బిదిరి సెటిల్‌మెంట్లకు సహకరించేవారేమో? | minister kj George fire on bjp | Sakshi
Sakshi News home page

బిదిరి సెటిల్‌మెంట్లకు సహకరించేవారేమో?

Published Wed, Jan 28 2015 2:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బిదిరి సెటిల్‌మెంట్లకు సహకరించేవారేమో? - Sakshi

బిదిరి సెటిల్‌మెంట్లకు సహకరించేవారేమో?

హోంశాఖ మంత్రి  కే.జే జార్జ్

బెంగళూరు:  సెటిల్‌మెంట్ ప్రభుత్వమంmiటూ సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలనను మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు శంకరబిదిరి అసత్య అరోపణలు చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులో మీడియాతో  ఆయన మంగళవారం మాట్లాడారు. శంకరబిదిరి డీజీపీగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం సెటిల్‌మెంట్‌కు సహకరించేవాడేమోనని కే.జే జార్జ్ అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే ఇప్పుడు కూడా అటువంటి ఆలోచనలే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ అర్కావతి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అర్కావతి విషయంలో వారి వద్ద దాఖలాలు ఉంటే కెంపణ్ణ కమిషన్‌తో పాటు కోర్టుకు కాని, లోకాయుక్తకు కాని అందజేయవచ్చుకదా అని ప్రశ్నించారు.

 భారతీయ జనతా పార్టీ నాయకులు రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే గవర్నర్ వజుభాయ్ రుడాబాయ్‌వాలా వారి ఒత్తిడికి తలొగ్గరని కే.జే జార్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement