
హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వారు తెలుసుకున్నారు. ఈ నెల 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప–2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం, ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడటం తెలిసిందే. ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అర్జున్ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ పేరుతో అల్లు అరవింద్ భారీ సాయం ప్రకటించారు. శ్రీతేజ ఆరోగ్య పరంగా త్వరగా కోలుకోవాలని రూ. 1 కోటి అరవింద్ ప్రకటించారు. డైరెక్టర్ సుకుమార్ రూ. 50 లక్షలు అందించారు. అయితే, మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే రూ. 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజుకు అందించారు. రేవతి భర్త భాస్కర్‌తో అల్లు అరవింద్ మాట్లాడారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు.
కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజను పరామర్శించిన అనంతరం అల్లు అరవింద్ ఇలా అన్నారు. ' ఈ విపత్తు అనంతరం అబ్బాయి కోలుకుంటున్నాడు. త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నాను. శ్రీతేజ కుటుంబానికి మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్, రవిశంకర్‌తో పాటు దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ తరపున మొత్తం రూ.2 కోట్లు ఇస్తున్నాం. ఈ చెక్‌లను ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న దిల్ రాజుకి ఇస్తున్నాం.' అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment