భూమా X శిల్పా | Kurnool tdp leaders bhuma, shilpa meets AP CM over settlement | Sakshi
Sakshi News home page

భూమా X శిల్పా

Published Mon, May 2 2016 9:52 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

భూమా X శిల్పా - Sakshi

భూమా X శిల్పా

► నేడు చంద్రబాబు వద్ద పంచాయితీ
► విజయవాడకు తరలి వెళ్లిన నేతలు


నంద్యాల: కర్నూలు టీడీపీలో శిల్పా సోదరులు, ఇటీవలే పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ ఇన్‌చార్జి శిల్పామోహన్‌రెడ్డి మధ్య పంచాయితీ సోమవారం సీఎం చంద్రబాబు కోర్టులో జరగనుంది.

ఇందుకోసం వీరిద్దరితో పాటు మాజీ మంత్రి ఫరూక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కూడా ఆదివారమే విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆధిపత్యం విషయంలో ఇరువర్గాల వారు పట్టుదలగా ఉండటంతో సయోధ్య కుదిరే అవకాశం లేదని తెలుస్తోంది. సీఎం కూడా సర్ధుకుపోవాలని సూచించి పంపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు వర్గాలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement