Minister KJ George
-
‘సూట్‌కేసులు’ మోస్తున్నారు !
సీఎం సిద్ధరామయ్య, మంత్రి జార్జ్‌పై కుమారస్వామి విమర్శలు బెంగళూరు: ‘సీఎం సిద్ధరామయ్య, మంత్రి కె.జె.జార్జ్‌లు హైకమాండ్‌కు కప్పాలు కడుతున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతోనే అప్పుడప్పుడూ ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళుతూ హైకమాండ్‌కు సూట్‌కేసులు మోస్తున్నారు’ అని జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి విమర్శించారు. శుక్రవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మంత్రి కె.జె.జార్జ్ కంటే ముందు సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వం సూట్‌కేస్‌ల ప్రభుత్వమని నేను చెప్పడం కాదు, ఏకంగా ఈ ప్రభుత్వంలో పనిచేసి ఇటీవలే మంత్రి పదవి పోగొట్టుకున్న శ్రీనివాస ప్రసాద్ అన్న మాటలివి. ప్రతి నెలా సిద్ధరామయ్య, కె.జె.జార్జ్‌లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌కు కప్పాలు కట్టి వస్తున్నారు’ అని మండిపడ్డారు. ఇక ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలోని నిజాయితీ పరులైన అధికారులకు రక్షణ ఇవ్వలేకపోతోందని విమర్శించారు. దళితురాలైన ఓ జిల్లాధికారికే (మైసూరు కలెక్టర్ శిఖా) ఈ ప్రభుత్వం రక్షణ ఇవ్వలేక పోయిందంటే, ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని కుమారస్వామి ప్రశ్నించారు. ఇక మైసూరు కలెక్టర్ శిఖాపై బెదిరింపులకు పాల్పడిన సీఎం సిద్ధరామయ్య ఆప్తుడు మరిగౌడపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం వస్తోందని కుమారస్వామి మండిపడ్డారు. -
పడక... నడక
చట్టసభల్లోనే నిద్రించిన విపక్షాలు గణపతి ఆత్మహత్యపై చల్లారని వేడి ఉదయం విధాన సౌధ ప్రాంగణంలో వ్యాహాళీ బెంగళూరు: దిగువసభలో రెండోరోజైన గురువారం కూడా జాగరణ కొనసాగింది. డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనకు సంబంధించి బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ రాజీనామా ప్రధాన డిమాండ్‌గా విపక్షాలు బుధవారం రాత్రి నుంచి చట్టసభల్లో అహోరాత్రి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బుధవారం రాత్రి శాసనసభ, శాసనమండలిలోనే నిద్రించిన ఆయా చట్టసభల సభ్యులు గురువారం ఉదయం విధానసౌధలోనే మార్నింగ్ వాక్‌తో తమ దినచర్యను ప్రారంభించి అక్కడే అల్పాహారాన్ని కూడా తీసుకున్నారు. అనంతరం చట్టసభల్లోని స్పీకర్, మండలి అధ్యక్షుడి పోడియంలోకి వెళ్లి నిరసనకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇక గురువారం ఉదయం విపక్షాల నిరసలన మధ్యనే శాసనసభలో సభా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కే.జే జార్జ్‌ను మంత్రి మండలి నుంచి తొలగించడంతో పాటు గణపతి ఆత్మహత్య ఘటనను సీబీఐ చేత దర్యాప్తునకు అంగీకరించేంతవరకూ తమ నిరసనను విరమించబోమని విపక్ష సభ్యులు తేల్చిచెప్పారు. అయితే ఇందుకు అధికార పక్షం నాయకులు ససేమిరా అన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ, జేడీఎస్‌లు నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంలో కర్ణాటక ఓపెన్ యూనివర్శిటీతో సహా మూడు ముసాయిదా చట్టాల అనుమతి కోసం అధికారపార్టీ దిగువసభ అనుమతి కోసం ప్రవేశపెట్టింది. దీంతో మరింత ఆగ్రహం చెందిన విపక్ష పార్టీల సభ్యులు ముసాయిదా చట్టం ప్రతులను చించి వేసి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. దీంతో స్పీకర్ కోడివాళ సభా కార్యక్రమాలను నిలిపి వేసి అన్ని పార్టీల ముఖ్యనాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సభా కార్యక్రమాలు సజావుగా జరపడానికి సహకరించాలని సూచించారు. అయితే అటు విపక్ష సభ్యులు కాని, ఇటు అధికార పార్టీ నాయకులు కాని వెనక్కు తగ్గక పోవడంతో శాసనసభ సమావేశాలను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోళివాడ వెల్లడించారు. సమావేశం అనంతరం శాసనసభ విపక్షనాయకుడు జగదీష్‌శెట్టర్ మీడియాతో మాట్లాడుతూ... తమ డిమాండ్‌లో ఎటువంటి మార్పు లేదని, కే.జేజార్జ్ రాజీనామా చేసేవరకూ ఉభయ సభల్లో అహోరాత్రి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. -
బిదిరి సెటిల్మెంట్లకు సహకరించేవారేమో?
హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ బెంగళూరు: సెటిల్మెంట్ ప్రభుత్వమంmiటూ సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలనను మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు శంకరబిదిరి అసత్య అరోపణలు చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. శంకరబిదిరి డీజీపీగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం సెటిల్మెంట్కు సహకరించేవాడేమోనని కే.జే జార్జ్ అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే ఇప్పుడు కూడా అటువంటి ఆలోచనలే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ అర్కావతి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అర్కావతి విషయంలో వారి వద్ద దాఖలాలు ఉంటే కెంపణ్ణ కమిషన్‌తో పాటు కోర్టుకు కాని, లోకాయుక్తకు కాని అందజేయవచ్చుకదా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే గవర్నర్ వజుభాయ్ రుడాబాయ్వాలా వారి ఒత్తిడికి తలొగ్గరని కే.జే జార్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు.