తశుద్ధి =భయపడుతున్నవారు కొందరు..అమ్ముడుపోతున్నవారు మరికొందరు.. =విధి నిర్వహణలో అధికారుల వెనుకంజ =కాలర్ ఎగరేస్తున్న ఇసుక మాఫియా యలమంచిలి, న్యూస్‌లైన్: ఇసుక స్మగ్లర్లపై ప్రభుత్వం మరోసారి కన్నెర్ర చేసింది. నదుల్లో ఇసుక తరలిస్తున్న వాహనాలకు జరిమానా విధింపులో మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. అక్రమ ఇసుక తరలింపునకు సంబంధించి ప్రభుత్వ చర్యలు ఆది నుంచి బెడిసికొడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను చిత్తశుద్ధితో అమలుచేసే అధికార యంత్రాంగం లేకపోవడంతో ఇసుక స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. తాజాగా నదుల్లో ఇసుకను తరలిస్తున్న వాహనాలను కేటగిరీలుగా విభజించారు. ట్రాక్టరు, లారీలు ఇసుక తరలింపుతో పట్టుబడినట్టయితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు, లారీల్లో ఇసుక తరలిస్తే మొదటిసారి రూ.15 వేలు, రెండోసారి రూ.20 వేలు జరిమానా విధించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. మూడోసారి పట్టుబడితే వాహనాలను సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు సరే.. అమలేదీ? నదుల్లో ఇసుక తరలింపును అడ్డుకోవలసిందిగా అప్పుడప్పుడు ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది. గత రెండేళ్లలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఒకసారి పరిశీలిస్తే.. నదుల్లో ఇసుక తరలింపును అడ్డుకోవడానికి గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. వీటి ఏర్పాటును అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. క్రిమినల్ కేసులు, వాహనాల సీజ్ వంటితో ఇసుక తరలింపును కట్టడి చేయాలన్న ఆదేశాల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ప్రతిసారీ రెండు మూడు రోజులపాటు హడావిడి చేస్తున్న అధికారులు.. ఆ తర్వాత ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్నారు. పేట్రేగిపోతున్న ఇసుక స్మగ్లర్లు వరాహ, శారద, తాండవ నదుల్లో ఇసుక రవా ణా చేసే స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటున్న ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు తెగబడడంతో పలువురు సిబ్బంది మాకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా స్మగ్లర్లు నెలకు లక్షల్లో ఆర్జిస్తున్నారు.దీంతో అధికారులు అప్పుడప్పుడు కేసు లు పెట్టి, జరిమానా వసూలు చేస్తున్నా పెద్దగా పట్టించుకోవడంలేదు. ఒక ట్రాక్టరు ఉన్న ఇసు క స్మగ్లర్ ఆదాయం నెలకు 3 లక్షల పైమాటే. దీంతో స్మగ్లర్లు ఇసుక అక్రమ రవాణాకు రెవె న్యూ, పోలీసు శాఖలకు వేలల్లో మామూళ్లు సమర్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నా యి. స్థానికులను మేనేజ్ చేయడానికి స్మగ్లర్లు పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇసుక స్మగ్లర్ల స్థాయిలో సెటిల్మెంట్ చేసే గ్యాంగ్‌లు కూడా పనిచేస్తున్నాయన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. ఇక నదుల్లో కెమెరాలు పట్టుకుని వెళ్తున్న వాళ్లకు వేలల్లో నెలవారీ మామూళ్లు సమర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మాకేమీ కాదంటూ స్మగ్లర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు. -
కోనసీమలో రౌడీయిజం
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :ప్రశాంతంగా ఉన్న అమలాపురం పట్టణం మారణాయుధాలతో అల్లర్లు, పరస్పర దాడులకు వేదికవుతోంది. ఆధిపత్య పోరులో ఒకరినొకరు హతమార్చేందుకు కూడా వెనుకాడడం లేదు. పాతకక్షలతో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ కేంద్రమైన అమలాపురం ఇటీవల నివురుగప్పిన నిప్పులా తయారైంది.రౌడీగ్యాంగ్ వార్తో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకుంటాయోనని ప్రజల గుండెల్లో గుబులురేగుతోంది. అమలాపురంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఇద్దరు రౌడీషీటర్ల వర్గాల మధ్య పరస్పర దాడులతో పట్టణ ప్రజలు ఉలిక్కి పడ్డారు. రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరుతో గతంలో ఎదురైన అనేక చేదు అనుభవాలను... భయానక సంఘటనలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుని ఆందోళనకు గురయ్యారు. ఫ్యాక్షనిజాన్ని తలపించేలా.. రౌడీషీటర్లు మారణాయుధాలతో రెచ్చిపోతున్న చర్యలు పోలీసులకు సైతం దడపుట్టిస్తున్నాయి. సెటిల్మెంట్లతో ఆజ్యం రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు సివిల్ సెటిల్మెంట్ల నుంచి మొదలవుతోంది. రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి సంఘటనలను పరికిస్తే.. 2000లో ఇలాంటి ఆధిపత్య పోరులో భాగంగా అమలాపురంలో జరిగిన జంట హత్యల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అమలాపురం కేంద్రంగా పట్టణంలోనే కాకుండా పరిసర గ్రామాల్లోను అనేక హత్యలు జరిగాయి. పట్టణంలో దాదాపు 35 మంది రౌడీషీటర్లున్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో చాలామంది నేరాలకు దూరంగా ఉన్నారు. సుమారు పది మంది రౌడీలు మాత్రం చెలరేగిపోతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ రౌడీషీటర్ వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో ఉంటూ పట్టణంలో తన అనుచరగణాన్ని పెంచిపోషిస్తున్నాడు. సెటిల్మెంట్లతో ఇక్కడ దందా చేస్తున్నాడు. పట్టణానికి చెందిన మరో రౌడీషీటర్ ఇక్కడ వ్యాపారం చేస్తూనే కొంత మంది రౌడీబ్యాచ్కు బాస్‌గా ఉన్నాడు. ఈ ఇద్దరి రౌడీషీటర్ల మధ్య కక్షలు కరుడుగట్టాయి. ఇందులో భాగంగానే ఆ ఇద్దరి రౌడీషీటర్ల వర్గాల మధ్య ఆదివారం అర్ధరాత్రి పరస్పర దాడులు జరిగాయి. నెల రోజుల క్రితం ఓ రౌడీ షీటర్ తన ప్రత్యర్థిని హతమార్చేందుకు పన్నిన పథకం త్రుటిలో తప్పడంతో అప్పట్లో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటి నుంచైనా పోలీసులు రెండు వర్గాలపై దృష్టిపెట్టి ఉంటే.. తాజా సంఘటన జరిగేది కాదంటున్నారు. పోలీసులకు సన్నిహిత సంబంధాలు రౌడీషీటర్లకు పోలీసులు తరచూ కౌన్సెలింగ్‌లు నిర్వహించాల్సి ఉంది. అమలాపురం పోలీసులు ఇందుకు చొరవ చూపలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధిపత్య పోరుతో రగిలిపోతున్న వారిని పిలిచి.. వారికి కళ్లెం వేసే వీలున్నా, పాత్రధారులపైనే చర్యలు తీసుకుంటున్నారు. కొందరు పోలీసులతో సూత్రధారులు సన్నిహితంగా ఉంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. పోలీసు స్టేషన్‌కు వచ్చిన కొన్ని సివిల్ వివాదాలు, అప్పటికే ఈ రౌడీషీటర్ల వద్ద తగువు రూపంలో ఉండడంతో అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరించుకోండని కొందరు పోలీసులు ఉచిత సలహాలు ఇస్తున్నట్టు తెలిసింది. దీనికితోడు ఈ రౌడీషీటర్ల వర్గాలకు రాజకీయ నాయకుల అండదండలు తోడవడంతో వారి దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. రౌడీయిజంపై కఠినచర్యలు : డీఎస్పీ రఘు అమలాపురంలో రౌడీషీటర్ల మధ్య ఉన్న గొడవల వల్ల తలెత్తుతున్న శాంతి, భద్రతల సమస్యపై తాను బాధ్యతలు చేపట్టిన గత 4 నెలల నుంచి ప్రత్యేక దృష్టి పెట్టానని అమలాపురం డీఎస్పీ కె.రఘు అన్నారు. సెటిల్మెంట్లు చేస్తున్న రౌడీషీటర్లతో పట్టణంలో కొందరు పోలీసులు సన్నిహితంగా ఉంటున్నారన్న విషయం ఇప్పుడే తన దృష్టికి వచ్చిందన్నారు. వీటన్నింటిపైనా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ, రౌడీయిజం అదుపునకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బేరం కుదిరింది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : బియ్యం అక్రమ పర్మిట్ల వ్యవహారానికి సెటిల్మెంట్ తో ముగింపు పలికింది. రైస్ మిల్లర్ల సంఘం జిల్లా కార్యాలయంలోనే ఈ బేరం కుదిరింది. వ్యాపారులకు కలిసి వచ్చే శుక్రవారం రోజునే ఈ సెటిల్మెంట్ పూర్తయ్యింది. పౌర సరఫరాల అధికారి సూచనతో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కోలేటి మారుతి పూనుకుని ఈ తతంగం పూర్తి చేశా రు. మిల్లర్లకు తెలియకుండా వారి ప్రోత్సాహక పర్మిట్లను అమ్ముకోవడం తప్పేనని మిల్లర్ల సంఘం పెద్దలు ఒప్పుకున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేస్తే అక్రమాల బాగోతం అంతా బయటపడుతుందని, పరిహారం చెల్లిస్తామని 12 మంది మిల్లర్లను ఒప్పించారు. వీరందరికీ కలిపి రూ.13.50 లక్షలు ఇచ్చేలా సంఘం ముఖ్యులు పంచాయితీ తెంపారు. పర్మిట్లను తమకు తెలియకుండా అమ్ముకోవడం వల్ల కలిగిన నష్టం కంటే ఇది ఎక్కువ మొత్తం కావడంతో నష్టపోయిన మిల్లర్లు కూడా వెంటనే ఒప్పుకున్నట్లు తెలిసింది. సెటిల్మెంట్ మొత్తం తీసుకున్న తర్వాత, ఈ 12 మంది మిల్లర్లకు భవిష్యత్తులో అధికారుల నుంచి ఇబ్బంది కలగకుండా చూస్తామని మిల్లర్ల సంఘం గట్టి హామీ ఇచ్చినట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న మిల్లర్లు చెప్పారు. పర్మిట్ల అమ్మకంలో నష్టపోయిన మిగిలిన మిల్లర్లు వస్తే వారికి సైతం మంచిగానే సెటిల్ చేస్తామని, అనవసరంగా అధికారులకు ఫిర్యాదు చేస్తే అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పినట్లు తెలిపారు. ఇక నుంచి ఎలాంటి అక్రమాలు బయటికి రాకుండా చూసుకోవాలని, అంతర్గతంగానే మాట్లాడుకోవాలని సంఘం ముఖ్యులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అక్రమాలిలా.. 2011-12 ఖరీఫ్ మార్కెట్ సీజన్లో జిల్లాలో 5.91 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఇప్పటివరకు 226 మంది మిల్లర్లు మాత్రమే వందశాతం బియ్యం అప్పగించడంతో వీరికి 2.06 లక్షల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రైస్ మిల్లర్ల సంఘం పెత్తనంతో అధికారులు ఇప్పటి వరకు 87 వేల టన్నుల బియ్యం విక్రయానికి పర్మిట్లు ఇచ్చారు. దీంట్లో 15 వేల టన్నుల బియ్యం పర్మిట్ల బదలాయింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి గడువులోగా అప్పగించిన రైస్ మిల్లర్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక పర్మిట్లు ఇస్తుంది. ఈ పర్మిట్లతో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ధాన్యంతో వచ్చే బియ్యాన్ని మిల్లర్లు బహిరంగ మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా సొంతంగా బియ్యం లేని వారు బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకునే అర్హతను ఇతరులకు బదిలీ చేసుకోవచ్చు. గతేడాది వరి విస్తీర్ణం తగ్గి బియ్యం ధరలు పెరగడంతో పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా అర్హులైన కొందరు రైస్ మిల్లర్ల ప్రత్యేక ప్రోత్సాహక పర్మిట్లను వారికి తెలియకుండానే ఇతరులకు బదిలీ అయినట్లు నాలుగు రోజుల క్రితం బయటపడింది. జిల్లా పౌర సరఫరాల అధికారి ఆమోదంతో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లు 12 మంది మిల్లర్లు ఆరోపించారు. వీరందరికీ పరిహారం చెల్లించడంతో ఈ అక్రమాలు నిజమేనని ఇప్పుడు స్పష్టమవుతోంది. పర్మిట్ల బదిలీతో నష్టపోయివారు గురువారమే ఫిర్యాదు చేసేందుకు కరీంనగర్‌కు రావాలని అనుకున్నారు. మిల్లర్ల సంఘం ముఖ్యుల ‘మధ్యవర్తిత్వం’తో ఆగిపోయారు. 12 మంది కలిసి శుక్రవారం కరీంనగర్‌కు వచ్చారు. అధికారులకు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతోనే బయలుదేరినా... ఇలా చేస్తే భవిష్యత్తులో వ్యాపారం విషయంలో అధికారుల నుంచి ఇబ్బందులు వస్తాయని మిల్లర్ల సంఘం నుంచి హెచ్చరికలు వెళ్లినట్లు తెలిసింది. ఫిర్యాదు చేయకుండా సెటిల్మెంట్ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని, అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూస్తామని చెప్పినట్లు సమాచారం. పర్మిట్ల అక్రమాలతో నష్టపోయిన వారిలో ఎక్కువ మంది కొత్తగా రైస్ మిల్లింగ్ వ్యాపారంలోకి వచ్చిన వారే కావడంతో... సెటిల్మెంట్కే మొగ్గుచూపినట్లు సమాచారం. -
దులిపేశారు.. వదిలించారు
సెటిల్మెంట్. పెద్దమాట! వీళ్లు చేస్తున్నదీ సెటిల్మెంటే అయినా ఇక్కడ ఆ మాట వాడేందుకు వీల్లేదు. వీళ్లేమీ తుపాకీ చేతబట్టిన వాళ్లు కాదు. బెదిరించి, నాలుగు పీకే వీర నారీమణులూ కారు. అధికారం ఉన్నవారు అసలే కాదు. మరెవరు? మామూలు మహిళలు. సాటి మహిళ కష్టానికి స్పందించే మనసున్నవాళ్లు. ఆ కష్టానికి కారణమైన మగవాళ్ల వ్యసనాలను ప్రశ్నించినవారు. మొదట పేకల్ని దులిపేశారు. తర్వాత మద్యం మత్తును వదిలించారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. సాధారణ మహిళల్లోని ఈ అసాధారణ ఉద్యమశక్తే ఈవారం మన ‘ప్రజాంశం’. పల్లెటూళ్లలో భర్తని పోగొట్టుకుని లేదా భర్త నుంచి విడిపోయి ఆర్థికంగా నష్టపోయిన మహిళల గురించి ఆలోచించేవారు ఎవరూ ఉండరు. అదే పట్టణాల్లో అయితే కేసులు, కోర్టులు అంటూ ఎంతో కొంత పోరాటం చేసే అవకాశం ఉంటుంది. పైగా పల్లెల్లో భర్తలేని మహిళ ఏం మాట్లాడినా, ఏం అడిగినా తప్పు. అలాంటివారికి ఆసరాగా నిలిచి తమ ప్రత్యేకతను చాటుకున్నారు వెల్టూరు గ్రామం మహిళలు. పెద్దగా చదువులేక పోయినా...అన్యాయానికి ఎదురునిలబడి పోరాడే శక్తిని సంపాదించుకున్న ఆ మహిళల వెనక ఉద్యమశక్తి దాగి ఉంది. ఏడాదికిత్రం వరకూ వెల్టూరు అన్ని గ్రామాలలాంటిదే. అన్యాయం, ఆస్తి...గురించి కాదు కదా సాయంత్రం అయితే మగవాళ్లతో మాట్లాడే ధైర్యమే ఉండేది కాదు. మద్యం, పేకాట కలిసి వెల్టూరుకి వెలుగుని దూరం చేశాయి. ఆరే ఆరు నెలల్లో అన్ని సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు మహిళావికాసం కోసం ముందు నిలబడ్డారు ఆ ఊరి మహిళలు. ‘‘మా ఊళ్లో ఒకతను భార్యని వదిలేసి, రెండోపెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య బాగోగులు, కష్టాసుఖాలు పట్టించుకోవడం లేదు. ఆ కేసుని మేం తీసుకుని అతనికున్న రెండెకరాల పొలాన్ని ఇద్దరు భార్యలకూ చెరో ఎకరం రాయించాం. ఎవరి పంట వారు తీసుకునేలా ఒప్పందం కుదిర్చాం. అలాగే మరో అమ్మాయి గర్భిణిగా ఉండి అత్తింటినుంచి పుట్టింటికి వచ్చేసింది. ఏళ్లు గడిచిపోతున్నా ఆమెను తీసుకెళ్లడానికి భర్త రావడంలేదు. మేం అతని దగ్గరికి వెళ్లి భార్యని తీసుకెళ్లనందుకు ఆస్తిలో సగం వాటా రాయమని చెప్పి న్యాయపరంగా ఆ అమ్మాయికి రావాల్సిన వాటా ఆమెకు రాయించాం. ఇలా...చాలా కేసులు పరిష్కరించి మా ఊరి ఆడపిల్లలకు న్యాయం జరిగేలా పోరాడాం’’ అని కమలమ్మ అనే మహిళ చెప్పింది. అంతే కాదు...ముగ్గురు బిడ్డల తల్లిని వదిలేసి ఊరొదిలి పారిపోయిన వ్యక్తిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి అతని ఆస్తిలో భార్యకు, పిల్లలకు సగభాగం రాయించారు. భార్యని వదిలేసి పారిపోయిన భర్త నుంచి పెళ్లినాడు భార్యకు పెట్టిన బంగారంతో సహా ఇప్పించారు. ఇరువర్గాలకు న్యాయం చేయడం ఈ గ్రామ మహిళల సెటిల్మెంట్ ప్రత్యేకం. సెటిల్మెంట్ సిస్టమ్... ఈ మహిళల్లో ఎవరు పెద్దగా చదువుకున్నవారు లేరు. చాలావరకూ వేలిముద్రలే. ఆస్తులు, వాటాలు అంటున్నారంటే పట్టణజ్ఞానం ఏమైనా ఉందా అంటే ఏనాడు పల్లెదాటి ఎరగరు. మరి వీరికింత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే? బాధల నుంచేనంటూ టక్కున సమాధానం చెబుతారు. కావాలంటే కాసింత సాయం చేస్తామనేవారుంటారు కాని కుటుంబవ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇంటిమనుషుల్లా న్యాయం చేసే మహిళల్ని చూడాలంటే మెదక్ జిల్లా కలెక్టరేట్‌కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెల్టూరు గ్రామానికి వెళ్లాల్సిందే. పత్తిని నమ్ముకుని బతుకుతున్న కుటుంబాల్లో పత్తాలు(పేకలు) చిచ్చుపెట్టాయి, కిరాణాదుకాణాల్లో కూల్‌డ్రింక్ బాటిల్స్‌తో పాటు దొరికే క్వార్టర్ బాటిల్స్ పేదల జీవితాల్ని పేకమేడల్లా కూల్చేశాయి. అలాంటి సమయంలో మహిళా సంఘాలన్నీ కలిసి కలిసి ఉద్యమం చేసి తమ ఊరిని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఏ ఉద్యమం విజయం సాధించాలన్నా... ప్రభుత్వ అధికారుల సాయం ఉండాలి. వారి దగ్గరికెళ్లి గోడు చెప్పుకుంటే అన్ని ఊళ్లలో ఉన్న బాధలే కదా అంటారు. ఆ సమయంలో వారికి తోచిన అద్భుతమైన ఆలోచన... బ్యాంకు రుణాల చెల్లింపు నిలిపి వేయడం. ‘‘మా ఊళ్లో చాలామంది మగాళ్లకు పత్తాలంటే ప్రాణం. బతుకులు కూలిపోతున్నా... వాటిని ముట్టడం మానరు. ఇక లాభం లేదని మహిళా సంఘాల మీటింగుల్లో ఈ విషయం గురించి బాగా చర్చించుకున్నాక... బ్యాంకు రుణం కట్టకుండా, గ్రామసంఘం మీటింగు రద్దు చేసి పంచాయితీ కార్యాలయం ముందు ధర్నా చేద్దామనుకున్నాం. మా ఊళ్లో 450 మంది మహిళలు పొదుపు సంఘాల్లో ఉన్నారు. వీరితో పాటు మిగతా మహిళలు కూడా ధర్నాకు దిగారు. మా ఊళ్లో ఉన్న ఆరు కిరాణాదుకాణాల్లో మద్యం అమ్మడం ఆపేయాలనేది మా మొదటి డిమాండ్. అలాగే ఎవరు పత్తాలు ఆడినా తమ పర భేదాల్లేకుండా వారి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. గంట రెండు గంటలు కాదు, ఏకంగా మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేశాం. ఆ మూడు దినాల్లో...ఒక్క మహిళ కూడా ఇంట్లో పొయ్యి వెలిగించలేదు. పిల్లల కోసమన్నా...వంట వండమని మగోళ్లు బతిమిలాడితే హోటళ్లలో తినిపించుకోమని చెప్పాం. మా ధర్నా సంగతి తెలిసి అధికారులు వచ్చి మా బాధలు విని మాకు సాయం చేస్తామన్నారు.’’ అని ఆర్నెల్లకిత్రం జరిగిన తమ పోరాటం మొదటిరోజుని గుర్తుచేసుకుంది వెల్టూరు గ్రామ సంఘం అధ్యక్షురాలు మల్లమ్మ. జరిమానా...బహుమతి నిరాహార దీక్ష, ధర్నా, ర్యాలీలు, షాపుల్లోకి చొరబడి సీసాలు పలకొట్టడంతో సరిపెట్టకుండా మద్యం తాగినవారికి 5000, అమ్మినవారికి 500 రూపాయల జరిమానా. తాగుతున్నప్పుడు, అమ్ముతున్నప్పుడు చూసి, ఫిర్యాదు చేసిన వారికి 500 రూపాయల బహుమతి ఇస్తామని మహిళా సంఘాల తరపున ప్రకటించారు. వివరాలు చెప్పినవారి విషయాలు గోప్యంగా ఉంచుతామన్నారు. దాంతో బహుమతుల కోసం చాలామంది అమ్మినవారి, కొన్నవారి వివరాలు వీరికి చేరవేయడంతో నేరుగా దాడులు చేసి మహిళలందరూ కూడి ఆందోళన చేయడం మొదలెట్టారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను ఇంట్లోవారు కాని, బయటివారు కాని ఏ చిన్నమాట అన్నా... వారు ఊరి మహిళలందరికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు.‘‘మేం కిరాణాషాపులపై దాడిచేసినపుడు ఆ షాపు ఓనర్లు మాతో ఒక మాట అన్నారు. ‘ముందు మీ మొగోళ్లతో పత్తాలు ఆడుడు మాన్పించండి. ఆ తర్వాత మందు...’ అన్నారు. మా మాట వినాలంటే ముందు మందు మానాలి. చాయ్‌కి బదులు మందు తాగేవాడి దగ్గర మా మాట ఏం వినిపిస్తుంది అని వాదించాం. మందు బాధ తగ్గిన తర్వాత పత్తాలపై దాడికి దిగాం’’ అని వివరించింది సంఘం ఉపాధ్యక్షురాలు లక్ష్మి. పత్తాల పని పట్టాం... వెల్టూరు గ్రామం పత్తి పంటలు పండించడంలో ప్రసిద్ధి. నేలసారమో, రైతుల కష్టమో పత్తి విపరీతంగా పండుతుంది.పత్తి ఎండబెట్టి మార్కెట్‌కి పంపే సమయానికి పొలాల్లోని పొదలన్నీ పత్తాలకు పరదాలుగా మారిపోతాయి. పంట అమ్మిన సొమ్ములేవని అడిగితే తాగొచ్చి తల్లీ, పెళ్లాం తేడా లేకుండా కొట్టడం...‘‘మాలోని చాలామంది మహిళలకు సెల్ఫోన్లు ఉన్నాయి. ధర్నా సమయంలో మా ఊరొచ్చిన ఎస్ఐ సారుతో పత్తాల విషయం చెప్పి ఆయన ఫోన్ నెంబరు తీసుకున్నాం. మా వివరాలు చెప్పకుండా ఆడేవారిని అరెస్టు చేయాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాం. పత్తాలు ఆడుతున్నట్టు ఎవరికి సమాచారం అందినా వెంటనే ఎస్ఐకి ఫోన్ చెయ్యడం మొదలుపెట్టాం. పోలీసులు వెంటనే వచ్చి వారిని జీపు ఎక్కించుకుని వెళ్లిపోయేవారు. ఇలా రెండు మూడు సంఘటనలు జరగడంతో పత్తాల ప్యాకెట్ల అమ్మకం ఆగిపోయింది. సమాచారం అందించిన మహిళలను ఆమె భర్త కొట్టబోతుంటే మా సంఘం మహిళలంతా వెళ్లి అడ్డుకుని అతనికి బుద్ధి చెప్పాం. ఈ ఊళ్లో ఏ మహిళా ఒంటరి కాదని ఆ సందర్భంగా గట్టిగా చెప్పాం’’ అంటూ మరో మహిళ వివరించింది. ‘‘ఆ రోజు వీరిలో ఎంత పట్టుదల ఉందో ఈ రోజూ అంతే ఉంది. ప్రతి గ్రామంలో మహిళ ధైర్యంగా నిలబడితే పల్లె పచ్చగా ఉంటుంది. దేశ అభివృద్ధి పల్లెల మీదే ఆధారపడి ఉంది’’ అని ఎంతో సంతోషంగా చెప్పారు సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు స్వరూప, అనూష. ఇబ్బందులకు ఎదురు నిలబడి, గెలిచిన వారి విజయాన్ని మిగతా పల్లెటూళ్లు కూడా ఆహ్వానించాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మరుగుదొడ్లు కట్టించకుంటే రేషన్ కట్..! మద్యం, పత్తాలు సమస్యలు తీరడంతో కాస్త తేరుకున్న మహిళలంతా ఊరి బాగుకోసం ఆలోచించడం మొదలెట్టారు. అందులో భాగంగా ముందుగా ఇంటింటికీ మరుగుదొడ్లు ఉంటే బాగుండుననుకున్నారు. అందుకోసం ప్రభుత్వసాయం తీసుకుని కొంత డబ్బుని పొదుపు సంఘాల నుంచి అప్పు ఇప్పించి 412 మరుగుదొడ్లు కట్టించారు. దీనికి సహకరించనివారికి రేషన్, ఫించన్ సౌకర్యాలు ఆపేస్తామని చెప్పారు. దాంతో ఊళ్లో పారిశుద్ధ్యం కూడా మెరుగయ్యేలా చేయగలిగారు. వీరికి ప్రభుత్వం తరపు నుంచి ఇందిరాక్రాంతి పథకం అధికారులు అండగా నిలిచారు.