హ్యూందాయ్, కియా కంపెనీలకు చెందిన కొన్ని మోడళ్ల కార్లను ఎంత సులువుగా దొంగిలించవచ్చో చూపించారు కొందరు టిక్‌టాకర్లు. ‘టిక్‌టాక్ థెఫ్ట్ ఛాలెంజ్’ పేరుతో అమెరికాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీని తర్వాత కార్ దొంగతనం బాధితులు ఈ రెండు కార్ల కంపెనీలపై కోర్టులో 200 మిలియన్ డాలర్లకు ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించుకునేందుకు హ్యుందాయ్, కియా కంపెనీలు ఎట్టకేలకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు బాధితులతో ఒప్పందం చేసుకున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం... దావా పరిష్కారం కోసం దక్షిణ కొరియాకు చెందిన ఈ కార్ల కంపెనీలకు 200 మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుంది. దీంట్లో అధిక మొత్తం కార్ల దొంగతనం సంబంధిత నష్టాలను భర్తీ చేసేందుకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బాధితులతో కార్ల కంపెనీలు చేసుకున్న రాజీ ఒప్పందాన్ని ఆమోదించాలా వద్దా అనేది కోర్టు ఇష్టం.
ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు
హ్యూందాయ్, కియా కంపెనీల కార్లను సులభంగా దొంగిలించవచ్చని చూపించే వీడియోలు టిక్‌టాక్‌లో వ్యాప్తి చెందడంతో అమెరికాలో గత సంవత్సరం ఆయా కంపెనీలకు చెందిన కార్ల దొంగతనాలు పెరిగాయి. యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ) ప్రకారం.. ఛాలెంజ్‌తో ముడిపడి ఉన్న కారు దొంగతనాలు కనీసం 14 క్రాష్‌లు, ఎనిమిది మరణాలకు దారితీశాయి.
దొంగతనాలపై సోషల్ మీడియాలో జరిగిన ప్రమోషన్ వల్ల అమెరికాలో ప్రస్తుతం ఉన్న సుమారు 9 మిలియన్ల హ్యుందాయ్, కియా కార్లు ప్రమాదంలో పడ్డాయని ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ ప్రకారం.. హ్యుందాయ్, కియా కంపెనీలు తమ కార్లలో ఇప్పటికే యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేశాయి. కార్ ఓనర్‌లకు పదివేల స్టీరింగ్ వీల్ లాక్‌లను అందించాయి.
ఇదీ చదవండి: కారు కొన్న ఆనందం.. డ్యాన్స్ చేసిన కుటుంబం.. ఆనంద్ మహింద్రా స్పందనేంటో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment