
ఎమ్మెల్యే ఇంటి వద్ద పంచాయితీ.. కత్తిపోట్లు
మహబూబ్‌నగర్: ఇరు వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నిర్వహించిన పంచాయితీ వికటించింది. ఇరువర్గాలు పరస్పరం కత్తులతో పొడుచుకోవడంతో ఇద్దిరికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాలు.. గత కొంతకాలంగా మున్సీపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్‌ల మధ్య మహబూబ్‌నగర్‌లో వర్గపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజీ కుదిర్చే పనిలో ఇరువర్గాలను శ్రీనివాస్‌గౌడ్ తన ఇంటి వద్ద చర్చకు పిలిచాడు. చర్చకు మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త అమర్, కౌన్సిలర్ ఆనంద్ హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో చర్చలు జరుగుతుండగానే ఇంటి బయట ఇరువర్గాలు కత్తులతో పొడుచుకున్నాయి. ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు.