Sankarabidiri
-
బిదిరి సెటిల్మెంట్లకు సహకరించేవారేమో?
హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ బెంగళూరు: సెటిల్మెంట్ ప్రభుత్వమంmiటూ సిద్ధరామయ్య నేతృత్వంలోని పాలనను మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు శంకరబిదిరి అసత్య అరోపణలు చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. శంకరబిదిరి డీజీపీగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం సెటిల్మెంట్కు సహకరించేవాడేమోనని కే.జే జార్జ్ అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే ఇప్పుడు కూడా అటువంటి ఆలోచనలే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ అర్కావతి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. అర్కావతి విషయంలో వారి వద్ద దాఖలాలు ఉంటే కెంపణ్ణ కమిషన్‌తో పాటు కోర్టుకు కాని, లోకాయుక్తకు కాని అందజేయవచ్చుకదా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు రాజ్‌భవన్‌ను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే గవర్నర్ వజుభాయ్ రుడాబాయ్వాలా వారి ఒత్తిడికి తలొగ్గరని కే.జే జార్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
అవినీతిలో కర్ణాటక మొదటి స్థానం
బీజేపీ నాయకుడు శంకరబిదిరి బెంగళూరు: సమాచార, సాకేతిక రంగంలో దేశానికి ఆదర్శవంతమైన కర్ణాటక ప్రస్తుతం అవినీతిలో మొదటి స్థానంలో ఉందని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు శంకరబిదిరి పేర్కొన్నారు. ఇందుకు కొంతమంది రాజకీయ నాయకులే కారణమన్నారు. బెంగళూరులోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...గతంలో నాయకులు రాజకీయాల్లోకి సేవా భావంతో వచ్చేవారన్నారు. దీని వల్ల అవినీతి తక్కువగా జరిగేదని తెలిపారు. అయితే ప్రస్తుతం ధనార్జనే ధ్యేయంగా నాయకులు రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. అందువల్లే ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి పనుల్లో కోట్లాది రుపాయల అవినితి జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి కర్ణాటకలో ఎక్కువగా ఉందన్నారు. ఇందుకు ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులే ప్రధాన కారణమన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మినహాయింపు కాదని ఆరోపించారు. తన విషయం బయటపడకుండా పకడ్భందీగా ఆయన ప్రభుత్వ అధికారులను ఈ అక్రమాల్లో భాగస్వామం చేస్తూ మాముళ్ల ముఖ్యమంత్రిగా మారారని శంకరబిదిరి ఆరోపించారు.